3, జూన్ 2009, బుధవారం

మహావీరుడు కట్ట బ్రహ్మన









Telusaa!

మహావీరుడు కట్ట బ్రహ్మన


By kadambari piduri,

కట్ట బ్రహ్మన (తమిళ నాడు) బ్రిటీషు వారిని ఎదిరించిన మహా వీరుడు. ఆతని కొలువులోఉన్న పాలెగాళ్ళు కొందరు దేశ ద్రోహులు, వీర పాండ్య కట్ట బొమ్మన్నను ఆంగ్లేయులకు పట్టివ్వడానికి కుటిల యత్నాలు చేయసాగారు. తప్పని సరియై, బొమ్మన స్వదేశాన్ని వదిలి వెళ్ళ వలసి వచ్చింది. తన ఇరువురు సోదరులతో కలిసి,మారు వేషాలలో పారి పోయాడు. మూడు రోజుల పాటు నిద్రాహారాలు లేకుండా తిరుగుతూ అలిసి పోయిన ముగ్గురికి ఒక గుడిసెలోని అవ్వ ఆతిధ్యం లభించింది. ఆమె పెట్టిన రాగి సంకటిని తిన్నారు.

మాటలలో ఆమె దీన గాధ వారికి తెలిసింది. ఆమె భర్త, ముగ్గురు పిల్లలు మాతృ దేశ రక్షణకై ప్రాణాలు అర్పించారు.

ఇంతలో, బయట దండోరా వినిపించింది. "ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారి బానర్ మన్ దొర ఉత్తర్వు! బొమ్మన సోదరులు తప్పించుకుని ఇదే పల్లెలో దాక్కుని ఉన్నట్లు తెలిసింది. వారిని పట్టి ఇచ్చిన వారికి మంచి బహుమతహో."

టముకును విని, "అమ్మా!! ఆ బొమ్మనని, తమ్ముళ్ళనీ పట్టి ఇస్తే మీకు మంచి బహుమతి వస్తుంది కదా!" అన్నాడు బొమ్మన. వెంటనే ఆమె గర్జించింది. 'నా భర్త దేశం కోసం ప్రాణాలు వదిలారు కట్ట బొమ్మన నాయకుల కోసం,పిల్లలు త్యాగం చేశారు.ఆయన మా పాలిటి దేవుడు. తెలుసా?"

ఆనంద బాష్పాలతో ఆ సోదర త్రయం ఆమెకు పాదాభివందనము చేసారు. ఇంతలో సిపాయీలు తలుపు తట్టారు. ఆమె కను సైగతో బొమ్మన, తమ్ముళ్ళు అటకపై దాక్కున్నారు. ఆమె గట్టిగా అరిచింది "నేను తలుపు తీస్తే, అమ్మ వారి గాలి సోకి మన్ను కరుస్తారు మీరు. జాగ్రత్త! కాదూ కూడదూ తియ్యాల్సిందేనంటే తలుపులు తీస్తాను" ఆ అవ్వ గదమాయింపులకు ఝడుసుకుని భటులు పరుగు లంకించుకున్నారు.

వీర వనిత అలా
ఆ దేశ భక్తులను తన శాయ శక్తులా కాపాడింది.
ఇట్టి ధీర గాధలు ప్రజలలో
దేశ భక్తిని ఇనుమడింప జేస్తాయి.







5 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

తమిళ సింగం వేలుపిళ్ళై ప్రభాకరన్ కూడా కట్ట బ్రహ్మన అభిమానే. ప్రభాకరన్ భగత్ సింగ్, కట్ట బ్రహ్మన ఇద్దరినీ అభిమానించేవాడు.

amma odi చెప్పారు...

స్ఫూర్తిని కలగజేసే ఇలాంటి సంఘటనలు గురించి ఎవ్వరూ వ్రాయటం లేదు. వ్రాసినందుకు మీకు కృతజ్ఞతలు.

jayachandra చెప్పారు...

మీ బ్లాగు చాలా బావుందండి. చాలా ఉపయోగకరమైనవి వ్రాస్తున్నారు. All the best.

Anil Piduri చెప్పారు...

Thank you,jaya chandra gaarU!

Anil Piduri చెప్పారు...

prabhakaran kanu marugu ayi poyyaaru.oka dESa bhaktuni chaaritraka gaathagaa,maruvalEnidi,aayana gaatha.

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...