10, జనవరి 2011, సోమవారం

పంచమ్ కథా కమామిషూ



















బర్మన్ కుటుంబీకులు సంగీత ప్రపంచానికే కలికితురాయిలు.
నార్త్ కలకత్తా లోని బర్మన్ ఇంటిని
“ హెరిటేజ్ బిల్డింగ్ /heritage building ” అని ప్రకటించడం
వారి కృషికి నిదర్శనమే!
త్రిపుర రాజు మహారాజా బిక్రమ్ కిశోర్ మాణిక్య బహదూర్,
రాహుల్ దేవ్ తండ్రి సచిన్ దేవ్ బర్మన్ ను
“విద్యా మంత్రి పదవిని” ఇవ్వ జూపగా,
సచిన్ దేవ్ “ సంగీత ప్రపంచంలోనే తాను
స్థిర పడతానని
" world of music ” స్థిర అభిప్రాయాన్ని చెప్పాడు.
కొమిల్లా ( comilla) లోని S.D.Burn ఫామిలీ పూర్వీకులు నివాస గృహాను
స్మారక ప్రముఖ చిహ్నాలుగా భద్రత ను ఇవ్వాలని ప్రతిపాదన చేసారు





















రాహుల్ దేవ బర్మన్ పేరు తెలియని సినీ సంగీత అభిమానులు ఉండరు.
ఆతనికి ఒక నిక్ మ్ ఉండేది, అందరూ అతన్ని “ పంచమ్ “ అని పిలిచే వాళ్ళు.
ఈ పేరు కథా కమామిషూ తెలుసుకునే ముందు
కొన్ని విశేషాలను ముచ్చటించుకుందాము.
రాహుల్ దేవ బర్మన్ తల్లి దండ్రులు సచిన్ దేవ్ బర్మన్,మీరాలు.
ఆషా భోస్లే Wife;;; ఎస్.డి. బర్మన్ ది సంగీత కుటుంబమే ఐనదనవచ్చును.
ముంబై లో, సరోద్ వాదనని ఉస్తాద్ ఆలీ అక్బర్ ఖాన్ వద్ద నేర్చాడు.
Rahul Dev Burman 9 సంవత్సరాల వయస్సులోనే,
ఒక హిందీ పాటకు బాణీ కట్టాడు.
Aye meri topi palat ke aa అనే పాటకు
తన తనయుడు ట్యూన్ ను చేశాడు,
మురిసిపోతూ ఆ తండ్రి Sachin Dev Burman
1956 లో రిలీజ్ ఐన “ఫన్ టూష్ “(Funtoosh ) అనే
మూవీ లో చేర్చుకున్నాడు.
R.D.Burman బాల్యంలోనే ఎన్నో సంగీత విజయాలను
అవలీలగా సాధించాడు.
“Sar jo tera chakraaye" అనే పాటకు సంగీత మట్టులను కట్టాడు.
యధావిధిగా “అంతటి సంగీత పరిజ్ఞానాన్ని తన కుమారుడు కలిగి ఉన్నాడంటే”
ఏ తండ్రి గర్వించకుండా ఉంటాడు!?
సచిన్ దేవ్ వెంటనే ఆ గీతాన్ని, సినీ జగత్తుకు చేర్చాడు.
ఆ సంగీత భరిణ గురుదత్ యొక్క “ప్యాసా “ చిత్రంలో సౌండ్ ట్రాక్ , ఇమిడింది.
దేవానంద్ నటించిన చలన చిత్రం Solva Saal .
ఈ సినిమాలోని Hai apna dil to aawara అనే పాటకు,
నేపథ్యంలో మౌత్ ఆర్గన్ ను వాయించాడు బాల రాహుల్ బర్మన్.
ఇలాగ చలన చిత్ర మ్యూజిక్ లో బాల్యంలోనే
తండ్రికి కుడి భుజంగా నిలబడిన భాగ్యశాలి రాహుల్ దేవ్ బర్మన్.
“ ఛోటే నవాబ్ “ పిక్చర్ తో సంగీత దర్శకునిగా మారాడు.













నాగార్జున, ఊర్మిళ నటించిన సినిమాకు సంగీత దర్శకుడు ఆర్.డి. బర్మన్.

ఆర్.డి. బర్మన్ కు చిన్నప్పుడు “పంచమ్” అనే nick name వచ్చింది.
“పంచమ్ “ -> సంగీతంలో పునాదులు సప్త స్వరములు.
అవి స, రి, గ, మ, ప, ద, ని, స – లు. “ప” వానిలో 5 వది,
ఈ “ ప”ను సంగీత శాస్త్రంలో “ పంచమ స్వరము” అని వ్యవహరిస్తారు.
పసి బాలుడు రాహుల్ దేవ్ బర్మన్ కేరింతలు కొడుతూ, ఏడుసూన్నప్పుడు
వాని స్వరం “ ఖంగున మోగుతూన్న కంచు కంఠము ” అని
సంభ్రమాశ్చర్యాలతో అతిథులు మెచ్చుకున్నారు.
అప్పటి ప్రముఖ హిందీ సినిమాలలోని ప్రముఖ హీరో అశోక్ కుమార్
చంటి వాణ్ణి చూడాటానికి వచ్చాడు.
ఉయ్యాలలోని నవ జాత బాలుడు పదే పదే “ ప”ను ఉచ్ఛరిస్తున్నాడు.” అని
గమనించి, అందరికీ చెప్పాడు.
అంచేత అశోక్ కుమార్ ముద్దుగా “పంచమ్ “ అని పిలిచాడు.
అదిగో! అలాగ మన రాహుల్ దేవ్ బర్మన్
ముద్దుగా “పంచమ్” అనే పేరును ఉగ్గు పాలతో పుణికి పుచ్చుకున్నాడు.
సాంప్రదాయ సంగీతానికి సరి కొత్త ఒరవడులను నిర్మించాడు ;
నవీన సంగీత దర్శకులకు మార్గదర్శకుడు ఐనాడు రాహుల్ దేవ్ బర్మన్.

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...