1, డిసెంబర్ 2010, బుధవారం

వర్ణ భరితం తూలికలు
అందాలకు నెలవులు,
చిన్న చిన్నరేఖలకు
అద్భుత భావాలను
అందించే సుదతీ మణుల
చిరు నవ్వులు;
కుంచెల (తూలికల)హృదయాలలో
వర్ణ భరితంగా
సాక్షాత్కరింప జేసే ప్రజ్ఞ
దరహాసాలకే సాధ్యం.

ముద్దు పేర్లు - మొద్దు పేర్లు

"బుజ్జీ! చంటీ! బన్నీ! చిట్టీ! కాఫీ తాగుదురు గాని రండి! టిఫిన్ కూడా రెడీ."  ; తరళ, ఆమె సోదరి లవంగిక తమతమ పిల్లల్ని ఎలుగెత్తి పిలి...