27, సెప్టెంబర్ 2012, గురువారం

హిందూదేశపు లక్క - బ్రిటీష్ శాస్త్రవేత్త విలియం లోక్స్ బర్గ్

మన మహా ఇతిహాసమైన "మహా భారతము"లో "లాక్షా గృహము" ఘట్టము ఉన్నది. 
పంచపాండవులు ఏకఛత్రపురమునకు చేరుటకు మూలమైనది ఈ అధ్యాయం. 
హిడింబా భీమసేనుల పెళ్ళి, నగరములో 
మత్స్యయంత్రభేదనము చేసిన అర్జున-ద్రౌపదీ పరిణయములు జరిగినవి. 
ఆ వివాహముల వలన పాండవులకు బంధుబలగము సమకూరి, 
వారికి అండదండలు దొరికి, భవిష్యత్తులో దాయాదులతో 
ముఖాముఖీ పోరాడగలిగిన “సమ ఉజ్జీలు” ఐనారు. 
పాండవవనవాసము-నకు దారి తీసిన ఆ పరిస్థితులలో పాండవులు ఉండాల్సిన స్థితి, 
వారి అవస్థలు, కథాగమనానికి చాలా స్పీడును కలిగించిన 
ఆ వైనములు మీకు గుర్తుకువచ్చినవా! 
ఇంతాచేసి ఈ వ్యాసానికి మూలమైనది లక్క (లాక్ష).

************** 

 
Dr. William Roxburgh -"Father of Indian Botany"

ఉపఖండంగా ప్రసద్ధి చెందిన ఇండియాలో ఈ నేలపై పెరుగుతూన్నమూలికలు, మొక్కలు, 
లక్క(లాక్షారసము), లోధ్ర, ఇలాటి వాటన్నిటి గురించీ 
19వశతాబ్దములలో-పాశ్చాత్యప్రపంచానికి తెలిపిన వ్యక్తి ఒక ఆంగ్ల భాషీయుడు. 
అతని పేరు విల్లియం రోక్స్ బర్గ్. 1751జూన్ 29వతేదీన జన్మించిన 
స్కాటిష్ సర్జన్, బోటనిస్టు. విల్లియం రోక్స్ బర్గ్ 
17 సంవత్సరముల వయసు వచ్చేసరికి ప్రపంచయాత్ర చేస్తూ, జీవనోపాధిని పొందేవాడు. 
హిందూదేశములో లక్క వినియోగము ఆతని దృష్టిని ఆకర్షించింది. 
ఇండియా బాటనీ విద్యా విభాగాలకూ, లాబరేటరీలలో 
వృక్ష సంబంధ పరిశోధనలకు మంచి పునాదిని వేసిన వ్యక్తి!

అప్పటికి హిందూదేశములో -  ఈస్ట్ ఇండియా కంపెనీ పెత్తనము  మొదలైనది. 
కుంఫిణీ (company) పాలనలోని భారతదేశానికి “ఇండియా” అనే పేరు వచ్చినది. 
ఈస్ట్ ఇండియా కంపెనీలో పాలనలోని ఇండియాకు చేరి, మద్రాసులోకి  అడుగుపెట్టాడు. 
మద్రాసులోకి అడుగుపెట్టిన స్వతహాగా అతను ప్రకృతి పట్ల ఆసక్తి కలిగిన మనిషి.
విల్లియం రోక్స్ బర్గ్  India కు చేరాడు.  అప్పటినుండీ ప్రకృతి ప్రేమికునిగా నిరంతర కృషినిసాగించాడు. 
ఉపఖండము ఇండియాలో పెరుగుతూన్నమొక్కలు, చెట్లు గురించి గణిత సేకరణలను లిపిబద్ధము చేసాడు. 

సంవత్సరాల పర్యంతమూ అంటే 1820 దాకా 
ఇలాటి వివరములను సైంటిఫిక్ గా Ricord చేసిన మొదటి వ్యక్తి ఈతడే! 
Ramsden barometers and Nairne thermometers మున్నగు పరికరములతో అవిరళకృషి చేసాడు.

లోధ్ర - గోరింట, ఇత్యాది వేలాది మొక్కలు, తరు సంపదలు 
వాని  జాతులు, ప్రజాతులను గూర్చి సవివరముగా రాసాడు, 
తరువాతి తరాల వారికి పరిశోధనలకు అమూల్య సంపదగా  అందించాడు. 
విల్లియం రోక్స్ బర్గ్ భారతీయ వృక్షశాస్త్ర జనకుడు (Father of Indian Botany) అనే బిరుదును పొందాడు. 
'లక్క’ అనే అమూల్య పదార్ధము గురించి 
పాశ్చాత్యలోకానికి విలువైన సమాచారాన్ని అందించడం చేత 
"Asiatic Society"  లో మెంబర్ ఐనాడు విలియం. 

*******
లక్కను – ఉత్తరములు, కొరియర్ పార్శిలు వస్తువులు, 
కోర్టు వ్యవహారాదులలో- “సీలు చేయుటకు” వాడుతూంటారు 
కాబట్టి అందరికీ తెలిసినదే! 
మైనములాగా కాస్త సెగ తగిలితే-త్వరగా కరిగిపోయే  స్వభావం దీనిది. 
ఇది మిలమిలా మెరుస్తూ మైనము, వార్నీషులను పోలివుంటుంది. 
అందుచేత ఇది చెట్ల బెరడు నుండి తయారయ్యే జిగురు లాంటి పదార్ధమని చాలామంది పొరబడుతారు
ఐతే “లక్క పురుగు” వలన ఉత్పత్తి ఔతూన్నది అంటే ఆశ్చర్యం కలగక తప్పదు.

భారతదేశములో కాళ్ళకు పారాణి మొదలైన ఆచార సంప్రదాయాలలలో లక్క use ఎక్కువగా తటస్థపడ్తూంటుంది. 
ఇంతటి ప్రశస్తమైన లక్కను గూర్చి 1800 ల తర్వాత తెల్లవారికి యూరోపు ఖండముల ప్రజలకు తెలిసింది. 
ఇందుకు కారణము విల్లియం రోక్స్ బర్గ్. 
"లక్క" ఒక పురుగు నుండి చేయబడ్తుంది. రికార్డ్ లలో రాసి, 
ప్రపంచానికి భారతీయులు కుటీరపరిశ్రమలలో విరివిగా వాడే విశేషాలను చెప్పాడు. 
వీటిని కొత్త అంశాలుగా యూరోపు దేశీయులు ఆశ్చర్యంతో గమనించారు.
నేడు మన దేశములో లక్క ఉత్పత్తిలో జార్ఖండ్ రాష్ట్రము ప్రధమ స్థానములో ఉన్నది. 
చత్తీస్ ఘడ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర లు తదుపరి క్రమముల్లో ఉన్నవి.
పట్టు పురుగుల నుండి పట్టు దారమును తీస్తారు కదా! పట్టుపురుగుల పరిశ్రమవలెనే - లక్కపురుగులపెంపకము కూడా కుటీరపరిశ్రమ ఐ, ప్రజలకు బ్రతుకుతెరువు ఏర్పరిచినది.

విల్లియం రోక్స్ బర్గ్ "Father of Indian Botany" అనే పురస్కారముతో 
సదా జ్ఞాపకములలో కొలువై ఉంటాడు. 
Tags:- లక్క, (లాక్షారసము), లోధ్ర; ఫాదర్ ఆఫ్ ఇండియన్ బాటనీ 
   
హిందూదేశపు లక్క - బ్రిటీష్ శాస్త్రవేత్త విలియం లోక్స్ బర్గ్ 
newAwakAya (Web magazine)  (see this essy)    
Member Categories - తెలుసా!   
Written by kadambari piduri     
Sunday, 16 September 2012 13:06  
;

18, సెప్టెంబర్ 2012, మంగళవారం

పండుగ సంరంభము


పండుగ సంరంభము నేడే!
మహేశపుత్రుడు గౌరీతనయుడు
విఘ్నవినాయక చవితి పర్వము ఈనాడే!||
;
వన్నెల సీతాకోక చిలకలకు
ఆహ్వానములు-అందినవా!
పాలవెల్లులను కట్టగ రండి! ||
;
జామ చెట్టుల గుబురుల నక్కిన
రామ చిలుకలూ! వేగమె రండి!
ఫలములు,పత్రీ తీసుకు రండి! !
;
భక్తి సీమలో తొలి తొలి పూజలు
అందుకునే మన గజాననుడు
విఘ్నేశునికి దండిగ ఇవిగో! అర్చనలు
చెవులను రెండూ పట్టుకునీ
గుప్పెడు గుంజీల్ చాలునట!

*******************************

అందరికీ వినాయక చతుర్ధి శుభాకాంక్షలు!


;


17, సెప్టెంబర్ 2012, సోమవారం

అక్షరము పవిత్రమైన కోవెల


అక్షరమ్ము పవిత్ర దేవాలయంబు
లక్షలాదిగ భావమ్ము లలరు నందు
అక్షరమ్మెల్ల విద్యల కాశ్ర యంబు

దానికిని సాటి కానమీధరణి యందు.
;
ఊహలును జీవ కోటికి ఉండునెన్నొ
మూగ జీవులే అన్నియు పుడమి నందు
ధ్వనికి రూపమ్ము నొసగును మనిషి యొకడె
వెలువరించినప్పుడె వాని విలువ గలదు.
;
అక్షర మొక దేవాలయమ్మరయగాను
మనసు లందలి
కలలు,కల్పనల కెలమి
నదియె స్వాగత ద్వారము
ఆశ లెల్ల వెలుగు చూడగ,
సర్వ విద్యలకు గూడ.
;
జీవి మనసున కదలాడు భావములకు
స్థిరముగా నుండు పీట మేర్పరచు కొరకు
సాధనలు చేసి కను గొన్న సత్ఫలమ్ము
అదియె, రూపొంది, ఉదయించె నక్షరముగ.
;
భాష, "లిపి" యను అరదము పైన నెక్కి
ముదము లొప్పార సంచారములును చేసె
వసుధ యందలి కోట్లాది వాక్కులకును
"ధ్వని", "లిపు"లె మూల కారణాధారమయ్యె.
;
ఆశలును, అభిలాషలు, ఆశయములు
కల్పితమ్మక్షరము నందె
కావ్యములకు, గాధలకును,చరితలకు,
కథల వాస్త వముల చిత్రించు వాక్య దేవాలయమ్ము.
;
ఘంటమ్ము, పెన్ను, పెన్సిళులుగా-
బలపమ్ము, సుద్ద ముక్క, కుంచె- 
చాక్ పీసుగాను, 
వచ్చితివి మౌనముగ, మాదు భాగ్య మనగ .
;
ఓసి కలమ!నీకు కలిగిన మహిమ కలిమిని
ఎన్ని వర్ణనల ఋజువు సేయగలను?
నీవు లేకున్న తెల తెల్ల బోవు చుండు
తెల్ల తెల్లని పేపరు, ఖచ్చితముగ;
;
సవ్వడికి మారు బింబమౌ "శక్తి" నీవు
అయ్యారె! అంతులేని పరమాద్భుతమ్ముల నెరపగలవు
ధరణి నీ సాటి ఎవరు, అరసి చూడ;
అందు కొనుమమ్మ! జోతల అక్షరమ్మ!
;

శ్రీ అక్షరము (Andhra Folks)                               Link ( 1 )
Posted On 9/1/2008 @6:32:53 AM 
;

                   

శ్రీ అక్షరము:-


అక్షరమ్ము పవిత్ర దేవాలయంబు 
లక్షలాదిగ భావమ్ము లలరు నందు 
అక్షరమ్మెల్ల విద్యల కాశ్ర యంబు 
దానికిని సాటి కానమీ ధరణి యందు

;
అఖిలవనిత:శ్రీ అక్షరము;Monday, April 20 2009
 तरति (tarati)
అచ్చులు: 16


 అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ  

   ఏ ఎ ఐ ఒ ఓ ఔ అం అః


హల్లులు: 38 

క ఖ్ గ ఘ ఙ్  
చ ఛ జ ఝ ఞ
ట ఠ డ ఢ ణ
త థ ద ధ న
య ర ల వ శ ష స హ ళ క్ష ఱ

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...