26, ఆగస్టు 2012, ఆదివారం

Neil Alden Armstrong-పి.బి. శ్రీనివాస్ లేఖలు

పి.బి. శ్రీనివాస్ ఒక ఇంగ్లీషు సాంగును కూడా పాడారు.
ఎస్. జానకి తో గాత్ర యుగళమును చేసారు.
"మానవుడు చంద్రగోళముపైన అడుగు పెట్టిన అద్భుత క్షణములు అవి.
ఆ చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని-
ఎస్. జానకి , పి.బి. శ్రీనివాస్ లు స్వర్ణించిన ఆ గీతమే

A song in English, “Man to moon;
--------------------------Moon to God...............”

ఇంతకీ ఈ ఆంగ్ల గీత రచయిత ఎవరో తెలుసా?
మరెవరో కాదు - మన పి.బి. శ్రీనివాస్.
అమెరికా ప్రెసిడెంటు నిక్సన్, చంద్రునిపై కాలూనిననీల్ ఆర్మ్ స్ట్రాంగ్ లు
( President Nixon and Louis Armstrong )
పి.బి.ఎస్. శ్రీనివాస్ P.B.S. కి ప్రశంసిస్తూ లేఖలను రాసారు. 
సకల జగత్తునూ తన చల్లని వెన్నెలతో మురిపించే జాబిల్లి,
ఆ గ్రహగోళముపైన మనిషి పాదము మోపి 2 గంటలు నడిచిన
అద్భుత సంఘటనను యావత్తు ప్రపంచ ప్రజలను మైమరపింపజేసినది.
అక్కడ సంచరించిన మొట్టమొదటి వ్యోమగామి నీల్ ఆర్మ్ స్ట్రాంగ్
(Neil Alden Armstrong-ugust 5, 1930 – August 25, 2012).
ఈ మహత్తర ఘటనను గూర్చి ఇండియాలోని
8 భాషలలో పాట(ల)ను-P.B.S.-లిఖించి, పాడి- రికార్డు చేసారు.

**********************************

“Man to moon; Moon to God,”
నీల్ ఆర్మ్ స్ట్రాంగ్(:Neil Alden Armstrong)

21, ఆగస్టు 2012, మంగళవారం

భీమ్ పూల్, విచిత్ర బ్రిడ్జి


ఉత్తరాఖండ్ లోని "ఘర్హ్ వాల్"/ గర్హ్వాల్ (= దేవ  భూమి)
హరితదనముతో  ప్రశాంతతను మనసులకు చేకూరుస్తుంది . 
పంచపాండవులు నడయాడిన ప్రదేశములు- 
హిమాలయ శిఖర వలయ సీమలు.  
సరస్వతీనది - అంతర్వాహిని ఐన స్రోతస్విని (SarasvatI river flows incognito).  
ఈ వేదభూమిలో పూజ్యనీయురాలు ఐన పవిత్ర నది  
సరస్వతీనదీ సరిత్తు.  - 
అలకనందా ఝరీ విలీనమౌతూ ప్రవహిస్తూన్న 
శోభాయమాన దృశ్యాలు  నయనానందము కలిగిస్తూంటాయి ఇక్కడ, 
;
సహజ వంతెన ; bheem pul
సరస్వతీనది పైన ఒక బ్రిడ్జి  ఉన్నది. 
ఈ bridge పేరు "భీమ్ పూల్"- పూల్= వంతెన - అని అర్ధము.  
ఇది సహజ వారధి. భీమ్ పూల్, ప్రాకృతిక సంపద; అమోఘ ప్రకృతి వరము, 
రెండు శిఖరములను కలుపుతూ ఏర్పడిన         శిలా వారధి బాట ఇది. 
ప్రకృతిసిద్ధమైన ఈ వంతెన- 
భగవానుని సృష్టిలోని విచిత్రములకు నిదర్శనముగా నిలిచి, అబ్బురపరుస్తూన్నది. 
మహా ప్రస్థానమునకై నిర్దేశించుకున్న "పంచ పాండవులు" - 
భార్య ద్రౌపదితో బాటు ముందుకు కదిలారు. 
పాండవులు ఈ నది చెంతకు వచ్చారు. 
సరస్వతీ ప్రవాహమును దాటి ఆవల తీరమునకు చేరడము ప్రస్తుత కర్తవ్యము. 
"కిమ్ కర్తవ్యమ్?". 
బాహుబలసంపన్నుడు, వెయ్యి ఏనుగుల బలము కలవాడు ఐన భీముడు 
ఒక పెద్ద శిలను తెచ్చి, ఆ ఉత్తుంగ ఝరికి పైన 
అటూ, ఇటూ ఉన్న గిరులను కలుపుతూ ఉండేటట్లుగా-వేసి, 
తాము అందరూ నడిచి వెళ్ళేందుకు వీలుగా చేసాడు. 
(Bheem threw a big massif rock to make a path joining two mountains)  
జయం సంహిత- (వేద వ్యాస విరచిత- మహా భారతము) - 
ఇతిహాసముతో ముడిపడి ఉన్న కల్పనా గాధలు 
ఈ సీమాసంబంధములై ప్రచారములో బహుళ ఉన్నవి. 
ఈ  హృద్య వర్ణన స్థానికుల కథనము. 
ఉరకలు వేస్తూన్న సరస్వతీ వాహినీ తరంగాలు చూపరులను దృష్టి త్రిప్పుకోనీయవు.

వ్యాస గుహ, గణేశ్ గుహ- లు దగ్గరలో ఉన్న ప్రత్యేక దర్శనీయ పుణ్య స్థలములు. 
వసుంధర జలపాతము, బండ రాళ్ళ మధ్య-ఇరుకు  
ఇరుకు సందులగుండా ప్రవహిస్తూ  ఉరికే నీళ్ళు ప్రత్యేక ఆకర్షణ
వసుంధరా జలపాత ధారలు - సుందర దృశ్యాలు. 
ఈ సీనరీలు బదరీనాధ్ కి 5 కిలోమీటర్లు దవ్వున ఉన్నవి.-  

సహజ Bridge వంతెన ; (Garhwal hills)
అంతర్వాహిని సరస్వతీనది పైన సహజ వంతెన

17, ఆగస్టు 2012, శుక్రవారం

శాండిల్యన్ చెప్పిన సంఘటన (నాగయ్య)


చిత్తూరు నాగయ్య గా వెండితెర జీవులకు సుపరిచితుడైన నాగయ్య
పూర్తి పేరు ఉప్పలపాటి  నాగయ్య (28 మార్చి 1904 - 30 డిసెంబరు 1973).  
నాగయ్య - జీవితము- సినీ రంగములో ఉన్న వారు 
నిరంతరము మననం చేసుకునేటన్ని మలుపులు తిరిగినది.  
1945లో "మీరా" హిందీ సినిమాలో (కథా నాయిక గా ఎం.ఎస్.సుబ్బులక్ష్మి) హీరోగా వేశారు. 
"మీరా"- నిర్మాణములో పాశ్చాత్యులు కూడా పాలుపంచుకున్నారు- 
అదీ విశేషం!!!!!  
;
నాగయ్య వేమన 

 


C.హొన్నప్ప, భాగవతార్, P.U. చిన్నప్ప,
G.N. బాలసుబ్రహ్మణ్యమ్ మున్నగువారి పేర్లు 
ప్రస్తావనకు వచ్చినవి. 
కానీ ....... ఎల్లిస్ ఆర్. డంగన్ మాత్రము నాగయ్యను మాత్రమే ఎంచుకున్నారు.
(Ellis R. Dungan)1945 లో నిర్మిస్తూన్న "Meera" (1945) కై- 
రాజపుత్ర రాజు కుంభ రాణా గా- నాగయ్య  పేరును ప్రతిపాదించారు. 
నాగయ్య ఆజానుబాహువు, గాంభీర్యము, ఠీవి ఐన నడక- 
ఆయనకు ఇలాటి పాత్రలు నప్పేటట్లు చేసినవి.
ఇలాగ తెలుగు, తమిళ, హిందీ ఇత్యాది భారతీయభాషలలో నటించిన నాగయ్య - 
"భక్త రామదాసు"ను నిర్మించారు. 
ఆ సినిమా హిట్ ఐనప్పటికీ వివిధ కారణాలవలన 
ఆయన బీదరికములో, last stage ను గడపవలసి వచ్చింది. 
శాండిల్యన్ చెప్పిన సంఘటన:- 
నాగయ్య బ్రతుకు చిత్రము క్రమేపీ వెలిసిపోసాగినది. 
వాహినీ పిక్చర్సు వైభవదశలో ఉన్న రోజులు అవి. 
శాండిల్యన్ ఆ స్టూడియో లో తమిళరచయిత. 
అతను అక్కడ నాగయ్యను చూసాడు. 
అప్పుడు జరిగినది ఫ్రెండ్సుకు చెప్పాడు :-  

నాగయ్య ఆయన ఒక సినిమాలో "కౌ బాయ్" గా వేసారు.
అంతకుమునుపు అత్యున్నత స్థాయిలో ఉన్న మహామనీషి, 
దాతృత్వములోనూ, ఉదాత్తవేషాలతో 
ప్రజలలో నీతినియమాలను పాదుకొల్పిన వాడు నాగయ్య.
త్యాగరాజు, యోగి వేమన- వంటి మహాపురుషుల పాత్రలను తలచుకోగానే- 
అందరి మనోఫలకాలపైన నాగయ్యయే- సాక్షాత్తు  అలాగ ప్రత్యక్షమయ్యేవాడు.
ఇప్పుడు శాండిల్యన్ కళ్ళకు కనుపిస్తూన్న దృశ్యము 
ఆతని మనసును కదిల్చివేస్తూన్నది. 
నాగయ్య (Nagaih play a cowboy for a third-rate `curry western
old pal, Nagaiah, dressed in a bizarre, outlandish, 
cowboy costume holding a rifle made of bamboo)                  
నాగయ్య  చెమటలు తుడుచుకుంటూ-   -
వెదురుతో చేసిన "కట్టె తుపాకి"ని పట్టుకుని, 
ఊపిరాడని తోలు కోటుతో వింత వేషధారణతో 
ఒక చెట్టు కింద కూర్చుని ఉన్నారు నాగయ్య. 
"షూటింగ్ లో తన సీనును షూట్ చేసే టైముకు - 
పిలుపు కోసమై వేచిచూస్తూన్నారు.
అలాటి పరిస్థితిలో ఉన్న నాగయ్యను చూడగానే - 
శాండిల్యన్ కళ్ళలో నీళ్ళు గిర్రున తిరిగాయి. నాగయ్య 
"నాగయ్యగారూ!మీరేనా?" అనే ప్రశ్న గుండె లోతుల్లోనుంచీ దూసుకువచ్చింది.  
నాగయ్య థర్డ్ రేటు (a third-rate `curry western) పాత్రలు వేస్తున్నారు.
కౌబాయ్ గెటప్ - ఉన్న నాగయ్యను చూసిన శాండిల్యన్ ఖంగు తిన్నాడు. 
దగ్గరికి వెళ్ళి నాగయ్యను పలకరించాడు శాండిల్యన్.
"ఇదేమిటి? ఇలాంటి ఈ దుస్తులు ధరించారు?" 
Sandilyan (Tami cine writer) అడిగాడు.   
శాండిల్యన్ విలవిలలాడడము చూసి, నాగయ్య అతడిని అనునయిస్తూ
"భాష్యమ్!! ఉదర నిమిత్తమ్ బహుకృత వేషమ్ కదా! " 
(శాండిల్యన్ అసలు పేరు భాష్యమ్)
నెమ్మదిగా పెదవులపై మందహాసమును వెలయిస్తూ అన్నారు నాగయ్య.   
(`for the sake of the stomach, one has to play many roles!') 
శాండిల్యన్ - అంతటి కష్టకాలంలోనూ నిబ్బరంగా ఉండగల్గిన 
మహనీయుడు నాగయ్యకు శాండిల్యన్ అభివాదములు చెప్పాడు. 
స్థితప్రజ్ఞతకు ప్రతిబింబరూపుడు నాగయ్య.

********************************    
Sandilyan- Vuppalagadiyam Nagaiah (Link- The Hindu)

;

16, ఆగస్టు 2012, గురువారం

"వి.ఐ .పి. అంటే?" - రాజబాబు నిర్వచనంరాజబాబు అసలు పేరు పుణ్యమూర్తుల అప్పల రాజు; 
 సి ; 20 అక్టోబర్ 1937- 7 ఫిబ్రవరి 1983)
1969 దశకములలో గొప్ప కమెడియన్ గా తెలుగు సినిమాలో ప్రకాశించాడు.
రమాప్రభ, గీతాంజలి మున్నగువారితో- జోడీగా 
వెండితెరపై నర్తిస్తూ, నటిస్తూ, ఆంధ్రులకు నవ్వుల నజరానా లను ఇచ్చాడు.
  

 చాలా లేటుగానైనా సినిమాలలో మంచి పాత్రలు లభించి,
తమ నటనతో ప్రేక్షకుల చేత నీరాజనాలందుకున్న 
అదృష్టవంతులైన నటులలో రాజబాబు ఒకరు. 

తెలుగు సినీ ప్రపంచానికి తన అద్భుత హాస్య నటనతో 
నవ్వులను పంచి ఇచ్చిన నటుడు కీర్తిశేషుడు రాజబాబు 
ఇష్టా గోష్టిలో తమ పాత 'జ్ఞాపకములను నెమరు వేసుకునే వారు.  
;
 పరమానందయ్య శిష్యుల కథVIP అనే పదానికి పొందికగా అందించిన సరదా సరదా నిర్వచనం ఇది. 
"వి.ఐ.పి. అంటే 'వి' అనగా వడ, 'ఐ' ఇడ్లీ, 'పి'అన్నచో పొంగల్."
V= vada
I = Idli
P= pongal
మద్రాసులోని (నేటి 'చెన్నై') పాండీ బజారులో 
చిన్నా చితకా వేషాల కోసం స్టూడియోల చుట్టూ ప్రదక్షిణాలను చేసిన రోజులలో, 
హోటళ్ళలో ఈ విఐపిలతోనే కడుపులను నింపుకుని, 
పార్కులోని చెట్ల క్రింద కాలక్షేపం చేసే వారు 
సత్యనారాయణ, వంగర, కాకరాల మున్నగువారు. 
అలాగే ఆ లిస్టులో రాజబాబు కూడా ఉన్నాడు.
 ;
"వి.ఐ .పి. అంటే?" - రాజబాబు నిర్వచనం
User Rating: / 2 ఇష్టా గోష్ఠి  (Link- New Awa kai-)
Member Categories - మాయాబజార్
Written by kusuma ;Monday, 06 August 2012 15:40

He is a great artist..film maker, good 
donator..having good heart..great..great..


లిటిల్ థింగ్స్ జూలియా

చిన్ననాటి జ్ఞాపకములలో ఒకటి-  
"లిటిల్ థింగ్స్" - 
ఇంగ్లీషు టెక్స్ట్ బుక్స్ లోని  ఈ కింది పోయెమ్.  
    
Little DrOps of water;
Little grains of land;
Make the mighty ocean;
And the pleasant land; 
;
లిటిల్ డ్రాప్స్ ఆఫ్ వాటర్

జూలియా ఫ్లెచెర్  (Julia Fletcher)  
రాసిన పద్యమిది. 
తొలి verse అందరికీ తెలిసిఉంటుంది.
ఈ దిగువ ఇచ్చిన కవిత. 
ద్వితీయ కవితా ఖండిక ఇది. 
;
                                           
So the little minutes;
Humble though they be;
Make the mighty ages;
              of Eternity.

వెరసి మొత్తం poem ఇది:-

Little DrOps of water;
Little grains of land;
Make the mighty ocean;
And the pleasant land; 

 So the little minutes;
Humble though they be;
Make the mighty ages;
              of Eternity.

**************************;
జూలియాఎబిగైల్ ఫ్లెచర్ కార్నీ (ఏప్రిల్ 6 , 1823 - 1 నవంబర్ 1908) 
అమెరికన్ కవయిత్రి. 14  వ ఏట నుండీ 
ఆమె రచనలు పత్రికలలో అచ్చు అవసాగినవి. 
జూలియా (Julya abigail flecher carney)  
తరువాతి కాలంలో వివిధ భావనలను (various pseudonyms) 
లిపిబద్ధము చేసినది.
అటు ఫిక్షన్ నూ, ఇటు నాన్ ఫిక్షన్ నూ  
ఏక కాలములో రాసేసిన సవ్యసాచి ఆమె. 
జూలియాఎబిగైల్ ఫ్లెచర్ కార్నీ రాసిన 
"లిటిల్ థింగ్స్ ..... " అనే చిట్టి పద్దెము - 
మొదట "బాల గీతము" గా ప్రాచుర్యాన్ని పొందింది.  
అటు పిమ్మట - కొంతకాలానికి ఆమె రచించిన  పద్య ఖండికలు - 
"నిర్వచన స్థాయి"ని ఆర్జించి, ప్రపంచ ప్రఖ్యాతి గాంచినవి.

***************************;
Julia Abigail Fletcher Carney 
Familiar Quotations 9th edition (1906) - edited by John Bartlett
The Oxford Dictionary of Quotations (1999) - by Elizabeth Knowles  &
                                                Angela Partington
The Yale Book of Quotations (2006) -
ed. Fred R. Shapiro -
మున్నగు అనేక సంకలనములలో ముద్రణ ఐనవి.
విభిన్నపబ్లికేషన్లు లో - 
(pun@h puna@h ) పునః పునః ప్రింటు ఔతూవచ్చినవి.

Julia Abigail : (Link);

 ప్రజలు అందరికీ 65 వ స్వాతంత్ర్యదిన శుభాకాంక్షలు!

14, ఆగస్టు 2012, మంగళవారం

swagger stick పట్టుకున్న నెహ్రూ మామ


జవహర్ లాల్ నెహ్రూబోంబే కు వెళ్ళారు.
ఒక ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన అక్కడికి చేరుకున్నారు. 
బొంబాయిలోని “ తాన్సా ” (“Tansa near Bobay”) అనే చోటు అది.
మోహన్ సింగ్ బయాస్  భుజస్కంధాలపై- 
ఇండియా ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ  - యొక్క రక్షణ బాధ్యత డ్యూటీ - ఉన్నది. 
ఆయన జూనియర్ పోలీస్ ఆఫీసర్సు ఇన్ చార్జ్ గా 
ప్రముఖ ప్రభుత్వ మంత్రుల , అధికారుల సెక్యూరిటీ విధిని నిర్వహిస్తూన్నారు.
సరే! తాన్సా లోని ఇనాగ్యురేషన్ ముగిసినది. 
ముగింపు వాక్యం అవగానే – స్టేజీని దిగివచ్చారు (Dias) చాచానెహ్రూ.
అక్కడ చుట్టూతా - వెదురు బొంగులతో కట్టి ఉన్నవి బారికేడ్ లు.  
నెహ్రూజీ ప్రజలను కలవాలనే ఆకాక్షతో కంచెను దాటి వచ్చేశారు. 
మోహన్ సింగ్ బయాస్ తన విధినిర్వహణలో- 
వేదికను దిగి వచ్చిన జవహర్ లాల్ నెహ్రూను అనుసరిస్తూ
ముందడుగు వేయక తప్పలేదు. 
పోలీసులు, మోహన్ సింగ్ బయాస్  
గుంపులు గుంపులుగా జవహర్ లాల్ నెహ్రూ చుట్టూ 
మూగుతూన్న జనమును చెదరగొట్టవలసివచ్చింది.  
మోహన్ సింగ్ బయాస్- వాళ్ళను 
జవహర్ లాల్ నెహ్రూకు దూరంగా ఉంచేందుకు కష్టపడసాగాడు. 
ఫ్రజలను వెనక్కి నెట్టసాగారు. లాఠీని ఝళిపిస్తూ,
 అందరినీ అదిలిస్తూ, అదుపులో పెట్టసగారు.   
swagger stick లను ప్రయోగించడమే శరణ్యమైనది 
మోహన్ సింగ్ బయాస్ కూ, ఇతర కాకీ డ్రెస్సుల వాళ్ళకున్నూ! 

పండిత్ జవహర్ లాల్ నెహ్రూ
************
అకస్మాత్తుగా  మోహన్ సింగ్ బయాస్ చేతిలోని లాఠీ కర్రను కాస్తా ఎవరో లాకున్నారు. 
ఆ చేపాటి గట్టి కఱ్ఱ అక్కర వాళ్ళది. 
మరి అందుకే అంతు లేని ఆగ్రహం కలిగింది మోహన్ సింగ్ బయాస్ కు.  
చుట్టూ రౌండుగా తిరుగుతూ మోహన్ సింగ్ బయాస్ ఉగ్రరూపుడౌతూ, చూసాడు. 
మోహన్ సింగ్ బయాస్ కళ్ళు చింత నిప్పు కణికలే ఐనాయి.
తీరా చూస్తే- అతగాడి హస్త ఆభరణమైన లాఠీ ఎవ్వారి దగ్గర అగుపించిందో తెలుసా?  
సాక్షాత్తూ జవహర్ లాల్ నెహ్రూ  కర కమలములలోనే!
మోహన్ సింగ్ బయాస్ నిర్ఘాంతపోతూ, నీళ్ళు నమలసాగాడు.
Prime Minister జవహర్ లాల్ నెహ్రూ – 
ఆ రక్షకభటుల దండమును పైకీ కిందికీ ఊపుతూ కాస్త కరకుగా అన్నారు 
(“What were you doing?”) – “ మీరు చేస్తూన్నది ఏమిటి?” 
అలాగ అంటూనే తన వ్యక్తిగత సెక్యూరిటీ ఆఫీసర్ వైపు తిరిగి హుకుమ్ జారీ చేసేసారు 
“ఇతనిని ఇక్కడినుంచి పంపించివేయండి!” 
ఆ సీన్ నుండి సడన్ గా 
అలాగ తనకు 'ఉద్వాసన జరుగుతుందని' అనుకోనేలేదు మోహన్ సింగ్ బయాస్. 
నయనములనుండి ఉబికుబికి వస్తూన కన్నీళ్ళను ఆపుకోవడానికి సతమతమౌతూ 
మోహన్ సింగ్ బైటికి వెళిపోయాడు.   
************                                                 
కొంతసేపటికి  మోహన్ సింగ్ బయాస్ కి – 
“ప్రైమ్ మినిస్టెర్ మిమ్మల్ని పిలుస్తున్నారు!” అంటూ 
సమన్ లు వచ్చాయి. 
“ఇక నా ఉద్యోగం ఊష్టు, నా కెరీర్ కి ఫుల్ స్టాప్ పడినట్లే!” 
అనుకున్నాడు Mohansingh.
లోపల్లోపల వణుకుతూ బయలుదేరాడు మోహన్ సింగ్ బయాస్.
మొరార్జీ దేశాయ్ తదితర లీడర్ లతో- కలిసి కూర్చుని, 
రాజకీయవ్యవహారాలను చర్చిస్తూ కూర్చుని ఉన్నారు  నెహ్రూ. 
“మీరు ఏమి చేద్దామనుకుంటూన్నారు?” నెహ్రూ ప్రశ్న.
“సర్! బ్లూ బుక్ ను అనుసరించాను, 
నేను ఆ నిబంధనలను మాత్రమే ఫాల్లో ఐనాను.” 
(I was only following Blue Book) 

అప్పుడు నెహ్రూ యొక్క సెక్రటరీ, 
మొరార్జీ దేశాయ్ లు నెహ్రూజీ తో ఏదో చెబుతూ, మాట్లాడారు. 
జవహర్ లాల్ నెహ్రూ కాస్సేపు మౌనంగానే ఉన్నారు. 
కొన్ని moments పాటు అలాగుండి, నెమ్మదిగా పెదవి విప్పారు.
“Young man! apparently you were right and I was wrong. I am sorry.
ఆఫ్ట్రాల్ ఒక junior police officer కి ఒక ప్రధాన మంత్రి క్షమాపణ అడిగారు.
తటాలున సంభవించిన ఈ సంఘటనకు అందరూ సంభ్రమాశ్చర్యాలలో మునిగారు. 
విభ్రమగా చూస్తూన్న  మోహన్ సింగ్ బయాస్ కనుగవలో – 
ఆనందబాష్పాలు చెలియలికట్టను దాటుతూ, ఆయన యూనిఫారమ్ ను తడిపేసాయి. 
ఈ సారి -
తన కళ్ళ నుండి రాలుతూన్న కన్నీళ్ళను ఆపుకోవాలని ..............
           ప్రయత్నించలేదు మోహన్ సింగ్ బయాస్.   

************

(Pandit Jawaharlal Nehru ; 14 November 1889 – 27 May 1964)
  
(బ్లూ బుక్ = VVIP security measures ను ఉటంకిస్తూ, 
పోలీసులు – పాటిస్తూ అనుసరణ చేయాల్సిన షరతులు, 
మార్గదర్శకములు ఉన్నట్టి - సూచనల పుస్తకము)

(Mohansingh Bayas- Indian Express; Remembering Nehru;) ::::::


కేరళ రాబిన్ హుడ్ - Kochunni19వ శతాబ్దములో కొచ్చున్ని వార్తలలోని వ్యక్తిగా పేరొందాడు 
(famed highwayman ; Kayamkulam). 

1859 ప్రాంతాలలో ఇండియాలో దారిద్ర్యం జటలు విప్పి నాట్యమాడింది. 
నీలిమందు విప్లవం చెలరేగింది. 
ప్రథమస్వతంత్ర్య సంగ్రామము ఉత్తరభారతములో రవరవ లాడసాగినది.
అప్పటికే ఈస్ట్ ఇండియా కంపెనీ భారతీయుల భాగ్యములను కొల్లగొట్టినది. 
ఆంగ్లేయుల ధాష్టీకము మూలంగా 
హిందూ దేశములోని అన్ని రంగాలూ శుష్కించిపోయాయి. 
చాప కింద నీరు లాగా ఇంగ్లీషువాళ్ళ పెత్తనము, పాలనలు 
యావత్ భారత జాతిని పీల్చి పిప్పి చేసాయి. 
ఆసియా దేశాలు  అన్నింటిలోనూ ఈ దుష్కర పరిస్థితి నెలకొని ఉన్నది.
ఫలితముగా మన దేశములో అలవి కాని అశాంతి, 
చెప్పరాని కష్టాలు చుట్టుముట్టాయి.   
కలిమి గలవారు వ్రేళ్ళమీద లెక్కబెట్టే అంతమంది -మిగిలారు, 
సహజంగానే అలాటి వారు తెల్లదొరలకు కాపు కాసే వాళ్ళుగానే- మారిపోవాల్సి వచ్చేది.  
తక్కిన 99 శాతం మంది దారిద్ర్య రేఖకు దిగువన - కంటే - 
పాతాళ స్థాయిలో పడి ఉన్నారు.
అదిగో! ....... అప్పటి దీన పరిస్థితులలో - 
సకల భారతావనిలో- అల్లకల్లోలములు ప్రజ్వరిల్లసాగినవి.
ఆనాడు- కేరళలో పెను సంచలనాలకు కారకుడైనాడు కుచ్చిన్న్ అనే గజదొంగ ఒక్కడు. 

**************************

Kayamkulam - Kochunni


కాయమ్ కులం- లోని కొచ్చున్ని

( Kayamkulam Kochunni ) - 
దారి దోపిడీ దొంగ. ఐనప్పటికీ అతగాడు ప్రసిద్ధికెక్కాడు. 
పేదలకు ఆరాధ్యుడై, ధనవంతులకు పీడకల ఐనాడు కొచ్చున్ని.
;
1859 లో కేరళలో " Central Travancore " లో 
సంచలనములు కలిగించిన 
"కొచ్చున్ని" అనే మనిషి.   
ధనవంతులను దోచి, సంపదను నిరుపేదలకు పంచేవాడు. 
పశ్చిమదేశాలలో "రాబిన్ హుడ్" (  Robin Hood) వలెనే- 
కొచ్చున్నిఖ్యాతి గాంచాడు. 

**************************

కొచ్చున్ని ప్రాణ స్నేహితుడు "ఇత్తిక్కార పక్కి" 
(ఇథిక్కార నది ఒడ్డున ఉన్న ఇతిక్కర గ్రామ నివాసి) .   
( aversion to misers, moneylenders and landlords )  
కొచ్చున్నికి కుడి భుజము "ఇత్తిక్కార పక్కి"; 
వీరిరువురూ చోర ప్రక్రియలో నిపుణులై, 
గవర్న్ మెంట్ కూ, సంపన్నులకూ కంటి మీద కునుకు లేకుండా చేసారు. 
కొన్నేళ్ళపాటు వారిద్దరూ చేసిన చోరీలతో - పరగణాలు అతలాకుతలం ఐనాయి.
సాధారణ ప్రజలకు తాము దోచిన సొమ్మునంతా ఇచ్చేవాళ్ళు. 
తమకై రాగి దమ్మిడీ కూడా అట్టిపెట్టుకోకుండా బీదా బిక్కీకి 
అంతా ఇస్తూన్న జగజ్జంత్రీలైన ధర్మదాతలు- గా ప్రజలలో కీర్తి గాంచారు.

ధనవంతులను దోచి, సంపదను నిరుపేదలకు పంచేవాడు. 
పేదలకు ఆరాధ్యుడై, ధనవంతులకు పీడకల ఐనాడు కొచ్చున్ని.   
ఏది ఏమైనప్పటికీ - దొంగతనము సంఘ ద్రోహము, నేరము కూడా!

ఎట్టకేలకు కొచ్చున్ని ని ప్రభుత్వం బంధించింది. 
కొచ్చుని పూజాపుర సెంట్రల్ జైల్ లో తుది జీవితం గడిపాడు.
కొచ్చున్ని  చెరసాలలో చివరి శ్వాస విడిచాడు.

**************************

ఆతనికి దేవాలయములో folklore ఇప్పటికీ పూజాదులు చేస్తూ, 
మొక్కుబడులు చెల్లిస్తున్నారు అంటే  విచిత్రమే!   
ఎడప్పర లో ఉన్న -"ఎడప్పర మలదేవర్ నాడ కోవెల లో
కొచ్చుని కి నేటికీ సంస్మరిస్తూ ఉంటారు.

1859
**************************

ఆతనికి దేవాలయములో ఇప్పటికీ పూజాదులు చేస్తూ, 
మొక్కుబడులు చెల్లిస్తున్నారు అంటే  విచిత్రమే!   %%%% 
ఎడప్పర లో ఉన్న -"ఎడప్పర మలదేవర్ నాడ కోవెల 
(Edappara Maladevar Nada Temple, Kozhencherry ) లో 
కొచ్చుని ఉనికిని నేటికీ సంస్మరిస్తూ ఉంటారు. 
కురవ కులస్థుడు ఊరళి (ఇడుక్కి కొండలు- లో నివాసము) జాతివారు 
ఈ గాధను ఇష్టంగా చెప్పుకుంటారు. 
ప్రీతితో-  కొచ్చుని ఆరాధనలు చేస్తారు.  
కొచ్చుని పట్ల స్తానిక కొండ జాతి జనులకు- 
కడు భక్తి విశ్వాసాలు ఉన్నవి. 
ఆ దేవాలయములో వాళ్ళు మొక్కులు ఇసూంటారు. 
సారాయి, గంజాయి, తమలపాకులు, విడెము
(= పాన్/ కిళ్ళీ), పొగాకు (టొబాకో), areca nut కాండిల్సు/ కొవ్వొత్తులను, 
సాంబ్రాణీ, అగరు వత్తులనూ ముడుపులుగా, మొక్కులుగా ఇస్తూంటారు.  

**************************

కొట్టరధిల్ శంకున్ని - అనే రచయిత 
కొచ్చుని యశో గాధలు, పుస్తకములుగా అచ్చు వేసారు.
( Kottarathil Sankunni, folklores )  
కొచ్చుని కథలను - కొట్టరధిల్ శంకున్ని విపుల రచనలను చేసాడు. 
కొచ్చున్ని గురించి అనేక జానపద గేయాలు ఉన్నవి.  

ఆతనిపైన మలయాళములో సినిమాలు కూడా వచ్చాయి అంటే 
కొచ్చున్ని స్థానిక ప్రజలలో 
ఎంత craze ని, కీర్తిని పొందాడో అర్ధము చేసుకోవచ్చు. 
[( Kayamkulam Kochunni (1966) Movie in Malayalam]

**************************

కొచ్చున్ని  సాహస కార్యాలు భారతదేశములో- 
అనేక సినిమాలకు - మూలధనములైనవి.
తెలుగులో "బందిపోటు" 
(ఎన్,టి, రామారావు, కృష్ణకుమారి, రాజనాల), 
కొండవీటి  దొంగ - బోటి చలనచిత్రాలకు- 
చలన వస్తు కథగా- కొచ్చున్ని 
'బ్రతుకు చిత్రము' లభ్యమైనది అంటే- అతిశయోక్తి కాదు. 
ఒకానొక చోర యోధ - ధీరకృత్యాలు 
movies కథా రచయితల మేధస్సులకు ఆలవాలములైనవి. 
మూవీ నిర్మాతలకు కనకవర్షము కురిపించే ముడిసరుకుగా దొరికినది.  

Robinhood Of Kerala ,chandamama

13, ఆగస్టు 2012, సోమవారం

కవిత search


"కవిత"అనే చిన్ని పాప తప్పిపోయె, వెతకరా?
"కవిత"అనే చిన్ని పాప తప్పిపోయె, వెతకరా???!!! 
;
ఛందస్సు అనే పచ్చ బుడగ కావాలని అడిగినది 
విచ్ఛందస్సనే గ్యాసు బుడగ బాగుందని అన్నది 
;
ప్రాసలనే సీసాలపై ఊగుతాను అన్నది 
శ్లేషల జెయింట్ వీలు నెక్కుతానని అడిగినది

        "కవిత"అనే చిన్ని పాప తప్పిపోయె, వెతకరా???!!! 


సమాసముల రంగుల రాట్నం ఎక్కుతాను అంటూ 
బహు మారాములు చేసినది
క్లిష్టాన్వయపు డోలలలో ఊగనీయండని అన్నది 
;
కలగాపులగపు భాషల - తకరారుల,తబిసీళ్ళ 
తాయిలాలు అవిగవిగో! కొనిపెట్టు నాకు ఇప్పుడే! 
                  అని అడుగుతూ అడుగుతూ 
                          అడిగేస్తూ, అడుగు వేస్తూ ......
                 గోముగా ప్రశ్నిస్తూ, ప్రశ్నిస్తూ
         ....... కవిత అనే చిన్నారి తప్పిపోయింది ఎటనో?

*************************************;

 ఆవకాయ.కామ్ Selayeru (Link)
                 8 నవం 2008 –


       Shri Radha-Krishna Swinging to the Melodious (Link Photo)
;
Shri Radha Krishna Swinging

 picnic ఆటవిడుపులు , akhilavanitha

9, ఆగస్టు 2012, గురువారం

వానరము చేసిన అర్చనలు

Kalika Mata temple in Ratlam,M.P

;  ;మధ్యప్రదేశ్ రాష్ట్రములో, రత్లామ్ లో 
కాళికా మాత కోవెల ఉన్నది. 

;
ఆ గుడి ప్రాంగణములో (Kalika Mata temple Ratlam,M.P.) 
మహంతీ (= సాధువు) ఉపన్యసిస్తున్నాడు. 
ఆయన ధర్మప్రవచనముల మృదుమధుర వక్కాణములలో శ్రోతలు లీనమైనారు. 
సాధువు రామాయణ గాథను, 
హనుమంతుని మహాకార్యములను విపులీకరిస్తూన్నారు. 
కీర్తనలను, భజనలను మధ్య మధ్యలో పొదుగుతూ, 
రమ్య ప్రవచనములు సాగుతూ ఉన్నవి. 
ఇంతలో అక్కడకు ఒక వానరము (langur) వచ్చింది;
mahantji, దగ్గరగా వచ్చి ఆసీనమైనది. 
ఆ కోతి శ్రద్ధగా అక్కడ పాడుతూన్న కీర్తనలను, వినసాగినది. 
అది మహంత్ జీ మైకు (mic) దగ్గరకు వచ్చి, 
ఆయనవద్ద చనువుగా తిష్ఠ వేసినది. 
            
మహంత్ జీ ఆశీస్సులను ఆ కోతి పొందినది. 
తర్వాత అది- సాధువులకు దీవెనలను ఒసగినది. 
కొన్ని పూలను చేతులలోనికి తీసుకున్నది. 
అచ్చట ఉన్న శ్రీరామచంద్రుల ఫొటోకు పూలను వేసినది. 
సభికులు ఆశ్చర్యపడే రీతిలో - ఆ వానరము- 
సాక్షాత్తూ ఆ హనుమంతుడు కూర్చున్న భంగిమతో- పూలతో పూజలు చేసినది.
~~~~~~  


రత్లామ్, మధ్యప్రదేశ్: జై గురు హనుమాన్
;  
 @@@@@@@@@@@@ 

ఈ విచిత్ర సంఘటన 2011 సంవత్సరములో  సంభవించినది.
 ఏప్రిల్ 25 వ తేదీన (April 25 2011) ఇది జరిగినది.  రత్లామ్ గుడి (M.P.) లో పూజలు చేస్తూ హనుమాన్లు


[Tags:- Ramayana, "Hanumanji", langur]  


రామ్ రామ్ జై సీతా రామ్! 
 జై బోలో హనూమాన్ జీ!


SUPER MONKEY   (Link 1)
Jai Guru Hanuman 

Bolo Siyavar Ramchandra ki Jai. 
Pavana suta Hanuman ki Jai.

The Monkey God , arunachalagrace

Ratlam, Madhyapradesh, Langur , Vedio (  వీడియో link)
;  

Temple పద మూలము


PUTRDA EKADASHI  (5th Jan, 2012)
;

కోవెల- ను ఇంగ్లీషులో Temple అని పిలుస్తున్నారు. 
ఈ "టెంపుల్" అనే మాట ఎప్పటినుండీ వాడుకలోనికి వచ్చినది? 
లాటిన్ పదము "Tempus" అనేది 
ధ్వనిపరముగా "టెంపుల్" కు దగ్గరగా ఉన్నది.
ఐతే దాని అర్ధము మాత్రము - మత గృహ, పూజాదులకు కనెక్షన్ లేదు.
లాటిన్ "టెంపస్" కణత, లోపలి కండరములు అని అర్ధము. 
టెంపుల్ - భారత దేశములోని అర్చనా ధామములకు- అంటే- 
గుడి- కి పర్యాయ పదమై అవతారము దాల్చినది.

Latin-  templum ఇండో యూరోపియన్ మూలము (root) - లలో :- 
కత్తిరించుట, లేక "విభజించబడిన" అనే భావాలను పొందినవి. 
అందరూ తిరుగాడే నేల నుండి- 
విడిగా పవిత్రముగా ఎంచబడుతూన్న భూమియే - 
టెంపుల్ - అనే పదస్వరూపాన్ని సంతరించుకొని ఉండవచ్చును.

లాటిన్ - లో నుండి -> :- ప్రాచీన ఫ్రెంచ్ భాషలో "టెంపులా" నుండి 
ఆంగ్లేయులు తెచ్చిన వర్డ్ యే ఇది! 
ప్రప్రథమముగా ఈ English- word- 
"Temple" 1310 లో ఉపయోగములోనికి వచ్చినది.
నేడు దేవాలయము, ఆలయము ఇత్యాది భారతీయ పద వల్లరి కన్నా- 
ఈ ఆంగ్లేయులు అందించిన "టెంపుల్" అనేదే మెండుగా వాడుకలో ఉన్నది.
అది సరే! ఇవాళ శ్రీక్రిష్ణాష్టమి కదా! 
క్రిష్ణా టెంపుల్ కి వెళ్ళి, పూజలు చేసి, ప్రసాదములను తిన్నారా మరి! 
ఇక ఇవాళ ఒక కోవెల గురించి తెలుసుకొందామా!!!!!!


**********************,

మూసీ నది, తెలంగాణా, హైదరాబాదువాసులకు ప్రధాన జలవనరులు, 
త్రాగునీటికి ముఖ్య ఆధారమైనది. 
మూసీ ఎక్కడ పుట్టిందో తెలుసా మీకు? 
ఇక్కడి కొండల ఏరు "అనంతగిరి".
("అనంతగిరి" అనగానే 
కేరళలోని "అనంతపద్మనాభస్వామి వారు" చప్పున జ్ఞాపకము వచ్చారు కదూ!)

ముచికుందుడు అనే రాజర్షి శ్రీకృష్ణ, బలరాముల చరణారవిందములను కడిగాడు. 
అలా పారిన జలములే ముచికుందానది- గా రూపొందినవి. 
క్రమేపీ, ముచికుంద- కాస్తా "మూసీ నది"( but- 'ఏరు లాంటి నది ఇది) ఐనది.
ఇక్కడ సాలగ్రామ రూపములు కనువిందు చేస్తూన్నవి.
అనంతపద్మనాభస్వామి- వెలసి, భక్తులకు నయనానందకరము చేస్తున్నాడు. 
భాగ్యనగరానికి/  అదే!- మన హైదరాబాదుకు 90 కి.మీ. దూరాన, 
వికారాబాదుకు 5 కి.మీ. దవ్వున నెలకొన్న పుణ్యసీమ ఇది. 
బాటలో ప్రయాణిస్తూన్నంతసేపూ, చుట్టూ పచ్చని ప్రకృతి ఆహ్లాదాన్ని కలిగిస్తూంటుంది.
తాండూరు- హైదరాబాద్ రూట్ లో బయలుదేరాలి. 


శ్రీ మహావిష్ణుపాదపద్మముల వద్ద జనించినది ముచికుందానది. 
రంగారెడ్డి జిల్లా, నల్గొండ జిల్లాలలో ప్రవహించినది ఈ చిన్న నది. 
అనంతగిరులలో- వికారాబాద్ వద్ద ఉద్భవించిన ముచికుందా ఝరి- 
నెమ్మదిగా తూర్పు దిశగా సాగినది. 
ఆ మూసీ వాహిని వాడపల్లి వద్ద కృష్ణానదిలో లీనమైనది.
సముద్రమట్టమునకు 2169 అడుగుల ఎతూన ఉండుటచే, 
అనంతగిరుల హరిత సౌందర్యాలు, యాత్రికులను ఆకట్టుకుంటాయి. 
ఆహ్లాదకర యానము సందర్శకులకు లభిస్తుంది అనడములో సందేహము లేదు.

దారిలో ప్రభుత్వ భోజన హోటల్ ఉన్నదికొంచెం కొస మెరుపు:- Temple అనే Wordకు 
ఈ వ్యాసములో వాడిన ఇతర పదాలు ఏమిటో గుర్తించగలరా?
సరే! అవి ఇవి!
ఇవిగో చూసి, చదవండి!:-

గుడి; ఆలయము, దేవాలయము; దేవళము; కోవెల;
photo astrojmd  (link)

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...