6, జనవరి 2011, గురువారం

"నేలకొండ పల్లి""నేలకొండ పల్లి" ;is known for its historic glory.
ఖమ్మం జిల్లా ప్రకృతి రమణీయత ,వినోద యాత్రలకు అనువైనది.
(Tourism) శాఖ ప్రత్యేక దృష్టిని సారిస్తూన్నది.
@)భద్రాచలం శ్రీరామ చంద్రుల కోవెలను కట్టించిన భక్త రామ దాసు /
కంచెర్ల గోపన్న నివసించిన "నేలకొండ పల్లి" కూడా ఖమ్మం జిల్లా లోనిదే!
ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి ఐతిహాసిక గాథలతో అనుబంధాన్ని కలిగిఉన్నది.
మీదు మిక్కిలి చారిత్రక ప్రాధాన్యం (historic glory) కలిగి ఉన్నది.
మహా భారత ఇతిహాసం తో ఈ సీమ ఆత్మ పెనవేసుకుని ఉన్నది.
"విరాట దిబ్బ, కీచక గుండం' ఇత్యాది ప్రాంతాలు ఉన్నవి.
కంచర్ల గోపన్న ,భద్రాచలంలో శ్రీరామ చంద్రుల కోవెలను కట్టించాడు.
ఆ కార్య సాఫల్యత కై ఎన్నో ఇడుములను ,కష్టాలనూ పడ్డాడు.
భక్త రామదాసు గా చిర కీర్తిని పొందాడు.
శ్రీ రామదాసు పేరున
అచ్చట "భక్త రామదాసు ధ్యాన మందిరము"
( "Bhakta Ramadas Dhyana Mandir") కట్టబడినది.

1977 వ సంవత్సరంలో బౌద్ధ మత స్థూపాలు, ఆనవాళ్ళు ఇక్కడ బయల్పడ్డాయి.


సీమ పటము ను దగ్గర ఉంచుకుని,
ప్రయాణించేలా Trecking clubs వీలైనంత వరకూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూన్నాయి.
సాహస యాత్రికులు, Tourism MAP (సీమ పటము) ను అనుసరిస్తూ,
ట్రెక్కింగ్, సరదా యాత్రలు చేస్తున్నారు
@)ఖమ్మం నుండి 50- 60 కిలో మీటర్ల దూరంలో కల్లూరు గ్రామ పట్టణము
ఉన్నది.
కల్లూరు - చిట్యాల గుట్టలు (hillock) Trecking చేసే ఉత్సాహవంతులకు
హాలీ డేస్ ను హ్యాపీ డేస్ గా మా;ర్చే కేంద్రంగా ఉంటూన్నది
కల్లూరు, చిట్యాల కొండ గుట్టలు (hillock) Trecking క్రీడాకారులు దృష్టి పెడుతున్నారు
పెను బల్లి, తల్లాడ, మల్లవరం మున్నగు పల్లె ప్రాంతాలలో నుండి, ట్రెక్కర్స్ ప్రయాణాలు చేస్తునారు.
@) ప్రభుత్వం ఎర్రుపాలెం మండలం పరిధిలోనికి జమలాపురం మున్నగు పన్నెండు
గ్రామాలను చేర్చినది.
@) కల్లూరు మండల పరిధిలో 23 గ్రామాలు ఉన్నవి.


సరదా ప్రయాణాలు (ఖమ్మం "నేలకొండ పల్లి",కల్లూరు)