శర్మగారికి తెలుగు సబ్జెక్టును, ఇంగ్లీషు -సబ్జెక్టును
జొన్నలగడ్డ శివశంకర శాస్త్రి బోధించేవారు.
శివశంకర శాస్త్రి తమ తోటి ఆంధ్రోపన్యాసకుడైన
"శ్రీ మద్రామాయణ కల్పవృక్షము" రచయిత అయిన
శ్రీ విశ్వనాధ సత్యనారాయణ గారిని పట్టుకునితమాషాగా ఇలా అనేవారు,
"కవి సామ్రాట్! యు ఆర్ టాకింగ్ సమ్ రాట్!" ( some rot)
"మధు సేవ " అనే నాటకంలోని ఈ తమాషా సీస పద్యాన్ని చదవండి.
********************************
(సీసము) :
"మోర్నింగు కాగానె మంచము లీవిన్గు
మొగము వాషింగు , చక్కగ సిటింగు
కార్కు రిమూవింగు గ్లాసులో ఫిల్లింగు
గడగడ డ్రింకింగు గ్రంబులింగు
భార్యతో ఫైటింగు ,బైటకు మార్చింగు
క్లబ్బును రీచింగు , గేంబులింగు
విత్తము లూజింగు, చిత్తము రేవింగు
వెంటనే డ్రింకింగు , వేవరింగు
(తేటగీతి)
మరల మరల రిపీటింగు. ,మట్టరింగు
బసకు ష్టార్టింగు, జేబులు ప్లండరింగు
దారీ పొడవున డేన్సింగు, థండరింగు
సారె సారెకు రోలింగు, స్లంబరింగు.
2 కామెంట్‌లు:
" సీసా " పద్యం గిలిగింతలు పెట్టింది.
కవి పేరు చెప్పండి ప్లీజ్ !
నమస్తే!ఫణీంద్ర గారూ!
కాళ్ళకూరి నారాయణ రావు గాru
రచించిన నాటకము అది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి