ఔరా!ఈ గిజిగాడు !
By kadambari piduri,
అటు ఎగిరీ,ఇటు ఎగిరీ,
నటనాల నీడలతో
పైరు పంటలపైన,
పుడమిపైన
రంగవల్లులల్లేను
బంగారు పిచ్చుక //
ఉడ్డీనాల చిత్రాలను
గాలి తెరలపై వ్రాయును
తొలి పొద్దుల నిగ్గులను
తన కంటిలోన దాచేను //
గాలి తెరలపై వ్రాయును
తొలి పొద్దుల నిగ్గులను
తన కంటిలోన దాచేను //
చిన్ని రెక్కలను చాచి
తప తపలు ఆడిస్తు
మబ్బు ఱెక్కలతోటి
పోటీ పడు 'వస్తాదు'!
ఔరా!ఈ గిజిగాడు
నింగినే గేలి సేయు//
మెరుపు దారాలన్ని
ఏరేరి ఇంచక్క
చిన్నారి గూడులను
కొమ్మలలొ అల్లు కొనును //
అల్లికలొ నేర్పరి
మెలకువల గడసరి
గిజి గాడి గూడుకి
చిన్ని కొమ్మలలోన
చిటికెడంత చోటు
చాలును కద తన ప్రజ్ఞకి//
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి