
_ ____
_
శ్రీక్రిష్ణ దేవ రాయలు జైత్ర యాత్రలు చేస్తూ, ఈ సీమలలో బస చేసి,
ఇచ్చట ప్రజోపయోగమైన పనులను నిర్వహించాడు.
అందుచేత ఖమ్మం కోట, జల్లేపల్లి కోట,జమలా పురం దేవళముల వద్ద
శ్రీ కృష్ణ దేవ రాయలు విగ్రహాలను నెలకొల్పారు.
ఆంధ్ర భోజునికి 500 వ జయంతి సందర్భంగా
ప్రజలు ఆయన విగ్రహాలను నిలిపి, కృతజ్ఞతను చాటుకున్నారు.
ఖమ్మం జిల్లాలో కోట, జల్లేపల్లి, శ్రీ వేంకటేశ్వర స్వామి కోవెల మున్నగునవి
చారిత్రక ప్రాధాన్యం కలిగినవి.
శ్రీ కృష్ణదేవరాయలు జల్లేపల్లి గ్రామంలో బస చేసాడు.
అప్పుడు రాయలు చక్రవర్తి “శ్రీ వేంకటేశ్వర స్వామి దేవళమును పున్నర్నవంగా కట్టించారు.
"ఆంద్ర్హ భోజుడు" రాయల వారి కంచు (bronze) విగ్రహాన్ని ప్రజలు నెల’కొలిచారు ’.
“తెలంగాణా చిన తిరుపతి”గా జమలాపురం దేవాలయం వినుతి కెక్కినది.

మున్నేరు తీరస్థ సీమ ఇది.
ప్రాచీన కాలంలో భరద్వాజ నది నామ ధేయంతో ఉన్న
మున్నేరు తీరం సూచీ ప్రాంతమైన జమలా పురం విశిష్టత కలిగి ఉన్నది.
ఇచ్చట వైకుంఠ గుహ, కైలాస గుహలు ఉండేవి అని జన శ్రుతి.
జాబాలి ముని యాత్రలు చేస్తూ,
భరద్వాజ నది/ మున్నేరు లో స్నాన సంధ్యలు చేసి,
ఈ ప్రాంతము అనువుగా ఉండుటచే, గురు కులమును స్థాపించాడు.
జాబాలికి శ్రీ విష్ణు మూర్తి సాక్షాత్కరించాడు.
తత్కారణంచే వైకుంఠ గుహ అనే పేరు వచ్చిన ఈ గుహ,
సూది బోడు ( సూచీ గిరి, అని ప్రాచీన పేరు) గుట్టలలో ఉన్నది.
ఇది జమలాపురానికి ఉత్తర దిక్కులో ఉన్నది .
కిరాతనార్జునీయ కథకు అనుబంధంగా ,
రెండవ గుహ కు కైలాస గుహ అని నామం పొందినది.
భారద్వాజ గోత్రీకుడు ఉప్పల యజ్ఞ నారాయణ శర్మ మున్నగు భక్తులకు
శ్రీ వేంకటేశ్వర స్వామి అనుగ్రహము లభించినది.
కనక గిరి గుట్టలు నేడు కల్లూరు గుట్టలుగా పేర్లు మారినవి.
2 కామెంట్‌లు:
Kanakagiri guttalu - Kalluru guttalu...ivi ekado chepagalara please?
Krishna
I write A new Essay.
I give there,Some information.
Please, See! sir!
కామెంట్‌ను పోస్ట్ చేయండి