తెనుగు లెంక బిరుదాంకితులు,తుమ్మల సీతారామ మూర్తితన జీవిత ప్రయాణానికి ప్రేరణ ఇచ్చిన సంఘటనలను నెమరు వేసుకునేవారు.తండ్రి - గొప్ప ధర్మ నిష్ఠా పరుడు.అల నాడు, 19, 20 వ శతాబ్దాలలో సాహిత్యాన్నిసరస్వతీ దేవికి ప్రతి రూపంగా భావించారు.నాయన కూడా బీదరికం అనుభవించారు.నిరు పేదగా గడుపుతూ కూడా నీతి నియమాలకు కట్టుబడి ఉండే వారు.ఒక పర్యాయం ఆయన స్నేహితుడు,10 వీశల బంగారాన్ని దాచి పెట్టుకున్నారు.అటు పిమ్మట, ఊరు నుండి చ్చాడు వచ్చాడు అతను."నా బంగారాన్ని ఇవ్వండి." అని అడిగారు.తండ్రి "నేను భద్ర పరచి ఇస్తున్నాను కదా,కాబట్టి, నాకు కొంత ద్రవ్యమును ఇవ్వు." అని అడగ లేదు,అడిగినదే తడవుగా, పది వీశల అపరంజినీ ఆ మిత్రునికి ఇచ్చేసారు.ప్రతిఫలాపేక్ష లేకుండా, జీవించడమేమానవ జీవిత పరమావధిగా ఆచరణలో చూపిన మహానుభావుడు ఆయన.తన తండ్రి నుండి ఈ విశిష్ట వ్యక్తిత్వాన్ని వారసత్వంగా పుణికి పుచ్చుకున్నారు తుమ్మల.సబర్మతీ ఆశ్రమంలో కొంత కాలం ఉన్నారు తెనుగు లెంక .జాతి పిత జీవన విధానము ఆయనను చాలా ప్రభావితం చేసింది.మహాత్మా గాంధీ ఆశయాల ఆచరణా కర్తవ్య బద్ధుడైనతుమ్మల సీతా రామ మూర్తి చౌదరిని " మహాత్ముని ఆస్థాన కవి"అనిప్రజలు, ప్రేమతో ప్రస్తుతించారు.పనిలో పనిగా ఒక కవి మంచి పద్య గానాన్ని ఈ ఫొటోలో చదవండి.(See LINK) ;శ్రీ తుమ్మల సీతారామమూర్తిగారు ఆధునిక కవులలో పేరెన్నిక గన్నవారు.ఇతను 1901 లో జన్మించారు. 1990లో కాలధర్మం చెందారు.తెలుగు రైతు కుటుంబంలో పుట్టిన యీయన ప్రముఖ గాంధేయవాది.సబర్మతీ ఆశ్రమంలో కొంతకాలం గాంధీగారి శిష్యరికం చేసి,మహాత్ముని జీవిత చరిత్రను ‘మహాత్మ కథ’ గా రచించారు.అదే కాక ఆయన ‘ఆత్మార్పణ’, ‘ధర్మజ్యోతి’, ‘శబల’,‘గీతాదర్శనం’, ‘సర్వోదయ గానం’, ‘ఉదయగానం’, ‘నేను’,‘తెనుగునీతి’, ‘సమదర్శి’, ‘పైరపంట’, ‘పరిగపంట’, ‘రాష్ట్రగానం’మొదలైన గ్రంథాలు ఎన్నో రచించారు.అన్నిటిలో బాగా ప్రసిద్ధి పొందిన గ్రంథం ‘రాష్ట్రగానం’స్ఫూర్తి;;_______
30, జనవరి 2011, ఆదివారం
తెనుగు లెంక తుమ్మల సీతారామ మూర్తికి స్ఫూర్తి
29, జనవరి 2011, శనివారం
హస్త మస్తక యోగముతో బ్రహ్మ జ్ఞానము
శ్రీశ్రీ శ్రీ మళయాళ స్వామి సర్వ సమ భావ సంపన్నమైనబ్రహ్మ విద్యా ప్రచారము చేసారు.సంఘ శ్రేయస్సే ప్రథమ కర్తవ్యంగా ఆయన స్థాపించి,నడిపిన పారమార్థిక సమాజములు అన్నీ సర్వ జనామోదము పొందాయి .అనతి కాలంలోనే ఆయన కీర్తి దశ దిశలా వ్యాపించింది.దీనిని సహించ లేని అసూయా పరులూ, సనాతనులూ ఉన్నారు.ఆయనను కించ పఱచడమే వారి ప్రథాన కర్తవ్యంగా ఎంచుకున్నారు.శ్రీ మళయాళ స్వామి వద్దకు వచ్చిన విద్వాంసుడు ఒకడు ఇలాగ అడిగాడు“స్వామీ! రామకృష్ణ పరమ హంస –హస్త మస్తక యోగము – తో వివేకానందునికి బ్రహ్మ జ్ఞానము కలిగించారట కదా!మరి, మీరు కూడా మాకు అట్లాగ చేయ గలరా?”తనను ఇరకాటములో పెట్టే ఇలాటి ప్రశ్నలు – ఆయనకు అలవాటే!కనుకనే స్మిత వదనుడై, తడుముకోకుండా తాపీగా సమాధానం ఇచ్చారు.“ఆహా! చేయకేమి? అలాగే! తప్పకుండా చేస్తాను;మీరు వివేకానందుని వలె తయారై (సిద్ధ పడి) వచ్చినచో –మేమును తప్పక అట్లే చేయ గలము.”( link -> స్వామి వారి ‘సో~హం’ చిట్కా )ఆ ప్రతి వాది ప్రతి ధ్వని సేయ లేక, నిరుత్తరుడై, అక్కడి నుండి నిష్క్రమించాడు.Link ;;;;;;;;( see this nice bhakti information blog )
25, జనవరి 2011, మంగళవారం
నీ పర్మిషన్ అక్కర లేదు!
లార్డ్ కర్జన్ (British India కు ) గవర్నర్ జనరల్‌గా ఉన్న కాలంలోఅశుతోష్ ముఖర్జీ (శ్యాంప్రసాద్ ముఖర్జీ తండ్రి) కలకత్తా హైకోర్టు జడ్జిగా ఉన్నారు.ఒకరోజు అశుతుష్ ముఖర్జీని కర్జన్ తన వద్దకు పిలిపించాడు.‘‘ముఖర్జీ గారూ! మీకు మంచి అవకాశం ఇస్తున్నాం.మిమ్మల్ని గవర్నమెంట్ పనిమీద ఇంగ్లండ్ పంపిస్తున్నాం!’’ఈ మాట విన గానే అశుతోష్ సంతోషంతో ఎగిరి గంతేస్తాడనుకున్నాడు కర్జన్.కానీ అశుతోష్ ముఖంలో ఎటువంటి స్పందనా కనబడలేదు.‘‘సర్! మా అమ్మగారిఅనుమతి తీసుకునిఏ సంగతీ మీకు తరువాత తెలియజేస్తాను!’’అన్నాడు అశుతోష్ ప్రశాంత వదనంతోకర్జన్ ఆశ్చర్యపోయాడు.‘‘నేను ఇండియా గవర్నర్ జనరల్‌ని!నేను ఆర్డరిచ్చిన తరువాత నీకు ఇంకొకరి పర్మిషన్అవసరమా?’’గవర్నర్ జనరల్ కాదు గదా, అతణ్ణి పుట్టించిన సృష్టికర్త ఆర్డరు వేసినప్పటికీ,అశుతోష్‌కి తన మాతృదేవత దీవనే ముఖ్యం!ఈ సంగతినే అశుతోష్ ముఖర్జీ గవర్నర్ జనరల్‌కి వివరించి,గుడ్‌బై చెప్పి బయటకు వచ్చాడు.కర్జన్ నోట మాట రాలేదు!హిందూ దేశంలో కుటుంబ, అనుబంధాలకుప్రత్యేక పవిత్ర భావన ఉన్నది.అలాగే ప్రకృతిలోని ప్రతి అంశాన్నీ దైవత్వానికి ప్రతిరూపంగా(ఈ నాటికీ )కొలవడం జరుగుతూన్నది.మనము పుట్టిన ఈ గడ్డ, మట్టి - అని అందరికీ తెలుసు.కానీ, ఈ భూమిని " మాతృ భావన"తో పూజ చేయడంబహుశా ప్రపంచంలోఇక్కడ మాత్రమే సాధ్యమైనది.అందుకే" వందే మాతరం మనదే భారతం!" అనిఆ నాడు దశ దిశలూ పిక్కటిల్లాయి.ఈ పై సంఘటనలో" మాతృ మూర్తికి అశుతోష్ వంటి పౌరులు ఎనలేని గౌరవం ఇవ్వడం,మాతృ భూమితో ఉన్న మానసిక మమతానురాగాలుపరస్పరం - బింబ ప్రతిబింబ భావాలై సాక్షాత్కరిస్తునాయి గదూ!జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలతో జే జేలు. ;స్వరాజ్యము కోసమై యావద్దేశము అణువణువూఉత్తేజంతో ఉర్రూతలూగుతూన ఆ రోజులలో -అశుతోష్ ముఖర్జీ జీవితంలో జరిగినఒక హాస్య సంఘటనకు పునర్దర్శన లాభం .@) అశుతోష్ ముఖర్జీ (1864-1924)"బెంగాల్ టైగర్" గా వినుతి చెందాడు.(see link - konamanini - బుధవారం 28 జూలై 2010 )నిర్భయత్వానికి మారుపేరు ఈ "Bengal Tiger".ఇంగ్లీష్ వారు పాలిస్తూన్న ఆ రోజులలో, భారతీయులను ఆంగ్లేయులుహీనభావంతో చులకన చేసేవారు.ఒకసారి trainలో అశుతోష్ ప్రయాణం చేస్తున్నాడు.అతను తన చెప్పుల జతను బెర్త్ కిందపెట్టి, నిద్ర పోసాగాడు.కొంతసేపటికి ఒక European అదే బోగీలోనికి ఎక్కాడు.ఆ యూరోపియన్ మనిషికి - సీటు మీద ఒక ఇండియన్ నిద్ర పోవడం -చాలా ఆగ్రహం కలిగించింది.ఆ తెల్ల వాడు ముఖర్జీ పాదరక్షల జతను కిటికీలో నుంచి బైటికి విసిరివేసాడు.పిమ్మట అతడు తన కోటును విప్పి, berth మీద పెట్టి, కునుకు తీయసాగాడు.Asutosh Mukharji కి మెలకువ వచ్చింది.తన చెప్పులు కనబడలేదు."ఎదుటి సీటు మీద ఉన్న ఇంగ్లీషు వాడు చేసిన పని"అని గ్రహించాడు.వెంటనే అశుతోష్ అక్కడ కనబడుతున్న తెల్లదొర కోటునుకిటికీలో నుండి విసిరేసాడు.నిద్ర లేచిన తెల్ల వాడు తన coatను వెతుక్కుంటూ,"Here! where is my coat?"అంటూ అడిగాడు."నీ కోటు నా స్లిప్పర్లను వెదకడానికి వెళ్ళింది."అని బదులిచ్చాడు అశుతోష్ ముఖర్జీ.
23, జనవరి 2011, ఆదివారం
జాబిలి నేర్చిన వెన్నెల పాట = వేసవిలో వచ్చిన ‘వెన్నెల పాట’
ఓ జాబిల్లీ! దిగి రావోయి!
చంద మామ! చంద మామ! చందమామా!
ఎందు దాగి ఉన్నావు చంద మామా! //
చిన్ని పాప మారాములు చేసెనోయీ!
అన్నమింత ముట్ట లేదు,అంట లేదు!
కారు మబ్బున దాగున్న చంద మామా!
మా పాపకుగోరు ముద్ద తినిపించగ వేగ రావోయీ! //
ఆట బొమ్మలంటేను వెగటేసేను
నే- పాట పాడ "విననంటూ" హఠము చేసేను!
"అమా వాస్య మఠము నుండి "చంద మామా!
20, జనవరి 2011, గురువారం
ఫిఫ్టీ శుభ శకునములు
భారతీయ సమాజములోను, ప్రపంచములోని అనేకసంఘాలలోనూప్రజలు తాము చేస్తూన్న పనులు సక్సెస్ అవాలనీ ఆశిస్తారు.అందుకు భగవంతుని అనుగ్రహాన్ని అభిలషిస్తారు .అయితే తాము ఆరంభించిన వ్యాపారము,ఉద్యోగమూ,గృహ నిర్మాణములు, ఇంటిలోని బాధ్యతలనూసక్రమ పద్ధతిలో పూ ర్తి చేయడానికి కొంత మనో బలము అవసరము అవుతుంది.అలాంటి ఆత్మ స్థైర్యాన్ని అలవరచుకునే ప్రక్రియలోఅంతర్భాగాలుగా జ్యోతిష్యము, శకునములు, శుభ లగ్నములు,వారములు,వర్జ్యములు,తిథులు మున్నగు వాటిని నమ్మకములుగా ఏర్పరచుకుంటారు."సూర్యుని కాంతితో సమానమైనవి కాదు గానీ"వీటిని కారు చీకటిలో చేతిలో ఉంచుకోదగిన టార్చి లైటుల వంటివి అని గుర్తించ వచ్చును.వానినే “మాంగల్య పంచావత్తు “ అని పిలుస్తారు.జనులు ప్రారంభించిన పనులలోను, చేస్తూన్న కార్యాలలోనూ,ప్రయాణాలలోనూ అప్రయత్నముగాఈ శకున వస్తు సామగ్రి ఎదురైతే విజయం సిద్ధిస్తుంది.నేటి ఆధునిక కాలములో ,వీనినే వినూత్న స్వరూపాలలో ఆపాదించుకుని, ఆవిష్కరించుకొన వచ్చును.ఉదాహరణకు , టెలి విజను ప్రోగ్రాములలో ఆ యా వస్తు సముదాయాలు అగుపిస్తే , శుభ యోగంగా అనుకో వచ్చును.అదే ఫక్కీలో ప్రయత్న పూర్వకంగా , ముందరే శుభ దృశ్యాలను ఏర్పాటు చేసు కోవాలి.అందు వలన కొంత మనో నిబ్బరం కలుగుతుంది.దాని ద్వారా ఆరంభించిన పనులలో జయం లభిస్తుంది.హిందువులకు విద్యాధి దేవత శ్రీ సరస్వతీ దేవి.శ్రీ వాణీ దేవి హస్త యుగ్మములో అలంకృతమై అలరారు వాయిద్య రాజమే “ కచ్ఛపీ వీణ”.సంగీత పరికరాలకు ఆది రూపిణి “ వీణియ”యే! ఇన్నేసి మంచి కారణాలు ఉన్నాయి కదా;కాబట్టి ఈ పాటికే పాఠక మహాశయులు గ్రహించే ఉంటారు; “ వర వీణా పాణి ఐన శ్రీ శారదా దేవి వాయించే వీణ ,మనకు ఎదురైతే, ఆటోమాటిక్ గా శుభ దాయినియే కదా!ఇక మాంగళ్య పంచాశత్త్తు వర్గములో చేరిన అంశాలను పరికిద్దాము.1) వీణ ; 2) సంస్కృత వాఙ్మయము 3) పుష్పములు ; 4) అలంకరణ సామగ్రి ; 5) తేనె ; 6)కాటుక ;
7) గోరోజనము ; 8) ఆవు ; 9) ఆవు పేడ ; 10) శంఖము ;11)చందనము ; 12) అక్షింతలు ; 13) నెయ్యి ; 14) పెరుగు ; 15) పచ్చని గడ్డి ;16) నిండు కుండ ; 17) భోజనముతో నిండిన పాత్ర ( అనగా క్యారియరు వగైరాలు ) : 18) వడ్డించిన విస్తరి ;19) తాంబూలము ;20) వాహనము ; 21) ఆసనము ; 22) కొత్త దుస్తులు/ వస్త్రములు ; 23) విసన కర్ర ; 24) జెండా ; 25) గొడుగు ; 26)పానకము ; 27) తెల్లని పూలు/ తెల్లని ధాన్యములు, ధాన్యాలు ; 28) తాజా కూర గాయలు ;28) తాజా కూర గాయలు ; 29) రావి, మఱ్ఱి , అత్తి , వనస్పతి మున్నగునవి;30) ఏనుగు ; అద్దము 31)గొఱ్ఱె ; 32) పళ్ళు, ఫలహారాలతో నిండిన బుట్ట, సంచీల వంటివి ; 33) రేగటి మన్ను ముద్ద ; 34) శుభ్రమైన శయ్య ; 34) పీఠము ;35) ఆహారము ఎట్సెట్రాలను రింటూన్న వారు ; 36)కాంచనము = బంగారము ; 37) రజతము = వెండి 38) రాగి వస్తువులు ; 39) రత్నములు ;40) పట్టు బట్టలు ; 41)చామరములు ; 42) చెరకు ; 43) మేళములు = మంగళ వాద్యాలు ; 44)నీళ్ళ గ్లాసు, పాల చెంబు మొదలైనవి ; 45) వెలుగుచున్న అగ్ని ; 46) కల్లు ( ఇది విచిత్రమే! కానీ అల నాడు సోమ రసముతో సమానముగా తలిచే వారు ; కావున “కల్లు”ను కూడా మంచి శకునాల లిస్టులోనికి చేర్చేసి ఉండ వచ్చును.) ; 47) కత్తి, చాకు మున్నగునవి ; . ( కానీ ఎక్సెప్షను ఉన్నది,అది ‘మంగలి కత్తి’ తటస్థ పడ రాదు,అది మాత్రం చెడ్డది. ) ; 48)మాంసము ; (ప్చ్! ఈ వ్యాస రచనా కర్తకు మాత్రం ,దీనిని – శుభ శకునాల లోనికి చేర్చేసేయుట నచ్చ లేదు.) ;49) పుత్రులతో స్త్రీ, కన్యకా, దంపతులు 50) గుంజకు కట్టిన పశువు .చూశారు కదా!మంచి దృశ్య హారములు మన మనసులకు ప్రశాంతతను చేకూరుస్తాయి.శాంత చిత్తముతో మొదలెట్టిన పనులను దిగ్విజయ భావనతో కొన సాగించ గలుగుతారు.మనో ధర్మ శాస్తము ( = సైకాలజీ ) ప్రకారము స్వాస్థ్యము కలిగిన మనసుతోనేనిత్య దైనందిక కార్య క్రమములను మనిషి పూర్తి చేయ గలుగుతాడు.అనుభవజ్ఞులు ,తత్వ వేత్తలు,జీవిత సరాన్ని కాచి వడబోసిన బుధ జనులు సర్వులకు ఉద్బోధిస్తూన్న బోధనల సారాంశములు ఇవియే కదా!మానవుని స్వభావములోని మౌలికముగా అంతర్లీనంగా ఉన్న ఫీలింగ్సును, మన దేశీయ లాక్షణిక వేత్తలు "నవ రసములు"గా విభాగించారు.అలాంటి వింగడింపులలో, లాస, హాస,దరహాసములను మనిషి అధరాల పైన విర బూయించ గల సామర్ధ్యము ఉన్నటువంటి భావ జాలములకు పునాదుల వంటివి శృంగారము , హాస్యము,శాంత రసములు. మన పరిసరాలు అనురాగము, మమత, ప్రేమ , ఆనందములతో నింప బడి ఉండాలి.అలాంటి వాతావరణము వలన ఎల్లరి హృదయాలు ఆహ్లాదముతో విర బూసే శత దళ పద్మములుగా విలసిల్లుతాయి. మన పూర్వీకులు తాము కని పెట్టినట్టి "ఈ జీవిత రహస్యాలను నాటకములలో, ఇతిహాస , కావ్యాదులలో అంతస్సూత్రాలుగా ఉండ వలెనని " నిబంధనలను విధించారు.$$$$$$కావ్యాలను సుఖాంతములుగా (= కామెడీ comedy )ఉండేలా రాయవలెనని లాక్షణికులు నిబంధించారు.ప్రాచీన కాలము నుండి పెద్దలు, వ్యక్తి/ వ్యక్తుల నిత్య ప్రవర్తనలను లోతుగా పరిశీలించారు.ప్రతి క్షణాన్నీ సంతోష మయంగా చేసుకుంటూ ,ప్రజానీకం తమ కర్తవ్యములను సంపూర్ణ విజయ వంతముగా ఒనరించుకోగలగాలని ఆర్యులు అభిలషించారు.అందుకు అవసరమైన విధి విధానాలను ఆచార వ్యవహారములలో అనుసంధించారు.ఆ అనుక్రమణిక పట్టికలలోని ఒకానొక విభాగమే "శకునములు".కానీ మూఢంగా అనుసరించ నక్కర లేదు.ఆలోచనలన్నీ మూఢ నమ్మకముల మయముగా అయిపోతే,అప్పుడు ఆచరణలు కూడా అసంబద్ధముగా పరిణమిస్తాయి.అలాంటప్పుడు జీవితములు రసాభాసగా మారి పోయి, ఆస్వాదనా యోగ్యములు కాకుండా పోతాయి.కాబట్టి, వీలైనంత వఱకూ, వీలు కుదిరినంత దాకా, మన మానసికోల్లాస రూప కర్తలుగా," శుభ శకునములను" ఆచరణకు అందు బాటులో ఉంచుకోవాలి.వీనిని వీలైనంత వఱకు పాటించ వచ్చు; అంతే కానీ, పిల్లి ఎదురైందని ఆగితే,స్టేషన్లో ఎక్కవల్సిన రైలు కాస్తా జీవిత కాలం లేటు అవుతుంది సుమండీ!
19, జనవరి 2011, బుధవారం
వృక్షో రక్షతి రక్షితః , Daripalli Ramaiah
17 అక్టోబర్ 2007 ( October 17, 2007 )లో వార్తలలో ఒక మంచి వార్త,
"వృక్షో రక్షతి రక్షితః " అనే ఆర్యోక్తి
అతనికి తెలుసునో, లేదో మనకు తెలీదు,
కానీ ఆ సారాంశమునకు ఆచరణలో ప్రతిబింబం అతడు,
నిష్కామ కృషీవలుడు .
అతడే దరిపల్లి రామయ్య. భార్య జానమ్మకు ఆ కార్యాచరణ అంటే సంతోషం.
అతని సైకిలుకు "వృక్షో రక్షిత రక్షితః" అని రాసి ఉన్న బోర్డు ఉంటుంది. vrukshO rakshita rakshit@h" ప్లాస్టిక్ కాయితాలు, వస్తువులూ, పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచే విధికి కంకణ బద్ధుడు రామయ్య ఎగ దోపిన పంచె క
ట్టుతో, నిరాడంబరంగా ఉండే రామయ్య ప్రతి రోజూ సైకిలు మీదబయలుదేరుతాడు.
ఎందుకు? "
మొక్కలను నాటడం కోసం".
వేప, సుబాబుల్, టేకు వంటి వాటిని ఎక్కువగా తీసుకుంటాడు. నీడ నిచ్చే మహా వృక్షాలకు పెద్ద పీట వేస్తారు
Daripalli Ramaiah, and Janammaలు.కేవలం తన ఒక్క చేతి మీదుగానే,ఇంతటి బృహత్ కార్యాన్ని నిర్వహిస్తున్నాడు. అంటు మొక్కలతో తన ద్వి చక్ర వాహనాన్ని తొక్కుతూ,బయలుదేరి,ప్రతి రోజునూ నిద్దుర లేపుతాడు.
( తెలుగు దేశము పార్టీ వారు విద్యార్ధినులకు, కొంత మందికీ సైకిళ్ళను ఉచితంగా ఇచ్చారు, మరి ఈ ప్రకృతి ప్రేమికునికి సైకిల్ ఐనా ఇచ్చారేమో తెలీదు.)“ తరు ఛాయలలో ప్రాణి కోటి సేద దీరుతూంటాయి,
కాబట్టి నీడ నొసగే పెద్ద చెట్ల జాతులనూ ,తరువులను ఎంచుకుంటాడు. కనీసం 100 అంటు కొమ్మలతో , తన సైకిలు పెడలును తొక్కుతూ వెళతాడు. ఖాళీ ప్రదేశాలను గాలిస్తాడు, తన వెంట తెచ్చిన Sapplings ను అంటు తొక్కుతాడు.ఖమ్మం పట్టణం సమీపంలోని కుగ్రామం అతనిది. తన శక్తి మేరకు, శక్తి వంచన లేకుండా ఖమ్మం పరిసరాలలో, చుట్టు పక్కలా మొక్కలను నాటే అసిధారా వ్రతం పూనిన ధన్య జీవి దరిపల్లి రామయ్య. అతను వన దేవతకు ముద్దు బిడ్డ , అందుకే ఆ వన జీవికి ప్రకృతి ప్రేమికుల కృతజ్ఞతాంజలి.
One-man brigade అంటే రామయ్య దంపతులే! 33(+ 6) సంవత్సరాలనుండీ, ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా ప్రకృతి మాతకు చేస్తూన్న రామయ్య సేవ అందరినీ అబ్బురపరుస్తూన్నది.
హోం మంత్రి జానా రెడ్డి , రామయ్యకు, తన జేబులోనుండి 6000 రూపాయలను ఇచ్చాడు. తమ్మినేని వీరభద్రం , రామి రెడ్డి వేంకట రెడ్డి, వనమా వెంకటేశ్వర రావు, గుమ్మడి నరసయ్య, సాంభాని చంద్ర శేఖర్, పాయం వెంకటేశ్వర్లు మున్నగు M.L.A. లు అందరూ, 20 వేలు ఇచ్చారు20 కిలో మీటర్ల దూరంలోని రెడ్డి పల్లి నుండి జిల్లా ప్రధాన కార్యాలయాలకు రాక పోకలతో,వనాల పెంపుదలలో తాను భాగ స్వామి అయ్యాడు.
కనీసం కోటి చెట్లను నాటాలని ఆ దంపతులు లక్ష్యంగా పెట్టుకున్నారు
దాదాపు వెయ్యి స్కూళ్ళలోనూ, 400 ఆఫీసులలోనూ, 258కోవెలలలోనూ వృక్ష రక్షణ, మనిషికీ, జీవ కోటికీ అత్యంత అవసరమనే సంగతులను చెబుతూంటాడు.“హరితదన సందేశాలు” అతని ఇంటి గోడలపైనా, అడుగడుగునా రాసి ఉన్నాయి. ఆ నినాద, సూక్తులు ఆతని హృదయ దర్పణంలో సాక్షాత్కరించే మానవాళికి అవసరమైన మణి దీప ప్రభలు.
18, జనవరి 2011, మంగళవారం
“శతభిష నక్షత్రము”, కదంబ తరువు
వృక్ష జాతులలో కదంబ తరువుకు, మన దేశంలో ప్రత్యేక స్థానం ఉన్నదికదంబము చెట్టును " పార్వతీ వృక్షముగా" ప్రఖ్యాతమైనది."కదంబ వన వాసిని" గా అమ్మ వారిని పూజిస్తున్నారు భక్త జనులు.మీనాక్షి సుందరేశ్వర స్వామి కోవెల ద్వారము వద్దస్థల వృక్షము కదంబం చెట్టు పురాతనమైన ది, స్థల వృక్షము.బాల క్రిష్ణుడు నవనీత ప్రియుడు, వెన్న ముద్దలనుకదంబం ఆకులలో పెట్టుకుని తిన్నాడట!"కడిమి చెట్టు" అనే నవలను జ్ఞానపీఠ బహుమతి గ్రహీతశ్రీ విశ్వ నాథ సత్యనారాయణ రచించారు.వృక్ష జాతులలో కదంబ వృక్షమునకుమన దేశంలో ప్రత్యేక స్థానం ఉన్నది.27 నక్షత్రాలకూ ప్రతీకలుగా 27 పాదపములను జ్యోతిష్య, వాస్తు శాస్త్రజ్ఞులు నిర్ణయించారు.వాటిలో “శతభిష నక్షత్రము” ( పాశ్చాత్యులు Aquarii star ) కు ప్రతిరూపము.కదంబం పూలు సువాసనలతో పరిమళిస్తూంటాయి.ఆయా భాషాలో / బొటనికల్ సైన్సులో కదంబ తరువుకు పేర్లు అనేకం .చెట్టు వ్రేళ్ళు, బెరడు( Bark) , పూలు, ఆకులు అన్ని భాగాలు ఉపయుక్తములే!అత్తరు / సెంటు, పసుపు పచ్చ రంగు ద్రావణము, జ్వర హారి ఔషధముగా మూలికా వైద్యములలోనూ, ఉపయోగించబడుచున్నవి.( ఒక కదంబ మహా వృక్షము యొక్క కాండముపైనిగణపతి , మున్నగు రూపాలతో వింతగా ఉన్నది. ఈ ఫొటోను గమనించండి.)
17, జనవరి 2011, సోమవారం
బెంగుళూరులో తోట
14, జనవరి 2011, శుక్రవారం
శ్రీ గౌతమీ జీవ కారుణ్య సంఘము
13, జనవరి 2011, గురువారం
పౌష్య లక్ష్మి రావమ్మా!
భోగి నాడు పూజలు చేసిధనుర్మాసముకు వీడ్కోళ్ళు;హేమంతములో వణుకుళ్ళుదక్షిణాయనం గిడిగిళ్ళు;టా! టా! షయొనారా!ఉత్తరాయణం అడుగిళ్ళు *భోగి పండుగకు రేగీ పళ్ళుపళ్ళు పోయగా పాపళ్ళుకేరింతలతో హ్యాపీలు!కొండల కోనల "కనుమ"లలోమసక మంచులతొ దోబూచి!ధాన్య లక్ష్మికి స్వాగతము!పౌష్య లక్ష్మికీ సంబరము;సస్య లక్ష్మికీ సుస్వాగతముప్రతి మది నీకు మందిరము,సంక్రాంతి దేవీ!రావమ్మా!మకర సంక్రాంతీ! మహదానంద దాయినీ!ఆదర పూర్వక స్వాగతము![* అడుగు+ఇడుట= అడుగిళ్ళు ]మిత్రులకూ, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.Wish You Happy Pongal.
11, జనవరి 2011, మంగళవారం
కరెంటు లేకున్నప్పటికీ వారి నిష్కల్మష కృషి
భారతీయ విజ్ఞానానికి క్రీస్తు పూర్వం నుండీ ఉన్న పునాదులకు నిదర్శనమైనచారిత్రక అమూల్య సంపద తాళ పత్ర సంపుటిగా లభ్యమైంది.ఆ శ్లోక సంపుటిక్రీ//పూ//300 సంవత్సరములలోని చాణుక్యుని"నీతి దర్పణము"అనే ఉద్గ్రంధము.Mysore prachya likhita bhanadagar, లో ఉద్యోగి శ్యామ శాస్త్రి,సంస్కృత, కన్నడ, ఆంగ్లాది భాషలలో పట్టు ఉన్న విద్వాంసుడు.Rudrapatna Shamashastry లైబ్రరీలోనితాళ పత్రాలను నిరంతరమూ పరిశీలిస్తూ భద్ర పరిచే వాడు.ఒక రోజు రుద్రపట్నం శ్యామ శాస్త్రి ప్రాచీన వ్రాత ప్రతులను సర్దుతూండగాఆయనకి ఒక తాళ పత్ర గ్రంధము కనబడినదిmarvelous Indian History అది;" చాణుక్యుని రచన " కనబడింది.ఆ palm leaves లో ఉన్న శ్లోకాలను చదువుతూ,అమితానంద ఉద్వేగాలతో ఆనంద బాష్పములతో పులకించిపోయారు.1905 లో శ్యామ శాస్త్రి గుట్టలుగా ఉన్న తాటాకు గ్రంధ ప్రతులనుండిఅనుకోకుండా ఈ అమూల్య రచనను కనుగొన్నారు .రుద్రపట్నం శ్యామ శాస్త్రి నివాస గృహం పేరు” అశుతోష్”.అప్పటికి వారి కాలనీలో కరెంట్ లేదు.అందుచే వారు టార్చ్ లైట్ ని వేసుకుని పని చేసారు.కరెంటు లేకున్నప్పటికీ వారి నిష్కల్మష కృషి అసిధారావ్రతంలాగా కొనసాగించారుఆ కుటుంబీకులు అందరూ!కౌటిల్య గ్రంథములోని శ్లోకాలనుఫొటోలు తీయుట,తర్జుమా చేయుట ఇత్యాది అనేక పనులు చేస్తూ,శ్యామ శాస్త్రికి చేదోడు వాదోడుగా మనుమరాలు,మనుమడులు నిలిచారు.మనుమలు చాణుక్యుని రచనను యావన్మందికీ పరిచయం చేసేఆ మహత్తరమైన బృహత్ కార్యంలో భాగస్వాములు ఐనారు.ఈ మహత్తర కార్యము 1905 లో మైసూర్ లోని ఓరియంట్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్(The Oriental Research Institute (ORI) జరిగింది.ఆ Details, News English లో అచ్చు ఐనాయి.´ Indian Antiquity and Mysore Review మొదలగు వివరాలు ప్రింట్ ఐనాయి.అప్పటినుండీ, రమారమి 6 ఏళ్ళు అవిరళ కృషి చేసి,1915లో ముద్రణా రూపంలో లోకానికిఅందించ గలిగారు.
తోటలో చిందులు
;;;;;;;;; లాల్ బహదూర్ శాస్త్రి భారత ప్రధానిగా ఉన్నారు.“జై జవాన్! జై కిసాన్!”(Hail the soldier! Hail the Former) అనేఉత్తేజ భరితమైన నినాదాన్ని ప్రజలకు మంచి పరిపాలనతో పాటు అందించారు.(Lal Bahadur Srivastava Shastri :लालबहादुर शास्त्री ,2 October 1904 - 11 January 1966)చిన్న తనంలో నాటకాల పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు శాస్త్రి.మహా భారతము నాటకంలో బాల్యంలో “కృపాచార్యుల వేషం ధరించాడు .కృపాచార్యులు , కౌరవుల కొలువులో ఉన్నప్పటికీపాండవుల అభిమానాన్ని కూడా చూర గొన్నాడు.అలాగే శాస్త్రి కూడా అజాత శత్రువే!అతను అందరి మన్ననలనూ పొందినసాత్విక స్వభావునిగా పేరు పొందాడుమూడేళ్ళ వయసులో తల్లి, కుటుంబంతోతాతగారి పంచన చేరవలసి వచ్చినది.మాతామహుడు తాత హీరాలాల్"నన్ హే (nanhe!)”అని మనవడినిముద్దుగా పిలిచేవారు.(nanhe = Tiny);;;;;;;;;6 ఏళ్ళు వయస్సులోఒక పళ్ళ తోపు ( Orchard ) లోనికి జతగాళ్ళతో వెళ్ళాడు.పిల్లలందరూ చెట్లు ఎక్కి, పళ్ళు కోస్తూ,తోటను చిందర వందర చేయసాగారు.ఇంతలో తోటమాలి వచ్చాడు.అతను అదిలించగానే, పిల్లలు ఒక్క ఉదటున దూకి, పలాయనం చిత్తగించారు.లాల్ బహదూర్ శాస్త్రి అమాయకంగా ఒక చిన్న కాయను మాత్రమే కోశాడు.తతిమ్మా వాళ్ళ లాగా అల్లరి చిల్లరి పనులు తెలీని బాలుడు,అక్కడే నిలబడి ఉండి, దొరికిపోయాడు.మాలి లాల్ ను కొట్టబోతూండగా, ఏడుస్తూ బేలగా అడిగాడు,“ నన్ను కొట్టొద్దు మాలీ! నేను అనాథను.” అంటూ బ్రతిమాలాడు.జాలితో మనసు కరిగిన గార్డెనర్ బాలుని వివరాలనూ,ఆచూకీని తెలుసుకున్నాడు."బాబూ! నువ్వేమో ముందూ వెనకా ఆధారం లేని అనాథ పిల్లాడివి.అంచేత నువ్వు మరింత వినయంగా మసలుకోవాలి.అల్లరి వాడివైతే నీ తల్లి మనసు తల్లడిల్ల్తుంది కదా!జాగ్రత్తగా మసలుకో నాయనా!”ఆ తోట మాలి పలుకులు శాస్త్రిని ఎంతో ప్రభావితం చేసాయి.“ ఇక పై నేను బుద్ధిగా మసలుకుంటాను.భవిష్యత్తులో నేను మంచివాడిననిపించుకుంటాను.”అనుకుంటూ అదే దృఢ సంకల్పంతోజీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించగలిగాడు లాల్ బహదూర్ శాస్త్రి.
ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు
"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...
-
అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి! ఆది పరాశక్తి పాలయమాం! త్రిభువనేశ్వరి! రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయమాం! ; || ; శ్రీ జగదీశ్వరి అన్న...
-
మన సంస్కృతాంధ్ర కవులు మాటలతోనే గాక అక్షరాలతో కూడా అందమైన ఆటలాడుకున్నారు. పద్యాలు, పదాలతో రకరకాల విన్యాసాలు చేసారు. పద్యంలో ఇంకో పద్యం, ఎటున...
-
“భయ భంజన శర్మ” విరచితమైన “రమల రహస్యము” అనే ప్రాచీన గ్రంధమును చదువుట వీరికి(ఎక్కిరాల వేద వ్యాస, ఎక్కిరాల సోదరులు) సంభవించినది. ఈ ప్రాచీన జ్యో...