30, జనవరి 2011, ఆదివారం

తెనుగు లెంక తుమ్మల సీతారామ మూర్తికి స్ఫూర్తితెనుగు లెంక బిరుదాంకితులు,తుమ్మల సీతారామ మూర్తి
తన జీవిత ప్రయాణానికి ప్రేరణ ఇచ్చిన సంఘటనలను నెమరు వేసుకునేవారు.
తండ్రి - గొప్ప ధర్మ నిష్ఠా పరుడు.
అల నాడు, 19, 20 వ శతాబ్దాలలో సాహిత్యాన్ని
సరస్వతీ దేవికి ప్రతి రూపంగా భావించారు.
నాయన కూడా బీదరికం అనుభవించారు.
నిరు పేదగా గడుపుతూ కూడా నీతి నియమాలకు కట్టుబడి ఉండే వారు.
ఒక పర్యాయం ఆయన స్నేహితుడు,
10 వీశల బంగారాన్ని దాచి పెట్టుకున్నారు.
అటు పిమ్మట, ఊరు నుండి చ్చాడు వచ్చాడు అతను.
"నా బంగారాన్ని ఇవ్వండి." అని అడిగారు.
తండ్రి "నేను భద్ర పరచి ఇస్తున్నాను కదా,
కాబట్టి, నాకు కొంత ద్రవ్యమును ఇవ్వు." అని అడగ లేదు,
అడిగినదే తడవుగా, పది వీశల అపరంజినీ ఆ మిత్రునికి ఇచ్చేసారు.
ప్రతిఫలాపేక్ష లేకుండా, జీవించడమే
మానవ జీవిత పరమావధిగా ఆచరణలో చూపిన మహానుభావుడు ఆయన.
తన తండ్రి నుండి ఈ విశిష్ట వ్యక్తిత్వాన్ని వారసత్వంగా పుణికి పుచ్చుకున్నారు తుమ్మల.
సబర్మతీ ఆశ్రమంలో కొంత కాలం ఉన్నారు తెనుగు లెంక .
జాతి పిత జీవన విధానము ఆయనను చాలా ప్రభావితం చేసింది.
మహాత్మా గాంధీ ఆశయాల ఆచరణా కర్తవ్య బద్ధుడైన
తుమ్మల సీతా రామ మూర్తి చౌదరిని " మహాత్ముని ఆస్థాన కవి"అని
ప్రజలు, ప్రేమతో ప్రస్తుతించారు.
పనిలో పనిగా ఒక కవి మంచి పద్య గానాన్ని ఈ ఫొటోలో చదవండి.
(See LINK) ;
శ్రీ తుమ్మల సీతారామమూర్తిగారు ఆధునిక కవులలో పేరెన్నిక గన్నవారు.
ఇతను 1901 లో జన్మించారు. 1990లో కాలధర్మం చెందారు.
తెలుగు రైతు కుటుంబంలో పుట్టిన యీయన ప్రముఖ గాంధేయవాది.
సబర్మతీ ఆశ్రమంలో కొంతకాలం గాంధీగారి శిష్యరికం చేసి,
మహాత్ముని జీవిత చరిత్రను ‘మహాత్మ కథ’ గా రచించారు.
అదే కాక ఆయన ‘ఆత్మార్పణ’, ‘ధర్మజ్యోతి’, ‘శబల’,
‘గీతాదర్శనం’, ‘సర్వోదయ గానం’, ‘ఉదయగానం’, ‘నేను’,
‘తెనుగునీతి’, ‘సమదర్శి’, ‘పైరపంట’, ‘పరిగపంట’, ‘రాష్ట్రగానం’
మొదలైన గ్రంథాలు ఎన్నో రచించారు.
అన్నిటిలో బాగా ప్రసిద్ధి పొందిన గ్రంథం ‘రాష్ట్రగానం’

స్ఫూర్తి;;
_______

29, జనవరి 2011, శనివారం

హస్త మస్తక యోగముతో బ్రహ్మ జ్ఞానము
శ్రీ
శ్రీ శ్రీ మళయాళ స్వామి సర్వ సమ భావ సంపన్నమైన
బ్రహ్మ విద్యా ప్రచారము చేసారు.
సంఘ శ్రేయస్సే ప్రథమ కర్తవ్యంగా ఆయన స్థాపించి,
నడిపిన పారమార్థిక సమాజములు అన్నీ సర్వ జనామోదము పొందాయి .
అనతి కాలంలోనే ఆయన కీర్తి దశ దిశలా వ్యాపించింది.
దీనిని సహించ లేని అసూయా పరులూ, సనాతనులూ ఉన్నారు.
ఆయనను కించ పఱచడమే వారి ప్రథాన కర్తవ్యంగా ఎంచుకున్నారు.
శ్రీ మళయాళ స్వామి వద్దకు వచ్చిన విద్వాంసుడు ఒకడు ఇలాగ అడిగాడు
“స్వామీ! రామకృష్ణ పరమ హంస –
హస్త మస్తక యోగము – తో వివేకానందునికి బ్రహ్మ జ్ఞానము కలిగించారట కదా!
మరి, మీరు కూడా మాకు అట్లాగ చేయ గలరా?”
తనను ఇరకాటములో పెట్టే ఇలాటి ప్రశ్నలు – ఆయనకు అలవాటే!
కనుకనే స్మిత వదనుడై, తడుముకోకుండా తాపీగా సమాధానం ఇచ్చారు.
“ఆహా! చేయకేమి? అలాగే! తప్పకుండా చేస్తాను;
మీరు వివేకానందుని వలె తయారై (సిద్ధ పడి) వచ్చినచో –
మేమును తప్పక అట్లే చేయ గలము.”
( link -> స్వామి వారి ‘సో~హం’ చిట్కా )
ఆ ప్రతి వాది ప్రతి ధ్వని సేయ లేక, నిరుత్తరుడై, అక్కడి నుండి నిష్క్రమించాడు.
Link ;;;;;;;;
( see this nice bhakti information blog )

25, జనవరి 2011, మంగళవారం

నీ పర్మిషన్ అక్కర లేదు!

"భారత మాత కి జై!"
"వందే మాతరం!" స్వాతంత్ర్య సముపార్జనకై
ఆసేతు హిమాచల పర్యంతమూ
ఏక తాటిపై నడిచిన రోజులలో
ఈ నినాదాలు మన భారత దేశంలో ప్రతి అంగుళమూ మార్మ్రోగినాయి.లార్డ్ కర్జన్ (British India కు ) గవర్నర్ జనరల్‌గా ఉన్న కాలంలో
అశుతోష్ ముఖర్జీ (శ్యాంప్రసాద్ ముఖర్జీ తండ్రి) కలకత్తా హైకోర్టు జడ్జిగా ఉన్నారు.
ఒకరోజు అశుతుష్ ముఖర్జీని కర్జన్ తన వద్దకు పిలిపించాడు.
‘‘ముఖర్జీ గారూ! మీకు మంచి అవకాశం ఇస్తున్నాం.
మిమ్మల్ని గవర్నమెంట్ పనిమీద ఇంగ్లండ్ పంపిస్తున్నాం!’’
ఈ మాట విన గానే అశుతోష్ సంతోషంతో ఎగిరి గంతేస్తాడనుకున్నాడు కర్జన్.
కానీ అశుతోష్ ముఖంలో ఎటువంటి స్పందనా కనబడలేదు.
‘‘సర్! మా అమ్మగారి
అనుమతి తీసుకుని
ఏ సంగతీ మీకు తరువాత తెలియజేస్తాను!’’
అన్నాడు అశుతోష్ ప్రశాంత వదనంతో
కర్జన్ ఆశ్చర్యపోయాడు.
‘‘నేను ఇండియా గవర్నర్ జనరల్‌ని!
నేను ఆర్డరిచ్చిన తరువాత నీకు ఇంకొకరి పర్మిషన్
అవసరమా?’’
గవర్నర్ జనరల్ కాదు గదా, అతణ్ణి పుట్టించిన సృష్టికర్త ఆర్డరు వేసినప్పటికీ,
అశుతోష్‌కి తన మాతృదేవత దీవనే ముఖ్యం!
ఈ సంగతినే అశుతోష్ ముఖర్జీ గవర్నర్ జనరల్‌కి వివరించి,
గుడ్‌బై చెప్పి బయటకు వచ్చాడు.
కర్జన్ నోట మాట రాలేదు!

హిందూ దేశంలో కుటుంబ, అనుబంధాలకు
ప్రత్యేక పవిత్ర భావన ఉన్నది.
అలాగే ప్రకృతిలోని ప్రతి అంశాన్నీ దైవత్వానికి ప్రతిరూపంగా
(ఈ నాటికీ )కొలవడం జరుగుతూన్నది.
మనము పుట్టిన ఈ గడ్డ, మట్టి - అని అందరికీ తెలుసు.
కానీ, ఈ భూమిని " మాతృ భావన"తో పూజ చేయడం
బహుశా ప్రపంచంలో
ఇక్కడ మాత్రమే సాధ్యమైనది.
అందుకే
" వందే మాతరం మనదే భారతం!" అని
ఆ నాడు దశ దిశలూ పిక్కటిల్లాయి.
ఈ పై సంఘటనలో
" మాతృ మూర్తికి అశుతోష్ వంటి పౌరులు ఎనలేని గౌరవం ఇవ్వడం,
మాతృ భూమితో ఉన్న మానసిక మమతానురాగాలు
పరస్పరం - బింబ ప్రతిబింబ భావాలై సాక్షాత్కరిస్తునాయి గదూ!
జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలతో జే జేలు. ;

స్వరాజ్యము కోసమై యావద్దేశము అణువణువూ
ఉత్తేజంతో ఉర్రూతలూగుతూన ఆ రోజులలో -
అశుతోష్ ముఖర్జీ జీవితంలో జరిగిన
ఒక హాస్య సంఘటనకు పునర్దర్శన లాభం .

(see link - konamanini - బుధవారం 28 జూలై 2010 )
నిర్భయత్వానికి మారుపేరు ఈ "Bengal Tiger".
ఇంగ్లీష్ వారు పాలిస్తూన్న ఆ రోజులలో, భారతీయులను ఆంగ్లేయులు
హీనభావంతో చులకన చేసేవారు.
ఒకసారి trainలో అశుతోష్ ప్రయాణం చేస్తున్నాడు.
అతను తన చెప్పుల జతను బెర్త్ కిందపెట్టి, నిద్ర పోసాగాడు.
కొంతసేపటికి ఒక European అదే బోగీలోనికి ఎక్కాడు.
ఆ యూరోపియన్ మనిషికి - సీటు మీద ఒక ఇండియన్ నిద్ర పోవడం -
చాలా ఆగ్రహం కలిగించింది.
ఆ తెల్ల వాడు ముఖర్జీ పాదరక్షల జతను కిటికీలో నుంచి బైటికి విసిరివేసాడు.
పిమ్మట అతడు తన కోటును విప్పి, berth మీద పెట్టి, కునుకు తీయసాగాడు.
Asutosh Mukharji కి మెలకువ వచ్చింది.
తన చెప్పులు కనబడలేదు.
"ఎదుటి సీటు మీద ఉన్న ఇంగ్లీషు వాడు చేసిన పని"అని గ్రహించాడు.

వెంటనే అశుతోష్ అక్కడ కనబడుతున్న తెల్లదొర కోటును
కిటికీలో నుండి విసిరేసాడు.
నిద్ర లేచిన తెల్ల వాడు తన coatను వెతుక్కుంటూ,
"Here! where is my coat?"అంటూ అడిగాడు.
"నీ కోటు నా స్లిప్పర్లను వెదకడానికి వెళ్ళింది."
అని బదులిచ్చాడు అశుతోష్ ముఖర్జీ.

23, జనవరి 2011, ఆదివారం

జాబిలి నేర్చిన వెన్నెల పాట = వేసవిలో వచ్చిన ‘వెన్నెల పాట’


మనిషి జీవితంలో అరమరికలు లేని అందమైన దశ బాల్యం.
పాపపుణ్యాలూ, కష్టనష్టాలూ,
ప్రపంచం పోకడలూ ఏమీ తెలియని వయస్సది.
అమ్మ ఒడిలోనో, తాతయ్య బొజ్జ మీదనో పడుకుని,
లాలి పాటలూ, రామ కథలూ వింటూ,
అచ్చమైన మనస్సు ఫలకం మీద అందమైన దృశ్యాలను ఆవిష్కరించుకుంటూ,
చిన్నారులు చిదానంద మూర్తులై ఉంటారు. ఆ దశలో మనం నేర్పిందే వేదం.
అలా నేర్పడానికి పుట్టిందే బాల సాహిత్యం.
ఆదిలో పిల్లల పదాలన్నీ ఇళ్ళల్లో అమ్మలూ, బామ్మలూ,
అల్లిన బొమ్మల పదాల అల్లికలే!
ఆ తరువాత మహా మహా కవులు కూడా
ఏదో ఒక దశలో బాల సాహిత్యాన్ని సృష్టించారు.
ఆధునిక యుగ కర్త గురజాడ కూడా –
“ మిరప కాయ బజ్జి
మినప్పప్పు సొజ్జి” అంటూ పిల్లాడిలా పదాలు కట్టారు.
ఆ తరువాత కొందరైనా పిల్లల సాహిత్యం కోసం కృషి చేశారు.
రోజులు మారి పోయాయి. మమ్మీ, డాడీ సంస్కృతి మన సమాజాన్ని
ఆపాద మస్తకం ఆవహించింది. “చిట్టీ చిలకమ్మ! అమ్మ కొత్తిందా”
అని పాడుకొనే పిల్లలు ఏరీ!
వాళ్ళలా పాటలను నేర్చుకుని పలికినా ఊరుకునే పెద్దలూ లేరు.
మన పిల్లలు “ అ, ఆ, ఇ, ఈ ….. లతో అక్షరాభ్యాసం చేయడం లేదు.
ముద్దు పలుకులు నేర్చుకునేటప్పుడే ఇంగ్లీషు a b c d ” లు రుద్దుతున్నాం.
అ -అమ్మ ; ఆ – ఆవు అని దీర్ఘాలు తీయడం మన పిల్లలకు రాదు.
“ఎ ఫర్ ఆపిల్ అంటూ పిల్లకాయలు ఎగురుతూంటే మనం వాళ్ళ ముఖాల్లో డాక్టర్లనో,
ఇంజనీర్లనో చూసి ఉబ్బి తబ్బిబ్బవుతున్నాం. గోచీ పెట్టుకోవడం రాని దశలోనే
గొట్టాం పేంట్లు తొడిగి నర్సరీలకూ, L.K.G. లకూ తోలి,
వాళ్ళ నోళ్ళలో నానుతున్న rhymes విని మురిసిపోతున్నాం.
ఇట్టి దశలో ఒకావిడ అమాయకంగా పిల్లల కోసం గేయాలు రాశారు.
ఆమె పేరు పి.కుసుమ కుమారి. రాస్తే రాశారు గానీ,
“జాబిలి నేర్చిన వెన్నెల పాట” అంటూ పరమ కవితాత్మకమైన పేరు పెట్టి,
మరీ అందంగా పుస్తకం అచ్చు వేశారు.
పిల్లల కోసం రాసిన ఈ పుస్తకంలో పేజీ పేజీకి పిల్లలు గీసిన బొమ్మలను సూపర్ ఇంపోజ్ చేసి,
“ఇది పిల్లల పుస్తకం సుమా!” అని ముఖం మీద గుద్ది మరీ చెప్పారు.
బాల సాహిత్యానికి ఆదరణ లేని ఈ కాలంలో
ఈ అతి సాహసం చేసినందుకు రచయిత్రిని అభినందించాల్సిందే!
ఈ పుస్తకంలో మొత్తం 30 గేయాలున్నాయి. అన్నీ తేట తెలుగులో రాసినవే!

“ పట్టెడంచు పావడాలు – పాపాయికి
పట్టె మంచం పావు కోళ్ళు – తాతయ్యకు”
- అని మొదలై,
“పెద్ద వాళ్ళందరినీ పిల్లలుగ పుట్టించు దేవుడూ!”
అనే అమాయకమైన “ఒక్క కోరిక”తో పుస్తకం ముగుస్తుంది.
మధ్యలో ఎన్నో రంగులు, ఎన్నో వెలుగులు.
పుస్తకం ఒక హరివిల్లై కనిపిస్తుంది.
ఈ గేయ రచనలో రచయిత్రి ఒక విలక్షణమైన రీతిని అవలంబించారు.
ప్రాచీనమైన మన సంస్కృతీ సంప్రదాయాలనూ ,
పౌరాణిక గాథలనూ చెప్పడానికి ప్రతీకలను ఎంచుకున్నారు.
“ విభూతి పండు – వెండి కొండలు
కస్తూరి బొట్టు – పాల సముద్రం
తామర పువ్వు – వేద పారాయణం –
తిరుగో తిరుగు, స్వామీ స్వామీ – ప్రదక్షిణం”
-ఇలా నాలుగైదు పాదాల్లో కేవలం ప్రతీకలతో త్రిమూర్తులను రూపు కట్టించారు.

అలాగే,
“ అష్ట దిగ్గజం – భువన విజయం
కృష్ణ రాయలు – ఆముక్త మాల్యద
సాల గ్రామం – నారాయణాయ నమోస్తుతే!
సైకత లింగం – నమ శ్శివాయ”
అంటూ ప్రతీకలతో ఆంధ్ర దేశం గురించి చెప్పడానికి ప్రయత్నించారు.
రామాయణం గురించి కూడా కట్టె, కొట్టె, తెచ్చె”
అన్నట్లు మూడు ముక్కల్లో కొత్త ప్రతీకలతో చెప్పారు.
ఈ పద్ధతి అన్ని గేయాల్లోనూ రాణించింది. చమత్కారం, హాస్యం తదితరాలు ఉన్నా
మన గత సంస్కృతిని ఈ నాటి పిల్లలకు చెప్పాలనే తపనే
మొత్తం గేయాలన్నిటిలోనూ కనిపిస్తుంది.
రచయిత్రి చేసిన ఈ ప్రయత్నాన్ని తప్పనిసరిగా అభినందించాలి.

రచయిత్రి రాసిన కొన్ని పాటలను చదివి, ఆనందించండి.


పిల్ల గాలి ఊసులన్ని
చిన్ని పూల బాసలన్ని
మనసు విప్పి చెబుతుంటే

ఇపుడే వస్తానమ్మా!
కొంచెం సేపు ఆగమ్మా! ||

వన్నె వన్నె ఈకలను
చిన్ని రాళ్ళు,గవ్వలనూ
పోగు చేసుకుని నేను
ఇపుడే వస్తానుండమ్మా! ||

గడ్డి పూల సొగసులన్ని
వెన్నెల కందిస్తాను
అలల నురుగు చిన్నెలను
ఇంద్ర ధనువులకు ఇపుడే
పరిచయాలు చేసొస్తా!
ఇపుడే వస్తాను !ఆగమ్మా! ||

అందమైన ప్రకృతికి
బాల సారె పేరు పెట్టి
ఆనందపుఋతువులకు
ఆ-ఆ -లను దిద్దించి
అమ్మా! నే వస్తాగా!
తొందర చేస్తావేమి !?! ||

బుల్లి బుల్లి పిట్టలకు
మాటలు నేర్పిస్తాను
చిరు జల్లుల వానలను
ఆటలు ఆడిస్తాను
అమ్మా!ఇపుడే వస్తా!
హడావుడి చేయొద్దు! ||


''''''''''''''''''''''''''''''''''''''


చిట్టి చిట్టి పాపాయికి
ఈక ఒకటి దొరికింది
చిట్టి తల్లి ఆ ఈకను
పట్టి ,పట్టి చూసింది

ఈకంటే ఈక కాదు
కన్నంటే "కన్ను" కాదు
అది , వేడుకైన నెమలి ఈక!
కడు వేడుకైన నెమలి కన్ను!

సిరి కన్నుల నింపేను
చిరు వన్నెలు చిందేను
వెన్నెలలో మెరిసేను !
వెన్నెలనే మురిపించును
ఇంతింతని చెప్ప లేము
ఔరౌరా! దీని సొగసు!!!

అలాంటిలాంటి ఈక ఐతే
అలనాడు క్రిష్ణయ్య
ఎలా దీన్ని మెచ్చేనట!?!

::::::::::::::::::::::::::::::::

ఓ జాబిల్లీ! దిగి రావోయి!

[అమావాస్య మఠము నుండి చంద మామా!]

చంద మామ! చంద మామ! చందమామా!
ఎందు దాగి ఉన్నావు చంద మామా! //

చిన్ని పాప మారాములు చేసెనోయీ!
అన్నమింత ముట్ట లేదు,అంట లేదు!
కారు మబ్బున దాగున్న చంద మామా!
మా పాపకుగోరు ముద్ద తినిపించగ వేగ రావోయీ! //

ఆట బొమ్మలంటేను వెగటేసేను
నే- పాట పాడ "విననంటూ" హఠము చేసేను!
"అమా వాస్య మఠము నుండి "చంద మామా!
మా అమ్మాయి కొఱకు రావయ్యా! - హఠమును మాని! //

Labels: బాల కవితా గీతికలు


రాసిన వారు: యరమాటి శశి ప్రపూర్ణ
[ఈ వ్యాసం మొదట మే 24, 1992,
ఉదయం పత్రిక ఆదివారం అనుబంధం లో వచ్చింది.
- పుస్తకం.నెట్]

20, జనవరి 2011, గురువారం

ఫిఫ్టీ శుభ శకునములు


భారతీయ సమాజములోను, ప్రపంచములోని అనేక
సంఘాలలోనూ
ప్రజలు తాము చేస్తూన్న పనులు సక్సెస్ అవాలనీ ఆశిస్తారు.
అందుకు భగవంతుని అనుగ్రహాన్ని అభిలషిస్తారు .
అయితే తాము ఆరంభించిన వ్యాపారము,ఉద్యోగమూ,
గృహ నిర్మాణములు, ఇంటిలోని బాధ్యతలనూ
సక్రమ పద్ధతిలో పూ ర్తి చేయడానికి కొంత మనో బలము అవసరము అవుతుంది.
అలాంటి ఆత్మ స్థైర్యాన్ని అలరచుకునే ప్రక్రియలో
అంతర్భాగాలుగా జ్యోతిష్యము, శకునములు, శుభ లగ్నములు,
వారములు,వర్జ్యములు,తిథులు మున్నగు వాటిని నమ్మకములుగా ఏర్పరచుకుంటారు.
"సూర్యుని కాంతితో సమానమైనవి కాదు గానీ"
వీటిని కారు చీకటిలో చేతిలో ఉంచుకోదగిన టార్చి లైటుల వంటివి అని గుర్తించ వచ్చును.
వానినే “మాంగల్య పంచావత్తు “ అని పిలుస్తారు.
జనులు ప్రారంభించిన పనులలోను, చేస్తూన్న కార్యాలలోనూ,
ప్రయాణాలలోనూ అప్రయత్నముగా
ఈ శకున వస్తు సామగ్రి ఎదురైతే విజయం సిద్ధిస్తుంది.
నేటి ఆధునిక కాలములో ,వీనినే వినూత్న స్వరూపాలలో ఆపాదించుకుని, ఆవిష్కరించుకొన వచ్చును.
ఉదాహరణకు , టెలి విజను ప్రోగ్రాములలో ఆ యా వస్తు సముదాయాలు అగుపిస్తే , శుభ యోగంగా అనుకో వచ్చును.
అదే ఫక్కీలో ప్రయత్న పూర్వకంగా , ముందరే శుభ దృశ్యాలను ఏర్పాటు చేసు కోవాలి.
అందు వలన కొంత మనో నిబ్బరం కలుగుతుంది.దాని ద్వారా ఆరంభించిన పనులలో జయం లభిస్తుంది.
హిందువులకు విద్యాధి దేవత శ్రీ సరస్వతీ దేవి.
శ్రీ వాణీ దేవి హస్త యుగ్మములో అలంకృతమై అలరారు వాయిద్య రాజమే “ కచ్ఛపీ వీణ”.
సంగీత పరికరాలకు ఆది రూపిణి “ వీణియ”యే! ఇన్నేసి మంచి కారణాలు ఉన్నాయి కదా;
కాబట్టి ఈ పాటికే పాఠక మహాశయులు గ్రహించే ఉంటారు; “ వర వీణా పాణి ఐన శ్రీ శారదా దేవి వాయించే వీణ ,
మనకు ఎదురైతే, ఆటోమాటిక్ గా శుభ దాయినియే కదా!
ఇక మాంగళ్య పంచాశత్త్తు వర్గములో చేరిన అంశాలను పరికిద్దాము.1) వీణ ; 2) సంస్కృత వాఙ్మయము 3) పుష్పములు ; 4) అలంకరణ సామగ్రి ; 5) తేనె ; 6)కాటుక ;
7) గోరోజనము ; 8) ఆవు ; 9) ఆవు పేడ ; 10) శంఖము ;
11)చందనము ; 12) అక్షింతలు ; 13) నెయ్యి ; 14) పెరుగు ; 15) పచ్చని గడ్డి ;
16) నిండు కుండ ; 17) భోజనముతో నిండిన పాత్ర ( అనగా క్యారియరు వగైరాలు ) : 18) వడ్డించిన విస్తరి ;19) తాంబూలము ;
20) వాహనము ; 21) ఆసనము ; 22) కొత్త దుస్తులు/ వస్త్రములు ; 23) విసన కర్ర ; 24) జెండా ; 25) గొడుగు ; 26)పానకము ; 27) తెల్లని పూలు/ తెల్లని ధాన్యములు, ధాన్యాలు ; 28) తాజా కూర గాయలు ;
28) తాజా కూర గాయలు ; 29) రావి, మఱ్ఱి , అత్తి , వనస్పతి మున్నగునవి;
30) ఏనుగు ; అద్దము 31)గొఱ్ఱె ; 32) పళ్ళు, ఫలహారాలతో నిండిన బుట్ట, సంచీల వంటివి ; 33) రేగటి మన్ను ముద్ద ; 34) శుభ్రమైన శయ్య ; 34) పీఠము ;35) ఆహారము ఎట్సెట్రాలను రింటూన్న వారు ; 36)కాంచనము = బంగారము ; 37) రజతము = వెండి 38) రాగి వస్తువులు ; 39) రత్నములు ;
40) పట్టు బట్టలు ; 41)చామరములు ; 42) చెరకు ; 43) మేళములు = మంగ వాద్యాలు ; 44)నీళ్ళ గ్లాసు, పాల చెంబు మొదలైనవి ; 45) వెలుగుచున్న అగ్ని ; 46) కల్లు ( ఇది విచిత్రమే! కానీ అల నాడు సోమ రసముతో సమానముగా తలిచే వారు ; కావున “కల్లు”ను కూడా మంచి శకునాల లిస్టులోనికి చేర్చేసి ఉండ వచ్చును.) ; 47) కత్తి, చాకు మున్నగునవి ; . ( కానీ ఎక్సెప్షను ఉన్నది,అది ‘మంగలి కత్తి’ తటస్థ పడ రాదు,అది మాత్రం చెడ్డది. ) ; 48)మాంసము ; (ప్చ్! ఈ వ్యాస రచనా కర్తకు మాత్రం ,దీనిని – శుభ శకునాల లోనికి చేర్చేసేయుట నచ్చ లేదు.) ;
49) పుత్రులతో స్త్రీ, కన్యకా, దంపతులు 50) గుంజకు కట్టిన పశువు .
చూశారు కదా!
మంచి దృశ్య హారములు మన మనసులకు ప్రశాంతతను చేకూరుస్తాయి.
శాంత చిత్తముతో మొదలెట్టిన పనులను దిగ్విజయ భావనతో కొన సాగించ గలుగుతారు.
మనో ధర్మ శాస్తము ( = సైకాలజీ ) ప్రకారము స్వాస్థ్యము కలిగిన మనసుతోనే
నిత్య దైనందిక కార్య క్రమములను మనిషి పూర్తి చేయ గలుగుతాడు.
అనుభవజ్ఞులు ,తత్వ వేత్తలు,జీవిత సరాన్ని కాచి వడబోసిన బుధ జనులు సర్వులకు ఉద్బోధిస్తూన్న బోధనల సారాంశములు ఇవియే కదా!
మానవుని స్వభావములోని మౌలికముగా అంతర్లీనంగా ఉన్న ఫీలింగ్సును, మన దేశీయ లాక్షణిక వేత్తలు "నవ రసములు"గా విభాగించారు.
అలాంటి వింగడింపులలో, లాస, హాస,దరహాసములను మనిషి అధరాల పైన విర బూయించ గల సామర్ధ్యము ఉన్నటువంటి భావ జాలములకు పునాదుల వంటివి శృంగారము , హాస్యము,శాంత రసములు. మన పరిసరాలు అనురాగము, మమత, ప్రేమ , ఆనందములతో నింప బడి ఉండాలి.
అలాంటి వాతావరణము వలన ఎల్లరి హృదయాలు ఆహ్లాదముతో విర బూసే శత దళ పద్మములుగా విలసిల్లుతాయి. మన పూర్వీకులు తాము కని పెట్టినట్టి "ఈ జీవిత రహస్యాలను నాటకములలో, ఇతిహాస , కావ్యాదులలో అంతస్సూత్రాలుగా ఉండ వలెనని " నిబంధనలను విధించారు.$$$$$$
కావ్యాలను సుఖాంతములుగా (= కామెడీ comedy )ఉండేలా రాయవలెనని లాక్షణికులు నిబంధించారు.
ప్రాచీన కాలము నుండి పెద్దలు, వ్యక్తి/ వ్యక్తుల నిత్య ప్రవర్తనలను లోతుగా పరిశీలించారు.
ప్రతి క్షణాన్నీ సంతోష మయంగా చేసుకుంటూ ,
ప్రజానీకం తమ కర్తవ్యములను సంపూర్ణ విజయ వంతముగా ఒనరించుకోగలగాలని ఆర్యులు అభిలషించారు.
అందుకు అవసరమైన విధి విధానాలను ఆచార వ్యవహారములలో అనుసంధించారు.
ఆ అనుక్రమణిక పట్టికలలోని ఒకానొక విభాగమే "శకునములు".
కానీ మూఢంగా అనుసరించ నక్కర లేదు.
ఆలోచనలన్నీ మూఢ నమ్మకముల మయముగా అయిపోతే,
అప్పుడు ఆచరణలు కూడా అసంబద్ధముగా పరిణమిస్తాయి.
అలాంటప్పుడు జీవితములు రసాభాసగా మారి పోయి, ఆస్వాదనా యోగ్యములు కాకుండా పోతాయి.
కాబట్టి, వీలైనంత వఱకూ, వీలు కుదిరినంత దాకా, మన మానసికోల్లాస రూప కర్తలుగా,
" శుభ శకునములను" ఆచరణకు అందు బాటులో ఉంచుకోవాలి.
వీనిని వీలైనంత వఱకు పాటించ వచ్చు; అంతే కానీ, పిల్లి ఎదురైందని ఆగితే,
స్టేషన్లో ఎక్కవల్సిన రైలు కాస్తా జీవిత కాలం లేటు అవుతుంది సుమండీ!

19, జనవరి 2011, బుధవారం

వృక్షో రక్షతి రక్షితః , Daripalli Ramaiah
17 అక్టోబర్ 2007 ( October 17, 2007 )లో వార్తలలో ఒక మంచి వార్త,

"వృక్షో రక్షతి రక్షితః " అనే ఆర్యోక్తి

అతనికి తెలుసునో, లేదో మనకు తెలీదు,

కానీ ఆ సారాంశమునకు ఆచరణలో ప్రతిబింబం అతడు,

నిష్కామ కృషీవలుడు .

అతడే దరిపల్లి రామయ్య. భార్య జానమ్మకు ఆ కార్యాచరణ అంటే సంతోషం.

అతని సైకిలుకు "వృక్షో రక్షిత రక్షితః" అని రాసి ఉన్న బోర్డు ఉంటుంది. vrukshO rakshita rakshit@h" ప్లాస్టిక్ కాయితాలు, వస్తువులూ, పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచే విధికి కంకణ బద్ధుడు రామయ్య ఎగ దోపిన పంచె క

ట్టుతో, నిరాడంబరంగా ఉండే రామయ్య ప్రతి రోజూ సైకిలు మీదబయలుదేరుతాడు.

ఎందుకు? "

మొక్కలను నాటడం కోసం".

రామయ్య 85 వేల అంట్లు కట్టాడు .మొక్కలను, వృక్ష సంపదను పెంపొందించే ఆతడి నిర్విరామ కృషి గొప్పది. కనుకనే ఆతను "వన జీవి"గా ప్రశంసా పాత్రుడు.
వేప, సుబాబుల్, టేకు వంటి వాటిని ఎక్కువగా తీసుకుంటాడు. నీడ నిచ్చే మహా వృక్షాలకు పెద్ద పీట వేస్తారు

Daripalli Ramaiah, and Janammaలు.కేవలం తన ఒక్క చేతి మీదుగానే,ఇంతటి బృహత్ కార్యాన్ని నిర్వహిస్తున్నాడు. అంటు మొక్కలతో తన ద్వి చక్ర వాహనాన్ని తొక్కుతూ,బయలుదేరి,ప్రతి రోజునూ నిద్దుర లేపుతాడు.

( తెలుగు దేశము పార్టీ వారు విద్యార్ధినులకు, కొంత మందికీ సైకిళ్ళను ఉచితంగా ఇచ్చారు, మరి ఈ ప్రకృతి ప్రేమికునికి సైకిల్ ఐనా ఇచ్చారేమో తెలీదు.)తరు ఛాయలలో ప్రాణి కోటి సేద దీరుతూంటాయి,

కాబట్టి నీడ నొసగే పెద్ద చెట్ల జాతులనూ ,రువులను ఎంచుకుంటాడు. కనీసం 100 అంటు కొమ్మలతో , తన సైకిలు పెడలును తొక్కుతూ వెళతాడు. ఖాళీ ప్రదేశాలను గాలిస్తాడు, తన వెంట తెచ్చిన Sapplings ను అంటు తొక్కుతాడు.ఖమ్మం పట్టణం సమీపంలోని కుగ్రామం అతనిది. తన శక్తి మేరకు, శక్తి వంచన లేకుండా ఖమ్మం పరిసరాలలో, చుట్టు పక్కలా మొక్కలను నాటే అసిధారా వ్రతం పూనిన ధన్య జీవి దరిపల్లి రామయ్య. అతను వన దేవతకు ముద్దు బిడ్డ , అందుకే ఆ వన జీవికి ప్రకృతి ప్రేమికుల కృతజ్ఞతాంజలి.

One-man brigade అంటే రామయ్య దంపతులే! 33(+ 6) సంవత్సరాలనుండీ, ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా ప్రకృతి మాతకు చేస్తూన్న రామయ్య సేవ అందరినీ అబ్బురపరుస్తూన్నది.

హోం మంత్రి జానా రెడ్డి , రామయ్యకు, తన జేబులోనుండి 6000 రూపాయలను ఇచ్చాడు. తమ్మినేని వీరభద్రం , రామి రెడ్డి వేంకట రెడ్డి, వనమా వెంకటేశ్వర రావు, గుమ్మడి నరసయ్య, సాంభాని చంద్ర శేఖర్, పాయం వెంకటేశ్వర్లు మున్నగు M.L.A. లు అందరూ, 20 వేలు ఇచ్చారు20 కిలో మీటర్ల దూరంలోని రెడ్డి పల్లి నుండి జిల్లా ప్రధాన కార్యాలయాలకు రాక పోకలతో,వనాల పెంపుదలలో తాను భాగ స్వామి అయ్యాడు.

కనీసం కోటి చెట్లను నాటాలని ఆ దంపతులు లక్ష్యంగా పెట్టుకున్నారు

దాదాపు వెయ్యి స్కూళ్ళలోనూ, 400 ఆఫీసులలోనూ, 258కోవెలలలోనూ వృక్ష రక్షణ, మనిషికీ, జీవ కోటికీ అత్యంత అవసరమనే సంగతులను చెబుతూంటాడు.హరితదన సందేశాలుఅతని ఇంటి గోడలపైనా, అడుగడుగునా రాసి ఉన్నాయి. ఆ నినాద, సూక్తులు ఆతని హృదయ దర్పణంలో సాక్షాత్కరించే మానవాళికి అవసరమైన మణి దీప ప్రభలు.

18, జనవరి 2011, మంగళవారం

“శతభిష నక్షత్రము”, కదంబ తరువు


వృక్ష జాతులలో కదంబ తరువుకు, మన దేశంలో ప్రత్యేక స్థానం ఉన్నది
కదంబము చెట్టును " పార్వతీ వృక్షముగా" ప్రఖ్యాతమైనది.
"కదంబ వన వాసిని" గా అమ్మ వారిని పూజిస్తున్నారు భక్త జనులు.
మీనాక్షి సుందరేశ్వర స్వామి కోవెల ద్వారము వద్ద
స్థల వృక్షము కదంబం చెట్టు పురాతనమైన ది, స్థల వృక్షము.
కదంబం ఆకులలో పెట్టుకుని తిన్నాడట!
"కడిమి చెట్టు" అనే నవలను జ్ఞానపీఠ బహుమతి గ్రహీత
శ్రీ విశ్వ నాథ సత్యనారాయణ రచించారు.
వృక్ష జాతులలో కదంబ వృక్షముకు
మన దేశంలో ప్రత్యేక స్థానం ఉన్నది.
27 నక్షత్రాలకూ ప్రతీకలుగా 27 పాదపములను జ్యోతిష్య, వాస్తు శాస్త్రజ్ఞులు నిర్ణయించారు.
వాటిలో “శతభిష నక్షత్రము” ( పాశ్చాత్యులు Aquarii star ) కు ప్రతిరూపము.
కదంబం పూలు సువాసనలతో పరిమళిస్తూంటాయి.
ఆయా భాషాలో / బొటనికల్ సైన్సులో కదంబ తరువుకు పేర్లు అనేకం .
చెట్టు వ్రేళ్ళు, బెరడు( Bark) , పూలు, ఆకులు అన్ని భాగాలు ఉపయుక్తములే!
అత్తరు / సెంటు, పసుపు పచ్చ రంగు ద్రావణము, జ్వర హారి ఔషధముగా మూలికా వైద్యములలోనూ, ఉపయోగించబడుచున్నవి.
( ఒక కదంబ మహా వృక్షము యొక్క కాండముపైని
గణపతి , మున్నగు రూపాలతో వింతగా ఉన్నది. ఈ ఫొటోను గమనించండి.)

17, జనవరి 2011, సోమవారం

బెంగుళూరులో తోట


బెంగుళూరు లో లాల్ బాగ్ టూరిస్టులకు ప్రత్యేక ఆకర్షణ.
హైదర్ ఆలీ ( బ్రిటీష్ వారితో పోరాడిన యోధుడు టిప్పు సుల్తాన్ కి తండ్రి )
ఈ వనమును నాటాడు.
అనేక దేశాల నుండి వందలాది మొక్కలను తెప్పించి,
విభిన్న జాతుల, ప్రజాతుల మొక్కలతో అభివృద్ధి చేసిన లాల్ బాగ్ తోట నయనానందకరము.
నేడు Lal Bag లో వెయ్యికి పైగా సుగంధ భరితంగా, పుష్పవనము,
ఉష్ణ మండల మొక్కల నిలయంగా విలసిల్లుతూన్నది.
నందన వన సమానంగా నేడు వర్ణాత్మకంగా ఉన్నది.
అచ్చట చూపరులను ఆకట్టుకునే తరువు ఇది.
300 సంవత్సరాల ఈ చెట్టు ప్రకృతి ఇచ్చిన వరము కదా

14, జనవరి 2011, శుక్రవారం

శ్రీ గౌతమీ జీవ కారుణ్య సంఘము" శ్రీ గౌతమీ జీవ కారుణ్య సంఘము”
నిష్కామ సేవలతో ముందంజలో ఉండి, పేరు గాంచినది.
సంఘ సేవా తత్పరత ఉన్న వారిలో,
కొందరి దృష్టిలో “ఆధ్యాత్మిక భావనలు కల వారు” అంటే
తూస్కార భావం ఉండేది.
అలాంటి వారిలో అధికులు నాస్తికులుగానూ,
చార్వాక మతస్థులుగానూ ఉండే వారు.
అట్టి మెంబర్సులో కొందరైన – కమ్యూనిష్టు వర్గీయులు – స్వామి వద్దకు వచ్చారు.
ఆ సమయంలో స్వామి ‘చాతుర్మాస వ్రత దీక్షలో’ ఉన్నారు.
ఆయన కొన సాగిస్తూన్న దైవ భక్తి ప్రచారము ,
మీదు మిక్కిలి సంఘ సేవ, సాంఘిక దురాచారాల నిర్మూలనలు సైతము
ఆ మార్గములో ఆచరణ సాధ్యమే –నని నిరూపించ గలిగిన మహానుభావుడిగా
ప్రజాదరణ పొందారు.
ఆ కారణము చేత ప్రజలు ఆయనకు భక్తితో సమర్పించే కానుకలు
ఇబ్బడి ముబ్బడిగా పెరగుతున్నాయి.
అది చూసి, సహింప లేని అసూయా గ్రస్తులు కూడా తయారవ సాగారు.
ప్రముఖ కమ్యూనిష్టులు కొందరు స్వామి వారి వద్దకు వచ్చారు.
“అయ్యా! ఈ ప్రాంత ప్రజలు ఇచ్చుకుంటూన్న ధనాన్ని
తమరు దోచుకుని పోయి, మీరు ఆ రాళ్ళల్లో (= రాయల సీమలోని ఆశ్రమంలో)
ఖర్చు పెడుతున్నారేమిటి? ఆ ధనమును ఇక్కడనే వెచ్చించ కూడదా?”
అంతట స్వామి ఇలాగ వాక్రుచ్చారు “ సోదరులారా! ఈ ప్రాంతము సంపన్నమైనది.
రాయల సీమలో (ధాత కరువు 7 సంవత్సరాలు ప్రజలను విల విల్లాడారు)
కఱువు కాలమున అన్నము లేక ఎందరో అల్లాడుచున్నారు.
ఇట్టి తరుణమున – ఇచ్చటి ధనమును అచ్చట వినియోగించుట దోషమా?
మీరు దీన జనోద్ధరణమునకై బద్ధ కంకణులైన కమ్యూనిష్టులు కదా!
మీ సమత్వ సిద్ధాంతమేమైనది?
ఆ సిద్ధాంత విషయమున మేమును కమ్యూనిష్టులమే!
కానీ మాకు దైవముపై విశ్వాసము గలదు; హింస మాకు నచ్చదు.”
స్వామి జవాబుతో వారు నిరుత్తరులై, స్వామి కి నమస్కరించి వెను తిరిగి పోయిరి.
మరో మారు ఆధ్యాత్మిక దృష్టి లేని కొందరు సంఘ సేవకులు
స్వామి ని సమీపించి, అడిగారు ఇలాగ
“ అయ్యా! రాయల సీమలో అన్నము లేక ప్రజలు అల్లలలాడుచున్నారు.
మీరిక్కడ వేదాంతమును బోధిస్తూ కాలమును వ్యర్ధ పరుస్తున్నారేల?
ఈ సమయాన మీ శిష్య వర్గముతో గూడి, సాంఘిక సేవలొనరుస్తూ,
దైన్య పరిస్థితులలో ఉన్న జనులను ఉద్ధరించుట మీ ధర్మము కాదా?!”
మరో మారు ఆధ్యాత్మిక దృష్టి లేని కొందరు సంఘ సేవకులు
స్వామి ని సమీపించి, అడిగారు ఇలాగ
“ అయ్యా! రాయల సీమలో అన్నము లేక ప్రజలు అల్లలలాడుచున్నారు.
మీరిక్కడ వేదాంతమును బోధిస్తూ కాలమును వ్యర్ధ పరుస్తున్నారేల?
ఈ సమయాన మీ శిష్య వర్గముతో గూడి, సాంఘిక సేవలొనరుస్తూ,
దైన్య పరిస్థితులలో ఉన్న జనులను ఉద్ధరించుట మీ ధర్మము కాదా?!”
అంతట స్వామి వారిని ఇలాగ ప్రశ్నించారు,
“నాయనలారా! ఇపుడు రాయల సీమలో సంఘ సేవ లొనర్చు
కొన్ని ముఖ్య సంఘములను – అవి యొనర్చు సేవలను పేర్కొన గలరా?”
“ గౌతమీ సేవా సంఘము ప్రథమ స్థానములో ఉన్నది స్వామి!
అహో రాత్రములు శ్రమిస్తూన్నారు,
అంబలి సత్రములు మున్నగునవి నడుపుతూ
అన్నార్తులను ఆదుకుంటున్నారు." అని చెప్పారు.
“ఓహో! అలాగా! ఐతే సంతోషము.
మీరు పేర్కొన్న ఆ గౌతమీ జీవ కారుణ్య సంఘము –
మా ఆశ్రమ సంఘములలో ఒక భాగమే!
అచట సేవలు సేయు వారందరూ మా శిష్యులే!
మేము సంఘ సేవను చేస్తూనే ఉన్నాము కదా!”
అంటూ స్వామి చెప్పగా, వారు ఆశ్చర్య చకితులై, స్వామికి ప్రణమిల్లినారు.
అనేక మందికి – ఆ నాడు
"గౌతమీ సంఘము" స్వామి వారికి సంబంధించిన సంస్థ అని తెలియదు.
రాజమండ్రి నగరము - కేంద్రముగా గౌతమీ సంస్థ నెలకొల్పబడినది.
1935 లో స్వామి అనుమతితో ,
స్వామి శిష్యులైన కారుణ్యానంద స్వామి స్థాపించారు.
ఆధ్యాత్మిక ప్రబోధములకు ప్రాధాన్యాన్ని ఇచ్చినప్పటికీ,
వారు సమాజ శ్రేయస్సును ఏ నాడునూ విస్మరించ లేదు.

13, జనవరి 2011, గురువారం

పౌష్య లక్ష్మి రావమ్మా!
భోగి నాడు పూజలు చేసి
ధనుర్మాసముకు వీడ్కోళ్ళు;
హేమంతములో వణుకుళ్ళు
దక్షిణాయనం గిడిగిళ్ళు;
టా! టా! షయొనారా!

ఉత్తరాయణం అడుగిళ్ళు *
భోగి పండుగకు రేగీ పళ్ళు
పళ్ళు పోయగా పాపళ్ళు
కేరింతలతో హ్యాపీలు!
కొండల కోనల "కనుమ"లలో
మసక మంచులతొ దోబూచి!

ధాన్య లక్ష్మికి స్వాగతము!
పౌష్య లక్ష్మికీ సంబరము;
సస్య లక్ష్మికీ సుస్వాగతము
ప్రతి మది నీకు మందిరము,
సంక్రాంతి దేవీ!రావమ్మా!
మకర సంక్రాంతీ! మహదానంద దాయినీ!
ఆదర పూర్వక స్వాగతము!

[* అడుగు+ఇడుట= అడుగిళ్ళు ]


మిత్రులకూ, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.

Wish You Happy Pongal.

11, జనవరి 2011, మంగళవారం

కరెంటు లేకున్నప్పటికీ వారి నిష్కల్మష కృషిభారతీయ విజ్ఞానానికి క్రీస్తు పూర్వం నుండీ ఉన్న పునాదులకు నిదర్శనమైన
చారిత్రక అమూల్య సంపద తాళ పత్ర సంపుటిగా లభ్యమైంది.
ఆ శ్లోక సంపుటి
క్రీ//పూ//300 సంవత్సరములలోని చాణుక్యుని
"నీతి దర్పణము"అనే ఉద్గ్రంధము.
Mysore prachya likhita bhanadagar, లో ఉద్యోగి శ్యామ శాస్త్రి,
సంస్కృత, కన్నడ, ఆంగ్లాది భాషలలో పట్టు ఉన్న విద్వాంసుడు.
Rudrapatna Shamashastry లైబ్రరీలోని
తాళ పత్రాలను నిరంతరమూ పరిశీలిస్తూ భద్ర పరిచే వాడు.
ఒక రోజు రుద్రపట్నం శ్యామ శాస్త్రి ప్రాచీన వ్రాత ప్రతులను సర్దుతూండగా
ఆయనకి ఒక తాళ పత్ర గ్రంధము కనబడినది
marvelous Indian History అది;" చాణుక్యుని రచన " కనబడింది.
ఆ palm leaves లో ఉన్న శ్లోకాలను చదువుతూ,
అమితానంద ఉద్వేగాలతో ఆనంద బాష్పములతో పులకించిపోయారు.
1905 లో శ్యామ శాస్త్రి గుట్టలుగా ఉన్న తాటాకు గ్రంధ ప్రతులనుండి
అనుకోకుండా ఈ అమూల్య రచనను కనుగొన్నారు .
రుద్రపట్నం శ్యామ శాస్త్రి నివాస గృహం పేరు” అశుతోష్”.
అప్పటికి వారి కాలనీలో కరెంట్ లేదు.
అందుచే వారు టార్చ్ లైట్ ని వేసుకుని పని చేసారు.
కరెంటు లేకున్నప్పటికీ వారి నిష్కల్మష కృ
షి అసిధారావ్రతంలాగా కొనసాగించారు
ఆ కుటుంబీకులు అందరూ!
కౌటిల్య గ్రంథములోని శ్లోకాలను
ఫొటోలు తీయుట,
తర్జుమా చేయుట ఇత్యాది అనేక పనులు చేస్తూ,
శ్యామ శాస్త్రికి చేదోడు వాదోడుగా మనుమరాలు,మనుమడులు నిలిచారు.
మనుమలు చాణుక్యుని రచనను యావన్మందికీ పరిచయం చేసే
ఆ మహత్తరమైన బృహత్ కార్యంలో భాగస్వాములు ఐనారు.
ఈ మహత్తర కార్యము 1905 లో మైసూర్ లోని ఓరియంట్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్
(The Oriental Research Institute (ORI) జరిగింది.

ఆ Details, News English లో అచ్చు ఐనాయి.
´ Indian Antiquity and Mysore Review మొదలగు వివరాలు ప్రింట్ ఐనాయి.
అప్పటినుండీ, రమారమి 6 ఏళ్ళు అవిరళ కృషి చేసి,
1915లో ముద్రణా రూపంలో లోకానికి
అందించ గలిగారు.

తోటలో చిందులు;;;;;;;;; లాల్ బహదూర్ శాస్త్రి భారత ప్రధానిగా ఉన్నారు.
“జై జవాన్! జై కిసాన్!”(Hail the soldier! Hail the Former) అనే
ఉత్తేజ భరితమైన నినాదాన్ని ప్రజలకు మంచి పరిపాలనతో పాటు అందించారు.
(Lal Bahadur Srivastava Shastri :
लालबहादुर शास्त्री ,2 October 1904 - 11 January 1966)
చిన్న తనంలో నాటకాల పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు శాస్త్రి.
మహా భారతము నాటకంలో బాల్యంలో “కృపాచార్యుల వేషం ధరించాడు .
కృపాచార్యులు , కౌరవుల కొలువులో ఉన్నప్పటికీ
పాండవుల అభిమానాన్ని కూడా చూర గొన్నాడు.
అలాగే శాస్త్రి కూడా అజాత శత్రువే!
అతను అందరి మన్ననలనూ పొందిన
సాత్విక స్వభావునిగా పేరు పొందాడు
మూడేళ్ళ వయసులో తల్లి, కుటుంబంతో
తాతగారి పంచన చేరవలసి వచ్చినది.
మాతామహుడు తాత హీరాలాల్
"నన్ హే (nanhe!)”అని మనవడిని
ముద్దుగా పిలిచేవారు.(nanhe = Tiny)
;;;;;;;;;
6 ఏళ్ళు వయస్సులో
ఒక పళ్ళ తోపు ( Orchard ) లోనికి జతగాళ్ళతో వెళ్ళాడు.
పిల్లలందరూ చెట్లు ఎక్కి, పళ్ళు కోస్తూ,
తోటను చిందర వందర చేయసాగారు.
ఇంతలో తోటమాలి వచ్చాడు.
అతను అదిలించగానే, పిల్లలు ఒక్క ఉదటున దూకి, పలాయనం చిత్తగించారు.
లాల్ బహదూర్ శాస్త్రి అమాయకంగా ఒక చిన్న కాయను మాత్రమే కోశాడు.
తతిమ్మా వాళ్ళ లాగా అల్లరి చిల్లరి పనులు తెలీని బాలుడు,
అక్కడే నిలబడి ఉండి, దొరికిపోయాడు.
మాలి లాల్ ను కొట్టబోతూండగా, ఏడుస్తూ బేలగా అడిగాడు,
“ నన్ను కొట్టొద్దు మాలీ! నేను అనాథను.” అంటూ బ్రతిమాలాడు.
జాలితో మనసు కరిగిన గార్డెనర్ బాలుని వివరాలనూ,
ఆచూకీని తెలుసుకున్నాడు.
"బాబూ! నువ్వేమో ముందూ వెనకా ఆధారం లేని అనాథ పిల్లాడివి.
అంచేత నువ్వు మరింత వినయంగా మసలుకోవాలి.
అల్లరి వాడివైతే నీ తల్లి మనసు తల్లడిల్ల్తుంది కదా!
జాగ్రత్తగా మసలుకో నాయనా!”
ఆ తోట మాలి పలుకులు శాస్త్రిని ఎంతో ప్రభావితం చేసాయి.
“ ఇక పై నేను బుద్ధిగా మసలుకుంటాను.
భవిష్యత్తులో నేను మంచివాడిననిపించుకుంటాను.”
అనుకుంటూ అదే దృఢ సంకల్పంతో
జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించగలిగాడు లాల్ బహదూర్ శాస్త్రి.

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...