29, జులై 2009, బుధవారం

అందాల పాపాయి.. ముద్దుల తాతయ్య..!

పట్టంచు పావడాలు బోలెడన్ని పాపాయికి --
పట్టెమంచం, పావుకోళ్లు చాలునంట్ తాతయ్యకి -
అరటి పిలక అరటి పండు బోలెడన్ని పాపాయికి -
బోడి పిలక విబూది పండు చాలునంట తాతయ్యకి -
వంకీ జడలు కలకండలు బోలెడన్ని పాపాయికి -
వంపు కర్ర కండువాలు చాలునంట తాతయ్యకి -

జామకాయలు కజ్జికాయలు బోలెడన్ని పాపాయికి -
పొడుము కాయ పడకకుర్చీ చాలునంట తాతయ్యకి -
గుడుగుడు గుంచం గుండే రాగం అన్నీ పాపాయికి -
గుండూ తుడుముడు గుళ్ళో పాటలు తాతయ్యకి -
సిరి సిరి నవ్వులు చెమ్మచెక్కలు బోలెడన్ని పాపాయివి -
ముసిముసి నవ్వులు చప్పరింపులు ముద్దుల తాతయ్యవి...!




వెబ్ దునియా లొ ప్రచురితమైన నా ఈ బాల గీతమును చదవండి.
"ఆంధ్ర ప్రభ"వార పత్రికలో నా మొట్ట మొదటి రచన,ఈ పాట.
"పాపాయికి,తాతయ్యకు"అనే ,ఈ పిల్లల పాట,నా స్వంత రచనయే!దేనికినీ అనువాదం కాదు.
ప్రముఖ పత్రికలో ,నేను చూసుకున్న మొదటి రచన,కాబట్టి,నాకు మరీ మరీ ఇష్టం.
ఇప్పుడు,వెబ్ పత్రికలలో చదువుకుంటే,మరీ,మరీ మరింత ఇష్టం.

2 కామెంట్‌లు:

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

చిన్ననాటి స్మృతులు గుర్తుచేసారండి.
"గుడుగుడు గుంచం గుండే రాగం "
"కాళ్ళ గజ్జ కంకాళమ్మ"
"వొత్తొత్తి వారొత్తి సూసినోళ్ళ కంట్లో సురొత్తి"
"కుచ్చు కుచ్చు పుల్లా కూరాడు పుల్లా..."

ఇలా ఎన్నో.. ఆడ మగా తేడా లేకుండా ఆడుకొనే వాళ్ళం మా వాగు వొడ్డున.

మాలా కుమార్ చెప్పారు...

పాట చాలా బాగుంది.

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...