9, మార్చి 2009, సోమవారం

వాన విల్లులు - సూరీడు

''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''


మబ్బు చేతులతోటి దండాలు పెడుతూ 
గొబ్బున "సూర్యుడు" వచ్చేనయా! 
"పగలు ఒడిలో " తాను 'చిన్ని పాపాయి'. // 

కిరణముల వలిపెముల - గుత్తంపు ఊయెలల 
మెత్తంగ ఊగుతూ - 'చిత్తరువల్లే తనరేటి వసుధను 
వింత వింతగ తోచి, చూసేనమ్మ! 
సూర్యుడు చూసేనమ్మా! // 

సరసు అద్దములందున - తనదు బింబమ్మును 
తనివి తీరా చూసుకొనుచూ, ఎంతొ మురిసాడమ్మా! 
ఆదిత్య దేవుడు, తరగలందున తగరు క్రీడలే 
ఆడేనమ్మా! ఆట లాడేనమ్మా! // 

నింగిలో విరిసిన 'ఇంద్ర ధనుసుల'ను 
చప్పున ఒడిలోన దాచేనమ్మా! 
'అచ్చముగ నాకేను ,హరి విల్లులం'టూను 
ఫక్కున నవ్వేసి - వెళ్ళేనమ్మా! 
ఏడు వాజిల తేరునెక్కి ,వెళ్ళేను // 


''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...