27, డిసెంబర్ 2011, మంగళవారం

క్యూబికల్స్, ఘనము, సామగ్రి



క్యూబ్ - (Cube):- "ఘనము"యొక్క నిర్మాణము గణిత సంబంధియే!
కానీ నిత్య జీవితంలో దీని స్వరూపముతో
అనేక అంశాలు రూపొందించబడి, వినియోగంలో ఉన్నాయి.
నేడు వాణిజ్య అవసరములు పెద్ద ఎత్తున పెరిగినవి.
ఫలితంగా మైన్ రోడ్ లలో, ముఖ్య రహదారులు,
ప్రధాన కూడళ్ళలో, బిజినెస్ సెంటర్లులో 
స్థలాలకు విపరీతమైన డిమాండు పెరిగింది.
కొద్ది స్పేసులో, అతి చిన్న జాగాలలో   
అనేక వ్యాపారాది కార్యక్రమములను పూర్తి చేయాల్సివస్తూన్నది.
ఇలాటి తరుణములో అందుబాటులోనికి వచ్చినదే 
"క్యూబికల్ వసతీ కుడ్యము".


Workers-Cubicle
"క్యూబికల్" అని దాని పేరు.
క్యూబికల్స్ - ఆఫీసులలో 
ఈనాడు ఎక్కువగా వాడుకలో ఉన్నవి.
 5, 6 ఫీట్లులో, ఐదారు అడుగులలో ఉన్న స్థలాన్ని 
నిర్దిష్టంగా ఉపకరించే సౌలభ్యము కలిగినట్టి నిర్మాణాలు ఇవి.


అతి తక్కువ స్థలాన్ని Cubicles తో 
సమర్ధవంతంగా ఉపయోగంలోకి తెస్తాయి.
సిబ్బంది అందరూ ఒకేచోట ఉన్నప్పటికీ, 
ప్రైవసీతో ఎవరి పని వారు చేసుకోగలుగుతారు.
ప్రత్యేక గదులలో ఈ సౌకర్యాలు కొరవడుతాయి.
cubicles అంటే ప్రహరీగోడల వంటి పార్టిషన్సు.
మనిషి కూర్చుంటే సరిపడే ఎత్తు ఉండే పిట్టగోడల వంటివి.
వర్కర్లు విశాలభవనములలో కూడా క్యూబికల్సు వలన
నిరాటంకంగా విధులను నిర్వర్తించుకోగలుగుతారు.
ఒకరికొకరు డిస్ట్రబెన్సు ఉండదు. 
ఇతరుల కార్యకలాపములకు విఘాతాలు ఏర్పడవు.
ఒక విధంగా చెప్పాలంటే "పాక్షిక గది". క్యూబికల్ డస్కు,
ఆఫీసు  క్యూబికల్,  క్యూబికల్ వర్క్ స్టేషన్ మున్నగునవి ఈ కోవలోనివే!


**********************************************;




క్యూబ్ - (+Cube) నిర్మాణము 
గణిత సంబంధియే!
కానీ నిత్య జీవితంలో దీని స్వరూపముతో
అనేక అంశాలు రూపొందించబడి, 
వినియోగంలో ఉన్నాయి.
నేడు వాణిజ్య అవసరములు పెద్ద ఎత్తున పెరిగినవి.
ఫలితంగా
 (Main Roads) 
మైన్ రోడ్ లలో, 
ముఖ్య రహదారులు,
ప్రధాన కూడళ్ళలో, 
బిజినెస్ సెంటర్లులో స్థలాలకు 
విపరీతమైన డిమాండు పెరిగింది.
కొద్ది స్పేసులో 
అనేక వ్యాపారాది కార్యక్రమములను 
పూర్తి చేయాల్సివస్తూన్నది.
ఇలాటి తరుణములో 
అందుబాటులోనికి వచ్చినదే 
"క్యూబికల్ వసతీ కుడ్యము"


**********************************************;


 క్యూబ్ - (=Cube)  అంటే దీర్ఘచతురశ్రపు దిమ్మలనుగా,
అంటే డైమెన్షన్లు ఆకారంలో సిద్ధపరచిన వస్తువు.
ఇంచుమించు, "షట్కోణపు పార్శ్వములఆకారము" ఇది.
క్యూబిక్యులం (Cubiculum)అనే లాటిన్ పదమునకు 'పడక గది 'అని  అర్ధము.
15 వ శతాబ్దపు ఈ ఇంగ్లీషులో వాడుకలోకి వచ్చిన
ఈ మాట :- అనుకోకుండా 20 వ సెంచరీలో బహుళ ప్రచారములోనికి వచ్చినది.
CUBE అనేది జామెట్రీ గణితములో ప్రత్యేకమైనది.
three Dimension స్వరూపముతో శాస్త్రజ్ఞులు దీనిని లోకానికి అందించారు.
అంతే! అప్పటినుండి, రేఖా గణిత శాస్త్ర పుస్తకాలలో,
Geometry mathematics world కు మాత్రమే పరిమితమైన
ఈ "క్యూబ్" జనావళి నిత్యావసర వస్తు సంచయ, పరికరముగా అమరినది.


**********************************************;


1960 లలో హెర్మన్ మిల్లర్ సంస్థ, రాబర్ట్ ప్రోస్పస్ట్, 
జార్జి నెల్సన్ మున్నగు వారి కృషితో,
ఈ క్యూబ్ పద్ధతి, సమాజములోని 
అన్ని రంగాలలోనికీ ప్రయోజనకారి ఐనది.
ఆఫీసులలోనే కాక, ఫర్నిచర్లు, పాకేజీ అట్టపెట్టెల పద్ధతులూ, 
ఆటవస్తువులు,  పోక్ మ్యాన్ క్రీడా పరికరాలూ, 
గ్రాఫిక్సు చిత్రాల మాయాజాలాలూ ఇలాగ- ఒకటేమిటి,
"వటుడింతవాడు త్రివిక్రమావతారుడిగా మారుతూన్నట్లు" 
సకల దేశాలలోను, అన్ని ఖండాలలోనూ ప్రఖ్యాతి గాంచినది.






పిల్లల ప్రపంచం లో CUBE toy:


క్యూబ్ - అనే ఆటవస్తువునకు విపరీతమైన క్రేజ్ ఏర్పడినది.
ఎంతగా అంటే పిల్లలే కాక పెద్దవాళ్ళు కూడా ఆడుతూంటారు.
మాజిక్ క్యూబ్- గా ప్రసిద్ధికెక్కిన క్రీడా సామగ్రి ఇది.
;
;
;
హంగరీ దేశస్థుడైన ఎర్నో రూబిక్ 
(Rubik's Cube in 1974)
 Majic Cube Toy ని 1974 లో కనిపెట్టాడు.
(Hungarian sculptor ,                                                                                                                                        professor in architecture Ernő Rubik)
2009 నాటికి 350 కోట్ల "క్యూబ్ క్రీడా బొమ్మలు" 
ప్రజలలోనికి వెళ్ళాయంటే -
ఇంత చిన్న వస్తువును కనిపెట్టిన
ప్రొఫెసర్, హంగరీ శిల్పి ఐన"Ernno Rubick" యొక్క
హస్తవాసి మహిమయే నని ఒప్పుకోవాలి.


            బ్లాగ్ పాఠక మిత్రులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు   
;

18, డిసెంబర్ 2011, ఆదివారం

సప్తపర్ణి tree






















పాల చెట్లు అధికంగా ఉన్నందుచేత 
కేరళ లోని ప్రాంతాలకు "పాలక్కాడ్" అనే పేరు వచ్చింది.
మేము ఇదివరకు 
"పాలు+కొండలు(=ఘాట్)" అనే 
మాటలతో-వచ్చింది కాబోలు!- 
అనుకునేవాళ్ళము.
"సప్తపర్ణి"అని "ఏడాకుల పాల చెట్టుకు సంస్కృత నామం ఉన్నది.
రెమ్మలకు ఉండే-ఏడు ఆకుల గుచ్ఛము" వలన 
ఇంత అర్ధవంతమైన పేరును 
ఆయుర్వేద శాస్త్రవేత్తలు, 
సంస్కృతభాషాకారులు నామకరణం చేసారు.
ఇంత బాగా ధాతు, ప్రకృతి, వికృతి, మూల,నానార్ధ, 
అనేకార్ధ పదముల సృజనకు అనువుగా రూపొందించబడింది, 
కాబట్టే, సంస్కృతము= "గీర్వాణభాష" ఐనది. ఔనా?]

***********************************;


धत्ते भरम कुसुम पत्र फलावलीनाम 
घर्म व्यथाम शीत भवाम रुजाम च
यो देहं अर्पयति चान्य सुखस्य हेतो:
तस्मै वदान्य गुरवे तरवे नमस्ते !


ധത്തേ ഭരം കുസുമ പത്ര ഫലാവലീനാം
ഘർമ വ്യഥാം ശീതഭവാം രുജാം ച
യോ ദേഹം അർപ്പയതി ചാന്യ സുഖസ്യ ഹേതോ:
തസ്മൈ വദാന്യ ഗുരവേ തരവേ നമസ്തേ !


{తరువు ఇతరుల కోసము  
ఆకుల, ఫలముల, విత్తనముల బరువును- మోస్తూన్నది; 
వేడి/ ఉష్ణ వేదనను శీతల బాధలను భరిస్తూ, 
తన జీవితాన్ని త్యాగం చేస్తూన్నది.
అట్టి చెట్టు నాకు గురువు, 
ఆ తరువు అనే గురువునకు ఇవే నా నమస్కారములు.} 

****************************************

అశ్విని నుండి రేవతి 27 నక్షత్రములు, 
చాంద్రమానము లో శుభకార్యాలకు, లగ్న నిర్ణయాలకూ 
ఆధారములుగా పరిగణిస్తున్నారు.
ఇలాటి సిద్ధాంతములను అనుసరిస్తూ, 
ప్రకృతిని రోదసీ నిర్మాణ, శాస్త్రములకు అనుబంధిస్తూ 
హైదరాబాదులో "నక్షత్ర ఉద్యానవనము" ను అభివృద్ధిచేసారు.
ఆ వివరములతో ఒక మంచి పుస్తకమును ప్రచురించినారు.
"వృక్ష మహిమ" అనే వారి పుస్తకము 
2001 సంవత్సరమునాటి  నుండి
5 ముద్రణలు పొందినది.

ప్రథమ ముద్రణ- 2000 కాపీలు; 
ద్వితీయ ముద్రణ 3000 copies ; 
తృతీయ ముద్రణ 2000 copies
చతుర్ధ& పంచమ ముద్రణలు;  2000 copies

కాపీలకు:-
సాయిగీతా ఆశ్రమము, 
వయా బోయిన్ పల్లి, 
మేడ్చల్ రోడ్, 
కండ్లకోయ బస్ స్టాప్ ఎదురు రోడ్ లో;
మేడ్చల్ తాలూకా, రంగారెడ్డి జిల్లా;

ఈ గ్రంథమునకు: సర్వస్వామ్యములు: మతాజీ జ్యోతిర్మా;
"నక్షత్ర వనము" గురించి మంచి వ్యాసము - 
వికీపేడియా-లో ఉన్నది.

************************************


;
;

17, డిసెంబర్ 2011, శనివారం

పెద్దలను గౌరవించాలి, పటేల్!



















వల్లభాయ్ ఝవేర్ భాయ్ పటేల్ 
(Vallabhai Jhawer Bhai Patel, 31st October 1875 - 15th December 1950), 
స్వాతంత్ర్య వీరుడు.ఉక్కు మనిషి గా 
ప్రజల మన్ననలను అందుకున్న వ్యక్తి.
బాల్యం నుండీ అమిత ధైర్య  సాహసాలను ప్రదర్శించే వాడు. 
పాఠశాల, విద్యార్ధి దశలో పటేల్ నిష్కర్షతనానికి 
గుర్తుగా ఒక జరిగిన సంఘటన ఇది.


స్కూలులో లెక్కల మాస్టారు బ్లాక్ బోర్డుమీద లెక్కలు రాస్తూ, 
చదువు చెబుతూన్నారు. 
ఒక ఆల్జీబ్రా లెక్క, ఆ పంతులు గారికి, 
ఎంతసేపటికీ కొరుకుడు పడలేదు.  
లేచి నిలబడ్డాడు. "అయ్యా! ఆ లెక్కను నేను చేస్తాను" అని అడిగాడు. 
"ఏమిటీ? ఈ గణితాన్ని ఔపోసన చేసినట్లు మిడిసిపడుతున్నావే? 
ఐతే సరే! ఈ లెక్కను చేసి, నువ్వే ఉపాధ్యాయుడిని, అనిపించుకో! సరి!" 
అంటూ ఉక్రోషంతో సుద్దముక్కను విసిరాడు.


ఆ చాక్ పీసును అందుకుని, నల్లబల్ల దగ్గరికి చక చకా నడిచాడు 
విద్యార్ధి మన బాల పటేల్. గబగబా ఆ లెక్కను పరిష్కరించాడు. 
అలా బోర్డు మీద పటేల్ లెక్కను రాయగానే, 
క్లాసులో కరతాళ ధ్వనులు మార్మ్రోగాయి. 
అందరూ నిర్ఘాంతపోయేలా అప్పుడే ఒక సంఘటన జరిగింది. 
పటేల్ మాష్టారు ఆసీనుడయ్యే కుర్చీ వద్దకు వెళ్ళాడు. 
ఠకాలన ఆ చైర్ లో కూర్చున్నాడు దర్జాగా. 
అధ్యాపకునికి దిగ్భ్రమతో, పట్టరాని కోపం కలిగింది. 
ఉక్రోషంతో రౌద్రంగా వెళ్ళి, హెడ్ మాస్టారుకు కంప్లైంట్ చేసాడు. 
అప్పుడు Head Master పటేల్ ను పిలిపించాడు.


"ఏమిటి పటేల్! ఇలాగ ఎలాగ ఎందుకని చేసావు?"


ఉన్నదున్నట్టుగా వివరిస్తూ చెప్పాడు పటేల్.


"సార్! గణిత సమస్యను solve చేసి, 
మాస్టారు గారు చెప్పినట్లే- నేను కూడా ఉపాధ్యాయుడిని అనిపించుకున్నాను కదా! 
కాబట్టే ఆయన హెచ్చరిక ప్రకారమే లెక్కను చేసాను. 
అందుకనే ఆ కుర్చీలో కూర్చున్నాను. తప్పేమీ లేదే? '"


అది సమస్యాత్మక సందర్భమని- హెచ్. ఎం. కు అర్ధమైనది. 
పటేల్ చెప్పిన దాంట్లో సబబు కనిపించింది. 
ఐనప్పటికీ మనసులోనే నవ్వుకుని,


"పెద్దలను గౌరవించాలి పటేల్! 
నువ్వు అలాగ పంతులు గారి కుర్చీలో కూర్చోవడం చాలా తప్పు. 
ఇకమీదట ఎప్పుడైనా ఇలాటి పొరబాటు చేస్తే స్కూలు నుండి నిన్ను పంపిస్తాను" 
తర్జని చూపిస్తూ అన్నాడు పెద్దాయన. 
దానికి కూడా పటేల్ తటపటాయించకుండా ఇలా అన్నాడు 
"సర్! పిల్లలకు విద్య చెప్పే గురువుగారు 
ఆ పాఠాన్ని ముందే ప్రిపేర్ ఐ రావాలి. 
అంతేగానీ, సగం జ్ఞానంతో, అర్ధ చదువుతో  వస్తే ఎలా? 
క్లాసులో అడుగు పెట్టే ఇలాటి టీచరు ఉన్న పాఠశాలలో ఉంటే 
పిల్లలకు చదువు ఎలా వస్తుంది. అందుకని నేనే వెళ్ళిపోతున్నాను!".
ఇంకేమున్నది, 
ధైర్యశాలి పటేల్ ఆ హైస్కూలు నుండి వెళ్ళిపోయాడు, 
                                                 వేరే స్కూలులో చేరాడు.


సర్దార్ వల్లభాయ్ పటేల్ బాల్య దశలో 
ఇంతటి నిర్మొహమాటాన్ని 
మనము (రచయిత్రి) ఒప్పుకోలేము. 
కానీ విద్య పట్ల పటేల్ కు కల శ్రద్ధాసక్తులను 
మెచ్చుకోకుండా ఉండలేము. 
భావి కాలంలో అఖిల భారతావనిని ఏకత్వ పరచి,ఏక దేశముగా చేసి, 
"ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా" గా ప్రశంసార్హమైన ధీశాలి, 
మహావ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్.



పెద్దలను గౌరవించాలి పటేల్! (Link 1)
ఉక్కుమనిషి గురువారం 14 జనవరి 2010 (Link 2
                                                                  konamanini)


పెద్దలను గౌరవించాలి పటేల్!
                 (Newavakaya,com)
User Rating: / 1 
Member Categories  - తెలుసా!
Written by kusuma   
Tuesday, 06 December 2011 10:53

15, డిసెంబర్ 2011, గురువారం

V.A.K. “ఆలాపన” కు “జై” అన్న ముళ్ళపూడి వేంకటరమణ



















వేంకట ఆనంద కుమార కృష్ణ రంగారావు అవిరళ కృషికి 
మహోద్గ్రంధ రూపమే 513 పుటల “ఆలాపన”. 
శ్రీమతి భార్గవి గారికి ‘పుస్తకప్రపంచం’ 
ఋణపడి ఉంటుందనడంలో సందేహం లేదు.
ఎందుకంటే సాహిత్యము అనే మొక్కకు నీరు పోసి, సంరక్షణ చేసే 
వరద హస్తములు ఎప్పుడూ వందనీయాలే! 
డాక్టర్ భార్గవి గారితో:”మాట మాట” (436నుండి 495 పేజీల వఱకు) ఇంటర్వ్యూ 
ఈ పుస్తకమునకు హైలైట్.


భార్గవి గారు 200 పేజీలు ఔతుందని అనుకుని, 
ప్రచురణా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 
కానీ తీరా చూస్తే 400 పేజీలని మించి, 
ఇంకా, ఇతర హంగులతో…….
అనగా ఇంటర్వ్యూ ఇత్యాదులతో- 
అదనంగా 70 పేజీలు అయ్యేటట్లుగా ఉన్నది, 
ఎలాగ? ఏమి చేతుము?”- అనుకుంటూ 
భార్గవి మథనపడుతూన్నారు. 
ఆ తరుణంలో ఒక ఫోన్ వచ్చినది. 
అది ముళ్ళపూడి వేంకట రమణ నుండి!!


“అమ్మా! నువ్వు V.A.K. ని ఇంటర్వ్యూ చేసిన కాసెట్టును విన్నాను. 
చాలా థ్రిల్లింగుగా ఉన్నది. 30 ఏళ్ళుగా వి.ఎ.కె. నాకు తెలుసు. 
అయినా నీ ఇంటర్వ్యూ విన్నాక 
నాకు తెలీని విషయాలు కొన్ని తెలుసుకున్నాను అనీ” -
ఆ రోజే నిర్ణయించుకున్నాను, 
ఇంటర్వ్యూ పుస్తకానికి అదనపు ఆకర్షణగా ఉంచాల్సిందేనని- అనుకున్నారు భార్గవి.
ఇలాగ ఒక ఫోన్ కాల్ ఒక మంచి పుస్తక స్వరూపాన్ని తీర్చిదిద్దడానికి కారణమైనది.


వి.ఎ.కె.రంగారావు అనేక ప్రముఖ పత్రికలలో వ్యాసాలు రాసిన కాలమిస్టు. 
శ్లేష చక్రవర్తి ముళ్ళపూడి మాటలలో వీరి వ్యక్తిత్వాన్ని వీక్షించగలము.


**************************************;


“వి.ఎ.కె. రంగారావు మ్యూజికాలమిస్టే కాదు, 
మ్యూజికాలజిస్టూ, లిటరేచరాలజిస్టూ కూడా. 
మల్లాది శాస్త్రి గారి సాహిత్యాన్ని మధించి, నవనీతాన్ని సాధించాడు. 
అన్నమయ్య పదాలు నూటికి పైగా పరిశీలించి, పరిశోధించి, 
ఎన్నోవిషయాలను తెలియజెప్పాడు. 
సంగీత సాహిత్యాలనే కాక నాట్య కళను కూడా 
ఆజన్మాంతం ఆరాధించే’త్రివేణీ సంగమేశ్వరుడూ ఈ వెంకట ఆనంద క్రిష్ణ రంగరాయలు’. 
ఏడు పదులు దాటినా ముక్కాలి ముదుసలి కాకుండా 
నిత్య యవ్వనుడై, నేటికీ శక్తి చైతన్యవంతమైన నాట్యం చేస్తాడు.
ప్రతి ఏటా తిరుపతి-శ్రీనివాస మంగాపురంలో 
ఆషాఢ శుద్ధ సప్తమి నాడు కళ్యాణ వేంకటేశ్వరుని ఎదుటనూ, 
శ్రావణ మాసంలో లో శ్రీ కృష్ణ జయంతి నాడు 
కార్వేటి నగరంలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో స్వామివారి 
ఆ దివ్య మంగళ విగ్రహం ఎదుటనూ రెండేసి గంటలు నాట్య నివేదనం చేస్తాడు. 
ఆలయ మంటపంలో దేవదాసీలు స్వామికి 
నృత్య నివేదన చేసే ఆనాటి సంప్రదాయాన్ని- 
ఈ నాటికీ మన్నించి, మధుర భక్త్యావేశంతో నివేదించేది ఈ ఒక్క మహా మనీషే.”
ఇంకా ముళ్ళపూడి వాక్కులలోనే వి.ఎ.కె. పర్సనాలిటీ సాక్షాత్కరిస్తుంది, 
అందుకే మక్కికి మక్కీగా అవే పద వల్లరి ఇక్కడ…..


“త్యాగరాజ స్వామి ‘ప్రక్కల నిలబడి…’ కీర్తనలో 
ప్రభువుతో చిన్న సరాగమాడాడు. 
“హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్నులతో 
కొలువు తీరిన శ్రీరామచంద్రుని వైభవాన్ని 
కన్నులారా తిలకించి తరించే భాగ్యం మాకే ఉందయ్యా! 
సభలో కూర్చుని నిన్ను చూసే అదృష్టం మాకే వుందయ్యా! 
సింహాసనం మీద కూర్చుని- నన్ను చూస్తున్న నీకు లేదు కదా!”- అన్నాడు. 
అలాగే వి.ఎ.కె. రంగారావు కళ్యాణ వేంకటేశ్వర, వేణుగోపాల స్వామి వారల సమక్షంలో 
నృత్య నివేదన చేస్తూంటే ఆ దృశ్యాన్ని, 
ఆ వైభవాన్ని సందర్శించే అదృష్టం 
ఆ ఎదురుగా కూర్చున్న ప్రేక్షకులు అందరికీ వుంటుంది గాని 
ఆయనకు లేదు. కానీ ఆయన దాన్ని సందర్శించేది ప్రేక్షక నేత్రాలలో- 
రాగ రంజిత హృదయ దర్పణాలలో. ధన్యహో!”


‘ఆలాపన ‘ అనబడే ఈ ఎన్ సైక్లోపేడియాలో – 
నిజంగా ఆ పేరుకు తగినన్ని విశేషాలూ, వివరాలూ, వింతలూ ఉన్నాయి.
(ఈ పుస్తకంలో వున్నవి రెండేళ్ళ సంగతులే 
కాని ఆయన రాసినవి నలభై యేళ్ళపాటు. దీర్ఘ కాలమ్.)


వి.ఎ.కె. ఆదినుంచి హిందీ సంగీత దర్శకుడు “సి.రామ చంద్ర” భక్తుడు. 
బాపు, పి.బి. శ్రీనివాస్ లు రామచంద్ర చితల్కర్ మూలంగానే- 
వారు “ముగ్గురు మిత్రు”లయ్యారు.
అలాగే మదన్ మోహన్, సలీల్ చౌధురి మన వి.ఎ.కె. కి చాలా ఇష్టం. 
వారి పాటలు – ఏనాటివో ఈయన ప్రస్తావించి వల్లిస్తూంటే 
ఆ హిందీ మ్యూజిక్ డైరెక్టర్ లే ఆశ్చర్యపోయేవారు. 
ఈ తరం వారికి తెలియని సరదా సంగతులు ఎన్నో 
ఈ ఆలాపనలో అందంగా- ముత్యాలహారంలో సైజు వారీ 
ముత్యాల వలె పొందుపరచి వున్నాయి. 
ఇలాగ సాక్షాత్తూ ముళ్ళపూడి వేంకటరమణ కలం “జై” అంటూ- 
(8 pages) అక్షరాలా ఎనిమిది పేజీలు 
“మున్నుడి” రాసారంటే వి.ఎ.కె. రంగారావు గారి “కలం కష్టమ్”
సాహితీ సేద్యంలో ఆయన మొలకెత్తించిన “ఆలాపన” 
కల్పవృక్షపు అమూల్య పుష్పము- అని నిర్ద్వంద్వంగా పేర్కొనవచ్చు.




V.A.K. “ఆలాపన” కు “జై” అన్న ముళ్ళపూడి వేంకటరమణ (లింక్ ఫర్ essay) 


More articles by అతిథి » Written by: అతిథి 
Tags: Alapana, breaking, V.A.K.రంగారావు


వ్రాసిన వారు: కాదంబరి
****************

gramaphone records of the 78rpm kind, 
made his collection of 42,000 
in forty national and international Languages

నర్తకి ; (Nartaki.kom)
;
Address  (Link 2):-  [Chennai Best]

For three hundred and forty five days in the year, 
he is available for use and abuse by kindred spirits, 
at Ram Mahal, 
36 Pycrofts Gardens, 
Chennai 600006, India. 
Ph: (91- 44) - 28278308 

13, డిసెంబర్ 2011, మంగళవారం

పునీతా గాంధిః - ఓ తాళపత్ర వినతి



















"పునీతా గాంధిః త్వత్ పద పరిచితా;
             రామ నగరీ గరీయః ప్రస్థానః"


ఈ వాక్యాలను తాటాకుపత్రాలలో 
వారు ముగ్గురూ రాసి ఇచ్చారు. 
అందుకున్న వ్యక్తి జాతిపిత మహాత్మా గాంధీ.


"భారత దేశంలో అనేక ప్రాంతాలకు వెళ్తున్నాను. 
ఇది విచిత్రంగా ఉన్నది. 
ఇలాటి స్వాగత పత్రమును 
ఇంతదాకా నాకు ఎవరూ ఈయలేదు కదూ! " 
అంటూ ఆశ్చర్యపడ్డారు మహాత్మా గాంధీజీ.


చీరాలలొ "రామదండు" ను స్థాపించిన దుగ్గిరాల గోపాలక్రిష్ణయ్య 
మంచి దక్షత గల నేతగా పేరుకెక్కారు. 
రామదండు అంటే "చిన్న మిలిటరీ దళము" అని ప్రశంసలను పొందినది. 


దుగ్గిరాల మిత్ర వర్గంలోని వారు అబ్బూరి రామకృష్ణా రావు. 
అక్కడ ఆయన ఒక చిన్న ఇల్లును కట్టుకున్నారు. 
(అబ్బూరి రామక్రిష్ణారావు గారు "నదీ సుందరి" - 
మున్నగు రచనలతో తెలుగు సాహిత్య మార్గంలో 
పూజాపుష్పములను ఉంచారు). 
బసవరాజు అప్పారావు మిత్ర త్రయంలోని మూడవ మనిషి. 


వీరి కృషితో "ఆంధ్ర విద్యాగోష్ఠి" అనే 
చదువుల నిలయం వెలిసినది. 


ఈ మువ్వురు స్నేహితులు 
"రాక రాక మన త్రిలింగ దేశములో అడుగుపెడుతున్నారు బాపూజీ. 
ఆయనకు చిర కాలమూ మదిలో గుర్తు ఉండిపోయేలాగా స్వాగతం పలకాలి, 
ఎలా? ఏ పద్ధతిని ఆచరిద్దాము?" 
ఇలా వారు మనసులో ఎంతో ఆలోచించారు. 
ఆ ఆలోచనా ఫలితమే- తాళపత్ర వినతిపత్రము. 
వారు పై శ్లోక వాక్యాలను శ్రమతో, కష్టపడి రాసారు. 
ఒక తాటాకుల పుస్తకములాగా తయారుచేసి, 
అందులో భద్రంగా చుట్టి 
బోసినవ్వుల బాపూజీ కి వినయ విధేయతలతో ఇచ్చారు. 
ఆప్యాయతతో అందుకున్నారు గాంధీ తాత.

పునీతా గాంధిః - ఓ తాళపత్ర వినతి (WEB NEW) ;
Member Categories  - తెలుసా!
Written by kusuma   
Friday, 18 November 2011 11:36

9, డిసెంబర్ 2011, శుక్రవారం

బర్మాలోని గంధం చెక్క


Thanaka face paste 

“తనఖా  చెక్క”- బర్మాలో 
ఈ చెట్టు ఉపయోగం చాలా ఎక్కువ.


మియన్మార్ (మునుపటి పేరు బర్మా దేశము) లో 
ముఖ లేపనముగానూ,
స్త్రీలు చేతులకూ, పాదాలకూ వాడుతారు. 
నఖ శిఖ పర్యంతమూ రాసుకుంటారు.
ఈ తనఖా  పేస్టును బర్మాలో పురుషులు, 
బాలురుకూడా పూసుకుంటారు.


"థయనా" అనే పేరుతో ఈ లేపనమును, 
క్రమంగా పొరుగు దేశాలైన థాయ్ లాండ్ మున్నగు దేశాల  
లలనా మణులు  సైతము పై పూతలుగా పూసుకుంటారు.


ఆ జాతి చెట్లను బర్మా దేశీయులు 
“తనఖా తరువులు” అని పిలుస్తారు.
మధ్య మియన్మార్ లో ఈ చెట్లు ఎక్కువగా పెరుగుతాయి.


ష్వేబూ, మాగ్వే డివిజన్సులోని 
ఆ యా ప్రాంతాలలో విభిన్న పేర్లతో   
ఈ లేపనము వాడబడుతూన్నది .
సదరన్ షాన్ స్టేట్ లోని కుటీర పరిశ్రమలలో 
తాజాగా, లేటెస్ట్ థయనా సౌందర్య లేపనము తయారీ చేశారు.


తాజా దనముతో ఎప్పటికప్పుడు చెక్కను అరగదీసి, 
సిద్ధం చేసుకుంటారు.
తనఖా చెట్ల  లోని – 
సర్వ భాగాలు ప్రయోజనకారులు.


35 సంవత్సరాలు పెరిగిన చెట్లు 
ఇలాటి గంధము తీయడానికి అనువైనవి.


హిందువులు గంధమును చేసినట్లుగానే  
దీనిని వాళ్ళు చేస్తారు.


మన దేశంలో సాన రాయి మీద గంధపు చెక్కను అరగదీస్తూ చేస్తారు.
బర్మాలో  ఇలాటి గుండ్రపు రాయిని  kyauk pyin  అంటారు.


చెట్టు బెరడును గానీ, చెట్టు వేళ్ళను గానీ – 
నీళ్ళు కొంచెం కొంచెం చిలకరిస్తూ బాగా అరగదీస్తారు. 
సాంప్రదాయిక పద్ధతిలో 
ఇలాగ రెడీ ఐన గంధాన్ని – కొద్ది మొత్తాలుగా విక్రయిస్తారు.


నేడు తనఖా తరువు నుండి 
గంధము – పేస్టు, పౌడర్, 
కురుల నూనె అత్యాది తయారీ వస్తువులు దొరుకుతూన్నవి.


బర్మా వనితలు 2 వేల ఏళ్ళ నాటి నుండీ- 
మన గంధము వలెనే- కమ్మని వాసన కలిగి ఉన్న 
తనఖా గంధములను ఉపయోగిస్తున్నారు.


బర్మా మహిళలు, తమ వదనాలకు 
ఈ లేపనాన్ని రక రకాల డిజైన్లతో కూడా అలంకరించుకుంటారు.


గుండ్రంగా గానీ, ఆకు ఆకారంలో గాని, 
వివిధ  రకాలుగా అలంకరించుకుంటారు.
నఖశిఖపర్యంతము కూడా సింగారించుకుంటారు.
ఎండ కాక నుండి, 
సూర్య రశ్మి  నుండి రక్షణ కల్పించేసాధనము.


దేహము యొక్క మృదుత్వమును ఇనుమడించే 
కాస్మొటిక్ సాధనమీ  పేస్టు.
J.Raeburn Middleton’ oil paintings లలో 
“తనఖా సింగారిత బర్మా స్త్రీల దృశ్యాలు “చోటుచేసుకున్నాయి. 
1920 ల నాటి నుండీ ఇంగ్లండు లో 
ఈ తనఖా విలేపనము అధిక గిరాకీతో ఉంది.


                                        (- కాదంబరి)



బర్మాలోని గంధం చెక్క; (Link web magazine)
Posted on November,2011 by విహంగ 1634;
;

;

;


Tags:-


thanaka (yellowish-white cosmetic paste made from ground bark) 
on face 







This entry was posted in వ్యాసాలు. 
Bookmark the permalink.
;

3, డిసెంబర్ 2011, శనివారం

వదినా మరదళ్ళ వెటకారాలు




;
మన సాహిత్యాన్ని అనేకానేక చమత్కార శ్లోకాలు, 
పద్యాలు హాస్య స్ఫూర్తిని నింపి 
పరిపుష్ఠము చేసినాయి. 
ఈ శ్లోకములోని చమత్కారాన్ని గమనించండి.


"భిక్షార్ధీ స క్వయాతః?


"బలి ముఖే!"


"తాండవం క్వాద్యభద్రే?"


"మన్యే బృందా వనాంతే!"


"క్వను స మృగ శిశుః?"


"నైవ జానే వరాహం?"


"బాలే క్వచ్చిన్న దృష్టః జరఠ వృషపతిః "


"గోపే వాస్య వేత్త."


లీలా సంలాప ఇత్థమ్ జలనిధి, 
హిమవత్కన్యయోత్రాయతాంవః."


శ్రీ లక్ష్మీ దేవి, పార్వతీదేవి 
స్నేహపూరితంగానే మేలమాడుకుంటున్నారు.


లక్ష్మి: "ఆ బిచ్చగాడు ఏ వీధికి వెళ్ళెనో?" 
(నీ భర్త బిక్షాటన చేసేవాడు అని వ్యంగ్యం)


పార్వతి: "బలి చక్రవర్తి సముఖానికి." 
(వామన మూర్తి గా వెళ్ళి మూడడుగుల నేలను 
దానం ఇవ్వమని అడిగినది శ్రీ మహా విష్ణు మూర్తి కదా)


లక్ష్మి: "అతను తాండవం చేస్తూ, 
              ఎక్కడ తైతక్కలాడుతున్నాడో?"


పార్వతి:"బృందావనంలో, ఏదో మూల."
(రాసక్రీడలు ఆడేది నీ భర్తయే కదా! 
అని దెప్పి పొడుపు ఇది.)


లక్ష్మి: "ఆ జంతువు పిల్ల (గణపతి)ఎక్కడ ఉన్నది?"


పార్వతి: "ఆ పంది పిల్ల ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలియదు?
(వరాహావతారం దాల్చినది నీ పతియే!")

లక్ష్మి: "బక్క చీ చిక్కిన ఎద్దు ఏదీ?"


పార్వతి: "ఎద్దు సంగతి మనకేమి తెలుస్తుంది, 
వదినా!ఆవుల్ని కాచే వాళ్ళకు తప్ప."


శ్లోకకర్త 'వసుధైక కుటుంబము' అనే సూక్తిని ముక్తాయింపుగా 
ఇంపుగా ఇచ్చిన వైనం ఇది. 
ఈరీతిగా అలరించే 
సాగర పుత్రిక, గిరి పుత్రికల 
విలాసవంతమైన లీలా సల్లాపములు 
మనలను రక్షించు గాక!"


*****************************;





ఒక చమత్కార శ్లోకము  ;( Web)
Member Categories  - తెలుసా!
Written by kusuma   
Friday, 02 December 2011 12:03


ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...