3, మార్చి 2009, మంగళవారం

తాళపత్రాలు


తెనాలి రామకృష్ణ సినిమాలో రామకృష్ణుని తల్లి "ఏం చేస్తున్నా"వని అడిగితే "వ్రాసుకుంటున్నానమ్మా!" అంటాడు. అప్పుడు ఆమె "తాటాకులు తేరగా వచ్చాయని ఎడతెరిపి లేకుండా ఏమి వ్రాతలురా ఇవి" అంటుంది. 

మన ప్రాచీన సాహిత్య సంపద యావత్తూ "తాళపత్రాల"లో నిక్షిప్తమై ఉన్నది. అందుచేతనే, ఇన్ని యుగాల తర్వాత కూడా మనకు ఆ అమూల్య సారస్వత పెన్నిధి లభించింది. అంతే కాదు, మన భారతీయ సాహిత్యమే ప్రపంచంలోనే అతి పురాతన సాహిత్యంగా నెలకొని గిన్నీస్ రికార్డులలో స్థానం ఆర్జించింది. 

మన హిందువులకు యశస్సు రావడానికి మూల కారణమైనవి తాళ పత్రాలే కదా! మరి అలనాడు రచనలకై వినియోగించబడుటకై వానిని ఎలా తయారు చేసి, సిధ్ధ పర్చుకొనేవారో తెలుసుకుందామా! 


1)మొదట తాటాకులలో పెద్ద సైజులను ఎన్నుకుంటారు. 

2) పసుపును కలిపిన నీళ్ళను పెద్ద బానలలో బాగా తెర్ల బెడతారు. 

3) ఆ నీళ్ళలో ఉడకబెట్టిన తాటాకులను అంచులు కత్తిరించి నీడలోఆరబెడతారు.

3) తాటిబద్దలను చెక్కి అట్టలుగా తయారుచేస్తారు. 

4) పేనిన త్రాడును ఎక్కిం చేందుకు వీలుగా ఎడమవైపు కొసలో రెండు రంధ్రాలను చేస్తారు. 
ఘంటమును చేత బూని ఎందరో పండితులు ఎన్నో గ్రంధాలను జగత్తుకు అందించారు. 

తాళ పత్రాలు సాక్షాత్తూ శ్రీ శారదా దేవికి ప్రతిరూపాలే! 

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

మన భారతీయ సంస్కృతికి సంబంధించిన ఇలాంటి ఎన్నో మంచి విషయాలు మీరు మీ బ్లాగ్ లో పొందుపరుస్తున్నారు . మీ కృషి అభినందనీయము.
Anil Piduri

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...