18, అక్టోబర్ 2012, గురువారం

ఆలుమగలు!


పండుగ సందర్భంగా ఇదిగో ఒక మంచి చమత్కార పాట. 
పల్లెవాసులు వారు, 
ఇతిహాసములలోని పాత్రలను తమవిగా చేసుకునే చనువు తీసుకోవడము 
లుమగల మధ్య సంభవించే చిలిపి తగాదాలను  నేరుగా
సాక్షాత్తూ ఆ సీతా రామచంద్రులకే ఆపాదించేసారు. 
చూడండి,చదవండి:


!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!! ! ! 

వాళ్ళ అందమైన సొంత హక్కు, 
ఇలాంటి అద్భుత జానపద గేయా ఆణి ముత్యాలను 
మన తెలుగు అక్ష్ర కడలిలో ప్రభవిల్లేలా చేసినవి.
పఠితల పెదవులపైన ముసిముసి నగవులను విరబూయిస్తూన్న 
అలాంటి పల్లె పదము ఇదిగో! మరి! 
హాస్య డోలలలో ఊగాలి మన మనసులు!


! ! ! ! ! ! ! ! ! ! ! ! ! ! ! ! ! ! ! ! !!! ! 

By Vishakha Devi Dasi


!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!! ! ! 


ముత్యాల పగడాలు అమ్మొచ్చినాయి;  
రత్న, మరకతాలు  ఉయ్యాలో! ఉయ్యాలో!  
కొంటనని సీతమ్మ కొంగొడ్డినాది; 
వద్దనుచు రామయ్య గద్దించినాడు 
;                ఉయ్యాలో!  ఉయ్యాలో!  

అలిగి వెళ్ళిపోయి మా జానకి, 
బుంగమూతిని పెట్టి అరక కడ పండింది ;
దొప్పల్ల పూలన్ని గుప్పించి పోసేసి,
 అమ్మను లేపండీ,  సహన శీలుల్లార! 

@) గుప్పినా లేవదూ గురజాల బంతి - 
;                          ఉయ్యాలో! ఉయ్యాలో! 
సానపై గంధాలు; చల్లి లేపండి -  
            సౌభాగ్యవతులార!
 @):         చల్లినా లేవదే సరసిజాక్షీ సీత - 
:                            ఉయ్యాలో! ఉయ్యాలో! 

@) విసనకర్రల తోటి విసిరీ లేపండీ - 
    ముత్తైదులార! నచ్చ జెప్పండి!

@) విసిరినా లేవదే విరజాజి మొగ్గ - 
      అవనిజకు అలుకలు ఔర!  విడ్డూరమే! 
      కౌసల్య, కైకేయి లేపినా లేవదూ - 
     సుమ్మిత్ర దశరధులు  పిలిచినా పలుకదూ;                                    

ఆడుబిడ్డ శాంత వచ్చి వేడినకూడ , 
పట్టు వదలా లేదు; మా ముద్దు పూబోణి!            
మరిది లక్ష్మణస్వామి, యారాలు ఊర్మిళ - 
శ్రుతకీర్తి, మాండవి; వేడుకోలులు - 
సుతరాము - అక్కరకు రానె లేదాయె - 
\                           ఉయ్యాలో! ఉయ్యాలో! 
ముసుగు దన్ని మోము చూపదు మైధిలి;  
ససేమిరా; మర్యాద  పాటించనే లేదు!!!!!!
అయ్య! రామయ్య! ఇంక నీదే వంతు; 
పంతాలు వీడి; ఒక మెట్టు దిగి రమ్ము!

ఆమైన రామయ్య గదిలోకి అడుగిడెను - 
నీల మోహన మెరుపు దూసుకొచ్చిందంట!

సాక్షాత్తు తన భర్త శ్రీరామ చంద్రులు - 
వెన్ను నిమిరీ లేపె వనజాక్షిని;

ముసి ముసిగ నవ్వుతూ ఓరగా చూసేను; 
మూసిన దుప్పటిని తొలగించి ముదిత 
పకపకా నవ్వుతూ, పరుపుల్లు దిగినాది - 
ముసిరిన ముంగురులు సవరించుకున్నాది;  
సీతాదేవి;

చిలుకోలె సీతమ్మ "గడి" - లోకి వెళ్ళింది - 
సొమ్ములెన్నో కొనెను సంబరముగాను 
చంద్ర కళ సీతమ్మ, రఘు రాము ప్రియ పత్ని - 
పచ్చనీ గాధలు రామచిలుకమ్మల రమ్య గానాలు!

(“బతుకమ్మ! బతుకమ్మ! ఉయ్యాలో! -
    బతుకమ్మ పాటలలో ఒక ముచ్చట


                                             (సేకరణ: కాదంబరి)  


********************************************;
aaaaaa a aaaaaa aaaaaaa aaaaaaa 

15, అక్టోబర్ 2012, సోమవారం

రావికొండలరావ్ కనుబొమ్మలు


1968 లలో ఒక తమాషా జరిగింది."వరకట్నం"  ఎన్.టి. రామారావు నిర్మిస్తున్నారు. 
ఆ సినిమాలో రావి కొండలరావు నటిస్తూ ఉన్నప్పుడు ఇలాగైంది. 

ఎన్.టి.రామారావుని అందరూ "పెద్దాయన" అని పిలిచేవారు. 
“బ్రదర్! కూర్చోండి. మంచివేషం మీరైతే బావుంటుంది. 
తమ్ముడితో మాట్లాడండి. డేట్స్ ఇస్తారు. 
"All the best!!!!! ” అన్నారు అన్నగారు.  
ఆనందంతో ఉక్కిరిబిక్కిరి ఔతూన్న  రావి కొండలరావు. 
తత్క్షణమే  త్రివిక్రమరావును కలిసాడు. 
షూటింగ్ తేదీల కాగితం మీద 'సంతకాలు' పెట్టాడు, 
ఆమైన దర్జాగా 'సొంత కాలు' బయటపెట్టి బయటపడ్డాడు 
"అమందానంద కందళిత హృదయారవిందుండనై” అని రావి కొమ్మలరావు,  
సారీ! రావి కొండలరావు తన “కనుబొమ్మలాట” అనే వ్యాసంలో ఉటంకించాడు.

******************;Photo Curtesy:-
telugu-movie-artist-address

(Link For Image)
******************;
సరే! షూటింగు తొలిరోజు, 
వాహినీలో చాలా సహజమైన సెట్ వేశారు కళాదర్శకుడు ఎస్.కృష్ణారావు
మేకప్ రూమ్ కి వెళ్ళి కూర్చున్నాడు రావి కొండలరావు. 
అక్కడ రావికి వేయాల్సిన డ్రెస్సు- పెద్దకోటు, జుబ్బా, తలపాగా- వగైరాలు అన్నీ సిద్ధంగా ఉన్నాయి. 
భక్తవత్సలం మేకప్ వేస్తూ 
“సార్, కనుబొమ్మలు సన్నగా చేయాలి. కిందాపైనా తీసేస్తాను”అన్నారు చేతిలో బ్లేడును ఆడిస్తూ. 
ఇంకేముంది? రావి కొండలరావు దిగ్గుమన్నాడు. 
“వద్దండీ- నాకు అలవాటు లేదు. 
ఏ సినిమాలో అలా కనుబొమ్మలు తియ్యలేదు. 
బయట తిరగడానికి ఇబ్బందిగా ఉంటుంది. 
మగాళ్ళం కదా. వద్దు లెండి” రావి అభ్యంతరం అది. 
భక్తవత్సలం బహు వాత్సల్యంతో 
“మీ ఇష్టం తర్వాత పెద్దాయన ఇష్టం!” సింపుల్ గా అనేసి ఊరుకున్నారు. 

మేకప్ పూర్తి చేసాక, మీసం కూడా అతికించాడు భక్తవత్సలం. 
“ఇంకా మీకు బొట్టు పెట్టాలి. సెట్టుకి వెళ్తే పెద్దాయనే పెడతారు” అని చెప్పేసారు. 
ముఖ్యపాత్రలకి ముఖాన బొట్టు పెట్టవలసి వస్తే రామారావుగారే దిద్దేవారు-  
అవి పౌరాణికమ్ములైనా, సాంఘిక సినిమాలైనా!  
డ్రెస్సు వేసేసుకుని సెట్లోకి వెళ్ళాడు. రావి. 
తన వెనకాలే భక్తవత్సలం గారు వచ్చి నించున్నారు. 
నందమూరి రామారావు ఈయనగారి మేకప్, దుస్తులూ 
ఎలాగ ఉన్నాయో నిదానించి చూసారు, 
మరి మొదటి రోజు కదా! 
ఆయన  అలాగ ఎగాదిగా చూస్తూ ఉంటే, 
హెడ్ మాస్టరు ముందు స్కూలు పిల్లాడిలా బుద్ధిగా 
అటెన్షన్ ఫోజులో అట్టే నిటారుగా ఉండిపోయాడు.
'బేబీ లైటు'ను తిప్పి, రావి కొండలరావు వదన పద్మము మీదికి తిప్పి, 
తేరిపార చూసి - "ఏమిటీ, ఐ బ్రోస్ (Eye Brows) తియ్యలేదేం?" క్వశ్చనించారు. 

"ఈ సార్ వద్దన్నారు. అందుకనీ …" ఆని నసిగారు భక్తవత్సలం.

“వద్దేమిటి? నో బ్రదర్! కన్ను విశాలంగా కనిపిస్తుంది. చూడండి”
అంటూ ఎన్.టి.ఆర్. చెయ్యి చాచగానే 
అప్పటికే తన చేతిలో రెడీగా ఉంచుకున్న బ్లేడును ఠకాల్న అందించారు భక్తవత్సలం. 
కొండలరావు నుదుటిమీద చెయ్యి ఆనించి, 
బ్లేడుతో సర్ సర్ ని ‘ఆపరేషన్’చేసేసారు. 
కొండలరావు నోరెత్తితే ఒట్టు. ఒక కన్ను అయ్యింది. 
రెండో కన్నునూ కడు ‘విశాలం’చేసేసారు. 
“వూ!”అని గర్జించి “బ్రదర్ కి అద్దం చూపించండి” అన్నారు. 
కొండలరావు  ముఖము మీద అద్దం ప్రత్యక్షమైంది. 

“ఎలా ఉందిప్పుడు?” రావికి ఆట్టే తేడా కనిపించలేదు గానీ  
కంటి పైన చిన్నమంట! 
“ఏం?” ఆయనే అన్నారు మళ్ళీ. 
“చాలా బాగుంది” అన్నాడు రావి అన్నగారి ముందు. 
పీత కష్టాలు పీతవి. ఏన్.ఏ.టి. లో వేషమంటే సామాన్యమా?

గీసేసిన భ్రూలతలతోటి బైట తిరిగితే చూస్తూన్నవాళ్ళు 
ఏమని అంటారో అని బెరుకు, భీతిన్నీ! 
రావికొండలరావు మనసులో అలాగ అల్లకల్లోలం సద్దుమణగనేలేదు, 
పాపం! అతనికి అప్పటికి  తెలిసింది “ఇప్పటిదాకా జరిగింది మేకప్ టెస్టు మాత్రమే
'అసలు షూటింగ్'-  అవాళ లేదు
గృహోన్ముఖుడైన కొండలరావు అవస్థలెలాగున్నవో చెప్పలేదు. 
"కొండ అద్దమందు కొంచెమై ఉండదా?"  అన్నట్లు, 
అంత గొప్ప అగ్ర నటుడు తన చేతుల్లో అద్దాన్ని పట్టుకొనగా 
తన ముఖబింబాన్ని (గజ గజా వణుక్కుంటూ
తనివితీరా తిలకించుకోగలిగిన రావి కొండలరావు  లక్కీఫెలోనే కదా!
*************************; 
రాజనాల పాట ఇందులో హై లైట్.
బండి ఎక్కి, బహు హుషారుగా అతడు పారాహుషార్ తో ఎలుగెత్తి, 
పదం లంకించుకుంటం ఒక ఎత్తు.
ఆ పాటలో రావి కొండలరావు నటనా చమత్కారం మరో ఎత్తు. 
ఎడ్ల బండి వెనుక రావి కొండలరావు పరిగెడుతూ, 
"మహ ప్రభో" అని అంటూ ఎలుగెత్తి కేక పెడుతూ running చేస్తూ ఉంటాడు. 
అప్పుడు కొండలరావు పంచె ఊడింది. తన పుట్ట గోచీని సర్దుకుంటూ - 
ఈ అనుచరుడు - రెండు చేతులూ పైకెత్తి, నమస్కారాలు పెడ్తూ - Ravi kondala rao.
సీను గొప్పగా నచ్చింది, అక్కడ సెట్ మీద - ఉన్న వారికీ; ఆనక ప్రేక్షకులకూ.
N.T.Rama Rao ఐతే- "నిజంగానే ఊడిందని- అనుకోలేదు.
రావి- కావాలనే అలాగ చేసారనీ, ఆ నాటి షూటింగులో అది  కూడా అంతర్భాగమనిన్నీ అనుకొన్నాడు.
రాజనాల ( Full nme: రాజనాలకాళేశ్వర రావు నాయుడు) విలన్ పాత్రలలో 
ఎదురు లేని నటునిగా పేరొందాడు. 
అందులోనూ ఈ సోషల్ మూవీ "వరకట్నం" లో సినిమాలో సైతం - 
రాజనాల ప్రతి నాయకుడే ఐనప్పటికీ- 
N.T.R. అతనికి తన సంస్థ నిర్మిస్తూన్న ఈ సాంఘిక పిక్చర్ లో 
పుష్కలముగా ఆక్షన్ కి ఆస్కారం ఉన్న పాటను ఇచ్చాడు- అంటే 
ఆయనకు తన సమర్ధతపై ఎంత నమ్మకము ఉన్నదో అర్ధమౌతుంది. 

************************;

రావికొండలరావ్ eye brows 
(Link: Essay: రావికొండలరావు కనుబొమలు!:-
New awa - WEB Magaine)
User Rating: / 1  
Member Categories - మాయాబజార్
Written by kadambari piduri   
Sunday, 30 September 2012 14:57

అలనాటి పాటలు1968 (Link: 
Read the full song, "akshara wanam" Blog)
;

10, అక్టోబర్ 2012, బుధవారం

మీసాల నాగమ్మ


N.T.రామారావు ఆంధ్రుల అభిమాన నటుడే కాక 
తెలుగుదేశం పార్టీ స్థాపనతో ప్రపంచానికి తెలుగు వెలుగును చాటిన మేటి నాయకుడు కూడా. 
అందువలననే, ఆయన ప్రతి చర్యా ఆంధ్రుల హృదయ  గ్రంధాలలో నిక్షిప్తమౌతూనే ఉంటుంది.

రామారావు బాల్యం నిమ్మకూరులో గడిచింది. 
విజయవాడలో S.R.R.C.V.R. College లో ఇంటర్మిడియెట్ లో చేరారు. 
ఆ కాలేజులో తెలుగు శాఖ అధిపతిగా శ్రీ విశ్వనాధ సత్యనారాయణ ఉండేవారు. 
విశ్వనాధ "రాచమల్లు దౌత్యము" అనే నాటకాన్ని విద్యార్ధుల చేత ప్రదర్శింపజేశారు. 
అందులో నాగమ్మ పాత్రను తారక రామారావును ధరించమన్నారు. 
రామారావు అందుకు అంగీకరించారు. ఐతే ఇక్కడ ఒక చిక్కు వచ్చి పడింది. 
నాగమ్మ పాత్ర కోసమని మీసాలు తీసేయమన్నారు గురువు గారు. 
నూనూగు మీసాల నూత్న యవ్వనంలో అడుగిడుతూన్న రామారావు అందుకు ఒప్పుకోలేదు. 
చివరికి చేసేది లేక "అలాగే!నీ ఇష్ట ప్రకారమే చేయి" అన్నారు. 
అలా మీసాలతోనే స్టేజీ మీద నటించి, 
ప్రైజు కూడా కొట్టేసాడు మన హీరో.


*****************;ఆ కాలేజీలో                                       "మీసాల నాగమ్మ" అనే నిక్ నేమ్ ను కూడా సంపాదించాడు రామారావు.

*****************;

ఆశ్చర్యకరంగా సినీ హీరోగా స్థిరపడిన తరువాత 
పల్నాటి యుద్ధం సినిమాలో నాగమ్మ ప్రతిద్వంద్వి -
ఐన బ్రహ్మన్న పాత్రను 
అద్భుతంగా పోషించారు రామారావు.


*****************;


 శ్రీనాధ మహాకవి                      "పల్నాటి వీర చరిత్ర" ను రచించాడు. 
తెలుగునాట నిజముగా జరిగిన  చారిత్రక గాధ ఇది. 
;
కోడి పందాలు ( = Cock Fight) దాయాదుల పోరు- 
బాలచంద్రుని సాహసాలు; 
ఇన్నీ కలిసి - తెలుగు నాట ఉర్రూతలూగించిన 
అద్భుత గాధ ఇది.
చిత్రమేమిటనగా మొత్తము కథ - మహా భారతము-కు 
మక్కీకి మక్కీగా గోచరిస్తుంది.

 శ్రీ నాధుడు (1365–1441) చాటు పద్యములు ప్రసిద్ధి కెక్కిన కవివరేణ్యుడు.
 శ్రీ నాధుడు ప్రౌఢ కవి- రచన "
పల్నాటి వీర చరిత్ర
" .

ఇది తెలుగు భాషలో మొట్టమొదటి చారిత్రక వీర  ద్విపద కావ్య రాజము.
తెలుగులో రెండుసార్లు (
1947, 
1
966
)- పల్నాటి కథ - సినిమాగా వచ్చింది.


1
.
పసుపులేటి కన్నాంబ; అక్కినేని నాగేశ్వరరావు, గోవింద రాజుల సుబ్బా రావు ప్రభృతులు 


2. భానుమతి, అంజలీ దేవి, హరనాధ్, వాసంతి, N.T. R
a
m
a R
ao
 మున్నగువారు)నాయకురాలు నాగమ్మ  ;

"నాయకురాలి మాయ కదనంబున, మా పలనాటి పౌరుష
 శ్రీ యడుగంటె? గడ్డి మొలిచెం బులిచారల గద్దె మీద; గెం
 జాయ మొగాన గ్రమ్మ జలజ ప్రమదామణి నాగులేటిపై
 వాయుచున్న దిప్పటికి బాలుని శౌర్య కథా ప్రబంధముల్ "

                                         (By: గుర్రం జాషువా)
నాగులేరు- కెరటాల ఘోషలో -
పలనాటి ఆవేష కావేషాల రణదుందుభివినబడుతూంటుంది.
అందుకే శ్రీ నాధుడు- మాచర్ల చెన్నకేశవ స్వామికి అంకితము ఇచ్చిన ఈ కావ్యము-
ఆ బాల గోపాలమూ చదువ వలసిన గ్రంధ రత్నము ఇది.మీసాల నాగమ్మ (Newwky: Web)
Member Categories - మాయాబజార్
Written by kusuma   
Tuesday, 11 September 2012 11:24 

;

2, అక్టోబర్ 2012, మంగళవారం

గోరింట మన ఇంట… గోరింటాకులో “లావ్సొన్” అనే రసాయనము ఉన్నది. 
మనిషి చర్మము పొరలకు మంచి ఎరుపు రంగు వస్తుంది.
గోరింటాకులో :- లాసోన్ (Naphthochinon (Lawson) in Henna Farben)తోపాటు 
మైనైట్, గ్యాలిక్, నాఫ్థోక్వినైన్ మున్నగు యాసిడ్ లు, కెమికల్సు ఉన్నవి. 
మన చర్మము పొరల రంగును హేతువు “కెరటిన్” అనే ప్రొటీన్.
ఇది – మానవుల అఱచేతులు, అరికాళ్ళు, వెంట్రుకలలో ఎక్కువ ఉంటుంది. 
అందువలన ఇవి గోరింటాకులోని లావ్ సిన్- తో
త్వరగా రసాయన ప్రక్రియకు లోనై, ఎర్రగా పండుతాయి.
ఈ రంగులోని రమ్యత- “గోరింట పంట” గా తెలుగువారిలోనూ, భారతీయులలోనూ వాసికెక్కినది.
దేవులపల్లి క్రిష్ణశాస్త్రి రచన “గోరింట పండింది, కొమ్మ లేకుండా… ” మనోజ్ఞము.
“గోరింటాకు” సినిమాలోని ఈ పాటకు, ప్రాచీన బాల గేయ ఫణితి మూలాధారము.
గోరింటాకును బాగా మెత్తగా రుబ్బి, ఆ ముద్దను అరచేతుల్లో డిజైన్లుతో పెట్టుకోవడము 
భారతదేశములో అనాది నుండీ ప్రాచుర్య ఆచరణయే- అని సుజన విదితమే! 
గోరింట ను హెన్నా, మెహిందీ అనే పేర్లు నేడు బాగా వాడుకలో ఉన్నవి.
జపాన్ లో గోరింట అతి ప్రాచీనమైనది. {గోరింటాకులో “పత్రహరితము” (=”క్లోరోఫిల్”) తో పాటు, కొన్ని యాసిడ్సు ఉన్నవి.
ఇలాటి ఆమ్లముల గుణము కలిగిఉన్నట్టి “ఫినాల్సు” ద్వారా 
మనిషి చర్మము గోరింటాకు రసము తాకి- ఎర్రగా మారుతుంది.
చర్మము పై పొరల కణాల స్థానములో – కొంత కాలానికి కొత్త కణములు జనిస్తాయి. 
అప్పుడు పాత స్కిన్ కణజాలముతో పాటే- గోరింట వలన వచ్చిన అరుణ వర్ణ కణజాలము కూడా పోతుంది,
కాబట్టి “హెన్నా పంట మెరుపు” తాత్కాలికమే! 
గోరింటాకు చేతులు, గోళ్ళు,పాదములకు పెట్టుకుంటారు.
పండిన తర్వాత కొంచెం నిమ్మరసమును, లేదా జామాయిల్ నూ, కొందరు కొబ్బరినూనెనూ, 
మరి కొందరు టీ తేయాకు రసమునూ, కాఫీ డికాక్షనునూ కూడా 5. 6 బొట్లు చేతుల్లో రాస్తారు. 
ఈ క్రియ గోరింట పంటను ఇనుమిక్కిలి రంగుగా కనిపించేలా జేస్తుంది.
అంచేత- “గోరింట”ను మళ్ళీ మళ్ళీ పెట్టుకోవడం ఒక సరదా! 
పెళ్ళిళ్ళు, పండుగలూ పబ్బాలూ, శ్రీమంతము ఇత్యాది సందర్భాలలో
మెహిందీ ఒక సంబరపు వేడుక! గోరింటాకు ఉపయోగాలు అన్నీ ఇన్నీ కావు.
ఫ్యాషన్ వరల్డ్ లోనే కాక, ఆయుర్వేద, అల్లోపతి ఎట్సెట్రా లలో సైతం అపరిమితముగా ప్రజలు వాడుతూన్నారు.
అందుకే ఇప్పుడు – విపణివీధులలో గుట్టలు గుట్టలుగా – 
ముఖ్యంగా సందర్భాలలో విక్రయములు సాగుతూoటాయి.
గోరింట చెట్టు – Magnolio pyta , మరియు, magnoliopsida ; 
క్లాస్ లోని Myrtales అనే వర్గమునకు చెందినది.
గోరింటాకును పెద్ద మొత్తములుగా వాణిజ్య పంథాలో అనేక మధ్య ప్రాచ్య దేశాలలో పెంచుతున్నారు.
మొరాకో, అల్జీరియా, యెమెన్, ట్యునీషియా, ఈజిప్టు, ఇరాక్, ఇరాన్, ట్యునీషియా, పాకిస్థాన్, బాంగ్లాదేశ్ మున్నగు కంట్రీలలో గోరింటాకును వ్యవసాయ క్షేత్రములలో పండిస్తున్నారు.
ఇండియాలో – అనేకగృహములలో గోరింటచెట్టు పెరటిమొక్కగా ఉంటుంది. 
రాజస్థాన్ లోని ‘పాలీ’జిల్లాలో
గోరింట తోటలు భారీ ఎత్తున వాణిజ్యపరముగా- పెంచబడుతూన్నవి.

**                    **                       **                              **                                 **
             శ్రీమద్రామాయణము నాటినుండీ స్త్రీల ఆభరణ అలంకారాది విభాగములలో-
 గోరింట – ప్రాచీన స్వరూపములు పునాదులుగా అగుపిస్తున్నవి.శరీరముపైన యువతీ యువకులు,
ఆబాలగోపాలమూ రకరకాల రంగులతో బొమ్మలను చిత్రించుకునే వారు.లత్తుక, ఆకు పసర్లు, పుష్ప రసములు, పూల పుప్పొడి,
కాంచన/ బంగారు పొడుల రజనులూ వాడేవారు.”మకర పత్ర, పత్రికా రచనలు” మొదలైన పేర్లు ఉన్నవి. తులసీదాసు , శ్రీరామ జననము, శ్రీరామ పట్టాభిషేకము వంటి పండుగసంబరములు జరుగుతూన్న తరుణములలో -
అయోధ్యలోని తరుణీమణులు, వనితారత్నములు- మేనులపైన చిత్రించుకున్నారని – విపులముగా హృద్యంగమ వర్ణన చేసాడు.
శాకుంతలము ఇత్యాది ప్రబంధములలో ఈ వర్ణనలు ఆ నాటి వైభవాలకు వైజయంతీ ధ్వజములు.

చిత్ర రేఖలు:- మకర పత్ర, పత్రికా రచనలు” “మకర పత్ర, పత్రికా రచనలు”
కిష్కింధకాండ- లోని 30 వ సర్గలో ఒక అందమైన వర్ణనను చూద్దాము.
“నదీ ఝరులలో మీనములు ఈదాడుతూన్నవి. చెట్ల ఆకులు నీళ్ళలో పడుతూన్నవి. ఛార్వాక పక్షులు ,
సరస సల్లాపములలో ఉన్న జంటలు – తీరము సౌందర్యభాసితమౌతూన్నది. ఫరచిన పట్టు / సిల్కు వస్త్రముపైన వేసిన సుందర చిత్రలేఖనము వెలసినట్లున్నది. ఈ దృశ్య పరంపరలు- కన్యా మణుల వదనములపైన –
కుంకుమలు (vermilion) , బొమ్మల- “చిత్ర రేఖలై” శోభాయమానమౌతూన్నవి

**                             **                              **                           **                            ** 

గోరింట పంటకు ఉక్రోషము కలిగినదట! 
ఎందుకనీ? ఏమిటీ? ఈ చమత్కారాన్ని, చిన్న గీతికలో పరికించగలము.

గోరింట ఎందుకో అలిగినది!
ఆ కినుకకు కారణమరసేరా!? ||

రాధా దేవీ అరచేతులలో/
కుదురుగ ఉండిన గోరింట ;
వెలతెలబోయేనెందుకనీ!
ఆ హేతువు నరసీ తెలుపండీ! ||

కందుక క్రీడకు పిలిచెను క్రిష్ణుడు;
బంతి ఆటలో భామలు అలిసిరి ;
ఆడీ ఆడీ మా రాధమ్మ
కర కమలములు కందినవి! ||

లేత చర్మము కందిన ఎరుపు!
ఎర్రని చేతుల కందినది-
అరుణవర్ణము క్రమ్మరగానే
ఇతర వన్నెలు మాసినవి ||

కమిలి పోయిన హస్తములందలి;
ఆ అరుణ వర్ణమున తన పంట
అంతయు; వెలతెల బోయెననీ;
గోరింటకు ఆయెను- తెగ గుబులు!
గోరింటకు ఆయెను- తెగ గుబులు!
అందుకనే ఈ ఆగ్రహము!
ఆపలేని ఈ ఉక్రోషం ||

**                            **                        **                           **                       ** 

గోరింటాకుకూ, హెన్నాకూ భేదమేమిటబ్బా?

మెహిందీ= అంటే చెట్టు ఆకులను నూరి, చేసిన గోరింటాకు – ఇది కేవలం గోరింటాకు- అన్న మాట.
ఐతే ఈ రోజులలో హెన్నా సైతమూ ప్రధాన అలంకరణసాధనము ఐనది. 
చాలామంది గోరింటాకుకూ, హెన్నాకూ- ఈ రెండింటినీ ఒకే వస్తువు- అని భ్రమిస్తూంటారు.
కానీ పై రెండు వస్తువులకూ కొంచెం తేడా ఉన్నది. 

మెహిందీ (గోరింట) ఒడలుపై చిత్రించే అలంకారములు.
“హెన్నా” ను “కేశపాశముల కోసమై” ఉపయోగిస్తారు
తలలో చుండ్రు, పేలను నివారిస్తుంది, శరీర వేడికి విరుగుడుగా- చలువ చేస్తుంది హెన్నా.
అన్నిటికంటే ముఖ్య విశేషము- జుట్టుకు రంగు కలిగిస్తుంది. నల్లని కురులకోసమే పరిమితము అవలేదు హెన్నా,
ఇది జుట్టుకు కోరుకున్న కలరులను చేకూర్చుతుంది.
దీనికై నిపుణులు హెన్నాలో – గోరింటాకును ఎండబెట్టి చేసిన పొడిని,
దానితో పాటు ఇతర మూలికలను కలుపుతారు.కచ్చూరాలు, మందార పూవులు, పూలూ, ఆకులూ
ఇత్యాది హెర్బల్సు తో కలిపి హెన్నాను చేస్తారు.
వీటన్నిటినీ మించిన అంశాలు కూడా ఉన్నవి. నిడుపాటి ఆరోగ్యకరమైన కురులకై మహిళలు అనేక పద్ధతులలో తలనూనెలను వాడుక- మన దేశములో అతి ప్రాచీన సాంప్రదాయము.
హెయిర్ ఆయిల్సు లో గోరింటాకును- విరివిగా వాడుతూంటారు. 
అందుకే సాహిత్యములో – పద్యాలూ, పాటలూ, ఆటలలో
– “గోరింట/ గోరింటాకు” ల ప్రాధాన్యత సాక్షాత్కరిస్తూంటుంది.మన ఆంధ్రదేశములో- ఈ పేరుతో పల్లెలు, ఊళ్ళూ దర్శనమిస్తూన్నవి.
గోరింట, గోరంట్ల, అనే గ్రామాలు అగుపడుతూన్నవి.
ఆయా villages లో ఈ గోరింటాకు మొక్కలూ, చెట్లూ 
అధికముగా ఉండటముచేత ఈ పేర్లు పొందిఉండవచ్చును.


ఆణిముత్యపు గోరులందు గోరింట


గోరింటాకు చెప్పే రహస్యాలు:- 

గోరింట ! చెప్పవమ్మ!
ఆ ఊసులను! ||

తన, అర చేతను చేరి
మందారం నుడువులై
గుస గుసలు ఏమిటో?
ఆ ఎద పలుకులు ఏమిటో!? ||

సింధూరం భాషవయీ
గీర్వాణీ నవ రచనగ
గుస గుసలు ఏమిటో?
ఆ ఎద పలుకులు ఏమిటో!? ||

అర చేయిని తాను
ఆర,బెట్టుకునే వేళలలో
సందె వెలుగు ముసిరి
గుస గుసలు ఏమిటో?
ఆ ఎద పలుకులు ఏమిటో!? ||

**                    **                     **                                 **                              *

నేడు హెన్నా, గోరింటాకు పౌడర్ లూ పరస్పరమూ పర్యాయపదాలైనవి 
అటు పద వ్యవహారములోనూ, 
ఇటు నిత్య జీవన విధానములో ఆహ్లాదాన్ని ఇనుమడింపజేసే అలంకారముగానూ- !!!!!

సంస్కృతములో మదయంతికా, మెంధి, మెంధిక, నఖరంజని – మొదలైన 
(Madayantika, Mendhi, Mendhika, Nakharanjani) నామావళి.
తమిళభాషలో “Maruthani ilai (leaves)”అని అంటారు. 
మదన,మార, అనగా- మన్మధుడు- అని అర్ధములో – 
ఇది చాలా భావ స్ఫూర్తి కల పదము.

ఇంతకీ మన అచ్చ తెనుగు పదము – 
“గోరింట” ను రవ్వంత క్రీగంట చూసి, అర్ధమేమిటో కనుక్కోండి, చూద్దాం!!!!
గోరు+ఇల్లు:- గోరునే ఇల్లు- గా చేసుకున్న ముచ్చటైన ఆకు ఇది.
"గోరింట” – అనే మాటకు ఉన్న వ్యుత్పత్తి అర్ధ, భావము -
బహు ముచ్చట గొలుపుతూన్నది కదూ! 
అందుకే గోరింటాకుకు ఇదిగో! – సాహితీ తోరణము……..

ఈ ఆధునిక కాలములో – “మెహిందీ కళ ” ను అద్భుత కళగా రూపొందినది. 
ఈ మంచి పరిణామమునకు కారణము “టాట్టూస్ ఫాషన్” ; 
ఈ fashion వలన ప్రపంచవ్యాప్తముగా- భారతీయ మెహిందీ ఆర్టు – ప్రత్యేక గుర్తింపును పొందినది. 
ఎంతోమందికి ఉపాధిని కల్పిస్తూన్న కళకు – మూలస్తంభము. 
గోరింటాకు.లక్షలాది బ్యూటీ క్లినిక్ లు అగణిత సేవలు అందిస్తూన్నాయి.
గోరింటాకుకు- అనుకరణలుగా- కృత్రిమ పద్ధతిలో ఎరుపు వర్ణద్రవమూ, 
అలాగే అనేక ఇతర రంగులు కుటీరపరిశ్రమలుగా పురోభివృద్ధి గాంచుతాయి.
** ** *******************
“షోడశ కళానిధికి షోడశోపచారములు..” అన్నమాచార్య కృతి సుపరిచితమే!
షోడశ- షట్ + దశ= 16 అనే సంఖ్యకు అనేక స్థానాలలో అనేక అంశాలలో ప్రముఖమైనది.
షోడశ శృంగారములు; అనగా 16 సింగారములు.
వీనిలో షోడశ శృంగారములు; అనగా 16 సింగారములు.
1. కేశపాశ సుగంధీ కరణ,
2. హస్త సుశోభితం,

“సోలహ్‌ సింగార్‌" :  (सोलह् सिंगार् )పదహారు కళలలో -

1. కుంతల పరిమళ క్రియ;
2. కర చిత్రాలంకరణ- లు అంతర్భాగములు. 
వీనిలో గోరింటాకులు తప్పనిసరి అవసరములు.
ఉత్తరభారతావనిలో – “సోలాహ్ సింగార్”అనే పేరుతో సుప్రసిద్ధమైన ఆచారము ఇది. 
వధూ వరులను సింగారించేటప్పుడు, ఉదయ స్నానము- నలుగు పెట్టి, మొదలిడి, 
వరుసగా పదారు రకములను వారిని అలంకరించుటలో – వస్తాయి.
అనేక హిందీ, స్థానిక భాషలలో "सोलह् सिंगार् ” పాటలున్నవి. 
మన ఆంధ్రుల వాడలలోని “వరుస పాటలు” వంటివే! 
కానీ,ఈ సోలాహ్ సింగార్” / सोलाह् सिन्गार् చిరు చమత్కారముమాత్రమే ఉంటాయి.
ఉదాహరణకు “శ్రీ గౌరీదేవిని అలంకరిస్తూ, పరమేశుని గురించి, 
ముచ్చట్లు చెబుతూ సాగే పాటలు మున్నగునవి.
కొత్త చైతన్యాన్ని సౌందర్య లోకానికి గోముగా అందించిన 
ఈ మన గోరింటాకుకు జేజేలు పలుకుదాము!!!!!!!
సరేనా!!!!

సంబరముల గోరింటాకు:- (పార్ట్ 1)

మళ్ళీ ఇంకొకసారి- ఆధునిక స్వరూపాలలో అవతరిస్తున్న- గోరింట డిజైన్ లను- కృత్రిమ పద్ధతిలో లిక్విడ్ లనూ,

స్టికర్సులనూ,టట్టూలనూ గురించి తెలుసుకుందాము.
అలాగే మెహిందీ ఉపయోగిత పరికరములను
తెలుసుకుందాము.

గోరింటాకును కొమ్మలు వంచి, జాగ్రత్తగా కోసి, 
(అందులోనూ గోరింట చెట్టు కొమ్మలకు ముళ్ళు దండిగా ఉంటాయి కూడానూ!
రుబ్బి, అలాగ రుబ్బుకున్న గోరింటాకు ముద్దను ఒక బాదం ఆకులో పెట్టుకుని, 
తీరిగ్గా కరకమలములకూ, పాదపద్మములకూ పెట్టుకునేవాళ్ళు.
ఆడవాళ్ళు చీకటి మంచాన లేచి, పొయ్యి వెలిగించి, గృహకార్యాలకు నాంది పలికేవాళ్ళు. 
ఇక వంచిన నడుము ఎత్తకుండా పనిలో మునగానామ్ తేలానామ్;……
ఎలాగో భోజనాలు అవీ కానిచ్చి రాత్రి తీరిక ఛిక్కించుకుని, తీరిగ్గా
ఒకళ్ళ హస్తములలో ఒకళ్ళు గోరింటాకును పెట్టుకునే వాళ్ళు. 
నూరి తెచ్చిన ఆకుల ముద్ద – 
కాబట్టి ఆట్టే డిజైన్ లను ఆశించేవాళ్ళుకాదు.

అరచేయిలో _ కొనలలోనొక్కులు, వంపులు ఎక్కువగా ఉన్న ఆకునో, పువ్వునో పెట్టి
ఆ పైన గోరింటాకు ముద్దను- మెత్తుతారు. అలాగ చిన్న చిన్న డిజైన్ లను పెట్టేవారు.

ఊసులాడే వేళ 
అంతే కాక- కరిగించిన మైనముతోకూడా అప్పటివారు- గోరింటాకు డిజైన్ లకై వాడేవాళ్ళు.

మంచి డిజైన్ కోసమైవేడి వేడి మైనమును- చుక్కలు చుక్కలుగా- 
వేయించుకునేవారు. వలలాంటి అలాటి బొమ్మలను 
తమతమ హస్తపద్మములలో- చూసుకోవాలని- 
పాపం! అంత వేడినీ భరిస్తూండేవారు. 
(ఇప్పుడు అట్లాంటి అవస్థలు లేకుండానే- కోన్ వంటి మోడరన్ మెథడ్సులతో- 
అనితరసాధ్య చిత్రములను చర్మముపై దించుతూ, 
"ఔరా!" అనిపిస్తూన్నారు- మెహిందీ డిజైనర్స్- 
మరి వీరు "ద్వితీయ బ్రహ్మలే కదూ!") 


ముందస్తుగా చిన్న పిల్లలు కిలకిలలాడుతూ చుట్టూ మూగేవాళ్ళు. 
ప్రౌఢ స్త్రీలు, యువతులూ “గోరింటాకు”ను
అందరి అఱచేతుల్లో పెట్టే కార్యక్రమానికి ఉపక్రమించేవాళ్ళు.
కథలూ, కబుర్లూ, కబుర్లూ, కాకరకాయలూ, ఆషామాషీ ముచ్చట్లు
అన్నీ అప్పటి “లోకాభిరామాయణము”లో నేలపై పారబోస్తూన్న గోళీకాయల్లాగా దొర్లేవి. 
అరిచేయి చాపి బుద్ధిగా కూర్చున్న బాల బాలికలకు, 
ముందు చిన్న గోలీ అంత ముద్దను, పెట్టి, సుతిమెత్తగా అద్దుతూ, పరిచేవారు.
“ఇదిగో! ఇది చందమామ!” అనేస్తూ, మరింత చిన్న గోరింట ముద్దను తీసుకుని, 
ఆ జాబిల్లి చుట్టూతా – నక్షత్ర మణులు” అనేవాళ్ళు. 
ఈ చంద్రుడూ, ఆ తారలూ – పండిన తర్వాత ఎఱ్ఱగా – వారి దోసిళ్ళలో మెరిసేవి.

  **                       **                         **                            **                          **               

ఈ ఆధునిక కాలములో – గ్రైండర్ లూ, మిక్సీలూ, గాస్ స్టవ్ లూ వచ్చేసినవి. 
మరి పని తేలిక ఐనది. అలాగే – గోరింటాకు పంట కూడా 'సూక్ష్మంలో మోక్షం' లాగా సులభ మార్గాలు 
అమలులోకి వచ్చేసినవి. కోన్ లలో రెడీమేడ్ గా ఉన్న గోరింటాకు అంగడిలలో అమ్ముతున్నారు. 
ఫ్యాన్సీ షాపులనుండి “మెహిందీ కోన్” లను కొని తెచ్చుకుంటే చాలు, 
చిటికెలో నఖ, హస్త, చరణాదుల సింగారాలు పూర్తి ఔతున్నాయి.
కోన్ లలో గోరింటాకు పసరుముద్దలు – డైరెక్టుగా, కూరి నింపుతారు.
వాటిని మించినవి – red liquid లు- సెంటు బాటిల్ అంత సీసాలలో లభిస్తూన్నవి.

ప్రస్తుత వక్తవ్యాంశములు రెండు …………..

అవి ఏమనగా ……

1 ) కోన్ లను ఎలా తయారించ వచ్చును?

2 ) చిట్టి సీసాలలో లభిస్తూన్న అలాటి “ఎర్రని గోరింట ద్రావణము” లను
ఇంట్లో స్వయానా ఏ మెథడ్ లో చేసుకోవాలి? అనేది!ఇదిగో! ఒకానొక తెలిసిన పద్ధతి.మరి చూడండి!

కోన్ ల తయారీ ని మొదట చూద్దాము :-

అరలీటర్ పాల కవర్ సైజులోని పాలిథిన్ కాగితాన్ని తీసుకోవాలి. ఈ సైజు షీట్ లతో- నాలుగు కోన్ లను తయారు చేసుకోవచ్చును.
దీర్ఘ చతురశ్ర ఆకారంలో ఉన్న షీట్ ముక్కను- సమోసా మాదిరిగా మడత పెట్టుకోవాలి.అంటే మిఠాయి పొట్లం వలె చుట్టి పెట్టుకోవాలన్నమాట!
అలాగ ఐస్ క్రీం కోన్ మాదిరిగా చుట్టి ఉంచిన – దానిని సెల్లో టేపుతో అంటించాలి.
కోన్ అంచులను బాగా – తమలపాకులాగా మడత పెట్టాలి.
వీలైతే, చిటికెన వేలి మందంలో, మీ అరచేతిలో పట్టేటంత పొడవుగా- కోన్ ను చేసుకుంటే 
మెహిందీ ఆర్ట్ డిజైన్ లను తేలికగా వేసుకోగలరు.

Lord Krishna putting Mehandion Radha's hand


 **                       **                              **                            **                           **

గోరింట పూచింది……

1) మెహిందీ పొడిని వస్త్ర గాలితం పట్టాలి. వస్త్రగాలితం- అంటే పలచని వస్త్రాన్ని జల్లెడ లాగా వాడటము.గోరింట పొడిని వస్త్రములో వేసి, జల్లెడ పడితే-మెత్తని పొడి లభిస్తుంది.అలాంటి మెత్తటి పొడి ఐతేనే- కోన్ లో స్మూత్ గా జారుతుంది.
మామూలుగా- బాగా పండడానికి- గోరింటాకులో గానీ, మెహిందీ పొడిలో గానీ కొన్ని పదార్ధాలను కలుపుతూంటారు.
నిమ్మరసము/ యూకలిప్టస్ ఆయిల్, లవంగ నూనె/ ఆయిల్/ కాఫీ డికాక్షన్ – వీటిలో ఏదో ఒక దినుసును నాలుగైదు బొట్లు వేసి మిళితం చేసి, వాడుకొనవచ్చును.

    **                          **                          **                                **                         **

కోన్ లో గుజ్జులాగా అయ్యే వరకూ- మెదిపిన మెహిదీని వేసుకోవాలి.ఇలాగ రెడీ ఐన కోన్ మెహిందీతో అరచేతులకూ, అరి కాళ్ళకూ, పాదాలకూ నచ్చిన డిజైన్ లతో ఇంచక్కగా అలంకరించుకోవచ్చును.

   **                         **                           **                          **                               ** 

ఇక రెండో  పధ్ధతి:-

“ఎర్రని గోరింట ద్రావణము” –  గోరింట మన ఇంట చేసేద్దామా?

  **                         **                           **                            **                                ** 

 కావలిసినవి :-

ఇంట ఈ రెడీమేడ్ గోరింట పంట- సిద్ధపరుచుకునేటందుకు కావలసిన వస్తువులు రెండే!

100 గ్రాములు బెల్లము (गुड़ /शक्कर/ jaggery)

చెంచాడు కుంకుమ-

మరి రెండు ఇవి! – ఇంతే!

చేసే పద్ధతికూడా చాలా సులభమే!

   **                       **                       **                            **                                  **

పధ్ధతి  :

మందమైన గిన్నె( Pan):
అంచు ఉన్న ప్లేటు (Plate):
ఇక్కడ కావలసిన ముఖ్యమైన వస్తువులు.
ఇత్తడి గిన్నెలు వగైరాలు అందుబాటులో లేని వారు-ఇనుపడబ్బాలు –
“పారేసినా ఫర్వాలేదు!“ – అనిపించే దాన్ని వాడండి.
పాత్రను ప్లేటుతో గానీ, కంచముతోగానీ పూర్తిగా మూసిఉంచాలి.
ప్లేటు గనుక ఐతే- దానిలో నీళ్ళు పోస్తే ఉండగలిగేలాగా-
ఆ ప్లేటుకు అంచు ఉండాలి. కంచము లాంటిది .

  **                       **                        **                                 **                                  **

step 1 :- డబ్బా లోపల కొంచెము మందముగా బెల్లము (జాగరీ)ను అంటించాలి. ఇలాగ మెత్తిన Jaggery మధ్య చిన్న గురుగు చేయాలి. అందులో నడుమ చిన్న గ్లాసు (లోటా)ను నిలిపి ఉంచాలి.గ్లాసు(లోటా)ను నిలిపి ఉంచాలి.

   **                      **                          **                                  **                                  **
step 2 :- ఇక డబ్బా పైన(/గిన్నె పైన) అంచు ఉన్న పళ్ళెము/ కంచమును మూత పెట్టాలి. ఈ ప్లేటులో నీళ్ళు నింపాలి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టాలి. (ప్లేటు/ లేదా గుండ్రముగా అడుగు కలిగిఉన్న గుండు గిన్నెను పూర్తిగా మూసిపెట్టేది ఐ ఉండాలి;
అప్పుడే – ఆవిరి చుక్కలు-మెల్ల మెల్లగా సెంటర్ కి జారుతూ చేరికింద ఉంచిన గ్లాసులో – బొట్టు బొట్టుగా నిండుతుంది.)

(స్టవ్వు వెలిగించడము మరువకండీ!!!!  )

step 3:- బర్నర్ సిమ్ లో సన్నపాటి సెగతో ఉండాలి.
ఇలాగ “లో వెలుగు”లో 15 నిముషాల వరకూ ఉంచాలి.

step 4 :- లోపలి బెల్లము {गुड़ (शक्कर} బాగా మరిగి, మాడుతూన్నపుడు-
అది ఆవిరిగా మారుతుంది.
ఆ బెల్లపు ఆవిరి కాస్తా – పై మూతకు తాకి, చుక్కలు చుక్కలుగా అంటుకుని, జారుతాయి.
అలాగ జారుతూన్న ఎర్రటి ఆవిరి ద్రవము- కింద ఉంచిన బుల్లి లోటాలోకి పడ్తాయి.
బొట్టు బొట్లుగా పడిన ఎర్రటి ద్రవముతో నిండిన గ్లాసును జాగ్రత్తగా బైటికి తీయాలి.
ఈ ద్రవమే – మనకు ఉపయోగపడే “గోరింట” అన్న మాట!గృహసామ్రాజ్య- మెహిందీ చుక్కలు సిద్ధం! సిద్ధం!

చిన్న పుల్లతో ఈ మెహిందీని నచ్చిన డిజైనులతో అరిచేతులలో పెట్టుకోవడమే తరువాయి.అన్నట్టు లిక్విడ్ చల్లారాక నెమ్మదిగా హస్తాలంకరణలను ముచ్చటగా తీర్చిదిద్దుకోవచ్చును.

   **                          **                             **                              **                             **


- కాదంబరి 
గోరింట మన ఇంట…(Link: vihaMga, magazine)
Posted on September,2012 by విహంగ 
http://vihanga.com/?p=5188 

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...