
ఆ సినిమా ప్రేక్షకుల తిరస్కారమునకు గురి అయ్యినది. నష్టాల్లో కూరుకుపోతూన్న రేవతీ స్టూడియోని నాగిరెడ్డి కొన్నారు.
తెలుగు సినిమా దర్శకుల్లో మంచి విలువలతో,ఉన్నత ప్రమాణాలతో ఉత్తమ అభిరుచి గల దర్శకులలో,మొదటి స్థానం, ఎవరనే ప్రశ్న వస్తే మనం ముందుగా వినే పేరు “బి.ఎన్. రెడ్డి”. నిజానికి 30 ఏళ్ళ సినీ జీవితంలో ఆయన తీసింది పదకొండు సినిమాలే! కాని ప్రతి ఒక్కటీ పేరు గడించిందే!ఆయన అసలు పేరు"బొమ్మి రెడ్డి నరసింహా రెడ్డి".65 వేల రూపాయలు పెట్టుబడితో "రేవతీ స్టూడియో"నిర్మాతగామారారు.
విజయ వాహినీ స్టూడియోగా అది పునర్జన్మను పొందినది.
నాగిరెడ్డి గారి సాహసోపేత నిర్ణయాత్మక నిర్ణయాలు ఎన్నెన్నో గొప్ప మైలు రాళ్ళను తెలుగు సినీ చరిత్రలో నెలకొల్పాయి.
గోవింద స్వామి గారి వయోలీన్ కచ్చేరీలో ఒక బాలుడు
భాగవతములోని 'ప్రహ్లాద' పద్యాలను శ్రుతి సుభగంగా పాడాడు. ఆ
బాలుని కి నాగిరెడ్డి ఆశీస్సులు అందించారు. అమోఘ దీవెనలను పొందిన ఆ పిల్లవాడే చిత్తూరు నాగయ్య!
మైసూరు మహారాజా గారి సన్మానం అందుకున్న నాగయ్య గారి ‘‘త్యాగయ్య’’ (1946) గొప్ప కళాఖండమే!
నటుడుగా, దర్శకుడిగా, నాగయ్య గారి జీవితంలో ‘‘త్యాగయ్య’’ ఓ మైలురాయిలా నిలిచిపోతుంది. ఇక్కడో సంఘటన చెప్పాలి: మైసూరు మహారాజాగారు తన రాజభవనంలో ‘‘త్యాగయ్య’’ చిత్రాన్ని ప్రత్యేక షో ఏర్పాటు చేయించుకని నాగయ్య గారిని వెండి శాలువాతోనూ, 101 బంగారు నాణాలతోనూ సత్కరించారు. శ్రీరామచంద్రుడి బొమ్మ ఉన్న ఒక బంగారు నెక్లెస్‌ను కూడా బహూకరించారు.
2 కామెంట్‌లు:
మన తెలుగు చిత్ర పరిశ్రమ లో ఉద్దండులైన వారి గురించి జ్ఞాపకం చెసికోవడం చాలా బాగుంది.
baagundi...............
కామెంట్‌ను పోస్ట్ చేయండి