20, ఏప్రిల్ 2009, సోమవారం

గుల్కందా తయారు చేసే పద్ధతి

గుల్కందా

By kadambari piduri, Apr 6 2009 5:39PM

గుల్కందా తయారు చేసే పద్ధతి 

జాగ్రత్తలు 

తాజా గులాబీ రేకులను దుమ్ము లేకుండా కడిగి జాగ్రత్తగా తడి లేకుండా ఆర బెట్టుకుని వాడుకోవాలి. 

ఇక తయారు చేయడము చూద్దాము. చాలా సింపులే లేండి. 

1)తేనెలో మునిగేటన్ని గులాబీ రేకులను వేసి ఉంచాలి. 
2)ఆ గులాబీ రేకుల తేనెని ఒక సీసాలో పోయ వలెను. 
3)మూత బిగించి పెట్టాలి. 
4)ఈ సీసాను మంచి ఎండలో పెట్టాలి. 
5)ఇలాగ 15 రోజులు వఱకూ చేయాలి. 
6)గరిటతో బాగా కలిపి,ఏ మాత్రం తడి తగలకుండా జాగ్రత్త పరచాలి. 

గుల్కందాను ఆయుర్వేద పద్ధతిలో 
తరచుగా తినే అలవాటు గతము కాలములో ఉండేది. 
ఇది తీయని రుచితో, sweet లాగా ఉంటుంది; 
కాబట్టి అప్పటికప్పుడు కొంచెం కొంచెము చొప్పున రెడీ చేసుకున్నా
 ఎలాంటి అభ్యంతరమూ లేదు.
 రోజూ ఉసిరికాయ అంత గుల్కందాను
 పరగడుపున(అనగా ప్రొద్దున్నే ఏమీ తినకుండా, ఏమీ త్రాగకుండా)తింటే మంచిది.
 ఇది ఔషధముల కోవలోనికి రావు. ఆరోగ్యమునకు అనుసంధానములు మాత్రమే!
చిన్నపాటి రుగ్మతలను రాకుండా కాపాడగల పదార్ధములు మాత్రమే! 
కాబట్టి ఇలాంటివి, దేహము యొక్క తత్వమును పరిశీలించుకుంటూ, 
నిత్యమూ వాడికలోనికి మలచుకొనవచ్చును. 


'''''''

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...