22, ఫిబ్రవరి 2009, ఆదివారం

ఆంగిల్స్ వివిధములు


బాల భారతి

చిన్ని నాతల్లి సిరి మల్లె

చిరు నవ్వు ముత్యాల ముగ్గు లేసేను

కను చూపు కిరణాల వెలుగు పఱచేను

చిలిపి చేతల తోటి సిరులు నింపేను

అందాల పాపకు ఎవఱమ్మ "పల్లవి"?

"రామాయణము"పాడు "కుశ లవులె పల్లవి!"

చిన్నారి పాపకు ఎవరమ్మ తోడు?

"సింహంతొ ఆడేటి భరతుడేనమ్మా!"

పొన్నారి పాపకు ఎవరమ్మ జోడు?

"కొండను ఎతిన శ్రీ బాల కృష్ణుడు!"

చదువుల తల్లికి ,

మా బాల పాపాయిలకు ఎవరు ఆదర్శం?

రాట్నమును త్రిప్పేటి గాంధి తాతయ్య!"

అర్ధ నారీశుడు


శ్రీ ఇష్ట కామేశ్వరి దేవీ కోవెల

1)శ్రీ శైలము ,మల్లి కార్జున శిఖరమునకు 11 కిలో మీటర్ల గూరంలో

నెక్కంటి - పాలుట్ల మార్గములో , నెలకొని ఉన్నది

"పరంఏశునికై తపస్సు చేయుచున్న పార్వతీదేవి అవతారమైన "శ్రీ ఇష్ట కామేశ్వరీ దేవీ కోవెల".

2)శ్రీ శైలము దేవ స్థానములోని పూజారులే , నిత్యమూ ఇచ్చటకు

ఉదయము వచ్చి ,పూజలు నిర్వహిస్తున్నారు.

3)క్వార్ట్జ్ రాతిలో చెక్కిన ఈ మూర్తి , 8-9 శతాబ్దముల నాటిది.

4)కుడి చేతిలో రుద్రాక్ష మాలను, ఎడమ చేత శివ లింగమును ,

వెనుకవైపున్న ఇరు హస్తములలో కలువ మొగ్గలను ధరియించిన చతుర్భుజాలు కల దేవత ఈమె.

పాన పట్టము వంటి పీఠముపైన ,ముకుళిత నయనములతో ,

ఈమె కిరీట ధారిణిగా కొలువై ఉన్నది.

"విష్ణు ధర్మోత్తర పురాణము"లో ఇట్టి సౌందర్య విశేషాలతో అమ్మ వారు వర్ణించ బడి ఉన్నారు.

5)శ్రీశైల క్షేత్రానికి తూర్పు దిక్కుగా 24 కిలో మీటర్ల దూరంలో ఉన్నారు "ఇష్ట కామేశ్వరీ అమ్మ వారు".

కిరణములు (చిత్ర వర్ణము )


ఓ జాబిల్లీ! దిగి రావోయి!

అమావాస్య మఠము నుండి చంద మామా!
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

చంద మామ! చంద మామ! చందమామా!
ఎందు దాగి ఉన్నావు చంద మామా! //

చిన్ని పాప మారాములు చేసెనోయీ!
అన్నమింత ముట్ట లేదు,అంట లేదు!
కారు మబ్బున దాగున్న చంద మామా!
మా పాపకుగోరు ముద్ద తినిపించగ వేగ రావోయీ! //

ఆట బొమ్మలంటేను వెగటేసేను
నే- పాట పాడ "విననంటూ" హఠము చేసేను!
"అమా వాస్య మఠము నుండి "చంద మామా!
మా అమ్మాయి కొఱకు రావయ్యా! - హఠమును మాని! //

19, ఫిబ్రవరి 2009, గురువారం

మాటల పేరోలగము

1)అన్యోన్యముగా = పరస్పరము/ దంపతులు ఒకరి పట్ల ఒకరు ప్రేమతో ఉండుట
2)అనన్య సామాన్యమైన విషయమును శాస్త్రజ్ఞులు కనుగొన్నారు.
3)అండ దండలు = తోడూ,నీడగా ఉండుట
ఉదా//;;; ఒకరికొకరు అండగా నిలబడి, పొలములను బాగా పండించి
కేదారములుగా చేసారు.
4)అంగ బలము,అర్ధ బలము ఉన్నవారు = సపోర్టుగా ప్రజలు/బంధు,మిత్రులు కలిగి ఉన్నచో
"అంగ బలము కల వారు"అనీ;
అవసరమైనప్పుడు ఖర్చు పెట్టుటకు ,సంకోచించనంతటి ధనమును , కలిగి ఉన్నటువంటి వారు.
5)డబ్బూ, దస్కమూ:::
6) డబ్బును వెదజల్లుట;;; రూపాయలను ' మంచి నీళ్ళ ప్రాయంగా 'వెచ్చిస్తూండుట ::::::::::
ఉదా//;;; ఎన్నికల సమయములో అన్ని పార్టీల వాళ్ళూ డబ్బును మంచి నీళ్ళ ప్రాయముగా ఖర్చు పెడుతున్నారు

చిత్రవర్ణం (కొత్త భరిణ ) aavi2009


అన్య - అన్యోన్యము (మాటల పేరోలగము)

'''''''''''''''''''''''


మాటల కొలువులు :::::::::::::
''''''''''''''''''''''''''''''''''''''''''''''
1)అన్యము =ఇతరము, తక్కిన అన్యులు=ఇతరులు;పరులు

2)అనన్యము = స్వంతమైనదిగా భావించుట

3)"అన్యథా శరణం నాస్తి! త్వమేవ శరణం మమ
ఇతరులెవ్వరినీ వేడను,నీవే నాకు శరణమువు!"
"నాకు దిక్కు! నిన్నే నమ్మి ఉన్నాను.నీవే నాకు అండ దంద! '"
"నీవే తప్ప నితః పరంబెరుగను." అని గజేంద్ర మోక్షములూ, ఏనుగు ,భగవంతుని ఎలుగెత్తి, ప్రార్ధించెను.

4)అన్యాపదేశముగా చెప్పుట = నేరుగా చెప్పకుండా, వేరే మిషతో చెప్పుట.
"కుక్క మీద పిల్లి మీద పెట్టి చెప్పుట"కూడా ఇలాంటిదే కానీ ,
కాస్త పరుషముగా నిందించే సందర్భాలలో వాడుక!

ఉదా:// శకుంతల ,"తుమ్మెదా! నీకు ఇంత దూకుడు పనికి రాదు!" అని,దుష్యంతుని ఉద్దేశ్యించి, పలికినది.
5)అన్య కాంతలు; మున్నగునవి.

4, ఫిబ్రవరి 2009, బుధవారం

జూకాలు


అలరించే బృందావని

'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''

బాలలమండి! బాలలము !

బావి బారత పౌరులము !

భారత మాటకు - మోదము నొసగే

వన్నెల పరిమళ పూవులము!

౨)ఆటలు, పాటలు - చదువు, సంధ్యలు

పని పాటులతో - ఆరి తేరిన ప్రజ్ఞాలము

౩)విత్తులు విట్టి - నారును చల్లి

చేస్తున్నాము "తోట పని"

అలరించునిది - అందరి మదినీ !

అందాలోలికే "బృందా వని " .

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

అనామిక


వెలుగుల నవ్వులు

''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''

బాల బాలికల కిల కిల నవ్వులు
ఆటలు, పాటలు -సందడి హేలలు
ప్రకృతి అంతా - నవ రస భరితం

పాల పుంతలు : కొలిచిన ముదములు
తొణికిస లాడిన దారులలోన
మిల మిల తారలు నడిచిన వేళల
ఆహ్లాదాల కావ్య హేలలు .

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;
తెలుగాప్పా!
''''''''''''''''''''''''''''''
తొలకరి జల్లులు - తెలుగప్పా!
బూమి పళ్ళెం - తెలుగప్పా!

నీలపు రాసులు - తెలుగప్పా!
పైరుల పచ్చలు - తెలుగప్పా!

ముత్యాల ధాన్యం - తెలుగప్పా!
ముత్తెపు నవ్వులు - వేద జల్లినవి

మన తెలుగు సీమ - తెలుగప్పా!
మమతల మాగాణి - తెలుగప్పా!

నవ ధాన్యాలు - నవ రత్న సిరి
మొదపు విందులు - చప్పట్లోయ్^! చప్పట్లోయ్^!

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...