26, ఏప్రిల్ 2009, ఆదివారం

అందమెపుడు కావ్యమే !!!


అందమెపుడు కావ్యమే ఔతున్నది కదా! ;;;;;;
''''''''''''''''''''''''''''''
కొండ గాలి వీచింది
పాల పిట్ట అఱచింది 
ఎగిరే పక్షుల గుంపుకు 
మబ్బు దారి చూపినది. 

ఎటకో చెదిరే మొయిలుల,
మెరుపు దారమున చేర్చి  
వర్ష హారమును చేసిరి 
హర్షాతిరేకమున దివ్యులు.  

రేయి పల్లకీలోన  
జాబిల్లి వెడలి పోయినది. 
తొలి పొద్దు విచ్చేసెను, 
సంబరాలు వచ్చేసెను.
వానొచ్చి వెలసినది
పుడమి తడిసి,మురిసినది. 
కృతజ్ఞతా భారముతో 
వర్ష బిందు మౌక్తికముల  
నిలకు ఒసగు బహుమతులుగ
హరిత పూర్ణ వృక్ష తతి. 
కొమ్మ గూళ్ళ నుండి 
కూనలు తొంగిచూచు చున్నవి. 
తడిసిన రెక్కలు  
తప తప విదిలించు కొనును విహంగములు. 
పైరు మడుగులలొ కొంగలు 
పచ్చల హారముల 'రవ్వలూ.  

"అందమెపుడు కావ్యమగును."
హన్నన్నా! 
కాకుంటే,నా ప్రేమను 
సృష్టి కర్త ఎటుల పొందు!?!

'''''''''''''''''''''''''''''''''


కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...