14, జనవరి 2011, శుక్రవారం

శ్రీ గౌతమీ జీవ కారుణ్య సంఘము" శ్రీ గౌతమీ జీవ కారుణ్య సంఘము”
నిష్కామ సేవలతో ముందంజలో ఉండి, పేరు గాంచినది.
సంఘ సేవా తత్పరత ఉన్న వారిలో,
కొందరి దృష్టిలో “ఆధ్యాత్మిక భావనలు కల వారు” అంటే
తూస్కార భావం ఉండేది.
అలాంటి వారిలో అధికులు నాస్తికులుగానూ,
చార్వాక మతస్థులుగానూ ఉండే వారు.
అట్టి మెంబర్సులో కొందరైన – కమ్యూనిష్టు వర్గీయులు – స్వామి వద్దకు వచ్చారు.
ఆ సమయంలో స్వామి ‘చాతుర్మాస వ్రత దీక్షలో’ ఉన్నారు.
ఆయన కొన సాగిస్తూన్న దైవ భక్తి ప్రచారము ,
మీదు మిక్కిలి సంఘ సేవ, సాంఘిక దురాచారాల నిర్మూలనలు సైతము
ఆ మార్గములో ఆచరణ సాధ్యమే –నని నిరూపించ గలిగిన మహానుభావుడిగా
ప్రజాదరణ పొందారు.
ఆ కారణము చేత ప్రజలు ఆయనకు భక్తితో సమర్పించే కానుకలు
ఇబ్బడి ముబ్బడిగా పెరగుతున్నాయి.
అది చూసి, సహింప లేని అసూయా గ్రస్తులు కూడా తయారవ సాగారు.
ప్రముఖ కమ్యూనిష్టులు కొందరు స్వామి వారి వద్దకు వచ్చారు.
“అయ్యా! ఈ ప్రాంత ప్రజలు ఇచ్చుకుంటూన్న ధనాన్ని
తమరు దోచుకుని పోయి, మీరు ఆ రాళ్ళల్లో (= రాయల సీమలోని ఆశ్రమంలో)
ఖర్చు పెడుతున్నారేమిటి? ఆ ధనమును ఇక్కడనే వెచ్చించ కూడదా?”
అంతట స్వామి ఇలాగ వాక్రుచ్చారు “ సోదరులారా! ఈ ప్రాంతము సంపన్నమైనది.
రాయల సీమలో (ధాత కరువు 7 సంవత్సరాలు ప్రజలను విల విల్లాడారు)
కఱువు కాలమున అన్నము లేక ఎందరో అల్లాడుచున్నారు.
ఇట్టి తరుణమున – ఇచ్చటి ధనమును అచ్చట వినియోగించుట దోషమా?
మీరు దీన జనోద్ధరణమునకై బద్ధ కంకణులైన కమ్యూనిష్టులు కదా!
మీ సమత్వ సిద్ధాంతమేమైనది?
ఆ సిద్ధాంత విషయమున మేమును కమ్యూనిష్టులమే!
కానీ మాకు దైవముపై విశ్వాసము గలదు; హింస మాకు నచ్చదు.”
స్వామి జవాబుతో వారు నిరుత్తరులై, స్వామి కి నమస్కరించి వెను తిరిగి పోయిరి.
మరో మారు ఆధ్యాత్మిక దృష్టి లేని కొందరు సంఘ సేవకులు
స్వామి ని సమీపించి, అడిగారు ఇలాగ
“ అయ్యా! రాయల సీమలో అన్నము లేక ప్రజలు అల్లలలాడుచున్నారు.
మీరిక్కడ వేదాంతమును బోధిస్తూ కాలమును వ్యర్ధ పరుస్తున్నారేల?
ఈ సమయాన మీ శిష్య వర్గముతో గూడి, సాంఘిక సేవలొనరుస్తూ,
దైన్య పరిస్థితులలో ఉన్న జనులను ఉద్ధరించుట మీ ధర్మము కాదా?!”
మరో మారు ఆధ్యాత్మిక దృష్టి లేని కొందరు సంఘ సేవకులు
స్వామి ని సమీపించి, అడిగారు ఇలాగ
“ అయ్యా! రాయల సీమలో అన్నము లేక ప్రజలు అల్లలలాడుచున్నారు.
మీరిక్కడ వేదాంతమును బోధిస్తూ కాలమును వ్యర్ధ పరుస్తున్నారేల?
ఈ సమయాన మీ శిష్య వర్గముతో గూడి, సాంఘిక సేవలొనరుస్తూ,
దైన్య పరిస్థితులలో ఉన్న జనులను ఉద్ధరించుట మీ ధర్మము కాదా?!”
అంతట స్వామి వారిని ఇలాగ ప్రశ్నించారు,
“నాయనలారా! ఇపుడు రాయల సీమలో సంఘ సేవ లొనర్చు
కొన్ని ముఖ్య సంఘములను – అవి యొనర్చు సేవలను పేర్కొన గలరా?”
“ గౌతమీ సేవా సంఘము ప్రథమ స్థానములో ఉన్నది స్వామి!
అహో రాత్రములు శ్రమిస్తూన్నారు,
అంబలి సత్రములు మున్నగునవి నడుపుతూ
అన్నార్తులను ఆదుకుంటున్నారు." అని చెప్పారు.
“ఓహో! అలాగా! ఐతే సంతోషము.
మీరు పేర్కొన్న ఆ గౌతమీ జీవ కారుణ్య సంఘము –
మా ఆశ్రమ సంఘములలో ఒక భాగమే!
అచట సేవలు సేయు వారందరూ మా శిష్యులే!
మేము సంఘ సేవను చేస్తూనే ఉన్నాము కదా!”
అంటూ స్వామి చెప్పగా, వారు ఆశ్చర్య చకితులై, స్వామికి ప్రణమిల్లినారు.
అనేక మందికి – ఆ నాడు
"గౌతమీ సంఘము" స్వామి వారికి సంబంధించిన సంస్థ అని తెలియదు.
రాజమండ్రి నగరము - కేంద్రముగా గౌతమీ సంస్థ నెలకొల్పబడినది.
1935 లో స్వామి అనుమతితో ,
స్వామి శిష్యులైన కారుణ్యానంద స్వామి స్థాపించారు.
ఆధ్యాత్మిక ప్రబోధములకు ప్రాధాన్యాన్ని ఇచ్చినప్పటికీ,
వారు సమాజ శ్రేయస్సును ఏ నాడునూ విస్మరించ లేదు.

2 వ్యాఖ్యలు:

SRRao చెప్పారు...

మీకు, మీ కుటుంబానికి, బంధు మిత్రులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు

శి. రా. రావు
సంక్రాంతి లక్ష్మి _ శిరాకదంబం

kadambari చెప్పారు...

ధన్యవాదాలు, S.R. Rav గారూ!
మీకు, మీ ఫామిలీకీ, సంక్రాంతి శుభాకాంక్షలు.

సంపూర్ణ వసంతసేన నాటకము ;- part - 5

అధ్యాయ శాఖ ;- 30 A ;-  తాటాకుల కవిలె కట్ట సేకరణ ;; ;           లేఖక్ 1 ;- ఇందాక వస్తుంటే - వీరకుడు తిట్టుకుంటూ వెళ్తున్నాడు, ఎవరినో!?  ల...