15, జులై 2017, శనివారం

ఆర్ష సాహితిప్రాచీన సంపత్తి - 2

మన ప్రాచీనులు గొప్ప పరిశోధకులు, 
అద్భుత విశేషాలను అక్షరబద్ధం గావించిన మహా పండితులు . 
రెట్టమత శాస్త్రం - గా వ్యవహృతమౌతున్న గ్రంధములోని 
ఈ క్రింది పద్యాలు దృష్టాంతాలు.
పరగ నశోకంబు - బ్రహ్మ మేడియు పూచి ;     కాచిన సస్యసంఘము ఫలించు ;కపురంపు టలు ;అనటులు కచ నల్లవిసె   పై- రాదిగా కృష్ణ ధాన్యములు ప్రబలు ;బాగు మీరగ చింత, పాలయు, కరి వేము ;   కాచిన వ్రీహి వర్గంబు మించు ;వింతగా తుమికి చెట్టంతయు గాచిన ;  యవ నాళ సమృద్ధి యగును మిగుల ;;తే|| గీ|| ఎలమి ములు మోదుగులు కాయ నలరు ;కొఱ్ఱ - మొల్ల పూచిన, ఆవాలు మొల్లమగును ;రావి కాచిన - జనుమును, ప్రత్తి వొడము ;సత్య మింతయు వేంకట క్ష్మాతలేంద్ర||
''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''';
;
కర్షక జగత్తుకు ఈ రచన అమూల్య వరదాయిని. 
ఇందులో - పెద్ద చెట్లు ఏ రకంగా పూస్తాయో గమనిస్తే - రైతులు - తాము ఎట్లాంటి పంటలను వేసుకో వచ్చునో ప్లాన్ చేసుకుని, పొలం పనులను మొదలుపెట్టవచ్చును. 
అంటే మహా వృక్షాలు - formers కి అరచేతిలో ఉన్న భవిష్యత్ దర్శిని, మార్గ దర్శిని అన్న మాట.
;
''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''';
మన పూర్వీకులు సంఘ శ్రేయస్సుకై - 
ఎంత పరిశ్రమించారో - మనకు ఈ పద్య రాజం వలన - బోధ పడుతుంది.
లోక కళ్యాణార్ధమై - ఇంతటి మహోన్నత అంశాలను పద్యాలలోనూ, శ్లోకముల రూపములుగానూ - రాబోయే తరముల కోసం భద్రపరిచారు అలనాటి పెద్దలు.
ప్రతి క్షణమును - ఈ ప్రకృతి రహస్యాలను అవగాహన చేసుకోడానికై వెచ్చించారు. నిఖిల విశ్వ రహస్యాలను, 
ఈశ్వరుని లీలలుగా భావిస్తూ - నిష్కామంగా పరిశ్రమించారు. 
;
వారి పరోపకార బుద్ధి  అనుపమానం.
తాము కనిపెట్టిన అనేక సంగతులను తాళ పత్రములలోనికి ఎక్కించారు.
పుస్తక రూపమున - భావి తరములకు అందించిన మన మాన్యవరులైన పెద్దల దూరదృష్టి అనన్య సామాన్యం. - 
ఆర్యులు మనకు అనుగ్రహించిన విజ్ఞాన సుధా గుళికలు 
ఎల్లరికీ సంభ్రమ, ఆశ్చర్య చకితులను చేస్తున్న అనర్ఘ రత్నములు కదూ!
;
[# 30 RETTAMATA SASTRAM -1938 ; 44 # &
C. MANUSCRIPTS :180 ] ;- &
CP BROWN LIBRARY, 
KADAPA, ANDHRA PRADESH-516003 ;
&
;
సంప్రదింపుల E mail ;-
ఈమెయిల్‌ : cpbrown19@gmail.com
;
సంప్రదింపుల చిరునామా :-
ఫోన్‌ నంబరు : 08562 - 255517
చిరునామా : డోర్‌ నంబర్‌ : 1-1254
ఎర్రముక్కపల్లి, కడప - 5160 ;
&
Lable ref ;- పొలం  proverbs - 2 , పౌరాణిక సా మెతలు, నానుడులు, చాటువులు ; 
లోకోక్తి , ఔచిత్యము ; 
పొలం proverbs , ఆర్ష సాహితి - 2 ;
రెటమత శాస్త్ర Fields - 2 ;
వేంకట క్ష్మాతలేంద్ర, రెటమతం, 12, డిసెంబర్ 2008, శుక్రవారం kona  ;-      [ LINK ] ;

12, జులై 2017, బుధవారం

క్షేమంగా వెళ్ళి, లాభంగా రండి

] పండితమ్మన్యులకు పాదుకాపట్టాభిషేకం ; 
          [ రామాయణ proverbs ]
] తోక వెంబడి నారాయణా అన్నట్లు ;  
        [ రామాయణ proverbs & humor proverbs ]
] క్షేమంగా వెళ్ళి లాభంగా రా!  
] నవ్విన నాప చేనే పండుతుంది.  [ పొలం proverbs ]
] దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి. [ ఇల్లు proverbs ] 
] సూర్యుడి ముందు దివిటీ వలె.  
&
] "పాలు పొంగినట్లు మన ఇంటిలో సిరులు ఉప్పొంగుచున్నవి."
'పాల ముంచినా నీట ముంచినా నీదే భారము,స్వామీ! '
'పాలు చూడనా? ,భాండాన్ని చూడనా?'
పొంగే పాలూ ,వెలిగే దీపమూ.
] పండు జారి పాలలో పడినట్లు.&

; =
] pamDitammanyulaku paadukaapaTTABishEkam ; 
] tOka wembaDi naaraayaNA annaTlu ;
] kshEmamgaa weLLi lABamgaa raa!
] nawwina naapa cEnE pamDutumdi.
] deepam umDagaanE illu cakkadiddukOwaali.

] suuryuDi mumdu diwiTI wale.
;
******************************; 

"వాగర్థావివ సంపృక్తౌ | వాగర్థ ప్రతిపత్తయే |
జగతః పితరౌ వందే | పార్వతీ పరమేశ్వరౌ ."
భావము ;- 

వాక్కు, అర్థములకు గల అవినాభావ సంబంధము వలె 
విరాజిల్లుతున్నజగత్తునకు తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులకు నమస్కరిస్తున్నాను. 
;
******************************; 
;
"శిశుర్వేత్తి ,పశుర్వేత్తి - వేత్తి గాన రసం ఫణీ | 
స ఏవ శ్శంకరో వేత్తి - సమగ్రం వేత్తి నాపరః
;
శిశువులను , పశువులను ,సర్పములను కూడా" సంగీతము" పరవశింప జేయును। -అలాంటి సంగీత సారము సర్వమును 
పరమేశుడు ఒక్కడే దానిని తెలిసి ఉన్న వాడు।
(ఈశునికన్నను ఎక్కువగా , ఇతరులకు ఎరుక ఉండదు।)
;
******************************; 
;  పౌరాణిక సామెతలు, నానుడులు, చాటువులు ; ;
లోకోక్తి , ఔచిత్యము ;  
సుపరిచితమైన వాక్కు ;- LINK ; కోణమానిని ;

11, జులై 2017, మంగళవారం

పౌరాణిక సామెతలు, proverbs - 5

1.  భోజుని వంటి రాజు ఉంటే, కాళిదాసు వంటి  కవి  ఉంటాడు ;  = 
bhOjuni wamTi raaju umTE, 
kaaLidaasu wamTi  kawi  umTADu ;
-  చదువు సామెతలు ;;;;; 

2.  అరుంధతీ గిరుంధతీ కనపడటం లేదు గానీ, 
     ఆరు వేలు అప్పు మాత్రం కనబడుతున్నది  = 
= arumdhatii girumdhatee kanapaDaTam lEdu gAnee, 
aaru wElu appu maatram kanabaDutunnadi.

3.  ఆవులు మళ్ళించిన వాడే అర్జునుడు ; 
-                  -  మహా భారతం సామెతలు ; =    
=  aawulu maLLimcina wADE arjunuDu ; 
                          - mahaa bhaaratam సామెతలు ;
;**************************;

 మాఘుడు , కవిరత్నములు ;-

ఉపమా కాళిదాసస్య,
భారవే రర్ధ గౌరవం ;
దణ్డినః పద లాలిత్యం ,
మాఘే సంతి త్రయో గుణాః ."  =
=

కాళి దాసు కావ్యములలోని ఉపమా సౌందర్యం ,
భారవి కృతుల 'అర్థ గాంభీర్యము', 
దండి రచనలందలి పద లాలిత్యము,
ఈ మూడు లక్షణ , గుణములు ,

మాఘ మహా కవి యొక్క కావ్యములలో ఉన్నవి.
;
లోకోక్తి , ఔచిత్యము ;  LINK ; కోణమానిని ;

పౌరాణిక సామెతలు, proverbs - 4

1) లక్ష్మణ రేఖ - గీసిన గీత దాటకూడదు - అనుట ; =
=  lakshmaNa rEKa =
= geesina geeta daaTakUDadu - anuTa ;
2) హనుమంతుని తోక లాగా.(= పైన సామెతయే!)
3) హనుమంతుని వాలము/ తోక.
4) కోతిమూక.
"ఇక ఇంట్లో కూడా కిష్కింధ కాండ మొదలైంది ,ఈ గోల భరించ లేను.")
5) లంకా దహనం.
     (అంతా ఖరాబు. అన్ని పనులనీ చెడగొట్టుట.)
6) "మంధర వచ్చింది" = తగవులను పెట్టే రకం. 
7)"చుప్ప నాతి శూర్పణఖ,ఓర్వ లేదు."
8) ఇల్లే తీర్ధం, వాకిలే వారణాశి, కడుపే కైలాసం ; =
illE teerdham, waakilE wAraNaaSi, 
kaDupE kailaasam ; ;
;
& ; -
డబ్బు, ధనము, మనీ :-

ధనము కూడ బెట్టి దానంబు చేయక:
తాను తినక, లెస్స దాచుకొనగ :
తేనెటీగ గూర్చి తెరువరి కియ్యదా!:
విశ్వదాభి రామ వినుర!వేమ! =

dhanamu kUDa beTTi daanaMbu chEyaka:
taanu tinaka,lessa daachukonaga :
tEneTIga gUrchi teruvaru kiyyadaa!:

visvadaabhi raama vinura!vEma! 
;
;
డబ్బు, ధనము,money ;
పౌరాణిక సామెతలు, proverbs - 4

పౌరాణిక సామెతలు, proverbs - 3

1) కార్తీకంతో వర్షం - కర్ణునితో యుద్ధం ;
] kaarteekamtO warsham - karNunitO yuddham ;
2) మహా భారతంలో "ఆది పర్వతము" అన్నట్లు.
   (ఆది పర్వము,సభా పర్వము మున్నగునవి).
3) బ్రతికిన బ్రతుకుకు భగవద్గీతా పారాయణమొకటి.
4) పంచ పాండవులు ఎందరు?" అంటే, నా కామాత్రం తెలీదా? 

మంచం కోళ్ళలాగా ముగ్గురు, - అని ,
రెండు వ్రేళ్ళు చూపించి, ఒక్క గీతను పలక పైన రాసాడు. 
 - [ హాస్య Humor సామెతలు ]
; &   పౌరాణిక సామెతలు, proverbs - 3 ;-
"రామ లాలీ! మేఘ శ్యామ లాలీ!
  తామరస నయన దశరధ తనయ లాలీ "
********************************************,
1)" శ్రీరామ" చుట్టి, కావ్య రచనకు ఉపక్రమించుట. 
2) శ్రీరామ రక్ష, సర్వ జగద్రక్ష.
3) ఒకటే మాట, ఒకటే బాణము, ఒకే పత్ని.
4) రామబంటు/రాం బంటు (= నమ్మకమైన సేవకుడు).
5) రామ రాజ్యము (సుభిక్షముగా విలసిల్లుతూన్న దేశము). 
&

1) రామాయణమంతా విని, రాముడికి సీత ఏమౌతుందన్నట్లు.
2) ఏదో ఉడతా భక్తిగా కొంచెం సేవ,సాయం." 
3) భరతుడి పట్నం, రాముని రాజ్యము.
4) లక్ష్మణ దేవర నవ్వు.
(అకారణముగా నవ్వితే, అపార్ధాలకు దారి తీసే నవ్వు).
5) ఊర్మిళ నిద్ర.
6)"వాడి వాక్కు రామ బాణమే! తిరుగు లేదు."
7) సుగ్రీవాజ్ఞ (= తిరుగు లేని ఆన,శిరసావహించాల్సినదే! )
8) కుంభ కర్ణుని నిద్ర.(= మొద్దు నిద్దుర)
9) ఆ జంట సాక్షాత్తూ సీతా రాములే! వారిది అన్యోన్య దాంపత్యం. 
10) తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి.
&
జాతీయములు :-
1) రామ ములగ పండు ; సీతా ఫలము ; రామ చిలుక ;
2)"రామ చక్కని బంగారు బొమ్మ ."
3)"శ్రీరాములు నీవే కలవు." 
(అనగా ,సాక్షి సంతకము వలె/ఒట్టు పెట్టు కొని" 
నిజమే చెబుతాను ."అనుట)
4)"రామ లక్ష్మణులు వీరు, భ్రాతృ ప్రేమకు ప్రతి బింబములు."
5) రాముడు లేని అయోధ్య/రాజ్యము.
(= ఆలనా పాలనా లేక ,పరిపాలనా దక్షుడు లేక ,
అవినీతి పేట్రేగి పోయిన దేశము/ ఇల్లు ఇత్యాదులు.)
6) రాముడున్న చోటే అయోధ్య.
(= జనాకర్షణ ఉన్న వ్యక్తి,
ఎక్కడికి వెళ్ళినా జనం రాక పోకలతో సందడి ,
హడావుడి సాక్షాత్కరించుట.)
7) జనకుని రాజ్యం .(పైన 6 వ సామెత లాంటిదే!) 
8) భరతుని పట్నం.( కొత్త మంత్రి గద్దె నెక్కే దాకా ,
   నామ మాత్రపు అధికారాలతో ఏర్పడిన పదవి వంటిది )
9) రామాయణంలో పిడకల వేట.
10) భూదేవంత ఓర్పు.
11) "ఆమె సీతా మహా లక్ష్మి. ఓర్పు, నిదానం ఎక్కువే!" 
12) లంకేశ్వరుడు.(నియంతలా వర్తించే వాడు.)
13) బోయ వాడు రత్నాకరుడు - శ్రీరామభక్తి ద్వారా - 
           వాల్మీకి మునిగా మారినట్లు =
=  bOya wADu ratnaakaruDu - 
Sreeraamabhakti dwaaraa - 
vaalmiiki munigaa maarinaTlu 
;
***********************************************;
;  హాస్య Humor సామెతలు ;  ;  
పౌరాణిక సామెతలు, proverbs - 3  కోణమానిని [ LINK ]  ;

రెటమతం- పొలం proverbs - 1

1] ఏడు ఎండల విత్తనాలు ఎంత వరపుకైనా ఆగుతవి ;-   

( పరిశోధనలలో - ఇది వాస్తవం - నిజమే - అని తెలుసుకున్నారు.  )
2] చిత్త చిత్తగించి, స్వాతి దయ చూసి, విశాఖ విసరికొట్టకుంటే, 
   అనూరాధలో అడిగినంత పండుతాను - అన్నది జొన్న చేను. ;
3] చిత్తజల్లు - స్వాతి వాన ;

4] చంద్ర పరివేషం - వర్షయోగం ;
============================= ;
=
1] EDu emDala wittanaalu emta warapukainaa aagutawi ;-   
pariSOdhanalalO - idi waastawam - nijamE - 
ani telusukunnaaru.
2] citta cittagimci, swaati daya cuusi, 
wiSAKa wisarikoTTakumTE, 
anuuraadhalO aDiginamta pamDutaanu - 
annadi jonna cEnu. ;
3] cittajallu - swaati waana ;
4] camdra pariwEsham - warshayOgam ;
;

[ uuru, polam #proverbs  # ;
;

[ ఊరు, పొలం proverbs , సామెతలు ] ;;
***************************************;

రెట్ట మతం / రెటమతం = మొండి ఘటం ; 
         పెడర్ధం మనిషి ; పెడకట్టె ; చండి మొండి = 

 ఎవరి మాటలు విననని వ్యక్తి యొక్క స్వభావం ; 
reTTamatam / reTamatam = momDi ghaTam ; peDardham manishi ; peDakaTTe ; camDi momDi = 
= ewari maaTalu winanani wyakti yokka swabhaawam ; 
;
**************************************;
;
రెట్ట మత శాస్త్రము , వ్యవసాయము, ప్రకృతి గురించి ప్రాచీనులు ;-
వ్యవసాయము, ప్రకృతి గురించి ప్రాచీనులు 
అనేక విషయములను పద్య రూపములో అమర్చి,
తమకు భవిష్యత్ తరాల వారికి అందించిన 
అద్భుత విజ్ఞాన కృషి సంపద ఇది.
;
''''''''''''''''''''''''''''''''''''''''''''''
"పరగ నశోకంబు, బ్రహ్మ మేడియు పూచి : 
కాచిన సస్యసం - ఘము ఫలించు :
కపురంపు టనటులు - కాచ నల్లవిసె పై : 
రాదిగా కృష్ణ ధా-న్యములు ప్రబలు :
బాగు మీఱగ చింత- పాలయు కరి వేము : 
కాచిన వ్రీహి వ-ర్గంబు మించు :
వింతగా తుమికి చె-ట్టంతయు కాచిన :
యవ నాళ సమృద్ధి - యగును మిగుల :
;
నెలమి ములు మోదుగలు కాయ నలరు గొఱ్ఱ :
మొల్ల పూచిన ఆవాలు మొల్ల మగును :
రావి గాచిన జనుమును, ప్రత్తి వొడము :

సత్యమింతయు వేంకట క్ష్మాతలేంద్ర."

;-  నేదునూరి గంగాధరం మొదలగు ఆర్ష సాహితీ జిజ్ఞాసువులు
ఈ ప్రాచీన సంపత్తిని, పాఠకులకు అందించుటకై ఎంతో కృషి చేసారు. ;

;************************************************************;
రెట్ట మత శాస్త్రము , వ్యవసాయము, ప్రకృతి గురించి ప్రాచీనులు ; - LINK ;
Labels: ప్రాచీన రత్న మాల ; సూక్తి మణి ;  పొలం proverbs - 1 ;
పౌరాణిక సామెతలు, proverbs - 2, 3 +  ;  
పౌరాణిక సామెతలు, నానుడులు, చాటువులు ;
లోకోక్తి , ఔచిత్యము  [ link ] ;

దీపావళి సామెతలు

1. దీపావళి కి దివ్వె అంత పొట్ట ;
2. దీపావళికి దీపమంత చలి ;
3. దీపావళికి వర్షాలు ద్వీపాంతరాలు దాటుతవి 
4. దిబ్బు దిబ్బు దీపావళి, మళ్ళీ వచ్చె నాగుల చవితి ;
=
''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''
; deepaawaLi saametalu ;-
1. deepaawaLi ki diwwe amta poTTa ;
2. deepaawaLiki deepamamta cali ;
3. deepaawaLiki warshaalu dweepaamtaraalu daaTutawi ;
4. dibbu dibbu deepaawaLi, maLLI wacce naagula cawiti ; 
;
''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''',
"ఉత్తమః క్లేశ విక్షోభం క్షమః సోఢుం న హీతరః ;
మణిరేవ మహా శాణ ఘర్షణం న తు మృత్కణః ." =
ప్రతి పదార్ధం :-
కష్టాల వల్ల కలిగే క్షోభకి ఉత్తముడు మాత్రమే తట్టుకోగలడు . 

సాన మీద ఒరపును మాణిక్యమే 
సహించ గలదు గాని, మట్టి బెడ్డ సహించ గలదా?  **************************************;
ప్రయత్నం ;-
"ఉద్యోగినం పురుష సింహ ముపైతి లక్ష్మీః |
దైవేన దేయమితి కా పురుషా వదంతి |
దైవం నిహత్య కురు పౌరుష మాత్మ శక్త్యా |
యత్నే కృతే యది న సిధ్యతి కో ~ త్ర దోషః ||"

==========================================,

సదా ప్రయత్నము,(ఉద్యోగము చేయుట) చేసే వాని వద్దకు 
లక్ష్మి , సిరి వచ్చి చేరును.
తెలివి తక్కువ వాళ్ళు "దైవమే అంతా ఇస్తుంది" అని పలుకుతారు.
దైవమును ఉపేక్షించి ,
నీ ఆత్మ బలముతో పురుష యత్నమును కొన సాగించు. 
"ప్రయత్నము చేసినప్పటికీ ,ఫల సిద్ధి లభించకున్నచో, నీ తప్పు ఏమీ ఉండదు.
;; *************************************,
;
పౌరాణిక సామెతలు, proverbs - 2 +  ; 

పౌరాణిక సామెతలు, నానుడులు, చాటువులు ;
లోకోక్తి , ఔచిత్యము  [ link ]

పౌరాణిక సామెతలు, proverbs - 2

1) పార్ధ సారథి/విజయ సారథి.(మార్గ దర్శి)
2)  యక్ష ప్రశ్నలు.
3) ఏక లవ్యుడు.
(= గురువు అవసరము లేకుండా,
       స్వయం కృషితో విద్యలను నేర్చు కొనే మనిషి.)
4) ధర్మ క్షేత్రం ,ఇది కురు క్షేత్రం.
5) భీమ బలుడు.
7) కర్ణుడు లేని భారతం.(అసంభవము)
8) శల్య సారధ్యం.
(నాశనానికి దారి తీసే నేతృత్వం/నాయకత్వం/సలహా దారు)
9) అదిగో ద్వారక! ఆల మందలవిగో!
10) వచ్చిన వాడు ఫల్గుణుడు.
11) భీష్మ ప్రతిజ్ఞ, భీకర ప్రతిజ్ఞ.
12) కుంతీ సంతానం.( = తండ్రి ఎవరో తెలీని వాడు.).
13) "ఇంటి నిండా గుడ్డలే,కాలికీ ,చేతికీ తగుల్తూ, 'ద్రౌపదీ వస్త్రాలు' .

14) ఆ ఇల్లు మయసభయే! /ఇంద్ర భవనం!" 
15) అబద్ధం వా సుబద్ధం వా  కుంతీ పుత్రో  వినాయకః ; 
   సారాంశము ;-
   తాను పట్టిన కుందేటికి, మూడే కాళ్ళు - 
     అని భీష్మించుకు కూర్చునేవాడు మూర్ఖుడు ;
 = 
saaraamSamu ;-  
abaddham waa subaddham waa ; 
             kumtee putrO winaayaka@h ; 
= taanu paTTina kumdETiki, mUDE kaaLLu - ani bheeshmimcuku kuurcunEwaaDu muurKuDu ;
;
&
గురుషు మిలితేషు శిరసా :
ప్రణమసి లఘుషూన్నతా సమేషు సమా :
ఉచిత జ్ఞాసి తులే! కిం :
తులయసి గుజ్జూ ఫలైః కనకం :
====================
తాత్పర్య భావము ;-
త్రాసా! గురువులు వచ్చినప్పుడు శిరస్సు వంచుతావు.
లఘువులు వచ్చినప్పుడు ఉన్నతంగా ఉంటావు.
సమానములైన గురువులు వచ్చినపుడు సమముగా ఉంటావు.
"ఈ తీరుగా ఉచితము(= ఔచిత్యము)ను తెలిసిన దానివి", 
ఐనా కూడా ఓ  తరాజు! ఇదేమిటి, ఈలాగున -
బంగారమును గురువిందలతో తూచుతూ ఉన్నావు, ఏలనో? 
; తక్కువ వాళ్ళు / లఘువులు ;
పెద్దలు / బరువైనవి / గురువులు
;

'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''
;
[ తెలుగు పలుకు బళ్ళు, అవీ ఇవీ ; పౌరాణిక సామెతలు, proverbs - 2 ]
పౌరాణిక సామెతలు, నానుడులు, చాటువులు ; 
లోకోక్తి , ఔచిత్యము ;  - లింక్ ;- 14, డిసెంబర్ 2008, ఆదివారం ; 

పౌరాణిక సామెతలు, proverbs - 1

1) ఆలి పంచాయితీ రామాయణం,పాలి పంచాయతీ భారతం. 
2) హనుమంతుని ముందు కుప్పి గంతులా?
3) శ్రీ సీతా రాముల పెళ్ళంట! చూచీ వత్తము ,రా రండి!
4) సీతమ్మ వారి జడ కుప్పెలు.(=ఒక మొక్క పేరు)
5) ఆకాశ రామన్న ఉత్తరములు .(=అజ్ఞాత వ్యక్తి పుకార్లు పుట్టించే మాదిరిగా రహస్యముగా రాసే లేఖలు)
6) హనుమంతుడు సంజీవనీ పర్వతాన్ని పెకలించుకు వచ్చినట్లు.
7) ఊరావలి హనుమాండ్లు./ఊరు అవతలి/ఊరవతలి /.
8) నసీబు నారాయణ.
'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''
1) పలుకే బంగారమాయెనా!
2) సీతమ్మ మా తల్లి, శ్రీ రాముల మాకు తండ్రి. 
3) శ్రీరామ నవమి చలువ పందిళ్ళు.
4) శ్రీరామ నవమి పానకం.
(మిరియాలు,బెల్లము వేసి చేసే పానకము ,వడ పప్పు ప్రసాదములు)
5) అంకె లేని కోతి లంకంతా చెరచిందంట.
6) రెంటికీ చెడ్డ(చెడిన) రామన్న.
7) హరిశ్చంద్రుడి నోట అబద్ధం రాదు, నీ నోట నిజంరాదు.

8) లంకా దహనం./లంకను కాల్చిన వాడు రాముని లెంక
(= బంటు/ నమ్మిన బంటు).
9) అమరము నెమరుకు వస్తే కావ్యాలెందుకు [ = అక్కర లేదు ] ; 
= amaramu nemaruku wastE kaawyaalemduku
;
; ************************************************************************,
పౌరాణిక సామెతలు, proverbs - 1  ; [ తెలుగు పలుకు బళ్ళు, అవీ ఇవీ  ]
పౌరాణిక సామెతలు, నానుడులు, చాటువులు ;
పౌరాణికముల గాధావళి ఆధారముగా లోకోక్తులు ; 12, డిసెంబర్ 2008, శుక్రవారం ;

సార్ధక నామధేయుడు

శ్రీశ్రీ - శ్రీరంగం శ్రీనివాస రావు ;-మహాప్రస్థానం - కలిగించిన సంచలనం  అంతా ఇంతా కదు. తెలుగు కవితా శైలిలో పెను పరిణామాలను తెచ్చింది. యుగకర్త , వైతాళికుడు - ఇట్లాగ కీర్తించబడ్డాడు శ్రీశ్రీ. 
యశస్సు ఎంతో ఉన్న చోట అంతే ఎత్తులో విమర్శకులు, వ్యతిరేక వర్గం వాళ్ళు ఉంటూనే ఉంటారు. 
శ్రీశ్రీ మసిలే ప్రతి చోట, సాహిత్య జిజ్ఞాస కల వ్యక్తులు చేరడం సహజమే కదా! 
అందరూ అవీ ఇవీ మాట్లాడుతున్నారు. 
సాహిత్య విశేషాలతో ఆ సంభాషణలు, 
వాతావరణంలో ఆహ్లాదాన్ని నింపుతూ ఉన్నాయి.
ఇంతలో అక్కడికి ఒక కొత్త అబ్బాయి వచ్చాడు. 
ఒక రోజు శ్రీశ్రీ దగ్గరికి ఒక స్టూడెంట్ వచ్చాడు.  
ఆ పిల్లాడిని మహాప్రస్థాన కర్త - కనుసైగ చేస్తూ, కూర్చోమని 
మర్యాదపూర్వకంగా ఆహ్వానించాడు. 
"నాయనా! నీ పేరేమిటి?" 
శ్రీశ్రీ ప్రశ్నకు బదులు వచ్చింది, "నా పేరు పిచ్చిరెడ్డి." 
;
శ్రీరంగం శ్రీనివాస రావు యొక్క విప్లవాత్మక ధోరణి పట్ల విముఖత ఉన్న విద్యార్ధి అతను. 
మహాకవిశ్రీశ్రీ దగ్గరికి వచ్చి, అతడు తృణీకారంగా, తిరస్కారంగా,
ఆపకుండా మాట్లాడుతున్నాడు.  
అతని వదరుబోతుతనాన్ని తతిమ్మా వాళ్ళు విస్తుబోతూ వీక్షిస్తున్నారు.
ఆతని వైఖరికి పక్కన కూర్చున్న మనుషులు ఖిన్నులై, 
చూస్తూ ఉన్నారు. 
విద్యార్ధి పిచ్చిరెడ్డి అన్నాడు 
"శ్రీశ్రీ! ఇంక మీ మహాప్రస్థానంను ఎవరూ చదవనక్కరలేదు." 
చాలా సేపటి దాకా ఓపిక పట్టి ఉన్న శ్రీశ్రీ,
క్లుప్తంగా చిలికిన పలుకులు - 
కొస మెరుపులు ఔతూ, పరిసరాలలో నవ్వులను వెదజల్లినాయి. 

"ఇదిగో చూడు పిచ్చిరెడ్డీ! సార్ధక నామధేయుడివి నువ్వు." 
;
==================================
;
1] శ్రీ mahaaprasthaanam - kaligimcina samcalanam  amtaa imtaa kadu. telugu kawitaa SaililO penupari Naamaalanu teccimdi. yugakarta , waitaaLikuDu iTlaaga keertimcabaDDaaDu శ్రీశ్రీ. yaSassu emtO unna cOTa amtE ettulO wimarSakulu, wyatirEka wargam waaLLu umTuunE umTaaru. 
2] శ్రీశ్రీ masilE prati cOTa, wEsE prati D saahitya jij~naasa kala wyaktulu cEraDam sahajamE kadaa! amdaruu awee iwee 
mATlaaDutunnaaru. saahitya wiSEshaala tO A sambhaashaNalu, waataawaraNamlO aahlaadaanni nimputuu unnAyi.
3} imtalO akkaDiki oka kotta abbaayi waccADu. "nAyanaa! nee pErEmiTi?" శ్రీశ్రీ praSaku badulu waccimdi, "naa pEru piccireDDi."
] oka rOju oka sTUDemT శ్రీశ్రీ daggarik waccADu. A pillaaDini mahaaprasthaana karta - kanusaiga cEstuu, kuurcOmani 'maryAdapuurwakamgaa aahwaanimcADu.  
3, 4 ] శ్రీశ్రీ yokka wiplawaatmaka dhOraNi paTla wimukhata unna widyaardhi atanu. }}}}  mahaakawi daggariki wacci, అతడు tRNIkaaramgaa, tiraskaaramgaa,ApakumDaa  maaTlADutunnaaDu.
4, 5 ] piccireDDi anE widyaardhi Sree SreetO annaaDu "imka mahaaprasthaanam nu ewaruu cadawanakkara lEdu." 
3, 4] "saardhaka naamadhEyuDiwi nuwwu." ani maaTala curakalu wEsaaru Sree Sree jawaabugaa. 
5} aatani waikhariki pakkana kuurcunna manushulu khinnulai, cuustuu unnaaru. ;
caalA sEpaTi dAkaa Opika paTTi unna శ్రీశ్రీ kluptamgaa cilikina palukulu - kosa merupulu autuu, parisaraalalO nawwulanu wedajallinaayi.
;
************************,
;
సాహిత్య ;- శుక్రవారం 16-06-2017 

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...