31, మే 2009, ఆదివారం

చాణుక్యుని "నీతి దర్పణము"చాణుక్యుని "నీతి దర్పణము" ;;;;;;;;;;;;;
''''''''''''''''''''''

క్రీ//పూ//300సంవత్సరములలో నీతి దర్పణము"అనే ఉద్గ్రంధము వెలసినది.సర్వ కాలములలోనూ,సర్వావస్థలలోనూ సర్వ దేశములకూ ఆదర్శ ప్రాయమైన సిద్ధాంతాలను వచిస్తూ,నిర్వచిస్తూ ఈ మహోన్నత ప్రమాణాలు కలిగిన గ్రంధ రాజమును నిర్మించిన వ్యక్తి"విష్ణు గుప్తుడు".అతని తండ్రి పేరు "చణకుడు" అగుటచే "చాణుక్యునిగా" లోక ప్రసిద్ధి గాంచాడు."ద్రమిశుడూ,"కౌటిల్యుడు"అనే నామ ధేయములతో కూడా వ్యవహరించ బడే వాడు.
చంద్ర గుప్త మౌర్యునికి కుడి భుజముగా నిలిచి,ప్రజా శ్రేయస్సును కాంక్షిస్తూ,అలనాడే"శ్రేయో రాజ్యమును"నెలకొల్పిన ధీశాలి.

నాటి మగధ రాజైన ధనక నందునితో విభేదించి,విరోధించి,చంద్ర గుప్త మౌర్యుని రాజుగా చేసి,పాటలీ పుత్రము రాజధానిగా ,సామ్రాజ్యము తీరు తెన్నులను రూప కల్పన చేసి,రాజ్య వ్యవహారాలను నిర్వహించేవాడు.
చంద్ర గుప్తునికి మహా మంత్రిగా,సలహా దారునిగా,సైనిక దళముల పర్య వేక్షకునిగా,పదవులను,బాధ్యతలను,చేపట్టి,బహు చాతుర్యంగా నిర్వహిస్తూ,తన ఆ అనుభవ సారముతో "రామ రాజ్యము"ను ఎలాగ రూపొందించ గలము?"అని అహో రాత్రులూ మధన పడి,అహర్నిశలూ శ్రమించి,రూపొందించిన ఉద్గ్రంధమే"నీతి దర్పణము".

క్రీస్తు పూర్వము 324 నుండి 299 వరకూ తాను నెరిపిన రాజ్య పాలనా విధానములతో జగద్విఖ్యాతిని పొందాడు కౌటిల్యుడు.
కౌటిల్య విరచితమైన అర్ధ శాస్త్రములోమొత్తము 15 అధికరణములు ఉన్నాయి.ఒక్కో అధికరణములో కొన్ని అధ్యాయాలు కలవు.అలాంటి 150 అధ్యాయముల సంకలనమే"అర్ధ శాస్త్రము"(నీతి దర్పణము).

విద్యార్ధి,విద్యా బోధన,కుటుంబ బంధాలు,సుభాషితములు,రాజు,ప్రభు పరి పాలన,ఇలాగ సకల కోణాల ప్రిజంలో కౌటిల్యుని అభిప్రాయములు,స్పష్టముగా,వ్యక్తీకరించబడి వన్నె లీనుతున్నాయి.

"లాలయేత్ పంచ వర్షాణి;
దశ వర్షాణి తాడయేత్;
ప్రాప్యేతు షోడశే వర్షే ;
పుత్రం మిత్ర్ వదాచరేత్."

కుమారుని 5సంవత్సరముల వరకూ లాలిస్తూ ముద్దు చేయాలి.10 స//ల వయసున దండించాలి.16 వత్సరముల ప్రాయమున,తనయుని ఆతని జననీ జనకులు "మిత్రుని వలె"భావించి,వ్యవహరించాలి.
ఇలాటివే ఎన్నో చాటువులుగా,సుభాషితములుగా నేల నాలుగు చెరగులా వ్యాపించి, భారత దేశములో వ్యాప్తి చెంది,జన వాక్యములుగా పరిధవిల్లుతున్నాయి.
శ్రీరామ చంద్రుని వలె,చక్రవర్తి ప్రజలను ఆదర్శ ప్రాయముగా పాలించుటకై చాణుక్యుడు అనేక సూత్రాలను,సిద్ధాంతాలను ప్రతిపాదించాడు.

"కు రాజ రాజ్యేన ;
కుతః ప్రజా సుఖం."

దుష్టుడైన ప్రభువు పాలనలో,ప్రజలకు సుఖము ఎక్కడుంటుంది?"
ప్రజల సుఖ సంతోషాల కోసము రాజ్య పరి పాలన కొన సాగాలనే దృక్కోణములో ,నిర్మితమైన రచన ఇది.
ఈ కోణములో ప్రపంచములోనే బహు అరుదుగా గ్రంధములు వచ్చాయి అనడంలో సందేహము లేదు.

"భ్రమన్ సంపూజ్యతే రాజా!"
నిరంతరము సీమలలో సంచారము చేయుట చే,ప్రభువు పూజించ బడును.

"రాజా రాష్ట్ర కృతం పాపం ;
రాజ్ఞః పాపం పురోహితః."

రాజు చేసిన పాపము పురోహితుడు లేక మంత్రిది ఔతుంది.అమాత్యుడు సరైన మంచి సలహాలను ఇస్తూ,చక్రవర్తిని సన్మార్గములో పెడుతూండలి.అలాగే రాజు దుర్మార్గుడు ఐతే ప్రజలు,ఆతనిని దండించ వచ్చును"అని ఈ శ్లోక భావము.

"బలం విద్యా చ విప్రాణాం;
రాజ్ఞాం సైన్యం బలం తథా;"

బ్రాహ్మణులకు విద్య బలము.అలాగే రాజుకు సైన్యమే బలము."సైన్య బలగాలు దృధముగా,సమర్ధనీయంగా,శౌర్య ప్రతాప పాటవాలకై,వ్యాయామ,సాధనలతో పటిష్ఠముగా ఉండాలని.ఘంటా పధముగా చెప్పాడు చాణుక్యుడు.

"నదీ తీరే చ యే వృక్షాః ;
పర గేహేషు భామినీ;
మంత్రి హీనాశ్చ రాజానః;;
శీఘ్రం నశ్యంతి.న సంశయః."

రాజుకు అసమర్ధుడైన మంత్రి ఉండి తీరాలని"ఖచ్చితముగా నొక్కి వక్కాణించాడు,విష్ణు గుప్తుడు.

"అసంతుష్టా ద్విజా నష్టః ;
సంతుష్టాశ్చ మహీ భృతః."

మహి పాలురు తమకు కలిగిన రాజ్య సంపదతో"ఇంతే చాలును!"అని సంతుష్ఠి చెందరాదు.(నేటి ఆధునిక ప్రాజా స్వామిక ప్రభుత్వ వ్యవస్థలకూ,నేటి చారిత్రక,సామాజిక పరిణామ జనితమైన రాజ్య నిర్వహణా క్రమములో ఈ సూక్తి వర్తించదు.)
"చక్రవర్తి,సామ్రాట్టు" అనే పదాలను చాణక్యుడు వాడ లేదు,అతను అనేక సందర్భాలలో "రాజు"అనే పదమునే ప్రయోగించాడు.

రాజులతో అతి సమీపములోకి చేర రాదనీ,కొంత దూరములో ఉండి,వారి సేవ చేయాలనిన్నీ ప్రభువులతో అతి చనువు కూడదనీ "కౌటిల్యునీ అభిప్రాయాన్ని ప్రతిబింబిస్తూన్నది ఈ క్రింది సూక్తి,

"అత్యాసన్నా వినాశాయ ;
దూర స్థాన ఫల ప్రదాః ;
సేవ్యతాం మధ్య భాగేన ;
రాజా వహ్ని ర్గురుః స్త్రియః."

రాజును,అగ్నినీ,గురువునూ,స్త్రీలను మధ్యే మార్గంగా సేవించాలి."

(ఎల్లలు చెరగి,ప్రపంచమే కుగ్రామముగా మారుతూన్న ఆధునిక ,వైజ్ఞానిక యుగములో ఈ సూక్తి ఆక్షేపణీయమే! ఔతున్నది.)

ఆరు అంశాలను ఉదహరిస్తూ,ఇలాగసూక్తీకరించాడు,నీతి దర్పణ కర్త.

"అగ్ని,ఆపః స్త్రియోః,మూర్ఖః ;
సర్పఃఅ,రాజ కులాని చ;
నిత్యం యత్నేన సేవ్యాని ;
సద్యః ప్రాణ హరాణి షట్."

ఈతడు "స్త్రీల పట్ల కొంత వైముఖ్యమును,కలిగి ఉండడము,చేదుగా ఉన్నది,ప్చ్!!!

శ్రేయో రాజ్య నిర్మాణములో
"అర్ధ శాస్త్రము"యొక్క సృష్టి కర్త ఐన చాణక్యుని మేధా సంపత్తికీ,కృషికీ అద్దము పట్టిన వాక్యాలు ఎన్నో ఉన్నాయి.


"విత్తేన రక్ష్యతే ధర్మః ;
విద్యా యోగేన రక్ష్యతే;
మృదునా రక్ష్యతే భూప@ ;
సత్ స్త్రియా రక్ష్యతే గృహం ."


ధనము చేత "ధర్మము" రక్షించ బడును.యోగము చేత విద్య రక్షించ బడును.సత్ స్త్రీల చేత గృహము సురక్షితమగును.మృదుత్వముచే భూపాలురు రక్షితులు అగుదురు.

సకల సద్గుణములచే సర్వ జన మనోభి రాముడుగా ,యుగ యుగాలుగా పూజ్యనీయుడుగా ఐనాడు గదా మన శ్రీరామ చంద్రుడు,జగద్విదితమే గదా ,ఈ విశేషము.నీతి దర్పణము,అర్ధ శాస్త్రము ,ఆ నాటి సమాజాన్ని,రాజ్య నిర్వహణా పద్ధతులను మన కళ్ళెదుట నిలుప గలిగిన అద్భుత చారిత్రక ఆధారములు.
చాణుక్యుడు అనేక లోక సామాన్య విశేషాలను అక్షర బద్ధము చేసాడు.
విద్య,పిల్లల పెంపకము,వ్యక్తి ప్రవర్తన,సత్పౌరునిగా మనిషి ఎదగడానికి అవసరమైన నియమావళి,స్నేహము,వ్యక్తిత్వముల రూప కల్పన.ప్రభువులు ప్రజల పట్ల అనుసరించ వలసిన బాధ్యతలు.ఇలా సంఘ జీవనానికీ,దేశ భక్తితో మెలగ వలసిన మార్గాలనూ సమగ్రంగా చిత్రీకరిస్తూ ,శ్లోక బద్ధము చేస్తూ
ఈ సేకరణలను మనకు అందించాడు చాణుక్యుడు.

భోజన కాలములో పాటించ వలసిన నియమాలనూ,ఆరోగ్య సంరక్షణకు దోహద పడే అలాంటి అనేక అంశాలను ప్రస్తావించడమును చూస్తే,ఆతని గమనికకూ,పరిశీలనా శక్తికీ ఆశ్చర్యము కలుగక మానదు.
అంతకు పూర్వమునుండీ.జన శ్రుతిలో ఉన్న విశేషాలనూ,సూక్తులనూ,చాణుక్యుడు సుభాషితములుగా అక్షర రూపములను కలిగించాడు అని చెప్ప వచ్చును.
ఈ సూక్తి ముక్తావళులు ఈ నాతికీ ప్రజలకు చిర పరిచితముల వోలె తోచుచున్నాయీ,అంటే నిస్సందేహముగా ఆ భావాలకు గల "సార్వ కాలీనతయే" కారణము.
ఈ శ్లోకాన్ని నెమరు వేస్తూ,అమాత్య చాణుక్యునికి జేజేలు పలుకుదాము.

"రాజ్ఞి ధర్మిణి ధర్మిష్ఠాః ;
పాపే పాపా,సమే సమాః;
రాజాన మను వర్తంతే ;
యథా రాజా తథా ప్రజా."

రాజు ధర్మ వర్తనుడైతే ప్రజలు కూడా,ధర్మ ఆచరణ శీలురు ఔతారు. రాజు పాపములు చేస్తే ప్రజలు కూడా పాప వర్తనులౌతారు.అలాగే ఆతడు మధ్యే మార్గానుయాయి ఔతే,ప్రజలు కూడా అంతే!
రాజును ప్రజలు అనుసరిస్తారు.
(రాజు /నాయకుని శీల సంపద ప్రజలపై అమిత ప్రభావాన్ని చూపుతుంది.)
రాజు ఎలాగో ప్రజలూ అలాగే!"యథా రాజా తథా ప్రజా!"
కోటి యుగాలకైనా కూడా శత కోటి సువర్ణ నాణెములతో తుల తూగే నాణెమైన
పలుకులే కదా ఇవి!
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

27, మే 2009, బుధవారం

శ్రీ వేంకట రామయ్య గారు గారికి...

Pramukhula Haasyam

శ్రీ వేంకట రామయ్య గారు గారికి...

By kadambari piduri,

దుగ్గిరాల గోపాల క్రిష్ణయ్య
స్కూలు ఫైనలు చదువు పూర్తి కాగానే ఉద్యోగములో చేరారు.

చీరాలలోని తాలూకా ఆఫీసులో, కొన్నిరోజులు గుమాస్తాగా పని చేసారు దుగ్గిరాల.

''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''


ఒకసారి ఒక పత్రంలో "వెంకట్రామయ్య గారు చేవ్రాలు..."అంటూ సంతకం చేసి ఉన్నది.

ఆ అప్లికేషన్ను పరిష్కరించి, కవరులో పెట్టి, ఆయనకు పంపించారు.


అలాగ పంపేటప్పుడు కవరుమీద ఆయన అడ్రసును రాస్తూ ;;;;;;

"శ్రీ వేంకట రామయ్య గారు గారికి....." అంటూ మిగతా అడ్రసును పూర్తిగా రాసి,
మరీ పంపించారు దుగ్గిరాల గోపాల క్లృష్ణయ్య "గారు".

{గారు,గారు,గారు,గారు,గారికి,గారెలూ బూరెలూ.....hha hha hhaaaaa!''}
********************************************************

క,ఖ,గ,ఘ

Pramukhula Haasyam
క,ఖ,గ,ఘ
By kadambari piduri,


అక్షర లక్షలు ఇచ్చే కళా పోషకుడు భోజ మహారాజు.

"కాళిదాస కవీంద్రా! క,ఖ,గ,ఘ-లతో శ్లోకమొకటి చెప్పండి!"
అని మర్నాటికి గడువు ఇచ్చాడు.

ఆలోచిస్తూ ఇంటి ముఖం పట్టిన కాళిదాసుకు
దారిలో ఒక అమ్మాయి కనపడింది.
ఆ పాప చేతిలో తాళపత్రము ఉన్నది.
కాళిదాసు ఆమెను పలకరిస్తూండగానే,
అనుకోకుండా సమస్య పరిష్కారమైంది.
కవి కాళిదాసు ప్రశ్న ;;;;;;;
'''''''''''''''''''''''''''''

1)కా స్త్వం? బాలే!
బాలిక;;;;;;;;

2)కాంచన మాలా!

'''''''''''''''''''''''''''''''

1)కస్యహ్ పుత్రీ?

2)కనక లతాయాః

'''''''''''''''''''''''''''''''
1)హస్తే కిం తే?

2)తావీ పత్రం.

'''''''''''''''''''''''''''''''

1)కావా రేఖా?

2)క,ఖ,గ,ఘ


'''''''''''''''''''''''''''''''

ఈ సమాధానముతో శ్లోకము పూర్తి అయింది.

కాళిదాసు సభలో దానిని చదివి,
ఆ సంఘటనను వివరించి,
సభా సదులను
సమ్మోద పరిచాడు.


"కాస్త్వం బాలే? కాంచన మాలా.
కస్యః పుత్రీ? కనక లతాయాః.
హస్తే కిం తే? తావీ పత్రం.
కావా రేఖా? క-ఖ-గ-ఘ."

సారాంశము;;;;;;;
''''''''''''''''''''''''''''''

"బాలికా!!!నీవెవరవు?
"కాంచన మాలను.
"చేతిలో ఏమి ఉన్నది?"
"తాటాకు పుస్తకము."
"అందులో ఏమి వ్రాశావు?"
"క-ఖ-గ-ఘ."

'''''''''''''''''''''''''''''''

తావీ పత్రము=తాళ పత్రము, తాటాకు.
సామాన్య ప్రజలు కూడా
సంస్కృత భాషలోనే సంభాషించగల
భాషా ప్రావీణ్యమును కలిగి ఉండే వారు.
తాళ పత్రములను విద్యాభ్యాసము కొరకై
విరివిగా వాడే వారని
ఈ శ్లోకము వలన తెలుస్తున్నది.'''''''''''''''''''''''''''''''

తట్టలో చెట్టు


తట్టలో చెట్టు!

సాధారణముగా మనము రోజూ వినే మాటలే!
ఐతే వాటి వ్యుత్పత్తి, అర్ధములను తెలుసుకొంటే ఎంతో ఆశ్చర్యము వేస్తుంది.

1. బోన్సాయ్ ట్రీ = మరు గుజ్జు వృక్షాలు

జపాన్ ప్రజలు పెంపొందించిన అత్యధుత కళ ఇది.
సాంప్రదాయ జీవితములో పెన వేసుకున్న
ప్రకృతి పట్ల గల వారి ప్రేమకు ప్రతి రూపము ఈ కళ.

ఇంతకీ ఈ పదానికి అర్ధము ఏమిటో తెలుసా?

బోన్ = ట్రే (tray)
సాయ్ = చెట్టు

మయూరి మారాముBaala
మయూరి మారాము
By kadambari piduri,

పల్లవి ;;;;;;
'''''''''''''''

వ్రేపల్లె వీట-నందుని ఇంట
ఎనలేని సొగసైన-కన్నుల పంట
ఆనందముల ఏరు వాక //

1)కాటుకలు చే సినారు
కర్పూర కాటుకలు చేసినారు
పుష్పములు పరచినారు
పరిమళ పుష్పములు పరచినారు
పేర్మి పేరంటాళ్ళ సొబగు సందడిని
పున్నమి జాబిల్లి తొంగి చూచేనండి! //

2)ఊయలను వేసినారు
బంగారు ఊయలను వేసినారు
లతలను అల్లినారు
పూ తీవియలు అల్లినారు
కూర్మి ప్రజలందరి కోలాహలములు
మబ్బెనక మెరుపులు వంగి చూచేనండి //

3)చందనము అలదినారు
శ్రీ హరి చందనము అలదినారు
అపరంజి నగలెన్నొ వేసినారు
కుందనపు డోలలో ఊపినారు
పింఛమును మరిచిరని మారాము చేయుచూ
నెమలి గడబిడ చేయ కన్నయ్య పక పకా నవ్వెనండీ! //

26, మే 2009, మంగళవారం

జన్మ చరితార్ధము
ఆరంజ్యోతులు ;;;;;
''''''''''''''''

"మాసే భాద్ర పదే విష్ణు తిథే విష్ణు సమన్వితే ;
సిద్ధ యోగే సోమ వారే గిరౌ నారాయణాహ్యయే ;
స్వామి పుష్కరిణీ తీరే పశ్చిమే భ్యూత్స పశ్చిమే ;
బృందారకాణాం బృందసైస్తు ప్రార్ధితో లోక రక్షకః ;
ఆవిర్భూవ భగవాన్ శ్రీనివాసః పరః పుమాన్<"

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

"పద్మ పురాణము"లో వివరణ ;;
''''''''''''''''''''''

భాద్ర పద మాసములోని,శుక్ల పక్షము,ఏకాదశినాడు,శ్రవణ నక్షత్రము,సోమవారమునాడు,ఒక అద్భుత సన్నివేశము జరిగినది.
నారాయణ గిరిలోని స్వామి పుష్కరిణీ తీరముపై శ్రీ శ్రీనివాసుడు ఉద్భవించిన మత్తర ఉద్విగ్న భరిత క్షణములు అవి!

""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""

ఓహో!ఏమి ఆ సన్నివేశము!

జన్మ చరితార్ధము (పాట) ;;;;;;;

పల్లవి;;;;;:
'''''''''''''
నవ కువలయ దళ నేత్రుడు ;
సన్నుత లావణ్య కీర్తి చరితుడు,
ఉదయ ప్రభా తేజుడు
స్వాము ,విమల కమనీయతయే కదా
మా కను పండుగ సేసేటి కథా,గాధ లాహిరి //

1)ఎదలు,సంపెంగలు
తన,సొదలు పూ దేనియలు
మొదలు నీ పదముల కడ
చేరితే చాలునులే!
స్వామి!మా జన్మములు సార్ధక్యమ్ములు!

2)స్వామి హృదయము పైని
వన్నె పూ చెండులో
చిన్ని పూవుగ నైతిని!

నేఘ శ్యాముని మేని ఛాయలన్ని
అలదుకొన్న నీలి సంపెంగను నేను!
సౌభాగ్య జన్మములు ధన్యమ్ములే! //

'''''''''''''''''''''

బ్రహ్మ దేవుడు తిరుమల కోవెలలో వెలిగించిన రెండు దీపములు
నిరంతరము వెలుగుతూనే ఉంటాయి.ఆ దీపములకు "ఆరం జోతులు ",అనగా "ఆరని జ్యోతులు "అని పేరు.

కలి యుగ పర్యంతము,ఆ కాంతులు,శ్రీ తిరుపతి వేంకట రమణుని అనుగ్రహములు
భక్తులకు వర ప్రసాదములుగా లభిస్తూనే ఉంటాయి.


'''''''''''''''

20, మే 2009, బుధవారం

భూమి నున్నగా ఉండును!

Pramukhula Haasyam

భూమి నున్నగా ఉండును!

By kadambari piduri,

1957లో వరంగల్ స్కూలు హెడ్మాష్టారు శేషగిరి రావు హయాంలో జరిగిన సంఘటన ఇది. పాఠశాల ఇన్స్పెక్షన్ సందర్భంగా టీచర్లు విద్యార్ధులకు చాలా సాన బట్టారు. స్టూడెంట్స్ కు సార్ ప్రత్యక్ష బోధన చేశారు. ఇస్మాయిల్ అనే విద్యార్థిని పిల్లలకు చూపిస్తూ "భూమి, ఇతని గుండులాగా ఉంటుంది" అన్నారు.

ఆ తరువాత జరిగిన డిమాస్ట్రేషన్ క్లాసుకు స్టాఫు అందరూ వెళ్ళారు. ఇన్స్పెక్షన్ లో పిల్లలకు ప్రశ్నలు వేస్తున్నారు. "ప్రియమైన విద్యార్ధులారా! భూమి ఎలా ఉండును?".

ఆ బాల గోపాలమూ ముక్త కంఠముతో "భూమి నున్నగా ఉండును!'''''''''''''''''''''''''''''''''''''''''''

పన్నులలో సంపన్నుడు!

"ఫిడేల్ రాగాల డజన్" రచయితగా వాసి కెక్కిన రచయిత

"పఠాభి" పూర్తి పేరు 'తిక్కవరపు పట్టాభిరామి రెడ్డి'.

అతడు తన "పన్ చాంగమ్" లో అన్నారు కదా

"వేసినా, తీసినా బాధించేవి పన్నులు"

నోటిలోని దంతములు, కప్పము, (Teeth &Taxes)
శ్లేషార్థముతో 'పన్నులు" అనే పదమును వేసారు.
ఆ తరు'వాత' ఆరుద్ర చమత్కరించారు ఇల్లాగ

"పన్నులలో సంపన్నుడు పఠాభి!" అంటే

"పన్ కర్త"('రచయిత') అనన్న మాట ఆరుద్రార్ధ అంతర్లీన శ్లేషార్ధము.

వర్ష ఋతువు తిరనాళ్ళ!Baala

వర్ష ఋతువు తిరనాళ్ళ!

By kadambari piduri,


తిరుగు ! తిరుగు! ఓ చెల్లీ!
ఒప్పుల కుప్పలు దబ్బున!
రివు రివ్వు రివ్వున!

1)కారుమొయిలు పల్లకిలో
మెరుపు కన్నెలొచ్చారు
వెంట కొంటె కుర్రకారు
ఉరుం బాట లేసారు
2)కొమ్మ కొమ్మ ఊయెలలో
పూల పాపలూగారు
పూలబాల దోసిలిలో
వాన చినుకు మొగ్గలు

3) గాలి రంగుల రాట్నం
హరివిల్లు జారు(డు) బండ
నదులు ఆడు పులి జూదం
గిరి శిఖరమ్ముల పయి
ఉషా కిరణావళి పరచినట్టి
పరమ పద సోపాన పటము

4)సుక్షేత్రపు అంగడిలో
నవ ధాన్యపు సందడులు
విశ్వమంత విపణి వీధి
భళి! సృష్టి కర్త నిర్వహణం!

కొసరింటి పేరు

Telusaa!

కొసరింటి పేరు

By kadambari piduri,

"ఆంధ్ర ప్రదేశ్" పత్రికా ఎడిటర్ గానూ,
సమాచార శాఖలోనూ ప్రభుత్వ ఉద్యోగాలనూ చేసారు ఎన్.వి. శాస్త్రి.

ఈయన 'గోరాశాస్త్రి"గారికి మేనల్లుడు.

పూర్వం గోదావరి ఒడ్డున ఉన్న మూడు ఇళ్ళలో
గోపాల చక్రవర్తి గారి పూర్వీకులు మధ్య ఇంటిలో ఉండేవారు.

వీరి అసలు ఇంటి పేరు "ఉప ద్రష్ట".

ప్రజలు గుర్తు కోసం 'నడిమింటివారు' అని పిలిచేవారు.

అలాగలాగ "సల్లాప గోపాలం" సృష్టికర్త గారి
అసలింటి పేరుకు బదులుగా
కొసరింటి పేరు 'నడిమింటి "వారుగా
లోకుల పలుకుబడి ద్వారా స్థిర పడి కూర్చుంది.
''''''''''''''''''''''''''''''''''''''''

వాహనముల పేర్లు
Telusaa!

వాహనముల పేర్లు

By kadambari piduri,

కలి యుగ ప్రత్యక్ష దైవము శ్రీ వేంకటేశుని బ్రహ్మోత్సవముల వైభవము
ప్రపంచ ప్రసిద్ధి గాంచినవి.
ఆ ఉత్సవములలో స్వామి వారు
అధిరోహించే వాహనములు కన్నుల పండువుగా శోభిల్లుతూంటాయి.
ఆ వాహనముల పేర్లు మననము చేయుదమా?

పెద్ద శేష వాహనము, చిన్న శేష వాహనము,
హంస వాహనము, సింహ వాహనము,
ముత్యాల పందిరి వాహనము, కల్పవృక్ష వాహనము,
సర్వభూపాల వాహనము, గరుడ వాహనము,
హనుమద్వాహనము, గజ వాహనము,
సూర్యప్రభ వాహనము, చంద్ర ప్రభ వాహనము, అశ్వ వాహనము.

ఈ వాహనములపై
శ్రీ తిరుపతి లో శ్రీ వేంకటేశ్వర స్వామి వారు
దేవేరులతో తిరుమాడ వీధులలో సంచారము
వైభవోపేతముగా జరుగును.

అనంతరము,
గోవిందునికి పల్లకీ సేవ, రధోత్సవము జరుగును.
ఈ వైభోగములను చూచిన వారికి నేత్ర పర్వము, విన్న వారికి 'శ్రవణ పర్వము' .
''''''''''''''''''''''''''''''''''''''''

పాడవోయి పూలరంగడా!
Kovela

పాడవోయి పూలరంగడా!

By kadambari piduri,

pallavi ;;;;;;;
''''''''''

పొన్ను కర్ర పట్టుకునీ -టక్కు టిక్కు టిక్కు టక్కు
అడుగడుగన దణ్ణాలెడుతు-చేరుదాము,రారండీ!
చెన్న రాయని నిండుగ చూద్దాము!
చెన్నుగ నారాయణ మూర్తినీ కందాము //

1)చట్రాళ్ళు,గుండ్రాళ్ళు మన కొక లెక్కా!
చక చక ఎక్కేద్దాము సప్త గిరులను
పట్టుదలకు 'ఉనికి పట్టు 'మనమే గద నా రంగీ! ///

2)గండ శిలలు,సెలయేళ్ళు-మనకు ఛూమ్మంతర్!!!
సంతసాల ఆటపట్టు -మనమే గద ప్రియ రంగీ! //

3)బళ్ళు కట్టు కెళదాము-పిల గాళ్ళు బయలు దేరండీ!
మీ తొలుకు తీపి పలుకు బళ్ళు-హుషారులకు మనికి పట్లు!

(కోరస్) ;;;;;;;;;;
''''''''''''''''''''
స్వామి హొంబట్టు వలువ మెరుపులవే!
శిఖరాల పసిడి కాంతి రాసులవే!

చేరువలోనే తిరుపతి ,చేరుదాము,రా రండీ!
అధరాలపైన వెంకన్న పేర్లు 'తేనె పట్లు 'రా!
సారంగా!పూల రంగా!
"గోవిందా! గోవిందా!" అంటూ మరి కదలండి!


'''''''''''''''''''''''''''''''''''''''

నీ కైదండ ఉండగా..!

Gusagusalu

నీ కైదండ ఉండగా..!

By kadambari piduri,

ఇది ఒకప్పటి మాట. ఇప్పటికీ తలచుకోవాల్సిన సంఘటన.

మీనంబాకం విమానాశ్రయంలో దిగారు అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దామోదరంసంజీవయ్య. జనం వేసిన వేసిన పూలదండలు భారీగా ఉండి, కాస్త అవస్థ పడుతూన్నారు. అప్పుడే అక్కడికి వచ్చారు, సినీ నటుడు పేకేటి శివరామం.

"నమస్కారాలు! మీకు వేసేందుకు,నా దగ్గర దండలు లేవండీ!" అని అన్నారు. అందుకు దా. సంజీవయ్య,ఇలా బదులిచ్చారు."నీ కైదండ ఉండగా, దండ లేదని దండమిడెద వేలమిత్రమా!!!"

ఇది వరకు, తెలుగు భాషా సాహిత్యాల పట్ల ప్రజానీకానికీ,నాయకులకూ భక్తీ అవగాహన ఉండేవి. అందు వలననే ఇలాంటి చమత్కార సమంభాషణలు వెలసి అందరినీ

అలరించేవి.


''''''''''''''''''''''''''''''''''''''''''

మదియే చిలుక
Kovela

మదియే చిలుక

By kadambari piduri,


స్వామి సేవా వాహినిలొ -
ఓలలాడే హృదయము
వహ్వారె! వేయి దళముల పద్మిని! //

1)ఏలొకో ?కోనేరునందున - ఇంతలింతల పులకరింతలు
అవిగవిగొ గోపురములు! - పసిడి వెలుగుల పురములు
ఆ ఛాయలెన్నెన్నో తనలోన - తానాలు చేస్తుంటే
పుష్కరిణి' పులకింత - మయమ'గుట జరుగుట
ఏమి వింత?(= అది సహజమే కదా!)

2) వేదనలు మటుమాయము !
ఇచట ; అణువణువు హర్షము!
స్వామి సాన్నిధ్యము -
ఆహ్లాద పూరితము !

పలుకవే మనసా! - గోవిందు నామము !
కులుకవే "చిలుకవై" -ఆ నామ మధు సుధలందు! //'''''''''''

18, మే 2009, సోమవారం

మీసాల నాగమ్మ
మీసాల నాగమ్మ

By kadambari piduri,

N.T.రామారావు ఆంధ్రుల అభిమాన నటుడే కాక
తెలుగుదేశం పార్టీ స్థాపనతో ప్రపంచానికి
తెలుగు వెలుగును చాటిన మేటి నాయకుడు కూడా.

అందువలననే,
ఆయన ప్రతి చర్యా ఆంధ్రుల హృదయ గ్రంధాలలో నిక్షిప్తమౌతూనే ఉంటుంది.

రామారావు బాల్యం నిమ్మకూరులో గడిచింది.
విజయవాడలో S.R.R.C.V.R. College లో ఇంటర్మిడియెట్ లో చేరారు.

ఆ కాలేజులో తెలుగు శాఖ అధిపతిగా శ్రీ విశ్వనాధ సత్యనారాయణ ఉండేవారు.
విశ్వనాధ "రాచమల్లు దౌత్యము" అనే నాటకాన్ని విద్యార్ధుల చేత ప్రదర్శింపజేశారు.
అందులో నాగమ్మ పాత్రను తారక రామారావును ధరించమన్నారు.
రామారావు అందుకు అంగీకరించారు.

ఐతే ఇక్కడ ఒక చిక్కు వచ్చి పడింది.

నాగమ్మ పాత్ర కోసమని మీసాలు తీసేయమన్నారు గురువు గారు.

నూనూగు మీసాల నూత్న యవ్వనంలో అడుగిడుతూన్న రామారావు
అందుకు ఒప్పుకోలేదు.

చివరికి చేసేది లేక "అలాగే!నీ ఇష్ట ప్రకారమే చేయి" అన్నారు.

అలాగే మీసాలతోనే స్టేజీ మీద నటించి, ప్రైజు కూడా కొట్టేసాడు మన హీరో.

ఆ కాలేజీలో "మీసాల నాగమ్మ" అనే నిక్ నేమ్ ను కూడా సంపాదించాడు


;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;


ఆశ్చర్యకరంగా సినీ హీరోగా స్థిరపడిన తరువాత
పల్నాటి యుద్ధం సినిమాలో నాగమ్మku
ప్రతిద్వంద్వి ఐన బ్రహ్మన్న పాత్రను అద్భుతంగా పోషించారు రామారావు.


''''''''''''


ఆంధ్రా Sow!

By kadambari piduri,

నడిమింటి వేణు గోపాలచక్రవర్తిని "గోల చక్రవర్తి", "పకపక శాస్త్రి" ఇత్యాది ముద్దు పేర్లతో ఫ్రెండ్స్ పిలిచే వారు.

"జీవితం కరిగి పోయే మంచు
ఉన్న దాంట్లోనే అందరికీ పంచు
అంగీలో అగ్ని పర్వతం ఉన్నా
చిరు నవ్వు మన సారగా నవ్వు."

శిష్టా జగన్నాధ రావు తో 'అర్బన్ హాస్యంలో అందె వేసిన చెయ్యి'గా ప్రసిద్ధిచెందిన 'చుక్కవర్తి' ఆడిన లోకాభి రామాయణం ఇది.

"తెలుగు వాళ్ళు ఆంగ్లంలో పెళ్ళి శుభలేఖలను ముద్రిస్తూంటారు.'సౌభాగ్యవతి' అని వధువు పేరుకు ముందు అచ్చు వేయాలి. దానికి క్లుప్తంగా ఆంధ్రేతరులు "sou" అని ముద్రించుకుంటారు. ఆంధ్రులు మాత్రం sow అని వేయించుకుంటారు. మన వాళ్ళకి ఒక విషయం తెలీదు, "sow" అర్ధం ఇంగ్లీషులో 'ఆడ పంది' అని అర్ధం! పెళ్ళి కూతురిని ఇలా పిలిస్తే ఏమైనా బాగుంటుందా?" అని మరో చురుక్కుమనే చమక్కు వేసారు చక్రవర్తి
.

ఏక శ్లోకీ రామయణము
''''''''


;;;
''''''''''''''''


పూర్వం రామ తపో వనాని గమనం;
హత్వా మృగం కాంచనం ;
వైదేహీ హరణం,జటాయు మరణం
సుగ్రీవ సంభాషణం ;వాలీ నిగ్రహణం ;
సముద్ర తరణం, లంకా పురీ దహనం ;
పశ్చాద్రావణ కుంభ కర్ణ నిధనం, వితద్ధి రామాయణం."'''''''''''''''

రాజ నీతి

'''''''''


రాజ నీతి ;


రాజనీతిజ్ఞుడు
జాంబవంతుని వాక్యము ;;;;;;;
''''''''''''''''''''''''''''"జాంబవాన్ తు అధి సంప్రేక్ష్య శాస్త్ర బుద్ధ్యా విచక్షణః ;
వాక్యం విజ్ఞాప యా మాస గుణవత్ దోష వర్జితం. "


''''''''''''''''''''''''''''''''''''''
రాజ నీతి సూత్రము(=వాక్యం)ని జాంబవంతుని విజ్ఞాపనగా,అంటే వినయముతో వ్హెబుతున్నాడు.గుణవంతమైన,దోషములు లేనిది ఐనట్టి వాక్య సూత్రము ఇది.బుద్ధి,తెలివి తేటలు కూడిన శాస్త్ర వాక్యములను జాంబవంతుని నోటి నుండి సలహాలుగా వెలువడినవి.

[ రామాయణము,వాల్మీకి,యుద్ధ కాండము ,17 సర్గ]


'''''''''''''''

కొత్త రిబ్బను
జ్యోకులు ;;;;;;;
'''''''


1)"పూజా బేడీ,కబీర్ బేడీలు కొత్త సీరియల్ లో ఉన్నారు."
"ఆయ్ బాబోయ్!బేడీలు వేసేటంత పెద్ద నేరాలూ,తప్పులూ వాళ్ళేమి చేసారండీ?"


''''''''''''''''''''''''''''''''

2)జంబు లింగం ఈ మధ్య బాగా గురక పెడుతున్నాడు.
"మీ గురక గురించి ఏదో చెప్పాలనుకుంటున్నారు మేనేజరు గారు,మిమ్మల్ని పిలుస్తున్నారు."

బిళ్ళ బంట్రోతు మాటలను వినగానే ముచ్చెమటలు పోసాయి,మన హీరోకి.
తడబడుతూన్న అడుగులతో లోనికి వెళ్ళాడు.
"కూర్చోండి,జంబూ!"
మేనేజరు ఇస్తూన్న అతి గౌరవంతో మరింత కంగారు పడ్తూ,"చిత్తం!రమ్మన్నారట!ఏమి సెలవు?!" నీళ్ళు నములుతూ అడిగాడు.
"మీరీ మధ్య బాగా గురక పెడ్తున్నారు?"
"అబ్బే!నేను రోజూ ఆఫీసులో నిద్ర పోనండీ! ఏదో,మధ్యాన్నం పూట కాస్తంత చిన్న 'కునుకు 'పడుతుంది,అంతే!"
"మీ భీకరమైన గురక వలన......"
చిన్న బోయిన విషణ్ణ వదనముతో,చేతులు కట్టుకుని,కుర్చీలో ఒక మూలకి ఒదిగి కూర్చుని ఉన్న జంబు లింగం,ఆఫీసరు పెదవుల కదలికలపైన వైపు రెప్ప వేయకుండా చూస్తూన్నాడు.
కంటిన్యూ చేస్తూ" గురక మూలాన్న తక్కిన వాళ్ళకి నిద్ర పట్టటం లేదట!అంచేత,మిగతా స్టాఫు అందరూ,ఇప్పుడు ఎవరి పనులను వాళ్ళు శ్రద్ధగా పని చేస్తున్నారు.థాంక్యూ! మీరలాగే మీ నిద్రా రాక్షసాన్ని కొనసాగించండి."'''''''''''''''''''''''''''''''''''''''''''
3)మంత్రిణి కొత్త కమ్యూనిటీ హాలుకు ప్రారంభోత్సవానికి వచ్చినది.
"మేము కమ్యూనిస్తు పార్టీ కాదు కదా!నేను రాను!"
అని పేచీ పెట్టింది మొదట.
"అది పార్టీకి సంబంధించిన ఆఫీసు కాదమ్మా!సభలూ,ఫంక్షన్లూ,అవీ ఇవీ నిర్వహించుకోవడానికి కట్టించిన మినీ హాలు."
నిర్వాహకులు ఎలాగో నచ్చ జెప్పిన మీదట కొత్తగా మంత్రి ఐన ఆమె అక్కడికి విచేసింది.
'''''''''''''''''''''''''''''''''''''
"రిబ్బను కత్తిరించాలండీ!" నిర్వాహకులు వినయం ఉట్టి పడుతూండగా చెప్పారు.

"చాలా బాగుంది,ఈ కొత్త రిబ్బను,కత్తిరించ బుద్ధి కావట్లేదయ్యా!"
అంటూ .....
"సరే!"అంటూ,ఎలాగో కట్ చేసింది ఆమె.
"ఈ రిబ్బను మా చెల్లెళ్ళు జడలకూ,గిఫ్టూలకూ కట్టుకుంటారు.భద్రంగా,పెట్టెలో పెట్టి,మా కారులో పెట్టించండి."


'''''''''''''''''''''''''''''''''''''''''
ఈ నవ్వుల షామియానా

17, మే 2009, ఆదివారం

మునిపుంగవులకు అభి వాదములు
మునిపుంగవులకు అభి వాదములు ;;;;;;
'''''''''''''''''''''''"విశ్వా మిత్ర పరాశరాది భృగు వాగస్త్యః,పులస్త్యః,క్రతుః
శ్రి మానత్రి,మరీచి,కౌత్స పులశ్శక్తిః,వశిష్ఠాః,అంగీరాః
మాండవ్యో,జమదగ్ని,గౌతమః,భరద్వాజాదయః తాపసాః ;
సశ్రీకా మునిపుంగవాః ప్రతి దినం కుర్వంతువాం మంగళం."''''''''''

లూజేంగే! శ్రీ రాజీవ్ గాంధీ


Pramukhula Haasyam

లూజేంగే!

By kadambari piduri,

కీర్తి శేషుడు శ్రీ రాజీవ్ గాంధీ ఆనాడు అలుపూ సొలుపూ లేకుండా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. బాల్యం నుండీ ఇంగ్లీషులోనే ఆయన విద్యాభ్యాసం కొనసాగింది. అందుచేత మాతృభాష ఐన హిందీతో పాటుగా ఆంగ్ల భాషకూడా మిళితమై పోయేది. ఎంతగా మిశ్రమం ఐపోయేదీ అంటే శ్రోతలకు తాము వింటూన్నవి హిందీ పదములే అని భావిస్తూండేంతగా!

రాజీవ్ గాంధీ ఒక చోట ఇస్తూన్న స్పీచ్ లో ప్రసంగ వశాత్తూ దొర్లిన మాటలు "...జీతేంగే యా లూజేంగే..." .

చటుక్కున త్రుళ్ళిపడి వాడిన పదమూ, దొర్లిన భాషా దోషాన్నివెంటనే గ్రహించారు రాజీవ్ గాంధీ. వెనువెంటనే తన పొరబాటును సరిదిద్దుకుంటూ, ఆయన ఉపన్యాసమును కొనసాగించారు."....జీతేంగే యా హారేంగే...."

ఇలాంటి వింత భాషా స్ఖాలిత్యాలు ఆనక నవ్వులను విరబూయిస్తాయి కదూ!
'''''''''''

వాహనముల పేర్లుTelusaa!


వాహనముల పేర్లు

By kadambari piduri,
కలి యుగ ప్రత్యక్ష దైవము శ్రీ వేంకటేశుని బ్రహ్మోత్సవముల వైభవము ప్రపంచ ప్రసిద్ధి గాంచినవి.ఆ ఉత్సవములలో స్వామి వారు అధిరోహించే వాహనములు కన్నుల పండువుగా శోభిల్లుతూంటాయి. ఆ వాహనముల పేర్లు మననము చేయుదమా?

పెద్ద శేష వాహనము, చిన్న శేష వాహనము, హంస వాహనము, సింహ వాహనము, ముత్యాల పందిరి వాహనము, కల్పవృక్ష వాహనము, సర్వభూపాల వాహనము, గరుడ వాహనము, హనుమద్వాహనము, గజ వాహనము, సూర్యప్రభ వాహనము, చంద్ర ప్రభ వాహనము, అశ్వ వాహనము.

ఈ వాహనముల పై శ్రీ తిరుపతి లో శ్రీ వేంకటేశ్వర స్వామి వారు దేవేరులతో తిరుమాడ వీధులలో సంచారము వైభవోపేతముగా జరుగును. అనంతరము, గోవిందునికి పల్లకీ సేవ, రధోత్సవము జరుగును. ఈ వైభోగములను చూచిన వారికి నేత్ర పర్వము, విన్న వారికి 'శ్రవణ పర్వము' .

రెట్టింపు నామము


Telusaa!

రెట్టింపు నామము

By kadambari piduri,

ఊర్ధ్వపుండ్రములను శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి ఫాల భాగమున తీర్చి దిద్దుతారు.
శ్రీ తిరు వేంగళనాధునికి అభిషేకము చేసిన
అనంతరము ఊర్ధ్వ పుండ్రములను నుదుట తీర్చి దిద్దుతారు.
తిరు పుండ్రములకు ఉపయోగించే దినుసుల వివరములు మీకు తెలుసా ?


;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;16 తులముల పచ్చ కర్పూరమును,
ఒకటిన్నర తులముల కస్తూరిని ఉపయోగిస్తారు.

కొన్ని సందర్భములలో అధిక కొలతలతో దినుసులు నామములకై వినియోగిస్తారు.

రెట్టింపు నామము ;;;;;;;;;;
''''''''''''''
32 తులముల పచ్చ కర్పూరము'ను,
3 తులముల కస్తూరిని వాడుట సాంప్రదాయము.

బ్రహ్మోత్సవములలో వచ్చునట్టి శుక్రవారములలో ఈ ప్రత్యేకత .

కనుకనే ఈ నామధారణకు "రెట్టింపు నామము " అని పేరు.

అందు చేతనే ముందు రోజు అనగా
గురువారము నాడు స్వామి వారి"నేత్ర దర్శనము" భక్త జనావళికి లభించుచున్నది .

భక్తులకు ఈ దృశ్యము నయనానంద పర్వములను కలిగించుననుటలో సందేహమేల!!!


''''''

హంసల దీవి
హంసల దీవి ;;;;;;;
'''''''''''''పిల్లలూ!చారిత్రక ,భౌగోళిక ప్రాధాన్యము కలిగిన అనేక ప్రదేశములు మన దేశములో ఉన్నాయి . ఆ యా ప్రంతాలకు ఆ పేర్లు ఎలా వచ్చాయో తెలుసు కుందామా!!!!!

"హంసల దీవి"::::::కృష్ణా నది ,సముద్రములో కలియు చోట ఉన్న పుణ్య క్షేత్రము.
గంగా నది లో అనేక కలుషములు ఏర్పడ సాగెను. ప్రజల పాపములను స్వీకరిస్తూన్న ,"గంగా మాత ",పాప ప్రక్షాళనము చేసుకొనుటకై పక్షి రూపము ధరించెను .

"గంగా దేవి " , కృష్ణా సాగర సంగమము ఉన్న సీమలో ,,,కాకి రూపములోవచ్చి ,స్నానము చేసేది.(గురుడు కన్యా రాశిలో ప్రవేశించే శుభ ఘడియలలో ,వాయస రూపిణి ఐన గంగమ్మ ,ఓలలాడేది.)కాకి రూపంలో వచ్చిన ఆమె ," హంస"గా మారి పోయేది .

అందు వలననే ,ఆ సీమకు "హంసల దీవీ " అనే నామ ధేయము కలిగినది .

'శ్రీ వేణు గోపాల క్షేత్రము ' ,సంగమేశ్వర ఆలయము ' ఇచట ఉన్నవి .శ్రీ విష్ణు మూర్తి , పరమేశుడు, ఒకేచోట కొలువై ఉండుట ,ఇక్కడి ప్రత్యేకత .

హంసలదీవి , విజయ వాడకు 90 కీ మీ' దూరములో ఉన్నది .

15, మే 2009, శుక్రవారం

కవి సామ్రాట్! టాకింగ్ సమ్ రాట్!" ( some rot)


''''''Pramukhula Haasyam

యు ఆర్ టాకింగ్ సమ్ రాట్!

By kadambari piduri,

పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి బాల్య స్మృతిలో ఇది ఒకటి.

శర్మగారికి తెలుగు సబ్జెక్టును,
ఇంగ్లీషు సబ్జెక్టును జొన్నలగడ్డ శివశంకర శాస్త్రి బోధించేవారు.

శివశంకర శాస్త్రి తమ తోటి ఆంధ్రోపన్యాసకుడైన
"శ్రీ మద్రామాయణ కల్పవృక్షము" రచయిత అయిన
శ్రీ విశ్వనాధ సత్యనారాయణ గారిని పట్టుకుని తమాషాగా ఇలా అనేవారుశ్రీ,"కవి సామ్రాట్!
"యు ఆర్ టాకింగ్ సమ్ రాట్!" ( some rot)"

'''''''''''''''''''''''''''''''''''''''''''

శాస్త్రీయాలు

Pramukhula Haasyam

శాస్త్రీయాలు

By kadambari piduri,

పురాణం సుబ్రహ్మణ్య శర్మ
('ఇల్లాలి ముచ్చట్లు' శీర్షికా రచయిత) స్నేహాల ముచ్చట్లు.

నడిమింటి గోపాల చక్రవర్తి కి మేనమామ 'గోరా శాస్త్రి'.

దాని గురించి చెబుతూ
"గోరాశాస్త్రి గారికి మేనల్లుడుగా ఉండటం కూడా పెద్ద ఫీటే!
పెద్ద కళ్ళూ, పెద్ద ముఖం, పొట్ట కదుల్తూ నవ్వడం...
ఇవన్నీ "గోరా శాస్త్రీయాలు"!

తదనంతరం అవన్నీ "గోపాల శాస్త్రీయాలై" కూర్చున్నాయి.


'''''''''''''''''''''''''''''''''''''''''
నడిమింటి గోపాల శాస్త్రి,
'గోరా గారికి తాను మేనల్లుడైనందుకు 'గర్వ పడుతూ,
సంతోషంతో ఆ ప్రశంసా పూర్వకమైన కామెంట్ ను స్వీకరించారు.


''''''''''''''''''''''''''''''''''''''''''

14, మే 2009, గురువారం

Telusaa!

Hawauian Creole

By kadambari piduri,

మాయా బజారు సినిమాలో ఘటోత్కచుడు అంటాడూ
"ఎవరూ పుట్టించకపోతే మాటలెలా పుడతాయి?"

క్రొత్త భాషల ఆవిర్భావానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇది!

అమెరికాను కనుగొనడం మానవ జాతి చరిత్రలోనే అతి పెద్ద మలుపు.

అది "ఎడ తెరిపి లేని మానవుల వలస"లకు praస్థానం.

1880 లలో హవాయీ దీవులకు
యూరోప్ దేశాల నుండి అసంఖ్యాకంగా
జన సందోహాలు వలసలు వెళ్ళారు.

అందరూ ఒకరికి ఒకరు క్రొత్త వారే!
పరస్పరం అపరిచితులు.
ముక్కు ముఖమూ తెలియని వారే!

ఐనా వారి పిల్లలు కలిసి ఆటలు ఆడుకునేవారు.


ఆటలలో వారిలో వారికి కలిగించుకున్న
భాషా సమన్వయముతో ఒక సరిక్రొత్త భాష ఉద్భవించినది.
మరో 30 ఏళ్ళలో ఆ భాషకు ఓ పేరు కూడ వచ్చింది.

అదే "Hawauian Creole".''''''''''''''''''''''''''

బర్మా ఆంధ్ర కేసరి

Telusaa!

బర్మా ఆంధ్ర కేసరి

By kadambari piduri,

"బర్మా ఆంధ్రకేసరి", "భారతీయ సింహము "గా పేరొందిన వ్యక్తి శ్రీ అవటపల్లి నారాయణ రావు గారు. 1930సంవత్సరములలో ఇపుడు మియన్మార్ గా పిలవబడుతున్న అప్పటి బర్మాలోని భారతీయ కార్మికుల కష్టాలను చూచి చలించిపోయారు. వారి బాగోగులకోసరం తన జీవితమునే అంకితం చేసిన మహనీయుడు ఆయన!

తెలుగు సోదరుల కోసం, భారతీయుల కోసం, కార్మిక చట్టమును రూపొందించి, అమలులోకి తెచ్చిన కార్యసాధకుడు ఆయన. అందుకే బర్మాలోని ఆంధ్రులకు సదాస్మరణీయుడు 'అవట పల్లి నారాయణ రావు'.

రమ్య జామాతృ ముని


Telusaa!


రమ్య జామాతృ ముని

By kadambari piduri,

"శ్రీ వేంకటేశ్వర సుప్రభాతము" ,
"శ్రీ వేంకటేశ మంగళాశాసనమ్"లు సుప్రసిద్ధమైనవి.
భక్త కోటి హృదయములను పులకింప జేసే మాధుర్య శ్లోక గుచ్ఛములు ఇవి.
శ్రీ వేంకటేశ పుణ్య శ్లోకములను రచించుటచే పునీతుడైన మహనీయుని పేరు తెలుసా?
ఆ భక్త వరేణ్యుని నామ ధేయం "రమ్య జామాతృ ముని"


శ్రీ వేంకటేశ మంగళాశాసనమ్
"శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం
శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్ "
అనే మొదటి శ్లోకముతో ప్రారంభమౌతున్నది.

"శ్రీ మత్సుందర జామాతృ ముని మానస వాసినే
సర్వ లోక నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్ ."

అని, రచయిత 'జామాతృ ముని' నామ ధేయం ప్రస్తావన ఉన్నది.

Views (53

12, మే 2009, మంగళవారం

శుక్రాచార్యుడు-ధృతరాష్ట్రుడు

Pramukhula Haasyam

శుక్రాచార్యుడు-ధృతరాష్ట్రుడు

By kadambari piduri,


భారత రాష్ట్రపతిగా ఉండిన శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి
ఇంగ్లండ్ లో కంటి ఆపరేషన్ జరిగింది.
సక్సెస్ అయిన ఆపరేషన్ తో
స్వదేశానికి తిరిగి వచ్చేశారు రాధాకృష్ణన్.

విలేఖరులు వివరములు అడుగుతూంటే,
ఆట్టే పరేషాన్ అవకుండా తాపీగా జవాబు చెప్పారు

"అంత మాత్రం ఆపరేషన్ ను మన ఇండియాలో చేయగలరు!"
అంటూ కొనసాగించారు

".... అక్కడ ఒక కంటి ఆపరేషన్ తో
నన్ను శుక్రాచార్యుణ్ణి చేసేసారు.
ఇంకో కంటికి గనక చేస్తే
ఏకంగా నన్ను ధృతరాష్ట్రుణ్ణి చేసేస్తారేమోనని
భయపడి ఇలాగ ఇండియాకి వచ్చేసాను."


''''''''''''''''''''''''''''''''''''''''''

విప్లవ మార్జాలం

Pramukhula Haasyam

విప్లవ మార్జాలం

By kadambari piduri,


సినీ గీత రచయిత శ్రీ శ్రీ
కమ్యూనిజం భావాలతో ఉత్తేజితుడైన విప్లవ కవి.
రష్యా , చైనా దేశాలను సందర్శించి, తన మాతృ భూమికి తిరిగివచ్చారు.

ఫ్రెండ్స్తో ఇష్టా గోష్టిలో ఇలా చెప్పారు

"చైనాలో అందరూ'పిల్లి'ని 'విప్లవ ప్రాణి'గా గౌరవిస్తున్నారు."

"ఔనా? అరె! అలాగలాగా! అలాగెందుకనీ?" విస్తుబోయిన శ్రోతలు అడిగారు.

"మరే! అది...మావో! మావో! అంటూ అరుస్తూ ఉంటున్నది."


''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''

తొండైమాను చక్రవర్తి


Telusaa!

తొండైమాను చక్రవర్తి ;

By kadambari piduri, Jan 22 2009 3:57PM


మీకు ఆకాశరాజు ఎవరో తెలుసా ?

శ్రీ వేంకటేశుని పత్ని "పద్మావతి"కి సాక్షాత్తూ కన్న తండ్రి.
శ్రీ పద్మావతీ దేవికి చిన్నాయన అనగా ఆకాశ రాజుకు తమ్ముడైన రాజు "తొండై మానుడు".
ఇతడే తొండమాన్ చక్రవర్తి అనే పేరుతో కూడా అన్నమయ్య కృతులలో వినుతి కెక్కాడు.

ద్వాపర యుగం తర్వాత కలియుగారంభం అవసాగినది.
మహా భారత యుద్ధం అనంతరం మానవ జాతి సమాజము మరల పునర్నిర్మాణము కొనసాగినది.

విక్రమార్కుడు మున్నగు ప్రభువుల తర్వాత చంద్ర వంశములో జన్మించిన.
సుధర్ముడు పూర్వ జన్మలో గొప్ప పుణ్యము చేసుకొనెను.

సుధర్మునికి;;;;;;;
ఆకాశ రాజు, తొండమానుడు అనే సుపుత్రులు ప్రభవించారు.

శ్రీ వేంకటేశునికి తన కుమార్తె పద్మావతీ దేవిని ఇచ్చి ,పెళ్ళి చేసిన పుణ్యచరితుడు ఆకాశ రాజు.

పద్మావతి పిన తండ్రి ఐన తొండైమానుడు చారిత్రక ప్రసిద్ధి కల వ్యక్తి.
శ్రీ తిరుమలేశునికి ఇతను "ఆనంద నిలయము"ను కట్టించెను.
"కపిల తీర్ధము"అనే పెద్ద చెరువును త్రవ్వించెను.
ఈ చెరువు జలములతోటే ఇదివరకు స్వామి వారికి అభిషేకములు నిర్వహించే వారు.
కపిల తీర్ధమే "తామర గుంట"గా ప్రసిద్ధి కెక్కెను.

తొండమానుడు శాతవాహనుల సైనిక దళాధిపతి.
వీరాగ్రేసరుడు, గొప్ప విజేత.
ఈయనే నారాయణ వనమునకు పాలకుడు.

శైవ భక్తుడైన తొండైమాను చక్రవర్తి పరిపాలించిన సీమకు
"తొండై మండలము" అని పేరు కలిగెను.
ఈతని రాజధాని "కోట".

తొండమానుని రాజధాని ఐన కోట;
శ్రీ కాళ హస్తికి 8కి.మీ. దూరములో ఉన్నది.

ఈ గ్రామమే ఇప్పుడు "తొండమనాడు"గా పేరు గాంచినది.

(టూరిస్టు డిపార్టుమెంటు ఈ సీమను కూడా అభివృద్ధి చేసి,
ప్రజలకు చారిత్రక అవగాహన కల్పించ వలసిన అక్కర ఉన్నది)''''''''''''''''''''''''''''''''''''''''''''''

పెళ్ళిపెద్ద
Baala

పెళ్ళిపెద్ద ;;;;;;

By kadambari piduri,


ఏనుగు !ఏనుగు!ఎటు పోతున్నవ్?

(answer):::
ఘీంకరిస్తూ అడవికి పోతా!

(ప్రశ్న) :::
అడవికి పోయి అటేమి చేస్తావ్?
( answer ):::
పద్మావతినీ భయ పెడతాను
శ్రీనివాసులుతొ దోస్తీ కట్టి
సాష్టాంగం!దండ ప్రణామం!


అమ్మకు,అయ్యకు కళ్యాణం
అంగ రంగ వైభోగంగా జరిపించేస్తా!
నా వీపు పైన అంబారి కట్టి
వధూ వరులను కూర్చుండ బెట్టి
ఊరేగిస్తా ముల్లోకములు.


'''''''''''''''''''''''''


Kovela


మేధినిలో వెలిసినాడు !

By kadambari piduri,


మేధినిలో వెలిసినాడు అందాల రాయుడు!
గోవిందుడు! శ్రీ గోవిందుడు!

ఆటలాడుతాం! నాట్యాలు, నటనమాడుతాం!
ఆనంద మూర్తి , నీ లీలలు చూపుటకే ఉల్లసిల్లు
నీ ఆటలు -ఈ ఆటలు ధన్యమైనవి!

పాట పాడుతాం! - కృతి, భజనల కీర్తించుతాం!
శ్రీకాంతు లాస్య హేల లీలలను వినుతించుట చేతనే
ఈ పాటలు సార్థకమ్ములైనవి!''''''''''''''''''''''

తమలపాకుల చిలకలీయవే!

''''''''''''''''''''''


Kovela

తమలపాకుల చిలకలీయవే!

By kadambari piduri,

పుండరీకాక్షునికి
పరమానంద రూపునికి
తమలపాకుల చిలకలీయవే!
చిలుకా!

నీ అరచేత లేలేత
పచ్చనాకులను
జీవితముగా కూర్చి
ఇచ్చినాడే! విభుడు!

పరికించి చేసేటి
కర్మల ఫలములు
చక్కనీ వక్కలుగ
వెలసెనే! చూడు!

కొండంత పాపాల
ఖండించ వలెననెడి
ఇసుమంత భావమే
సున్నమయ్యెను నేడు

అన్నిటిని కలబోసి
ఆ పైన కల నూర్చి
చిరు నవులు నీ కొసగునే!
స్వామి
వెల తూచలేనంత
ఆనందముల నొసగునే!


'''''''''''''''''''''''

10, మే 2009, ఆదివారం

ఏరా! ఘటోత్కచా!


Pramukhula Haasyam

ఏరా! ఘటోత్కచా!

By kadambari piduri

ఆంధ్రా యూనివెర్సిటీ రిజిష్ట్రార్ శ్రీ కూర్మా వేణుగోపాల రావు.
ఆయన మాంచి ఆజానుబాహువు అవడంతో నిక్ నేమ్ స్టార్ గా చేసేసారు విద్యార్ధులు.

ఓ సభలో,ఆకతాయి కుర్రాళ్ళు కీచు గొంతులతో అరిచారు

"హాయ్! భీమా!" "హెల్లో! భీమ సేనా!"
అంతే! ఠకాల్న మైకు దగ్గరికి వెళ్ళారు వేణుగోపాల రావు

"ఏరా! ఘటోత్కచా! ఏం కావాలీ?"అని బిగ్గరగా అరిచారు.

మరంతే! మరలా ఏ సౌండూ వినబడలేదు.
అందరూ గప్ చుప్ సాంబార్ బుడ్డి!!!

Views (74)

పాపాయికి;;;;; తాతయ్యకు!


Baala

పాపాయికి

By kadambari piduri,

1)పట్టెడంచు, పావడాలు - పాపాయికి
పట్టె మంచం, పావు కోళ్ళు - తాతయ్యకు!

2)అరటి పిలక, అరటి పండు - పాపాయికి
బోడి పిలక, విబూది పండు - పాపాయికి

3)వంకీ జడలు, కల కండలు- పాపాయికి
వంపు కర్ర, కండువాలు -తాతయ్యకు!

4)జామ కాయ, కజ్జి కాయ - పాపాయికి
పొడుము కాయ, పడక కుర్చీ- తాతయ్యకు

5)గుడు గుడు గుంచం, గుండే రాగం - పాపాయికి
గుండూ తడుముడు, గుళ్ళో పాటలు - తాతయ్యకు

6)సిరి సిరి నవ్వులు, చెమ్మ చెక్కలు -పాపాయికి
ముసి ముసి నవ్వులు, చప్పరింపులు - తాతయ్యకు.


;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;
(ఆంధ్ర ప్రభ లో ప్రచురణ)
Views (58

9, మే 2009, శనివారం

పంచ గవ్యము

Telusaa!

పంచ గవ్యము

By kadambari piduri

మన దేశీయ వైద్యములో "పంచ గవ్యము" ఎంతో ప్రసిద్ధి గాంచినది.
వేలాది సంవత్సరముల నుండీ,సమర్ధవంతముగా, విశ్వాస పాత్రముగా పని చేయుచుండుట చేత
ఇది నేటికిన్నీ అనేక ప్రాంతాలలో ఔషధంలా స్వీకరించబడుచున్నది.

పంచ గవ్యము తయారీ

ఇందులో ఐదు ద్రవ్యములు వాడబడుచున్నవి.


ఆ దినుసుల వివరములు;;;;;;;;;;;;
'''''''''''''''''
(1) ఆవు పాలు
(2)ఆవు(పాలతో)పెరుగు
(3)(ఆవు పాలు, పెరుగుల నుండి తీసిన)ఆవు నెయ్యి
(4) గో మూత్రమును
(5) గో పంచితమును(పేడ)

అప్పుడే వేసిన అవు పేడను, పలుచటి వస్త్రములో బాగా వడ గట్టాలి.
అలాగ వడ గట్టిన ద్రవము నుండి
కేవలము 2, 3 చుక్కలను పైన పేర్కొన్న దినుసులలోకి చేర్చి కలియగలపాలి.

ఇలా సిద్ధ పర్చుకున్న "పంచ గవ్యము" టానిక్కులాగా భావించబడుతూన్నది.
ఈ "పంచ గవ్యము" ఔషధమువలె ప్రసిద్ధి పొందినది.

''''''''''''''''''''''''''''''''''''''''
ఇండోర్ లో ఎన్నో కుటుంబాల వారికి
ఈ పంచ గవ్యము తయారీ
ఒక కుటీర పరిశ్రమావలె జీవనోపాధిని కలిగిస్తూన్నది.

Views (52)

8, మే 2009, శుక్రవారం

ప్రమిద_ప్రమద


'''''''''''''''''''''


ప్రమిద_ప్రమద ;;;;;;;;;
'''''''''''

దోసిలిలో ఈ ప్రమిద,
శశి బింబము వెదజల్లే
కిరణాల కలములతో
"వెలుగు పద్యము"లను రాస్తుంది.

జాగృతికి
తానే కృతి కర్తయై భాసిస్తుంది.
ఆశలకు నిఘంటువై,
ఆశయాలకు భాష్య కర్త్రియై,
హసిస్తుంది.

ఆలోచనలకు తాత్పర్యమై,
ఆదర్శాలకు సారాంశమై
వివృతమౌతూన్న
వెలుగు వెలుతురుల
వెన్నెలల చల్ల దనాలను
ఉదయ రాగాలకు
ప్రసాదంగా ఒసగుతుంది.


''''''''''''''''''''''''''''''''''''''''''''

jokes''''''''''''''''''''''''''''''''''''''''''''
పంకజాక్షికీ,అత్త గారికీ
బాగా లడాయి పడింది.
రుస రుస లాడుతూ,వచ్చి
తన కూతురు చిట్టితో అన్నది పంకజాక్షి,

"హు!మీ బామ్మ
పిట్ట కథలు బాగా అల్లి చెబుతుంది."

చిట్టికి గొప్ప ధర్మ సందేహమే కలిగింది;

"ఏ పిట్ట మీద మమ్మీ!
పావురాయిమీదనా,పిచ్చుక మీదనా,పీ కాక్ మీదనా?" .............................................

{నా కలం "జోకుతూన్న" కొన్ని జోకులు;
చూడండి,ప్లీజ్! }'''''''

7, మే 2009, గురువారం

మధ్యమ షష్టి లేదు


మధ్యమ షష్టి లేదు!


సభలో అహూతుల మధ్య
ప్రసంగాలూ, చమత్కారాలూ, నవ్వుల జల్లులు కురిపిస్తూన్నాయి.

వరదాచార్యులు మాట్లాడుతూ అన్నారు
 'మా కృష్ణమాచార్యులు సదా 
మా సభా సదులకు విధేయులే!"

 అలా అంటూండగానే చటుక్కున 
వరదాచార్యులు మాటలకు అడ్డు తగిలి, ఇలాగ అన్నారు
"నేను ఒట్టి కృష్ణాచార్యులునే! మధ్యమ షష్టి లేదు. నేను చాలా సన్నం!"

కృష్ణాచార్యులు గారి పలుకులకు వరదాచార్యులు
"వీరిని కృష్ణమాచార్యులను చేసి 
మా వైష్ణవులలో కలిపేసుకుందామనుకుంటే 
ఆయనేమో రానంటున్నారు....."
అని చమత్కరిస్తూ ఆయనను చాలా పొగిడారు.

అప్పుడు కృష్ణాచార్యులు ఇట్లా సెలవిచ్చారు 

"వరదాచార్యులు నాపై చాలా ప్రశంసలను గుప్పించారు. 
ఉన్నవి చెప్పడం కష్టం, 
లేనివి చెప్పడం సులభం. 
ధారాళంగా చెప్పడం వారి సహృదయతకు నిదర్శనమైన మంచి అలవాటు."

సాహిత్య పరిమళ భరితమైన ఆనాటి ఆ పిచ్చాపాటీ సభికులను అలాగ అలరించింది. 

Views (62)

సోమయాజి

Telusaa!

సోమయాజి ;


'అగ్నిష్టోమ యజ్ఞము' చేసిన దంపతులను
 "సోమయాజి", "సోమిదేవమ్మ" అని పిలుస్తారు. 
సామాన్యుల వ్యావహారిక భాషలో ఈ పదాలు 
"సోమయలు", "సోదెమ్మ" అనే రూపాలను సంతరించుకున్నాయి.

అగ్ని ష్టోమము తర్వాత,

" చిత్ చయన యాగము"ను చేసిన వ్యక్తిని

 "చయన యాజి" అని పిలుస్తారు. 

ప్రజల పలుకుబడిలో

 "చయన్లు","చైన్లు", "చేనమ్మ" మున్నగు రూపములు కలవు.


Views (81) 

అది నీలి కలువేనా ?!!!

Kovela

అది నీలి కలువేనా (కవితా రూపకము)


వింత ఇది ఏమమ్మా!!
రండి! చెలియల్లార!
రారండి! వేగమే! 

తన కుంచె విదిలించి,విదిలించి
ఇది, నిజమొ? భ్రాంతియొ 
కాక పొరపాటో అనుచు
బ్రహ్మ విస్మయమంది
తిలకించు, నేత్రములు
నులుముకుని, నులుముకుని 

ఆ అబ్బురము గనుచు 
"అబ్బోసి!" అనుకొనుచు
శ్రీ వాణి నగవులను 
ఒలికించ సాగెను

మరి మరీ చూచుకొను 
తన సృష్టి వైచిత్రి
నలు మోములను బ్రహ్మ

రండి!! సఖియల్లార!!
రా రండి!వేగమే! 

ఈ రేయి కొలనులో 
కలువ విప్పారెనో?!
కలువ దళముల
నిండు చెలువంపు మిసమిసలు!
తెలి కలువ కాదది!
నీలాల కలువయే!
నీలి కువలయమునూ
కాదోయి సుమ్మీ!

ఆమె:
"నీలి కలువని కలికి 
భ్రమసేవు, చాలులే!

ఆమె:2
"కలువ కాకున్న మరి ఏమది?
కువలయమ్మును నీవు చిన్నబుచ్చుదువేల?"

జవాబు:
వింత తెలిసెను నేడు,
వంశి మ్రోగిన జాడ
నీలి కలువల శోభ 
నిలిచి ఎదుటను నవ్వె
దిగివచ్చిన నింగి
వాడె కద, కన్నయ్య 

కోరస్:
తెలిసె వింతల సౌరు!
కులుకు ప్రకృతి కులుకు!


''''''''''

చెంగా బజారు నాటకములు(మద్రాసు )
Telusaa!

చెంగా బజారు నాటకముల...!!


మద్రాసు లోని 'చెంగా బజారు నాటకాల'కు ప్రేక్షకులు 
చెంగు చెంగున గంతులేసుకుంటూ వెళ్ళేవాళ్ళు. 
"తారా శశాంకము' నాటకములో 
"తార"గా 'బాలామణి' నటించేది. 

"ఫాల భాగమున వజ్రాల పాపిట బొట్టు...తమక మెడ నంట సంపంగి తైల మంటె!.........." 
ఈ సీనులో రంగ స్థలముపైన ఒక దోమ తెర కర్టెనును వేసే వారు. 

ఆ తెర వెనుక, నటి దిగంబరముగా చంద్రుడి తలను అంటుతుంది. 
ఆమె కేవలం దిగంబరంగానే నిలబడేదో లేక బనియన్ డ్రెస్సు మీద అలాగ కనిపించేదో గానీ, 
ఏది ఏమైతేనేమి గానీ ఆ మహత్తర దృశ్యాన్ని చూడటానికే జనం వచ్చేవారు. 
పెద్ద తొక్కిసలాట అయ్యేది. 

మొదటి తరగతిలో కూర్చునేందుకు 
మదరాసులోని "ప్రముఖులు" ముందు కెగబడేవారు.

 ఆ ఘట్టం అయిపోగానే 
ఖాళీ అయిపోయిన కుర్చీలను చూస్తే చాలు!,
 ఆ మహాశయులందరూ ఏ ఆకర్షణ కోసం దయ చేశారో ఇట్టే అర్ధమౌతుంది.

'అరవ భాష తెలియక పోయినా,
అరవం అంటే రాళ్ళ డబ్బా చప్పుడు'
అని ఎగతాళి చేసినా, 
మన తెలుగు విద్యార్ధులు కూడా
 అప్పుడప్పుడు ఈ "చెంగా బజారు నాటకముల"ను 
చూడటానికి పోవడము కద్దు!
 అవును పాపం! ఇటువంటి చాన్సు 
మన దేశంలో ఎక్కడ దొరుకుతుంది గనుక?!!!

(తాపీ ధర్మా రావు గారి 'రాలూ, రప్పలూ'లోని విశేషాలు ఇవి) 
Views (95)

కటపయాది సూత్రము

Telusaa!

కటపయాది సూత్రము  ;

1)నాట్య, రూపక ప్రదర్శనలను వృత్తిగా గైకొన్న వారు భాగవతులు.
భాగవతులు "ఆనంద భైరవి రాగము ను మాకు వదిలి పెట్టమని
" త్యాగరాజును కోరారు. 
త్యాగయ్య "అట్లే!"అని ,వారికి వాగ్దానము చేసెను. 
అందుచేతనే త్యాగయ్య ,ఆనంద భైరవి రాగములో కృతీ రచన చేయలేదు. 

త్యాగ రాజు స్పృశించని రాగమే లేదు,
కనుకనే సాంప్రదాయ కర్ణాటక సంగీత ప్రపంచమునకు ఆరాధ్య దైవము!

2)కటపయాది సూత్రము ;;;;;
'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''

ఈ సూత్రమును అనుసరించి
72 మేళ కర్త రాగములలోని 
ఏదేని ఒక రాగము యొక్క సంఖ్యను 
కనుక్కోవడానికై ఉపయోగించే సంగీత సూత్రము .


'''''''''

భారతీ !

Baala

భారతీ ! ;


శ్రీ వాణీ! సరస్వతీ!
వందనములను గై కొనవమ్మా! //
2)వర వీణా పాణీ!
శుక, పుస్తక ధారిణీ!
వందనములు, గై కొనవమ్మా! //
3)నీ కంకణ నిక్వాణము
నభో జనిత ఓంకారము!
విద్యా,విజ్ఞానములకు 
నీవే కద ఆధారము //
4)అక్ష మాలా ధారిణి!
అక్షర మాలా "ధరణి"వి!
అక్షయమౌ ఆశీస్సుల
దయతొ మాకు ఒసగుమమ్మా! //
5)వాయింపుము "కచ్ఛపి"ని!
స్వర లహరీ ప్రమోదినీ!

(కోరస్ ) :::::::::
''''''''''''''''''''''''''''''''' 
నీ ; దివ్య నాద సంగీత సుధా రసములను గ్రోలుచూ,
బ్రహ్మానందమున; పతి "విరించి"
సుందరముగ రచియించును ఈ సృష్టిని! భారతీ!


''''''''''''

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...