11, మార్చి 2009, బుధవారం

రాతి గంధము

రాతి గంధము
;;;;;;;;;; 

రావేల కృష్ణా!  
ఇకనైన
రావేల క్రిష్ణా! //

1)కుండ నిండుగ పాలు
పితికి,ఉంచానురా!
పాలలో వెన్నెలలు  
తొంగి చూసాయిరా! //

2)రాతి గంధము  
అరగ తీసి ఉంచానురా!
గాలి విసురుకు  
'హరి 'చందనమే విడిలెరా! //  

3)చట్టి నిండుగ వెన్న 
తీసి ఉంచానురా! 
వెన్న కరిగి పోయె! 
వెన్నెల మరుగాయెరా! //  

4)రంగు రంగుల పూలు 
అల్లి ఉంచానురా!
రజని ఒడిలో  
పూలు సొమ్మసిల్లాయిరా! //  


'''''

పొల్లు పో రాదు! ;;;;;;;;

పొల్లు పోరాదు ;;;;;;;
'''''''''''''''''''''


జనులారా!ప్రజలారా! 
'విద్య ' అనే గొడుగు కింద 
అందరమూ చేరుదాము!
జనులారా!ప్రజలారా! 
వేగిరమే రారండీ! //

1)దొరల వోలె కూర్హోండి!
రాత్రి విద్య గుడిలోన 
మల్లె దొంతరలల్లే పేర్చండీ
ఇంచక్కా అక్షరములు! //

2)వరుసగాను కూర్చోండి!
అమ్మ,నాన్న,అన్న,చెల్లి
వరుసలలో రాయండి!
అచ్చు,హల్లు పొల్లు పోక //  


''''''''


శ్రావణ మేఘములారా! ;

''''''''
మేఘములారా!
;;;;;;;;;;;;;

''''''''''''''
వర్షించే మబ్బులార!
మేఘములారా!
శ్రావణ మేఘములారా!
కుప్పతెప్పలౌ జలముల
దాచుకొనుడు!
మీ హృదయ కుహరముల
దాచుకొనుడు!
నా కన్నులలో వానికి
ఉప్పతిల్లు అశ్రువు లుగ
'పునర్జన్మ 'నొసగెదను,
దిగులు వలదు, వలదింka!


''''''''''''''''''

9, మార్చి 2009, సోమవారం

కొలను భారతి కోవెల


''''''''''''''''''''''''


కొలను భారతి కోవెల  ;;;;;;;;;;;;;
"""""""""""""""'"""   

1)కర్నూలు జిల్లాలోని కొత్త పల్లె మండలములో
శ్రీ కొలను భారతీ దేవి అమ్మవారు ఉన్నారు.
2)నల్లమల కొండలలో "చారు ఘోషిణీ నది ఒడ్డున" 
వెలసిన ఈ కోవెలలు అతి ప్రాచీనమైనవి.
3)ఇచ్చట,"శ్రీ చక్ర  సంచారిణీ"యంత్రములో
   ' కొలను భారతి' ప్రతిష్ఠించ బడి ఉన్నారు,
4)ఈ క్షేత్రము "వరుణ తీర్ధము"గా ప్రసిద్ధి గాంచెను. 
5)శ్రీ శైలమునకు పశ్చిమ దిక్కులో ఉన్న
   ఈ' కొలను భారతీ అమ్మ వారు', 
           చేతిలో వేదములను ధరించి ఉన్న "పుస్తక పాణి".

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

శ్రీ శైలము నుండి గానీ, కర్నూలు నుండి గానీ బయలు దేరాలి.
 కొత్త పల్లె మండల కేంద్రము నుండి 15 కిలో మీటర్ల దూరములో
         "శివ పురము" (వరకు వేసి ఉన్న "తారు రోడ్డు) గ్రామాన్ని చేరి :
                 అక్కడినుండి 5 కిలో మీటర్లు (మెటల్ రోడ్) ప్రయాణించి,
                         "కొలను భారతి కోవెలలను" భక్తులు దర్శించు కొంటారు.

పింఛధారి జాడలు


'''''''''''


పల్లవి 

చైత్ర మాసములోన - కుహు కుహూ కోయిలా! 

అను పల్లవి 

రాగాల రంజిల్లు స్వర జల్లు కోయిలా! 
రాగలవ?ఇటుకేసి - మా పర్ణ శాలకు 
1) 
పారిజాతము తరువు ఛాయలో 
నక్కి నక్కీ దాగి ఉండినాడే! 
మా చిలిపి కృష్ణుడు - నవనీత చోరుడు 
2) 
గుట్టుగా నువ్వు - వానినీ పట్టిస్తే 
మా గారాల పట్టి అపరంజి బొమ్మ 
పట్టెడంత మావి చిగురులెన్నెన్నో 
పెడుతుంది నీకు ఓపికతొ బాగా! 

ఓపినంతంతా మెసవవే! ఓ పికమా! 
తోపులన్నీ నీవె ఈ నాడు కదవే! 
3) 
మరకత శ్యాముడు, మా కుందనపు క్రిష్ణయ్య 
చెక్కుటద్దముల మీద - తెలి వెన్నెలల నీడలను 
కనుల కన్నావా? - తెలుసుకున్నావా? 
బాలా! నెమలి కన్నులు సిగను ధరియించినట్టి 
అల్లరల్లరి వాని జాడలల్లవిగవిగో! 



   ''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''

!మహానుభావా! రెండు ఘజళ్ళు ఘజళీకరించి!




మహానుభావా! రెండు ఘజళ్ళు ఘజళీకరించి!

గొల్లపూడి మారుతీ రావు సినీ నటుడుగా మారక మునుపు
 ఆలిండియా రేడియోలో ఉద్యోగానందాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదించారు.
 ఆయనే స్వయంగా రచయితలచేతా, కళాకారుల చేతా పూనుకుని
 మంచి రచనలను అడిగి, వ్రాయించి,
 ఆకాశవాణి ప్రోగ్రాములను సుసంపన్నం చేసారు.
 అందుకనే ఆయా కళాకారులూ, అశేష శ్రోతలూ
 "గొల్లపూడికి ౠణపడి ఉన్నామని" కృతజ్ఞతలను చెప్పుకొనేవారు.
 మద్రాసుకు ఏదో పని మీద వచ్చిన
 పీ.బి.శ్రీనివాస్ మన మారుతీ రావు గారికి తటస్థ పడ్డారు.
 AIR లో పెక్స్ ఐన గొల్లపూడి ,కవితాత్మకంగా పి.బి.ని కొసరిన రీతి ఇది
 "మహానుభావా!మహనీయ తేజా! ఎలాగూ దయ చేసారు
 రెండు ఘజళ్ళు ఘజళీకరించి మమ్మల్ని ఆనందంలో ఓలలాడించండి." 



...........

వాన విల్లులు - సూరీడు

''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''


మబ్బు చేతులతోటి దండాలు పెడుతూ 
గొబ్బున "సూర్యుడు" వచ్చేనయా! 
"పగలు ఒడిలో " తాను 'చిన్ని పాపాయి'. // 

కిరణముల వలిపెముల - గుత్తంపు ఊయెలల 
మెత్తంగ ఊగుతూ - 'చిత్తరువల్లే తనరేటి వసుధను 
వింత వింతగ తోచి, చూసేనమ్మ! 
సూర్యుడు చూసేనమ్మా! // 

సరసు అద్దములందున - తనదు బింబమ్మును 
తనివి తీరా చూసుకొనుచూ, ఎంతొ మురిసాడమ్మా! 
ఆదిత్య దేవుడు, తరగలందున తగరు క్రీడలే 
ఆడేనమ్మా! ఆట లాడేనమ్మా! // 

నింగిలో విరిసిన 'ఇంద్ర ధనుసుల'ను 
చప్పున ఒడిలోన దాచేనమ్మా! 
'అచ్చముగ నాకేను ,హరి విల్లులం'టూను 
ఫక్కున నవ్వేసి - వెళ్ళేనమ్మా! 
ఏడు వాజిల తేరునెక్కి ,వెళ్ళేను // 


''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''

చిన్న శాస్త్రీ! నువ్విక్కడున్నావేమిటి?


'''''''''''''''


నటి శాంతకుమారి ని అడిగారు నిర్మాత
"మా డైరెక్టర్ మీకు కథను వినిపిస్తారు ,
అతణ్ణి మీ దగ్గరికి ఎప్పుడు పంపించ మంటారు?" 

"అదేమన్న మాట? డైరెక్టర్ ని మా ఇంటికి పంపించడమా?! 
 నేనే వస్తాను లెండి." అన్నారు శాంతకుమారి.
 నిర్మాతలను,దర్శకులనూ సినీ ఫీల్డులో 
అందరూ 'గురువూ, దైవముల' వలే'గౌరవించే రోజులు అవి. 

శాంత కుమారి ఆఫీసుకు వెళ్ళింది. అక్కడ, వాహినీ స్టూడియోలో సౌండ్ ఇంజనీర్ గా పని చేస్తూ ఎప్పుడూ ఖాకీ యూనిఫార్మ్ లో ఉండే అతను అగుపించాడు. అందరూ అతణ్ణి 'చిన్న శాస్త్రీ!'అని పిలిచే వాళ్ళు. "నువ్విక్కడున్నావేమిటి? చిన్న శాస్త్రీ!"అడిగింది ఆమె. 

"ఈ పిక్చరు(చిన్ననాటి స్నేహితులు) కు నేనే నమ్మా డైరెక్టరును" అతను అన్నాడు. "నీ ఇల్లు బంగారంగానూ నువ్వెప్పుడు డైరెక్టరువు అయ్యావు ?నాయనా?" నవ్వుతూ అన్నది శాంత కుమారి. 

'విశ్వం' చెప్పిన కథను సావధానంగా విని,ఆ సినిమా లో నటించడానికి ఒప్పుకున్న శాంత కుమారి కొన్ని సంవత్సరముల తర్వాత "నీ శంకరాభరణం చిత్రం అద్భుతంగా ఉన్నది నాయనా!"అని మెచ్చుకొంటూ ఫోన్ చేసి మాట్లాడింది. ఇపుడు మీకుతెలిసినదా అతనెవరో? అతనే ప్రఖ్యాత దర్శకుడు కాశీనాథుని విశ్వనాధ్. నటి శాంతకుమారి ని అడిగారు నిర్మాత "మా డైరెక్టర్ మీకు కథను వినిపిస్తారు ,అతణ్ణి మీ దగ్గరికి ఎప్పుడు పంపించ మంటారు?" 

"అదేమన్న మాట? డైరెక్టర్ ని మా ఇంటికి పంపించడమా?! నేనే వస్తాను లెండి." అన్నారు శాంతకుమారి. నిర్మాతలను,దర్శకులనూ సినీ ఫీల్డులో అందరూ 'గురువూ, దైవముల' వలే'గౌరవించే రోజులు అవి. 

శాంత కుమారి ఆఫీసుకు వెళ్ళింది.
 అక్కడ, వాహినీ స్టూడియోలో సౌండ్ ఇంజనీర్ గా పని చేస్తూ
 ఎప్పుడూ ఖాకీ యూనిఫార్మ్ లో ఉండే అతను అగుపించాడు.
 అందరూ అతణ్ణి 'చిన్న శాస్త్రీ!'అని పిలిచే వాళ్ళు. 
"నువ్విక్కడున్నావేమిటి? చిన్న శాస్త్రీ!"అడిగింది ఆమె. 

"ఈ పిక్చరు(చిన్ననాటి స్నేహితులు) కు 
నేనే నమ్మా డైరెక్టరును" అతను అన్నాడు.
 "నీ ఇల్లు బంగారంగానూ నువ్వెప్పుడు
 డైరెక్టరువు అయ్యావు ?నాయనా?" నవ్వుతూ అన్నది శాంత కుమారి. 

'విశ్వం' చెప్పిన కథను సావధానంగా విని,
ఆ సినిమా లో నటించడానికి ఒప్పుకున్న శాంత కుమారి
 కొన్ని సంవత్సరముల తర్వాత
 "నీ శంకరాభరణం చిత్రం అద్భుతంగా ఉన్నది నాయనా!
"అని మెచ్చుకొంటూ ఫోన్ చేసి మాట్లాడింది.
 ఇపుడు మీకుతెలిసినదా అతనెవరో?
 అతనే ప్రఖ్యాత దర్శకుడు కాశీనాథుని విశ్వనాధ్. 


'''''''''

తుది గమ్యం

'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''




1)మొక్క వోనిది మానవత్వం - మాసి పోనిది మహా ధర్మం 
సాగి పోరా! నీదు గమ్యం - తొణకనీకోయ్ గుండె ధైర్యం 

2) అడగకోయీ , కారణాలు - వెతకకోయీ వేయి చిల్లులు 
పెంచ వోయీ మమత మొక్కలు - అడవి కూడా విరియు తావులు 

3)పాత పాటకు కొత్త గమకం - నత్త నడకకు నూత్న వేగం 
రాగ మేదైనా , దారి ఏదైనా , మాధుర్యమె తుది గమ్యం 

4)పచ్చనాకుల నందనమ్మిది - పచ్చ తోరణ , రంగ వల్లులు 
పచ్చ కెంపుల పర్ణ కుటిని- మంచికిచ్చట గోరు ముద్దలు 

5)మంచి చెడుల వింగడింపు - ఆశలందున రంగరింపు 
సంఘమందున చదువు నేర్చిన మనిషి జాడలు ఇంపు నింపు.





''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''

రాగము ప్రభావము



  నిఖిలం నీ రూపం 
సకలం నీ ధ్యానం! 
.....................కృష్ణా! // 

1)మురళి పైన 
చివురు వ్రేళ్ళు కదలినవి 
చిరు గాలికి 'రాగ జన్మ 'యోగమైనది 
- భోగమో!? 
పురా పుణ్య భాగ్యమో!? // 

2)తోటలోన 
నీ పదములు కదలినవి 
బృందావని పరిమళమై పులకితమౌ 
- హాసమో!? 
తవ స్పర్శా లాసమో!? //

small reason

"నేను ఒక మారు మూల చిన్న పల్లెటూరులో పుట్టాను"
                                         అన్నాడు శ్రీరంగం శ్రీనివాసరావు . 


" అరరే! ఎందుకలాగ?"
                      పరధ్యానంగా ఉన్న ఒక శ్రోత
                                   చిరు కామెంటు విసిరాడు. 


" ఆ! ఏం లేదు! ఊరికినే!
             మా అమ్మ దగ్గర ఉందామనీ! "
                               అన్నాడు ఆ శ్లేషల శ్రీశ్రీ!

మదియే చిలుక




స్వామి సేవా వాహినిలొ - 
ఓలలాడే హృదయము 
వహ్వారె! వేయి దళముల పద్మిని! // 

1)ఏలొకో ?కోనేరునందున - ఇంతలింతల పులకరింతలు 
అవిగవిగొ గోపురములు! - పసిడి వెలుగుల పురములు 
ఆ ఛాయలెన్నెన్నో తనలోన - తానాలు చేస్తుంటే 
పుష్కరిణి' పులకింత - మయమ'గుట జరుగుట 
ఏమి వింత?(= అది సహజమే కదా!) 

2) వేదనలు మటుమాయము ! 
ఇచట ; అణువణువు హర్షము! 
స్వామి సాన్నిధ్యము - 
ఆహ్లాద పూరితము ! 

పలుకవే మనసా! - గోవిందు నామము ! 
కులుకవే "చిలుకవై" -ఆ నామ మధు సుధలందు! // 

పలుకుల తల్లి

'''''''''''''


పలుకుల తల్లి పిలిచెను చెల్లీ! 
చదువులపై నీ మనసును నిలుపు // 

ఎంత వెలిగినా ఆరని దీపము 
ఎంత గ్రోలినా తరగని అమృతము 
ఎంత వాడినా అరగని హేమము 
ఎంత తీసినా చెదరని శైలము 
జగతిని చదువే!తెలియుము బాలా! // 

ఎంత కురిసినా ఆగని ధార ,అది 
ఎంత త్రవ్వినా తరగని గని అది 
కదలవె బాలా! - అదరక,బెదరక 
కుదురుగ విద్యను నేర్చు కొనుటకై 
ప్రగతికి బాట చదువేనమ్మా! //


''''''''''''''

కురిసే చంద్రికలు

'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''



అవిద్యలో తల మునుకలు కావొద్దు, కావొద్దు 
విద్యతోటి చెంగనాలు చేయుటయే ముద్దు! ముద్దు! 

కనురెప్పల విశ్వాసం రంగరించు 'బ్రతుకు హద్దు! 
గుండె గుప్పెడే నింగిగ - మారినపుడె తొలి పొద్దు 

భీతి, భయం కారు మబ్బు - కరిగితేనె "వాన ముగ్గు"! 
దౌర్జన్యం,దౌర్బల్యం- చేయదింక ఏ సద్దు! 

అఱ మరికలు లేని చెలిమి -మేలిమి బంగారు 
ఆశా శిఖరముల పైన- కురియు నపుడె వెన్నెలలు 



'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''

యాద ఋషి

'''''''''''





యాదగిరి గుట్టకు ఆ పేరు ఎలా వచ్చినదో మీకు తెలుసా? 

యాదర్షి తల్లి దండ్రులు శాంత, ఋష్యశృంగులు.
 యాద ఋషి తపస్సు చేసి దివ్యులను మెప్పు పొందినది. జ్వాలా నరసింహ స్వామి సాక్షాత్కారాన్ని పొందాడు యాద ఋషి.
 శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వెలసిన కొండ,
 ఆ ముని పేరున యాదగిరి అని ప్రసిద్ధి గాంచెను.
స్కాంద పురాణములో ఈ ఉదంతము ఉన్నది.


 సహస్రానీక మహా రాజుకు భృగు మహర్షి యాదగిరి క్షేత్ర మహిమను తెలిపెను. 

* యాద ముని స్నానము చేసిన పుష్కరిణి పేరు "విష్ణు కుండము". 
* క్షేత్ర పాలకుడు శ్రీ ఆంజనేయ స్వామి . 
* స్వయంభూ లింగముగా, పరమేశుడు శిఖరాగ్రమున ఉద్భవించెను . 

ఫాల్గుణ శుద్ధ విదియ నుండి ద్వాదశి వరకు  
  Srii  యాదగిరి నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవములు జరుగును. 



''''''''''''''''''''

7, మార్చి 2009, శనివారం

ఉయ్యాల ఊగుదాము!

                                                                ''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''

ఉయ్యాల లూగుదాం 
రారండి,పిల్లలూ! // 

మామిడి తోపుల్లొ 
జాబిల్లి ఆగింది 
రారండి,బాలలు 
జతలు గుంపులుగాను // 

సీమ చింతల్లోన 
చుక్కల్లు దాగాయి 
రారండి,పిల్లలూ! 
బొమ్మలతొ జోడీగ // 

మొయిలు కొమ్మలకు 
గొప్ప-ఉయ్యాలలను కట్టి 
ఒడుపుగా కూర్చుండి 
వేగంగ ఊగండి ........... 

ఈ నేల నుండి ఆ నింగి దాకా 
ఆ నింగి నుండి ఈ నేల దాకా //


    ''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''
 

సంస్కారపు నగిషీలు


''''''''''''''''''                                              
                                                                చదువుల తల్లీ! అభివాదం!
విద్యల జననీ! అభి వాదం! 
గైకొనవమ్మా!శ్రీ శారదా! // 

1)విద్యంటే అక్షరాల తోరణాల మాల 
అవి సదాశయాల ప్రాంగణాల రంగ వల్లిక ! 

3)"లిపి" చదువుల తొలి మెట్టు 
విజ్ఞానం ,విశ్వాసం ఆ పైన మలి మనట్లు // 

4)ఇంగితముల ఆది గురువు 
సంతాసముల కది నెలవు 
వినయ, విధేయతలకు 
నగిషీసను దుద్దేటి ఆట విడుపు ! // 
అందుకే , 
విద్యను ఆరాధిస్తాము! 
చదువుల తల్లి సరస్వతిని 
భక్తితొ కొలిచి,మ్రొక్కేము! 

''''''''''''''''''
''''''''''''''''''

ఆంజనేయ క్షేత్రంలో ఆంగ్లేయులు




పెన్నా నదికి ఉపనది పాపాఘ్ని శేషాచలము కొండ నుండి
 పాపఘ్నినది ప్రవహించినది.
అందుచేత ఈ ప్రదేశమును "గండి క్షేత్రము" అని పిలుస్తున్నారు.
కడప జిల్లాలోని గాలివీడు మండలములో ఉన్నది ఈ పుణ్య క్షేత్రము.
రాయచోటి-వేంపల్లి రోడ్డులో నెలకొని ఉన్నది ఈ "శ్రీ వీరాంజనేయ క్షేత్రము". 
ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన చేసే రోజులలో ఈ పుణ్య క్షేత్రముnu 
 సర్ థామస్ మన్రో, సి.పి. బ్రౌన్ లు దర్శించినారు. 

ఈ విశేషాలు, ఆనాటి "కడప జిల్లా గెజెట్టు"లలో ఉన్నవి. 
ఇవి నేటికీ చెన్నై మ్యూజియములో భద్రముగ ఉన్నవి.

మన్రో భక్తి


సర్ థామస్ మన్రో,ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనాలో,
బళ్ళారి జిల్లాలో కలెక్టరుగా పని చేశారు. 
మంత్రాలయము లోని శ్రీ రాఘవేంద్ర స్వామి వారి మఠమునకు 
సంబంధించిన భూమివివాదము గూర్చి ,పరిశీలించుటకై
 మన్రో మంత్రాలయమునకు వెళ్ళారు. 
అప్పుడు ఆయన తన టోపీ(hat) ని తీసి ,పట్టుకుని ,వినమ్రతతో గుడిలోనికి వెళ్ళారు.
 ఆ మఠములో శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించినప్పుడు,
 "నాతో ఎవరో అదృశ్య శక్తి, మాట్లాడి ,నా సందేహములను తీర్చారు." అని,
 ప్రభుత్వ పత్రాలలో వ్రాసారు. 
అలా, భూమి గురించిన శంకలన్నీ తొలిగిపోయినట్లు , 
మన్రో రాసిన "కడప గెజెట్టీర్లు ,చారిత్రక నిధులు .









సదా వెన్నెల



గోవిందా! హరి!గోవిందా! 
వేంకట రమణా! గోవిందా! // 

మాయ తెలియదు, 
మర్మము తెలియదు 
నీ సన్నిధికై వేచీతిమయ్యా! // 

రేయి తెలియదు 
పగలు తెలియదు 
మా కన్నుల ,నీ రూపు 
నిండు వెన్నెల: కాన // 

నిన్న తెలియదు 
రేపు తెలియదు 
వీనుల(లో) విందు 
స్వామి!నీ గాధలే గాన //

శతకోటి వెన్నెలలు

కొనియాడ తరమా 
స్వామి కొసరు మురిపాలెన్నో! 
(అనుపల్లవి) ;;;;;;;;;;; 
''''''''''''''''''''''''''''''''''''''' 
'కో కోటి ' దరహాస చంద్రికల 
కోనేటి రాయని కొనియాడ తరమా! // 

1)తొలి పొద్దు నెన్నుదుటి 
నామమై వెలిగేను 
ఇరుఝాము కాంతులకును 
మణి రత్న కుండలములు! 

2)వరద హస్తమునందు 
పద్మ రేఖల "పగలు" 
నిగ నిగలు తానగుచు 
వగలు కురిపించేను //కోనేటి// 

3)శ్యామ సుందరు 
నీలి మేని ఛాయలలోన 
"పగటి"తో పగ మాని, 
రేయి కూడ జత చేరేను //కోనేటి//

భక్తులకు రహదారి

నీల మేఘ శ్యామా! శ్రీ వేంకట గిరిధామా! 
నీ భక్తుల విన్నపము లాలించి 
మా కొఱకు వేంచేయుమ! 
ఈ భువి స్వర్గము అవునుగా! 

నా మానసము - కోనేటి తీరము 
ఇట తోటను వెలసినవీ 
నీ భావన లత లంతట, అహహా! 
విరి జపముల తావులంట! 

నీ ఊసుల మకరందము 
తొణికి ఎడద దారులన్ని 
అందముగా తీర్చిఉంచిన 
నీ నడకకు రహదారి 

మూల్యం న యాచతే!

''''''''''''

"అనేక శత భాండాని - భిన్నాని మమ మస్తకే
అహో! చితశ్నయ నారీ - భాండ మూల్యం న యాచతే! "
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

గయ్యళి భార్య కోపం వచ్చినప్పుడు తన భర్త శిరసు మీద కుండలను విసిరేది.
 ఐనప్పటికీ అతనికి తన ముద్దుల పత్ని మీద ఎంతో ప్రేమ.
 కనుకనే జీవితంతో సమాధాన పడ్డాడు అతను.
అందుకనే ఇలాగ సమాధానం చెప్పాడు

"నా తల మీద అనేక భాండాలను పగలగొట్టింది ఆమె!
అహో!అంత కోపంలోనూ, పగిలిన కుండలకు
 విలువ చెల్లించమని అడగలేదు, చూసారా!
 నా సతి ఎంత మంచిదో!" 

మొయిలు తోటలో విడిది


వెన్నెల పల్లకిలోన
ఒదిగెను చల్లని జాబిల్లి

పాప పాట విని
మై మరచీ 
అట్టె ఆగెను జాబిల్లి

కేరింతలతో సేదదీరుచు
మబ్బు తోటలో
విడిది చేసెను జాబిల్లి ! 
వెన్నెల పల్లకిలోన
ఒదిగెను చల్లని జాబిల్లి

పాప పాట విని
మై మరచీ 
అట్టె ఆగెను జాబిల్లి

కేరింతలతో సేదదీరుచు
మబ్బు తోటలో
విడిది చేసెను జాబిల్లి ! 

విశాల నేత్రి



నీ కను చూపులతో ఓ తరుణీ !

ఏ పూల బాటలను వేస్తున్నావో?!

రెప్పలను ఎత్తి చూడుమా!

ఆ సొగసు పరిమళాలను

మా నయనాలలోన నింపు కోనిమ్మా

5, మార్చి 2009, గురువారం

మన దేశము

జయ జననీ!పరమ పావనీ!
జయ జయ భారత జననీ!
శీత శైల శృంగ కిరీటా!
సింహళ జాంబూ నద పీఠా
వింధ్య మహీధర మహా మేఖలా, విమల కాశ్మీర కస్తూరి రేఖా!
గంగా సింధూ మహా నదీ
గౌతమి కృష్ణా కావేరీ
జీవ సార పరి పోషిత కోమల
సస్య విశాలా శ్యామలా!
(సేకరణ ;;;;; చందన)

మాతృ భూమి

3, మార్చి 2009, మంగళవారం

మీ ఉడత చిన్నదా/పెద్దదా?




సాహిత్య సభలను భక్తితో ఏర్పాటు చేస్తూండే కొందరు సాహిత్యాభిలాషులు
మహాకవి "గుర్రం జాషువా"ను ఆహ్వానించటానికై వచ్చారు.

సభా నిర్వాహకులు ఇలా వినయంగా అడిగారు
"జాషువా గారూ! ఉడతా భక్తిగా
మీకు సన్మానం చేద్దమని మేము అనుకుంటున్నాము."

అందుకు, జాషువా నవ్వుతూ అడిగారు "ఇంతకీ, మీ ఉడత చిన్నదా/పెద్దదా?".

భగవద్గీతే నాకు మార్గదర్శకం



1948-49 లో B.M. గుప్తా విదేశాలలో చదివారు.అతను విద్యార్థి గా ఉన్న రోజులలో,ఒక ప్రసిద్ధ సైంటిస్టును కలిసాడు.అతనే డాక్టర్ ఐన్ స్టీన్. 

గుప్తా ప్రిన్స్ టన్ యూనివర్సిటీలొ కలిసినప్పుడు, ఆంగ్లేయుడైన ఐన్ స్టీన్, సంస్కృత భాషలో అభివాదము చేసాడు. 

"I have made GITHA as main source of my inspiration and guidance for purpose of scintific investigations and formulations of theories." అని చెప్పాడు ఐన్ స్టీన్. 

అలా మన" భగవద్గీత"ను మార్గదర్శకముగా గైకొన్నాడు ప్రపంచ ప్రఖ్యాత శస్త్రవేత్త ఐన్ స్టీన్.





తాళపత్రాలు


తెనాలి రామకృష్ణ సినిమాలో రామకృష్ణుని తల్లి "ఏం చేస్తున్నా"వని అడిగితే "వ్రాసుకుంటున్నానమ్మా!" అంటాడు. అప్పుడు ఆమె "తాటాకులు తేరగా వచ్చాయని ఎడతెరిపి లేకుండా ఏమి వ్రాతలురా ఇవి" అంటుంది. 

మన ప్రాచీన సాహిత్య సంపద యావత్తూ "తాళపత్రాల"లో నిక్షిప్తమై ఉన్నది. అందుచేతనే, ఇన్ని యుగాల తర్వాత కూడా మనకు ఆ అమూల్య సారస్వత పెన్నిధి లభించింది. అంతే కాదు, మన భారతీయ సాహిత్యమే ప్రపంచంలోనే అతి పురాతన సాహిత్యంగా నెలకొని గిన్నీస్ రికార్డులలో స్థానం ఆర్జించింది. 

మన హిందువులకు యశస్సు రావడానికి మూల కారణమైనవి తాళ పత్రాలే కదా! మరి అలనాడు రచనలకై వినియోగించబడుటకై వానిని ఎలా తయారు చేసి, సిధ్ధ పర్చుకొనేవారో తెలుసుకుందామా! 


1)మొదట తాటాకులలో పెద్ద సైజులను ఎన్నుకుంటారు. 

2) పసుపును కలిపిన నీళ్ళను పెద్ద బానలలో బాగా తెర్ల బెడతారు. 

3) ఆ నీళ్ళలో ఉడకబెట్టిన తాటాకులను అంచులు కత్తిరించి నీడలోఆరబెడతారు.

3) తాటిబద్దలను చెక్కి అట్టలుగా తయారుచేస్తారు. 

4) పేనిన త్రాడును ఎక్కిం చేందుకు వీలుగా ఎడమవైపు కొసలో రెండు రంధ్రాలను చేస్తారు. 
ఘంటమును చేత బూని ఎందరో పండితులు ఎన్నో గ్రంధాలను జగత్తుకు అందించారు. 

తాళ పత్రాలు సాక్షాత్తూ శ్రీ శారదా దేవికి ప్రతిరూపాలే! 

వ్రతఫలము దక్కింది


భారతదేశములో ప్రజలు ఎంతో భక్తితో ఆచరించే వ్రతము "శ్రీ సత్య నారాయణ వ్రతము. పురాణములను శోధించి ఈ నోమును కథగా వ్రాసి లోకానికి అందించిన రచయిత శ్రీ కాశీపత్యావధానులు. 


రాయచూరు వద్ద ఉన్న ఆత్మకూరులో ముత్యాలయ్యాచారి అనే వ్యక్తి ఉండేవాడు. సంతానార్ధి ఐన ఆయన శ్రీ కాశీపత్యావధానులు చేత "శ్రీ సత్య నారాయణ వ్రత మాహాత్మ్యము"ను రచియింప చేసాడు. అతని చిన్న భార్యకు సంతానము కలిగి,అతని కోరిక ఈడేరింది. 


వారి సంకల్పబలము చేత ఆ విధంగా లోకానికి "శ్రీ సత్య నారాయణ వ్రత కల్పము"లభించినది. 

2, మార్చి 2009, సోమవారం

సాఫల్యము

భక్త కోటి 'నిరీక్షణమున,
ప్రతీక్షణమున ప్రతి క్షణము
పగడాలు తాపిన హారములు ఆయెను //

నీ నామ మననమున
ఈ పెదవులు
ఈ పలుకు నిగ నిగలు ,
మిసిమి తళుకుల్ల
కోవెలకు తోరణములయ్యేనుగా! //

నీలములు నింపిన భరిణలే ఆయెను
నిన్ను వీక్షించినవి- గాన
ఈ నయనములు
ఈ దృక్కు ధగ ధగలు వలయమ్ములు'
విష్ణు వడ్డాణములె ఆయేనుగా! //

మరకత, మణి స్థగితమౌ మందిరమ్ము
శ్రీ వేంకటేశుడు కొలువైన మానసము
అందు, ధ్వని ఆతడే! ప్రతి ధ్వని ఆతడే!
నిశ్శబ్ద ఓంకార సడి ఆతడే! //

చుక్కల హారము నాదే!

భలే భలే పతంగి!
నింగిలోన ఎగిరేవు
చుక్కల చక్కని హారము
'నాదే'నని మురిసేవు //

గగనం నా రాజ్యమనుచు
హొయలు లెన్నొ ఒలికేవు
చంద మామ గద్దె నెక్కి
ఠీవిని చిందించేవు//

మబ్బులతో ఎడ తెగని
ఊసులెన్నొ పలికేవు
ఝలు ఝల్లన చినుకు పడితె
గడగడమని వణికేవు//

1, మార్చి 2009, ఆదివారం

అంతర్నేత్రము దృశ్య దాయిని

ఆనందమే పరమావధి
విరబూసినది ఊహల పద్మిని

శబ్ద మూర్తి

కావ్యా లాపాశ్చయే;

కేచిద్గీతాని సకలాని చ;

శబ్ద మూర్తి ధర స్త్యైతే;

విష్ణోరంశా మహాత్మనః;

కావ్యములు, సంగీతములు సాక్షాత్తు ఆ భగవంతుని స్వరూపములే!

గాన నివాసము

నాహం వసామి వైకుంఠే;
న యోగి హృదయే రవౌ ;
మద్భక్తా యత్ర గాయంతే ;
తత్ర తిష్ఠామి,నారద!
ఓ నారద, నేను వైకుంఠ ము లో కాని యోగీశ్వరుల హ్రిదయము లో కాని లేను. నా భక్తులు ఎక్కడ అయితే పాడతారో, నా నివాసం కుడా అక్కడే.

వన్నెల దరహాసం

ప్రాచీన రత్న మాల

సంగీత సాహిత్య రసానభిజ్ఞ స్సాక్షాత్ పశూః పుచ్ఛ విషాణ హీనః
సంగీత,సాహిత్య సారము(లను గ్రోలుట)తెలియని వాడు కొమ్ములు లేని వింత పశువుతో సమానము.

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...