28, నవంబర్ 2010, ఆదివారం

ఆవులు ,“హయమార్” అనే మూలిక,















హైదరాబాద్ నివాసి ఫర్హతుల్లా బేగ్ నిర్మాణతలో
రూపుదిద్దుకున్న డాక్యుమెంటరీ సినిమా
"Mad Cow; Sacred Cow".
ఫర్హతుల్లా బేగ్ ఈ వెండితెర రూపకల్పన కోసం ఎంతో శ్రమించారు.
ఈ సినిమా నిర్మాణమునకు అప్పట్లో సంచలనం కలిగించిన ఒక వార్త -
పాశ్చాత్య దేశాలలో లక్షలాది ఆవులు ,
మనిషి చేసిన తప్పిదానికి బలి అయినాయి .
భారత దేశములో సంఖ్యా పరంగా ఎక్కువగా ఉన్న ఆవుల వలన
వాతావరణ కాలుష్యం జరుగుతూన్నదనే దుష్ప్రచారం జరుగుతూన్నది.
ఇందులోని సామంజస్యతను పరిశీలన చేయ వలసి ఉన్నది.
ఇది ఎంత వరకూ సబబు? అనే ప్రశ్నకు
అనేక అంశాలు అందరి అవగాహనకై ఉన్నవి.

విదేశాలలో పాడి తగ్గినప్పుడు,
ఆవులకు “ఆక్సిటోసిడ్” అనే హోర్మోన్ ను ఇస్తున్నారు.
ఇలాంటి ఇంజెక్షన్ ల వలన, గోవులకూ ,
తన్మూలమున మనుష్యులకూ ఆరోగ్య సమస్యలు ఎదురు అగుతున్నవి.
సంకర జాతి ఆవులకు అనేకములకు గంగ డోలు ఉండవు.
ఎక్కువ వేడిని తట్టుకో లేవు.
మాంసమును కలిపిన కృతిమ దాణాను
వాళ్ళు బలవంతంగా తినిపిస్తూ,
కొత్త గో జాతిని ఉత్పత్తి చేయ సాగారు;
అందువలన 'mad coe desease విపరీత పరిణామాలు
ప్రపంచానికి కలిగిన చేదు అనుభవమే!

***********************************

మన India లో దేశ వాళీ ఆవులకు “గో మాత”గా గౌరవం లభించడానికి కారణం
వాటి ద్వారా మానవ జాతికి కలుగుతూన్న ఎన్నో ఉపకారాలు కారణము.
వాటికి మూపురములు, గంగడోలులు ప్రత్యేకత.
దేశీయ ధేనువులలో మూత్రము –
నాలుగు సార్లు వాని దేహములో ఫిల్టర్ అగును,
అలా వడపోతల తర్వాత వాని మూత్రము బయటకు విడుదల చేస్తాయి.
కనుకనే “పంచ గవ్య ఔషధములలో –
గో మూత్రము సైతము వాడ బడుతూన్నది.
కారడవులలో అనేక రకాల తరువులు ఉంటాయి, కొన్ని హానికరమైనవి.
ఆవులు మాత్రమే వాటిని తిని, నిరపాయకరంగా మార్చుకుని,జీర్ణము చేసుకోగలవు.
“హయమార్” అనే మూలికను తినగానే, గుర్రము విగత జీవి అగుతుంది ,
దీన్ని మేకలు , కోతులు వంటి జంతువులు కూడా ముట్టుకోవు..
కానీ హయమర్ (గన్నేరు ;ఆంగ్లం Oleander) ని
ఆవులు భేషుగ్గా భుజిస్తాయి.

SYNONYMS -
Sansk. : Divyapushpa, satakumbha,

Asvamaraka, Hayamara.
Assam. : Diflee, Sammulhimar
Beng. : Karbbe, Karbee
Eng. : Sweet-Scented
Oleander
Guj. : Kaner
Hindi. : Kaner
Kan. : Kanagilu, Kharjahar, Kanigale, Kanagile
Kash. : --
Mal. : Kanaveeram
Mar. : Kanher
Ori. : --
Punj. : Kanir
Tam. : Sevvarali, Arali
Tel. : Kastooripatte, Errugumeru
Urdu. : Kaner
************************************************
గంగ డోళ్ళు, మూపురములు – విశిష్టతలను చేకూర్చుతున్నాయి.
ఆమ వాతానికి నిశ్చయమైన మందు:--
ఆవు శరీరంలో “ సూర్య నాడి” కలదు.
సూర్య నాడి - Sun Rays నుండి శక్తిని సేకరిస్తుంది;
ఆ సంచయనము ద్వారా – 3 రోటిడ్ – అనే ఎంజైం ఉత్పత్తి జరుగును.
ఈ లేత పసుపు రంగు పదార్ధము ఆరోగ్య ప్రదాయిని.
Anti Biotecs దుష్ప్రభావాన్ని -
గోమూత్ర ఆర్క్ 2 నుండి 80 రెట్లు తగ్గిస్తుంది.
1 స్పూన్ ఆవు నెయ్యి ,హోమం ద్వారా –
1000 సి సి ల ఆక్సిజన్ ను ప్రభవిల్ల జేస్తున్నది.
“యజ్ఞోపతి” ద్వారా జగత్తుకు కలిగే మేలు గురించి
శాస్త్రజ్ఞులు పరిశోధనలు చేస్తునారు.
విదర్భ లో పుసద్ అనే ఊరు ఉన్నది.
అక్కడ నివసిస్తూన్న “పండరీ పాండే”
40 సంవత్సరాల నుండి అనేక ప్రయోగాలు చేస్తూన్నాడు.
అతను – ఒక కిలో గ్రాము ఆవు పేడతో
= 40 కిలోల ఎరువు తయారౌతుందని నిరూపించాడు.
ఒకసారి పొలములో ఈ గోవు కంపోస్టును వేస్తే –
మళ్ళీ 3 ఏళ్ళు వఱకూ , ఎరువులను వేసే అవసరం ఉండదు.
అందు వలన ఎంతో రసాయనిక ఎరువుల ఖర్చు తగ్గుతుంది.

***********************************************

మధురా పురినీ, ద్వారకనూ , ప్రజలనూ బ్రోచిన మహనీయుడు
శ్రీ కృష్ణుడు ఆల మందల నిర్వహణలో మేటి,
గోపాల బాలుని గా అందరి చేత మన్ననలు పొంది,
పూజలు అందుకుంటూన్నాడు కదా!
దిలీప చక్రవర్తి, జమదగ్ని, సత్య కామ జాబాలి ,గౌతమ ఋషి ,
మున్నగు వారు అనేక వ్యక్తులు ప్రాచీన కాలం నుండీ
మన భారత దేశంలో ధేను సంరక్షణ కు పునాదులు వేసి,
విశిష్ట ఆచారాన్ని నెలకొల్పారు.
మారిషస్, మలేషియా ఇత్యాది (ఆసియా ఖండము)
అనేక దేశాలలో గో మాతకు సమంజసమైన ప్రాధాన్యం కలదు.

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...