21, డిసెంబర్ 2010, మంగళవారం

తాయిలం పెట్టు అమ్మా!


ఆకాశవాణి లో బాలానందం కార్యక్రమం ప్రసారమయ్యే సమయానికి
వారం వారం పిల్లలు, ఆబాల గోపాలమూ రేడియో దగ్గర బైఠాయించేవారు.
న్యాయపతి అన్నయ్య రచనలు ఎన్నో పరిసరాలలో శ్రావ్యతను నింపేవి.
ఈ పాట "బాలాంత్రపు రజనీ కాంత రావు" రచన అనుకుంటాను.
పాడిన వారెవరో గానీ, ఆ గళము ఇప్పటికీ నా చెవుల పర్ణశాలలో ఉన్నది.

బాలానందం ;;;;
_______

ఆటలు ఆడీ, పాటలు పాడీ అలసీ వచ్చానే!
తియ్య తియ్యని తాయిలమేదో తీసి పెట్టమ్మా! ||

పిల్లి పిల్ల కళ్ళు మూసి, పీట ఎక్కింది
కుక్క పిల్ల తోకాడిస్తు గుమ్మంఎక్కింది
కడుపులోని పాకి పిల్ల గంతులు వేస్తూంది
తియ్య తియ్యని తాయిలమేదో తీసి పెట్టమ్మా! ||

గూటిలోన బెల్లం ముక్క కొంచెం పెట్టమ్మా!
చేటలోని అటుకులు చారెడు ఇవ్వమ్మా!
అటక మీది అటుకుల కుండ అమ్మా! దించమ్మా!
తియ్య తియ్యని తాయిలమేదో తీసి పెట్టమ్మా! ||

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

taayilaM peTTu ammaa!
__________________

aaTalu ADI, paaTalu pADI alasI vachchaanE!
tiyya tiyyani taayilamEdO tiisi peTTammaa! ||

pilli pilla kaLLu mUsi, pITa ekkiMdi
kukka pilla tOkaaDistu gummaMekkiMdi
kaDupulOni paaki pilla gaMtulu vEstUMdi
tiyya tiyyani taayilamEdO tiisi peTTammaa! ||

gUTilOna bellaM mukka koMcheM peTTammaa!
chETalOni aTukulu chaareDu ivvammaa!
aTaka mIdi aTukula kuMDa ammaa! diMchammaa!
tiyya tiyyani taayilamEdO tiisi peTTammaa! ||

2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

there are a couple of mistakes here.

Kadupu lona kaki pilla is correct and not paki pilla.

cheta loni kobbari koru charedu pettamma

vanijayaram చెప్పారు...

బాలాంత్రపు రజనీకాంతరావు గారు రైటే

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...