25, జులై 2009, శనివారం

పేరడీ-బీ రెడీ!


జొన్నలగడ్డ రామ లింగేశ్వరరావు నవ కవిత :::::
జొన్నవిత్తుల ఒక పేరడీ పద్యాన్ని రాసారు.

"నేను సైతం
నల్ల రంగును కొనుక్కొచ్చాను.

నేను సైతం
నల్ల రంగును తెల్ల జుట్టుకు రాసి దువ్వాను.

ఇంత చేసీ ,
ఇంత క్రితమే
తిరుపతయ్యకు జుట్టు నిచ్చాను.

ఈ పేరడీ గీతమునకు
శ్రీ శ్రీ ప్రసిద్ధ రచనకు మూలం.
అది ఇదే! చదవండి !

"సింధూరం, రక్తచందనం,
బందూకం, సంధ్యారాగం,
పులిచంపిన లేడినెత్తురూ,
ఎగరేసిన ఎర్రజెండా,
రుద్రాలిక నయనజాలిక,
కలకత్తా కాళిక
కావాలోయ్ నవకవనానికి--

ఘాటెక్కిన గంధక ధూమం,
పోటెత్తిన సప్త సముద్రాల్,
రగులుకొనే రాక్షసబొగ్గూ,
బుగులుకొనే బుక్కాగుండా,
వికసించిన విద్యుత్తేజం,
చెలరేగిన జనసమ్మర్దం
కావాలోయ్ నవకవనానికి--

రాబందుల రెక్కల చప్పుడు,
పొగగొట్టపు భూంకార ధ్వని
అరణ్యమున హరీంద్ర గర్జన
పయోధర ప్రచండ ఘోషం
ఖడ్గమృగోదగ్రవిరావం,
ఝఝానిల షడ్జధానం -
కావాలోయ్ నవకవనానికి--

కదిలేది కదిలించేదీ,
మారేది మార్పించేదీ,
పాడేదీ పాడించేదీ,
పెనునిద్దుర వదిలించేదీ,
మునుముందుకు సాగించేదీ,
పరిపూర్ణపు బ్రతుకిచ్చేదీ -
కావాలోయ్ నవకవనానికి .

2 వ్యాఖ్యలు:

vedantamvenkatasatyavati చెప్పారు...

baagundi! annatlu aavakaaya.com visit cheasi mii kavitalu chadavaalani prayatninchaanu kaani chaatakaaleadu! succeed ayyaaka malli prayatnisthaanu kalavadaaniki! wish me good luck!

chitravarnam.blogspot.com చెప్పారు...

Thank you satyavati gaarU!

జొన్నవిత్తుల రామ శాస్త్రి,
జొన్న విత్తుల శేష గిరి రావు మున్నగు వారి
"హాస్య పద్యాలు"చదివారా?
ఈ బ్లాగులోనూ,
పత్రికలోనూ,
http://aavakaaya.com
రచ్చబండ(grous yahoo.mail.com )లోనూ ,
"కాదంబరి"అనే పేరుతోనూ వచ్చినవి.
నా బ్లాగులోని,రచనలపై ,
మీ అభిప్రాయాలు చెప్ప గోరుచున్నాను.

ముద్దు పేర్లు - మొద్దు పేర్లు

"బుజ్జీ! చంటీ! బన్నీ! చిట్టీ! కాఫీ తాగుదురు గాని రండి! టిఫిన్ కూడా రెడీ."  ; తరళ, ఆమె సోదరి లవంగిక తమతమ పిల్లల్ని ఎలుగెత్తి పిలి...