11, ఏప్రిల్ 2009, శనివారం

టీచరులు, కాఫీచరులు!


తెలుగు వారికే గర్వకారణమైన "అష్టావధానము"సాహితీ ప్రక్రియలో,"అప్రస్తుత ప్రసంగము"ఒక అంతర్భాగము.అవధానము కొనసాగేటప్పుడు వారిని తికమక పెట్టేటందుకు పృచ్ఛకులు లల్లాయి లొల్లాయి కబుర్లూ,ప్రశ్నలూ వేస్తూంటారు. ఆ చొప్పదంటు ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలంటే పండితునికి కత్తి మీద సాము లాంటిదే!వేదిక మీద అప్పటికప్పుడు చమత్కర భరితముగా జవాబు నివ్వగలిగివాకవి గారికి 
ప్రశంసలు లభిస్తాయి,ఆ సమయోచిత సంభాషణలను ,సభికులు మరల మరల గుర్తుకు తెచ్చుకుని,ఆనందిస్తూంటారు.

ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారిది అవధానములు చేయటములో అందె వేసిన చెయ్యి. అప్రస్తుత ప్రసంగముచేస్తూన్న వారి కొంటె ప్రశ్నలకు లభించే 
హాస్య  సమాధానములలో మచ్చుకు ఒకటి. ప్రశ్న "రామబ్రహ్మం పంతులు గారూ! మీకు 'కాఫీ' ఇష్టమా?'టీ' అంటే ఇష్టమా?"
 అధ్యాపక(=టీచర్) వృత్తిలో ఉన్న ఆ పండిత వరేణ్యుడు బేతవోలు రామ బ్రహ్మం ఇలా అన్నారు,ఏమాత్రం తడుముకోకుండా
 "సోదరా! మనము టీచర్లం("టీ"చర్)కదండీ!".

ఇతరులను నొప్పించని ఇలాంటి సంభాషణలు, తొణికిసలాడే హాస్య మంజరుల గుబాళింపులు సారస్వత నందనవనములలో రసజ్ఞులు విహరించేలా చేస్తాయి.

2 కామెంట్‌లు:

చదువరి చెప్పారు...

గిలిగింతలు పెట్టే చక్కటి చతురత! చెప్పినందుకు నెనరులు.

అజ్ఞాత చెప్పారు...

chaduvariki kRtaj~natalu.
mI aBipraayamu naaku kotta utsaahaanni kaligiMchinadi.

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...