30, సెప్టెంబర్ 2009, బుధవారం

టెంకాయ చిప్ప

వావిలి కొలను సుబ్బారావు గారు గొప్ప రామ భక్తుడు. రామాయణము ఆంధ్రీకరించి "ఆంధ్ర వాల్మీకి " బిరుదాంకితులు అయ్యారు.
సహజ కవి పోతన భాగవతము వెలసిన సీమ ఐన ఒంటిమిట్ట లోని
కోదండ రామాలయమును పునరుద్ధరించడానికి నడుం బిగించారు. ఆయనది వజ్ర సంకల్పమే! అలనాడు రామదాసుగా ప్రజల మానస పద్మములందు నెలకొనిన కంచర్ల గోపన్నను ఆదర్శముగా తీసుకున్నారు , ఈ " వాసుదాసు ". విరాళాలను పోగు చేశారు,
అయితే అందుకు ఆయన అనుసరించిన పద్ధతి విభిన్నముగా ఉండి , జనుల మన్ననలను అందుకున్నది.
సంచులూ, హుండీలు వంటి వాటిని పట్టుకోలేదు వావిలికొలను సుబ్బారావు. కేవలం ఒక కొబ్బరి చిప్ప ను బిక్షా పాత్రగా గైకొన్నారు. ప్రజానీకం ఇచ్చిన విరాళాలతో , కోదండ రామాలయ పునర్నిర్మాణము దిగ్విజయముగా పూర్తి చేయ గలిగారు వాసు దాసు.
తన బుజ్జి బిక్షా పాత్రపై ఎన లేని ప్రేమతో ఒక శతకమునే రచించారు. అది -

" ఆంధ్ర వాల్మీకి హస్తంబు నందు నిలిచి
రూప్యములు వేన వేలుగా ప్రోగు చేసి
దమ్మిడైనను వాని , లో దాచుకొనక
ధరణి జాపతి కర్పించి, ధన్యవైతివి కదా
కమ్రగుణముల కుప్ప ! టెంకాయ చిప్ప!

ఫిలిప్పీన్సులో మగ లతిక్ నాట్యము(magalatik Dance ) ప్రదర్శిస్తూంటారు.ప్రజలు
అభిమానించే ఈ డాన్సులో ఒక ప్రత్యేకత ఉన్నది.అది, శరీరముపైన - కొబ్బరి చిప్పలను కట్టుకుంటారు.ఆ నారికేళ డిప్పల పైన లయ బద్ధముగా ,మన కోలాటము వలె -కొడుతూ, చిందులు వేస్తారు.ఈ నాట్యము యుద్ధ సమయాలలో ,యోధులను ఉత్సాహ పరిచే గానముతో, నాట్యముతో కూర్చబడిఉంటుంది.స్పెయిన్ పాలనలో ఉన్నప్పుడు, ఇది రూపు దిద్దుకున్నది. స్థానికముగా నివసించే మోరోలు,అనే తెగ వారు, విదేశీయులతో (Moros ) పోరు సలప వలసి వచ్చినది బినాన్, లగునా వారు చేసిన "పోరు చిత్రణ"యే ఈ నర్తన కళగా ప్రదర్శన అయ్యింది.
(Binan, Laguna as a mock-war dance)

ఆ నగరము స్వేచ్ఛ ప్రదర్శన కొరకై పోరాడిన (Town’s patron saint, San Isidro Labrador.)సైంట్ శాన్ ఇసిడ్రో లాబ్రేడర్ అనే యోధుని స్మరిస్తూ, మెగా లతిక్ నాట్యములలో అధికముగా కొనసాగుతూంటాయి.
ఈ నాట్యములో వేసే అడుగులను క్రమమైన పద్ధతితో,లెక్క ప్రకారము జరుగుతూంటాయి.

All dancers are male; with harnesses of coconut shells
attached on their chests, backs, thighs and hips.

Here are the steps of maglalatik dance:
_______________________________________

1. 6 8-counts jogging to get to place -

2. 4 steps forward while pounding chest

3. 4 basic clap cycles in place -
4. 4 basic clap cycles to get to two rows

5. 8 quick clap cycles to do the ripple effect - 6. 8 quick clap cycles to circle around partner- 7. CIRCLE UP

2 8-counts + 1 4-count for first clap - cp after 1 8-count 3X- - Finishing clap - 8. 8 high-low clap cycles to move to position -
9. 8 cycles of 6 hit clapping - 10. 16 counts for tricks with clapping in the background

11. 4 basic to get to two sides - 12. 8 quick clap cycles for the battle -
13. 4 quick clap cycles to get to end

after last clap POSE


---*Note:*---

-----*Learning "maglalatik" Dance is quiet hard for me, but ofcourse, we can learn something. It's a nice dance!*-----

21, సెప్టెంబర్ 2009, సోమవారం

మేలిమి బంగారము వంటి ఈ పాట

మేలిమి బంగారము వంటి ఈ పాటను వీడియో-లో వినండి.

మేలిమి బంగారము వంటి పాట

చక్రవర్తుల రాజగోపాలాచారి స్వాతంత్ర్య పోరాటములో పాల్గొన్న దేశభక్తుడు.
ఆయన స్థాపించిన "స్వతంత్ర్య పార్టీ" ఆనాటి రోజులలో పేరెన్నిక గన్నది. గొప్ప రచయిత కూడా.
రాజాజీ రాసిన తమిళ పాట
" kurai onrum ellai maraimoorthi kanna " ను
1966 లో U.N. లో M.S. సుబ్బులక్ష్మి గానం చేసారు.

ఆమె, భర్త T. సదాశివమ్ లు తమ ఇంటికి భోజనమునకు రమ్మని,
రాజాజీని ఆయన అనుచరులనూ ఆహ్వానించారు.
విందులో అరిసెలు, బొబ్బట్లు వంటి రుచికరమైన పిండి వంటలను కూడా వడ్డించారు.
బెల్లంతో తయరు చేసిన భక్ష్యాలను అందరూ తిని, ప్రశంసించారు.
రాజాజీ "విందు సంపూర్ణంగా రుచికరముగా ఉందమ్మా! "అని మెచ్చుకుంటూ కృతజ్ఞతలను తెలిపారు.
ఆనక, కొంచెం తాళి ఇలా అడిగారు
" సదాశివం గారూ! వంటింట్లో బెల్లానికి చీమలు ఏమైనా పట్టాయా?" ఆ ప్రశ్న దంపతులను తికమక పెట్టినది.
అప్పుడు వంటింట్లోకి వెళ్ళి, పరిశీలించారు ; నిజంగానే చీమలు పుట్టలు పుట్టలుగా బెల్లానికి పట్టి ఉన్నాయి.
రాజాజీ నిశిత పరిశీలనా శక్తికి అక్కడ ఉన్నవారు అందరూ సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు.
" కల్తీ లేని తీపి వస్తువులకు చీమలు పడతాయని గుర్తించారు; అన్యాపదేశంగా వారు ఇచ్చిన విందును రాజాజీ మెచ్చుకున్నారని "
సుబ్బులక్ష్మి దంపతులు, సంతోషం పొందారు.

( Pramukhula Haasyam " కల్తీలేని మధురభక్ష్యాలు "

By kadambari piduri
___________________________________________


kurai onrum illai marai mUrti kaNNA!
kurai onrum illai kaNNA!kurai onrum illai gOvindA!( 2 )

kaNNukku teriyaamal nirkinray^, kaNNA !
kaNNukku tteriyaamal
ninraalum enakkukurai onrum illai marai mUrthy, kaNNA!
vENdiyaadait tanDida vEnkaTEsan enrikkaa
vENdiyadu vEronrum enakkillai, kaNNA
maNivaNNA, malaiappA!
gOviMdaa!gOviMdaa! gOviMdaa! gOviMdaa!

tiraiyinpin^ nirkinraai, kaNNA! -kaNNA!
tiraiyinpin^ nirkinraai, kaNNA! -kaNNA!
unnai+maraiyODum gnAnaiyir- maTTumE kANbAr -
enraalum +
kurai onrum illai marai mUrthy kaNNA!
kurai onrum illai kaNNA!
kunrin mEl kaLLaagi mirkinra varadA!
kunrin mEl kaLLaagi mirkinra varadA!
maNivaNNA, malaiappA!
gOvindA, gOvindA !
gOvindA, gOvindA !gOvindA, gOvindA !
kalinaaLuk irangi kaLLilE
irangaisilaiyaaga kOilil nirakkinraay^ , kEsavA!
yaarum marukkaada ,malai appA!
yaarum marukkaada malayappA!-
un maarbil +yenrum yeduM daaruLum
karuNai kaadal annaiyenrum
irundhida yEdhu kurai enakku?
yenrum irundiDa - yEdhu kurai enakku?
kurai Onrum illai marai mUrti , kaNNA!
kurai Onrum illai marai mUrti , kaNNA!
maNivaNNA, malaiappA! gOvindA, gOvindA !
gOvindA ! gOvindA ! gOvindA !

పాట :---
కురై ఓన్రుం ఇల్లై మరై మూర్తి కణ్ణా!
కురై ఓన్రుం ఇల్లై కణ్ణా!
కురై ఓన్రుం ఇల్లై గోవిందా!( 2 )

కణ్ణుక్కు తెరియామల్ నిర్కిన్రయ్, కణ్ణా
కణ్ణుక్కు త్తెరియామల్ నిన్రాలుం ఎనక్కు
కురై ఒన్రుం ఇల్లై మరై మూర్థ్య్, కణ్ణా!

వేణ్దియాదైత్ తండిద వేంకటేసన్ ఎన్రిక్కా
వేణ్దియదు వేరొన్రుం ఎనక్కిల్లై, కణ్ణా
మణివణ్ణా, మలైఅప్పా! గోవిందా!గోవిందా!
గోవిందా! గోవిందా!

తిరైయింపిన్ నిర్కిన్రాఇ, కణ్ణా! -కణ్ణా!
తిరైయింపిన్ నిర్కిన్రాఇ, కణ్ణా! -కణ్ణా!
ఉన్నై+మరైయోడుం గ్నానైయిర్-
మట్టుమే కాణ్బార్ - ఎన్రాలుం
కురై ఒన్రుం ఇల్లై మరై మూర్థ్య్ కణ్ణా!
కురై ఒన్రుం ఇల్లై కణ్ణా!

కున్రిన్ మేల్ కళ్ళాగి మిర్కిన్ర వరదా!
కున్రిన్ మేల్ కళ్ళాగి మిర్కిన్ర వరదా!
మణివణ్ణా, మలైఅప్పా! గోవిందా, గోవిందా !
గోవిందా, గోవిందా !గోవిందా, గోవిందా !

కలినాళుక్ ఇరంగి కళ్ళిలే ఇరంగై
సిలైయాగ కోఇలిల్ నిరక్కిన్రాయ్ , కేసవా!
యారుం మరుక్కాద ,మలై అప్పా!
యారుం మరుక్కాద మలయప్పా!-
ఉన్ మార్బిల్ +
యెన్రుం యెదుం ధారుళుం కరుణై కాదల్ అన్నై
యెన్రుం ఇరుంధిద యేధు కురై ఎనక్కు?
యెన్రుం ఇరుందిడ - యేధు కురై ఎనక్కు?
కురై ఓన్రుం ఇల్లై మరై మూర్తి , కణ్ణా!
కురై ఓన్రుం ఇల్లై మరై మూర్తి , కణ్ణా!
మణివణ్ణా, మలైఅప్పా! గోవిందా, గోవిందా !
గోవిందా ! గోవిందా ! గోవిందా !

========================================
Meaning: "I have no grievances at all absolutely, vEdha nayakA! kaNNA!
Youare not seen by mt eyes;
Even though You are not seen by my naked eyes, Ihave no grievances!
(implies; I have, because I am not able to see you)

తాత్పర్యము :
________
1.వేద నాయకా! అత్యాస లేదు. నా బాహ్య చక్షువులతో నీవు కనుపించుట లేదు.
Whatever I wish, You are able to give me,
Then, whatelse do I need? (exceptYou); Hence, I have no grievances;
maNivaNNA! malai appA! GovindhA!
నేను ఏది కోరినా నువ్వు ఇయ్య గలవు,నువ్వు తప్ప ,నాకు ఇంకేమి కావాలి?
అందు చేతనే నేనేమీ కోర నక్కర్లేదు. మణివణ్ణా! మలయప్పా!
You are standing behind the curtain (imples stage; You are a soothradhaari);
Only vEdic scholars and gnAnis can see You;
Even then, I have nogrievances
(implies, I have because I am not able to see You);
తెర వెనుక ఉండి,మమ్మల్ని నడిపించే సూత్రధారివి నీవే కదా!
వేద పండితులు, జ్ఞానులు మాత్రమే నిన్ను వీక్షించ గలరు.
ఐ కూడా , నాకు అసూయ, ఖేదము లేవు.
During these "kali" yugam,
You have come and entered and stayed as an archAform at TirumalA, kEsavA!
No one can deny Your Existence, GovindhA!
When the Merciful, Goddess stays in Your chest all the time,
why should Ihave any "kuRai"? GovindhA!"
కేశవా! ఈ కలి యుగములో అర్చా మూర్తిగా నీవు వచ్చి, తిరుమలైలో వెలిసి ఉన్నావు.
ఎవ్వరూ నీ వ్యాప్తిని అడ్డుకోలేరు.
కారుణ్యము,అనుగ్రహమును ఒసగే దేవత, నీ హృదయ సీమ పై స్థిర పడి ఉన్నది కదా,
మరి, నాకు వేరే శంక (కురవై ) ఏల ? గోవిందా!

శ్రీ పద్మావతీ సమేత శ్రీనివాస పరబ్రహ్మణే నమః

18, సెప్టెంబర్ 2009, శుక్రవారం

రాయలు-కుహూ యోగం
___


___


___


___
___

"బీచుపల్లి"కి ఆ పేరు రావడానికి ఒక హేతువు ఉన్నది.
"ఆంధ్ర భోజుడు" ఐన శ్రీ కృష్ణ దేవ రాయలకు జ్యోతిష్యులు చెప్పారు
"ప్రభూ!మీకు మూడు సంవత్సరమ్ములు 'కుహూయోగము ఉన్నది."
చాంద్ర మాన గణకులు, పంచాంగ పండితుల "భవిష్య వాక్కును అనుసరించి, శ్రీ కృష్ణ దేవ రాయల వారు తాను దానముగా ఇచ్చిన ప్రాంతమును, తానే మరల స్వీకరించి, కొన్ని సంవత్సరములు పరిపాలన చేయ వలసి వచ్చినది.
అందుచేత రాయలవారు 1521నుండి1524 వఱకు"మదనపల్లె"ను" శ్రీ కృష్ణముద్ర" తో పరిపాలించారు.
అయితే, ఆ ప్రాంతము "వ్యాస రాయలు"కు ఇచ్చినట్టి దానము.
ఆ ప్రాంతమును -"శ్రీ కృష్ణ ముద్ర"తో పాలించిన విజయనగర సామ్రాజ్య తేజో విరాజి,
నిర్ణీత గడువు తరువాత, వ్యాస రాయల కవికి ఒసగిన ఆ దత్త సీమ పైన ను తన పాలనాధికారములను నిషేధించుకుని
తిరిగి వ్యాసరాయలుకు ఇచ్చివేసారు.
పాప పరిహారార్ధమై 378 దేవతా విగ్రహాలను ప్రతిష్ఠ చేసారు.
వ్యాసరాయలు అక్కడ హనుమంతుని కోవెలను నిర్మించాడు.
ఇక్కడ రెండు వైపులశ్రీ ఆంజనేయస్వామికి శంఖ, చక్రములు ఉన్నాయి.
"హనుమంతుల వారిని దర్శించుకోవడనికి వచ్చేమొట్ట మొదటి వ్యక్తియే పూజారిగా ఉండాలని"వాక్కు పలికాడు.
"బీసన్న"అనే బోయ పిల్ల వాడు ప్రప్రధమంగా స్వామి వద్దకు వచ్చి, సాష్టాంగ నమస్కారము చేసాడు.
ఆనాటినుండీ,"బీచు పల్లి"గా పేరొందిన హనుమత్ క్షేత్రానికి,
వ్యాసరాయలు అభీష్టము ప్రకారము,
నెలకొల్పబడిన ఆ సంప్రదాయము నేటికినీ అవిచ్చన్నముగా పాటించబడుచున్నది.
************************************************************************************************** http://astroyogas.wikidot.com/
Kuhu Yoga ====== The lord of the 4th house is in the 6th, 8th or 12th house (Phala Deepika 6/61). Result : The person will be bereft of mother, conveyances, friends, happiness, ornaments, relations. The person will be unemployed and without a place of living having lost the one owned by him/her associating with low people of the opposite sex.


Telusaa! - రాయలు-కుహూ యోగం -
By kadambari piduri, Aug 3 2009 11:34PM

16, సెప్టెంబర్ 2009, బుధవారం

గాన సరస్వతి ఆమె


నేడు సంగీత సామ్రాజ్ఞి సుబ్బులక్ష్మి M.S. సుబ్బు లక్ష్మి జయంతి.
ఇది కర్ణాటక సంగీతము మాధు మాధుర్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన ఆమె గాత్ర మాధుర్యానికి పుట్టిన రోజు.
సుబ్బు లక్ష్మి - 1916 సెప్టెంబరు ,16 వ తేదీ ,జన్మించారు.
గాన కోకిల M . S . సుబ్బు లక్ష్మి గాత్రము ఎల్లరికీ సుపరిచితమే !
"నా భర్త సదాశివం ప్రోత్సాహము వలన నేను ఇంత కీర్తి శిఖరాలను అధిరోహించగలిగాను." అని ఆమె కృతజ్ఞతతో చెప్పేది."తోటి పిల్లలతో ఆడుకుంటూ ఉన్నాను. అప్పుడు మా అమ్మ నన్ను పిలిచింది.పాట పాడమనిఅన్నది. ఒక పాట పాడాను. అప్పుడు చప్పట్లు మారుమ్రోగాయి. ఐతే, నాకు అవేవీ బోధపరచుకొనని వయసు. పాట పాడటము అయిపోగానే మళ్ళీ స్కూలు పిల్లలతో మట్టిలో ఆడుకుంటూ కూర్చున్నాను." అని బాల్య స్మృతులను మననం చేసుకున్నది, ఆ నైటింగేల్ ఆఫ్ కర్ణాటక సంగీతం ".
* ఆమె సమకాలీనురాలైన, భారత కోకిల బిరుదాంకితురాలైన సరోజినీ నాయుడు ఉవాచ
"From today, I surrender to Subbulakshmi, the enchanting singer with an enchanting voice, my tittle The Nightingale of India".
* మహాత్మా గాంధీజీ ఆమె సంగీత మాధుర్యాన్ని ఇలా ప్రశంసించారు "I would rather hear the words of the bhajan spoken by Subbulakshmi than sung by any one else.".
జాతి పితకు ఇష్టమైన "వైష్ణవ జనతో తేన కహి ..." , మీరా భజనలు ఆమె గళములో ప్రాణం పోసుకుని, ప్రజా బాహుళ్యములో ప్రాచుర్యాన్ని పొందాయి.
* జవహర్ లాల్ నెహ్రూ ఇలా పలికారు "Who am I before this melody Queen? A mere Prime Minister. And what right have I, or any one else, to speak when she is there to sing."
By kadambari piduri, Sep 15 2009 9:45AM

ఆక్స్ ఫర్డు యూనివర్సిటీలో "సంస్కృత సాహిత్యము"

John Clay, Sanskrit Literature :
_________________________

న్యూయార్కులో
"Clay Sanskrit Library " నిర్మాత
ఒక ఆంగ్లేయుడు. జాన్ క్లే , తన భార్య జెన్నిఫర్ తో కలిసి చేసిన అవిరళకృషికి ప్రతిబింబము.
1934 లో న్యూజెర్సీ వద్ద ఉన్న పీటర్ సన్ లో క్లే జన్మించాడు.
1950 లో ఆక్స్ ఫర్డు యూనివర్సిటీలో "సంస్కృత ప్రాచీన సాహిత్యము"ను అధ్యయనం చేసాడు.
కొన్నాళ్ళు "గ్లోబల్ ఇన్విస్టుమెంట్సు బ్యాంకింగు"లో మెలగాడు.
కానీ, తన అంతరాళాలలోని సంస్కృత భాషా మమకారము అతనిని మళ్ళీ జీవితాశయ మార్గమునకే నడిపించింది.
***దేవ భాషా మహోద్గ్రంధాలను 1965 నుండీ 2004 వఱకు నిరంతర దీక్షా దక్షతతో, ఇంగ్లీషు లోనికి అనువదించాడు.
Loeb Classical Library నెలకొల్పిన John Clay మహాశయుడు New York University press ద్వారా 46 వాల్యూములను వెలువరించాడు .స్వదేశీయులే శీత కన్ను వేస్తూన్న "సంస్కృత సాహిత్య విలువలను " గుర్తించిన పాశ్చాత్య మేధావులు గుర్తించి గౌరవిస్తూన్నారు కదా! మన అపార ప్రాచీన సాహితీ నిధుల విలువలను ,అగణిత కావ్యముల ప్రామాణికతల ఘన కీర్తిని గుర్తించ దలుచుకోని నేటి తరం వారి గురించి ఏమని చెప్ప గలము !?!

By kadambari piduri

15, సెప్టెంబర్ 2009, మంగళవారం

' చంద మామ ' చక్రపాణి కదా!

చక్రపాణి కదా! చక్ర పాణి , నాగి రెడ్డి (విజయ వాహినీ బ్యానరులో,(డిస్ట్రిబ్యూటర్లు) నిర్మించి, 1957 న విడుదల చేసిన "మాయా బజార్ " సినిమా అత్యద్భుత విజయం సాధించినది.బి.ఎన్.రెడ్డి ,చక్రపాణి ల జంట నిర్మించిన కొన్ని సినిమాలు బాక్సాఫీసు దగ్గర బోల్తా పడ్డాయి కూడా !.అయితే చక్ర పాణి ఆ అపజయాలను కూడా, 'జీవితంలో ఒక భాగంగానే గ్రహించే వారు. 'విధి లీలలు' అనే భావనతో, స్పోర్టివ్ గానే తీసుకునేవారు.వారం రోజులలోనే, ఫిల్ము రీళ్ళ డబ్బాలను వెనక్కు వచ్చేసిన ప్పుడు,చక్రపాణి వాల్ పోస్టర్ లను ,తిరిగి కొత్త వాటిని ముద్రింపించి, గోడల మీదకు కులాసాగా వదిలారు.ఆ గోడ బొమ్మలలో ఇలా రాసి ఉన్నవి 'సరి కొత్త - డైలాగులు కాని డైలాగులు!'ఆ ట్యాగ్ లు ఇలాగ ............. "నూరు రోజులు ఆడిన చలన చిత్రము 93 రోజుల క్రిందట విడుదల అయి ఉంటే! " మొదటి వాక్యము బోల్డు లెటర్సులో, పెద్దవిగానూ, ఆ'93 రోజులు...." అనే సెంటెన్సు ,(నూర్రోజులు .. )క్రిందనే, చిన్న అక్షరాలతో రాయించారు. ఓటమిని కూడా హాస్య స్ఫూర్తితో గై కొన్న ధీరోదాత్తుడు ఆయన.

By kadambari piduri

14, సెప్టెంబర్ 2009, సోమవారం

కల కలము రేపిన వారి బంధము

ఛాన్సు ఇవ్వకుండానే..! ::::::
పార్లమెంటు ఉభయ సభలలో వాదోపవాదాలు , వాడిగా- వేడిగా సాగుతూండేవి.నియంత" గా ప్రసిద్ధి కెక్కిన రష్యా దేశ నేత స్టాలిన్ .ఆ నిరంకుశ నాయకుని కుమార్తె స్వెత్లానా ( Stalin’s daughter Svetlana ) ఆమె ఒక భారతీయుని ప్రేమించి, పెళ్ళి చేసుకున్నది. ఆ ప్రేమ వివాహము సహజంగానే, రష్యాలో స్వకుటుంబీకుల నుండి వ్యతిరేకత ఎదురైనది.అందుచేత ఆ ప్రేమ జంటకు మన దేశములో "రాజకీయ ఆశ్రయము ( asylum ) లభించినది".ఈ విషయములో, డాక్టర్ రామ మనోహర్ లోహియా , వారిరువురికీ( Dr. Ram Manohar Lohia ) ఎంతో చేయూతను ఇచ్చారు.రష్యా తో మన దేశమునకు గల రాజకీయ స్నేహము వలన స్వెత్లానా పరిణయమును సపోర్టు చేసే వారు, వ్యతిరేకించేవారు ఉండే వారు.ఉభయ సభలలో దీనిపై వివాదాలు చెల రేగేవి.
లోహియా తో , తారకేశ్వరి వాగ్యుద్ధం చేయ సాగినది."పెళ్ళి పెటాకులూ తెలియని రామ మనోహరు లోహియా గారికి పరిణయము , దానికి సంబంధించిన సమస్యలు ఎలా అర్ధమౌతాయి."
ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా ,వెంఠనే లోహియా అనేసారు ఇలా,
"తారకేశ్వరీజీ! మీరేమైనా నాకు (ప్రణయము - పరిణయము )నాకు అలాంటి ఛాన్సును ఎప్పుడూ ఇవ్వనే లేదు కదా!?!"లోక్‌సభ యావత్తు నవ్వుల సందడే సందడి .
By ; By kadambari piduri, ) ___________________________________________________

రష్యన్ నేత స్టాలిన్ నిరంకుశుడూ ,కర్కశుడు - అని పేరు పడ్డాడు.స్టాలిన్ కుమార్తె అల్లిలూయా స్వెత్లానా ట్రాన్స్ లేటరు వృత్తిని చేపట్టినది.

1965 లో భారతీయుడైన "బ్రజేష్ సింగు తో పరిచయం ఏర్పడినది.

బ్లాక్ సీ వద్ద ఉన్న "సోచి "వద్ద వారి స్నేహము అనుబంధముగా మారినది.తరువాత వ్రజేష్ అనారోగ్యముతో మరణించాడు. ఆతని చివరి కోరిక ,' పవిత్ర గంగా నదీ జలాలలో ఆతని చితా భస్మాన్ని కలుపుటకై , ఆమె ఎంతో శ్రమించినది.
ఏప్రిల్ 16వ తేదీ 1967 లో ,అష్ట కష్టాలు పడి , భారత దేశమునకు వచ్చినది. వ్రజేష్ సింగు అస్థికలను , చిత భస్మాన్నీ , పావన నదీ వాహినిలో కలిపినది.ఆమెకు రాజకీయ ఆశ్రయము మన దేశములో లభించ లేదు.అమెరికా , యూరపు మున్నగు దేశములను స్వెత్లానా తిరుగుతూ , ఎన్నో ఇడుములకు లో నైనది. - కష్టాలకు ఎదురీది ,నిలిచిన ధీర వనిత ఆమె.రష్యాతో ఇండియా స్నేహము భంగమౌతుందనే భీతితో అప్పటి ఇండియా గవర్నమెంటు ,ఆమెకు పొలిటికల్ అస్సైలం ను ఇవ్వడానికి నరాకరించినది. సామాజిక పరిస్థితులే కాదు , దేశాల రాజకీయ పరిస్థితులు కూడా , మనుష్యుల వివాహ సంబంధాలపై తీవ్రంగా ప్రభావం చేసి, ఫలితాలను నిర్ణయిస్తాయనడానికి , స్వెత్లానా జీవిత చరిత్రయే సాక్ష్యము .

__________________________________________________________________________________

10, సెప్టెంబర్ 2009, గురువారం

ధర్మ సూత్రములు - హ్యూయన్ సాంగు


ఈ ఫొటోలో -( చైనాలోని ) అద్భుతమైన బుద్ధ విగ్రహము ; ;

స్వర్ణ యుగము అది. చైనా నుండి ,మన హిందూ దేశానికి వచ్చాడు ఒక వ్యక్తి. గుప్తుల కాలంలో భారత దేశంలో పర్యటించిన ఆ బౌద్ధ బిక్షువు పేరు "హ్యూయన్ సాంగు". శాక్యముని బోధనల సారాంశాన్నీ , సంస్కృత నిఘంటువులతో, తన సీమను ,సాంస్కృతిక సంపదతో విలసిల్లేటట్లుగా చేసిన హ్యూయన్ సాంగ్ ,మన ఆంధ్ర దేశాన్ని కూడా సందర్శించాడు.ఆతని రచనలు అప్పటి భౌగోళిక స్వరూపము, ప్రదేశాలకు ఉన్న నామములు తెలిపే చారిత్రక ఆధారములు - ఆయన రచనలు.
ఎన్నో శ్రమ దమాదులకు ఓర్చి,మన "ఇండియా"కు వచ్చి, బుద్ధుని ధర్మ బోధనలతో మరలి వెళ్ళిన - బౌద్ధ ముని హ్యూయన్ సాంగ్ ను గురించిన - ఈ ఇంగ్లీషు నాటకమును(వీడియో) చూడండి.
విద్యార్ధులు , పిల్లలు ప్రదర్శించేందుకు అనువుగా ఉన్నది ఈ "సంగీత రూపకము". "ఓ ఎంపరర్!" , మున్నగు చోట్ల , ఆ ఉచ్ఛారణను, ప్రొనౌన్సేషన్ లలోని అందాలను గమనించండి.
***************************************************************************************************************

http://www.historyforkids.org/learn/china/religion/gods.htm

http://www.dharmabliss.org/songs/3cart-main.html

----------------------------------------------------------


HSUAN TSANG SONG

______

Tang Hsuan-Tsang and his helpers, they

Endured the hardships of the great highway

Doin' what others could not do

Through heat and cold and monsters, they

Just continued on their way

To bring the Sutras home for me and you.
The Sutras are a bubbling spring

A guideline and a road

They tally with the Buddha's mind above

And with living beings below
Thinking on, Tang Hsuan-Tang

Crossin' the desert sands

Bringing back the Buddha's law

For us to read and understand

Thinking on his journey long

To India and back again

How can we fail to study them?
The Sutras are a bubbling spring

A guideline and a road

They tally with the Buddha's mind above

And with living beings below
Thinking on, Tang Hsuan-Tang

Crossin' the desert sands

Bringing back the Buddha's law

For us to read and understand

Thinking on his journey long

To India and back again

How can we fail to study them?

-------------------------------------------------
OH EMPEROR!

_____________
Emperor, do not be concerned for me.

All of us, must fulfill our destiny.

I will return, you have my word, just wait and see.

When the branches of the pine tree turn to the east.
Oh Emperor, I have one small word of advice.

If you would be obeyed you must be reasonable and nice.

Set a good example, others will follow you of course.

For authority rests on reason, not on force.
Oh Emperor, do not be concerned for me.

All of us must fulfill our destiny.

He will return, you have his word, just wait and see.

When the branches of the pine tree turn to the east.
Oh Emperor, Oh Emperor

I will return, you have my word, just wait and see.

When the branches of the pine tree turn to the east

When the branches of the pine tree turn to the east.

-----------------------------------------------------------
MONKEY SONG

_____________
I'm just a simple monkey

Trapped by circumstances

Into a life of crime and trickery

Won't you just give me one more chance

To show you how reliable this monkey can be
I made a lot of trouble

Through diminished capacity

But I've been rehabilitated

A future sage I'll be
The monkey you

Is not the monkey you once knew

I've recognized what's before my eyes

Now let me start anew.

---------------------------------------------------------

THE HERMIT

___________
Don't think that bein' a hermit is a life of ease

Don't think if you're a hermit, you can do just what you please

Though it may look like a piece of cake to you

By doin' nothing you can blow it, too

Don't think that bein' a hermit is a life of ease
Gees I guess I blew it, forgot to set me my alarm

Gees I guess I knew it, Shakyamuni Buddha's come and gone

I missed the whole show, now what's to be done?

Time sure flies when your're havin' fun

Don't think that bein' a hermit is a life of ease
Though it may look like a piece of cake to you

By doin' nothin' you can blow it, too

Don't think that being a hermit is a life of ease

------------------------------------------------------------
conGRATULATIONS
______

congratulations on a job well done

Congratulations to the monk, Hsuan Tsang

Now the Buddha's Dharma has come to the land of Tang

Great our happiness

Great our joy

And great our gratitude to you
Congratulations, you have brought the Dharma's light

To shine forever, making all things bright

Now the Buddha Dharma's here, true wisdom is in sight

Great our happiness

Great our joy

And great our gratitude to you ;


Congratulations, on this very special day

Your gift of kindness we never can repay

Now the Buddha Dharma's here,

It's such a happy day.

Great our happiness

Great our joy

And great our gratitude to you.

------------------------------------------------
TAKE BACK YOUR CARTS
______________________

Take back your carts

I don't need them anymore

Now I'm awake

I know just what I came here for

I have awakened I fulfill my destiny

Take back your carts

Bring out the books and let's begin.
I blew it once

I just spaced out I guess

I blew it twice

When I got the wrong address

I tell you now I will not blow it once again

Take back your carts

Bring out the books and let's begin
Take back your carts

Your wine, your women and your meat

I'll trade them in for a Sanskrit dictionary

I've awakened I fulfill my destiny

Take back your carts

Bring out the books and let's begin
---------------------------------------
{{{ Story of a Buddhist monk who walked from China to India to get the Buddhist sutras (scriptures) to China. Lyrics are below: HSUAN TSANG SONG Tang Hsuan-Tsang and his helpers

Three Cart Patriarch - Buddhist musical play

veoh.com - Story }}}

8, సెప్టెంబర్ 2009, మంగళవారం

చక చకా వస్త్రాలంకరణ

( magic show dress change ) :::::
డ్యాన్సు బేబీ డ్యాన్స్ "అంటూ రక రకాల ప్రోగ్రాములు బుల్లి తెరపైన అవతరించి, ప్రేక్షక లోకాన్ని ఆనందింప జేస్తున్నాయి.ఇలాంటి కార్య క్రమాలకు , "ఆహార్యం" = అంటే -ఆహారము"అని కాదండోయ్!దుస్తులు ,ఆభరణాలూ వగైరాలతో , కను విందు చేసే మేకప్పు అన్న మాట!ఒక ప్రదర్శనలో , ఒక అమ్మణ్ణి చులాగ్గా , సెకండుకు ఒక వస్త్రాలంకరణ చొప్పున మార్చి , చూపించింంది.ఆమె చిందులు కూడా - నాట్యం వలె , తోచేటట్లుగా అలరించినది అందరినీ!ఆ ప్రదర్శన "గిన్నీస్ బుక్ రికార్డులకు" విజయ వంతంగా ఎక్కడంతో ,నేపాలీ గ్రూపు వారి ద్వారా - అత్యద్భుత విన్యాసాలను నిర్ణీత సమయంలో , పూర్తి చేసిన ఆ యువతి నయనములలో 'ఆనంద బాష్పముల విలువ కొలవ తరమా !?
{ పైన "చక చకా వస్త్రాలంకరణ " హెడింగు-వద్ద క్లిక్ చేస్తే , లింకులోని వీడియోను చూడండి . }

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...