
Pramukhula Haasyam
నీ తల మాసిందయ్యా!
By kadambari piduri,
మల్లవరపు విశ్వేశ్వర రావు "మధు కీల" అనే తన పద్య కావ్యాన్నిప్రచురించారు.
ఆ పుస్తకానికి ముందుమాటను దేవులపల్లి రాసారు.
"విశ్వేశ్వర రావూ!
నీ రచనలన్నీ పుస్తక రూపంలో రావాలయ్యా!
నువ్వు కవివయ్యా!
ఎవ్వరితోటీ ఇట్లా అనను
విశ్వేశ్వర రావు నిజంగా కవి!"
********************************************
దీనికి ప్రఖ్యాత పేరడీ కవి జరుక్ శాస్త్రి (జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి) ఇలాగ రాసేసారు.
"సుబ్బారావూ!
నువ్వింక క్షవరం చేయించు కోవాలయ్యా!
నీ తల మాసిందయ్యా!
నేను ఎవ్వరి తోటీ ఇట్లా అనను-
సుబ్బారావు తలకు మాసిన వాడు అని"
++++++++++++++++++++++++++++++++++++++++++++
1 కామెంట్:
సంధర్భోచితంగా జరుక్ గారు చేసిన హాస్యం చాలా బాగుంది. మీ సేకరణను నేను మనసారా అభినందిస్తున్నను.
కామెంట్‌ను పోస్ట్ చేయండి