26, ఏప్రిల్ 2009, ఆదివారం

కవితా కన్య

కవితా కన్య ;;;;
''''''''''

"నైవ వ్యాకరణజ్ఞ మేతి పితరం,న భ్రాతరం తార్కికం ;
దూరాత్ సంకుచితేవ గచ్ఛతి పునశ్శుండాలత్ ఛాందసాత్;
మీమాంసా నిపుణం నపుంసక ఇతి జ్ఞాత్వా నిరస్యాదరాత్ ;
కావ్యాలంకరణజ్ఞ మేవ కవితా కన్యా వృణీతే స్వయం."


తాత్పర్యము:::::: 
'''''''''''''

"కవిత" అనే కన్యకు వ్యాకరణ వేత్త తండ్రి వంటి వాడు;
కనుక, అతనిని ఆమె అభిలషించదు.
తార్కికుడు సోదరసమానుడు,కావున ఆతనిని అంగీకరించదు.
ఛాందసుడు(=వేదవేత్త)నుంచి,ఏనుగు నుండి వైదొలగి నట్లుగా,
తప్పుకొని పోతుంది.
మీమాంసానిపుణుడు"నపుంసకుని"బోటివాడని తెలుసుకున్నదై,
ఆతని నుండిన్నీ,అనాదరణతో,తొలగును.

"కావ్యాలంకరణ వేత్త"నుమాత్రమే 
"కవితా కన్యక" స్వయముగానే వరిస్తుంది."
'''''''''''''''''''''''''''''''''' 

ఈ శ్లోకముపైన నా అభిప్రాయము ;;;;; ''''''''''''''''''''''''''' ఇది ప్రాచీనోక్త శ్లోకము. ఈ భావముతో.......
ఈ "బ్లాగిత్రి" ఏకీభవించుట లేదు. మనము నిత్యమూ మాట్లాడే భాష ,వాక్య నిర్మాణములో అంతర్లీనముగా వ్యాకరణము ఒనగూడే ఉంటుంది. అలాగే,ఇతరులతో సంభాషించేటప్పుడు పరిస్థితులను,సమకాలీన రాజకీయ,సంఘ,ప్రజా జీవనాది అనేక అంశాలను మనకు తెలీకుండానే సమన్వయ పరచుకుంటూ,మసలుతాము;మరి తర్క మీమాంసాది అంశాలు ప్రభావితం చేస్తూన్నాయని అంగీకరించ వలసినదే కదా! ఛందో శృంఖలాలను నేటి కవిత్వం త్రెంచి,నడుస్తూన్నదా? కానే కాదు; గమనించండి,అనేకులు,ప్రాసకు,ముఖ్యంగా అంత్యానుప్రాసకూ ప్రాముఖ్యతను ఇస్తూనే ఉన్నారు:అందు మూలంగా ,అనుకోకుండానే ఒక లయ,ఒక తూగు కవితా,కావ్యాలకు కలుగుతున్నాయి. కొన్ని వేల సంవత్స్రాల సాహిత్య కృషి అనంతరమే.......... తమకు ముందు ఉన్న కావ్యాలను పరిశీలించిన మేధావులు,"పిండిత మధు సారమును" క్రోడీకరించి,"లక్షణ గ్రంధములుగానూ, అలంకార శాస్త్రాలుగానూ" వెలువరించరు. అలాగే,ఈ నాటి కవిత్వములోని అంతర్లీనముగా ఉన్న "ఛందస్సును"గురించి పరిశీలనా గ్రంధాలు అతి త్వరలోనే,సమీప భవిష్యత్తులో ,భాషా శాస్త్ర్ వేత్తల నుండీ,భాషాభిమానుల నుండీ గ్రంధరూపమున లోకానికి అందుతాయని, "నేను "నమ్ముతున్నాను.
''''''''

1 కామెంట్‌:

రానారె చెప్పారు...

ఐతే రసపట్టులో తర్కమే కాదు వ్యాకరణ ఛాందస మీమాంసలూ కూడవన్నమాట. :-)

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...