22, జులై 2009, బుధవారం

భూత దయ

టీవీ 9 లో వార్త; "మృగ రాజు ముదమారగా ముదితను ముద్దాడుట".రెండేళ్ళ కిందట ఒక వనిత ,తిండీ తిప్పలూ సరిగా అమరని కారణము వలన ,చిక్కి,శల్యమై పోయింది. ఆ స్థితిలో ఆమె జాలి పడి, ఆ సింహాన్ని రక్షించేందుకు పూను కున్నది.తన చేతి డబ్బులు ఖర్చు పెట్టి,దనిని,"జీవ కారుణ్య సంఘము"ద్వారా,పోషణ భారాన్ని వహించి కాపాడింది. ఇప్పుడు ఆ అడవికి సామ్రాట్టు ఐన
సింహం, పుష్ఠిగా,ఆరోగ్యంగా ఉన్నది. (నేడు బహుశా అభయారణ్యములో ఉన్నది కాబోలును!))ఆ మహిళ అప్పుడప్పుడూ ఆ సింహాన్ని చూడటానికి వస్తూ ఉండేది.

ఇంత వఱకూ,సరే! అయితే,ఆ జంతు చక్రవర్తి,ఆమెను గుర్తు పట్టి,ప్రేమతో,కౌగిలించుకుని,ముద్దులు పెడుతూన్నది.అందు వలన్నే,ప్రజలనూ,ప్రసార మాధ్యమాలను ఆకర్షించిన అంశముగా మారి పోయినది.నాకు అమితంగా నచ్చిన విశేషం..
1)క్రూర మృగాలకు కూడా ఆపేక్షలు ఉండుట.
2)సింహము,ఇతర జంతువులకు కూడా జ్ఞాపక శక్తి ఎక్కువగానే ఉంటున్నది.సాధారణముగా,పావురాలు,కోతులు,ఏనుగులు వంటి కొన్ని జంతువులుకూ,పక్షులకూ మత్రమే గ్రహణ శక్తి ఎక్కువగా ఉంటూన్నది-అనే అభిప్రాయాన్ని పుస్సమీక్షించుకోవాల్సి వస్తున్నది.పరిశోధనలకు అనువైన కొంగ్రొత్త అంశమేనేమో!
సింహము పుట్టిన రోజును ఆమె,నిష్కల్మష అనురాగంతో,ఘనంగా సెలబ్రేట్ చేస్తున్నది. బుల్లి తెరపై,ఆమె ఆ మృగ రాజుకు ఇష్టమైన ఆహారన్ని పెడుతూంటే,అందరూ ఎంజయ్ చేసే దృశ్యాన్ని ప్రదర్శించారు.

ఇంత దాకా బాగానే ఉన్నది సరేనండీ!పునర్జన్మను పొందిన ఆ జంతువు చూపించిన ఆ అనురాగము మనలను అందరినీ మంత్ర ముగ్ధులను చేసింది.ఔను కదా!

కానీ,అరణ్య చక్రవర్తి 'జూలును సవరించుకుంటూ,విదిలించుకుంటూ,తింటూన్నది,పెద్ద పళ్ళెం నిండా ఆమె పెట్టిన మాంసాన్ని '. ఈ దృశ్యం మాత్రం నాకు చాలా వెగటుగా అనిపించింది. జీవ కారుణ్యంతో కాపాడిన సింహంపైన ప్రేమతో,"ఆమె పెట్ట వలసి వచ్చిన పదార్ధము ఏమిటి?మరల ఇంకో జంతువును వధించి తెచ్చిన మాంసమే కదా!"మరి,ఈ దాతృత్వాన్నీ,అందులోని మానవీయ విలువలనూ,మనము ఏ మేరకు అంచనా కట్టి,పాస్ మార్కులను వేయాలి?"ఇదేనండీ నా ధర్మ సందేహం?సందేహ నివృత్తికై మీ సమాధానం ఇస్తారు కదూ?
(అన్నట్టు వారి పేర్లు "టోరెస్ ,జూపిటర్". )

1 కామెంట్‌:

Anil చెప్పారు...

మీరు రాసిన సంఘటన విడియొ ఈ వెబ్ సైటు లొ ప్రచురితము అయినది

http://www.youtube.com/watch?v=6Xp7M0_hdUE

ఇక మీ ధర్మ సందేహం గురించి చెప్పాలి అంటే, నా మటుకు అది సమంజసమే అనిపిస్తుంది. ఆమెరికా లొ రోడ్ మీద జంతువులు (బాతులు, జింకలు లాంటివి) కనిపిస్తే వాటికి హాని కలుగకుండా ట్రాఫిక్ ప్రక్క కు పొతుంది. అవే జంతువులను హంటింగ్ పేరు తొ చంపి ఆస్వాదిస్థారు. అది అదే, ఇది ఇదే.

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...