17 అక్టోబర్ 2007 ( October 17, 2007 )లో వార్తలలో ఒక మంచి వార్త,
"వృక్షో రక్షతి రక్షితః " అనే ఆర్యోక్తి
అతనికి తెలుసునో, లేదో మనకు తెలీదు,
కానీ ఆ సారాంశమునకు ఆచరణలో ప్రతిబింబం అతడు,
నిష్కామ కృషీవలుడు .
అతడే దరిపల్లి రామయ్య. భార్య జానమ్మకు ఆ కార్యాచరణ అంటే సంతోషం.
అతని సైకిలుకు "వృక్షో రక్షిత రక్షితః" అని రాసి ఉన్న బోర్డు ఉంటుంది. vrukshO rakshita rakshit@h" ప్లాస్టిక్ కాయితాలు, వస్తువులూ, పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచే విధికి కంకణ బద్ధుడు రామయ్య ఎగ దోపిన పంచె క
ట్టుతో, నిరాడంబరంగా ఉండే రామయ్య ప్రతి రోజూ సైకిలు మీదబయలుదేరుతాడు.
ఎందుకు? "
మొక్కలను నాటడం కోసం".
వేప, సుబాబుల్, టేకు వంటి వాటిని ఎక్కువగా తీసుకుంటాడు. నీడ నిచ్చే మహా వృక్షాలకు పెద్ద పీట వేస్తారు
Daripalli Ramaiah, and Janammaలు.కేవలం తన ఒక్క చేతి మీదుగానే,ఇంతటి బృహత్ కార్యాన్ని నిర్వహిస్తున్నాడు. అంటు మొక్కలతో తన ద్వి చక్ర వాహనాన్ని తొక్కుతూ,బయలుదేరి,ప్రతి రోజునూ నిద్దుర లేపుతాడు.
( తెలుగు దేశము పార్టీ వారు విద్యార్ధినులకు, కొంత మందికీ సైకిళ్ళను ఉచితంగా ఇచ్చారు, మరి ఈ ప్రకృతి ప్రేమికునికి సైకిల్ ఐనా ఇచ్చారేమో తెలీదు.)“ తరు ఛాయలలో ప్రాణి కోటి సేద దీరుతూంటాయి,
కాబట్టి నీడ నొసగే పెద్ద చెట్ల జాతులనూ ,తరువులను ఎంచుకుంటాడు. కనీసం 100 అంటు కొమ్మలతో , తన సైకిలు పెడలును తొక్కుతూ వెళతాడు. ఖాళీ ప్రదేశాలను గాలిస్తాడు, తన వెంట తెచ్చిన Sapplings ను అంటు తొక్కుతాడు.ఖమ్మం పట్టణం సమీపంలోని కుగ్రామం అతనిది. తన శక్తి మేరకు, శక్తి వంచన లేకుండా ఖమ్మం పరిసరాలలో, చుట్టు పక్కలా మొక్కలను నాటే అసిధారా వ్రతం పూనిన ధన్య జీవి దరిపల్లి రామయ్య. అతను వన దేవతకు ముద్దు బిడ్డ , అందుకే ఆ వన జీవికి ప్రకృతి ప్రేమికుల కృతజ్ఞతాంజలి.
One-man brigade అంటే రామయ్య దంపతులే! 33(+ 6) సంవత్సరాలనుండీ, ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా ప్రకృతి మాతకు చేస్తూన్న రామయ్య సేవ అందరినీ అబ్బురపరుస్తూన్నది.
హోం మంత్రి జానా రెడ్డి , రామయ్యకు, తన జేబులోనుండి 6000 రూపాయలను ఇచ్చాడు. తమ్మినేని వీరభద్రం , రామి రెడ్డి వేంకట రెడ్డి, వనమా వెంకటేశ్వర రావు, గుమ్మడి నరసయ్య, సాంభాని చంద్ర శేఖర్, పాయం వెంకటేశ్వర్లు మున్నగు M.L.A. లు అందరూ, 20 వేలు ఇచ్చారు20 కిలో మీటర్ల దూరంలోని రెడ్డి పల్లి నుండి జిల్లా ప్రధాన కార్యాలయాలకు రాక పోకలతో,వనాల పెంపుదలలో తాను భాగ స్వామి అయ్యాడు.
కనీసం కోటి చెట్లను నాటాలని ఆ దంపతులు లక్ష్యంగా పెట్టుకున్నారు
దాదాపు వెయ్యి స్కూళ్ళలోనూ, 400 ఆఫీసులలోనూ, 258కోవెలలలోనూ వృక్ష రక్షణ, మనిషికీ, జీవ కోటికీ అత్యంత అవసరమనే సంగతులను చెబుతూంటాడు.“హరితదన సందేశాలు” అతని ఇంటి గోడలపైనా, అడుగడుగునా రాసి ఉన్నాయి. ఆ నినాద, సూక్తులు ఆతని హృదయ దర్పణంలో సాక్షాత్కరించే మానవాళికి అవసరమైన మణి దీప ప్రభలు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి