8, జనవరి 2011, శనివారం

ఇచట పరిపాటియే కదా!

నిత్య కళ్యాణం, పచ్చ తోరణములు ;
శ్రీ సప్తాద్రి వాసునికి, మా వేంకటేశునికి,
ఎల్లపుడు తేజములు పరిపాటి ||

వేలాది పువ్వులు, పది వేల పుప్పొడులు
సౌగంధములు లక్ష; విరబూయుచుండగా -
భూదేవి ప్రకృతి, మోదమ్ములందుట
సుందరమ్మౌ బృందవనిలోన పరిపాటి
లక్షణంగా ఇచట పరిపాటి ||

పెదవి సింహాసనమందు ;శత కోటి సుందర -
దరహాసములు వెలియ;
ముక్కోటి దివ్యులకు కలిగేటి సంబరమ్ములు ;
అంబర చుంబితము, అగణితమ్ములు నిజము
సల్లక్షణమ్ముగ ఇచట పరి పాటి ||

చివురు వ్రేళుల స్పర్శ ; మురళి పులకింతల
రాగమ్ము లీనుట;
యమునమ్మ అలలు శృతి చేయుచుండుట
వ్రేపల్లె వాడలలొ పరిపాటి
ఇచట పరిపాటియే కదా! ||

సంపూర్ణ వసంతసేన నాటకము ;- part - 5

అధ్యాయ శాఖ ;- 30 A ;-  తాటాకుల కవిలె కట్ట సేకరణ ;; ;           లేఖక్ 1 ;- ఇందాక వస్తుంటే - వీరకుడు తిట్టుకుంటూ వెళ్తున్నాడు, ఎవరినో!?  ల...