నిలిచిన తొలకరుల మబ్బులకు
అభివాదము! అభివాదము! //
చివురులను ఒసగిన
మామిడి తరువులకు,//అభి//
పల్లెల తొణికేటి మమత లన్నిటికిని //అభి//
చదువులను ప్రేమతో
నేర్పేటి గురువులకు
అభివాదము! అభివాదము //
ఒకరోజు మొదటి పేజీలో అసలు ఏమీ రాయకుండా నిండా తారు పూసి, పత్రిక ను అలాగే విడుదల చేసారు నార్ల వేంకటేశ్వర్రావు.పత్రికా ప్రపంచములో ఇది చాలా ఘాటైన నిరసన. అంతే! దాంతో బ్రిటీషు వారు వార్తాపత్రికలను ఎలాంటి కత్తిరింపులనూ చేయకుండా ఖైదీలకు ఇవ్వసాగారు .
(Pramukhula Haasyamవార్తల సెన్సారుBy kadambari piduri )
హ్త్త్ప్://ఆవకాయ.కం
హైదరాబాద్ నివాసి ఫర్హతుల్లా బేగ్ నిర్మాణతలో రూపుదిద్దుకున్న డాక్యుమెంటరీ సినిమా
"Mad Cow; Sacred Cow".
ఫర్హతుల్లా బేగ్ ఈ వెండితెర రూపకల్పన కోసం ఎంతో శ్రమించారు.
అతని పరిశోధనకు అనేక ప్రశంసలు, అవార్డులు లభించాయి.ఇదీ కథ!
కెనడా లో స్థిరపడిన భారతీయుడు ఆనందరామయ్య.
ఈతని భార్య కెనడా స్త్రీ. భార్యా పిల్లలతో హాయిగా పాశ్చాత్య దేశంలో ఉంటున్నాడు ఆనంద రామయ్య.
ఉన్నట్టుండి "mad cow" అనే పశు రోగం వలన వ్యవసాయ రంగములో సంక్షోభం ఏర్పడింది.
పశువుల సంరక్షణ, సేద్యం జీవనాధారమైన ఆనంద రామయ్య కూడా ఈ సుడిలో ఇరుక్కున్నాడు.
సస్య, పశు ప్రగతి రంగాలు అతలాకుతలమైనందు వలన
ఆ పరిస్థితులకు మూల కారణాలు ఎక్కడి నుండి మొదలైనాయో కనుగొనడానికి బయలుదేరాడు.
ఆ అన్వేషణలో అతను ఇండియాకు వచ్చాడు.
ఆ గాలింపులో వెలికి వచ్చిన సంగతులు ఎన్నో!
ఎన్నో ఫిలిమ్ ఫెస్టివల్సు లో ప్రదర్శించబడిన
ఈ డాక్యుమెంటరీ చిత్రం "గోల్డెన్ ఫిష్ అవార్డు"ను గెలిచినది కూడా!
Mad Cow Sacred కౌ,By kadambari piduri
Weaving interviews from internationally reknowned speakers such as Dr. Vandana Shiva, Maneka Gandhi, Dr. Murray Waldman, Nettie Wiebe and Swami Agnivesh with stunning visuals of a personal journey that crosses continents, the story of Mad Cow Sacred Cow takes us from the filmmaker’s own happy days of indiscriminate beef consumption to the frightening realities created by గ్లోబలైజేషన్.
(see" karmafilm "
Mad Cow Sacred Cow Trailer from KarmaFilm on Vimeo.
చింతా దీక్షితులు బాల సాహిత్య స్రష్ట. బాలబాలికలతో స్నేహము, వారి ఆట పాటల పట్ల ఆసక్తీ, పరిశీలనలు ఆయన వ్యక్తిత్వములో రంగరించుకున్న నైజములు. రిక్షా గూడు బండిలో మైకులో చెబుతూ, సినిమాలకు ప్రచారమును( నేటికీ పల్లెటూరులలో ఉన్నది.) చేసే వారు. అంతే కాదు, ఆ సినిమా వివరాలతో ప్రచురించిన కరపత్రాలను ఊరూరా పంచే వారు. ఒకసారి ఒక బాలునికి అలాంటి పాంప్లెట్టు దొరక లేదు. టవలు కట్టుకుని అప్పుడే వీధిలోనికి వచ్చారు చింతా. బిక్క మొహము వేసిన ఆ పిల్లవాణ్ణి చూసి జాలి పడ్డారు దీక్షితులు. అంతే! ఆ బండి వెనుక చిన్నబ్బాయి లాగా పరుగులు తీసారు. ఎలాగైతేనేం! కరపత్రాలను సాధించి, ఆ పిల్లోడికి ఇవ్వగలిగారు.
తృప్తిగా గాలి పీల్చుకోబోయి ఖంగు తిన్నారు చింతా దీక్షితులు .
ఆయన ఒంటి పైన అంగోస్త్రం లేదు మరి! అదన్న మాట!
***********************************************
మలేషియాలో వేడుకలు
-----------------------
A full scale installation of Sri Sri Gaura Nitai is scheduled to take place Seberang Jaya (Butterworth), Penang on Wednesday, 17th September – Thursday, 18th September 2008. Do not miss the rare opportunity in Malaysia.(At Bhaktivedanta Cultural Center (BCC) at Seberang Jaya, Penang.)
Dr. B.L. Sharma, a Vastu Architect and Consultant from Jaipur, India who generously offered free services, mentioned that the land purchased was “Godsent”. He said the land has good Vastu and instructed accordingly. at Bhaktivedanta Cultural Center (BCC) at Seberang Jaya, Penang.
(Photo
శ్రీ బాల కృష్ణ)
(Telusaa!చింతా దీక్షితులుBy kadambari piduri )
"స్వాతంత్ర్య పోరాటము" అంటేనే ఉద్విగ్నభరిత సంఘటనలకు ఆలవాలమైన
వాతావరణమును ఆవిష్కరించుకున్నట్టి చారిత్రక యవనిక.
త్రిలింగ దేశములో అనగా నేటి మన తెలుగుదేశములో
కాశీనాధుని నాగేశ్వరరావుగారు, టంగుటూరి ప్రకాశంపంతులుగారు, దుగ్గిరాల సీతారామయ్యగారు, కొండా వెంకటప్పయ్యగారు, దుర్గాబాయి్ దేశ్ ముఖ్ గారు, మున్నగు దేశభక్తులు ఎందరో ఉద్యమించారు.
"భారతమాత"ను కించపరిచే ఎంత చిన్న సంఘటననైనా ప్రజలను ఎంతో ప్రభావితం చేసేది.
"లాయిడ్" అనే ఆంగ్లేయుడు లెక్చరర్గా పని చేసేవాడు.
అతడికి హిందువుల సాంప్రదాయాలు మూఢనమ్మకాలుగా కనిపించేవి. భారతీయులు అందరూ అతడి దృష్టిలో పరమ ఛాందసులు.
"మీరు రాతి బొమ్మలకు పూజలు చేస్తారు. ప్రతి వాటినీ 'దేవుళ్ళు'గా భావిస్తూ పూజిస్తున్నారు. అదీ ఒక పూజయేనా? అంతకంటె నా కాలిచెప్పుకు పూజ చేయండి.............".
ఈ మాటలు అందరికీ తెలిసింది. ఇంకేమున్నది? క్షణాల్లో జనులలో ఆవేశం ఉప్పొంగినది.విద్యార్ధులందరూ స్ట్రైకు చేసారు. కొండా వెంకటప్పయ్య నాయకత్వం వహించగా కాశీనాధుని నాగేశ్వరరావు ఆయనకు కుడిభుజంగా నిలిచారు. వరుసగా పదకొండు రోజులు స్ట్రైకు జరిగింది.అటు పిమ్మట రాజీ కుదిరింది.
కొస మెరుపు
------------
ఆ ఇద్దరు నాయక శిఖామణులను అధికారులు కాలేజీ నుండి ఇళ్ళకు పంపించి వేసారు.
(By kadambari piduri)
మచిలీపట్నం వురఫ్ బందరుతెలుగు సాహిత్య సరదాలకు తేనెపట్టు అయిన పట్టణము.
'బందరు కవితా సమితి'లో వివిధ సారస్వత సమావేశాలు,గుర్తుంచుకొనదగిన సంఘటనలనుసాహిత్య యవనిక మీద రంగులు చిందించినాయి.
ప్రొప్రైటరు వెల్లటూరి స్వామి నాధన్.
ఆయనను "గోల్డుస్మిత్ ఆఫ్ గొడుగు పేట"(Gold smith of Godugu peta) అని పిలిచే వారు.
వెల్లటూరి స్వామి నాధన్ ఒకసారిపింగళి లక్ష్మీ కాంతం గురించి ఇలాగ అన్నారు.
1)"కాంతాయ కాఫీ హోటలుప్రాంతాయ
రుజా క్రాంతాయవృధా పంధాయ."
అదే పంధాలోవెల్లటూరి స్వామి, మరి కొన్ని పృధక్కులు;;;;;;;
2)"చేత కానీ లేని పూల రంగడు"
3)పూవుల రంగడై విఱియ బూచినతంగెడు సంగడీడివై....
"ఆ నాటికి ఇంకా లబ్ధ ప్రతిష్ఠులైన కవివర్యులుగా నిల ద్రొక్కుకోలేదు.
ఆ తర్వాత "తెలుగు సాహిత్య చరిత్ర", "తెలుగు సరస్వతీ దేవికి" ముద్దుబిడ్డఅయినారు .
(Pramukhula Haasyam పూలరంగడు By kadambari piduri )
కాసు బ్రహ్మానంద రెడ్డి(ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి) ,తన సెక్రటరీతో హస్తినా పురమునకు,
అదేనండీ, ఢిల్లీకి వెళ్ళి రాచ కార్యాలు చక్క బెట్టుకుని వస్తూండే వారు.
ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ఎదుట వినయంగా నిలబడి భక్తితో నమస్కరించేవారు.
ఆమె అందరినీ ఆప్యాయంగా పలకరించేది.
కాసు బ్రహ్మానంద రెడ్డి "మిమ్మల్ని ఆంధ్ర జనులు దేవతగా కొలుస్తున్నారు.
బీద ప్రజల పాలిటి కరుణ కురిసే అమ్మ మీరు."
ఇలా స్తోత్రం చేస్తూ, చాకచక్యంగా మన తెలుగునాడుకు నిధులను రాబట్టగలిగేవారు.
"కాసు" సార్ధక నామధేయుడే మరి!
ఇందిరా గాంధీ కూడా రాజకీయ దురంధురాలే!
ఇంగ్లీషులో మాట్లాడుతూ ,మూలనిధులలో నుండి
ఆంధ్రదేశమునకు కేటాయించిన నిధులనుండీ, ఇవ్వగలిగినంత మేర కేటాయింపులను
"ఓ.కే.! రెడ్డీజీ! I will give my help." అంటూ శాంక్షన్ చేసేవారు.
అత్యుత్సాహంతో రెడ్డి గారు, మన రాష్ట్రమునకు' నిజంగానే' ఉన్న అవసరాలనుఏకరువు పెడుతూ,
మరిన్ని నిధులను రాబట్టడానికై ప్రయత్నించేవారు.
చిన్న పథకములకు ఆమె ఉదారంగానే డబ్బును శాంక్షను చేసే వారు.
ఇక పెద్ద గ్రాంటుల ప్రస్తావన రాగానే, ఆమె భాష కాస్తా హిందీలోకి మారేది.
పాపం! బ్రహ్మానంద రెడ్డికి మన రాజ భాష రాదు!
" ఆప్ క్యా బోల్తే హై?రెడ్డీజీ!.."అంటూ, ఇందిరమ్మ హిందీ భాషలోనికి జంప్ చేసేవారు.
ఠకాల్న నిలబడి, రెడ్డి గారు భుజంపైని ఉత్తరీయాన్ని దులిపేస్తూ అనే వారు.
"సెక్రటరీ!ఈ ముం... ఇంక చేయదు గానీ ,పా! వెళ్ళిపోదాం!"
ఇందిరా గాంధీ రాజకీయ నైపుణ్యమునకు, అప్పటి "అగ్ర రాజ్యం ప్రెసిడెంటు" కూడా విస్తుబోయేవారు.
"ఆమె చాలా మొండిది."అని వ్యాఖ్యానించాడు, వారి ఎత్తుగడలకు లొంగిపోలేదన్న అక్కసుతో!
(By kadambari piduri )
ఐశ్వర్యా రాయ్ 1972 లో (మంగుళూరు వద్ద)జన్మించినది.ఆమె 1974 లో "ప్రపంచ సుందరి"గా ఎన్నిక అవడము భారతీయులకు ఎంతో గర్వ కారణమైనది.మణి రత్నం 1996 లో నిర్మించిన"ఇరువర్"అనే తమిళ సినిమాతో సినీ రంగంలోనికి అరంగేట్రం చేసింది.ఈ సినిమాయే తెలుగులో డబ్బింగు చేయ బడిన "ఇద్దరు".అలాగే "ఐష్ హీరోయిన్‌గా ఉన్నట్టి "జీన్స్"భారతీయ సినిమాలకు ఒక కొత్త ఒరవడిని సృష్టించినది.ఈ సినిమాలో ఐశ్వర్యా రాయ్ నటించిన యుగళ గీతము ,ఏడు ప్రపంచ వింతలు వద్ద చిత్రీకర జరగడం ఒక రికార్డు.ఈ సినిమా 1997 లో విడుదలైనది.తెలుగులో,నాగార్జున నటించిన "రావోయి చంద మామా"లో ఈమె నటించినది.హిందీ వెండి తెరకూ రాణి అయ్యి,అమితాభ్ బచన్,జయ బాధురి ల కోడలు అయి,అభిషేక్ బచ్చన్ ఇల్లాలు అయిన అద్వితీయ సౌందర్య రాశి ఐశ్వర్యా రాయ్,సారీ!ఐశ్వర్యా బచన్.
అరవై లక్షల గుర్రం స్వారీ!,
కండు కొండేన్-కండు కోండేన్అనే సినిమా షూటింగు నిమిత్తమై, ప్రఖ్యాత హీరోయిన్ ఐశ్వర్యా రాయ్ యూరోప్ కు వెళ్ళింది. బ్రిటన్ షూటింగులో ఆ అందాల రాణి ఐశ్వర్యా రాయ్ పాల్గొన్నది. అప్పుడు ఆమెకు అపురూప సంఘటన తటస్థ పడింది.స్కాట్లండు రాణి మాత్రమే స్వారీ చేసే గుర్రం పై కూర్చుని స్వారీ చేసే అవకాశం ఐశ్వర్యాకు లభించింది. "ఆఫ్ట్రాల్!గుఱ్ఱమే కదా!" అని పెదవి విరవకండి. ఆ అశ్వరాజం గారి ధర అక్షరాలా రూ.60 లక్షల పైనే! అంతే కాదండీ! సాక్షాత్తూ రాణీ గారే స్వయంగా మన భారతీయ సినీ ప్రపంచపు మహా రాజ్ఞి ఐన ఐశ్వర్యా రాయ్ కి భోజన, ఆదరువులను వడ్డించింది కూడాను. ఈ సందర్భాన్ని పూస గుచ్చినట్లు చెప్పింది ఆ తేనె కళ్ళ సౌందర్య రాశి.
"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...