16, ఫిబ్రవరి 2013, శనివారం

మన కశ్యప వారసత్వము


కాశ్యప గోత్రము :- హిందూ సమాజములో 
"సాంప్రదాయములలో గోత్రము యొక్క  ప్రాధాన్యత" అపరిమితమైనది. 
ముఖ్యంగా పెళ్ళిళ్ళు చేసేటప్పుడు, 
వధూ వరులకు రాశి, నక్షత్ర, గోత్ర పొంతనలను చూస్తారు. 
మఱి ఎవఱికైనా 'తమ యొక్క గోత్రము తెలీదనుకోండి. 
అప్పుడేమి  చేయాలి ? 
అలాంటప్పుడు ఈ క్రింద ఉటంకించిన శ్లోకమును చెప్పుకోవలెను. 
అనగా తమది కాశ్యప గోత్రమని చెప్పుకోవచ్చును.                                    
శ్లో. గోత్రత్వస్యాఽపరిజ్ఞానే! కాశ్యపం గోత్రముచ్యతే |                          ;  యస్మాదాహ శ్రుతిః పూర్వం ప్రజాః కశ్యప సంభవాః||
తాత్పర్యము :-
ప్రజలు కశ్యపుని వలన జన్మించినారు అని శ్రుతివాక్యము.

కశ్యప ప్రజాపతి :- 

కశ్యప మహర్షిని మన  ప్రాచ్య (=తూర్పు) ఖండములలో 
"ఆది పురుషుడు" అని భావించవచ్చును. 
దక్షిణ ఆసియా దేశాలలో - మూల స్తంభము. 
అనాది మనిషి, నాగరికత అభివృద్ధి చెందే దశలలోని 
ప్రజలకు మార్గదర్శకత్వము వహించినాడు. 
ఈ పైన చూపిన శ్లోకము అందుకు ముఖ్య ఆధారము.

కశ్యప కుటుంబము :- 

సృష్టికర్త బ్రహ్మ మరీచి అనే మహర్షిని సృజించెను. 
ఆ మరీచి భార్య పేరు కళ. ఈమె కర్దమ ప్రజాపతి కుమార్తె. 
వారికి జన్మించినవాడే కశ్యపుడు. కర్దమ ప్రజాపతి మాతామహుడు. 
కావున ఈతని మధ్యవర్తిత్వముచే కశ్యప ఋషి వివాహమైనది. 
దక్ష ప్రజాపతి తన కుమార్తెలు పదమువ్వుఱిని - 
కశ్యపునికి ఇచ్చి వివాహమొనరించెను. 
అలాగే వైశ్వానరుని తనయలు ఇఱువుఱు కశ్యపుని అర్ధాంగీ పదవులను పొందినారు. 
15 మంది సతులతో కూడి, జీవితమును నియమబద్ధముగా గడుపుచూ 
క్రమముగా ఆ మునివరుడు సమాజ సుస్థిరతకు అవసరమైన నియమావళిని 
రూపొందించే ప్రయత్నాలను చేసెను. 
ఆతని సంతానము తామరతంపరగా వర్ధిల్లి, మానవుని ఉనికి ప్రవర్ధమానమైనది. 
మానవుని సుఖ జీవనమునకు నీరు ముఖ్య ఆధారము గనుక, 
కశ్యపుడు సంఘ నిర్మాణమునకు నదీ, సముద్ర తీరములను ఎంచుకుని 
ఆ అన్వేషణలో సఫలీకృతుడైనాడు. తద్వారా “కశ్యప ప్రజాపతి”గా 
ప్రజల అభిమానమును పొందినాడు. 

వివిధ ప్రాంతముల ఉనికిని కనుగొన్న ఋషిసత్తముడు :-

"నీల మత పురాణము"లో కశ్యప మౌని గుఱించిన 
అనేక అంశములకు ఆధారములు లభించినవి. కాశ్మీరమునకూ, 
కశ్యపునికీ అవినాభావ సంబంధము కలదు. 
కశ్యప మీర దేశము” పరిణామములో “కాశ్మీరము” ఐనది. 
నేటి వ్యావహారిక నామము “కాశ్మీర్”.  

కశ్యప = కూర్మము, మధుపాన మత్తుడు అనే అర్ధాలు ఉన్నవి. 
శ్రీకూర్మము = అంటే తాబేలు - భూమిపైనా, జలములలోనూ జీవించే ఉభయచర ప్రాణి. 
కశ్యపుడు - ఇటు పృధ్వీతలము పైనా, అటు నీటిలోనూ 
నిర్భీతిగా సంచరించగల శక్తిసామర్ధ్యాలు కలిగి ఉన్నట్టి వ్యక్తి.

అంబుధికి ముని పేరు :-

నదీ తీరములు, జలనిధులు మిక్కిలిగా ఉన్న సీమలలో 
'ప్రజా సంఘముల ఏర్పాటుకు' పునాదులను వేశాడు కశ్యపుడు. 
తటాకాది జలాశయములు మనిషికి జీవనాధారములై, నాగరికతలు 
నవ్య నవీనముగా రూపొందే దశలకు శ్రీకారము చుట్టాడు తాపసి కశ్యపుడు. 
కశ్యప మహాఋషి సంచార జీవనములో కనుగొని, 
ప్రజా జీవనమునకు పూలబాటలను పరిచాడు. 
కనకనే అవి ఆ మునీశ్వరుని నామముతో వినుతికెక్కినవి. 

కశ్యప + మీర = కాశ్మీరము/ కాశ్మీరదేశము. 
కశ్యప సముద్రము = అనగా నేటి కాస్పియన్ సాగరము, 
సప్త మహా సముద్రాలలో ఒకటి 
Darya -I - Kaspyan. (Kashyap sagar - caspian sea)

కశ్యపుని జన్మ పరంపరలు :-

ఈ వివరములకు ఆధారములు 
"రాధాంతర కల్పము", 
"నీలమత పురాణము", 
"మహా భాగవతము" ఇత్యాది గ్రంధములు. 
ఆజన్మ బ్రహ్మచారిగా ఆసేతు హిమాచల పర్యంతమూ 
ప్రజలకు ఆరాధ్య దైవమైనవాడు శ్రీ హనుమంతుడు. 

కశ్యపుడు తన భార్య స్వాధ్యతో కలిసి, సంతానప్రాప్తికై తపస్సు చేశాడు. 
పరమేశుడు ఆ దంపతులకు ప్రత్యక్షమై,
“కశ్యపా!  కారణజన్ముడవు నీవు. రాబోయే జన్మలో 
నీవు “కేసరి” అనే వానర శ్రేష్ఠుడుగా జన్మించి,  
హనుమంతుడనే ఒక మహాపురుషుని జనకుడవయ్యే కారణ జన్ముడివి. 
ముందు జన్మలో హనుమదంశతో నేనే నీకు కుమారుడినౌతాను
"కేసరి పుత్ర హనుమ" అని తండ్రివగు నీ పేరుతో చిరకీర్తిమంతుడ నౌతాను” 
అని అనుగ్రహించెను. 
శ్రీ మహాదేవుని వరసారాంశము సత్యమై, 
కశ్యపుడు మఱుజన్మలో కేసరి అయి, 
శ్రీమద్ రామాయణము నకు మూలస్తంభమైన 
శ్రీ ఆంజనేయ స్వామికి కశ్యపుడు తండ్రియై చరితార్ధుడైనాడు. 
ఈ గాధ రాధాంతర కల్పములోనిది.

భరత వర్షమును ఆహ్లాదపరిచిన యుగకర్త శ్రీకృష్ణుడు. 
కశ్యపుడు, ఆయన సతి అదితి  దేవకీ వసుదేవులుగా పునర్జన్మలు పొందిరి. 
సాక్షాత్తూ  శ్రీ మహావిష్ణుమూర్తియే 
ఈ ఆలుమగల పుణ్యాల పంటగా ఉద్భవించిన పునీత బృహత్ గాధయే 
చిరస్మరణీయమైన మహేతిహాసము శ్రీమన్ మహాభాగవతము. 
'ఇందుశేఖరుడు' ఆ ద్వాపర యుగములో దూర్వాసమునిగా జనియించినాడు 
అంతే కాదు. ఆదిదంపతులైన పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహ సంపదకు వారసుడేమో 
మన కశ్యప ప్రజాపతి ! 
తనభక్తిఫలముల మధుర రుచిని సంపూర్ణముగా ఆస్వాదించిన భాగ్యశాలి. 
పరమేశుడు కశ్యపునికి, ఆతని పత్ని ఐన సురభియందు – 
ఏకాదశ రూపములతో, పదకొండుమంది కుమారులుగా ఉదయించెను.

కశ్యప ఋషీంద్రుని వివేచన :-  

కశ్యపుని తనయుడు గరుత్మంతుడు. 
గరుడుడు పక్షులలో బలాఢ్యుడు, విహంగాధిపతి. 
ఒక గుహలో నాగజాతీయుడైన వాసుకి తో గరుడుడు భీకరముగా పోరాడసాగాడు. 
అనేక దినాలుగా ఎడతెఱపి లేకుండా ఆ యుద్ధము జఱిగినది. 
ఇది తెలిసి, కశ్యప మునీంద్రుడు ఆఘమేఘాలమీద అక్కడికి చేరాడు. 
హోరాహోరీగా సాగుతూన్న ఆ భీకర యుద్ధాన్ని ఆపాడు. 
రణోత్సుకత వలన, యుద్ధోన్మాదము వలన శాంతికి భంగం కలుగుతుందనీ
లోకములన్నీ అతులాకుతలమౌతాయని” ఇఱువుఱికీ నచ్చజెప్పాడు. 
ఆత్మజుడైన గరుడుని రమణక ద్వీపము (నేటి ఫిజీ ద్వీపము) నకు పంపించాడు. 
విహగాధిపతికి విరోధి ఐన వాసుకీ సర్పరాజును 
కుమార క్షేత్రములో భద్రముగా నివసించుము!” అని ఏర్పాటు చేశాడు కశ్యపుడు. 
ఈ క్షేత్రము సహ్యాద్రి శ్రేణిలో ఉన్నది.
శాంతికాముకుడు కశ్యప ముని :- 
ఈ రీతిగా భయంకర యుద్ధాల నివారణకై పాటు పడుతూ, 
ఆయా ( పక్షి, జంతు,కీటకాది) ప్రాణులు
నిరపాయకరముగా  వివిధ జాతులూ జీవనమును కొనసాగించగలిగే ప్రదేశాలను 
ఎంపిక చేయుటలో కశ్యపుని దూరదృష్టి, ప్రజ్ఞ ద్యోతకమౌతూన్నవి. 
జీవకోటిలోని వైవిధ్యతలను పరిరక్షిస్తూ, వాటి పురోభివృద్ధికీ తోడ్పడిన మునివరుడు  కశ్యపుడు. 
ప్రకృతిలో సమతౌల్యతను కాపాడేటందులకై ఆతడు ఎన్నో కఠిన పరీక్షలను ఎదుర్కొని, 
కఠోర శ్రమదమాదులకు ఓర్చి, అన్ని వర్గాలవారినీ ప్రేమ ఆప్యాయతలతో సమాదరించి, 
తద్వారా ఎల్లరు తన వాక్కులను‘వేదవాక్కులు' గా 
అపేక్షతో శిరసావహించేలాగున చేయగలిగిన మేధావి కశ్యపుడు. 
దక్ష, కర్దమ రాజేంద్రులు సైతమూ కశ్యపునికి తమతనూజలను ఇచ్చి వివాహము చేసి, 
ఆతనిని తమ అల్లుడుగా చేసుకున్నారు అంటే 
'కశ్యపుడు కేవలం మౌనముద్రాంకితుడైన తాపసియే కాదు, 
ప్రజానీకము యావత్తూ, ఆబాలగోపాలమూ ఇష్టపడే నాయకుడు కూడా!’ 
అని బోధపడుతూన్నది కదా!

కశ్యప సంహిత :-

ఆయుర్వేద వైద్య గ్రంధాలలో మొట్టమొదటిది "కశ్యప సంహిత".  
ఇది సంఘానికి అందించబడిన అమూల్య వరము. 
ఈ ఆయుర్వేద వైద్య విధాన వివరణల ఉద్గ్రంధమును రచించిన మహాపురుషుడు - 
పేరును బట్టే అర్ధమౌతూన్నది కదా - తొలి మహర్షి కశ్యపుడు. 
ఈ అమూల్యమైన పొత్తము "వృద్ధ జీవకీయ తంత్రము" అనే పేరుతోకూడా పిలువబడుతూ ఉన్నది. 
బ్రహ్మ నుండి దక్షప్రజాపతికీ, 
అటు తర్వాత వరుసగా అశ్వినీ కుమారులకు, ఇంద్రునికి, 
కశ్యపునికీ, వశిష్ఠునికీ, అత్రికీ, భృగు మహర్షులకు 
ఈ "కశ్యప సంహితా విజ్ఞానము అందినది. 
అలా అంచెలంచెల మీద ప్రజల ఆరోగ్యవర్ధని ఐన 
అగణిత ఆయుర్వేద రహస్యములను అందించి, 
లోకానికి వరప్రదాయిని ఐనది. 
కశ్యపుని కుమారుడు, ఆతని అనుయాయులు 
ఈ మేధాసంపత్తిని తరువాతి తరాలవారికి అందజేశారు. 
మధ్య యుగాలలో వృద్ధ జీవకీయ తంత్రము 
చైనా భాష (Chinese language) లోనికి అనువదించబడినది
ప్లేటో రచన "The Republic" (జేగంటలు) లోని శైలివలెనే 
'కశ్యప సంహిత' - ప్రశ్నోత్తరముల రూపములో ఉన్నది. 
ప్రజలు, సభికులు తమసందేహాలను ఆయనను అడిగేవారు. 
పృచ్ఛకుల సందేహాలకు కశ్యపముని సమాధానాలు చెప్పేవాడు. 
ఉభయ సంవాదములను శిష్య వర్గీయులు, భక్తులు వ్రాసి 
నమోదు చేసిన సంఘటన సమాజ వస్త్రానికి వేసిన మెఱిసే జరీ అంచు అనే చెప్పాలి.
హిందూ ధర్మము మహోన్నత ఆధ్యాత్మిక, సాంఘిక విజ్ఞాన సంపదలతో వైభవోపేతముగా విరాజిల్లినది.
ఈ ప్రాభవమునకు ఎందఱో మహానుభావులు హేతుభూతులైనారు. 
అవ్వారిలో “కశ్యప యోగి పుంగవుడు” ఒకరు. 
సప్త మహామునులలో ఒకడైన కశ్యప మౌని తిలకము 
ఆర్ష ధర్మము తప్పటడుగులు వేస్తూన్న దశలో 
వెన్నుదన్నుగా నిలిచి, హైందవ ప్రాభవమును అంబుధులను దాటి, 
ఆవలి దిక్కులకు పరివ్యాప్తి జేసిన తొట్ట తొలి వైతాళికుడు కశ్యప ప్రజాపతి. 
ఆ ఋషిపుంగవునకు నమోవాకములు.              

ఓమ్ శుభమ్ భూయాత్!!!!

**************************;


 కశ్శన్న అచ్చతెనుగులో విరిసిన మాట. 
ఎవరివైనా వివరములు - స్పష్టత లేకుండా ఉంటే –
ఆతనిగూర్చి పరిచయాలు చేసేటందుకు ఇలాటి సంబోధన ఉపకరిస్తుంది. 
సంస్కృత "కశ్యప" శబ్దము ; 
తేట తెనుగులో కశ్యపన్న -> కశ్యన్న ->  కశ్శన్న – గా పరిణమించిన 
తీయని జాతీయ రూపాంతరము.   


**************************;
కశ్యప - మొదటి చారిత్రక గోత్రము (LINK)
(Read this essay in WEB magazine "pushkarinee.com"
;
Sth Karnataka , Sri Kukke Subrahmanya Ksetra

;

వ్యాస రచయిత్రి:
శ్రీమతి కుసుమ (కాదంబరి)

;

10, ఫిబ్రవరి 2013, ఆదివారం

చైనా మీసం ఇంతేరా బాబూ!

ఫ్యూ మంచు - అనే పదార్ధమేమిటి? 
అద్దానికి "మంచు"/ "శీతల హిమము" అని మాత్రం అర్ధము లేదండోయ్! 
డాక్టర్ ఫ్యూ మంచు - అనేది కాల్పనిక పాత్ర. 
ఈయనగారు - ఒక ఫిక్షన్ కారక్టర్ - అన్న మాట.
ఇంగ్లీష్ నవలా రచయిత "శాక్స్ రోహ్మర్"  వరస క్రమములో సిరాను వెదజల్లి 
(అంటే 'రాసాడు' - అని లెండి!) వెలువరించిన సిరీస్ లలో 
మన 'డాక్టర్ ఫ్యూ మంచు'గారిది ఒక పోర్షన్. 

***************;
;
20 వ శతాబ్దము తొలి భాగములో- ప్రచురితమైన ఆతని గ్రంధ సముదాయాల series లలో  - ఈ డాక్టర్ ఫ్యూ మంచు (fictional character - Dr.Fu Manchu) 
అంగ్రేజీ novelist ఐన  Sax Rohmer 'కలము ' ఏ ముహూర్తాన "డాక్టర్ ఫ్యూ మంచు" ను క్రియేట్ చేసిందో గానీ,  అబ్బో! ఆ పాత్ర ప్రభావముఅంతా ఇంతా కాదు! 
డాక్టర్ ఫ్యూ మంచు తన సృష్టి కర్తకు ఎంతో కీర్తిని ఇచ్చినాడు. టెలివిజన్, సినిమాలలో, రేడియో, కామిక్ స్ట్రిప్స్ లలోనూ,కామిక్ బుక్స్ లలోనూ
(cinema, television, radio, comic strips and comic books) 
అన్ని చోట్లా ఈయనగారి ముఖారవిందమే!  

ఒకటీ, రెండేళ్ళు కాదు, ఏకంగా ఈ హడావుడి 90 సంవత్సరముల దాకా కొన సాగుతూనే ఉంది. అందాకా ఎందుకు? నేటికీ ఈ హవా అక్కడక్కడా ప్రత్యక్షమౌతూనే ఉంది. 
ఇంతకీ ఈ డాక్టర్ ఫ్యూ మంచులోని గొప్పదనం ఏమిటబ్బా?!!!!!!! 
మొత్తం రహస్యం అంతా డాక్టర్ ఫ్యూ మంచు గారి 
మీస కట్టులోనూ, విచిత్రవేషధారణలోనూ ఉన్నది.
డాక్టర్ ఫ్యూ మంచు గారు ఎలా ఉంటారుష?

****************;
ఈ fictional character ' ఫ్యూ మంచు' వి చీనా మీసాలు!                        
షత్రంజ్, ఇత్యాది అనేక హిందీ మూవీలు; 
అలాగే తెలుగు వెండి తెరపైన సైతం - 
మన హీరోలు మారువేషాలు వేసి, విలన్ ని ఓడించే వారు. 
అలాంటప్పుడు- మారువేషాలకోసమని 
ఈ 'ఫ్యూ మంచు కొత్త వేషాన్ని' బాగా ఉపయోగించుకునే వాళ్ళన్న మాట!
అంతేనా?     
విలన్ లు చాలా మందికి ఈ  ఫ్యూ మంచు వేషం ఆపాదించబడేది.
హిందీ నటుడు, మదన్ పురి కొన్ని సినిమాలలో 
చీనా మీసకట్టుతో- (saazish - 1975) విలనీ తనంతో 
"శభాష్" అనిపించుకున్నాడు.
 "ముగాంబో ఖుష్ హువా!"     

పాత తరం ప్రేక్షకులను అలరించిన అనేక గూఢచారి సినీమాలలో దర్శక, నిర్మాతలను 
ఈ విలన్ (= ప్రతినాయకుడు) వేషమే ఆదుకుని, లాభాల పంట పండించింది. 

****************;

"జాజిరి 
జాజిరి జక్కుల మావా! చిన్ చున్ చిన్!|
  కాకర చెట్టు మేకలు మేసె: చిన్ చున్ చిన్!... "
;
                  
"బంగారు గాజులు" అనే చిత్రం లో- 
కథా నాయిక భారతి - డాన్సు  చేస్తుంది. 
కథానాయకుడు అక్కినేని నాగేశ్వర రావు హీరో
(నాగభూషణం విలన్  రహస్య స్థావరములో)   
చైనా భాషలో కాబోలు, కొన్ని పదాలను ఉచ్ఛరిస్తూ, 
చార్లీ చాప్లిన్ నడక cum నాట్యాలతో 
audiens ని  అలరిస్తాడు. 

********************;

 డాక్టర్ ఫ్యూ మంచు moustache ని 
అనుసరించే models,  fancy dress కాస్ట్యూమ్ మోడల్సు (models)   
తమ చుబుకమునూ, చెంపలనూ నున్నగా షేవ్ చేసుకుంటారు.     

మీసాన్ని ప్రత్యేక శ్రద్ధతో పెంచుతారు. మీసాన్ని - stait & కాస్త సన్నగా ఉంచి, 
చివర్లలో దాన్ని పై పెదవి కొస నుండీ కిందికి జారేటట్లు పెంచుతారు. 
ఇంచుమించు 2 సెంటీ మీటర్లు - కింది పెదవి కంటే 
ఇంకా కిందకి- వేళ్ళాడుతూ భలే తమాషాగా ఉంటుంది. 
చూడగానే  ఆమైననే ఆబాలగోపాలమూ ఇట్టే కనిపెట్టేస్తారు, 

"యా! ఇది చైనా చున్ చున్ మీసము" ; 
అది "చైనా మౌత్ స్టెచ్" అని.
నవ్వించే విదూషకులకు కూడా ఈ వేషం బాగా అతికించినట్లూ సరిపోయింది.                   

ఐతే అందరికీ నచ్చినప్పటికీ దీనిలో ఒక చిన్న క్లిష్టత ఉంది: 
అదేటంటే ఈ మీసాల్ని మెలేసుకో లేరు! 
అదన్న మాట సంగతి!
ఐనప్పటీకీ - నాటీ నుండి - నేటి దాకా - ఈ నాటికి కూడా - 
ఎందరో - నాటక రచయితలకూ, డైరెక్టర్ లకూ, ఫ్యాన్సీ డ్రెస్సు పోటీలకూ - 
English నావలిస్ట్ Sax Rohmer సృజనాత్మకత, 
villian యొక్క ఆహార్యము స్ఫూర్తిగా నిలిచింది.
సిల్వర్ స్క్రీన్ పైన సాక్షాత్కరిస్తూన్నది  ఫ్యూ మంచు Dress, వేషమూ! 
ప్రధానంగా ఆ నంగనాచి చీనా మీసమున్నూ! 
ఔర! ఔరా! . హ్హి హ్హి హ్హీ .......... !!!!!!!!!!! 

"ఓస్! ఇంతేనా!" అంటూ పెదవి విరవకండి!       
ప్రపంచ వ్యాప్తంగా ఆహ్లాకరంగా, టముకు వేస్తూ మరీ -  
ఈ ఫ్యూ మంచు జారుడు మీసాల గురించి- 
చాలా చాలా పోటీలు జరుగుతూనే ఉంటూన్నవి !!!!!!!!!!!   

2011 లో జరిగిన WBMC మీసాల పోటీ లో :- 
జర్మనీ  నుండి వచ్చిన "లుట్జ్ గీస్" ప్రధమ స్థానంలో, 
యు.కె. నుండి టెడ్ మాన్ కి ద్వితీయ బహుమతి, 
అలాస్కా మనిషి "బాబ్ జెంగ్లర్"  తృతీయ ప్రైజునీ గెలుచుకున్నారు.   

First: Lutz Giese, Germany
Second: Ted Sedman, UK
Third: Bob Gengler, Alaska  

****************;

బ్రిటీష్ సీరియల్ "The Mystery of Dr. Fu Manchu (1923)" 
ప్రేక్షకులకు తెగ నచ్చి, పాప్యులర్ ఐనది. 
అప్పటి నుంచి  Fu Manchu moustache కాస్తా 
చైనా విలన్ లకు బండ గుర్తుగా మారిపోయింది. 
ప్రపంచ గడ్డములు, మీసములు పోటీలలో 
World Beard and Moustache Championships  
ఫ్యూ మంచు మీసకట్టుకు స్థానం ఖచ్చితంగా ఉండసాగింది.     
బుర్ర మీసాలకు లాగా మెలి పెట్టేందుకు, 
మీసాలు దువ్వడానికీ అనువుగా లేకున్నప్పటికీ, 
ఈ  'విలనీ మౌస్టేచ్ 'రంగవేదికా ప్రదర్శనలలోనూ, 
తదుపరి చిన్న తెరల పైన, 
పెద్ద తెరపైన అనగా - సినీ బొమ్మగానూ 
అమితాకర్షణీయతను గడించిన గడుసు మీసమే 
ఈ ఫ్యూ మంచు మీసకట్టు సారీ!. "మీస జారు" 

         (కుసుమ - రచన)
;;
saazish 1975
****************;

ఫ్యూ మంచు chinese మీసకట్టు

బద్‍కమ్మాహ్, బద్‍కమ్మాహ్ - 
హిందీ సినిమాల్లో బతుకమ్మ పాటలు:-
బుధవారం 14 నవంబర్ 2012  :
రాజ్ కుమార్, వహీదా ప్రభృతులు నటించిన మూవీ, 
షత్రంజ్ (Shatranj) 1969 లలో విడుదల ఐనది. 
ఎస్.వాసన్ దర్శకత్వంలో 
1969 లో వచ్చిన హిందీ చలనచిత్రం “షత్రంజ్”
(రాజేంద్ర కుమార్, వహీదా రెహెమాన్) 

Tags:- 
 Sax Rohmer; Fu Manchu ; 
"The Mystery of Dr. Fu Manchu (1923)" 
Madan Puri (Link: Memsaabstory )

Madan Puri — sporting Fu Manchu moustaches, squinty eyes

7, ఫిబ్రవరి 2013, గురువారం

చెన్నపట్టణం, మద్రాస్ అనే పేర్లు ఎలా కలిగినవి?


అర్ధ చంద్రాకారములో ఉన్నది  ఆ కొండ .
చంద్ర వంక ఆకారములో ఉన్నది కాబట్టి “చంద్రగిరి ” అన్నారు.
ఆ గిరి పాదమున కట్టిన కోట అవడముతో –
దానికి “చంద్రగిరి కోట”అనిన్నీ, ఆ ఊరికి “చంద్రగిరి”అనిన్నీ పేర్లు కలిగినవి.
శ్రీ కృష్ణ దేవ రాయలు “తిరుపతి మహా పుణ్యక్షేత్రము” ను దర్శించుకోవడానికై వచ్చినప్పుడు,
మార్గ మధ్యాన ఈ చంద్రగిరి దుర్గములో బస చేసేవాడు.
చంద్రగిరి పట్టణమును పాలించిన చక్రవర్తి “పెద వేంకట రాయలు”.
ఈతను విజయ నగర సామ్రాజ్య సామ్రాట్టులలో ఆఖరి ప్రభువు.
ఈతని సామంతుడైన రాజు దామెర్ల చెన్నప్ప నాయకుడు సిఫార్సు చేయగా-
సామ్రాట్ పెద వేంకట రాయలు అంగ్రేజీ వర్తకులకు – కోటను కట్టుకోవడానికి అనుమతిని ఇచ్చారు.
1639 లో ఆగస్ట్ 22 వ తేదీనాడు ఈ సంఘటన సంభవించినది.
ఫ్రాన్సిస్ డే – అనే ఆంగ్లేయుడు – “బ్రిటీష్ ఇండియా కంపెనీ తరఫున
ఇలాటి పర్మిషన్ ని సంపాదించగలిగాడు. 

***********************;

నాయక రాజులు తెలుగు సీమకు గుర్తింపు తెచ్చిన సామంత పరిపాలకులు.
దామెర్ల వెంకటాద్రి నాయకుడు తెలుగు వ్యక్తి:
ఈతని తండ్రి “దామెర్ల చెన్నప్ప నాయకుడు” శ్రీ కాళహస్తి కీ, వందవాసికీ ఏలిక.
దామెర్ల చెన్నప్ప నాయకుడు ఆరవీటి వంశీయులకు సామంత రాజు.
ఆరవీడు చక్రవర్తి ఐన “శ్రీ రంగ దేవ రాయలు” కు విధేయునిగా
శ్రీ కాళహస్తి నీ, వందవాసినీ ప్రాంతాలను పాలించాడు దామెర్ల చెన్నప్ప నాయకుడు.
ఈ తెలుగు ప్రభువు ఏలుబడిలో ఉన్నట్టి ప్రాంతములలో ఉన్న నగరమునకు
ఆతడి పేరుమీదనే “చెన్నపట్టణము” అని వచ్చినది.
చెన్నపట్టణమునకు హ్రస్వ రూపమే “చెన్నై”.

***********************;
చెన్నపట్టణము – మద్రాస్ సిటీ కి దక్షిణ దిక్కున ఉన్నది.
చెన్నపట్టణమునూ, ఈ జార్జ్ కోట ప్రాంతాన్నీ కలిపి

ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రభావముతో
“మద్రాసు”అని  పేరు ఇవ్వబడినది.
కానీ ప్రజలకు “చెన్నపట్టణం” అనే నామధేయం చాలా ప్రీతికరమైనది.
అందుచేతనే మరల “చెన్నై” అనే పేరుతో పునః బారసాల జరిగినది.
చెన్నపట్టణమునకు చిట్టి పిలుపు “చెన్నై”.
తమిళ నాడు ప్రభుత్వము సాంప్రదాయనామమును స్వీకరించి,
1996 సంవత్సరములో    
మద్రాసుకు మళ్ళీ “చెన్నై” అనే పేరును నిశ్చయించినది.
ప్రజలు సంతోషముతో స్వాగతము పలికారు.
ఆమోదముద్రను పొంది ఐనది ఈనాడు అది చెన్నై.

***********************;

“మద్రాస్” కి మూల పదము:-
పాశ్చాత్యుల రాకతో మన హిందూదేశములోని
అనేక cities కి – కొత్త పేర్లు వచ్చినవి.
వాటిలో అధిక నిష్పత్తిలో  పోర్చుగీసు names మూలములుగా కలిగినవి.
“మాడ్రె డి డ్యూస్ (Maare de Dues) నుండి
“మద్రాస్” అని నిర్ధారించారు  కుంఫిణీ వాళ్ళు.
1639 లలో Fort St. George ని ఇంగ్లీషు వాళ్ళు కట్టారు.
ఆంగ్లేయులు సైంట్ జార్జ్ కోటను కట్టినారు.
అప్పటికే చెన్న పట్టణము అనే చిన్న నగరము ఉన్నది.
దామెర్ల చెన్నప్ప నాయకుని నామధేయాన్ని ఈ నగరము పొందినది.
కాలక్రమేణా జార్జి కోటకు చుట్టుపక్కలా విస్తరిస్తూ,
మద్రాసు మహా నగరము – గా రూపుదిద్దుకున్నది.
***********************;
చెన్న కేశవ పెరుమాళ్ కోవెల అక్కడి పుణ్య క్షేత్రము.
కనుక ఆ స్వామి పేరుతో పేరెన్నిక గన్నది “చెన్నై” అని కొందరి అభిప్రాయం.
***********************;
1) చంద్రగిరి: 2) మద్రాస్: 3) చెన్నై:
ఆయా పేర్లు వరుసగా ఇల్లాగ
ఆయా ఊళ్ళకు ఒనగూడినవన్న మాట!
***********************;
వ్యాస రచన: కాదంబరి:   
***********************;
;
                          ‘Town Temple'

;
 ఆధార పదములు:
( Telugu rule Damarla Chennappa Nayakudu :
  Chennapattanam (British Madras):- -> Chennai );

‘Town Temple' ; "The Arani zamindari's palace;
 Arani House.(Essay in "jaabilli" : below this LINK): 

చెన్నపట్టణం, మద్రాస్ అనే పేర్లు ఎలా కలిగినవో తెలుసునా? 
January 30, 2013 By: జాబిల్లి Category: వ్యాసాలు;


‘Town Temple': photo link:  (The Hindu)2, ఫిబ్రవరి 2013, శనివారం

కన్నడములోనే అర్చనలు అక్కడ!రుక్మాంగద రాయలు "సక్రేత పట్టణము"నకు ప్రధాన పాలకుడు. 
శఖ్యత, మైత్రీ బంధాలకు మారుపేరుగా ( Sakrepatna ) 
అతని ఏలుబడిలో రూపుదిద్దుకున్నది.
అతనికి ఇద్దరు తనూజలు. వారికి రెండు పట్టణాలను 
పరిణయ వేళల కానుకగా ఇచ్చాడు. 
అవే చిక్కమగళూరు, హీరేమగళూరు.
రుక్మాంగదుడు "అయ్యన్ కెరె జలాశయాన్ని" కట్టించినాడు. 
ప్రజలకు నేటికీ అధిక ఉపయోగము ఔతూన్నది.

*******************;

 ఇందిరా గాంధి ఈ చిక్ మగలూర్ నుండి పోటీ చేసారు. 
1978 లో ఎన్నికలలో నిలబడ్డా
ఆమె - ఇండియ, పార్లమెంటు , లోక్ సభ స్థానాన్ని గెలిచారు. 
అందుచేత వార్తలలో పతాకశీర్షికలను తుమ్కూరు దగ్గరలో ఉన్న 
ఈ ఊరు అలంకరించినది.

*******************;

“ చిక్ మగలూర్/  చిక్కమగళ్ ఊరు”/ Chikmagalur City
 (“చిక్క మగల్ ఊరు” = ) కు అర్ధము 
“చిన కుమార్తె ఊరు” అని.  
ఆ పట్టణమునకు 5 కి.మీ. దూరములో వేరొక భాగాన్ని పెద్ద  కూతురుకు ఇచ్చారు. 
దాని పేరు “హీరేమగలూర్”.
 'Chikmagalur (ಚಿಕ್ಕಮಗಳೂರು) కర్ణాటకలో చారిత్రక సంపదను కలిగిన గొప్ప డిస్ట్రిక్టు. 
ఈ జిల్లాలోనే “అమృత పుర” వద్ద -హొయసల కోవెలల సముదాయాలు  
కలగడానికి కారణము ఉంది.
పెద్ద కుమార్తెకు భరణముగా ఒసగబడిన “హీరేమగలూర్" సంస్కృతీ విలక్షణప్రదమై, 
చారిత్రక పరిశోధకుల శోధనలకు అనువైన (ఒకప్పుడు) అగ్రహారము-  అని పేర్కొనవచ్చును.

*******************;

కన్నడ భాషలోనే అర్చనలు అక్కడ మంత్రాలు పూజలూ:-

ఈ Hiremagalur ఊళ్ళో కోదండరామాలయము కలదు.
సీతా దేవి ఈ గుడిలో శ్రీరామచంద్రులకు కుడిపక్కన ఉన్నది.

సీతారామలక్ష్మణులు సమాన్యముగా నిలిచే స్థానములకు ఈ పద్ధతి కొంత విరుద్ధము. 
సాధారణముగా "భార్య తన భర్తకు ఎడమ వైపు - నిలబడుతుంది. 
పూజా పునస్కారాది సమయాలలో - ఆచరణలో ఉన్న 
హిందూ సాంప్రదాయములకు విభిన్నతను చేకూర్చినది 
ఈ కోవెలలో ప్రతిష్ఠితమైన జానకీ, లక్ష్మణ సమేత శ్రీ రామ చంద్రుడు.
అంతే కాదు!
ఆలయములలో దేవభాష ఐన సంస్కృతములో మంత్రోచ్ఛారణలు జరుగుతూంటాయి. 
కానీ “హీరేమగలూర్ లో గీర్వాణభాషలో అర్చనలు కాకుండా, 
స్వచ్ఛమైన కన్నడ భాషలో నుడువులు కొనసాగుతూ అర్చనలు జరుగుతూంటాయి.
ఇదీ ఈ ఊరి ప్రత్యేకత.

*******************;
;

Sri Kodanda Rama kOwela


;
;photo link (Karnataka state) 

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...