30, డిసెంబర్ 2017, శనివారం

ఆమెకు బుద్ధ పరిరక్షణ

[శకారుని బండి ఉద్యానవనానికి చేరింది.] ;
వసంతసేన ;- పుష్ప పరిమళాలు ... తోటకు చేరాము, అంబా, భగవతీ, 
ఆర్య చారుదత్తులు ఇప్పటికిప్పుడు ఈ పుష్ప కరండకంలోనే ఉండేటట్లు అనుగ్రహించు. 
శకార్ ;- హీనుడైన నీతో పిచ్చాపాటీ మాట్లాడీ మాట్లాడీ నాకు దప్పిక వేస్తున్నది. 
అడుగో, బౌద్ధ శ్రమణకుడు, ఒరేయ్, ఇటు రారా - 
నాకు దాహం వేస్తున్నది, అత్యవసరంగా జలం పట్టుకురా.
బౌద్ధ [సంవాహకుడు] ;- సరే. [ తామరాకులలో తెచ్చి, ఇచ్చాడు]
శకార్ ;- అకులోనా, ఈ శకారునికి బంగారు గిన్నెలో నీళ్ళు ఇవాలని తెలీదూ.
విరటు ;- అతను సన్యాసి, బీదరికాన్ని స్వచ్ఛందంగా స్వీకరించిన  పరివ్రాజకుడు. 
ఈ పర్యాయం నేను స్వర్ణ, రజత పాత్రలను తెచ్చి - అట్టి పెడతాను 
[ విరటు చేతితో సన్యాసికి సైగ చేసాడు -  సన్యాసి జారుకున్నాడు]
శకారుడు ;- రేయ్, స్థావరకుడా, నీకు ఒళ్ళు బలిసిందిరా. ఇంత ఆలస్యంగా వచ్చావు.
స్థావరక్ ;- మహాప్రభూ, బాటలన్నీ బహు రద్దీ, 
చాలదన్నట్లు బండి కాస్తా బురదలో కూరుకుపోయె, చాలదన్నట్లు - 
వీరకుడు ఆపాడు, చాలదన్నట్లు పాదచారులతోటీ, ప్రయాణీకులతోటీ పోట్లాటలు ....
 ' ఇది స్థావరకుని బండి - జాగ్రత్త - ' అన్నాను. 
మీ పేరు చెప్పగానే తలలు పాతాళానికి దించుకుని వైదొలిగారు అనుకోండి .....
విటుడు ;- స్థావర భట్రాజు - మాటలలో మేటి. ఎవరినైనా మాటలతో బోల్తా కొట్టిస్తాడు.
శకార్ ;- నా పేరు చెబితే హడల్. [మీసం మెలి దిప్పబోయి] 
అరె, నా మీసం ఏదీ, ఎక్కడ మర్చిపోయాను?
విరటుడు ;- అందం ద్విగుణీకృతం ఔంతుందని - 
రెండు రోజుల క్రితమే - తమరు మీసాలు, గడ్డాలు - గొరిగించుకున్నారు కదా.
శకార్ ;- ఔనుస్మీ. నిలబడి, నిలబడీ కాళ్ళు నెప్పి పుడ్తున్నాయి. 
విరటూ, బండిలో పరుపును దులిపి, సర్ది పెట్టు.
విర :- [లోనికి తొంగి చూసి] వసంతసేనా, గణిక బుద్ధి - నీవు - 
చారుదత్తునికి కట్టుబడి ఉన్నానని చెప్పిన మాటలన్నీ -
వట్టి నీటిమూటలు, ధనం కోసం ఈ శకారుని వద్దకు వస్తున్నావే ....
వసంతసేన ;- చారుదత్తుల కొరకు వచ్చాను. పొరపాటున ఇందులో ఇరుక్కున్నాను. రక్షించు.
విర ;-[ఇవతలికి తిరిగి చూస్తూ ] శకారా, ఈ వేళ చల్లగాలి మైమరపిస్తున్నది. 
కులాసాగా, నడుస్తూ వెళదాము.
శకారుడు ;- రాజ శ్యాలక శకారునికి చరణ ధూళి అంటడం అసంభవం. 
ఇంత పెద్ద తోటకు ఆసామిని, దర్జాగా బండి - బండి నెక్కి వెడతాను, అంతే. 
[శకారుడు ఎక్కబోయి] బావా, లోపల దయ్యం ఉన్నది.
విరటు ;- ఆ, ఆ, పిశాచి ఉన్నది, అందుకే నడక అన్నాను.శకారుడు 
శకారుడు ;- ఊహు, కమ్మని వాసన - పిశాచి - అంటే ఆడదెయ్యం - 
[మళ్ళీ  తొంగి చూసి] లోన వసంతసేన ... ఆహా  ఆహాహా ,
విర ;- వసంతసేన, చిత్తం - ఆమె చిత్తం మీ పైన - కనుకనే ఆమె ఈ రాక - మీకు కానుక 
[ మనసులో ] - ఇంక ఈమెను ఆ దేవుడే కాపాడాలి.
వసంతసేన ;- ఇంక దిగక తప్పదు. 'నీకు తగని ధైర్యం - ఎక్కువ ' అని -
మా అమ్మ మెచ్చుకుంటూ ఉంటుంది. 
దేవీ, ధైర్యలక్ష్మీ, నాకు ఇప్పుడు ధైర్యం, ఆత్మ స్థైర్యాలను ప్రసాదించు. [ దిగింది]
శకార్;- నీ అమూల్య రత్నాభరణాల ధగధగలు, కిణకిణలు - 
వసంత సేనా, ఆకాశం నుండి నా కోసం నువ్వే దిగివచ్చావా.
విర ;- ఔను, మిమ్మల్నే వెదుకుతూ వచ్చింది ఆమె. 
వసంతసేన ;- కాదు, ఆర్య చారుదత్తుల కోసమే వచ్చాను.
శకార్; ఏమిటి, ఏమి కూసావు, చాతురుదత్తుడే నీకు ఎక్కువా!? 
ధనవంతుడు, భాగ్యవంతుడు ఈ శకారుని కాదని, దరిద్ర చారుని కోరుతున్నావా!? 
వాడికి అభిసారికవై, సారె సారెకూ వెళ్తున్నావు --- 
విర ;- వేశ్యలకు మాట చాతుర్యం నిధులు అంటారు. 
ఇదేమిటి, ఈ వసంత సేన  ఆపదలను కొని తెచ్చుకుంటున్నది, 
విపత్తులను కోరి మీద వేసుకుంటున్నది,
ఈ 'చారుదత్తుల ప్రేమిక'కు రక్షణ ఎక్కడ ఉన్నట్లు!? ........ ,  

శకార్ ;- స్థావరా, ఈ నికృష్ట వసంత సేనను చంపు.  &&&&&&&&&&
స్థావరక ;- ముందు జన్మలో ఏదో పాపం చేసి, వెట్టి చాకిరీ వాడినైనాను. 
ఈమెను ఇక్కడికి తెచ్చాను, పాపం మూట కట్టుకున్నాను, 
చాలు దొరా, అబలను చంపడమా, నేను చెయ్యను.
శకార్ ;- విటూ - విరటూ, దీన్ని నీ ఉత్తరీయంతో గొంతుకు ఉచ్చు బిగించి, చంపు. 
విర ;- నన్ను పూర్తి పేరు పెట్టి, :) :) పిలుస్తున్నారు. 
ఐనా సరే, స్థావరకుని సమాధానమే నా సమాధానం.
స్థావరక్ ;- మీరు కూడా ఈ పాపం పని చేయకండి, నేను ఊరుకోను.
విర ;- ఈ పాపం చేస్తానంటే నేను మాత్రం ఊరుకే - ఎట్లాగ ఊరకుంటాను!?
శకార్ ;- [లోన] వీళ్ళిద్దరూ ఎదురుతిరిగారు - సరే మెరమెచ్చు మాటలను చెబ్తాను ; & 
అరె, మీ స్వామిభక్తి ఎంతున్నదో అని పరీక్షించాను. ఈమెను సరస సల్లాపాలతో బులిపించి, 
దారికి తెచ్చుకుంటాను.మీ ఎదుట వీలవదు కదా
విర ;- అదీ నిజమే, మేమిద్దరం - కొంతసేపు అవతలకు వెళ్ళి ఉంటాము, పద, స్థావరకా. ; 
శకార్ ;- వీళ్ళిద్దరు నాపై అనుమానంతో ఇటు పక్కనే దాక్కున్నారు. 
కానీ చూద్దాం. ఓహో సేనా, నీవు - నువ్వు - ఈ వసంత ఋతువుకే గొప్ప శోభవు - 
విరట్ ;- ఇతని మనసు మారింది, ఆమెకు హాని చేయడు,  
పద, స్థావరకా, చెరువు గట్టున కూర్చుందాం. 
స్థావ ;- ఆ చెరువులో తన బట్టలు ఉతుక్కుంటున్నాడు,
 ఆ సన్యాసితో ముచ్చట్లు చెప్పుకుందాం. పదండి విరటూ. [ వెళ్ళారు] 
శకార్ ;- వసంత సేనా, నన్ను ప్రేమిస్తావా లేదా ;
 [ ఆమె తిరస్కార సూచకంగా - పెదవి విరిచి, తల అడ్డంగా ఊపి, 
తోట నలు దిక్కులా - చారుదత్తునికై చూడసాగింది ] 
వసంత సేన ;- చారుదత్తా, ఎక్కడ ఉన్నారు? ; 
శకార్ ;- ఐతే నువ్వు చారుదత్తుని అభిసారికవై వచ్చావు, 
వాడు ఇక్కడే ఎక్కడో ఉన్నాడన్న మాట.
వసంతసేన ;- కలకాలం సుగుణవంతులు 
చారుదత్తుల వనితగా కట్టుబడి ఉంటాను. 
[ శకారుడు వేగంగా దూకి, ఆమె పీక పట్టుకున్నాడు - విలవిలలాడుతూ పడిపోయింది &
ఇంతలో విరట, స్థావరకులు వస్తున్నారు.]
స్థావర ;- విరాటయ్యా, ఆ సన్యాసికి కాషాయ వస్త్రాలను ఉతుక్కోవడం - మనమే నేర్పాలి .....   
విర ;- స్థావరకా, కొత్తగా సన్యాసం స్వీకరించినట్లున్నాడు, 
అతని కావి గుడ్డలు కొత్తవి, అంత మురికి పట్ట లేదు, తెలుసుకో - 
అక్కడ మాధురుడు - మనకు కొత్త మిత్రుడు అయ్యాడు. 
ఆర్యకుని గురించి - మనకు కొత్త సంగతులు అనేకం తెలిసినవి. 
స్థావరక ;- వసంతమ్మ - పడి ఉన్నదేమిటి? శకారయ్యా, చంపేసావా?
విర ;- ఐతే అన్నంత పని చేసేసావా!?
విరటుడు ;- అయ్యో, అయ్యో అయ్యో - సుగుణవతివి, దయామతివి, 
నీవు లేక ఇంక మా నగర శోభ మసకబారింది. 
వచ్చే జన్మలో కుల వధువు జన్మను భగవంతుడు ప్రసాదించాలని ఇదే నా ప్రార్ధన. 
శకార్ ;- వసంత సేనను నువూ చంపావని ఒప్పుకో, నీకు వెయ్యి దీనారాలు ఇస్తాను.
స్థావరక ;- ఈ పాపం ఫలితం నాకు అంటగడుతున్నారు, గడుసువారే దొరగారు.
శకార్ ;- విరటూ, నీకైతే - ఇన్నూరు మణుగుల స్వర్ణం కార్షపణాలు --- 
నా - ఈ నందన వనం కూడా ఇస్తాను. 
విరటుడు ;- తోటనే కాదు, సామ్రాజ్యం ఇచ్చినా - తిరస్కారమే నా సమాధానం. 
స్థావరకుడు నా కన్నా మేలు, నిర్భయంగా ఎదిరించాడు.
విరటుడు ;- అబలా హత్య - నికృష్ట అపరాధం - 
ఛీ. శకారుని వంటి దుర్మార్గులకు అధికారం అయాచితంగా లభిస్తున్నది, 
ధర్మదేవతపైన కాళ్ళూనుతున్నారు. 
ఇది విధి విలాసమా, దేవుని నిర్లిపత కారణమా!? 
శకార్ ;- విటూ, నువ్వు, నేను మిట్టమధ్యాహ్నం నుండి ఇక్కడే ఉన్నాం. 
చాలామంది చూసారు. 
నువ్వే ఈమెను పై లోకాలకి పంపావని అభియోగం వేస్తాను.
విరటుడు ;- ఎట్లాగూ చేయని నేరం మీద పడుతున్నది కదా, 
నిన్నే చంపి - భటులకు లొంగి పోతాను 
శకార్ ;- వద్దు వద్దులే ;
విరటు ;- వీని ఆశ్రయంలో ఉంటే - ఖాండవ వనంలో ఉన్నట్లే. 
శర్విలకుడు, చందనకులు ఆర్యకుని దళంలో చేరారు. 
నేను కూడా వారి అనుయాయిని ఔతాను.ఒరేయ్ స్థావరకా, 
ఇది నీ ఎడ్ల కొరడా, ఇక్కడ పెట్టి ఉంచి, 
నువ్వే ఈ హత్య చేసావని నిరూపిస్తాను.
శకార్ ;- విరటుడు వెళ్ళి పోయాడు. స్థావరకా, 
కొంతమంది గుంపుగా వచ్చి, దీన్ని చంపారని - అధికరణ మండపంలో నేను చెబుతాను.
నువ్వు నాకు వత్తాసుగా పలుకు, సరేనని చెప్పాల్సిన సాక్షి నీవే. 
స్థావరక ;- అంగీకరించకపోతే - వీడు నన్ను ఈ నేరంలో ఇరికిస్తాడు. 
ఇప్పటికి ఒప్పుకోక తప్పదు. ----- అట్లాగే దొరా.
శకారుడు ;- సరే, ఇదిగో, నా బంగారు మురుగులు, నీకు బహుమతి. 
నా ఇంటికి వెళ్ళి అక్కడే ఉండు. -------
స్థావరకుడు, విటుడు వెళ్ళి పోయారు. స్థావరకుని నా మిద్దె పైన మూల గదిలో బంధిస్తాను. 
వసంత సేన శవాన్ని మాయం చేస్తాను. నా ఉత్తరీయాన్ని కప్పుతాను ..... 
ఊహు, కూడదు, దీన్నిబట్టి నేరగాడు ఈ శకారుడే అని గుర్తులు ఇచ్చినవాణ్ణి ఔతాను. 
ఎప్పుడూ శుభ్రం చేయని తోట ఇది, ఎండు ఆకులు దండిగా ఉన్నవి. 
ఈ శీర్ణ పత్రాలతో కప్పుతాను. 
బౌద్ధ ;- బుద్ధం శరణం, బోధిసత్వునికి శరణం శరణం  .........
శకారుడు ;- శ్రమణకుడు వస్తున్నాడు, వీణ్ణి నా చేతికి దొరికినప్పుడల్లా కొట్టాను, 
హింసించి, ఆనందించాను. ఇప్పుడు నన్ను పసికడితే - 
నన్ను ఖైదు చేయించి తీరుతాడు, కనుక మెల్ల మెల్లగా తప్పుకుంటాను
ప్రస్తుతానికి - నాకు అదే క్షేమం.మెల్ల మెల్లగా తప్పుకుంటాను. 
[ శకారుడు దొంగ చూపులు చూసుకుంటూ వెళ్ళి పోయాడు ]
&
బౌద్ధ సంవాహకుడు ;- ఈ పూలు కోసి, బుద్ధదేవుని- పూజ కోసం బయలుదేరుతాను. ..... 
పూలబుట్ట నిండింది. ఇంక నా పంచె, ఉత్తరీయాలను ఆరబెట్టి, నగరిలోకి వెళతాను.
ఎంత పిండినా తడి  వస్త్రాలు, నీళ్ళు కారుతున్నవి.
కోతులు - వలువలు, చెట్ల కాయలు ......
వానరమూక అన్నింటినీ చిందరవందర చేస్తున్నవి.

వలువలను నేలపైన ఈ ఎండుటాకుల పైన ఆరేస్తాను.
ఆరామంలో అర్చనలు చేసిన పిదప, బిక్షాటన నిత్య విధి.
జీవునికి తిండి తిప్పలను తప్పనిసరి అవసరంగా - నిర్దేశించాడు ఆ దేవుడు - 
ఎంత పిండినా తడి  వస్త్రాలు, నీళ్ళు కారుతున్నవి. 
వస్త్రములను ఈ ఆకుల పైన ఆరేస్తాను. ...... 
హమ్మయ్య, ఆరేయడం పూర్తి ఐనది. 
ఇంక ఊళ్ళోకి నా గమనం ....... 
ఊ  ....... , ఆకులు కదులుతున్నవి ..... 
వెలుపలికి చేయి కనబడుతున్నది .... బైటికి - పైకి చాచి, పిలుస్తూ .... 
అది స్త్రీ హస్తం - ..... ఎండిన ఆకులను తొలగిస్తాను ...
వసంత సేన ;- [మూలుగుతున్నది] ఎవరమ్మా, మీరు వసంతమ్మ కదూ, ఇక్కడ, 
ఇట్లాగ - భూమిలో - మిమ్మల్ని - ఎవరి అకృత్యం ఇది? 
నెమ్మది నెమ్మది, నిమ్మళంగా మెల్లగా లేవండి. 
వసంత సేన ;- దుర్మార్గ శకారుడు నన్ను చంపాలని యత్నించాడు. 
శకారుడు నా గొంతు నులిమాడు,  చచ్చిపోయాను ..... అనుకుని ....... 
వదిలి పెట్టి, పోయినట్లుగా ఉన్నాడు.
హు ... నేను ఉంటేనేం , పోతేనేం ..... 
బౌద్ధ సంవాహకుడు ;- వైరాగ్యం వలదమ్మా, నన్ను ఆనవాలు పట్టారా, 
మీ ఉపకారం వలన  ఋణవిముక్తుడిని ఐనాను.
వసంత సేన;- నీవు ... మీరు .... !?
బౌద్ధ సంవాహకుడు ;- జూదంలో ఓడి, పారిపోయి, మీ ఇంటిలో దాక్కున్నాను.
అప్పుడు జూదం పందెంలో చెల్లించాల్సిన- నా - శుల్కాన్ని చెల్లించి, 
ఋణవిముక్తుణ్ణి చేసారు. నన్ను గుర్తు పట్టారా!? 
వసంత ;- ఔను, చారుదత్తుల ఇంటి నుండి తెచ్చిన వెండి పాత్రను అమ్మజూపావు ...... 
బౌద్ధ సంవాహకుడు ;- నాడు సంవాహకుడిని, నేను మారాను తల్లీ, 
వసంతసేన;- ఈ తీరుగ సన్యసించావా!

బౌద్ధ సంవాహకుడు ;- శరణాగత రక్షణం - బౌద్ధ విహారం - ఇక్కడికి దగ్గరలోనే ఉన్నది. 
మీ గాయాలు నయమై, తేరుకునే దాకా అక్కడ ఉందురు గాని.
వసంత సేన ;- భగవత్ కృప.
;  [ఇద్దరు వెళ్తున్నారు.] 
******************************:
అధ్యాయ శాఖ ;- 29 - ఆమెకు బుద్ధ పరిరక్షణ 
previos posts ;- 
అధ్యాయ శాఖ ;- 28 ;-  బాట అదే - బండి మారింది ; 25, డిసెంబర్ 2017, సోమవారం  ;
అధ్యాయ శాఖ ;- 27 ;- సంకెళ్ళ చప్పుడు - గాజుల సవ్వడి
అధ్యాయ శాఖ ;- 26 ;- నగరంలో గజం ;  
;

25, డిసెంబర్ 2017, సోమవారం

బాట అదే - బండి మారింది

[శకారుని బండి బాటపైన వెళ్తున్నది. గూడు బండిలో వసంతసేన ]
వసంత సేన ;- ఇవాళ ఎందుకనో నిద్రమత్తుగా ఉంది. 
అమ్మ ఇచ్చిన భక్ష్యాలు తిన్నాను, 
అప్పటి నుండి కొంచెం 
మైకంగా అనిపిస్తున్నది. 
స్థావరకుడు ;- బాట కిట కిటలాడుతున్నది, తప్పుకోండి తప్పుకోండి - పల్లెటూరి బైతులారా! 
వసంత సేన ;- ఇది మార్గుని గొంతులా అనిపించడం లేదు. 
మా కొత్త దాసీ
'వెనుక గుమ్మం వద్ద బండి వచ్చి, ఆగి ఉందని' చెప్పింది. 
గూడు పైన చిలకపచ్చ వస్త్రం నుండి - 
బైట 
ఏమీ కనిపించడం లేదు, ఏమీ తెలియడం లేదు.
స్థావ ;- ఇది రాజు శకారుల బండి, 
దారి ఇవ్వక పోతే -ఖైదులో వేస్తాం, పక్కకు జరగండి, హూ ...... 
వసంత ;- ఇది శకారుని బండి, దైవమా, కాపాడు. 
గుండంలోకి దిగాను. కంటిరెప్పల మీద నిద్ర ..... 
నా తల్లికి 
నేను చారుదత్తుని కడకు చేరడం ఇష్టం లేదు. 
మధురమోదములదు ఏదో కలిపినట్లు ఉన్నది. 
నేను రహస్యంగానే ఈ 
తీరున ప్రయాణిస్తున్నాను. పోనీ - బండి దిగనా!? 
భటులు ;- స్థావరకా, నీ ఒళ్ళంతా బురద. 
స్థావరక్ ;- ఎకసెక్కాలు చేస్తున్నారు. ఇందాక మీరు కనబడి ఉంటే - 
నాకు కాస్త చేతి సాయం అంది ఉండేది.
వసంతసేన ;- హమ్మయ్యో, భటులు, 
,              వీరికి చిక్కితే - నాది అధోగతి, 
,                 అసలే వేశ్యలంటే చులకన.  ;;
స్థావ;- ఇవాళ బయలుదేరిన వేళ బాగుళ్ళేదు. 
అరె, బండి చక్రం బురదలోన కూరుకు పోయింది. ఎవరూ సాయం 
చేయడం లేదు, 
ఒక్కణ్ణే ఇంత బరువు చక్రం తీసాను. అబ్బ, ఆయాసం. [ఎద్దులను అదిలించాడు] 
వీటికి కూడా 
అలసట - శ్రమ పడింది నేనైతేను. 
బండిలో ఎంతో బరువు ఉన్నట్లు - మెల్లగా లాగుతూ, కదుల్తున్నాయి. హెయ్, 
వేగిరం - హెయ్ [ఛెమ్కీ తో కొట్టాడు] 
వసంత సేన ;- అక్కడ తోటలో నా కోసం ఆర్య చారుదత్తులు వేచి ఉంటారు, 
కనుక ఉద్యానం చేరిన పిమ్మట - 
ఆ చోట 
సురక్షితం ఔతాను. పైన దేవుడే గతి.
వీరకుడు ;- అదేంటో - ఇవాళ చిలకపచ్చ వస్త్రాల మేళా జరుగు తున్నాదా ఏమిటి, 
ఐదు క్షణాల కిందట - 
చారుదత్తుని శకటం వెళ్ళింది. ఇదే రంగు వలువతో. 
ఇట్లాంటి ఖరీదైన వలువ బండి - లోన వసంత సేన ఉన్నదట. 
చందనకుడు - తగాదా పెట్టుకున్నాడు, నన్ను సోదా చేయనీయ లేదు.
స్థావ ;- ఓహో, అందచందాలకు పెట్టింది పేరట కదా, ఆమె.
వీరకుడు ;- ఔను, చారుదత్తుడు అంటే దానికి తెగ ఇష్టమట. 
డబ్బు లేక పోయినా అంత గొప్ప సానిది - 
వాణ్ణి 
తగుల్కొన్నది. దేనికైనా పెట్టి పుట్టాలి, 
మనమూ ఉన్నాము ఎందుకూ, 
భూమి మీద లెక్కకు ఒకటి చొప్పున 
అదనంగా.
వసంత ;- చారుదాత్తులు బండిని పంపారన్న మాట. ఇంక ఫర్వాలేదు. 
పొరపాటున ఎక్కాను ఈ బండిని. ఇది శకట 
విపర్యాసం. వ్యత్యస్త శకట విపత్తు. 
దిగితే ఈ భీకర గండు పిల్లులు నన్ను - శకారునికి పట్టి ఇస్తారు, 
భగవంతుడా, 
అన్యధా శరణం నాస్తి, త్వమేవ మమ గతి ;
; [ఎద్దుల మెడలలో చిరు గంటల చప్పుడు - ముందుకు వెళుతూ] ; 
[ చాటింపు ;-  పారా హుషార్, 
నగరి సమయ ఘంటా నాదం ఇది - 
మలి సందె - మూడవ ఝాము గంట - పారా హుషార్ - 
మసక 
వెలుతురు వేళ - కనుక ఏమరుపాటున సాగండి, ప్రమాదాలు జరగవు. 
అశ్వ సంచార భటులకు దారి విడువండి, 
అప్రమత్తులవండి, పారాహుషార్ 
పారాహుషార్ 
 ]
;
;
*****************************; ;
previos post ;- 

22, డిసెంబర్ 2017, శుక్రవారం ;- సంకెళ్ళ చప్పుడు - గాజుల సవ్వడి ; 
[ తప్పించుకున్న ఆర్యకుడు చారుదత్తుని బండిలో ఎక్కాడు.]
& NOW :- బాట అదే - బండి మారింది ; 
,                     = bATa adE - baMDi maarimdi ;
&   లిపి వ్యాకరణ ; = lipi wyaakaraNa ; &

22, డిసెంబర్ 2017, శుక్రవారం

సంకెళ్ళ చప్పుడు - గాజుల సవ్వడి

[ తప్పించుకున్న ఆర్యకుడు చారుదత్తుని బండిలో ఎక్కాడు.]
;
ఆర్యకుడు ;- ఈ గూటి బండి ఎవరిదో, గయునికి అర్జునుడి ఇచ్చిన అభయంలాగా - 
నాకు ఇక్కడ రక్షణ దొరికింది. ఈ చిలకాకుపచ్చ పట్టు వస్త్రం - 
నాకు కొంత మరుగుగా, మెరుగుగా ఆచ్ఛాదనం లభించింది.
మార్గుడు ;- వసంతసేనమ్మా, స్వస్థతగా కూర్చోండి. డుర్ డుర్, 
ఈ ఎడ్లు నాకు మాలిమి అయ్యేదెప్పటికో, 
వసంతమ్మ పెరటి గుమ్మం వద్ద నిలబెడితే - ఇవతలికి వచ్చేసాయి. 
మా అన్న వర్ధమానుని చేతిలో ఏమి కిటుకు ఉన్నదో గానీ - 
ఆయన గారు వీల వెయ్యగానే ఈ కాడెద్దులు బుద్ధిగా హుందాగా నడుస్తాయి. 
ఇప్పుడు చూడమ్మా, ఇవి అటూ ఇటూ దౌడు తీస్తున్నాయి. 
మీ నగలు, గాజుల చప్పుడు మహిమ కాబోలు ....
అక్కడ తోటలో - చారుదత్తుల వారు - ఈ సరికి వచ్చి ఉంటారు.

ఆర్యకుడు ;- ఇతను వర్ధమానుని తమ్ముడు మార్గుడు అన్న మాట. 
ఖుంటమోదం ఏనుగును ఉసిగొల్పి, దుర్గం గోడను భేదించాడు మిత్రుడు వర్ధమాన్. 

ఉజ్జయినిని అనుమానించి, రాజ భటులు ప్రశ్నిస్తున్నారట. 
కర్ణపూరకుని, శ్యాలకుని పంపించాను - 
ఉజ్జయినిని రహస్యంగా తీసుకుని వచ్చి, కాపాడడానికి. 
ఇందరు మిత్రులు తమ ప్రాణాలకు తెగించి, నాకు సాయం చేస్తున్నారు. 
ఏమిచ్చి ఋణం తీర్చుకోగలను?
['రోడ్డు'పైన ఇద్దరు] 
కన్యేశ్వరుడు ;- ఒహో బండి వాడా! కొంచెం మార్గం పై కన్నేసి ఉంచు. 
వాహనాన్ని అదుపులో ఉంచు. 
ఈ కన్యేశ్వరుడు, నిశుల్కుడు - మా ఇద్దరికి కన్ను లొట్ట పోయి ఉండేది .......
మార్గుడు ;- చిత్తం దేవరలారా! ఈ మార్గుని క్షమించండి. 
తమరు ఎక్కడికి వెడుతున్నారు?
కన్యేశ్వరుడు ;- న్యాయాధికారి ధర్మవరుని వద్దకు వెళుతున్నాము. 

మార్గ్ ;- నా బండిని ఎక్కమని అడిగేవాణ్ణి.
ఆర్యకుడు ;- దైవమా, శరణు, మార్గుని మాటను వారిద్దరు వినకూడదు గాక!
మార్గ ;- అయ్యా, మా యజమానిని ఇందులో ఎక్కి ఉన్నారు. 
వెనుక స్థావరకుని బండి వస్తున్నది. 
అది ఖాళీగానే ఉన్నది. 
నిశుల్క్ ;- అది శ్యాలకుని వాహనం కదూ.
మార్గుడు ;- మీరు న్యాయ శాఖ ఉద్యోగులు కనుక, 
మీకు అంతమాత్రం స్వతంత్రం ఉంటుంది. 
మిమ్మల్ని రాజా వారి బావమరిది ఏమీ అనరు లెండి.
కన్యేశ్వరుడు ;- మార్గా, మా నడక మాది. సత్వరమే వెళ్ళు. 
మార్గ్ ;- హమ్మయ్య, ధర్మోద్యోగులు శాంతంగా వెళ్ళారు. 
ఆర్యకుడు ;- పూల వాసన - ఉద్యానానికి వాచ్చేసాము కాబోలు, 
ఇప్పుడు తప్పించుకునే దారేదీ, చారుదత్తుడు నన్ను భటులకు అప్పగిస్తాడేమో ......
మైత్రేయుడు ;- మార్గా, ఇంత ఆలస్యమా, ఇక్కడ చారుదత్తులు, 
నేను వచ్చి, మూడు గంటల పద్ధెనిమిది విఘడియలు ఐనవి.
మార్గ ;- పజ్ఝెనిమిది విఘడియలైందా, కాలం కొలమానం మీకే తెలుసును స్వామీ. 
నిరక్షర కుక్షిని - నాకు పూర్తి అయోమయం.

మైత్ర్ ;- మార్గుడా, నువ్వు అన్నీ అట్లాగే చెబుతుంటావు. 
ఏమీ తెలీని వాడివే ఐనా - శకట గమనం, గమనిక - 
అంతా నీ అధీనంలోనే ఉంటాయి.
చారు ;- వసంతసేనా, ఇదిగో ముక్కాలి పీట - 
నెమ్మదిగా పాదం పెట్టి దిగుతావా .....  [
ఆ, ఎవరు నీవు? 

ఆర్యకుడు ;- నా నామం ఆర్యకుడు.
[అతని పేరు వినగానే ముగ్గురు భయ విహ్వలులైనారు.]
మార్గ ;- ఐతే నీ సంకెళ్ళ చప్పుడు - గాజుల సవ్వడి - అని నాకు అనిపించింది.
మైత్ర్ ;- కొంప మునిగింది. ఇతనిని కాపలాదారులకు అప్పజెబుదాం.
చారు ;- తప్పు, మిత్రమా. ఆపదలో ఉన్న వ్యక్తి, 
అందునా నిరపరాధి - కల్లోలంగా ఉన్న పరిస్థితుల గుండా ఇతని ప్రయాణం - 
ఈతనిని  కాపాడటం - భగవంతుడు మనకు ఇచ్చిన అవకాశం.
మైత్ర్ ;- కనుక ఈతని రక్షించుట మన తక్షణ కర్తవ్యం. 
నక్క తోకను తొక్కి వచ్చావయ్యా ఆర్యకా.
మార్గ్ ;- మరి ఇతని సంకెళ్ళ సంగతి!?? 
పొదల మాటున ఎవరో ఉన్నారు -
[బైటికి వచ్చి - అతను]
కర్ణపూరకు ;- కర్ణపూరకుడిని - ఆర్యకా, సంతోషం - 
చెరసాల వద్ద - అందరమూ విడి పోయాము. 
ఇదిగో, ఈమె ఉజ్జయిని
శ్యాలకా,  త్వరగా ఈ పదునైన రాళ్ళను ఉపయోగించుదాం. .... 
సంకెళ్ళు పగిలిపోయాయి. ఇంక స్వేచ్ఛ.
ఆర్యక ;- చారుదత్తా, దయ ఉమంచి - ఉజ్జయినికి రక్షణ కల్పించండి, 
మీ వంటి ఉదారులు, నీతిమంతుల ఆశ్రయంలో 
ఆమె సుస్థిరంగా, శాంతంగా మనగలదు.
చారు ;- ఆర్యకా! త్వరలో ఈమెను నీవు పరిణయం చేసుకుందువు గాని. 
ఉజ్జయినీ, నీకు సమ్మతమే కదా. 
మైత్రేయా, నీది వాక్ శుద్ధి కల జిహ్వ, ఆర్యకునికి నీ ఆశీస్సులు ఇవ్వు.

మార్గ్ ;- మైత్రేయుల దీవనలు - తొలకరి వానధారలు. 
మైత్ర్ ;- ఆర్యకా, దిగ్విజయ ప్రాప్తిరస్తు.
ఉజ్జయిని ;- తప్పకుండా - విజయం సాధిస్తావు ఆర్యా! 
జయం మనదే , విజయం మన అందరికీ.

ఆర్యక ;- కర్ణపూరకా, శ్యాలకా - 
మీరు ఈశాన్య, ఆగ్నేయ యోధుల దళాలను అప్రమత్తం చేయండి. 
నేను ఈ దిశగా వెళ్తున్నాను. చారుదత్తా, మీ ఎల్లరకు నమస్సులు.
మార్గ్ ;- ఆర్యకులు వెళ్ళారు. కర్ణపూరక, శ్యాలకులు - 
అందరూ - తలో దిక్కు వాళ్ళు వెళ్ళారు. 
మైత్ర్  ;- అందరూ  - ఎక్కడో అక్కడ - కలుస్తారు. కలిసి, తారతమ్యం లేకుండా - 
భేద భావాలు మరిచి - తమ తమ కార్యాచరణలను కొనసాగిస్తారు. 
మైత్ర్ ;- కిం కర్తవ్యం?
చారు ;- అమ్మా, ఉజ్జయినీ, శకటాన్ని అధిరోహించు.
వసంత రాక - ప్రశ్నార్ధకం అయిందేమిటి విచిత్రంగా.
మైత్ర్ ;- ఆ తరువులు, పుష్పాలు, సరసులు, మేఘాలు, విహంగం, మనుషులు  - 
ఇన్నిటి గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం. 
లోకాభిరామాయణం - కాలక్షేపం - పిచ్చాపాటీ - 
ఆషామాషీ కబుర్లు  - ముచ్చట్లు - నిర్విరామంగా చెప్పుకున్నాము. 
ఊరూ వాడా, నగరం, దేశం ఇన్నింటిని  గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం. 
మాట్లాడుకునీ, మాట్లాడుకునీ, అలసిపోయాం. ఇంక నా ఆలోచన స్తంభించింది.
మార్గ్ ;- కొంచెపాటి విషయాలకే - కొందరి మెతకమనసులకు
మెదడు మొద్దుబారిపోతూ ఉంటుంది. [నవ్వి] 
యజమానీ, వసంత సేన గారి కన్నతల్లికి - ఇష్టం లేని వ్యవహారం ఆయిరి. 
ఆమె కంట్లో పడి ఉంటారు, కూతురిని ఆపి ఉంటుంది.
చారు ;- ముందు ఉజ్జయినినైనా భద్రంగా తీసుకు వెళ్ళు. 
మైత్ర్ ;- ధూతాంబ దేవి గారికి ఒకరు చెప్పాల్సిన పని లేదు. 

ఆమె ఈమెను చల్లగా కాపాడుతుంది. 
;
***************************;
సంకెళ్ళ ధ్వని - గాజుల సడి ;
శృంఖలలు = బేడీలు ; 
***************************;
;
 పాత్రలు ;-  ఉజ్జయిని & ఆర్యకుడు ;; 
కన్యేశ్వరుడు & నిశుల్కుడు ;; మార్గుడు ;;
చారుదత్తుడు ; మైత్రేయుడు ;;
previous post ;-20, డిసెంబర్ 2017, బుధవారం ;; నగరంలో గజం  ;;
***************************; ;
మృచ్ఛకటికం ;- ఆసక్తి, కృషి ;-
1. ఎం. ఆర్. కాలే - ప్రకారం - రచనాకాలం 200 BC - రచయిత - శూద్రకుడు ; 
MR Caulay - pub - 1924 ;;
2. దండి [దశకుమార చరిత్ర - ] - రాసిన అనే వాదన ఒకటి ఉన్నది. 

3. బేతవోలు రామబ్రహ్మం - అనువాదం ;;
4. ధేనువకొండ చిన్ని కృష్ణ శర్మ ; విజయవాడ ; 
***************************;
REF ;-
1. అది వింటూనే శర్విలకుడు 'నా ఆప్తమిత్రుడు ఆర్యకుడు బంధింపడ్డాడా? ఎంత కష్టం వచ్చింది. ... 
శర్విలకుడు వెళ్లిపోయిన కాస్సేపటికే వసంతసేన వద్దకు చారుదత్తుడి సహచరుడు మైత్రేయుడు వచ్చాడు. 
&
2. ఆ సమయంలో స్థావరకుడనే శకారుడి బండివాడు బండితో సహా ఆ వీధిలోకి వచ్చాడు. 
పుష్పరండకం ఉద్యానవనంలో వుంటాను రమ్మనమని శకారుడు అతని చెప్పాడు. 
ఉజ్జయినికి యితర ప్రాంతాల నుంచి వచ్చిన బళ్లవాళ్లతో వీధంతా నిండిపోయి వుండి -
అతను ముందుకు వెళ్లలేకపోతున్నాడు. 
'ఒరేయ్‌ పల్లెటూరి బైతుల్లారా, ఇది ఎవరి బండి అనుకుంటున్నారురా? 
సంస్థానకుడు (శకారుడు పదవి పేరు) గారి బండి. 
దారి వదలకపోతే ఎలా? ఆయన అక్కడ నా గురించి కాచుకుని వున్నాడు.

; &
వీరకుడు - చందనకుడు స్పర్ధ - ఎమ్బీయస్‌: మృచ్ఛకటికమ్‌- 11 ;- LINK ;-
వాళ్లిద్దరూ సమానస్థాయి దండనాథులు
''ఒరేయ్‌ వీరకా! మేం దాక్షిణాత్యులం
పది రకాల మ్లేచ్ఛభాషలు తెలిసినవాళ్లం. 
మా భాష అందుకే అలా వుంటుంది. ఒక్కోప్పుడు లింగభేదం పాటించం. 
మా యాసకీ, నేను చెప్పినదానికి సంబంధం ఏమిటి?'
2. చిన్న బండి - క్లుప్తంగా కథ ;-  LINK ;- 
;

20, డిసెంబర్ 2017, బుధవారం

నగరంలో గజం

చారుదత్తుడు ;- రదనికా, నేను బయటకు వెళుతున్నాను.
[ చారుదత్తుడు వీధిలోకి వచ్చాడు] ;
[ తెరలో ;- 2. కుంటమోదకం తప్పించుకున్నది. రాజు గారి ఏనుగు కట్లు తెంచుకున్నది
3. కోట ప్రహరీ గోడని పగలగొట్టింది. వీధులలో పరుగులు తీసేస్తున్నది. 
ప్రజలందరూ జాగ్రత్త పడండి ......  ఇది దండోరా ;
; టముకు వేస్తూ - మనిషి వేగంగా వెళ్ళసాగాడు. ]
బౌద్ధ సన్యాసి ;- బుద్ధం శరణం గచ్ఛామి - ఇప్పుడేమి చేయడం!?
[ సంవాహకుడు భీతితో స్థంభించి నిలబడి ఉన్నాడు. 
బౌద్ధ సన్యాస జీవితాన్ని స్వచ్ఛందంగా గైకొన్న సంవాహకుడు ఇతడే. 
పరుగు తీసే చారుదత్తుడు - అతని హస్తం అందుకున్నాడు.] 
చారుదత్తుడు ;- అరె, అట్లాగ ఆగిపోయావేమిటి, ఇటు రా, నా చెయ్యి పట్టుకో. 
పద, ఈ అంగడిలోనికి.
ఉజ్జయిని ;- భద్రం, భద్రం. మెట్లు ఎక్కి, లోనికి రండి.
షాపు యజమాని ;- ఉజ్జయినీ, కుంటమోదకం ఏనుగు - అదిగో - వెళుతున్నది. 
వీధి మలుపు తిరిగింది, పాపం, అక్కడ జనం ఈ సరికి ఇళ్ళలోకి దూరి, 
స్వీయ రక్షణ పొంది ఉంటారు.
చారుదత్తుడు ;- అరె, సంవాహకా, నీవేనా ..... ?
బుద్ధ పరివ్రాజక ;- ఔను సుజనా, సంవాహక సన్యాసిని.
జూదరిని, గతంలో వీడు తమకు *పరిచిత చోరుడు.
చారుదత్త ;- మార్గా, నీవుకూడా - ఇక్కడ?
మార్గ్ ;- చిత్తం, దేవరా, మీ ఆనతి ప్రకారం - వసంతమ్మ వద్దకు - 
బండి తీసుకుని బయలుదేరాను. ఇంతలో ఈ ఉపద్రవం. 
[తెర వెనుక - చాటింపు వేస్తున్నారు ;- 
[ ఏనుగును పట్టుకుని, బంధించారు. 
ప్రజలందరు తమ దైనందిన కార్యక్రమాలను నిశ్చింతగా చేసుకోగలరు, ఇది దండోరా.]
చారు ;- మీ అందరికీ కృతజ్ఞతలు. మీ దుకాణంలో మాకు భద్రత ఇచ్చారు.
షాపు మనిషి ;- ఆ భగవంతుడు ఇచ్చిన అవకాశం, 
ఈ సాకున మనకు ఈ తీరున సమావేశం సంభవించినది.
మార్గ్ ;- ఉజ్జయినీ, మీ వాళ్ళను పల్లెలో కలిశాను, 
మీ అక్క కుశావతి - నీ సంగతులను తెలుపమన్నది. 
మీ అన్న రేభిలుడు - మళ్ళీ బస్తీకి వచ్చాడట. 
చారుదత్ ;- మార్గా, బండి ఏది?
మార్గ్ ;- దేవరా, బండి ఈ పక్క వర సందులో పెట్టాను, నా పయనం ప్రారంభం. [వెళ్ళాడు].
షాపు వ్యక్తి ;- ఉజ్జయినీ, దుకాణమును శుభ్ర పరిచి, సర్ది ఉంచు, 
నేను బైటికి వెళ్తున్నాను. అందరూ వెళ్ళిపోయారు, భద్రం. [అతను వెళ్ళాడు.]
సంవాహకుడు ; శరణాగతవత్సలుడు ఐన చారుదత్తులకు నమస్కారం.  

చారుదత్ ;- ఉజ్జయినీ, మేమూ వెళ్ళివస్తాము. [అందరూ వెళ్ళిపోయారు] ; 
ఉజ్జయిని ;- సరేనండీ.
[వెనుక సంకెళ్ళ చప్పుడు]
ఉజ్జయిని ;- ఎవరు నువ్వు?
ఆర్యక ;- నన్ను ఆర్యకుడు అంటారు. దాహం ....
ఉజ్జయిని ;- పస్తులతో అలమటిస్తున్నట్లున్నావు. ఇదిగో,  చద్దన్నం తిని, నీళ్ళు తాగు. 
ఆర్యక్ ;- నేను అర్ధగంట నుండీ ఈ మూల నక్కి కూర్చున్నాను. ఉజ్జయినీ, ఫలహారం ఇచ్చావు. 
నాకు ఓపిక వచ్చింది. మరి వెళ్ళివస్తాను.
ఉజ్జయిని ;- వద్దు వద్దు, అక్కడ మదపుటేనుగు సంచారం ....
ఆర్యక్ ;- దానిని వర్ధమానుడు కట్లు విప్పాడు. ఉసిగొలిపి, కోట గోడను పగలగొట్టించాడు.- 
నాకు సాయ పడ్డాడు. 
ఉజ్జయిని ;- మార్గుని అన్న వర్ధమానునికి - ఎద్దులు, దున్నపోతులు, ఏనుగులు - 
సకల జంతువులూ- మాలిమి ఔతాయి.  
ఆర్యక్ ;- ముమ్మాటికీ నిజం. [ఇద్దరూ  నవ్వారు] 
ఆర్యక్ ;- ఉజ్జయినీ, నీ మేలు మరువను. ఈ కంచం, 'లోటా'లను :) 
లోపల దాచు. లేకుంటే ఇతరులకు - ఎవరో వచ్చారు, అని అనుమానం వస్తుంది. సెలవ్. 
ఉజ్జయిని ;- జాగ్రత్త, మరి.

;
*********************************************;
;
1] పరిచిత చారుదత్తునికి - 1. *పరిచిత చోరుడు = సంవాహకుడు ; & 

2] చారుదత్తునికి - శర్విలకుడు అపరిచిత చోరుడు ;
3] సంవాహక వృత్తి = ఒళ్ళు మర్దన పట్టే పని, ఉద్యోగం ;
4] కుంటమోదం హస్తి  
*********************************************; 
;
అధ్యాయ శాఖ ;- 26 ;- నగరంలో గజం ; 
previous ; అధ్యాయ శాఖ ;- 25 ; వసంతసేన ఇంటికి ...  ;
&
21, నవంబర్ 2017, మంగళవారం ; కూటమి నడక - కూడలి వైపుకి ; : 
********************************************* ;
వసంతసేనకు చెప్పాడు - సంవాహకుడు 'మాది పాటలీపుత్రం LINK  - 
సంపదలు పోవడంతో చారుదత్తుడు నన్ను పనిలోంచి తొలగించాడు. 
నేను బయటకు వచ్చి జూదగాడిగా మారాను. 
ప్రస్తుతం జూదంలో పది బంగారునాణాలు పోగొట్టుకున్నాను...''  ;
;

15, డిసెంబర్ 2017, శుక్రవారం

వసంతసేన ఇంటికి ......

మైత్రేయుడు ;- మార్గుడా, చారుదత్తుల వారి బండి -
నీ అలంకరణతో కొత్త అందం 
సంతరించుకున్నది.
మార్గుడు ;- మా అన్న వర్ధమానుడే నాకు నేర్పాడు.
మైత్రేయుడు ;- 
మీ సోదరుడు వర్ధమానుడు 
ఐతే బహు నిమ్మళం, నెమ్మదస్థుడు.
అడపాదడపా ఏదో ఒక పని ఉన్నదంటూ, వెళ్తుంటాడు, 
నిన్ను ఇక్కడ పనికి అప్పగించి మరీ వెళ్తాడు.
నిన్ను చూస్తే గుండెలో నాకు బెరుకు.
మార్గుడు ;- 
 అదేంటయ్యా, అంత మాట అనేస్తున్నారు. 
నా పనికి ఇంతదాకా ఎవరూ పేరు పెట్ట లేదు, వంక చెప్ప లేదు.  
మైత్రేయుడు ;-  సరే, నేను కాదన్నానా, ఇంతకీ చారుదత్తుల వారి ఆనతి - గుర్తున్నది కదా.
మార్గుడు ;- వసంతసేనా దేవిని ఊరి శివార్లలోని ఆ తోటకు - తీసుకురమ్మన్నారు.
మైత్రేయుడు ;- రహస్యంగా - అని నొక్కి చెప్పారు కదా.
మార్గ ;- అట్లాగా, ఎందుకని?
మైత్రేయుడు ;- వసంత దేవి యొక్క తల్లికి కోపం,  
చారుదత్తుడు బీదరికంలో ఉన్న మనిషి, 
వీని 
పంచన చేరితే - గిట్టుబాటు కాదని.
మార్గ ;- ఆ, గుర్తు వచ్చింది, 
అందుకనే కాబోలు, వసంతమ్మ ఇంటికి నేరుగా వెళ్ళకూడదు, అన్నారు.
మైత్రేయుడు ;- ఔను, పెరటి గుమ్మం వద్ద బండిని నిలిపి ఉంచు, 
ఇప్పటికైనా నీ మట్టి బుర్రకు 
బోధ పడింది - అని అనుకుంటున్నాను.
మార్గ్ ;- మరైతే నాకొక అనుమానం.
మైత్రేయుడు ;- నువ్వొక ఆలోచనల పుట్ట - 
నీ పనికి మాలిన ధర్మ సందేహాలను తీర్చడానికే  
ఈ 
మైత్రేయుడు ఉన్నాడు, 
ఆ మనో వల్మీకం నుండి, వెయ్యి సందేహాలని - బైట పడెయ్యి.
మార్గుడు ;- ఈ తతంగం - ధూతమ్మ గారికి తెలీకుండానే జరుగుతూ ...
మైత్రేయుడు ;- ఆవిడ సతీ అనసూయకు వారసురాలు. 
భర్త ఏది చేసినా - భక్తితో ఆమోదిస్తూనే 
ఉంటుంది. 
ఐనా, అవి పెద్దవాళ్ళ ఆంతరంగిక విషయాలు.
మార్గ్ ;- బహిరంగ రహస్యాలున్నూ. 
మైత్రేయుడు ;- యజమానుల వ్యక్తిగత సంగతులని - సేవకులు ప్రశ్నించ కూడదు, తప్పు.
మార్గ ;- చిత్తం, చిన్న ప్రభువా. రౌరవాది నరకాలని పట్టి పోతారట. [పకపకా నవ్వుతూ] 
ఇది మా అన్న వర్ధమానకుడు  - నాకు బహూకరించిన ఛెర్నాకోల, 
ఇక చూడు, ఈ ఎడ్లు ఎట్లాగ పరిగెడుతాయో ......... ఛల్ ఛల్ డుర్ర్  .........
మైత్రేయుడు ;- ఈ మార్గుడు - కానరాని తుంటరి, 
వీనితో మాట్లాడే టప్పుడు నేను కాస్త అహమికతో మెలగాలి. 
;
**************************; 
శ్లోకమ్ ;-
శాస్త్రజ్ఞః కపటానుసార కుశలో వక్తాన చ క్రోధనః|
తుల్యో మిత్ర పరస్వకేషు చరితం దృష్టైన- దత్తోత్తరః|
క్లీ బాన్ పాలయితా శరాన్ వ్యధయితా ధర్మ్యోన లోభాన్వితో| 
ద్వార్భావే పరతత్వ బద్ధ హృదయో రాజ్ఞశ్చ కోపాపః||  
[9-5] ;; 
శూద్రకుడు - తన నాటకం - మృచ్ఛకటికమ్ - లో తెలిపిన - 
న్యాయాధికారి వ్యక్తిత్వం - నిర్వచనం ;  in -  మృచ్ఛకటికమ్ - start to her house
;
అధ్యాయ శాఖ ;- 25 ; వసంతసేన ఇంటికి ......  ;;
previous ; అధ్యాయ శాఖ ;- 24 ; డిసెంబర్ పోస్ట్ ;- వస్త్ర ప్రపంచం, బోణీ బేరం ;
;

14, డిసెంబర్ 2017, గురువారం

వస్త్ర ప్రపంచం, బోణీ బేరం

[ పాత్రలు ;- ఉజ్జయిని [sales girl] - దుకాణదారుడు  & 
విరటుడు - శకారుడు & మైత్రేయుడు ; వర్ధమానకుడు]
;
శకారుడు ;- విటూ! [on the road, walking]
విరటుడు ;- దొరా, సంస్థానకా!
శకారుడు ;- నన్ను రోజుకో కొత్త పేరు పెట్టి పిలుస్తున్నావేమి?
విరట ;- చిత్తం, నా అసలు పేరుని నేనే మర్చిపోయాను గదండీ .....
శకారుడు ;- ఓహో, నిన్ను విరటుడు - అని సంబోధన చేయలేదని అన్న మాట ...... 
నాతో చతురులాడుతున్నావూ .....
విరటుడు ; ఎంత మాట - మీతోనే హాస్యాలు, ఇదిగోండయ్యా, 
చెంపలేసుకుంటున్నాను, లెంపలేసుకుంటున్నాను ...
శకారుడు ; అది సరే గానీ - ప్రతి రోజు - వసంతసేన - కోవెలలో "నిత్య నాట్యం" చేస్తుంటుంది కదా.
విరటుడు ;- ఔను, అది వారి కట్టుబాటు, సంప్రదాయాలు
శకారుడు ; వేశ్యగా పుట్టింది, కానీ కులవృత్తిని చేయట్లేదే,
....... మన బోటి రసికుల గతి - పస్తులేనా 
విరటుడు ; మన - అనకండి, మీరు మాత్రమే - అడ్డు ఆపూ లేని రసిక శిఖా మణులు. 
ఆ సుగుణవతి, లావణ్యాల రాశి మీద మీ కన్ను పడింది,
- [ విరటుడు - లో లోపల చిన్నగా నసుగుతూ] ఆమె ఖర్మ.
శకారుడు ; ఏమిటి, నీలో నువ్వే ఎదో గొణుగుతున్నావు? 
విరటుడు ;- అహ, మీరు చెప్పినట్లు ........ సర్వం సత్యం.
శకారుడు ;- నేనేం చెప్పానూ ....... ఆ, వసంతసేన - నాట్యం చేయడానికి - 
ప్రతి నిత్యం ఈ దారంటే వెళ్తూంటుంది కదా, ఈ మధ్య కనిపించడం లేదేమిటా అని.
విరటుడు ; అంగడి వీధికి రానే వచ్చాము. మన బండికి దుకూలం ఒకటి కొంటామని నిన్న చెప్పారు. 
శకారుడు ;-  మాట మారుస్తున్నావూ, సరే పద, ఈ దుకాణంలో చూద్దాము.
[ at the shop] 
శకారుడు ;-  మాకు కొత్త విపుల వస్తం చూపించు.
విక్రయదారుడు ; - మా దుకాణంలో అన్నీ కొత్తవే విక్రయిస్తాం.
శకారుడు ; ఇవాళ ప్రతి చోట నాతో హాస్యాలాడే వాళ్ళే ఎదురౌతున్నారు.
విటు ;- చప్పున మాకు చూపించు, చిలక పచ్చ వస్త్రములను.
విక్రయదారుడు ;- అదైతే ఒకటే ఉన్నదండి, ఇదిగో. 
విరటుడు;- ధగధగ లాడుతూ, భేషుగ్గా ఉన్నది - ఈ పట్టు గుడ్డ. మడతపెట్టి, ఇవ్వు.
దుకాణదారుడు ;- ఇదిగోనండి. అయ్యా అయ్యా, దీని ఖరీదు రెండు వరహాలు.
విరటుడు ;- అమాయకుడా, మా దొరగారి నుండి - ఖరీదు ద్రవ్యాన్ని ఆశిస్తున్నావు. 
నువ్వు ఊరికి కొత్త అనుకుంటాను. [వలువను పట్టుకుని, వెళ్లిపోయారు.]
షాపు వ్యక్తి ;- హూ, వెళ్ళిపోయారు, ఇంకా నయం, ఉన్నవి రెండే రెండు, 
నిన్న చారుదత్తుల ఇంటి వాళ్ళు - 
కబురు చేస్తే, తెప్పించాను - ఇవాళ ఇట్లాగైంది. 
[అంగడి వద్దకు ఇద్దరు -  మైత్రేయ, వర్ధమానక - వచ్చారు]
దుకాణదారుడు ;- ఉభయులకూ నూరేళ్ళాయుష్షు, 
రండి రండి, దయ చేయండి. మైత్రేయా, వర్ధమానకా.
మైత్రేయుడు ;- మేము చెప్పిన వర్ణం ఇదే. ఇంత  శ్రద్ధగా గుర్తు పెట్టుకుని, తెప్పించావు.
వర్ధమానకుడు ;- కనుకనే మీ అంగడి ఎప్పుడూ కిట కిట లాడుతుంటుంది.
దుకాణం యజమాని ;- వాస్తవానికి రెండు తెచ్చి ఉంచాము. కానీ ....
ఇప్పుడే ఒకరు దౌర్జన్యంగా - డబ్బులు ఇవ్వకుండా - తీసుకుని, వెళ్ళి పోయారు.
వర్ధమానకుడు ;- శకారుడే అయి ఉంటాడు.
దుకాణ ;-  వర్ధమానకా! తమరు ఖచ్చితంగా పోల్చుకున్నారే.
వర్ధమానకుడు ;- అటువంటి తింగరి చేష్ఠలు - అతనికి మాత్రమే పరిమితం.
ఉజ్జయిని :- శకారుడు సన్యాసులను, పరివ్రాజకులను కుడా వదిలిపెట్టడు. 
క్రితం నెల - పుష్పకరండకం వద్ద ఒక బౌద్ధ పరివ్రాజకుని - నిష్కారణంగా - కొట్టాడు.
వర్ధమానకుడు ;- అతను మన సంవాహకుడేమో, మైత్రేయా.
మైత్రేయుడు ;- నువ్వు చెబ్తుంటే, నాకూ అదే అనిపిస్తున్నది, వర్ధనా! 
దుకాణదారుడు ;- ఉజ్జయినీ, ఈ పట్టు వస్త్రాన్ని మడతపెట్టి, వీరికి ఇవ్వు.
వర్ధమానకుడు ;- నువ్వు ఉజ్జయిని కదూ ; కుశావతి, రేభిల్లుడు - ఎక్కడ ఉన్నారు?
ఉజ్జయిని ;- మా అక్క, అన్నయ్య - ఇద్దరు - చెరొక వైపు. 
అక్కయ్య కుశావతి - మా ఊరు చేరింది. మా అన్న రేభిల్లుని జాడ తెలీదు. 
జానెడు పొట్ట కోసం - నన్ను పనిలో చేర్చారు, మా వాళ్ళు .
మైత్రేయుడు ;- ఔరా, మనమందరము - ఆ భగవానుని ఆటలో పావులమే.
ఉజ్జయిని ;- మరే, చదరంగంలో పావులము, పాచికలము.
;
♣♣♣  ♣♣♣♣♣♣ ♣♣♣ ♣♣♣   ♣♣♣  ♣♣♣♣♣♣ ♣♣♣ ♣♣♣ 
అధ్యాయ శాఖ ;- 24 ; డిసెంబర్ పోస్ట్ ;-వస్త్ర ప్రపంచం, బోణీ బేరం ;
;& previous అధ్యాయ శాఖ ;- 23 ; -  
గృహ శోభ, ఇంటి ఇల్లాలు ; 9, డిసెంబర్ 2017, శనివారం ;
♣♣♣  ♣♣♣♣♣♣ ♣♣♣ ♣♣♣   ♣♣♣  ♣♣♣♣♣♣ ♣♣♣ ♣♣♣ 
భాసో హాసః  - = bhaasO haasa@h - ;[LINK] ;- 
ఆంధ్రభూమి సాహితి ;- అది హాస్యం కాదు.. అవహేళన ;-

ప్రాచీన నాటకకర్తలలో స.శ.పూ.4వ శతాబ్దంలోని భాసుడు- 
చారుదత్త నాటకంలో శకారుడు అనే పేరున్న రాజుగారి బావమరిది పాత్ర హాస్యాన్ని సృష్టించాడు. 
బాధ్యత లేని అధికారం ఎంత అనర్థదాయకమో రచయిత లోకానికి తెలిపాడు. 
రామాయణ, భారత కథలలోని పాత్రలను వరుసలు కలిపి మాట్లాడే ఆ మూర్ఖుడు, 
అతడి అనుచరులు గొప్ప హాస్యం ప్రదర్శిస్తారు. 
చిత్రమేమంటే శకారుడు ఈనాటికీ మనకు సమాజంలో ఎక్కడ చూచినా కనిపిస్తాడు. 
ఈ పాత్ర సృష్టివలన ఖాసోహాసః- అనే నానుడి కూడా పుట్టింది.
;

9, డిసెంబర్ 2017, శనివారం

గృహ శోభ - ఇంటి ఇల్లాలు

రోహణుడు ;- అమ్మా! అమ్మవస్తున్నది, నాన్నగారూ!
ధూతాదేవి ;- రోహణా, బాగా ఆడుకుంటున్నావుకదూ. 
రదనికను ఇబ్బంది పెట్ట లేదు కదూ.
రోహణ ;- అమ్మా, ఇదిగో నా బండి.
ధూత ;- ఈ నగలు, ఇన్ని రత్నాభరణాలు, ఎక్కడివి?
రదనిక ;- అవీ, అవి, వాటిని ఆమె ఇచ్చారు. [లోనికి వేలు చూపిస్తూ అన్నది.] 
ధూతామాంబ ;- ఆమె ఎవరు? అరె, వసంతసేన .....
వసంత సేన ;- నమస్కారం దేవీ! 
ధూత ;- ఐతే నేను లేని లోటును నీవు తీర్చావన్న మాట.
వసంత సేన ;- [గాభరాగా] అబ్బే అదేమి కాదు. 
మరి, సెలవు తీసుకుంటాను.
రదనిక ;- మన రోహణ బాబు - తోటి పిల్లలు ఏడిపిస్తుంటే, 
బంగారం బొమ్మ బండి కొనుక్కోమని, సముదాయించారు, 
తన నగలన్నీ వలిచి ఇచ్చారు.
వసంత సేన ;-  మరి ......., ఇంక ...... సెలవు తీసుకుంటాను.
ధూత ;- నేను వచ్చాను,  కాబట్టి - వెళుతున్నావా, 
నాకైతే వెన్నెల మాయం ఔతున్నట్లు అనిపిస్తున్నది.
వసంత సేన ;- ఉదయ ప్రభాతం, సూర్యుడు రాగానే, 
వెన్నెల మటుమాయం ఔతుంది కదా.
చారు దత్తుడు ;- వర్ధమానకా, ఈమెను ఆమె ఇంటి వద్ద, క్షేమంగా దిగవిడచి, రా. 
వర్ధమానకుడు ;- అయ్యా, యజమానురాలు వచ్చారు, పండగ వస్తున్నది, 
మన గూటి బండికి కొత్త వస్త్రాలు కప్పితే బాగుంటుంది.
ధూత ;- నా పుట్టినింటి వారు ఇచ్చారు ఆడ పడుచు లాంఛనం. 
ఇవిగో, ఈ డబ్బులు తీసుకుని, పట్టు వస్త్రాన్ని కొను. 
చిలకాకు పచ్చ రంగు వస్త్రాన్ని కొను వర్ధమానా. 
మైత్రేయుడు ;- వీనికి ఏం తెలుసును వస్త్రాల  నాణ్యత, నేనూ తోడు వెళ్తాను. 
వర్ధమాన ;- ఈమె  తల్లి వచ్చి ఉన్నారు. బైట వాకిలి వద్ద నిలబడింది, 
రుస రుసలాడుతూ, అందరినీ తూర్పారబోస్తున్నది. 
వసంత సేన ;- ధూతా దేవీ, నన్ను మన్నించండి, త్వరగా వెళ్ళాలి,
మా అమ్మ నాలికకు పదును ఎక్కువ, సెలవు. 
[ ముగ్గురూ - నడిచారు.]
ధూత ;- రదనికా, నీళ్ళు బాగా తెర్లనీ. మరిగే నీళ్ళతో - ఇంట్లో అందరమూ, 
తలంటు స్నానాలు చేద్దాము.
రదనిక ;- అది సరేగానీ, తమరికి, వసంతమ్మ మీద కోపం రాలేదు, 
నాకైతే - మీ పోకడ చిత్రంగా అనిపిస్తున్నది.
ధూత ;- ఇందులో ఆశ్చర్యాలెందుకు, ఆమె నాట్య లావణ్యాలు - 
ఈ నగరంలోనే కాదు - లోక ప్రసిద్ధి. మా పుట్టింటి ఊరిలో కూడా - 
ఈమెను గూర్చి మాట్లాడుకున్నారు - పొగుడుతూ. 
అంత సౌందర్య రాశి రాక, మా గృహ శోభను ఇనుమడింప జేసింది. 
చారు ;- నీ వంటి భార్య లభించడం, నా పూర్వ పుణ్య సుకృతం. 
రోహణా, వచ్చే పౌర్ణమి - మనకు కొత్త వెలుగు.
రదనిక ;- ధూతమ్మ లాంటి ఇల్లాళ్ళు ఉన్నప్పుడు, 
మగవారికి నిత్య పున్నములే, 
అమ్మా, వస్తున్నాను ఉండండి. 
పొయ్యిలో పొట్టు కూరి, నీళ్ళ గాగు పెడ్తాను. 
[ధూతను అనుసరిస్తూ, లోనికి వెళ్ళింది]
రోహణుడు ;- నాన్నారూ, మైత్రేయుడు వెళ్ళి పోయాడు. 
నాకు మన చెట్టు జామకాయలు కోసి ఇవ్వరూ, 
కొమ్మ మీద చిలక వాలి, దోర పళ్ళన్నీ తినేస్తున్నది. 
;
;;  ♣♣♣  ♣♣♣♣♣♣ ♣♣♣ ♣♣♣   ♣♣♣  ♣♣♣♣♣♣ ♣♣♣ ♣♣♣ 
] అధ్యాయ శాఖ ;- 23; డిసెంబర్ పోస్ట్ ; -  గృహ శోభ, ఇంటి ఇల్లాలు ;

previous ;- 3, డిసెంబర్ 2017, ఆదివారం ;- 
మట్టి బండి తళ తళా మిలా మిలా ;-
 ♣♣♣♣♣♣   ♣♣♣  ♣♣♣♣♣♣ ♣♣♣ ♣♣♣ ;;
బంగారుబండితో ఆడుకుంటావులే ; Link ;- 
మా అమ్మ వంటి మీద నగలుండవు. 
ఇన్ని నగలున్నావిడ మా అమ్మ ఎలా అవుతుంది?'' అన్నాడు  
ఈ రత్నహారాన్ని తీసుకుని నువ్వు ఆవిడ వద్దకు వెళ్లి 
చారుదత్తుని గుణాలకు లొంగిపోయిన 
యీ దాసి ఆమెకు కానుకగా యిస్తోందని చెప్పి యిచ్చిరా' అంది వసంతసేన. 
కాస్సేపటికి ఆమె తిరిగి వచ్చి 
''ధూతాదేవి తీసుకోలేదు. 'నా భర్త నీకు యిచ్చిన హారాన్ని నేను తీసుకోకూడదు. 
నా భర్తే నాకు వెలలేని ఆభరణం' అని చెప్పమంది.'' అని తెలిపింది. ...... 
అంతలో - రోహసేనుడు ఏడుస్తూ వచ్చాడు  ......... 

 ♣♣♣♣♣♣   ♣♣♣  ♣♣♣♣♣♣ ♣♣♣ ♣♣♣ ;

3, డిసెంబర్ 2017, ఆదివారం

మట్టి బండి తళ తళా మిలా మిలా

[ వసంత సేన, చారుదత్తుల వద్దకు వచ్చింది రదనిక ];
రదనిక ;- ఈ పాలు, పళ్ళు - ఇక్కడ పెట్టమంటారా!?
చారుదత్తుడు ;- ఈమెకు పాలు ప్రత్యేకం తెచ్చావా రదనికా!?
రదనిక ;- కర్పూరం, సుగంధ ద్రవ్యాలు కలిపాను. 
అన్నీ ఆమె చెప్పిన పద్ధతినే- పాళ్ళు కలిపాను. 
బయట పంచపాళీలో రోహణబాబు ఆడుకుంటున్నారు. 
పొరుగు వారి పిల్లలు కూడా ఇవాళ ఆడుకోవడానికి వచ్చారు .........
వసంత ;-  పెద్దవాళ్ళు దగ్గర లేకపోతే - పిల్లలు పోట్లాడుకునే ఆస్కారం ఉన్నది కదా. 
[చారుదత్తుని వైపు చూస్తూ అన్నది]
చారు ;- నిజమే కదా - వేగిరం వెళ్ళు రదనికా. 
మా పుత్రుడు రోహణుని జాగ్రత్తగా ఆడించు. 
రద ;- సరేనండి, వెళ్తున్నాను. '''''''''''''''''
చారు ;- వసంతసేనా, ఉత్సవంలో ఆ రోజున - నీ నాట్యం అద్భుతం.
వసంతసేన ;- ధన్యురాలిని. మీరు ఈ వేణువును  - సుందరతమంగా మ్రోగిస్తున్నారు. 
మీ మురళీ వాదనా కౌశలం అమోఘం. 
ఈసారి - నా నర్తనాభినయాలకు - మీరు పిల్లనగ్రోవిని 
ఊదితే ఈ వసంతసేన - పురా సుకృతంగా భావిస్తుంది.
[రోహణుడు ఏడుస్తూ వచ్చాడు]
వసంత ;- అరే, ఎందుకు చిన్నా, ఏడుస్తున్నావు, 
మా రోహణ బాబుని ఎవరు కొట్టారు? హన్నా, వాళ్ళను చూపించు.
రద ;- పక్క వాళ్ళ పిల్లలు - ఎగతాళి చేస్తున్నారు .... అందుకనీ .......
చారు ;- ఏమని, ఇటు రా కన్నా.
రోహణ్;- నాది మట్టి బండి అట, వాళ్ళవి లోహ శకటులని అంటున్నారు,
అంటూ నన్ను ఒకటే గేలి చేస్తున్నారు, నాన్నా!  
చారు ;- ఆ [నిర్ఘా ర్ఘాంతపోయాడు]
రద ;- బాబు ఎక్కిళ్ళు పెడుతూ - ఒకటే ఏడుపు.
వసంత ;- ఇవిగో, ఈ ఆభరణాలు, ఈ చిన్నారి బండిలో వేస్తున్నాను, రదనికా, 
విపణివీధికి వెళ్ళి, ఎక్కడెక్కడ అందమైన చక చక్కని - 
మంచి బంగారు బళ్ళు దొరుకుతాయో కనుక్కొని, మాకు చెప్పు. 
మంచి అంగడి చిరునామాలను - నీవు, మైత్రేయుడు, సంవాహకుడు - ఆరా తీసి, 
చారుదత్తుల వారికి తెలపండి.
రదనిక ;- సంవాహకుడు ఇప్పుడు - ఇక్కడకు రావడం లేదమ్మా! 
ఎక్కడికో వెళ్ళి పోయాడు. 
అతను బౌద్ధం స్వీకరించాడు- అంటూ అనేక వార్తలు వినిపిస్తున్నవి.
వసంత ;- అరే, ఔనా!  రదనికా, అతను జూదం ఆడుతుంటాడు కదూ!
రద ;- ఔనమ్మా, సంవాహకుడు మీకు కూడా తెలుసా!? 
వసంత ;- రెండు నెలల క్రితం - అతను నా వద్దకు వచ్చాడు. 
జూదంలో పందాలు కట్టి ఓడిపోయాడు, జూదరులు వెంటాడారట. 
వెండి కంచాన్ని - దాచి తెచ్చి, మాకు అమ్మజూపాడు.
వస్తువుపైన చారుదత్తుల పేరు ఉన్నది. అతనికి డబ్బు ఇచ్చి - మందలించాను. 
ఈ విలువైన వస్తువును తిరిగి యజమానులకు ఇవ్వమని చెప్పాను.

సిగ్గు పడి, పశ్చాత్తాప పడుతూ వెళ్ళిపోయాడు.
రద ;- ఔరా, కొన్నాళ్ళు ఇంట్లో - వెతుక్కున్నాము. 
తర్వాత - గొడ్ల సావిడిలో దొరికింది. ఇదన్న మాట, అసలు కథ. 
మేము గుర్తుపట్టనే లేదు. సంవాహకుడు - కంచం దొంగిలించి - 
తానే గుట్టుచప్పుడు కాకుండా - అక్కడ పేడ కుప్పలో
అట్టి పెట్టేసి - వెళ్ళిపోయాడన్న మాట. ఔరా.
వసత ;- ఐతే సంవాహకుడు - బౌద్ధ పరివ్రాజకునిగా మారాడు కాబోలు.
రదనిక ;- కామోసు.
వసంత ;- విధిలీలలు ఎంత చిత్రమైనవి.
రోహణ్ ;- మరైతే - ఈ గొలుసులతో వెండి శకటం వస్తుందా.
రదనిక ;- వెండి కాదు, బంగారందే వస్తుంది, మన ఇంటికి, 
బంగారంలాంటి వసంతసేనమ్మ హస్తవాసి కదా . [నవ్వింది]
వసంత ;- హమ్మయ్య, నన్ను చూసి, రుసరుసలాడే రదనిక వీక్షణాలలో - 
తేనె జల్లులను కురిపిస్తున్నవి - ఈ క్షణాలు.
రదనిక ;- అమ్మా, మీకు చెప్పేటంతదాన్ని కాదు గానీ - 
వసంత ;- ఊ, కానీ ....... ?
రదనిక ;- ఆ, ఏమి లేదు లేమ్మా. పండుగ వస్తున్నది. 
మామిడాకులు, అవీ కోయమని మైత్రేయునికి చెప్పాలి. 
అక్కడేమో కొమ్మల్లో కాకి గూళ్ళు ఉన్నవి. 
ఆ గూళ్ళలో - కోయిలలు గుడ్లు పెట్టాయి. 
ఈ అమాయక పక్షులు - వాటినీ పొదిగాయి. 
పిల్ల పిట్టలు కిచకిచమటున్నాయి. 
ఆ పరాయి పిట్టలు - ఎగిరి వెళ్ళాలి. 
ఆనక, మామిడాకులు కోస్తాము. అడుగో మైత్రేయుడు .....
మైత్రేయ ;- ధూతమాంబ గారు - ఈ వారం వస్తున్నారని - కబురు వచ్చింది.
రద ;- రోహణ బాబూ! పదండి, బైట మీ నేస్తాలు ఆటలకు పిలుస్తున్నారు. 
మైత్రేయా, సమయానికి వచ్చావు. 
తోరణాలు కట్టడం కోసం - నువ్వు మామిడాకులు తేవాలి.
మైత్రేయ  ;-  ఈ మైత్రేయుడు సమ భావుకుడు, 
అందరి ఆజ్ఞలను శిరసా వహిస్తాడు, పద, 
రదనికా! ఇదేమిటి, రోహణ బాబు మృచ్ఛకటికం - 
ఈ నాడు - భారీగా ధగధగలాడ్తున్నది.
మట్టి బండి తళ తళా మిలా మిలా ....... 
కళ్ళు మిరుమిట్లు గొలుపుతున్నవి. 
రదనిక ;- ష్, మైత్రేయా, ముందు పద.
;
♣♣♣ ♣♣♣ ♣♣♣ ♣♣♣
మట్టి బండి తళ తళా మిలా మిలా ;  
అధ్యాయ శాఖ ;- 22 ; డిసెంబర్ పోస్ట్ ;
& previous ; అధ్యాయ శాఖ ;- 21 ;- ఆర్యకుడు - ఎక్కడ!? ;
♣♣♣ ♣♣♣ ♣♣♣ ♣♣♣
ఐదవ అంకం - వసంతసేనే - poddu ;- LINK ;
;
వసంతసేనే! పశ్య!పశ్య!
గర్జంతి శైల శిఖరేషు విలంబి బింబా మేఘా వియుక్త వనితా హృదయానుకారాః |
యేషాం రవేణ సహసోప్తతితైః మయూరైః ఖం వీజ్యతే మణిమయైరివ తాళ శృంగైః ||
= భావము ;- 
వసంతసేనా, చూడు, చూడు - శైలశిఖరాల మీద గర్జిస్తున్న ఆ మేఘాలు -
విరహిణుల హృదయాల లాగా ఎలా భారంగా ఉన్నాయో! 
వాటి చప్పుడుకు ఒక్క ఉదుటున పైకెగిరిన నెమళ్ళ పింఛాలతో 
ఆకాశం మణిమయమైన వింజామరలచేత వీయబడుతున్నట్టుగా లేదూ! 
;

2, డిసెంబర్ 2017, శనివారం

ఆర్యకుడు - ఎక్కడ!?

మార్గుడు ;- రేభిలా, ఓ రేభిల్లుడా!
రేభిల్ ;- మార్గా, మేము వెళ్తున్నాము.
తుందిలుడు ;- ఎక్కడికి?
రేభిల్ ;- పర దేశానికి తుందిలా.
మార్గుడు ;- ఏమిటీ - ఈ పురుటి గడ్డను, నీ మాతృ భూమిని వదిలిపెట్టి వెళుతున్నావా!? 
రేభిల్ల ;- పొట్ట చేత పట్టుకుని - వలస యాత్రలు
మనకు కొత్త కాదు కదా.
తుందిలుడు ;- ఆ మాట నిజమే అనుకో, మన పల్లెను వీడి - ఇక్కడ చేరాము, 
ఇప్పుడు వేరే దేశానికి ..... అంతే తేడా.
మార్గుడు ;- పరిపాలకులలో అలవి మాలిన స్వార్ధం పేరుకుపోయింది. 
శ్రీరామచంద్రుడు - గూఢచారులను పెట్టి, ప్రజల కష్ట సుఖాలను అరసేవాడు. 
తుందిల ;- మరే, శ్రీకృష్ణ దేవరాయలు, తిమ్మరుసు మంత్రితో కలిసి - 
మారు వేషాలలో రాజ్యంలో 
అందరి గురించి తెలుసుకుంటూండే వాళ్ళు.  
జనం, ప్రతి ఒక్కరి బ్రతుకు బండి గతుకులలో పడకుండా 
నడిచేటట్లు చూస్తూ, కాపాడే వారు.
మార్గుడు ;- రేభిల్లా, ఇప్పటి పరిస్థితులకు - ఇదే సరైనది అనిపిస్తున్నది.
కుశావతి ;- తుందిలా, మా అన్నతో వెళ్తున్నాము. 
వసంతసేనమ్మకు నా నమస్కారములను అందించు, సెలవు.
తుందిలుడు ;- మార్గయ్యా, కుశావతి, రేభిల్లుడు వెళ్ళి పోయారు. 
పాపం, ఆమె ప్రియుడు శర్విలకుడు ఎక్కడున్నాడో ఏమో.
మార్గ ;- ఎక్కడ ఉన్నా - క్షేమంగా ఉంటే చాలు, 
ఆ జంట మళ్ళీ ఒకటైతే మేలు, బాగుంటుంది. 
శకారుని అనుచరుడు - 'విటుడు' వస్తున్నాడు.
విటుడు ;- ఆర్యకుడు తుర్ర్  తుర్రుమని పారిపోయాడు.  
మార్గు ;- అతడు తప్పించుకున్నాడా!? ఆహా, శుభ వార్త.
తుందిల ;- ఔనా, విరటూ.
విటుడు ;- శకారుడు అతనిని వెతుకుతున్నాడు. 
మా యజమాని శకారుడి కంట పడకుండా - 
జాగ్రత్త పడండి. లేకుంటే - 
మిమ్మల్ని కూడా వేధిస్తాడు, మా పెత్తందారు.
మార్గ ;- ఆర్యకుడు ఎట్లాగ తప్పించుకో గలిగాడు విటుడా!
విటుడు ;- కొందరు కావలి భటులు - 
లోపాయికారీగా సహాయం చేసారు, ష్ ష్ ష్ - సద్దు, సద్దు!
శకారుడు ;- ఆర్యకుడు పారిపోయాడు. హ్హు, 
ఎంత దూరం తప్పించుకుంటాడు, తాషామరప్పా. 
వాడి కాళ్ళు చేతులకి - సంకెళ్ళు ఉన్నాయి, 
ఆ శృంఖలల  ధ్వని చాలు, వాణ్ణి పట్టిస్తాయి ......... 
విటూ, ఎక్కడున్నావు, 
సమయానికి కనపడవు.
విటు ;- చిత్తం, ఈ విరటుడు ఇక్కడే ఉన్నాడిదిగో స్వామీ!
శకారుడు ;- మన బండిని సిద్ధం చేయించమన్నాను - ఏదీ, మన శకటం!?
విరట ;- అదిగో, రానే వచ్చింది, మన బండి.
♣♣♣♣♣♣♣♣  ♣♣♣♣♣♣♣♣  ♣♣♣♣♣♣♣♣  ;
2, డిసెంబర్ 2017, శనివారం ; 
అధ్యాయ శాఖ ;- 21 ;- ఆర్యకుడు - ఎక్కడ!? ;
&
ఆషామాషీ కబుర్లు - పుష్పకరండకం తోట ;
డిసెంబర్ పోస్ట్ ; & ;- previous ;- అధ్యాయ శాఖ ;- 20 ;
 ♣♣♣♣♣♣♣♣  ♣♣♣♣♣♣♣♣  ♣♣♣♣♣♣♣♣  ;
తెలుగు బ్లాగుల సంకలిని ;-  http://www.maalika.org/   ; LINK ;
REF ;- బౌద్ధభిక్షువుగా మారిన సంవాహకుడు - LINK ;  ; 
తన కౌపీనాన్ని అక్కడి చెరువులో ఉతుక్కుంటున్నాడు ;
 ♣♣♣♣♣♣♣♣  

ఆషామాషీ కబుర్లు - పుష్పకరండకం తోట

ఉపకథ ;- పావురం - princess of Komala kingdom - to Gowranga king ;
1. కోమల రాజ్య యువరాణి - గౌరాంగ రాజుకు 
సందేశం ఉత్తరం పంపింది.
"మా ప్రాంత స్త్రీలు అందరము ఒక వ్రతము చేయుచున్నాము. 
ఈ నోము కోసం అత్యవసరంగా - కొన్ని సువర్ణ బీజములు అవసరం. 
116 పసిడి విత్తులను మీరు మాకు ఇవ్వగలరా!?.....
మా దేశంలో బంగారు గనులు లేవు. మాకు వెండి 
ఎక్కువ ఉన్నది. కనుక మీకు రజతమును [= వెండి] 
అధికంగా ఇస్తాను. మీరు స్వర్ణ బీజములను 
పంపగలరని ఆశిస్తున్నాను. కృతజ్ఞతలతో - 
కోమల రాజ్య యువరాణి." 
ఈ లేఖ చూసి, గౌరాంగ ప్రభువుకు ఎంతో సంతోషం కలిగింది.
కోమల సీమకు, తమ రాజ్యానికి ఎప్పటి నుండో 
వైషమ్యాలు, తగాదాలు ఉన్నవి. 
ఇప్పుడు ఇరుగు పొరుగున ఉన్న 
తమ రెండు దేశాలకు స్నేహం కుదిరినచో మంచిదే కదా! 
కోమల రాజ్య యువరాణి అడిగిందే తడవుగా - 
వెంటనే - బంగరు విత్తులను పంపించాడు గౌరాంగుడు. 
అటు తర్వాత - ఇరువురికీ అభిమానం, 
ప్రేమ కలిగాయి, పెళ్ళి చేసుకున్నారు. రెండు రాజ్యాలు ఒకటైనాయి. 
అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లారు.
తాను చెబుతున్న కథకు కొస మెరుపును తగిలించాడు  మార్గుడు  -
అట్లాగ ఆ కోమల ఉత్తర సందేశం - ఉత్తమ సందేశం అయి,
ఉభయ రాజ్యాలు ప్రగతిమార్గాన పయనిస్తున్నవి. 
;

;  ♣♣♣♣♣♣♣♣ ♣♣♣♣♣♣♣♣ ♣♣♣♣♣♣♣♣ ;
;
చారుదత్తుని సారధి మార్గుడు చెప్పిన కథను వింటూ 
తనలో తాను అనుకుంటున్నట్లుగా, 
అన్నాడు వసంతసేన యొక్క బండి వాడు తుందిలుడు
తుందిలుడు ;- "ఏమిటో అర్ధం కాలేదు, అన్నా."
మార్గుడు ;- సరే సరే - సరదాకి చెప్పిన కథ అనుకో, పోనీ
మార్గుడు ;- పుష్పకరండకానికి వెళ్ళాలి.
తుందిల ;- పుష్పకరండకానికి ...... అంటే ........ ?
మార్గుడు ;- కాణీ కాదు, అర్ధణా కాదు.
పుష్పకరండకం - అనగా - మన ఊరి ఉద్యానవనం.
ఆ తోట - మీ యజమాని వసంతసేన వంటి వారికి
అందాల విడిది. [ అని నవ్వాడు] ;
తుందిల ;- మార్గా, ఇదేం బాగా లేదు. నువ్వలా ఎగతాళిగా నవ్వడం.
మార్గుడు ;- సరే, నవ్వను గానీ, ఇంకో ఉపకథను -
చెప్పుకుందామా, మార్గాయాసం లేకుండా.
ఇంకొక చిట్టి పిట్టకథ - చెబుతాను, నీ దొప్ప చెవులు అప్పగించి విను.
[ ఇద్దరి బళ్ళు కదిలాయి]. 

 ♣♣♣♣♣♣♣♣ ♣♣♣♣♣♣♣♣ ;  ♣♣♣♣♣♣♣♣ ♣♣♣♣♣♣♣♣ ; 

డిసెంబర్ పోస్ట్ ;;  అధ్యాయ శాఖ ;- 20 ;-  ఆషామాషీ కబుర్లు ;- 
 ఆషామాషీ కబుర్లు - పుష్పకరండకం తోట = park 
అధ్యాయ శాఖ ;- 19 ;  మార్గుడు, తుందిలుడు -           
& ;- previous ;- ; అధ్యాయ శాఖ ;- 19 ;- శకారుని ఘోష యాత్ర ;
;  ♣♣♣♣♣♣♣♣
;
మృచ్ఛకటికం కథ టూకీ గా (రవి గారి మాటల్లో ) ; LINK ;
ఈ రూపకం యొక్క కథాసంవిధానం ;- 
1. వసంతసేనను రాజశ్యాలుడు – శకారుడు మోహించి ; 
2.  చారుదత్తుడనే బ్రాహ్మణశ్రేష్టుడు,-భార్య,ధూతాంబ ; పుత్రుడు లోహసేనుడు ;
3. ఉజ్జయినీ నగరం రాజధానిగా అవంతీ రాజ్యం ; రాజు - పాలకుడు ;;
4. వసంతసేన - గణిక ;

5.  వసంతసేనను చారుదత్తుడు రెండవ భార్యగా ధూత అనుమతితో స్వీకరిస్తాడు. ;
;
శకారుడి అపభ్రంశపు ఉపమానాలు ;-
ఉదాహరణకు –
◾రావణుడికి కుంతిలాగా నువ్వు నా పాలబడ్డావు. 
◾రాముడికి భయపడ్డ ద్రౌపదిలా భయపడకు.
◾విశ్వావసువు సోదరి సుభద్రను హనుమంతుడు అపహరించిన  - 
రీతిలో నేను నిన్ను అపహరిస్తాను.

◾అడవి కుక్క లాంటి నేను పరిగెడుతుంటే, 
ఆడ నక్కలా నువ్వు పారిపోతున్నావు. 
;

28, నవంబర్ 2017, మంగళవారం

శకారుని ఘోష యాత్ర

శకారుడు ;- విటూ, ఆ కాలి గజ్జెలు, ఆ అందెల సవ్వడి  ...
వసంతసేనవి అనిపిస్తున్నది ...
విరటుడు ;- చిత్తం ప్రభూ. ఆ కాలి గజ్జెలు, ఆ అందెల సవ్వడి  ... అవి అవే. 
శకారుడు ;- భేష్, ఐతే నా అనుచరుడు - 
ఈ విరటుడి చెవులు రెండు - బాగా పనిచేస్తున్నవన్న మాట.
విరటుడు ;- చిత్తం, ఈ విరటుని శ్రవణేంద్రియాలు బహు చురుకు. 
మీ మదిని రాపాడుతున్న ఆ వసంతసేన  జాడలను - 
ఇట్టే పసికట్టగలుగుతున్నవి.
శకారుడు ;- ఆ మదిరాక్షి వసంతసేనను లోబరుచుకులేకపోతున్నాను, 
నా రాజ పదవికి అవమానం.
విరటుడు ;- చిత్తం. గతంలో మూడు సార్లు వెంటపడ్డారు, ఫలితం శూన్యం. 
తుర్రుమని వెంట్రుకవాసిలో తప్పించుకున్నది. తప్పించుకో గలగడం 
ఆమెకు వెన్నతో పెట్టిన విద్య అనుకుంటాను. 
శకారుడు ;- తోటలో ఆ బాలుడు - చారుదత్తుని కొడుకు ఐ ఉంటాడు - 
ఇటు బయటికి రప్పించు, విటూ.
విరటుడు ;- బాబూ, ఇటు రా .....
రోహణుడు ;- నా పేరు రోహణుడు.
శకారుడు ;- రోహణూ! నీ బుల్లి బండి బాగుంది. 
ఇంతకంటే మంచి వెండి బండి బొమ్మను తెచ్చి ఇస్తాను నీకు, 
ఒక సంగతి చెప్పు. 
ఇప్పుడే మీ ఇంటి లోపలికి వచ్చింది, ఆమె మీ అమ్మ కదూ .
రోహణుడు ;- ఊహు, కాదు. మా అమ్మగారు ఊరికి వెళ్ళారు. ఈమె మా పిన్ని.  ;
శకారుడు ;- విటూ - పిన్ని - అని కూడా పిలిపించుకుంటున్నది, 
ఎంతైనా ఆ వసంతసేన జగజ్జాణ.
రోహణుడు ;- నా నేస్తాలు ఆటకి పిలుస్తున్నారు.
శకారుడు ;- విటూ, ఆ జగజ్జంత్రి -  వసంత సేన ఆ ఇంట్లోనే తిష్ఠ వేసింది. చూస్తాను, 
దీని పొగరు అణచకపోతే - నా పేరు శకారుడే కాదు, విటూ!
విర ;- చిత్తం, నాదొక చిన్న విన్నపం. విరాటుడని చక్కని పేరు నాది. 
మీరు - విటూ - అనేస్తున్నారు. వినడానికి ససిగా లేదు. విటుడు - అనే అర్ధం - వస్తున్నది.
[ఆర్యకుని దళంలోని వాళ్ళు - పరిగెడుతున్నారు, పట్టుకోండి, పట్టుకోండి]
శకారుడు ;- పద పద విటూ. దాక్కుంటూ పరుగు పెట్టాలి మనం. 
వాళ్ళ కంట పడితే మనకు ప్రమాదం.
విరటుడు ;- ఇతను శకారుడు, హ్హు 
ఈ మహా వీరునికి అనుచరుణ్ణిగా నేను, ప్రారబ్ధం.
శకారుడు ;- ఓ భటులారా, ఆ దళాలను తరమండి, వెంటాడండి. 
తరిమి తరిమి పట్టుకోండి 
[గట్టిగా అరుస్తూ, పక్కకు తిరిగి, లోగొంతుకతో] 
విటూ, మనం ఈ పక్క సందులో నుండి నెమ్మదిగా కోటకు చేరుదాం. 

విరటుడు ;- అట్లాగేనయ్యా, ఇట్లాగే - 
గమ్ముగా, గమ్మత్తుగా - జారుకుందాం, పదండి.  
;
 ♣♣♣ ♣♣♣ ♣♣♣ ♣♣♣ ♣♣♣  ♣♣♣ ♣♣♣ ♣♣♣ ♣♣♣ ♣♣♣ ;;
; అధ్యాయ శాఖ ;- 19 ;- శకారుని ఘోష యాత్ర ;
previous ;- ; అధ్యాయ శాఖ ;- 18 ;- మళ్ళీ చారుదత్తునికి ఇంటికి ఆమె  ;
+ matter REF - Sakaaruni GOsha ;- link ;- 
 శకారుడు పలికే ప్రాకృతంలో శ-ష-స మూడు వర్ణాలకు శ-కారమే  .

27, నవంబర్ 2017, సోమవారం

మళ్ళీ చారుదత్తునికి ఇంటికి ఆమె

వసంతసేన ;- శర్విలకుడు, కుశావతి వెళ్ళిపోయారు.
కుశ వెళ్ళిన తర్వాత - ఒంటరి తనం - తెలిసి వస్తున్నది. 
ధూతా దేవి నగలు - నాకు భారంగా అనిపిస్తున్నవి. 
వెంటనే వీటిని ఆమెకు చేర్చి తీరాలి. తుందిలుడా! 
తుందిలుడు ;- బండిని సిద్ధం చేసి ఉంచాను దేవీ!
వసంత సేన ;- తుందిలుడా! ఆర్యకుడు ఎవరు? 
                       నగరంలో ప్రశాంతత - స్థిరంగానే ఉన్నదా!?  
తుందిలుడు ;- కొంచెం కల్లోలంగా ఉన్నదమ్మా! 
ఐనా ఫరవాలేదు, కొంత సద్దు మణిగినట్లే ఉంది. 
వసంతసేన ;- తుందిలా, ఎందుకైనా మంచిది, 
పక్క సందు నుండి శకటమును పోనివ్వు.
తుందిల ;- చారుదత్తుల ఇల్లు వచ్చింది అమ్మా! 
వసంత సేన ;- అదే తోట, అదే ప్రశాంతత.
ఆ ఇద్దరు పరిచారకులు పంచపాళీలో చదరంగ క్రీడను చెరిగేస్తున్నారు.

మైత్రేయుడు ;- వర్ధమానా, చూడు పందెం.
వర్ధమాను ;- మైత్రేయుని శకటు ఓడి పోయింది, గెలుపు 
పందెం ఈ వర్ధమానునిదే కదా.
వసంతసేన ;- గృహమునందు యజమాని ఉన్నారా!? 
మైత్రేయ ;- చారుదత్తా! వసంతసేన వచ్చారు. 
చారుదత్తుడు ;- వసంతసేన ఆగమనం ఆశ్చర్యదాయకం. 

మైత్రేయా, ఈమెకు నగలను ఇచ్చావా!?
మైత్రేయ ;- చారుదత్త స్వామీ, మీరిచ్చిన మూటను 
,               ఆమెకు అప్పటికప్పుడు - 
,                   అప్పుడే ఇచ్చేసాను దేవరా! 
వసంతసేన ;- అరె, మైత్రేయుని నిజాయితీని శంకించకండి. ఇవేగా ఆ నగలు, చూసి చెబుతారా?
చారుదత్త ;- ఔను, మీకు నచ్చలేదు కాబోలు. మీ ఆభరణముల విలువకు సమం అవవు. 
నెమ్మదిగా - తరువాత వాటి విలువను - ద్రవ్య రూపంలో ఇస్తాను. 
ఈ పేదవాని వలన తప్పిదం జరిగి పోయింది. మీ సొమ్మును కాపాడ లేక పోయాను. 
వసంతసేన ;- అరె, మీ మీద నాకు భరోసా ఉన్నది. 
చోరులు తెగించారు, మీరేమి చేయగలరు? 
ఇవి మీ భార్యవి కదా, 
కళళలాడుతున్న ధూతాంబ ఆభరణాలను - మీరు నాకు పంపించారు. 
నాకు దోషం, పాపం అంటుకుంటాయి. ఆవిడకు ఇవ్వండి.
మైత్రేయ ;- అమ్మగారు తమ సోదరి పెళ్ళికి వెళ్ళారు. 
దేవరా! వంట గదిలో భోజన పదార్ధాలు ఉంచాను. 
ఏదో మగవాని చేతి వంట, మీరు సర్దుకోక తప్పదు.
వర్ధమానుడు ;- దొరా! మైత్రేయుని ఆప్తులు వచ్చి ఉన్నారు. 
పండుగ పనులకు ఇతని చేతి సాయం కావాలంటున్నారు - బైట నిలబడి ఉన్నారు.
చారుదత్ ;- సరే, మైత్రేయా! అంత కావలసిన బంధువులు పిలుస్తున్నారు కదా, వెళ్ళు. 
భోజనాదులు, పనులు - మేము చూసుకుంటాములే.
&
వర్ధమానుడు ;- తుందిలా, నీ గూడుబండిని బాగా అలంకరించావు. శభాష్!
తుందిలుడు ;- నా పని అద్దంలాగా ఉంటుంది - అని 
మా వసంత దేవి మెచ్చుకుంటుంటారు, తెలుసా. 
వర్ధ ;- ఎవరి కర్తవ్యాన్ని వారు సక్రమంగా చేస్తుంటే 
లోకంలో కరువులు, కన్నీళ్ళు ఉండవు కదా.
మైత్రేయుడు ;- మా ఆప్తులు వచ్చారన్నావు కదా, వర్ధమానా, ఏరీ, ఎక్కడ?
వర్ధ ;- అమాయక బ్రాహ్మణుడా. మైత్రేయా, 
నీకు అర్ధం కావాలంటే పుష్కర కాలం పడుతుంది. 
పద, ఆ గుట్ట మీది గుడికి వెళ్ళి వద్దాము.  
తుందిలుడు ;- ఓహో, మీ జోడీ - అట్లాగ కులాసాగా తిరిగిరండి. 
మీకు ఈ తుందిలుడి శకునం అభయం, శుభం భూయాత్.  
 [నవ్వాడు తుందిలుడు]
;
♣♣♣ ♣♣♣ ♣♣♣ ♣♣♣♣♣♣ ♣♣♣ ♣♣♣ ♣♣♣♣♣♣ ♣♣♣ ♣♣♣

మళ్ళీ చారుదత్తునికి వాపసు ఇచ్చిన నగలు  ;
అధ్యాయ శాఖ ;- 18 ;- మళ్ళీ చారుదత్తునికి ఇంటికి ఆమె  ;

] previous ;- ఆర్యకుడు బందిఖానా ; 
& ;  శకారుడు -రదనిక - వసంతసేన ; LINK ;
ఎమ్బీయస్‌: మృచ్ఛకటికమ్‌- 3 ; 
REF ;- మైత్రేయుడు దీపం పట్టుకుని వచ్చి శకారుడితో 
''ఇది చారుదత్తుడి యిల్లు, ...... " ;

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...