30, జనవరి 2012, సోమవారం

కోవిదార మహల్, కేరళ


Kowidar Palace, Thiruvananthapuram 

;
దేవకాంచనం చెట్టు, శ్రీరామ చంద్రుని సోదరుడైన 
భరతుని ధ్వజ చిత్రము- గా విలసిల్లినది. 
ఈ పాదపము ప్రాచీన భారతావనిలో విశిష్ట స్థానాన్ని పొందింది.
కేరళ రాష్ట్రములోని తిరువనంతపురము- వద్ద 
(ట్రావెన్ కూర్)
"కోవిదార భవనము" ఉన్నది. 
అంటే ఆ మహలులోని ఉద్యానవనములలో 
ప్రాచీనకాలములో కోవిదారములు/ దేవకాంచన పాదపములు 
విరివిగా ఉండేవి కాబోలును.


దేవకాంచనం' చెట్టు శ్రీరామ చంద్రుని సోదరుడైన 
భరతుని ధ్వజ చిత్రము- గా విలసిల్లినది.
ట్రావెన్ కూర్ రాజవంశీకుల (Travancore,)నివాసము 
ఈ కోవిదారములోని భవంతి. 
సాక్సన్-ట్రావెన్ కూర్ స్టైల్ లో ఈ కోవిదార్ పాలెస్ నిర్మించబడినది.
ట్రావెన్ కూర్ రాజులలో ఆఖరి వ్యక్తి "మహారాజా చిత్రా తిరుణాళ్". 
ఆయన విశ్రాంతి భవనము ఇందులోని "పంచవడి". 
ఈ మహలులోనికి ఇతర సందర్శకులకు అనుమతి లేదు. 
అందుచేత అందరూ ప్రవేశించి చూసే వీలు లేదు.
ఐతే చెట్టుకూ - ఈ సీమకూ గల అనుబంధమును గురించి- 
పరిశీలనలు చేయవలసిన ఆవశ్యకత ఉన్నది. 


]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]


कोविदार (कचनार);
ఆధార పదములు:-
current residence of Maharaja of Travancore and the royal family 
and is prohibited for the public;;; 
wonderful building built in Saxon-Travancore style;;; 
Panchavadi,
      resting place of Late His Highness Maharaja Chitra Thirunal
                  the last King of Travancore, 
దేవకాంచనం'  कोविदार (कचनार);
భరత ధ్వజముపైన కోవిదార పాదపము చిత్రణ;
;
कोविदार (कचनार); గండకీ పత్రం (దేవకాంచనం)(Link 2)
Worship God Ganesha(Thelugushakthi.kom)
;

29, జనవరి 2012, ఆదివారం

మాగ్జిమియానీ పోర్టాస్ - మొక్కవోని ఆర్యన్ (నాజీ) విశ్వాసిఏథెన్స్  లోని మహా హర్మ్యము 
19వశతాబ్దిలో నిర్మించబడినది. 
ఆ భవంతిపైన "స్వస్తిక" గుర్తు ఉన్నది. 
అదీ విశేషం. ఆ భవనమును రూపకల్పన చేసింది 
హైన్ రిచ్ అనే జర్మనీ భవన నిర్మాణవేత్త,
వాస్తు నిపుణుడు దీనిని నిర్మించాడు. 


సావిత్రీదేవి ముఖర్జీ (మాగ్జిమియానీ పోర్టాస్)
మాగ్జిమియానీ పోర్టాస్ (Maximian Portas) అనే ఫ్రెంచ్ వనిత జీవితాన్ని 
మలుపు తిప్పిన సింబల్ ఈ స్వస్తిక్ .
ఆమె "ఆర్య జాతి గురించి గొప్పది"అనే 
అభిప్రాయాలను కలిగి ఉన్నది. పురాతన కాలము నాటి ను౦డీ 
చరిత్రలో ఆర్యులు ఉన్నత ఆశయాలు, ప్రకృతి ఆరాధకులు 
సున్నిత భావజాలములు కలవారు,
"ఆర్యులు ఎక్కడివారు? 
ఎచ్చటనుండీ వారి పుట్టుపూర్వోత్తరముల మూలము ఉన్నది?" అనే 
సందేహాలు పొడిమాయి.
అప్పటినుండీ ఆ దిశగా పరిశీలనాత్మక పరిశోధనలు చేయ నారంభించినది.


"ఆర్యులు ఎవరు? నేటి ఆధునిక యుగంలో వారు ఎక్కడ సుప్రతిష్ఠులై కానవస్తునారు?" 
అనే అంశాన్ని ఆమె శోధనను కొనసాగించినది. 
ఈ అన్వేషణకు గమ్యము ఆమెకు తటస్థపడినది. 
ఆర్యజాతి భారతదేశములో పావన జీవన మార్గములలో కొనసాగుతూన్నది. 
ఆర్యులు ఆరాధించే దేవతలను, ప్రకృతినీ హిందువులు పూజిస్తూన్నారు. 
నడవడిక, ప్రవర్తనా సరళి- ఉదాత్తమైన ఆర్యుల ఆశయాల అనుసరణ,
భారతీయులు ఆచరణలో నవ పల్లవముగా ఉన్నది.


"హిందువులే స్వచ్ఛమైన ఆర్యజాతికి ప్రతిబింబములు" 
అనే దృఢ సంకల్పము క్రమంగా ఆమెకు ఏర్పడినది. 
1935 - 1936 ల ప్రాంతాలలో ఇండియాకు వచ్చిన ఆమె, 
హిందూ సాంప్రదాయాల ఆంతర్యము, సంస్కృతి పట్ల మంచి అవగాహన కలిగినది. 
1935 లలో బెంగాల్ రాష్ట్రములోని బోల్ పూర్ లోని 
రవీంద్రనాథ టాగూరు ఆశ్రమములో చేరి, సంస్కృతీ అధ్యయనము , 
హిందీ భాష, బెంగాలీ భాషలను నేర్చుకున్నది.


*****


మాగ్జిమియానీ పోర్టాస్ తన సహవిద్యార్ధుల ఆలోచనలను మనస్ఫూర్తిగా ఆమోదించి, 
తన పేరును మార్చుకున్నది. 
సూర్యుడు, ఆదిశక్తి ల నామమును ఎన్నుకున్నది. 
"సావిత్రీ దేవి" గా ఆమె కొత్త జీవితమును ప్రారంభించినది. 
మాగ్జిమియానీ పోర్టాస్ ప్రాణ శక్తినీ,జీవితమునూ, 
తేజస్సునూ ప్రతిబింబిస్తూన్న పేరు "సావిత్రీ దేవి"ని 
తన నూతన నామధేయముగా గైకొన్నది. 
"పాశ్చాత్య దేశాలలోని వారు ప్రాచీన ఆర్యులు ఒసగిన 
జీవిత విలువలను కోల్పోయారు. 
హిందువులు నివసిస్తూన్న ఇండియా, 
అద్భుతమైన ఆర్య సంస్కృతీ సంప్రదాయాలకు 
రక్షణ దుర్గముగా విలసిల్లుతూన్నది" 
అని నొక్కి వక్కాణించినది.


ఆమె రచించిన అనేక గ్రంధములు 
విలువైన భావసంపదతో ప్రజల ప్రశంసలను పొందినవి.

********************************************;

 Maximian portas  (Link 1)

Heinrich Schliemann,German archaeologistఏథెన్సులోస్వస్తిక్ గుర్తు (Link 2)


జ్ఞాన ప్రతీక సొయొంబో Letter (konamanini- Link 3 )
శుక్రవారం 21 అక్టోబర్ 2011


Mysterious Symbol : SOYOMBO

;

జ్ఞాన ప్రతీక సొయొంబో (Zanabazar)
Monday, 10 October 2011 10:33
mysterious Symbol SOYOMBOswastik

మాగ్జిమియానీ పోర్టాస్ -  (Link 4)
Member Categories - తెలుసా!
Written by kusuma  
Saturday, 21 January 2012 16:01

మైకంలో దాసరి పాట
దాసరి వాళ్ళకు “పాటలు” అంటే ప్రాణం. తంబూరా మీటుతూ, 
ప్రతి గడపకూ తమ గాన మాధుర్యాలను పంచిపెడ్తూంటారు. 
దాసరులకు తంబూరా ప్రాణ సమానం.
ఒక ఊళ్ళో దాసరివాడు ఇల్లిల్లూ తిరిగి, 
పాటలు పాడుతూ బిక్షాటనం చేసాడు. 
"తిరిపెం ఎత్తే పని" పూర్తి ఐన తర్వాత 
ఆ దాసరి ఊరి శివార్లలో కల్లుదుకాణానికి వెళ్ళాడు. 
ఆ అంగడిలో కల్లు తాగేశాడు. 
ఇక గృహోన్ముఖుడైనాడు దాసరి. 
ఇంటిముఖం పట్టిన దాసరి, తాగుడు మత్తు ఎక్కువై, 
ముందుకు సాగలేకపోయాడు. 


"మైకంలో ఉన్నాను, మన్నించాలి, 
 నా మాటలు చేతలు మన్నించాలి........"


అనుకుంటూ చిన్న దిబ్బ మీద చతికిలబడ్డాడు. 
ఆ గుట్టపైన “ఊడుగచెట్టు”ఉన్నది. 
ఆ చెట్టు వేళ్ళు “ఉడుము ఆకారము”లో ఉంటాయి. 
ఊడుగ తరు మూలము అక్కడ ఉన్న బండ సందులోనుండి పాకిపోయాయి. 
కల్లు నిషాలో ఉన్న మన దాసరి 
“ఉడుమును పట్టుకుని, కొట్టేస్తున్నాను” అనుకుంటూ, 
తన చేతిలో ఉన్న తంబురాతో ఠపీమని దెబ్బ వేసాడు.
ఇంకేముంది? తంబూరా కాస్తా ముక్కలుచెక్కలైంది.
“ఉడుము అనుకుంటినే, ఊడుగేరా! ఉట్టి ఊడుగేనురా!
తాంబూరా పోయెనురా తాటి మోరా!.....”
అంటూ కొత్త తత్వసారాన్ని మిళాయించిన 
గీతగానమును అందుకున్నాడు.


మోర్= మజ్జిగ, కల్లు (తమిళము); 
తెలంగాణాలోని వైష్ణవ సంప్రదాయము వారు
నిత్య జీవితంలో- కొన్ని పదాల వాడుక 
విభిన్నతను సంతరించుకున్నాయి.
అలాంటి వాటిలో “మోరు” అనే మాట ఉన్నది.
మోరు- అనేదానికి “కల్లు” అనే భావములో వ్యవహృతమౌతూన్నది.
అనగా “తాటిమోరు”= తాటికల్లు.


***********************************************;

"ఊడుగేరుడుమైనట్లు":- 


అనేది తెలంగాణాలో ప్రజాబాహుళ్యంలో ఉన్న సామెత.
ఈ జాతీయమునకు మూలము, 


ఊడుగ చెట్టు భ్రాంతి వలన దాసరివాడు చేసిన పొరపాటు, తప్పిదము.
ఊడుగచెట్ట్లు ముళ్ళ చెట్లు. బెరడు, 
పై పొట్టు ఉడుము రంగును కలిగి ఉంటాయి.
డుగు+వేరు+ఉడుము+ఐనట్లు
ఇదీ  ఆ తెలంగాణాము జాతీయము ఏర్పడడానికి 
మూల కథా కారణము.
;
లింక్స్ ఫర్ matters:- 

Date 2011/4/22 0:07:33 | Topic: AP News In Telugu
Bharat Waves.com 

వృక్షో రక్షతి రక్షితః , Daripalli Ramaiah 
కోణమానిని ; బుధవారం 19 జనవరి 2011 (Link 2)


అయస్కాంతము చెట్టు; " శివానంద లహరి"లోని 61, 
బుధవారం 27 అక్టోబర్ 2010 (Link 3)


20, జనవరి 2012, శుక్రవారం

కోడి రామ్మూర్తి, అబ్బూరి రామక్రిష్ణారావు స్నేహబంధము


శ్రీకాకుళం వద్ద- వీరఘట్టం గ్రామంలో నిరుపేద కుటుంబంలో జన్మించారు. 
సర్కస్ ప్రదర్శనలలో మేటి. 
కోడి రామ్మూర్తి నాయుడు కలకత్తాలో ప్రదర్శనలు ఇచ్చే వారు. 
మహా నగరంలో వరుసగా 2, 3 నెలలు ప్రదర్శించేవారు ఆయన. 
ఛాతీ మీద ఏనుగును ఎక్కించుకోవడము, 
బలమైన ఇనప సంకెళ్ళను త్రెంచివేసుకుని నిలబడడమూ, 
రెండు కార్లను ఆపుట,రైలుఇంజనును ఒంటి చేత్తో ఆపివేయగలగడమూవంటి
బల ప్రదర్శనలతో- ప్రపంచ ప్రఖ్యాతి గాంచారు.
"కలియుగ భీముడు", "వీర కంఠీరవ", 
"ఇండియన్ హెర్క్యులెస్" మొదలగు 
అనేక బిరుదులతో సన్మానించబడిన వ్యక్తి. 
ఆ రోజులలో దేశ విదేశాలలో ఇచ్చిన ప్రదర్సనలు 
మన వారికి ఎంతో గర్వ కారణాలు అయినాయి. 
బకింగ్ హామ్ పాలస్ లో కింగ్ జార్జి, క్వీన్ మేరీ ల ఎదుట ఇచ్చిన - 
Culinary play లతో వారి మెప్పు పొందాడు ఆయన. 
ప్రజలచే వేనోళ్ళ పొగడ్తలను అందుకున్నారు 
కోడి రామమూర్తిగారు.


*********************;
అబ్బూరి రామక్రిష్ణారావు తనయుడు అబ్బూరి రాజేశ్వరరావు. 
అబ్బూరి వరద రాజేశ్వరరావు గారు 
తన తండ్రి గురించి కొన్ని జ్ఞాపకములను వివరించారు.


* * * * *
అబ్బూరి రామక్రిష్ణారావు "ఆంధ్ర కంఠీరవ” అనే పద్యాన్నిరచించినారు. 
అబ్బూరి రామక్రిష్ణారావు గారు ఆ పద్యాన్ని
"కలియుగ భీముడు" బిరుదాంకితుడైన కోడి రామమూర్తి మీద రాసారు. 
ఆ పద్యాన్ని చదివిన వెంటనే
అబ్బూరి రామక్రిష్ణారావు ఉంటూన్న ఇంటికి వచ్చారు కోడి రామమూర్తి. 
“రావుగారూ! ఇంత మంచి పద్యం రాసారు.
మీరు ఇంత చిన్నవారు అని నేను అనుకోనే లేదు” – అంటూ 
ఆయన ఆశ్చర్యపడ్డారు. 
కోడి రామమూర్తికి ఆ తెలుగు పద్య మాలిక "ఆంధ్ర వీర కంఠీరవ”ఎంతగానో నచ్చినది. 
అబ్బూరి రామక్రిష్ణారావు రాసిన ఆ పద్యాలను సిలుకు రుమాళ్ళ(silk kerchiefs) మీద 
అచ్చొత్తించారు కోడి రామమూర్తి. 
అలాగ చేతిగుడ్డలపై అచ్చు వేయించి, వాటిని తెలుగువాళ్ళకు పంచిపెట్టారు .


“నీ యశః పారిజాతమ్ముల మాల” అనే పంక్తితో ప్రారంభమౌతుంది ఈ పద్యం. 
జలసూత్రం రుక్మిణీ నాథ శాస్త్రి తెలుగుదేశములో, 
ఆనాటి ప్రతి కవి ముందూ చదివే వారు. 
“నీ యశః పారిజాతమ్ముల మాల.” అనే పద సందోహం 
ఒక్క అబ్బూరి రామక్రిష్ణారావుకే చేతనవును" అనేవాడు 
జరుక్ శాస్త్రిగా ప్రశస్తి కెక్కిన జలసూత్రంరుక్మిణీ శాస్త్రి. 


అబ్బూరి రామక్రిష్ణారావు తనయుడు అబ్బూరి రాజేశ్వరరావు 
అభిమాన పులకాంకితులైనారు. 
తన తండ్రి గూర్చి ఒక వ్యాసంలో 
కోడి రామమూర్తికీ, అబ్బూరి రామక్రిష్ణారావుకూ ఏర్పడిన మైత్రీ అనుబంధాన్ని వివరించారు.
* * * * *
కోడి రామమూర్తి  ప్రదర్శనలకు 
గవర్నర్లూ, మహారాజులూ, ఆంగ్లేయ ప్రముఖులూ హేమాహేమీలు హాజరు అయ్యేవారు. 
కోడి రామమూర్తి గారు తన ప్రదర్శనలకు వచ్చే 
ప్రత్యేక ఆహూతులకు ముందు వరుసలలో,
వేరుగా ఆసనాలను వేయించేవారు. 
అక్కడ అలాగ ఆ ఆసనాల పక్కగా- 
మా నాన్నగారి (అబ్బూరి రామక్రిష్ణారావు)కీ, 
మా అమ్మగారికీ రెండు కుర్చీలను ప్రతి రోజూ కేటాయించి ఉంచేవారు
ఓ రోజున గవర్నరుగారి కుటుంబం వచ్చారు. 
అక్కడ అబ్బూరి రామక్రిష్ణారావు దంపతులకై కేటాయించిన 
ఆ రెండు కుర్చీలనూ కూర్చోవడానికి  తీసుకుంటామని అన్నారుట. 
కోడి రామమూర్తి "అలాగా కుదరదు! వీల్లేదు!"  అంటూ 
సుతరామూ అంగీకరించలేదు. 
గవర్నరు కుటుంబానికి ఆ ఆసనాలను ఇవ్వకుండా 
నిర్మొగమాటంగా తిరస్కరించారు కూడా!


“ఆ కుర్చీలు అలా ఉండావలసిందే 
లేకపోతే ప్రదర్శనకు అంతరాయం కలుగుతుందని" 
గవర్నరు గారి  కార్యదర్శికి కబురుచేసారుట- కోడి రామమూర్తి. 
అబ్బూరి రామక్రిష్ణారావు అంటే కోడి రామమూర్తి గారికి అంతటి అభిమానం. 
ఆ స్నేహ అభిమానములకు విలువ కట్టగలమా? 
స్నేహ బంధాలకు అంత విలువను ఇచ్చి, 
ఆ అమూల్య బంధాలను కాపాడే సున్నిత మనస్వి కోడి రామ్మూర్తి.


(అబ్బూరి సంస్మరణ, పేజీ 141)


;
కోడి రామమూర్తి - అబ్బూరి (వెబ్ లింక్: New Avakaya
Member Categories - తెలుసా!
Written by kadambari piduri   
Thursday, 15 December 2011 14:31

18, జనవరి 2012, బుధవారం

బుద్ధుడు ఒసగిన 12 పేర్లు


శాక్యముని ఇహలోకము నివాసుల నుండి
“వీడ్కోలు తీసుకొనుటకై” ని నిర్ణయించినాడు.
ఆ సమయానికి గౌతమ బుద్ధ దేవునికి
“సెలవు!” చెప్పేటందుకు
ఆ సీమకు 12 జంతువులు మాత్రమే రాగలిగినాయి.
బుద్ధ దేవుడు ”తనపట్ల ఆ పండ్రెండు జంతువులకూ గల
ప్రేమానురాగాలకు ముగ్ధుడు ఐనాడు.
బుద్ధుడు ఆ పన్నెండు ప్రాణులకు వరప్రదానము చేయ సంకల్పించాడు.
“కాలము అనంతమైనది.
ఈ కాలమును మానవజాతి గుర్తించుటకు వీలుగా
నెలలు, సంవత్సరములు గా విభజించబడుతూ, తెలుసుకొనబడుతుంది.
ఇకనుండీ – శ్రద్ధాళువులైన మీ పేరులతో
సంవత్సరములు మనుష్యులు తెలుసుకోగలుగుతారు.
నేను ఒక్కొక్క ఏడాదికి- మీ ఒక్కొక్కరి నామధేయాన్ని అనుగ్రహిస్తున్నాను”
అని వాక్కు ఇచ్చాడు ఆయన.
అలాగ బుద్ధ దేవుడు వరుసగా “పండ్రెండు సంవత్సరములకు”
వరుసగా ఆ జంతు నామములను ఉంచాడు.
అంటే ఆయా Years లో జన్మించిన వారికి,
ఆయా జంతువుల స్వభావము – ముఖ్య స్వభావంగా సంక్రమిస్తుందన్నమాట!
బుద్ధ దేవుడు ఉంచిన నామావళి,
ఆ ఏడాది సంబంధించిన జంతువు – ప్రభావము,
మౌలికంగా స్వభావ, శక్తి, ఆధ్యాత్మిక చింతన
ఆదిగా వానిలో గల మౌలిక తత్వముల రూపకల్పనలతో అనుబంధమై ఉంటుంది
ముందుగా వచ్చిన జంతువుకు “తొలి సంవత్సరము పేరు” గా ఉంచే వరము లభించింది.
ఇలాగే పన్నెండు names కూడానూ.
చైనా దేశంలో కేలండరును ఈ పంథాలో నిర్మించుకున్నారు.
***************************************************************
ఉదాహరణకు- బుద్ధుని దర్శించుకొనుటకు వానిలో
వరుసలో చతుర్ధ స్థానములో ఉన్నది కుందేలు.
ఆ నాలుగవది – కుందేలు.
కాబట్టి చైనా దేశం అనుసరిస్తూన్న Calendar ప్రకారము
ద్వాదశ (= 12) రాశి చక్రములో నాల్గవ వత్సరానికి చెందినది
శశి/ కుందేలు. అంటే అప్పుడు పుట్టిన పిల్లలు
సాధు స్వభావులు, కరుణార్ద్ర మనసులు గల వారు, తెలివి గల వారు ఔతారు-
(intelligent, intuitive, gracious,
kind, loyal, sensitive, beauty,
diplomatic and peace-loving) అని సారాంశము.
*********************************************************
చైనీయుల కేలండర్ (రాశిచక్రము ) ప్రకారము
మొదటి వత్సర జంతువు “ఎలుక“.
అంటే అనగా తిరిగి, తొలి మూషిక సంవత్సరము- లో వస్తుందన్న మాట.
సాధారణంగా చైనీయుల తొలి సంవత్సర ఆరంభము “ఏప్రిల్” లో జరుగుతుంది.
వ్యక్తిత్వాలకు సింబల్ గా 12 ఏళ్ళూ, 12 జంతు నామాలతో వ్యవహారంలో ఉంటున్నవి.

12 జంతు వత్సర నామావళి:-
2008 is the Year of the Rat - (మూషికము/ ఎలుక)
2009 is the Year of the Ox – (ఎద్దు/ వృషభము)
2010 is the Year of the Tiger - (వ్యాఘ్రము/ పులి )
2011 is the Year of the Hare (rabbit) – (కుందేలు)
2012 is the Year of the Dragon - (డ్రాగన్)
2013 is the Year of the Snake - (పాము)
2014 is the Year of the Horse - (గుఱ్ఱము)
2015 is the Year of the Ram (sheep, goat) – (గొఱ్ఱె)
2016 is the Year of the Monkey - (వానరము/ కోతి)
2017 is the Year of the Rooster - (కోడిపుంజు)
2018 is the Year of the Dog - (శునకము/ కుక్క )
2019 is the Year of the Pig (Boar) – (వరాహము/ పంది )
*******************************************
2020 is the Year of the Rat - (మూషికము/ ఎలుక)
2021 is the Year of the Ox - (ఎద్దు/ వృషభము)
2022 is the Year of the Ox
2022 is the Year of the Tiger (వ్యాఘ్రము/ పులి )

బుద్ధుడు ఒసగిన 12 పేర్లు
January 02, 2012
By: జాబిల్లి Category: వ్యాసాలు

రచన:- కాదంబరి

17, జనవరి 2012, మంగళవారం

చందమామలో కుందేలు;
;
బుద్ధదేవుడు ప్రాణికోటి పట్ల,
జంతువుల పట్ల అనురాగము కల మహామనీషి.
కావుననే ఆయన జంతువుల రూపములలో అవతారములను దాల్చాడు.
అలాగే ఒకసారి కుందేలుగా అవతారము పొందాడు.
అలాగ కుందేలు రూపంలో తారాడసాగాడు.
గౌతమబుద్ధుని వద్దకు ఆప్యాయతతో వచ్చిన జంతువులలో,
నాలుగవది కుందేలు.
అందుచేత చీనా కేలండర్ (Zodiac)లో
నాలుగవ స్థానము ఈ కుందేలుకు దక్కినది.
(చైనా దేశంలో కేలండరును ఈ పంథాలో నిర్మించుకున్నారు)
“చెవులపిల్లి”- అనే తమాషా పేరు కూడా దీనికి ఉన్నది.

***********************************************************,

బాల బాలికలారా!
మీరు ఆకాశంలోని చంద్రుని జాగ్రత్తగా పరిశీలిస్తూ చూడండి.
ఒకప్పుడు – చందమామ కేవలం తెల్లగా ఉండేవాడు.
ఆ ఇనబింబమునకు మధ్యలో
ఒక చిన్న జంతువు మీకు అగుపడుతుంది.
ఆ బుల్లి కుందేలమ్మ,
జాబిల్లి ఒడిలోనికి ఎలాగ వచ్చి చేరిందో తెలుసుకుందామా!!?

***********************************************************,

బుద్ధ జాతక కథలలో- మన హిందూ దేశ గాథలు,
ఈ క్రమంలో వ్యాప్తిలో కొన్ని ఉన్నవి.
బుద్ధుడు అనేక అవతారములను దాల్చాడు.
“సర్వ జీవాళి పట్ల ప్రేమ, అనునయ, కరుణలను కలిగి ఉండాలన్నదే “
ఆ మహనీయుని అభిమతము.
ఈ తాత్పర్యాంశాల గాథలు భారతదేశంలో ఉన్నవి.

***********************************************************,

బుద్ధుడు కుందేలుగా అవతారము పొందాడు.
అలాగ ఆతను కుందేలు రూపంలో తారాడసాగాడు.
బుద్ధుడు కోతి, నక్క లు భక్తితో అనుసరిస్తూండగా,
వాటితో కలిసి ప్రయాణిస్తూన్నాడు.
“బుద్ధ దేవుని సహనశీలతలో నిజాయితీ ఎంత ఉన్నది”?-
అనే అనుమానం ఒకసారి సుర రాజు ఇంద్రునికి కలిగింది.
బుద్ధ దేవుడు సుర రాజు సురేంద్రునికి ఒకసారి doubt కలిగింది.
ఇంకేముంది, బుర్రకు పుట్టిన బుద్ధి, doubt కలిగి
అట్లాంటి ఆలోచన వచ్చిందే తడవుగా బయలుదేరాడు.
చదువరీ! పాఠకులారా!
అంత గొప్ప ఇంద్రుడు ఏ వేషముతో,
ఎలాగ వచ్చేసాడని మీరు అనుకుంటున్నారు?
సురేంద్రుడు బిక్షం అడుక్కునే వాడి వేషంలో కదిలాడు.
శుష్కించి, నీరసంగా బిచ్చగాడు
“పక్షం దినాలుగా ఏమీ భుజించలేదు.
మాదా కబళం అనుగ్రహించండి”
అంటూ వేడుకున్నాడు.
బుద్ధుని వెంట ఉన్న జంతువులు
” యాచకునికి తినడానికి ఏమైనా తెస్తాము” అని తలచినవి,
అవి తలా ఒక దిక్కుకు వెళ్ళాయి.
అది మహేంద్రజాలము-
కాబట్టి వాటికి ఏమీ దొరకలేదు.
రిక్త హస్తాలతో డీలా పడి, వెనక్కు వచ్చినవి.
కుందేలు కూడా శూన్య హస్తాలతో మరలి వచ్చింది.
“ఈ బీదవానికి నేనే ఆహారము ఔతాను,
నా మాంసం తో ఆకలి తీరును” అనుకున్నది.
వెంటనే నిప్పు చేసి, కుందేలు ఆ మంటల్లో దూకింది.
దేవేంద్రుడు హఠాత్ ఘటనతో ఉలిక్కిపడ్డాడు.
“అనుకోకుండా, కుందేలు చేసిన ఇంతటి త్యాగము— ఔరా!”
నిర్ఘాంతపోయాడు ఇంద్రుడు.
“బుద్ధుని పరిసరములలో మెలిగే అల్ప ప్రాణులలో కూడా
ఎనలేని త్యాగసంపద ఉన్నది.
అలాంటప్పుడు ఈ నేత వ్యక్తిత్వము మరెంతటి ఔన్నత్యమైనదో కదా!”
లజ్జతో సురరాజు పశ్చాత్తప్తుడైనాడు.
“ఓ మిత్రమా! కుందేలూ ! నీ రూపమును ప్రజలందరూ
అనేక పర్యాయాలు వీక్షిస్తూ ఆనందిస్తారు.
ఈ నాటి నుండీ- నింగిలోని చందమామ ఒడిలో నీవు అగుపిస్తూ,
అందరినీ అలరింపజేస్తావు” అంటూ సురేంద్రుడు వరమొసగినాడు.
అప్పటినుండీ, గగనంలోని జాబిల్లి నడుమ కుందేలు కూడా -
అందముగా ఒదిగి జనులను ముగ్ధులను చేస్తూన్నది.

చందమామలో కుందేలు (Link: For KIDS; web magazine)
Published On Thursday,
December 29, 2011
By ADMIN. Under: విజ్ఞానం, వ్యాసాలు.

15, జనవరి 2012, ఆదివారం

మానవతకివి ఉషస్సులు!
మబ్బుల మెడలో
చక్కని- మెరుపుల దండలు 
వేసిన వారు ;ఎవ్వరో? 
ఎవ్వరో?వారెవ్వరో!?


వానదేవుణ్ణి- 
డమడమ ఉరుముల
జడిపించేదది ఎవ్వరో?


జడి, వానధారల
చిక్కని- మెలికల దారుల 
నేర్పరచిన వారది ఎవ్వరో?
ఎవ్వరో?వారెవ్వరో!?


పుడమికి మేల్ కలనేత చీరలను
కట్టిన వారు ఎవ్వరో?
ఆ వలువల మడుగుల
అద్దపు బిళ్ళలు  కుట్టిన
ప్రజ్ఞా-వంతులు ఎవరో?
ఎవ్వరో? వారెవ్వరో?


************


నదీఝరులలో అలల కొసలలో;
నురుగుల ముత్యాల్ చల్లినదెవరో?
ఎవ్వరో? వారెవరో?
పైరు పంటలకు
పచ్చని "పాటల వినిపించేది" ఎవ్వరో?


ఆ గాలిబాలలకు
చక్కని ఈ పని
అప్పగించినది ఎవ్వరో?
వారెవ్వా!ఎవ్వరో? వారెవ్వరో?


ఇన్నీ ఇన్నీ ఇన్నిన్నీ;
ఆ విధాత సృజనల కలిమి చిత్రముల
నిశితముగా గమనించగలిగిన వాడే కద,
ఈ మానవుడు!


ఈ మనిషి పెదవుల
చక్కని చల్లని-
నగవు వరముల నొసగినట్టి
ఆ దైవమ్మునకు మేమిస్తాము 
బులిపించేటి బుల్లి వరమ్ములు,
అవే అవే!
ఈ "శత కోటి నమస్సులు"!
"మానవత"కివి మురిపాల ఉషస్సులు!
;
*************************************

మానవతకివి ఉషస్సులు! (Link: NewAvakaaya.com)
Member Categories - బాల 
Written by kusuma   
Monday, 19 December 2011 14:08

14, జనవరి 2012, శనివారం

మహాత్మాగాంధీ గారి పంచాంగం


;
కస్తూరిబాయి  (11 April 1869 – 22 February 1944) గాంధీజీ భార్య. 
మోహన్ చంద్ కరమ్ చంద్ గాంధీ 
"మహాత్ముని"గా మారడానికి  ఆమె స్ఫూర్తి ఐనదని 
చాలా మందికి తెలుసినదే! 
ఆయన రాజకీయాలను నిర్వహించడంలో 
గొప్ప సమర్ధత కలిగిఉన్నవాడే! 
తోటి మనుష్యుల ఫీలింగ్సును సైతము బాగా గమనించగల వ్యక్తియే! 
తన అర్ధాంగి కస్తూర్ బా చిన్న చిన్న కోరికలను కూడా 
'ఆమె నోరు తెరచి అడగకపోయినప్పటికీ' గుర్తించేవాడు.
వీలైనంతవరకు తీర్చడానికి శాయశక్తులా ప్రయత్నించే వాడు.


కస్తూర్బాకు తన నిత్య కార్యక్రమాలను 
అక్షరబద్ధం చేయడమునూ, 
డైరీలు రాసే అలవాటును నేర్పిన వాడు గాంధీయే! 
కస్తూర్ బా స్వంత వ్యక్తిత్వమును తన ప్రవర్తనలో వ్యక్తీకరిస్తూండేది. 
బార్డోలీ పోరాటంలో స్వయంగా పాల్గొన్నది.
 ఆమెకు ‘హిందీ భాష ’ అంత బాగా రాదు.


1931- 1933 ల మధ్య మూడుమార్లు 
కస్తూర్ బా కారాగారా వాసము చేసినది. 
కస్తూర్ బా  కు “తులసీ రామాయణము” ను 
సుశీలా నయ్యర్, ప్యారేలాల్ మున్నగు వారు చదివి, వినిపించే వారు. 
కస్తూర్బా అందరు భక్తుల వలే మూఢ భక్తితో విని ఊరుకునేది కాదు. 
తులసీ రామాయణ పద్యాలను సునిశితముగా విమర్శించేది. 
పతిదేవుడు గాంధీజీ  ప్రార్ధనానంతరము కస్తూర్బా వద్ద కూర్చుని, 
ఆమెకు ఆయా శ్లోకముల అర్ధాలను చెబ్తూండే వారు. 
కస్తూర్బా కొన్ని పద్యాలను వింటూ, 
"ఇందులో అతిశయోక్తులు ఉన్నవి. 
ఇది నిజం అవకపోవచ్చును” -
ఇలాగ నిష్కర్షగా స్వీయ అభిప్రాయాలను తెలిపేది.


గాంధీజీ ఈ శ్రోత కోసం 
“సంగ్రహ రామాయణము” ను తయారుచేయాలని అనుకున్నారు. 
చాలా కృషితో, కస్తూర్బా కోసం కొన్ని శ్లోకములను ఎంపిక చేసారు. 
అలాగ వాల్మీకి రామాయణములోని రెండు కాండముల వరకు 
సులభమైన గుజరాతీ భాషలోనికి అనువాదము చేసారు.
ప్రతిరోజు సాయంత్రము ప్రార్ధన వేళలో 
ఆ అనువాదాలను కస్తూర్బా  చదువుకోగలదని గాంధీజీ భావన. 
అలాగ తాను కొన్ని శ్లోకాలను ఎంపిక చేసి, 
అనుచరులకు ఇచ్చేవారు ఆయన. 
ఆ తర్వాత వాటిని ఆయనే చదివి సరిదిద్దుతూండే వారు.


అప్పటికి కస్తూర్ బా  శ్వాసకోశ రుగ్మతతో, 
ఆయాసంతో బాధ పడ్తూండేది. 
గాంధీజీకి నిరాహార వ్రతాలూ, బ్రిటీష్ ప్రభుత్వముతో చర్చలు, 
భార్య కస్తూర్బా ఆరోగ్య చింతనలూ, ఆమెకు సేవలు ఇత్యాదులతో 
ఊపిరి సలుపని పనులు చుట్టుముట్టాయి. 
దానితో ఆయన కస్తూర్బా  కోసం 
తలపెట్టిన “సంక్షిప్త రామాయణ సంకలనము” కాస్తా 
రెండు కాండములతో ఆగిపోయినది. 


కస్తూర్బా ఆగాఖాన్ పాలెస్ ను చేరారు. 
పండుగలు, వ్రతాలు, నోములు అన్నింటికీ 
క్రమం తప్పకుండా ఉపవాసాలను ఆచరించేది. 
జైలులో ఉన్నప్పుడు ఆమె “ఏకాదశి ఎప్పుడు?” అని అడిగినది. 
గాంధీజీ సూపర్నెంటును కలిసి
తిథి, వార, నక్షత్రాలను చూపించే కేలండర్ ను 
మాకు తెప్పించగలరా?” అని అడిగారు. 
Superintendent “అలాగే! తెప్పిస్తాను” అని సమ్మతిని తెల్పాడు. 
కానీ బయటనుండీ , 
అధికారుల పర్మిషన్ తో వస్తువులు లోనికి రావడానికి 
కొన్ని రోజులు పడ్తుంది. 
అందుకని గాందీజీ ఆలోచించారు. 
అనుచరులను పిలిచి కొన్ని సూచనలు ఇస్తూ 
ఒక కొత్త కేలండరును తయారు చేయ గలిగారు.


అందరికీ జాతిపిత ఎప్పుడు అరెస్టు ఐనారో తెలుసును. 
ఆ రోజు తిథి, తేదీ అన్నీ బాగా జ్ఞాపకం ఉన్నాయి. 
ఇక ఆ రోజు నుండీ లెక్కిస్తూ వచ్చారు. 
అలాగ లెక్కిస్తూ, సంవత్సరం కొస వరకూ 
తిథులను, నక్షత్రములనూ రాశారు. 
గాంధిమహాత్ముడు ఇచ్చిన సూచనలు 
అద్భుత ఫలితాలను ఒసగినవి. 
తిథులు అన్నిటినీ 
ఎర్ర పెన్సిల్ తో “పౌర్ణమి” వద్ద క్రింది గీతలు వేసారు. 
అలాగే “అమావాస్య” రోజులకు క్రీగీతలను గీసారు. 
అలాగ red, blue pencils తో 
పున్నమి, అమావాస్యలను underline చేయడంతో 
నవీన పంచాంగ కేలండర్ నిర్మాణం పని సులువు ఐనది.


ఇక ఆనాటి నుంచీ కస్తూరి బాయికి,
తక్కిన వారికీ “ఏకాదశి ఫలానా రోజున వస్తుంది. 
అట్లాగే తక్కిన ఉపవాసములు, నోముల పండుగల టైములను – 
 అడిగిన వారికీ మహాత్మా చెప్పేవారు. 
అటు పిమ్మట కొన్ని రోజులకు 
సిబ్బంది తెప్పించిన calender కూడా 
వారి చేతిలోనికి వచ్చిందనుకోండి. 
ఐతే సంక్షిప్త రామాయణ సంకలనము, 
కేలండరు సిద్ధపరచిన వైనమూ, 
వారి అనురాగానికి తీపి గురుతులు.


;  

గాంధీజీ గారి పంచాంగం (Newaawakaaya, Web)
User Rating: / 2 
Member Categories - తెలుసా!
Written by kadambari piduri   
Saturday, 10 December 2011 12:09
;
శ్రీ రామాయణం బాలకాండ సర్గ (mdileep కృషి)
;

10, జనవరి 2012, మంగళవారం

శ్రీరామ రాజ్యము జయము! జయము!


మన భారతదేశములో వెలువడిన 
అనేక ఇతిహాసములలో  “శ్రీ మద్రామాయణము” ప్రధమ స్థానము పొందినది.   
“మహా భారతము”(/= “జయమ్”),
"శ్రీమద్ మహా భాగవతము”, 
ఉపనిషత్తుల, పురాణములు, 
అనేక గాథలుగా జన బాహుళ్యములో విస్తృత వ్యాప్తిలో ఉన్నవి. 
సంఘములోని మనుష్యుల వ్యక్తిత్వములను తీర్చిదిద్దడంలో 
వీని ప్రభావము ఎనలేనిది.
సమాజములో నీతి నియమాలను గాఢముగా నిలిపి ఉంచగలిగిన 
ఈ గ్రంధాలు ఆరాధనీయాలు అవడంలో ఆశ్చర్యం లేదు. 
రామాయణ ఇతిహాసము , మరల మరల సినిమాలుగా 
నిర్మించబడి, ప్రేక్షకులకు ఆహ్లాదము కలిగిస్తూనే ఉన్నది కదా!  
మన దేశములో రచించబడిన వేలాది రామాయణములలో 
కొన్నిటి నామావళిని తెలుసుకుందామా?;

సంపూర్ణ రామాయణములు :- 


వాల్మీకి రామాయణము
అద్భుత రామాయణము
ఆద్యాత్మిక రామాయణము
వశిష్ఠ రామాయణము ;
ఉత్తర రామాయణము ; 
విచిత్ర రామాయణము 
శతకంఠ రామాయణము         
గోనబుద్ధారెడ్డి: ద్విపద రామాయణము;
లేపాక్షి రామాయణము ; 
బొమ్మలాట రామాయణము 
ఆంధ్ర  వాల్మీకి రామాయణము ; 
ధర్మ సార  రామాయణము;
ఎర్రాప్రెగడ రామాయణము ;  
మొల్ల రామాయణము ; 
భాస్కర రామాయణము ; 
రామాభ్యుదయ రామాయణము ; 
రఘునాధ నాయక రామాయణము ; 
శారదా రామాయణము ; 
గోపీనాథ రామాయణము ;
శ్రీ పట్టాభిరామ రామాయణము ; 
కబీరుదాస రామాయణము ; 
శ్రీరామచంద్రోపాఖ్యాన రామాయణము ;
తాళపాక అన్నమాచార్య రామాయణము ;  
శ్రీ త్యాగరాజ విరచిత గాన రామాయణము ; 
తరిగొండ వెంకమాంబ రామాయణము ; 
కట్టా వరదరాజయ్య రామాయణము ; 
శ్రీ విశ్వనాథ సత్యనారాయణ  - “శ్రీ రామాయణ కల్ప వృక్షము;”
చర్ల గణపతిశాస్త్రి; గణపతి రామాయణము;
వావిలాల రామాయణము ;


శ్రీరామ రాజ్యము జయము! జయము! (Link: Web, ForKids)
Published On Wednesday, December 14, 2011 
By ADMIN. Under: విజ్ఞానం, వ్యాసాలు.   
రచన : కాదంబరి పిడూరి

1, జనవరి 2012, ఆదివారం

శుభాకాంక్షలు
బ్లాగ్ పాఠకులకు అందరికీ 
2012 నూతన సంవత్సర  శుభాకాంక్షలు.   


                                               కోణమానిని 
;

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...