24, జులై 2015, శుక్రవారం

కేరళ, 3 temples

ఎటు చూసినా, పుష్కరముల సంబరములు, 
గోదావరిలో స్నానం చేసిన రోజునే కృష్ణానదిలో కూడా చేయవలెను -  
ఈ మంచి సంప్రదాయాన్ని చాలామంది పాటిస్తున్నారు. 
ఈ విశ్వాసాన్ని పాటించి, క్రితం పుష్కరములు - అంటే 
క్రిష్ణపుష్కరములప్పుడుక్రిష్ణానదిలో పవిత్రస్నానాలు చేసాము, 
వెంటనే విజయవాడ నుండి మేము రాజమండ్రికి వెళ్ళాము. 
రాజమహేంద్రి వద్ద - గోదావరీ ఝరిని స్నానాలు చేసాము, భక్తిపరవశులమైనాము.  
*****************************************,

ఒకే పరుగున కొన్ని పుణ్యక్షేత్రములను దర్శించుకోవాలనే ఆచారం, హుషారును కలిగిస్తుంది. 
ఈ కోవలోనివే కేరళలోని ముచ్చటగా నెలకొన్న మూడు శైవ ఆలయాలు.  
1] వైకోం ; 2] కడతుర్తి ; 3] ఎట్టుమన్నార్. 

ఖరుడు అనే రాక్షసుడు చిదంబరం లో ఉన్న 'మాల్యవంతుని' వద్దకు వెళ్ళాడు. 
మాల్యవాన్ వద్ద విద్యలు నేర్చుకున్నాడు. 
అనంతరం ఖరాసురుడు తపస్సు చేసి, మూడు శివలింగములను వరములుగా పొందాడు. 
( రామాయణము లో ఖరుడు ) హిమాలయాలలోని తన రాజ్యానికి పయనమైనాడు ఆ దానవుడు.  
 రెండు చేతులలో రెండు లింగాలను, మెడలో ఒక లింగమును పెట్టుకున్నా డు. 
గృహోన్ముఖుడు ఐన ఖరుడు మార్గాయాసముతో త్రిలింగములను 
భూమిపై ఉంచి, కునుకు తీసాడు. మేలుకునిన తర్వాత 
ఆ మూడు సదాశివ లింగములను  తీయబోగా, అవి ఎంతకీ ఊడి రాలేదు. 
శివుని ఆజ్ఞ - అని వానిని ఆ సీమలలోనే ప్రతిష్ట చేసి పూజించసాగాడు ఖరుడు. 
=========

ఆ త్రిలింగాలు కేరళలో పుణ్యక్షేత్రములుగా వెలిసినవి.
అవి - 1] వైకోం ; 2] కడతుర్తి ; 3] ఎట్టుమన్నార్.
========= 

ఖరుని గళమున పట్టుకున్న ఈశుని లింగము - "కడతురుతి" ; 
దానవుని ఎడమ చేతిలోని లింగము - "ఎట్టుమనూర్" ;   
కుడి చేత లింగము - "వైకోమ్" కోవెలలు వెలిసినవి. 
"వైకోమ్ మహదేవ ఆలయ కళ" , పేరెన్నిక కలిగినది.
కేరళలో పెద్ద గుడి, 8 ఎకరములలో ఉన్న గుడి వైకోమ్  కోవెల ఉన్నది. 
=========

కడల్ తురుత్ = అనగా "సముద్రము నుండి వెలువడినది" 
అని అర్ధం.
(Kadal thuruth , meaning near to the beach)
అరేబియా కడలి నుండి ఉబికి వచ్చిన నేల - అని భావం.
పరశురాముడు, వ్యాఘ్రపాద మహర్షి - ఈ సీమ వెలయడానికి కారణము ఐనారు. 
కడతురుత్తి స్థలగాథలు ఈ ఇరువురి మునులతో ముడిపడినవి. 
ఈ మూడు కోవెలలను ఒకే పర్యాయాన దర్శించుకొనుట పుణ్యప్రదమని - భక్తుల విశ్వాసం.
అందువలన భక్తులు వీలైనంతవరకు ఒక్క రోజే ఈ త్రి దేవాలయాలను దర్శించు ప్రయత్నాలు చేస్తారు. 

********************************************, 

eTu chuusinaa, pushkaramula sambaramulu,   
gOdaawarilO snaanam chEsina rOjunE 
kRshNA nadilO kUDA chEyawalenu - 
I mamchi sampradaayaanni chaalaamamdi pATistunnaaru.
ii wiSwaasaanni pATimchi, kritam pushkaramulu - amTE 
krishNapushkaramulappuDu mEmu kUDA krishNAnadilO 
pawitrasnaanaalu chEsaamu, wemTanE wijayawaaaea numdi 
mEmu raajamamDriki weLLAmu.
raajamahEmdri wadda - gOdaawarii jharini snaanaalu chEsaamu, 
bhaktiparawaSulamainaamu. 
okE paruguna konni puNyakshEtramulanu darSimchukOwaalanE aachaaram, 
hushaarunu kaligistumdi. ii kOwalOniwE kEraLalOni 
muchchaTagaa nelakonna muuDu Saiwa aalayaalu. 

******************

1] waikOm ; 2] kaDaturti ; 3] eTTumannAr. 
 kharuDu anE rAkshasuDu tapassu chEsi, 
mUDu Siwalimgamulanu waramulugaa 
pomdaaDu. remDu chEtulalO remDu limgaalanu, 
meDalO oka limgamunu peTTukunnaa Du. 
maargaayaasamutO waanini aayaa siimalamdu umchaaDu.
aa trilimgaalu kEaLalO puNyakshEtramulugaa welisinawi.
awi - 1] waikOm ; 2] kaDaturti ; 3] eTTumannAr.
kharuni gaLamuna paTTukunna ISuni limgamu - "kaDaturuti" ; 
daanawuni eDama chEtilOni limgamu - "eTTumanUr" ;   
kuDi chEta limgamu - "waikOmm mahadEwa aalaya kaLa" 
pErennika kaliginadi.
kEraLalO pedda guDi, 8 ekaramulalO unna guDi waikOmm kOwela.

ii muuDu kOwelalanu okE paryaayaana darSimchukonuTa 
puNyapradamani - bhaktula wiSwAsam.
amduwalana bhaktulu wiilainamtawaraku okka rOjE tri dEwaalayaalanu 
darSimchu prayatnaalu chEstaaru. 

అఖిలవనిత
Pageview chart 32125 pageviews - 790 posts, last published on Jul 23, 2015

కోణమానిని తెలుగు ప్రపంచం
Pageview chart 59946 pageviews - 1019 posts, last published on Jun 29, 2015 - 7 followers

Telugu Ratna Malika
Pageview chart 4501 pageviews - 127 posts, last published on Jun 22, 2015

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...