14, డిసెంబర్ 2008, ఆదివారం

లోకోక్తి , ఔచిత్యము

లోకోక్తి :::::::
''''''''''


గురుషు మిలితేషు శిరసా :
ప్రణమసి లఘుషూన్నతా సమేషు సమా :
ఉచిత జ్ఞాసి తులే! కిం :
తులయసి గుజ్జూ ఫలైః కనకం :

"""""""""""""""""""""""""""""""""'''
) త్రాసా! గురువులు వచ్చినప్పుడు శిరస్సు వంచుతావు.
లఘువులు వచ్చినప్పుడు ఉన్నతంగా ఉంటావు.
సమానస్తుల్త్ గురువులు వచ్చినపుడు సమముగా ఉంటావు.
"ఈ తీరుగా ఉచితము(=ఔచిత్యము)ను తెలిసిన దానివి", ఐనా కూడా బంగారమును గురువిందలతో తూచుతూ ఉన్నావు,ఏలనో?

'''''''''''''''''''''''''''''''''''''''''''''''

తక్కువ వాళ్ళు/లఘువులు
పెద్దలు/బరువైనవి/గురువులు


'''''''''''''''''''''''''''''''''''''''''''''''

సూక్తి మణి

సూక్తి మణి
"""""""

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;
"ఉత్తమః క్లేశ విక్షోభం క్షమః సోఢుం న హీతరః ;
మణిరేవ మహా శాణ ఘర్షణం న తు మృత్కణః ."

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

ప్రతి పదార్ధం :::::
''''''''''
కష్టాల వల్ల కలిగే క్షోభకి ఉత్తముడు మాత్రమే తట్టుకోగలడు . సాన మీద ఒరపును మాణిక్యమే సహించ గలదు,గాని మట్టి బెడ్డ సహించ గలదా?

''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''
::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

ఆత్మ బలము

ప్రయత్నము
''''''''


"ఉద్యోగినం పురుష సింహ ముపైతి లక్ష్మీః ;
దైవేన దేయమితి కా పురుషా వదంతి ;
దైవం నిహత్య కురు పౌరుష మాత్మ శక్త్యా ;
యత్నే కృతే యది న సిధ్యతి కో ~ త్ర దోషః ."

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;
సదా ప్రయత్నము,(ఉద్యోగము చేయుట) చేసే వాని వద్దకు ,లక్ష్మి , సిరి వచ్చి చేరును.
తెలివి తక్కువ వాళ్ళు "దైవమే అంతా ఇస్తుంది" అని పలుకుతారు.
దైవమును ఉపేక్షించి ,నీ ఆత్మ బలముతో పురుష యత్నమును కొన సాగించు. "ప్రయత్నము చేసినప్పటికీ ,ఫల సిద్ధి లభించకున్నచో, నీ తప్పు ఏమీ ఉండదు.

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

aame,r , (ksm)

13, డిసెంబర్ 2008, శనివారం

bhaarathamu: lOkOktulu :::::

భారత ఆధారిత లోకోక్తులు :
'''''''''''''''''''

1)పార్ధ సారథి/విజయ సారథి.(మార్గ దర్శి)భారత ఆధారిత లోకోక్తులు 2)యక్ష ప్రశ్నలు.
3)ఏక లవ్యుడు.(=గురువు అవసరము లేకుండా స్వయం కృషితో విద్యలను నేర్చు కొనే మనిషి.)
4)ధర్మ క్షేత్రం ,ఇది కురు క్షేత్రం.
5)భీమ బలుడు.
7)కర్ణుడు లేని భారతం.(అసంభవము)
8)శల్య సారధ్యం.(నాశనానికి దారి తీసే నేతృత్వం/నాయకత్వం/సలహా దారు)
9)అదిగో ద్వారక!ఆల మందలవిగో!
10)వచ్చిన వాడు ఫల్గుణుడు.
11)భీష్మ ప్రతిజ్ఞ,భీకర ప్రతిజ్ఞ.
12) కుంతీ సంతానం.(=తండ్రి ఎవరో తెలీని వాడు.).
13)"ఇంటి నిండా గుడ్డలే,కాలికీ ,చేతికీ తగుల్తూ,ద్రౌపదీ వస్త్రాలు.
14) ఆ ఇల్లు మయ సభయే! /ఇంద్ర భవనం!"

''''''''''''''''''''''''''''''''''''''''''''''
1)మహా భారతంలో "ఆది పర్వతము" అన్నట్లు.(ఆది పర్వము,సభా పర్వము మున్నగునవి).
2)పంచ పాండవులు ఎందరు?" అంటే, నా కామాత్రం తెలీదా? మంచం కోళ్ళలాగా ముగ్గురు, అని ,రెండు వ్రేళ్ళు చూపించి,ఒక్క గీతను పలక పైన రాసాడు.
3))బ్రతికిన బ్రతుకుకు భగవద్గీతా పారాయణమొకటి.

'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''

(ksm ): mg

12, డిసెంబర్ 2008, శుక్రవారం

పౌరాణికముల గాధావళి ఆధారముగా లోకోక్తులు

పౌరాణికముల గాధావళి ఆధారముగా లోకోక్తులు :::
'''''''''''''''''''''''''''''''''''''

1)ఆలి పంచాయితీ రామాయణం,పాలి పంచాయతీ భారతం.
2)హనుమంతుని ముందు కుప్పి గంతులా?
3)శ్రీ సీతా రాముల పెళ్ళంట!
చూచీ వత్తము ,రా రండి!
4)సీతమ్మ వారి జడ కుప్పెలు.(=ఒక మొక్క పేరు)
5)ఆకాశ రామన్న ఉత్తరములు .(=అజ్ఞాత వ్యక్తి పుకార్లు పుట్టించే మాదిరిగా రహస్యముగా రాసే లేఖలు)
6) హనుమంతుడు సంజీవనీ పర్వతాన్ని పెకలించుకు వచ్చినట్లు.
7)ఊరావలి హనుమాండ్లు./ఊరు అవతలి/ఊరవతలి /.
8)నసీబు నారాయణ.
''''''''''''''''''''''''''''''''''
1)పలుకే బంగారమాయెనా!
2)సీతమ్మ మా తల్లి, శ్రీ రాముల మాకు తండ్రి.
3)శ్రీ రామ నవమి చలువ పందిళ్ళు.
4) శ్రీ రామ నవమి పానకం.
(మిరియాలు,బెల్లము వేసి చేసే పానకము ,వడ పప్పు ప్రసాదములు)
5)అంకె లేని కోతి లంకంతా చెరచిందంట.
6)రెంటికీ చెడ్డ(చెడిన)రమన్న.
7)హరిశ్చంద్రుడి నోట అబద్ధం రాదు, నీ నోట నిజంరాదు.
8)లంకా దహనం./లంకను కాల్చిన వాడు రాముని లెంక(=బంటు/ నమ్మిన బంటు).

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;
::::::::::::::::::::::::::::::::::::::::::

రెట్ట మత శాస్త్రము , వ్యవసాయము, ప్రకృతి గురించి ప్రాచీనులు

రెట్ట మత శాస్త్రము :::::
''''''''''''''''''''
వ్యవసాయము, ప్రకృతి గురించి ప్రాచీనులు
అనేక విషయములను పద్య రూపములో అమర్చి,
తమకు భవిష్యత్ తరాల వారికి అందించిన అద్భుత విజ్ఞాన కృషి సంపద ఇది.
''''''''''''''''''''''''''''''''''''''''''''''
"పరగ నశోకంబు ,బ్రహ్మ మేడియు పూచి :
కాచిన సస్యసం - ఘము ఫలించు :
కపురంపు టనటులు - కాచ నల్లవిసె పై :
రాదిగా కృష్ణ ధా-న్యములు ప్రబలు :
బాగు మీఱగ చింత- పాలయు కరి వేము :
కాచిన వ్రీహి వ-ర్గంబు మించు :
వింతగా తుమికి చె-ట్టంతయు కాచిన :
యవ నాళ సమృద్ధి - యగును మిగుల :


నెలమి ములు మోదుగలు కాయ నలరు గొఱ్ఱ :
మొల్ల పూచిన ఆవాలు మొల్ల మగును :
రావి గాచిన జనుమును, ప్రత్తి వొడము :
సత్యమింతయు వేంకట క్ష్మా తలేంద్ర."

'''''''''''''''''''''''''''''''''''''''''''''''
నేదునూరి గంగాధరం మొదలగు ఆర్ష సాహితీ జిజ్ఞాసువులు
ఈ ప్రాచీన సంపత్తిని, పాఠకులకు అందించుటకై ఎంతో కృషి చేసారు.

''''''''''''''''''''''''''''''''''''''''''''''''

november+,17+muggu


11, డిసెంబర్ 2008, గురువారం

"రామ లాలీ!మేఘ శ్యామ లాలీ!"

లోకోక్తులు :
'''''''''''
(ఇతిహాసములు-సామెతలు) :::
'''''''''''''''''''''

"రామ లాలీ!
మేఘ శ్యామ లాలీ!"

1)" శ్రీ రామ" చుట్టి ,కావ్య రచనకు ఉపక్రమించుట.
2)శ్రీ రామ రక్ష, సర్వ జగద్రక్ష.
3)ఒకటే మాట, ఒకటే బాణము, ఒకే పత్ని.
4)రామ బంటు/రాం బంటు (= నమ్మకమైన సేవకుడు).
5)రామ రాజ్యము .(సుభిక్షముగా విలసిల్లుతూన్న దేశము).

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;1)రామాయణమంతా విని,రాముడికి సీత ఏమౌతుందన్నట్లు.
2)ఏదో ఉడతా భక్తి"గా కొంచెం సేవ,సాయం."
3)భరతుడి పట్నం,రాముని రాజ్యము.
4)లక్ష్మణ దేవర నవ్వు.(అకారణముగా నవ్వితే,అపార్ధాలకు దారి తీసే
నవ్వు).
5)ఊర్మిళ నిద్ర.
6)"వాడి వాక్కు రామ బాణమే! తిరుగు లేదు."
7)సుగ్రీవాజ్ఞ.(=తిరుగు లేని ఆన,శిరసావహించాల్సినదే! )
8)కుంభ కర్ణుని నిద్ర.(=మొద్దు నిద్దుర)
9)ఆ జంట సాక్షాత్తూ సీతా రాములే! వారిది అన్యోన్య దాంపత్యం.
10)తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి.
::::::::::::::::::::::::::::::::::

జాతీయములు :
,,,,,,,,,,,,,

1)రామ ములగ పండు;;; సీతా ఫలము ;;; రామ చిలుక ;;;
2)"రామ చక్కని బంగారు బొమ్మ ."
3)"శ్రీ రాములు నీవే కలవు."
(అనగా ,సాక్షి సంతకము వలె/ఒట్టు పెట్టు కొని" నిజమే చెబుతాను ."అనుట)
4)"రామ లక్ష్మణులు వీరు, భ్రాతృ ప్రేమకు ప్రతి బింబములు."
5)రాముడు లేని అయోధ్య/రాజ్యము.(=ఆలనా పాలనా లేక ,పరిపాలనా దక్షుడు లేక ,అవినీతి పేట్రేగి పోయిన దేశము/ఇల్లు ఇత్యాదులు.)
6)రాముడున్న చోటే అయోధ్య.(=జనాకర్షణ ఉన్న వ్యక్తి,ఎక్కడికి వెళ్ళినా జనం రాక పోకలతో సందడి ,హడావుడి సాక్షాత్కరించుట.)
7) జనకుని రాజ్యం .(పైన 6 వ సామెత లాంటిదే!)
8)భరతుని పట్నం.(కొత్త మంత్రి గద్దె నెక్కే దాకా ,నామ మాత్రపు అధికారాలతో ఏర్పడిన పదవి వంటిది )
9)రామాయణంలో పిడకల వేట.
10)భూదేవంత ఓర్పు.
11) "ఆమె సీతా మహా లక్ష్మి. ఓర్పు, నిదానం ఎక్కువే!"
12)లంకేశ్వరుడు.(నియంతలా వర్తించే వాడు.)
13)"bOya (vaalmiiki )munigaa maarinaTlu.

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;
లంకా దహనం.(అంతా ఖరాబు. అన్ని పనులనీ చెడగొట్టుట.)
2) హనుమంతుని తోక లాగా.(= పైన సామెతయే!)
3)హనుమంతుని వాలము/ తోక.
4)కోతిమూక./"ఇక ఇంట్లో కూడా కిష్కింధ కాండ మొదలైంది ,ఈ గోల భరించ లేను.")
5)"మంధర వచ్చింది,తగవులను పెట్టే రకం./కైకేయి.../.

6)"చుప్ప నాతి శూర్పణఖ,ఓర్వ లేదు."

////////////////////////////////////

लोकल फ : तू टी ple

సామెతలు, నానుడులు

సామెతలు, నానుడులు :::
''''''''''''''''

1)సూర్యుడి ముందు దివిటీ /కాగడాను వెలిగించినట్లు .
2)వెన్నెలచే మిణుగురులు వెలిసినట్లు.
3)కందెన వేయని బండికి కావలసినంత సంగీతము.
4)క్షేత్రమెరిగి విత్తనం, పాత్రమెరిగి దానము (చేయాలి).
5)అపాత్ర దానము కూడదు.
6)గంగి గోవు పాలు గరిటెడైనను చాలు.
7)కందకు లేని దురద కత్తి పీటకు ఎందుకు?
8)కట్టిన ఇంటికి వంకలు చెప్పే వాళ్ళు వెయ్యి మంది.
9)ఏ పాటు తప్పినా సాపాటు (=తిండి ) తప్పదు.
10)ఉన్నదే మనిషికి పుష్ఠి, తిన్నదే పశువుకు పుష్ఠి.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

శ్రీ మద్భాగవతం

శ్రీ మద్భాగవతం :(10 - 35)
''''''''''''''''


దర్శనీయ తిలకో వన మాలా :
దివ్య గంధ తులసీ మధు మత్తైః :
అలికుల రలఘు గీత మభీష్ట :
మాద్రియన్ యర్హి సంధిత వేణుః :

సేఅసి సారస హంస విహంగాః :
చారు గీత హృత చేతస ఏత్య :
హరి ముపాసత తే యత చిత్తా :
హంతా! మీలిత దృశో ధృత మౌనాః."

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

తాత్పర్యము:::::
"""""""""""""""'

దర్శనీయ తిలకుడు,
వనమాలల దివ్య గంధము గల తులసి మొక్కల లో మధు పానముచే మత్తిల్లిన (అలి కుల =)తుమ్మెదల గుంపుల వలన పొడమిన
(అభీష్ట అలఘు గీతం)తనకు ప్రియమైన మధుర గీతమును ఆదరముతో ఆస్వాదిస్తూ,
తన పెదవిపైన ఎప్పుడైతే మురళిని శ్రీ కృష్ణుడు సంధిస్తూన్నాడో ,అప్పుడు ..........

సరసులోని సారస(=బెగ్గురు)పక్షులు,హంసలు మున్నగు విహంగములు ,
మనో హరమైన వేణు గానముచేత దోచ బడిన చిత్తములు గలవై,
ఆ పక్షులు మూసిన కన్నులతో , మౌనమును వహించి ,
శ్రీ విష్ణువును సేవిస్తూన్నవి ,(హంత=) ఔరా!

7, డిసెంబర్ 2008, ఆదివారం

ఆ ఇంతులు ఎదురేగిరి

ఆ ఇంతులు ఎదురేగిరి :::::
'''''''''''''''

"అదె భాను డపరాద్రి చేరె , నదె సాయంకాల మేతెంచె , అ ;
ల్లదె గో పాద పరాగ మొప్పెసగె ,బృందారణ్య మార్గంబునన్:
దిదె వీతెంచె వృషేంద్ర ఘోషము ,ప్రియుడేతెంచె ,రండంచు తా :
మెదు రేతెంతురు మాపు కృష్ణునికి నయ్యింతుల్ పరిభ్రాంతలై ."

(పోతనార్యుని "భాగవతము")
:::::::::::::::::::::::::::::::::::::::::::::::

woman

సత్యాన్వేషణ - తత్వ సారమును గ్రహించుట

సత్యాన్వేషణ - తత్వ సారమును గ్రహించుట ::::::
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;
"తటస్థితే బోధయంతి గురవః స్మృతా ఊధా :
ప్రజ్ఞాయైవ తరేత్ ఈశ్వరానుగ్రహేతయా ."
:::::::::::::::::::::::::::::::::::

తాత్పర్యము ::::::
'''''''''
"ఎందరో గురువులు, పెద్దలు జీవితాన్ని గురించి, సంసార సాగరాన్ని దాటించ గల తరుణోపాయాన్ని గురించి వారు 'తమ తమ అనుభవముల దృష్ట్యా బోధించారు.
స్మృతులు కూడా అంతే!
కానీ, విజ్ఞులు తమ తమ బుద్ధులను అనుసరించి, పరమేశ్వరుని అనుగ్రహముతో గ్రహించి తరిస్తారు."

::::::::::::::::::::::::::::::::::

సత్యాన్వేషణ - తత్వ సారమును గ్రహించుట

సత్యాన్వేషణ - తత్వ సారమును గ్రహించుట ::::::

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

"తటస్థితే బోధయంతి గురవః స్మృతా ఊధా :
ప్రజ్ఞాయైవ తరేత్ ఈశ్వరానుగ్రహేతయా ."

:::::::::::::::::::::::::::::::::::

తాత్పర్యము ::::::
'''''''''
"ఎందరో గురువులు, పెద్దలు
జీవితాన్ని గురించి, సంసార సాగరాన్ని దాటించ గల తరుణోపాయాన్ని గురించి
వారు 'తమ తమ అనుభవముల దృష్ట్యా బోధించారు.
స్మృతులు కూడా అంతే!
కానీ, విజ్ఞులు తమ తమ బుద్ధులను అనుసరించి,
పరమేశ్వరుని అనుగ్రహముతో గ్రహించి తరిస్తారు."

::::::::::::::::::::::::::::::::::

6, డిసెంబర్ 2008, శనివారం

కావ్యము గొప్ప దనము

నరస భూపాలీయము ( రామ రాజ భూషణుడు) :::::
::::::::::::::::::::::::::::


"పరమ జ్ఞాన లతాలవాలము, జగత్ప్రఖ్యాత విఖ్యాత సా:
గర చంద్రోదయ ,మిష్ట సంఘటన రేఖా దివ్య ధేనూత్త మం :
బురు కారుణ్య దశా నిశా దిన ముఖం, బుద్వేల నిర్వాణ భ :
వ్య రసాస్వాద రసాయనం బవని కావ్యంబెన్న సామాన్యమే! "

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

కావ్యము గొప్ప దనము :::::
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

modern+girl

కళ్యాణ ఘడియలు

తేనె తెలుగు ::::::
''''''''''''''''

1)కళ్యాణ వేదిక; కళ్యాణ తిలకము ;కళ్యాణ ఘడియలు :
2)తలంబ్రాలు ;అక్షింతలు :
3)ఆశీర్వచనములు:ఆశీస్సులు ;
దీవెనలు;దీవించుట :ఆశీస్సులను అందజేయుట:
4)బాసికము ; బాసికములు ; బాసిగము;
5) నాగ వల్లి ; నాగవల్లి ;పోలు కట్టుట
6)అరివేణి కుండలు ;ఐరేణి కుండలు
7)గౌరీ పూజ : మంగళ గౌరి
8)మంగళాను శాసనము
9)హారతి పళ్ళెము = ఆడ పడుచు లాంఛనములు :కట్న కానుకలు : చదివింపులు
10)బూజం బంతి ;బువ్వం బంతి;బంతు లాడు వధూ వరులు ; ఇరువురూ చెండులు ఆడుట; చెండ్లాడుట
11) పెళ్ళి పందిరి; పెళ్ళి విందు; వివాహ భోజనము ;పప్పన్నము ;
12)పెళ్ళి వారిల్లు; విడిదిల్లు;విడిది చేయుట;
13)" పెళ్ళి పెద్దలు; పెళ్ళికి పెద్దలు ;
14)పెళ్ళి శుభ లేఖలు ;"ఈ పెళ్ళికి తామెల్లరూ/ యావన్మందీ/ సకుటుంబ సపరివార సమేతముగా విచ్చేసి , వధూ వరులను ఆశీర్వదించమని విన్నవించుచున్నాము."

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;1)తెర సెల్లా; పట్టు వస్త్ర్ములు ,పట్టు ధోవతులు;
2)పావు కోళ్ళు ;పాం కోళ్ళు
కాశీ యాత్ర
3)అరుంధతీ నక్షత్రమును చూచుట;"అరుంధతీ నక్షత్రాన్ని కొత్త జంటకు పురో హితుడు చూపించెను."
4)పురోహితుడు ;;; బ్రాహ్మణుడు ;
5) పెళ్ళి మంత్రాలు ; వేద మంత్రములు పఠించుట ;

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

श्री कृष्ण

5, డిసెంబర్ 2008, శుక్రవారం

తేనెల పలుకులు

తేనెల పలుకులు :::::
;;;;;;;;;;;;;
1)తాంబూలములు పుచ్చు కొనుట; పెళ్ళి నిశ్చయము చేసుకుని వచ్చిన తండ్రి;
పెళ్ళి తాంబూలాలు; నిశ్చయ తాంబూలాలు;
2) లగ్న పత్రికను వ్రాయించుట;
3)ముహూర్తమును పెట్టుట;
4)సదస్యము;;; బుగ్గన చుక్క/ దిష్టి చుక్క ;
5)సన్నికల్లు ను త్రొక్కుట;
6)"పెళ్ళి రోజును ఆ దంపతులు గ్రాండ్ గా ,పండగవలె జరుపుకున్నారు ."

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

1) పెళ్ళి ,పరిణయము,వివాహము,మనువు,
2)పెళ్ళి చేసుకొనుట ; పెళ్ళి చేయుట :::
వివాహమాడుట ,వివాహము చేసికొనుట;

mahila

నగ నట్రా

తేట పలుకులు :::::
;;;;;;;;;;;
1)పారితోషికము , బహుమతి ,కానుక,కానికలు
2)ప్రెసెంటేషన్,ప్రెసెంటేషన్స్,గిఫ్టు
3)పరిధానము ; లంచము ,అమ్యమ్యా,,, ఇత్యాదులు
4)నజరానా
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
5)సంపద ,జవహరీ,సొమ్ములు,సొత్తు;
నగలు;నగ నట్రా,నగలు నాణ్యాలు ;భూషణములు ,ఆభరణములు ,సొమ్ములు,షోకులు
6)జాగీరు , జమీన్ (పొలము,భూమి);
జమీందారు,జమీందార్లు ;జమీన్ రైతు
7)ఆస్థి , ఆస్థి;ఆస్థులు అంతస్థులు ;ఆస్థిపరులు
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;
సామెతలు ;;;;;
,,,,,,,,,,,
1)సొమ్మొకడిది,షోకొకడిది.
2)అత్త సొమ్ము ,అల్లుడి దనం.
3)తాత జాగీరు;
"ఇదేమైనా మీ ముత్తాత జాగీరనుకుంటున్నావా?,తెగ పెత్తనం చలాయిస్తున్నావు!"

అందుబాటులోనే భగవానుడు

అందుబాటులోనే భగవానుడు
;;;;;;;;;;;;;;;;;;;;;

"కణ్ఠి నుణ్ శిరుత్తాంబినాల్ ;
కట్టుణ్ణవ్పణ్ఠియ పెరుమాయన్ ;
నణ్దిత్తెన్ కురుగూర్ నంబి ఎన్నప్పనిల్ ఎనక్కాల్ ;
అణ్దిక్కుం అముదూరుం ఎన్నవుక్కే. "

:::::::::::::::::::::::::::::::::::::::::::::

యశోద ,కన్నయ్యను
చిన్న ముడులు ఉన్న త్రాడులతో బంధించినది
భక్త సులభుడు కదా ఆ స్వామి!
భక్తులకు అందుబాటులో ఉండే "సౌలభ్య గుణము " భగవంతునిది.

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

4, డిసెంబర్ 2008, గురువారం

హారతిని అద్దుకొనుట

కన్ను దోయి ;;;;;
;;;;;;;;
1)కను దోయి,కన్ను గవ ;నయన ద్వయము ,
2)అ))"శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవము కన్నుల పంటగా ఉన్నది ."
ఆఆ)) కన్నులకు హారతి అద్దు కొనుట/కళ్ళకు హారతిని అద్దుకొనుట
3)"కను చూపు మేరలో ,దుర్భిణీ (=భూతద్దము) వేసి చూసినా,
నీవు చెప్పిన భవనం కన బడ లేదు."
4)కన్ను పొడుచుకున్నా(ఎదుట ఉన్న వస్తువు) కాన రాని అంతటి చీకటి .
5)"నా కంటి దీపమా! నాకొక ముద్దివ్వు!"
6)కంటి కాటుక ; కళ్ళ జోడు ,కళ్ళద్దాలు
7) కంటి డాక్టరు ,/స్పెషలిస్టు
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

8)అర మోడ్పు కన్నులు; అర్థ నిమీలిత నేత్రములు ;

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

9)వీక్షించుట,తిలకించుట,
విలోకించుట,అవలోకించుట :సింహావలోకనము చేయుట =సమీక్షించుట ;
10)"గుడ్ల గూబలాగా ఎలాగ గుడ్లు మిటకరించి చూస్తున్నాడో ,చూడు!"

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

జాతీయములు :::::
:::::::::::

"అక్ష్యండ న్యాయము ///భేషజ న్యాయము = "కంటికి పెట్ట వలసిన కాటుకను (/మందును) తుంటికి పెట్టినట్లు ; అనగా సజావుగా/ సక్రమముగా/ సవ్యముగా చేయవలసిన పనిని అవక తవకగా చేసి,చెడ గొట్టుట :
2)చూచి రమ్మంటే కాల్చి వచ్చేడు.(హనుమంతుడు చేసిన లంకా దహనము ;
3)అంధకారము = కాటుక ; చీకటి ; ఇంద్ర నీలము; మేష రాశి ;
4)"ముక్క్కు మీద కోపం,మూడో కాను తెరుస్తాడు."
5)ముక్కంటి+శివుడు;త్రినేత్రుడు;ఎగుడు దిగుడు కన్నుల వాడు; ఫాల నేత్రుడు;
లలాట నేత్రము కల వాడు ;

నా కంటి దీపమా

కన్ను దోయి ;;;;;
;;;;;;;;
1)కను దోయి,కన్ను గవ ;నయన ద్వయము ,
2)"శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవము కన్నుల పంటగా ఉన్నది ."
3)"కను చూపు మేరలో ,దుర్భిణీ (=భూతద్దము) వేసి చూసినా,
నీవు చెప్పిన భవనం కన బడ లేదు."
4)కన్ను పొడుచుకున్నా(ఎదుట ఉన్న వస్తువు) కాన రాని అంతటి చీకటి .
5)"నా కంటి దీపమా! నాకొక ముద్దివ్వు!"
6)కంటి కాటుక ; కళ్ళ జోడు ,కళ్ళద్దాలు
7) కంటి డాక్టరు ,/స్పెషలిస్టు
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;
8)అర మోడ్పు కన్నులు; అర్థ నిమీలిత నేత్రములు ;
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;
9)వీక్షించుట,తిలకించుట,
విలోకించుట,అవలోకించుట :
సింహావలోకనము చేయుట =సమీక్షించుట ;
10)"గుడ్ల గూబలాగా ఎలాగ గుడ్లు మిటకరించి చూస్తున్నాడో ,చూడు!"


;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

parrot,+

మానస సరోవరము

మానస సరోవరము
;;;;;;;;;;;;;
"కైలాస పర్వతే రామ మనసా నిర్మితం సరః ;
బ్రహ్మణా నరశార్దూల! తేనేదం "మానస సరోవరః."
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

"ఓ రామా! కైలాస పర్వతం మీద ఈ సరస్సును
బ్రహ్మ తన మనస్సంకల్పముతో నిర్మించాడు.
అందు చేతనే దీనికి " మానస సరోవరము"
అనే నామ ధేయము కలిగినది.

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

కైలాస శిఖరము

కైలాస శిఖరము ;;;;;
;;;;;;;;;;;;;;;;

"కేలయోః జల భూమ్యోః ఆసనం స్థితిః ;
యస్య్స సః కేలాసః తస్యాయం కైలాసః .;"

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;
కం = జలము,నీరు
ఇల =భూమి, పుడమి
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
నీళ్ళు , వసుధ : ఈ రెండిటికీ ఆసనంగాను ,ఆధారంగానూ ఉన్నది;
కనుక ఇది "కైలాసము".

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

देसिग्न्स (को.भ.)

देसिग्न्स (को.भ.)

kOvela+daari

మేఘ బృందము

"ఆకాశంబున మేఘ బృందము ఘనంబై,సన్నమై ,దీర్ఘమై :
ఏకంబై, బహు రూపమై అణగునట్లే, దేవు గర్భంబులో :
లోక శ్రేణి జనించుచున్ మెలగుచున్ లోపించు, నా దేవు సు :
శ్రీ కాంతున్ హరి గూర్చి యాగములు సేసెన్ నాహుషుండిమ్ములన్ ."

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

(బమ్మెర పోతన రాసినట్టి "భాగవతము"లోని పద్యము ఇది. )

భావము :::::
,,,,,,,
నహుషుని తనూజుడైన "యయాతి " మహారాజు ,
శ్రీ మన్నారాయణునిపైని భక్తితో అనేక యజ్ఞములను చేసెను.
మబ్బులు అనేకానేక రూపములలో గోచరించు చుండును; సన్నముగాను ,దట్టముగాను,పలుచగాను, దీర్ఘముగాను ఏకంబుగాను,
బహు రూపముగాను భాసిల్లుచుండును;కాస్సేపు కనబడును,
కొంత సేపు మాయమగును .
ఆలాగుననే , "శ్రీ మన్నారాయణుడు" అనే "నేపథ్యము"లో నుండి
ఎన్నో లోక శ్రేణి ఉద్భవిస్తూన్నవి;
అలాంటి శ్రీ కాంతుని గురించి నాహుషుడు యాగములను చేయు చుండెను.

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

mahila+mahila

నవ రత్నములు

నవ రత్నములు :::
,,,,,,,,,,,,,

"ధన్వంతరి ,క్షపణ ,కామర, సింహ శంకు:
భేతాళ భట్టు, ఘట కర్వర ,కాళి దాసాః :
ఖ్యాతో వరాహ మిహిరో, నృపతేః :
సభాయాం రత్నాని వై వర రుచిర్నవ "విక్రమస్య".
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;
విక్రమార్కుడి ఆస్థానములో తొమ్మిది కవులు కలరు;
వారికి "నవ రత్నములు " అని పేరు.
.....................................................

3, డిసెంబర్ 2008, బుధవారం

గోరోచనా తిలకము

గోరోచనా తిలకము ::::::
,,,,,,,,,,,,,,,,,,

"నాసాగ్రాత్ కేశపర్యంతం,
"ఊర్ధ్వ పుండ్ర ముదాహృతం ;
అధో భల్లాకృతియుతం ,
కృష్ణ ధార్యమతి స్ఫుటం ."

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

నాసికాగ్రం నుంచి మూర్ధజముల వరకుదిద్దిన "తిలక రేఖ"ను,
ఊర్ధ్వ పుండ్రమును శ్యామ సుందరుడైన
శ్రీ కృష్ణుడు ధరించెను.
శిరోజాల పాపిటి వరకు
కుంకుమ కేసర మిశ్రితమైన ఎర్రని " గోరోచనా తిలకమును "
నీల మోహనుడు ధరించెను.

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

VIBHINNA

ఊత పదములు

పలుకులు ;;;;;
;;;;;;;

ఊత పదములు :::
'''''''''''''


1)"చిత్తం!మహారాజా! మీ ఇష్టానుసారం అలాగే చేస్తాను ."అని మంత్రి పలికెను.
2)"హసాదు! హసాదు! " విధేయులు,
అధికారుల ఆనతిని వినయముతో
అంగీకరించుట.
3)"సాధు! సాధు !లెస్స పలికితివి."అని, భటునితో నంది
వాక్రుచ్చెను.
4)"భళి! భళీ! "అని మెచ్చుకొనెను.::: " భలే! బహ్లే!"
భలే బాగున్నది.::: భలే మంచి చౌక బేరము! :::
పిల్ల వాడు, వట్ఠి తుంటరి,చిలిపి!"
5)చంగురే! ::: "చంగు భళారే! "
6)వారెవ్వా! /వహ్వారే! /"వహ్వా! వహ్వా!"
7)"బాపురే!"
8)మజ్ఝారే!
9)"జయ!జయ!","జయహో!"
10)భంగారే!
11)"అవ్వ! ఇలాంటి విడ్డూరము నెక్కడైనా ఎరుగుదుమా?"
12)హవ్వారే! :::
13)హైలెస్సా! హైలెస్సా! " అంటూ,సరంగులు ,
"తెడ్డు"ను వేస్తూ,పడవను హుషారుగా నడుపుతున్నారు.
14) "హల్లో!బాగున్నారా!"అని పలకరించారు.
15)"హల్లో! శుభోదయం!"
16)"హల్లో!" ఫోను లిఫ్టు చేసి,మాట్లాడడం మొదలు పెట్టినది.
17)"జోహారు! శిఖి పింఛ మౌళీ!"
18)"జో ,జో! జో జో!"అంటూ ,తల్లి జోల పాట పాడ సాగింది.
19) "థాంక్యూ!" ;;; "థాంక్స్ !"
20)"వందనములు!"/"అభి వందనం!":::"అభివాదములు!"/నమస్కారములు"/"నమస్తే!"/
21)"జయీ భవ! దిగ్విజయీ భవ!"
22)"జయహో!"
23) "మంగిడీలు! మంగిడీలు!"/
"దండాలు,దొరా!"
24)"హల్లెలూయా! "
25)"టా టా! వీడుకోలు!"
26)"శుభోదయం!"
"గుడ్ మార్నింగ్!" ;;;
"గుడ్ ఆఫ్టర్ నూన్!"
"గుడీవినింగ్!"
27)"మాయురే!"
28)"అమ్మయ్యో!" ;;; "అమ్మ నాయినో.".
29)"హమ్మయ్య! ఇప్పటికి పనులు పూర్తి అయినయి!"
30)"శుభం!";;; సినిమా అయిపోయాక,"శుభం కార్డును వేస్తారు."
31)ఆశీస్సులు, దీవెనలు.

'''''''''''''''''''''''''''''''''''

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

paper+pieces

కృష్ణ మురళీ నాద సుధ ;;;

కృష్ణ మురళీ నాదమాధుర్యము
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;
"నవ మాధుర్యము గల్గు కృష్ణు మురళీ నాదామృత స్యందముల్ :
చెవులం జొచ్చి హృదంతరాళముల భాసిల్లన్ స వత్సంబులై :
ఉవిదా! మేపులకు దొఱంగి మృగ గో యూధంబు లుత్కంఠతో ;
దివికిం కంఠము లెత్త్ లో వదలు బో దేహేంద్రియ వ్యాప్తులన్ ।"
''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''

सोपानमुलु, (को भ)


మయ సభ

సభ ;;;;;;;;;;
'''''''''''''''
సభ= పరిషత్తు , ఇల్లు ,చావిడి,
జూదము , సమాజము ,కొలువు కూటము :
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
1)సభ , ; పేరోలగము ; రాజు కొలువు కూటము; సంస్థానము :
(చట్ట సభ; సభలు,సమావేశములు,'సంస్థా గత చర్చలు ' ; )
2)సభా గౌరవము ,"సభా మర్యాద ను కాపాడుట";
3) సభికులు ,సభా సదులు,
4)సభ్యత::: సభ్యత,సంస్కారములు, సభ్య ప్రపంచము ,
5) సంఘములో సభ్యులు ;
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
6)చట్ట సభ , లోక్ సభ ,రాజ్య సభ
8)"మయ సభ"ను మయ బ్రహ్మ పాండవులకు నిర్మించి ఇచ్చెను.

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

nava+Sukra14

మాఘుడు , కవిరత్నములు

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
మాఘుడు , కవిరత్నములు :::::
,,,,,,,,,,,,,,,,,,

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
"ఉపమా కాళి దాసస్య,
భారవే రర్ధ గౌరవం ;
దణ్డినః పద లాలిత్యం ,
మాఘే సంతి త్రయో గుణాః ."

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

కాళి దాసు కావ్యములలోని ఉపమా సౌందర్యం ,
భారవి కృతుల 'అర్థ గాంభీర్యము ',
దండి రచనలందలి పద లాలిత్యము '''''
ఈ మూడు లక్షణ , గుణములు ,,,,,
మాఘ మహా కవి యొక్క కావ్యములలో ఉన్నవి.

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

reflections

నది పేర్లు

నది పేర్లు ::::::::

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

"తరఙ్గిణీ, శైవాలినీ ,తటినీ ,హ్రాదినీ ధునీ :
స్రోతస్వినీ , ద్వీపవతీ ,స్రవంతీ ,నిమ్నగాపదా :
(కూలంకషా ,నిర్ఝరిణీ, రోధో వక్రా, సరస్వతీ )

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

ప్రాచీన నిఘంటువులలో ,
సంస్కృత భాషలోని "అమర కోశము " నిస్సందేహముగా కలికితురాయి.

ప్రధమ కాండము"లో "నది " , 'నదులు ' గురించి ఇచ్చిన అనేక పదములు ,
అమర సింహుని అద్భుతమైన పరిశీలనా శక్తికి దర్పణములు.

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;నదీ తీరము :::::::::::::
;;;;;;;;;

భాద్ర పద బహుళ చతుర్దశి నాడు ,
"నదిలో నీరు ఎంత వరకు ఆక్రమిస్తుందో",
అంత వరకు ఉన్న మట్టమును
" నదీ గర్భము " అని నిర్ధారణ చేస్తారు.
నదీ గర్భమునుండి 150 బారలు
(అనగా" 2 గజముల చొప్పున , 300 గజములు ) దూరము వరకు
"తీరము" అని నిశ్చయిస్తారు.

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

line

నదీ తీరము

నది పేర్లు ::::::::

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
"తరఙ్గిణీ, శైవాలినీ ,తటినీ ,హ్రాదినీ ధునీ :
స్రోతస్వినీ , ద్వీపవతీ ,స్రవంతీ ,నిమ్నగాపదా :
(కూలంకషా ,నిర్ఝరిణీ, రోధో వక్రా, సరస్వతీ )

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

ప్రాచీన నిఘంటువులలో ,సంస్కృత భాషలోని "అమర కోశము " నిస్సందేహముగా కలికితురాయి.
ప్రధమ కాండము"లో "నది " , 'నదులు ' గురించి ఇచ్చిన అనేక పదములు ,అమర సింహుని అద్భుతమైన పరిశీలనా శక్తికి దర్పణములు.
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

నదీ తీరము :::::::::::::
;;;;;;;;;

భాద్ర పద బహుళ చతుర్దశి నాడు ,"నదిలో నీరు ఎంత వరకు ఆక్రమిస్తుందో",అంత వరకు ఉన్న మట్టమును " నదీ గర్భము " అని
నిర్ధారణ చేస్తారు.
నదీ గర్భమునుండి 150 బారలు (అనగా" 2 గజముల చొప్పున , 300 గజములు ) దూరము వరకు "తీరము"
అని నిశ్చయిస్తారు.

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

reflections

తగువు తీరినది !::::::::::

తగువు తీరినది !::::::::::
,,,,,,,,,,,

"భ్రమరక మనోహరం బగుట "పద్మమ"గును :
తారకా హృద్యమగుట "సుధా నిధి " అగును :
రెంటి జగడాలు " మోమున అంటి యుంట :
"అబ్జ ముఖి " అంట లెస్స ఈ అలరు బోడి ."
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

చంద్రుడు, తామర పూవు సహజ వైరులు.
ఇరువురినీ సంతసము కలిగించుటకై
సుభద్రా దేవిని " అబ్జ ముఖి " అని పిలుచుట మేలైన పద్ధతి.
సుభద్రను 'అబ్జ ముఖి 'అనాలని పద్మమూ , ముఖి ' అని పిలవాలని చందురుడూ వాదు లాడు కుంటున్నారు.
కవి "అబ్జ ముఖి "అనే పేరిడి, వారి తగువును తీర్చాడు.
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;
అబ్జము=నీటిలోన జనించినది= పద్మము,జాబిలి :
జగడాలు= వైరములు,పోరు :
జగ=శ్రేష్ఠమైన ,,, డాలు= కాంతి :
భ్రమరకము =ముంగురులు / తుమ్మెదలు :::
తారకా= నక్షత్రాలు/ కంటిలోని నల్ల పాపలు (కనీనికలు )

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

2, డిసెంబర్ 2008, మంగళవారం

ribbon

గంధపు చెట్టు

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;


"కులములోన నొకడు గుణవంతుడుండిన ;
కులము వెలయు వాని గుణము చేత ;
వెలయు వనములోన మలయజమున్నట్లు ;
విశ్వదాభి రామ వినుర, వేమ ! "

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

మలయజము =గంధపు చెట్టు

విశ్వదాభిరామ వినుర వేమ!

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

పూజ కన్న నెంచ బుద్ధి ప్రధానంబు ;
మాట కన్న నెంచ మనసు దృఢము ;
కులము కన్న మిగుల గుణము ప్రధానంబు ;
విశ్వదాభిరామ వినుర వేమ! "

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

ఉర్విలోని జనులు

ఉర్విలోని జనులు :::::
,,,,,,,,,,,,,,

అనగ ననగ రాగ మతిశయిల్లుచు నుండు ;
తినగ తినగ వేము తీయ నుండు ;
సాధనమున పనులు సమకూరు ధరలోన ;
విశ్వదాభి రామ వినుర!వేమ! "

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;
వేము= వేప (చెట్టు ,వేపాకు మున్నగునవి)

రాగము,సాధనము

రాగము,సాధనము ;;;;;
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

"తప్పులెన్ను వారు తండోప తండంబు:
లుర్వి జనుల కెల్ల నుండు తప్పు;
తప్పు లెన్ను వారు తమ తప్పు లెరుగరు;
విశ్వదాభిరామ! వినుర వేమ!"

'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''

spray

డబ్బు,ధనము,మనీ ,లెస్స దాచుకొనగ

Dabbu,dhanamu,manii :::
,,,,,,,,,,,,,,,,,,
"dhanamu kUDa beTTi daanaMbu chEyaka:
taanu tinaka,lessa daachukonaga :
tEneTIga gUrchi teruvaru kiyyadaa!:
visvadaabhi raama vinura!vEma!
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;డబ్బు,ధనము,మనీ :::
,,,,,,,,,,,,,,,,,,
"ధనము కూడ బెట్టి దానంబు చేయక:
తాను తినక, లెస్స దాచుకొనగ :
తేనెటీగ గూర్చి తెరువరి కియ్యదా!:
విశ్వదాభి రామ వినుర!వేమ!

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;
''''''''''''''''''''''''''''''''''''

1, డిసెంబర్ 2008, సోమవారం

తెలుగు పదములు

తెలుగు పదములు :
,,,,,,,,,,,,
1)మాట ,మాటకారి ;
2)రెండు నాలికలు గల వాడు=రెండు రకాల మాటలు;ఆడిన మాట తప్పుట ;
3) సొరకాయ కోతలు; ప్రగల్భములు;ఉత్తరుని ప్రగల్భాలు ;దాంబికపు మాటలు;భేషజములు ;4)మాట పట్టింపు=పంతాలు,పట్టింపులతో తగాదాలు;
5) బ్రహ్మ కాయ= వస పిట్ట =వాగుడు కాయ= లొడ లొడా ,ఆపకుండా మాట్లాడే వ్యక్తి;6)"మాట మిగల వద్దు1 జాగ్రత్త!" "తొందర పడి, తూలనాడకు!"
7)మాటా మంతీ;
8)"మాట,మూట లేకుండా కూర్చుని, విసిగిస్తున్నావేమిటి?"
9)అప్రస్తుత ప్రసంగము=ఇప్పటి సందర్భమునకు సంబంధించని ప్రసంగము
10)కుశలములు అడుగుట/కనుక్కొనుట।
11)ఆజ్ఞాపించుట
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;
1)నోటికి తాళం వేయుట=నోరు మూయించుట.
2)నీళ్ళు నములుతూ చెప్పుట=కాస్త సందేహముతో చెప్పుట;
3)నోతి దురద/తీట =భావముతో నిమిత్తము లేకుండా ,ఏదో ఒక టి మట్లాడుతూ ఉండుట;

వేమన ఏమన్నాడు?

వేమన ఏమన్నాడు?
'''''''''''""""""""""'''''

"చెప్పులోని రాయి,చెవిలోన జోరీగ
కంటిలోని నలుసు,కాలి ముల్లు
ఇంటిలోని పోరు ఇంతింత కాదయా!
విశ్వదాభిరామ వినుర వేమ!"

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

వాక్కు,అర్థము

"వాగర్థావివ సంపృక్తౌ
వాగర్థ ప్రతిపత్తయే
జగతః పితరౌ వందే
పార్వతీ పరమేశ్వరౌ ."

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
వాక్కు,అర్థములకు గల
అవినాభావ సంబంధము వలె విరాజిల్లుచూన్న
"జగత్తునకు తల్లిదండ్రులై"న పార్వతీ పరమేశ్వరుల"కు నమస్కరిస్తున్నాను.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

30, నవంబర్ 2008, ఆదివారం

సుపరిచితమైన వాక్కు ;;;

సుపరిచితమైన వాక్కు ;;;,
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

"శిశుర్వేత్తి ,పశుర్వేత్తి;
వేత్తి గాన రసం ఫణీ ;
స ఏవ శ్శంకరో వేత్తి
సమగ్రం వేత్తి నాపరః

శిశువులను , పశువులను ,సర్పములను కూడా" సంగీతము" పరవశింప జేయును। (అలాంటి సంగీత సారము సర్వమును) పరమేశుడు ఒక్కడే దానిని తెలిసి ఉన్న వాడు।(ఈశునికన్నను ఎక్కువగా , ఇతరులకు ఎరుక ఉండదు।)

"గాజు కుప్పెలోన కదలక దీపంబ;

"గాజు కుప్పెలోన కదలక దీపంబ;

దెట్టులుండు,"జ్ఞాన మట్టులుండు ;

తెలిసినట్టి వారి దేహంబు లందున;

విశ్వదాభి రామ వినుర! వేమ! "

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


వెలుగు :::
,,,,,,,

"స్థిరా శైలీ గుణవతాం ; ఖల బుద్ధ్యా న బాధ్యతే ;
రత్న దీపస్య హి శిఖా వాత్యయాపి న బాధ్యతే ;"
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

మంచి గుణములు గల వారి స్థిరమైన ప్రవర్తన
దుష్ట బుద్ధి కలవారి వలన బాధింప బడదు.
ఎట్లనగా , 'రత్న దీపము 'యొక్క దీప శిఖ '(వెలుగు)
గాలికి(వీచినా కూడా)ఆరి పోదు కదా!"

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

ఐదు "వ" కారములు

ఐదు "వ"కారములు ;;;
,,,,,,,,,,,,,,

"వస్త్రేణ ,వపు షా,వాచా,విద్యయా,వినయేన చ :::
వకారైః పంచభి ర్యుక్తః నరో భవతి పూజితః ."

"""""""""""""""""""""""""""""""""""""""""""""""""

తాత్పర్యము ;;;
,,,,,,,,,,,

దుస్తులు ,స్వరూపము, మాట తీరు, వినయము -
ఐదు "వ" కారములతో కూడిన మానవుడు గౌరవించ బడతాడు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

29, నవంబర్ 2008, శనివారం

సూక్తి ;;;
,,,,,

" ఆశా నామ మనుష్యాణాం కాచి దాశ్చర్య "శృంఖలా" ;;;
యయా బద్ధాః ప్రధావంతి ; ముక్తా స్తిష్ఠంతి పఙ్గువత్ ."

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

మానవులకు ఆశ్చర్య కరమైన సంకెల " ఆశ".
ఆశ అనే సంకెల తో బంధింప బడిన వాళ్ళు విపరీతముగా పరుగులు పెడుతూంటారు.
ఆశా విముక్తులు, దానిని విప్పుకున్న వాళ్ళు
కుంటి వాళ్ళ(పంగుం) వలె ఒకే చోట పడి ఉంటారు.
;(;;; శృంఖల =సంకెల ;;; ధావనము =పరుగు ;;; )
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

సూక్తి

సూక్తి :::::
,,,,,,,,,

" కోహి భారః సమర్ధానాం ;
కిం దూరం వ్యవ సాయినాం ;
కో విదేశః సు విద్యానాం ;
కః పరః ప్రియ వాదినాం ; "

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;
పలుకులు :::
,,,,,,,,,,,

1)కన్ను తెరిచి/కళ్ళు తెరచుట=
జన్మించుట ;
2)"కళ్ళు తెరవరా!నరుడా! "
(= " లోక జ్ఞానమును సంపాదించుము!" అని ఉద్బోధించుట.)
3)"కంటి పాపలాగా కాపాడు కొనుట."
4)కన్ను,మిన్ను కాననంతటి అహంకారము ;
5)"కన్నారా? కను గొన్నారా?"
6)కంటి మీద కునుకైనా లేకుండా పని చేసారు.
7)కంటికి నిద్ర కరువు ఐనది.
8)కంటికి రెప్ప దూరమా?(= అనుబంధములు,ఆప్యాయతలు)
9)"కలలు కనే వేళ ఇది, కన్నయ్యా!"
10)కంటి కాటుక( అలంకారము)

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

11)కంటికీ,మంటికీ ఏక ధారగా
ఏడ్చుట .
12) కన్నీరు; కన్నీళ్ళు ;
ఆనంద బాష్పములు ;ఆనందాశ్రువులు ;
13)కన్ను,కన్ను /కళ్ళు కలిసినవి=ప్రేమ కలుగుట,
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

1)కను దోయి;కన్ను దోయి;కన గవ ;
"నయన ద్వయము ;నయనములు ;
నేత్రములు/నేత్ర ద్వయము ;
లోచనములు ;::
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
విశాల నేత్రి ;పద్మ నయని ;కమల లోచని ;హరిణ లోచని ;;;
"కంటికి చారెడు కళ్ళు ఉన్నాయి."
పద్మ నయనుడు ; కమల లోచనుడు/
కువలయ నయనములు ; కురంగ నేత్రములూ;;
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

సూరదాసు - పోతన

సూరదాసు - పోతన ::::::::
;;;;;;;;;;;;;

"కైధేరీ బస్ బేలి కహు; తుమ దేఖీ హై నంద నందన్ ;
బూఝుహు మాలతి కిధే తై పాయే హై తను చందన్ ;;
కైధే కుంద కదంబ ఆకుల వట చంపక లతాల మాల్ ;;
కైధే కమల కహో కమలా పతి సుందర నయన విసాల్ ;;;

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
" ఓ లతా,వృక్షములారా! మీరెక్కడైనా శ్రీ కృష్ణుని చూచితిరా?
ఓ మాలతీ! చందన చర్చిత గాత్రుని నీ వెచటనైనా జాడలు అరసితివా?
ఓ కమలమా! కమలా కాంతుని నీ వెచట నైనా పొడ గాంచినావా?
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
ఇది"సూర దాసు " రచన!

:::::::::::::::::
ఇట్లే , బమ్మెర పోతనామాత్యుడు విరచించిన పద్య మాధుర్యమును గ్రోల గలము.

"నల్లని వాడు ,పద్మ నయనంబుల వాడు, కృపా రసంబు పై ;
చల్లెడి వాడు, మౌళి పరి సర్పిత పింఛము వాడు , నవ్వు రా ;
జిల్లెడు మోము వాడొకడు చెల్వల మాన ధనంబు దెచ్చెనో ;
మల్లియలార! మీ పొదల మాటున లేడు గదమ్మ ,చెప్పరే! "

'''''''''''''''''''''''''''''""""""""""""""'''''

డబ్బు,దస్కం

డబ్బు,దస్కం ::::::( పలుకులు):::
,,,,,,,,,,
1)బేరం చేయుట ::: "మారు బేరానికి వస్తువును తెచ్చుట :::
2)బయానా ఇచ్చుట ;అడ్వాన్సు ఇచ్చుట ;
సంచకారి -ముందస్తు అడ్వాన్సులో కొంత ఇచ్చుట;సొమ్ము చెల్లించి ;;; గుడ్ విల్ ;
3)రాయల్టీని "పే"చేయుట;;;
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
4)బేరం కుదుర్చుకుని ;గీసి,గీసి బేరం చేసి ;
5)రిబేటు ;కన్సెషన్ ; డిస్కౌంటు ;
6)"భలే మంచి చౌక బేరము...";
కారు చౌక గా అమ్ముట;
" చీప్!"; "చీప్ అండ్ బెస్ట్"
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
7)అంగడి ; షాపు; దుకాణము; కిరాణా కొట్టు;
మార్కెట్టు ;విపణి వీధి ;కిళ్ళీ కొట్టు ;'డబ్బా'కొట్టు;
సూపర్ బజారు; బిగ్ బజార్లు ;
సంత ; (కూర గాయల సంత)
("చేపల మార్కెట్టు లా ఉంది,ఇల్లంతా ఒకే గోల!")
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
8)వ్యాపారం చేసుకుంటూ ; వ్యాపారము,వ్యవహారము;;;
వ్యాపారి ; బేహారి;బేర గాడు;
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
9)కొనుట; కొనుగోలు శక్తి;
10)అమ్ముట;అమ్మకము :
("పండుగ నాళ్ళలో అమ్మకములు భారీగా జరిగాయి.")
11)ఎగుమతి,దిగుమతి :ఎగుమతులు,
దిగుమతులు ;;;ఎక్స్ పోర్టు,ఇంపోర్టు ;;;
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
,,,,,
12)ద్రవ్య వినిమయము ;
13) ద్రవ్యము చలామణి అగుట
(అణ ,బేడ నాణాలు పాత కాలం నాటివి,నేడు అవి చలామణీ అవవు.")
14)వినియోగ దారుడు ; కస్టమరు;
కొనుగోలు దారుడు ;
15) వస్తు మారకం; వస్తు మార్పిడి పద్ధతి ;
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


తూనికలు, కొలతలు :
,,,,,,,,,,,,,,,,,,,,
1)తూనిక రాళ్ళు ;తరాజు; త్రాసు ;తుల ;తులా దండము;
కాంటా; ధర్మ కాటా;
2)మానిక ,కుంచము ;శేరు గిద్ద;
3) కొల బద్ద; మాన దండము;
స్కేలు ;మీటరు బద్ద; టేపు;;;;;
మూర, జాన ;బార;
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
3)గోరంత(గోరు) దీపం ;
"నాకు నీ అండ ఉంటే,కొండంత ధైర్యం(కావల్సినంత/ఎంతో);;;
"వేలెడంత(వ్రేలు;అంగుళి;ఫింగర్)లేడు ,నాకే ఎదురు చెబుతున్నావు,
భలే గడుగ్గాయివే!"

బెత్తెడు(బెత్త)ముగ్గు ;
మూరెడు పూలు;
జానెడు నడుము; బారెడు పొడుగు జడ;;;
పిడికెడు బియ్యము ;గుప్పెడు చక్కెర; దోసెడు తేనె;;;
చిటికెడు పసుపు ,కుంకుమలు ;చెంచాడు నెయ్యి;
స్పూనుడు" టీ" పొడి ; సీసాడు కాఫీ పొడి ;
గరిటెడు పెరుగు ;చిట్టెడు(=చిన్న గిన్నెడు) నేయి ; ;;
మిల్లి గరిటె; చిట్టాముదము ;పుడిసెడు నీళ్ళు;(పుక్కిలి=పుక్కిలించుట);;;
3)తూచుట; కొలుచుట ;
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
"ధన ధాన్యాలతో,భోగ భాగ్యాలతో వీరు తుల తూగు చున్నారు."

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
దూరము :కిలో మీటరు:కూత వేటు దూరము //ఇత్యాదిగ పదములు కలవు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

ద్రవ్యోల్బణము ;
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
"మనీ లెండర్సు ";"అప్పు ఇచ్చు వాడు...";ఋణ దాత ;
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
ఋణ గ్రస్తుడు;అప్పు పుచ్చుకున్న వాడు;మిత్తి; చే బదులు ;"బదులు ";

చంద్ర గుడి

సామెతలు :::
,,,,,,,,,
1)ఇల్లు కట్టి చూడు,పెళ్ళి చేసి చూడు.
2)కనుమకి 'కాకర ',భోగికి పొట్ల.
3)కామ ధేనువు,కల్ప వృక్షము.
13)ఉంటే లిక్కి,పోతే కొడవలి.
4)కార్తీకం కలకాశా,వైశాఖం పులకాశా.
5)"కార్తీక మాసాన కదురంత ఉంటినా,
మాఘ మాసంలో నా మహిమ చూపుతా!"(అన్నది చిక్కుడు తీగ)
6)కార్తీకంతో వర్షం, కర్ణునితో యుద్ధం.
7)కార్తీక మాసంలో కడపటి వానలు.
చంద్ర పరి వేషం వర్ష యోగం.
(చంద్రుని చుట్టూ "గుడి" వేయుట)=
" చంద్ర గుడి " జాబిలికి దగ్గరలో ఈ వలయం ఏర్పడితే,
వర్షం దూరంగానూ ,అంటే ఆలస్యముగా కురుస్తుంది ;
దూరముగా "గుడి" కట్టితే ,దగ్గరగా ,తొందరలో వర్షించును.
8)తూనీగలాడితే తూమెడు వర్షం.
9)చీమలు చెట్లెక్కితే భూములు
సస్య శ్యామలం.(బాగా పండును.)
10)చీమ బలం,దోమ చప్పుడు. (వాడు బక్కగా అగుపిస్తాడు కానీ....//
11)పిల్ల పదిలం, ముల్లె పదిలం.
12)అశోకుని సామ్రాజ్యంలో పశువైతేనేమి? ("మేలే!")
14)"అనూరాధ"లో అడిగినంత పంట.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

శ్రీకృష్ణ దేవరాయల కోర్కె-పెద్దన ప్రబంధము

శ్రీ కృష్ణ దేవరాయల కోర్కె-పెద్దన ప్రబంధము :::
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

"సప్త సంతానములో ప్రశస్తి గాంచి ;
ఖిలము గాకుండునది ధాత్రి" కృతియ"గాన ;
కృతి రచింపుము మాకు "శిరీష కుసుమ ;
పేశల సుధామ యోక్తుల పెద్దనార్య!"
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
"ధరిత్రిపై "సప్త సంతానముల "లో కావ్యము శశ్వతమైనది.
ఖిలము కానిది సారస్వతము,
కావున అట్టి"దిరిసెన పూవు రేకు వలె
సుకుమారమైన సుధామయములైన పదములతో వ్రాయుము,పెద్దనార్య!"
:::::::::::::::::::::::::::::::::::
:::::::::::::::::::::::::::::::::::
:::::::::::::::::::::::::::::::::::

నిఘంటు వివరణ :
,,,,,,,,,,,
సప్త సంతానములు ;;;
,,,,,,,,,,,,,,,,,,

తనయుడు; తటాకము;
కావ్యము; నిధానము; కోవెల;
వనము,తోట;భూదేవ స్థాపనము;
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

సప్త కవులు :::
,,,,,,,,,,,,,,

వివేకి; వాచకుడు; రౌచికుడు; అర్థి;
శిల్పకుడు; భూషణార్థి; మార్దవానుగతుడు;
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

మాటలు , పలుకులు

పలుకులు :::
,,,,,,,,,
ధనదుడు =కుబేరుడు :::
,,,,,,,,,,,,,,,,
కుబేరుడు;నర వాహనుడు ;కిన్నరేశుడు;యక్ష రాజు;మహేశ సఖుడు;గుహ్యకేశ్వరుడు:
(గుహ్యకులు=నిధులను రక్షించే వారు):::
పౌలస్త్యుడు;:::
కుబేరుని తల్లి "ఇళ బిల";
తమ్ముడు"ఇడ బిట్టు".
విశ్రావస్సు తనయుడు,శ్రీదః":శ్రీ/ధనదుడు=భాగ్యములను ఇచ్చు వాడు;
"పుణ్య జనేశ్వరు"లకు ప్రభువు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
::::::::::::::::::::::::::::::::::
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


మాటలు :::(డబ్బు:విభాగము)
,,,,,,,,,,,,,,,,,,,,,,

1)వడ్డికాసుల వాడు; ఆపద మొక్కుల వాడు;శ్రీ శ్రీని వాసుడు :
2)సంపత్తి; ముల్లె;;;
2)డబ్బు మూటలు;డబ్బుల సంచులు ;
3)నిధి; నిధులు ;నిధి ,నిక్షేపములు :::
"లంకె బిందెలు";లంకెల బిందెలు;
4)రత్న రాసులు;మణుల,మాణిక్యములు
5)ధనేశుడు/ధనాధిపుడు/(కుబేరుడు)::: భాగ్యశాలి ,భాగ్య వంతుడు;
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;
1)కోశాగారము (:కోశాధికారి= క్యాషియర్ ;)
2)ఫైనాన్సు(ఫైనాన్షియర్)
3)(తాకట్టు వ్యాపారి)డబ్బును వడ్డీకి త్రిప్పుట:::/వడ్డీలకు తిప్పుట:::/ఇంటెరెష్టు /
4)వస్తువులను తాకట్టు పెట్టుట/కుదువ పెట్టుట
5)అప్పు ఇచ్చుట;మిత్తికి ఇచ్చుట=వడ్డికి ఋణ సదుపాయములను కల్పించుట;
6)వస్తు మారకము/
మారకము సేయుట=ఒక వస్తువును తీసుకుని, బదులుగా ఇంకొక వస్తువును ఇచ్చుట;
7)మదుపు పెట్టుట/పెట్టుబడి పెట్టుట/"బిజినెస్సులో పెట్టుబడులను పెట్టి,"భాగ స్వామి"(=షేర్ హోల్డర్)గా అయ్యెను."
1)ఆదాయము=రాబడి;ఇన్ కం; ఐవేజు; సాలీనా ఆదాయము=సంవత్సరమునకు .../నికర ఆదాయము ;(పంటపై కౌలు/పాలి/గుత్త/
8)పెట్టు బడి::: బిజినెస్సులో పెట్టు బడులు పెట్టుట;/మూల ధనము;
ఆదాయ,వ్యయములు; జమా బందీలు; రాబడి,ఖర్చులు
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
కుండ మార్పిడి పద్ధతి=అన్నా చెల్లెళ్ళకు,వేరొక ఇంటిలోని సోదర సోదరీలతో పెళ్ళి జరుగుట:::

28, నవంబర్ 2008, శుక్రవారం

శ్రీ కృష్ణ సన్నుతి

శ్రీ కృష్ణ సన్నుతి :
,,,,,,,,,,,

" కువలయ రక్షా తత్పర :
కువలయ దళ నీల వర్ణ -కోమల దేహా :
కువలయ నాథ శిరో మణి!:
కువలయ జన వినుత విమల- గుణ సంఘాతా!
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

(కువలయము=కలువ పువ్వు:భూమి: )

భూమిని రక్షించుట యందు ఆసక్తి కల వాడా!
కలువ రేకుల వంటి నీల వర్ణ దేహము కల వాడా!
ధరణీ నాథులలో శిరోమణి వంటి వాడా!
వసుధపైన ఉన్న అనేక జనులచే వినుతించ బడుచున్న వాడా!
స్వచ్ఛమైన గుణ సముదాయము కల వాడా!

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజ లోకమున ఆనందము

రాజ లోకమున ఆనందము :::
,,,,,,,,,,,,,,,,,,

"హరి పెండ్లికి 'కైకేయక,:
కురు,సృంజయ, యదు,విదర్భ- కుంతి నరేంద్రుల్ ' :
పరమానందము పొందిరి:
ధరణీశులలోన గాఢ తాత్పర్యములన్ ."
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

కైకయక,కురు,సృంజయ,యదు,విదర్భ,కుంతి దేశ చక్రవర్తులు
"శ్రీ కృష్ణుని పరిణయము"నకు పరమానందమును పొందిరి. భూపాల
లోకము గొప్ప శ్రద్ధానందములు పొందెను."
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

27, నవంబర్ 2008, గురువారం

రుక్మిణీ కళ్యాణము

రుక్మిణీ కళ్యాణము
,,,,,,,,,,,,,,,,,,,,,,
రుక్మిణీ దేవి ,రహస్యముగా పంపిన "వినతి "ని విని ,
శ్రీ కృష్ణుడు చేస్తూన్న ప్రతిజ్ఞ :::
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

"వచ్చెద విదర్భ భూమికి ;
జొచ్చెద భీష్మకుని పురము - సురుచిర లీలన్ ;
దెచ్చెద బాలన్ వ్రేల్మిడి ;
వ్రచ్చెద నడ్డంబు రిపులు - వచ్చిన బోరన్."
(ఇది కంద పద్యము )

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

విదర్భ రాజ పుత్రిక రుక్మిణీ దేవి వివాహమును ,
ఆమె అన్న రుక్మి,తండ్రి భీష్మకుడు నిర్ణయించిరి.
శిశుపాలునితో ఆ వైదర్భి పెళ్ళి నిర్ణయమైన సందర్భముగా
రాజ్యమున ఉల్లాసము వెల్లివిరిసినది.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
(సీసము, ఆట వెలది)

"రచ్చలు,క్రంతలు-రాజ మార్గములు :
విపణి దేశంబులు-విశదములుగ :
చేసిరి చందన- సిక్త తోయంబులు
కలయంగ జల్లిరి- కలువడములు:
రమణీయ వివిధ తో-రణములు గట్టిరి;
సకల గృహంబులు-సక్క జేసి
కర్పూర కుంకుమా-గరు ధూపములు వెట్టి;
రతివలు,పురుషులు-నన్ని ఎడల;"

"వివిధ వస్త్రములను-వివిధ మాల్యాభర;
ణాను లేపనముల-నమరి యుండి;
రఖిల వాద్యములు,మ-హా ప్రీతి మ్రోయించి;
రుత్సవమున నగరమొప్పి యుండె."
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
కుండిన పుర ప్రజలు రచ్చలు/ కూడళ్ళు,అడ్డ త్రోవలు(క్రంతలు),
రాజ మార్గములు, మార్కెట్లు,విశదముగా ,పరిశుభ్రముగా చేసిరి.
చందన /గంధ సిక్తములైన జలములను కలయ చల్లి ఉన్నారు.
రమణీయమైన (కలువడములు=) కలువ పూవులు, మున్నగు
వివిధ తోరణములను కట్టిరి.
సకల గృహములను చక్కగా చేసి,
కర్పూర, కుంకుమ,అగరు ధూపములను పెట్టిరి.
అతివలు/స్త్రీలు, పురుషులు వివిధ మాలలను ధరించి,
(అను లేపనములు) మై పూతలతో ఒప్పి ఉండిరి.
అఖిల వాద్యములను మహా ప్రీతితో మోగించ సాగిరి.

విదర్భ రాజధాని యైన కుండిన పురము
ఉత్సవములతో విలసిల్లుచున్నది.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

"రుక్మిణీ కల్యాణము "

పేర్వేర బొమ్మల -పెండ్లిండ్లు సేయుచు :
అబలల తోడ వి-య్యంబులందు :
గుజ్జన గూళ్ళను-గొమరొప్ప వండించి:
చెలులకు పెట్టించు-చెలువు మెఱయు:
రమణీయ మందిరా-రామ దేశంబుల:
పువ్వు తీగెలకును-ప్రోది సేయు:
సదమల మణిమయ -సౌధ భాగంబుల :
లీలతో భర్మ డో-లికల నూగు :

బాలికల తోడ చెల రేగి- బంతులాడు:
శారికా ,కీర పంక్తికి- చదువు చెప్పు:
బర్హి సంఘములకు మురి-పములు గఱపు :
మద మరాళంబులకు-జూపు మంద గతులు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రుక్మిణి దేవి పేరు ,పేరున "బొమ్మల పెండ్లిండ్లు" చేయుచు,
తన చెలి కత్తెలకు ,"వియ్యములు ,ఇచ్చి పుచ్చు కొనుటల"ను నేర్పెను.
ఆటల 'గుజ్జన గూళ్ళను ' వండించి,
ఆ బాలికలకు చెలువు మీరగా,అందముగా వడ్డించెను.
రమణీయ మందిరముల పెరటి తోటలలో/ఆరామ దేశములందు ,
పూ లతలకు పోషణకై' పాదులు ' చేసి ,పట్టు కొమ్మలను ఏర్పరచును.
స్వఛ్చమైన(సదమల) మణి మయ సౌధ భాగములలో లీలా విలాసములొప్పగా ,
భర్మ(బంగారు)డోలికలందు ఊగు చుండును.
చెలిమి కత్తెలతో బంతులాట లాడును.
గోరు వంకల,చిలుకల గుంపులకు "చదువులు " చెప్పు చుండును.
నెమళ్ళ(బర్హి) గుంపులకు మురిపములను నేర్పును.
మద మరాళములకు(మదించిన హంసలు)
వయ్యారముతో నెమ్మదిగా నడచు పద్ధతిని నేర్పును.
.::::::::::::::::::::::::::::::::::::::::::::::
"రుక్మిణీ కల్యాణము "లోని ఈ సొగసరి కబ్బములు
సీస.తేట గీతి ఛందస్సులలో పోతన రచించెను.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

26, నవంబర్ 2008, బుధవారం

మాటలు

మాటలు :
,,,,,,,,,,

1)పర్యవసానము , రిజల్టు:
2)క్లైమాక్సు ,పరాకాష్ఠ :::
"సినిమలో/నాటకములో క్లైమాక్షు
3)పర్యవసాయి ,పర్యవసించు .
4) దరిమిలా : ఆ మీద/ఆ మీదటను /ఆ పైన /ఆ వెనుక /ఆ తరువాత ,
అటు తరువాత ,తర్వాత,
" చెప్పడమే తరువాయి , హనుమంతుడు 'సంజీవనీ పర్వతముణు
పెకలించి తెచ్చెను."
5) పిదప,పిమ్మట , అటు పిమ్మట
" పిదప కాలం,పిదప బుధ్ధులు."
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
1)రమారమి :దాదాపు :ఇంచు మించు గా :
2)సరా సరిగా : ఖనా ఖనిగా :
బరా బరి :::
"అత్తెసరు మార్కులతో ఈ క్లాసును గట్టెక్కించెను." :::
"బొటా బొటి మార్కు"లు :
3)మట్టసము=పొదుపు,
"అతగాడు డబ్బును మట్టసంగా వాడుతాడు,దుర్ఖర్చును చేయడు. పొదుపు చేసిన మనీని,బ్యాంకులో జమ చేసి,నిశ్చింతగా ఉన్నాడు."
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

1)బహుశ: 2)"ఔను,కామోసు!"
3)"అంతే కాబోలు!"/కాబోలును!/
4)ఐ ఉండ వచ్చును."
5)ఐతే,గియితే,
6)"అట్లాగైతే,మీరు ఇక్కడికి బదిలీ చేయించుకుని, వస్తారన్న మాట!"
అయినచో/ఐతే/
7)"ఐనా సరే,నేను, ఇంజనీరునే ఔతాను"
8)"గొల్ల భామలు,పాలు వెన్నలను ఉట్టి మీద దాచారు.ఐనా గానీ,
బాల క్రిష్ణమ్మ మీగడ వెన్నలను కాజేసి ,శుభ్రంగా ,నేస్తాలతో కలిసి,కూర్చుని, త్రాగేశాడు."

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

పలుకులు

పలుకులు :
(మనీ:విభాగము )
,,,,,,,,,,,,,,,,,,
1)తూకము :::బారువా ,మణుగులు
2) "కోవెలలో తన ఎత్తు(=బరువు) నాణెములను 'తులా భారము 'ను మ్రొక్కి ,తీర్చుకొనెను."
3)కాసులు: "కనక వర్షము కురిసి, మా ఇల్లు సిరులతో నిండినది.":
కాసుల పేరు '=నగ :
"కాసులు గల గల మంటూన్నవి.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
4)అణా=6 పైసలు :16 అణాలు=రూపాయితో సమానం:
అర్ధణా= 3 పైసలు:
5) దమ్మిడీ,దమ్మిడీలు,కాణీలు
:::::::::::::::::::::::::::::::::::

బాకీ:::1)బాకీ,' బకాయి పడిన బిల్లులు ': 2)ఋణము : 3)అప్పు:మిత్తి :
4)అసలు,వడ్డీ: చక్ర వడ్డీ,బారు వడ్డీ: అసలు ఫాయిదాలతో సహా,బాకీని తీర్చేసి,హాయిగా,కులాసాగా,(నిష్పూచీగా, రికామీగా) దర్జాగా' కాలు మీద కాలు వేసుకుని, కూర్చున్నారు."5)'బ్యాంకులో తీసుకున్న లోనుతో ఇల్లు కట్టుకున్నారు.' :6)ఫండ్
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

1_జీతము :జీతము,నాతము ":జీతంకన్న పీతం ఎక్కువ,: వేతనము,శాలరీ,భత్యము (దారి భత్యము:దినసరి కూలీ,దినసరి భత్యము : కరువు భత్యము) :
2)విద్యార్ధుల చదువులు నిరాటంకముగా కొన సాగుటకు ,స్కాలర్ షిప్పులు
(=ఉపకార వేతనములు:ఫెలో షిప్స్ )
3)పెన్షను,పింఛను, పింఛనీ,వృద్ధాప్యపు పెన్షను : భరణము :
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

1) పన్నులు,టాక్సులు : కప్పము,సుంకము ;
2)ప్రభుత్వ ఖజానా: కోశాగారము : ధనాగారము :
(ధాన్యా గారము,భాండారము)
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;
1) లక్ష్మీ దేవి అనుగ్రహము ' :లక్ష్మీ కటాక్షము ,సిరి ,
"లచ్చింతల్లి చల్లని చూపు తాకి,ధన ధాన్య సమృధ్ది లభించినది."

భూ దేవి

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


"సముద్ర వసనే దేవి,
పర్వత స్థన మండలే :
ఆపో అస్మాన్ మాతరః . :
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
భూ దేవి ,కడలి వసనముతో ,
పర్వత స్థన మండలములతో అలరారుతూన్నది.
నదులకు తల్లి వంటిది" భూ మాత".
(ఆపోః =జలములు,నీరు)
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
" మూలతో బ్రహ్మ రూపాయ ,
మధ్యతో విష్ణు రూపిణే ,
అగ్రతః శివ రూపాయ ,
వృక్ష రాజాయ నమః."
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రుక్మిణీ కల్యాణము

రుక్మిణీ కల్యాణము :
,,,,,,,,,,,,,,,,,,

"బాలేందు రేఖ తోచిన :
లాలిత యగు నపర దిక్కు- లాగున ధరణీ :
పాలుని గేహము మెరసెను :
బాలిక జన్మించి ,ఎదుగ -భాసుర మగుచున్. "
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
(పోతన ,కంద పద్యము,దశమ స్కంఢము,10 )

"రాజు భీష్మకుని గృహము ,
బాలిక రుక్మిణి జన్మించి, ఎదుగుచుండగా,
పాడ్యమి నాటి నెల వంక వలన అందముగా ఉన్న "పడమటి దిక్కు" వలె, కాంతివంతము అయ్యెను."
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

సూక్తి

సూక్తి :::
,,,,,,,

" మాతా శత్రః ,పితా వైరి ,
యే న బాలో సపాఠిథః :
న శోభతే సభా మధ్యే
హంస మధ్యే బకో యథా."
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

హుండీ

సామెతలు :::
,,,,,,,,,,,
1)ధన మూలం ఇదం జగత్.
2)డబ్బుకు లోకం దాసోహం.
3)ధనమేరా అన్నిటికీ మూలం.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

1) పైసాకు ఠికాణా(/గతి)లేదు గానీ ఆడంబరాలకు తక్కువ లేదు,అన్నీ కావాలంటాడు."
2)గవ్వ రాకడ లేదు,ఘడియ రికాం (/పుసరత్తు)లేదు,:::
/క్షణం తీరిక లేదు,దమ్మిడీ ఆదాయం లేదు.
3)"కుబేరుని మనుమడు అతను,బహు భాగ్య వంతుడు."
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
పలుకు బళ్ళు :::
,,,,,,,,,,,,,
1)పర్సు, మనీ పర్సు,బ్యాంకు లాకరు ,బ్యాంక్ లోని లాకర్ రూము.
:::::::::::::::::::::::::::::::::::
పెట్టె :::
""""""""""""""
1)భోషాణము, భోషాణంపెట్టె ,
2) హుండీ ,డబ్బుల పెట్టె/భరిణె/భరిణ.
3) హుండీ ,డిబ్బీ,డిబ్బెన,దిబ్బీ
4)దేవళములో "హుండీ';;;
తిరుపతి కోవెలలో "పరకా మణి "
(=తిరుమలలోని శ్రీవేంకటేశ్వర స్వామి వారి కోవెలలో,హుండీలో వచ్చిన రాబడిని లెక్కించుట.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

25, నవంబర్ 2008, మంగళవారం

కలిమి

1) కలిమి ,కల వారు =/ఉన్న వారు= బాగా డబ్బున్న వారు
2)లక్ష్కాధికారులు, కోటీశ్వరుడు/లు :
మిల్లియనీర్స్ ,మిలియనీర్లు ::: వాళ్ళు జమీందారులు."
3)"వాడికేం, భాగ్యశాలి.బొడ్డులో బంగారంతో పుట్టాడు ."
4)నోట్ల కట్టలు=రూపాయిల బండిల్సు:
"నా దగ్గర ఏదైనా మిషను ఉందనుకున్నావా?
అడగంగానే ,నోట్లు ప్రింటువేసి ఇవ్వడానికి,/నోట్లు అచ్చు వేసి ఇవ్వడానికి."
5) హస్తము= ఐదు రూపాయల నోటు.
6) వంద నోటు/నూరు రూపాయలు,హండ్రెడ్ రుపీస్ ,పెద్ద నోటు, పచ్చ నోటు
7) మింటు కాంపౌండు = డబ్బులు అచ్చు వేసే ప్రభుత్వ కర్మాగారము
''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''
1)పరసు వేది= ఇనుమును బంగారముగా మార్చు 'విద్య '/రాయి.
"అతగాడికేం,మహా రాజు!అరి చేతిలో పరసు వేదిని ఉంచుకుని పుట్టాడు./
"వాడి జీవితం 'అన్ని వడ్డించిన విస్తరి."
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

ధనము (విభాగము):::

ధనము (విభాగము):::
,,,,,,,,,,,,,,,,,,,,,,
1)ధనము,ద్రవ్యము ,విత్తము ,విత్తు
2)నాణెము ,నాణ్యములు ,
కాయిన్స్ ,కాయిన్లు,"బొమ్మ,బొరుసు"లు.
3)రూప్యములు, నినిష=108 సువర్ణములు ::: రూపాయి ,రూపాయిలు,రూపాయలు:::
"పచ్చ నోటు"=నూరూ రూపాయల నోటు ,రుపీస్ :::
రూకలు ,
4) కార్షా పణములు,నిష్కములు
''''''''''''''''''''''''''''''''''

1)భాగ్యము=సంపద,పణము ,
" భోగ భాగ్యములతో తుల తూగుట ":::
సిరి ,సిరులు ,సిరి సంపదలు , సంపద ,సంపదలు ,
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
1)ధనవంతుడు/లు :,ధనికుడు/లు : భాగ్య వంతుడు/లు : సంపన్నులు :::

2)సంపన్న వర్గము ::: "ఉన్న వారు/ఉన్న వాళ్ళు/ కలిగిన వాళ్ళు

పలుకులు

పలుకులు :::
,,,,,,,,,
1)డబ్బు ,ధనము, శుల్కము,
పైసా,పైసలు,సొమ్ము .సొమ్ములు, సొత్తు,
సంపద ,సంపదలు ,
2)కాన్ డబ్బులు ,కాణీ,కాణీలు,
దమ్మిడీలు,దుడ్లు,గవ్వలు ,అణా,అణా పైసలతో ,
(పదహారణాలల తెలుగు దనము ఉట్టి పడుతూన్నట్లున్నది
వేష భాషలలో ఆ కన్నె పిల్ల.")
ఉదా// "చిల్లి గవ్వకు కొరగాడు." //
3) కాణీ, "కాణాచి"
(ఉదా// కథలకు కాణాచి."=నిలయము, ఆకరము,నెలవు)
4)" అణా పైసలతో సహా బాకీని కట్టినాడు."
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

1)వరహాలు,దీనారములు, దీనార టంకములు ,
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
2)డబ్బు,దస్కం, దభ్భు,డుబ్బు,
("డబ్బు లేని వాడు డుబ్బుకు కొర గాడు, ")
3)కట్న కానుకలు
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

1)కట్నము , కట్న కానుకలు ,
2) కన్యా శుల్కము ,ఓలి .
3) అరణము (ఉదా// "సత్యభామకు, వెంట
ముక్కు తిమ్మన 'అరణపు కవి 'గా వచ్చెను. ")
3)భరణము :::
ఉదా//" ఇందిరా గాంధీ,రాజ వంశీకులకు ఇస్తూన్న 'భరణము 'లను
రద్దు చేస్తూ ,చట్టమును చేసెను."
4)ఋణము ,బాకీ ,అరువు ,అప్పు,
చే బదులు ,బదులు పుచ్చుకొనుట.

పోతన

పోతన :::
,,,,, ,
"మంతనములు సద్గతులకు :
పొంతనములు ఘనములైన పుణ్యముల, కి :
దానీంతన పూర్వ మహాఘ ని :
కృంతనములు రామ నామ కృతి చింతనముల్."
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
భాగవతము,నవమ స్కంధము,262 :::
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
శ్రీ రామునికి అంకితములైన కథలు ,
రామ వర్ణనలు కలిగిన కావ్యములు సద్గతులను ఉపదేశించును.
గొప్ప పుణ్యములను ప్రసాదించును.
ఈ క్షణము వరకు చేసిన పాపములను ఖండించే ఉపకరణములై
అవి మనలను సముద్ధరించును.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

23, నవంబర్ 2008, ఆదివారం

పోతన

"నల్లని వాడు, పద్మ నయనంబులవాడు,మహా శుగంబులన్ :::
విల్లును దాల్చు వాడు, కడు విప్పగు వక్షము వాడు,మేలు పై :::
జల్లెడు వాడు,నిక్కిన భుజంబుల వాడు, యశంబు దిక్కులం :::
జల్లెడు వాడు నైన రఘుసత్తము డీవుత మా కభీష్టముల్ ."

( పోతన )
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

పోతన,నవమ స్కంధము ,250 వ పద్యము

యజ్ఞ శాలలో కుశీ లవులు " రామ కథా గానము "చేసిరి. ఆ పాట మాధుర్య ప్రవాహమున ఎండిన చెట్లు చిగురించునట్లుగా సాగెను. ఆ గానము
శ్రీ రామచంద్రుని,ప్రజలను ఆనందములో ఓలలాడించసాగెను.కుశీ లవ కుమారులపై ఎల్లరకు వాత్సల్య ,అనురాగములు జనియించగా వారి కన్నుల నుండి ఆనంద బాష్పములు కార
సాగెను.
(పోతన,నవమ స్కంధము ,250 వ పద్యము)
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

" వట్టి మాకులు పల్లవింప ,నవారియై మధు ధార దా :
నుట్ట పాడిన ,వారి పాటకు నుర్వరాధిపుడున్,ప్రజల్ :
బిట్టు సంతస మంది రయ్యెడ, ప్రీతి కన్నుల బాష్పముల్ :
దొట్ట నౌదల లూచి ,వారల తోడి మక్కువ పుట్టగాన్. "

(పోతన) :::
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

పోతన

" తండ్రి క్రియ రామ చంద్రుడు :
తండ్రుల మఱపించి ప్రజల తా రక్షింపన్ :
తండ్రుల నందఱు మఱచిరి :
తండ్రి కదా రామ చంద్రు ధరణిపు డనుచున్ ."

(పోతన) :::

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

పోతన పద్యము

పోతన పద్యము :
,,,,,,,,,,,,
ఒక మున్నూఱు కదల్చితెచ్చిన లలాటోగ్రాక్షు చాపంబు, బా :
ల కరీంద్రంబు సులీల మై చెఱకు కోలన్ ద్రుంచు చందంబునన్
సకలోర్వీశులు సూడగా విఱిచె దోశ్శక్తిన్, విదేహ క్షమా :
పక గేహంబున సీతకై గుణమణి ప్రస్ఫీతకై లీలతోన్ .

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

భూతల నాధుడు రాముడు :
ప్రీతుండై పెండ్లి యాడె పృధు గుణ మణి సం :
ఘాతన్ భాగ్యోపేతన్ :
సీతన్ ముఖకాంతి విజిత సిత ఖద్యోతన్ .

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
('భాగ వతము 'నందలి
నవమ స్కంధము లోని 261 ,262 పద్యములు)

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

నాసికా వర్ణనము

"నాసికా వర్ణనము
,,,,,,,,,,,,,
(రామ రాజభూషణుని ప్రబంధము " వసు చరిత్రము")
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

నానా సూన వితాన వాసనల నానందించు సారంగ మే :
లా నన్నొల్ల దటంచు గంధ ఫలి బల్కాకం దపంబంది, యో
షా నాసాకృతి చూచి, సర్వ సుమన స్సౌరభ్య సంవాసమై :
పూనెం ప్రేక్షణ మాలికా మధుకరీ పుంజము నిర్వంకలన్ .

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

సూక్తి :

సూక్తి :
,,,,,,,,,,,,,,,,,,,

కార్పాసం కటి నిర్ముక్తం :
కౌశేయం భోజనావధి :
ఊర్ణ వస్త్రం సదా శుద్ధం :
ఊర్ణా వాతేన శుద్ధ్యతి .:

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

నూలు వస్త్రము కట్టి ,విడిచే దాకా మడి:
పట్టు బట్ట భోజనము చేసేంత వరకూ మడి:
ఉన్ని బట్ట సదా మడియే !
ఇందుకు కారణమేమనగా ,
ఉన్ని గాలి వలన పరిశుభ్ర మౌతున్నది గదా!

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

కబీర్ దాసు

కబీర్ దాసు :::
,,,,,,,,,,,,,,,,

"మాలా ఫేరత్ జుగ్ భయా :
ఫిరాన మన్ కాఫేర్ :
కర్ కా మన్ కా డారికే :
మన్ కా మన్ కా ఫేర్ ."

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

అనేక సంవత్సరములుగా చేత
తావళమును త్రిప్పుచున్ననూ ప్రయోజనము అగు పడ లేదు.
మనస్సునే మాలగా చేసినచో,భగవానునికి చేరువ అగును.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

22, నవంబర్ 2008, శనివారం

20, నవంబర్ 2008, గురువారం

పలుకులు

పలుకులు :::
,,,,,,,,,,,,,,

1) కాలికి వేస్తే మెడకు వేస్తాడు.
=సమస్యకు పరిష్కారం చెప్పడు,ఒకటే సాగదీస్తాడు."
2)కాలు,చెయ్యి ఆడినంత కాలం
మనిషన్నాక ,ఏదో ఒక పని చెయ్యాల్సిందే! ఊరికే కూర్చుండలేను."
3)"హంస నడకలు రాక పోయె,ఉన్న(తన) నడకలు మరిచి పోయె!"
4)"కాలు సాగనీ! కొంచెం కష్టమైనా ,నీ అంతట నువ్వే నడువు!"
5)నలుగురు నడిచిన బాటలో ,మనమూ నడిస్తే తంటాలు(=రిస్కు) ఉండదు.
/"గతాను గతికో లోకః."
6)నడవడికలు చక్క దిద్దేది నాటకము.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
1) హంస నడకలు/నడలు /
:::"హంస గమన"=స్త్రీ/గ గామిని/గజ గమన/మరాళ గమన
2) పిల్లి నడకలు=చప్పుడు లేకుండా నడచుట.
3)"ఏమిటా పెళ్ళి నడకలు? ,త్వరగా నడవండి!"
4)పాము నడకలు=వంకర టింకర నడకలు/ఒకే పార్టి వైపు స్థిరంగా తీర్పును ఇవ్వ లేక పోవడం.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

జాతీయములు

జాతీయములు :::
,,,,,,,,,,,,,
1)కాలికి బలపం కట్టుకుని తిరుగుట/చెప్పులు అరిగేలా తిరిగి /
అరి కాళ్ళు మోకాళ్ళు అయ్యేలా తిరిగారు./
2)"ఇవి చేతులు కావు, కాళ్ళు అనుకో!"అంటూ ,
ఆతని చేతులు పట్టుకుని ఎంతగానొ బ్రతిమాలాడు./కాళ్ళు,గడ్డాలు పట్టుకుని బతిమాలుతూ/కాళ్ళు,కడుపు పట్టి/ కాళ్ళు,చేతులూ పట్టుకుని /
3)"అతని అరి కాలిలో చక్రం ఉన్నది,
అందుకే పొద్దస్తమానము తిప్పాయిలాగా తిరుగుతూనే ఉంటాడు."
4)మోచేతి నీళ్ళు త్రాగుట=ఆధార పడి ఉండుట
5) కావేరీ గుర్రాలు =స్పీడుగా,వడి వడిగా ,కాలి కొద్దీ పరుగులెత్తుట/
6) కాలు గాలిన పిల్లిలా (బాధలు ఓర్వలేక)తిరుగుట
7) కాలికి బుద్ధి చెప్పుట/పిక్క బలం కొద్దీ పరుగెత్తి,పారి పోయారు./దౌడు తీయుట
8)కయ్యానికి కాలు దువ్వుట /కాలు దూయుట
9)ఇక నా వల్ల కాదనీ కాళ్ళు (బార) చాచుకుని ,చతికిల పడి.
10)'ముసలయ్యా! కాళ్ళు సాచుకుని,కృష్ణా! రామా! అనుకుంటూ
మూల కూర్చోక ,నీకు ,అనవసరపు ఆసక్తి ఎందుకు?"
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాధికా సాంత్వనము (రచన: ముద్దు పళని )

రాధికా సాంత్వనము (రచన: ముద్దు పళని ) :::
,,,,,,,,,,,,,,,
" తేటలుగా జిగి ముత్యపు :
పేటలుగా,పంచదార వూటలుగా,పూ :
తోటలుగా, రా చిలుకల :
మాటలుగా ,కంస వైరి మాటలు తనరున్ ."
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

"కావి కాదది, విడి కెంపు దీవి కాని :
దీవి కాదది అమృతంపు బావి కాని :
బావి కాదది కపురంపు తావి కాని :
తావి కాదది శౌరి కెమ్మోవి కాని."
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

19, నవంబర్ 2008, బుధవారం

పలుకులు

పలుకులు :::
,,,,,,,,

1)చేతులు కట్టుకొనుట= వినయముగా ; శ్రద్ధాళువులై ఆలకించుట.
2)చేతులు ముడుచుకు కూర్చొనుట =
ఉదాసీనులై,ఏమీ తోచక ,ఉండుట.
3)"తన కూతుర్ని ,ఓ అయ్య చేతిలో పెట్టి,నిశ్చింతగా ఉండ గలనని"అన్నాడు.
(=బాధ్యతలను పూర్తిగా అప్ప జెప్పుట)
4)"ఇక్కడెవరూ చేతులకు గాజులు తొడుక్కో లేదు."
('అసమర్ధులము కాదు 'అనుట)
5)అర చేత ఉసిరిక /
"వానికి అన్నీ తెలుసు,అన్ని విద్యలు అతనికి 'కర తలామలకములే!"
(అమలకము=ఉసిరిక కాయ)
6)"ఈ వ్యవహారాన్ని తేల్చ లేము.ఇక మా వలన కాదు."
అనేసి ,చేతులు ఎత్తేసారు.
7)'చేయి ,చేయి కలిపి ' ,ఐకమత్యంతో
ముందుకు కదిలారు.
8)ఈ చేత్తో ఇచ్చినది,ఆ చేతికి తెలియ కూడదు.
(=ప్రతి ఫలమును కోరకుండా గుప్త దానము)
9)చేతులు కాలాక ,ఆకులు పట్టుకున్నట్లు.(నష్టం కలిగాక వగచుట వ్యర్ధం.)
10) "అతను చేతి బారు మనిషి,ధారాళంగానే దాన ధర్మాలను చేస్తాడు."/
' చేతికి ఎముక లేదు ...' :::
11) అర చేతి వేళ్ళు/ చేతి వ్రేళ్ళు అందరికీ ఒకేలా ఉంటాయా?
(బుద్ధి విశేషాలలో/డబ్బు దస్కములలో
అందరూ సమాన స్థాయిలో ఉండరనుట.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

11)చే బదులు/చే బదుళ్ళు= హామీ పత్రాల వంటివి అక్కర లేని చిన్న పాటి అప్పులు.
12)చేవ్రాలు ,చేతి దస్తూరి మొదలైనవి.
13)చే పాటి కర్ర /(ఊత కర్ర )
14)చేతి సంచీ::;
చేతిపనులు/చేతి వృత్తులు(కుమ్మరి,కమ్మరి వగైరా) = హస్త కళలు ,బొమ్మల తయారీ మున్నగునవి.
15) చేం తాడు ::: "చేంతాడు కురుచ ఐతే ,బావిని పూడ్చు కుంటారా?"
16)"అతను చేతి వాటం మనిషి,
అతను గనక వచ్చి నట్లైతే ,మీ ఇంట్లో వస్తువులు జాగ్రత్త,సుమీ!"
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

పోతన ,పద్యము

పోతన ,పద్యము :::
,,,,,,,,,,,,,,,,

"ఇందిందిరాతి సుందరి :
ఇందిందిర చికుర యున్న,దిందిందః శుభం :
బిం,దిందు వంశః యను క్రియ :
నిందీవర వీధి మోసె నిందిందిరముల్."
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
దుష్యంతునికి తుమ్మెదలు ఈ రీతిగా చెప్పినట్లుగా అనిపించినది.
"ఈ సుందరి ఇందిరా దేవి కన్నా అందమైనది.
ఆమె చుబుకము 'తుమ్మెద ' వాలినట్లుండును.
చంద్ర వంశ పురుషుడా! ఇక్కడిక్కడే ఆమె ఉన్నది."
అనుచూ భ్రమరములు ఝుంకారములతో పలికినట్లే అనిపించినది.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

వసు చరిత్ర(పద్దెము)

వసు చరిత్ర(పద్దెము):::
,,,,,,,,,,,,,,,,,,,,,,,,

ఆ జాబిల్లి వెలుంగు వెల్లికల డాయన్లేక రాకా నిశా :::
రాజశ్రీ సఖమైన మోమున పటాగ్రం బొత్తి యెల్గెత్తి,ఆ :::
రాజీవానన ఏడ్చె ,కిన్నర వధూ రాజత్కరాంభోజ కాం :::
భోజీ మేళ విపంచికా రవ సుధా పూరంబు తోరంబుగన్. "

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రామ రాజ భూషణుని "వసు చరిత్రము "లోనిది ,ఈ పద్యము.

మిథ్య

ఉక్తి :::
,,,,,,,
" జ్యోతిషం జలదే మిథ్యా ; మిథ్యా శ్వాసని వైద్యకం ;
యోగో బహ్వశనే మిథ్యా ; మిథ్యా జ్ఞానం చ మద్యపే!::: "
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
తా// మేఘము విషయములో జ్యోతిష్యము పని చేయదు.
శ్వాస రోగమునకు వైద్యము మిథ్య.
అతిగా తిండి తినే వానివద్ద 'యోగము ; వృధా.
త్రాగు బోతునందు జ్ఞానము మిథ్య,హుళక్కి. "
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

18, నవంబర్ 2008, మంగళవారం

parroT

పోతన పద్యము :(903)

పోతన పద్యము :(903)
,,,,,,,,,,,,,,
లలితాయతాష్ట భుజ మం :::
డల మధ్య స్ఫురిత రుచి విడంబిత లక్ష్మీ :::
లలనా కాంతి స్ఫర్ధా :
కలిత లసద్ వైజయంతికా శోభితుడున్ ."
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
మేరు పర్వ శిఖరము వంటి నీల దేహముతో ,
నీల మేఘ ఛాయ కల స్వామి ,గరుడ వాహనుడు వచ్చెను.
కమనీయమైన దేహ కాంతితో దిక్కుల చీకట్లను విచ్ఛిన్నము చేసెను.
ఎనిమిది ఆయుధములు ధరించి,
ముని జన పరివేష్టితుడైన నరాయణుడు,
మెరిసే చెవుల కుండలముల కాంతులు చెక్కిళ్ళ మీద ప్రతి ఫలించ సాగెను.
నవ రత్నములు తాపడము చేసిన కిరీటమును,
వక్ష స్థలమున కౌస్తుభమును,పచ్చని పట్టు పీతాంబరములతో ,భాసిల్లుచుండెను.
నారాయణ మూర్తి హారములను, బాహు పురులను ,
కంకణములను, ఘల్లు టందెలను ధరించెను.
(903)
మనోహరమైన ఎనిమిది బాహువుల నడుమ వక్ష స్థలమునందున :శ్రీ లక్ష్మీ దేవి ప్రకాశించు చున్నది. ఆమె కాంతులతో స్పర్ధ వహించుచూ "వైజయంతీ మాల " తళుకులీనుచున్నది.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

భాగవతము,(పంచమ స్కంధ,902,903)పద్యము

భాగవతము,(పంచమ స్కంధ,902,903)పద్యము
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
(సీస పద్యము) :::
,,,,,,,,,,,,,,,,,
"ఘన మేరు శృంగ సంగత నీల మేఘంబు :
నెరి గరుడ స్కంధ నివసితుండు :::
కమనీయ నిజ దేహ కాంతి విపాటితా :
భీలాఖిలా శాంతరాళతముడు:
సు మహితాష్టాయుధ సుమనో మునీ:
శ్వర సేవక పరిజన సేవితుండు :
మండిత కాంచన కుండల రుచిరోప :
లాలిత వదన కపోల తలుడు :::

(తేట గీతి) :::
" జారు నవ రత్న దివ్య కోటీర ధరుడు :
కౌస్తుభ ప్రవిలంబ మంగళ గళుండు :
లలిత పీతాంబర ప్రభాలంకృతుండు :
హార కేయూర వలయ మంజీర యుతుడు. :::

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
(కందము):::
,,,,,,,,,,,,,,,
" లలితాయతాష్ట భుజ మం : డల మధ్య స్ఫురిత రుచి విడంబిత లక్ష్మీ : లలనా కాంతి స్పర్ధా : కలిత లసద్ వైజయంతికా శోభితుడున్ ."
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

వేమన పద్యము

వేమన పద్యము :::
,,,,,,,,,,,,,
కనగ సొమ్ములెన్నొ, కనకం బదొక్కటె :::
పసుల వన్నెలెన్నొ, పాలొక్కటియే!
పుష్ప జాతు లెన్నో ,పూజ యొక్కటె :::
విశ్వ దాభి రామ !వినుర వేమ! "
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

तेलुगु तल्ली

तेलुगु तल्ली

పోతన పద్యము

పోతన పద్యము :::
,,,,,,,,,,,,,,,,,,
సీసము://
"ఏ బాము లెరుగక యేపారు మేటికి :
పసుల కాపరి ఇంట బాము కలిగె:
నే కర్మములు లేక యెనయు నెక్కటికి :::
జాత కర్మంబులు సంభవించె :
నే తల్లి చను బాలు నెరుగని ప్రోఢ:
యశొద చను బాల చొరవ నెరిగె:
నే హాని వృద్ధులు నెరుగని బ్రహ్మంబు :
పొదిగిటిలో వృద్ధి పొంద జొచ్చె :::

ఆట //

నే తపములనేని నెలమి పండని పంట :
వల్లవీ జనముల వాడ పండె :
నే చదువులనైన నిట్టిట్టి దన రాని :
అర్ధ మవయవముల నందమొందె! "

...................................

కష్టమే ఎరుగని శ్రీ కృష్ణునికి
పసుల కాపరి ఇంట సంక్లిష్టతలను అనుభవించ వలసి వచ్చినది.
కర్మలే అంటని దైవమునకు ,జాతక కర్మలు జరగాల్సి వచ్చినది.
యశోద చను పాలను కుడువ వలసి వచ్చెను.
హాని,వృద్ధులు తెలియని బ్రహ్మము,
తల్లి ఒడిలోన పెరుగ వలసెను.
ఎట్టి తపస్సులకును సాధ్య మవని
కన్నుల పంటలు ,వ్రజ వాసులకు దక్కినది.
ఎలాంటి చదువుల ద్వారానైనా
" ఇలాంటిదీ" అనివర్ణించ లేని అర్ధము
క్రమముగా వృద్ధి నొందుచున్న అవయవముల
అంద చందములు అలరారు వాడు అయ్యెను . "

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...