చిన్న తనంలో నాటకాల పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు శాస్త్రి.
మహా భారతము నాటకంలో బాల్యంలో “కృపాచార్యుల వేషం ధరించాడు .
కృపాచార్యులు , కౌరవుల కొలువులో ఉన్నప్పటికీ
పాండవుల అభిమానాన్ని కూడా చూర గొన్నాడు.
అలాగే శాస్త్రి కూడా అజాత శత్రువే!
అతను అందరి మన్ననలనూ పొందిన
సాత్విక స్వభావునిగా పేరు పొందాడు
మూడేళ్ళ వయసులో తల్లి, కుటుంబంతో
తాతగారి పంచన చేరవలసి వచ్చినది.
మాతామహుడు తాత హీరాలాల్
"నన్ హే (nanhe!)”అని మనవడిని
ముద్దుగా పిలిచేవారు.(nanhe = Tiny)

;;;;;;;;;
6 ఏళ్ళు వయస్సులో
ఒక పళ్ళ తోపు ( Orchard ) లోనికి జతగాళ్ళతో వెళ్ళాడు.
పిల్లలందరూ చెట్లు ఎక్కి, పళ్ళు కోస్తూ,
తోటను చిందర వందర చేయసాగారు.
ఇంతలో తోటమాలి వచ్చాడు.
అతను అదిలించగానే, పిల్లలు ఒక్క ఉదటున దూకి, పలాయనం చిత్తగించారు.
లాల్ బహదూర్ శాస్త్రి అమాయకంగా ఒక చిన్న కాయను మాత్రమే కోశాడు.
తతిమ్మా వాళ్ళ లాగా అల్లరి చిల్లరి పనులు తెలీని బాలుడు,
అక్కడే నిలబడి ఉండి, దొరికిపోయాడు.
మాలి లాల్ ను కొట్టబోతూండగా, ఏడుస్తూ బేలగా అడిగాడు,
“ నన్ను కొట్టొద్దు మాలీ! నేను అనాథను.” అంటూ బ్రతిమాలాడు.
జాలితో మనసు కరిగిన గార్డెనర్ బాలుని వివరాలనూ,
ఆచూకీని తెలుసుకున్నాడు.
"బాబూ! నువ్వేమో ముందూ వెనకా ఆధారం లేని అనాథ పిల్లాడివి.
అంచేత నువ్వు మరింత వినయంగా మసలుకోవాలి.
అల్లరి వాడివైతే నీ తల్లి మనసు తల్లడిల్ల్తుంది కదా!
జాగ్రత్తగా మసలుకో నాయనా!”
ఆ తోట మాలి పలుకులు శాస్త్రిని ఎంతో ప్రభావితం చేసాయి.
“ ఇక పై నేను బుద్ధిగా మసలుకుంటాను.
భవిష్యత్తులో నేను మంచివాడిననిపించుకుంటాను.”
అనుకుంటూ అదే దృఢ సంకల్పంతో
జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించగలిగాడు లాల్ బహదూర్ శాస్త్రి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి