27, జూన్ 2009, శనివారం

కాటుక తయారు చేయుట


కాటుక చేసే విధానం
By kadambari piduri,

కావలసిన వస్తువులు
==============
పత్తి వత్తి(పురి పెట్టకుండా)వట్టి దూదిని ; లావుగా అరచేతిలో పరచుకునాలి.
దీనిలో ,కరక్కాయ పొడిని చల్లి,ముడిచి ,అరచేతుల్తో మళ్ళీ మలుస్తూ
" ఉండ వత్తి"లా లావుగా తయారించాలి.
కరక్కాయ పొడి(పైన చెప్పినదే!)
ముద్ద
కర్పూరము (లేదా/మంచి గంధమును,
గంధపు చెక్కను సాన రాయి మీద అరగ దీస్తూ,తయారించుకోవాలి.)
వెడల్పు ఇత్తడి పళ్ళెము; వంటాముదము;ప్రమిదలు;
ఆవు; నెయ్యి/లేక - వెన్న;
ధారాళంగా;
నీళ్ళూ(భాగ్య నగరము; మున్నగు చోట్ల నివసించే వారికి
ఈ అంశాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సి ఉంటుంది కదా!)
1)ముద్ద కర్పూరముతో కాటుక తయారీని ముందుగా తెలుసు కుందాము.
ముందస్తుగా వత్తిని , మంచి ఆముదములో
కాస్సేపు నాన బెట్టి ఉంచుకోవాలి.
2)ఒక గుంట గరిటెను కాస్త 'వాల్చినట్లుగా,
ప్రమిదకు బాగా దగ్గరగా బోర్లించి పట్టుకోవాలి.
3)కర్పూరమును వెలిగించాలి.
5) అప్పుడు గుంట గరిటలోనికి "కప్పురపు మసి"ఏర్పడుతుంది.
"తాటాకు రేకులతో " ఆ కాటుక మసిని ,గీకి తీయాలి.
6)ఆ మసిని రాగి పళ్ళెమునూ (ఐతే శ్రేస్ఠము . కానిచో ఇత్తడి/ కంచు పళ్ళెములను బోర్లించి పెట్టి,నూరాలి.)
ఆవు నేతితో గానీ, వెన్నతో కానీ ,
ఆముదమును gaanii
(బొట్లు; బొట్లుగా )వేసి,నూరుతూండాలి.
8)నూరి,ముద్దగా ఏర్పడేటప్పుడు,
ధారగా నీళ్ళు పోస్తూండాలి.
ఇలాగ బిందేడు నీళ్ళు పోయాలి.
9)రెడీ ఐన 'కాటుక'ను, రాగి భరిణలలోనికి తీసి జాగ్రత్త చేసు కోవాలి.

2 వ్యాఖ్యలు:

రామ చెప్పారు...

తరతరాల నుంచి సంప్రదాయంగా వస్తున్న కాటుక తయారీని చక్కగా భావితరాల కోసం "బ్లాగస్థం" చేసారు. చాలా కృతఙ్ఞతలు. చిన్నప్పుడు ఒకసారి మా అమ్మమ్మగారు కాటుక తయారుచేస్తుండగా చూసిన గుర్తు. మళ్ళీ మీ బ్లాగ్లో చదివి అది అంతా గుర్తువచ్చింది (ముఖ్యంగా మసిని తాటాకు తో గీసి తీయడం).

Anil Piduri చెప్పారు...

Thank you!
mana pUrvIkulaku telisina ennO chitkaalu,gurtu chEsukOvaDamulO,eMtO saMtOshaM uMTuMdi kadaMDI!

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...