13, మార్చి 2011, ఆదివారం

టక్కు టిక్కు చమకుల బండిజమ్మల మడుగు మాధవ రామ శర్మ* సంస్కృత అధ్యాపకులు.
నాగార్జున యూనివర్సిటీలో M.A. students కి క్లాసులో
సంస్కృత పాఠాలను చెబుతున్నారు .
ఒక రోజుక్లాసులో lessons చెబుతున్నారు.
పక్కనే రోడ్డు మీద వెళుతూన్న
కార్లు, వాహనాల హారన్ మోతల హోరు
"గయ్ గయ్"న వినిపిస్తూన్నాయి.
ఆ హారన్ మోతల గోలతో అందరికీ విసుగు వచ్చింది.
జమ్మల మడుగు మాధవరామ శర్మ గారు
" ఏమిటా కారు కూతలు?**"అంటూ
విసుగెత్తి, పుస్తకం మూసేసారు.
[Car+కూతలు ]
అలా bookని మూసి పెడ్తూండగా,
కొన్ని కాగితాలు కింద పడ్డాయి. ఆ అధ్యాపకుడు
"ఇవి ప్రేమ లేఖలు(*1) మాత్రం కావు"
అన్నారు.
అనువాద ఆంధ్ర చిత్రం "ప్రేమ లేఖలు" వచ్చింది.అప్పట్లో "ఆహ్"అనే హిందీ సినిమాకు
"ఏకాంతము, సాయంత్రము"అనే పాట -
రాజ్ కపూర్, నర్గీస్ లు
నటించిన
"ఆహ్"అనే movieలోనిదే!

[* గండికోట కడప జిల్లాలో ఉన్న దుర్గము(Fort).
ఈ చారిత్రక కట్టడములో
" మాధవ రాయ , రంగనాథ స్వామి మొదలైన Temples"ఉన్నవి.
తల్లి దండ్రులు ఆ పేరును పెట్టి ఉంటారు]


ఇలాటిదే మరో చెణుకు, సారీ! చమత్కారము.
"చెణుకులు"
ఎదుటి వారి మాటకు టక్కున
చిట్టి వ్యంగ్యంతో విసిరే వాగ్బాణము - అన్న మాట.
చమత్కారము, మామూలుగా సంభాషణలలో,
స్వగతంలో గానీ దొర్లే హాస్యపు పుప్పొడి జల్లు.
ఆచార్య బేతవోలు రామబ్రహ్మం కవి, రచయిత.
ఆయన అవధానములు చేయడంలో కూడా ప్రతిభ కలిగిన మనిషి.#
అష్టావధానాలలో ఒక ఐటం "అప్రస్తుత ప్రసంగము" .
అవధానము చేస్తూన్న కావ్య రచయితను ,
ప్రస్తుతం జరుగుతూన్న సాహిత్య పాండిత్యానికి
సంబంధము లేనటువంటి ప్రశ్నను పృచ్ఛకుడు అడుగుతాడు.
అంటే పిచ్చాపాటీలో దొర్లే తమాషా కబుర్ల లాంటి వాటిని సంధిస్తూ,
ప్రశ్నలతో అవధాని ఏకాగ్రతకు భంగం కలిగిస్తూ,
ఆతనిని విసిగిస్తాడన్న మాట.
ఇలాగే ఒక పృచ్ఛకుడు రామ బ్రహ్మం గారిని,
" అప్రస్తుత ప్రసంగ విభాగం"లో సారస్వత ప్రసంగాలను మధ్యలో కెలికాడు.
"అవధాని గారూ! మీకు కాఫీ ఇష్టమా? టీ ఇష్టమా?"
ఇదీ ఆ Question.
బేతవోలు రామ బ్రహ్మం అధ్యాపక వృత్తిలో ఉన్నారు.
Teacher ఐన ఆయన ఠక్కున చెప్పారు ఇలాగ
" మనం టీచర్లం కదండీ!"
ఈ రీతిగా ఉండేవి
ఆనాటి సాహితీ వ్యాసంగాలతో
ఆంధ్ర దేశంలో సామాన్య ప్రజలు కూడా
మేధస్సును చురుకుదనం నింపే కాలక్షేపాలతో
వాతావరణం కులాసాగా, ఉల్లాసంగా ఉండేది.
నేడు, పత్రికలలో శీర్షికలను, పెట్టేటప్పుడు, శ్లేష్లతో,
కాస్త వ్యంగ్యం మిళాయించి
headings ను పెడ్తున్నారు.
ఈ పద్ధతికి పునాది వేసినవి నాటి
Telugu Literature చమత్కార ప్రయోగాలే కదా !

&&&&&&&&&&&&&&&&&&

"తెలుగు"లో ఆలోచిస్తూ, ఇంగ్లీషు టైపింగులో -
అప్పుడప్పుడూ, అక్షర తప్పులు - పడుతూంటాయి.
ఇవ్వాళ " వద్యార్ధులు" - అని వచ్చింది ,
చూసి, వెంటనే సరి దిద్దాననుకోండి.
ఇలాటి అప్పు తచ్చులు- కు ఆద్యులు ,
ముళ్ళపూడి వెంకట రమణ గారు .
ఆయన దారి చూపించారు,
తదుపరులు ఆ మార్గంలో నడవ యత్నించే బాటసారులు;
కీర్తి శేషులు ము.వె.ర. కు కృతజ్ఞతాంజలి.
[*1 [ఇప్పటి స్టూడెంట్సు ఐతే ఆ కూతకు -
ఇంకొక చమక్కును విసిరే వాళ్ళే!
అప్పటి బుద్ధిమంతులైన విద్యార్ధులు ఉన్న రోజులు,
కాబట్టి దీనికి దీటైన ప్రత్యుత్తరం రాలేదు- అని అనుకుంటున్నాను.]
[** "కారు కూతలు కూయబోకుమురోరి...... "
అంటూ ఘటోత్కచుడు ఏదో సినిమాలో "పద్య సంభాషణతో"తిట్టాడు]

2 కామెంట్‌లు:

Rajendra Devarapalli చెప్పారు...

అయ్యా/అమ్మా,
మీరు పేర్కొన్నట్లు ఆయన పేరు జమ్మల మడుగు మాధవ రామ శర్మ కాదు జమ్మలమడక మాధవ రామశర్మ.ఆయన పనిచేసింది ప్రతిష్టాత్మక ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో.ప్రేమలేఖలు(రాజ్ కపూర్ సినిమా వచ్చినప్పటికి ఆచార్యనాగార్జున విశ్వవిద్యాలయం లేదు.1976లో స్థాపించారు.

kadanbari చెప్పారు...

రాజేంద్ర కుమార్ దేవరపల్లి గారూ
మీరు చెప్పింది నిజమే!
నా స్వంత ఊహతో, హిందీ సినిమాను
ఇందులో అనవసరంగా అనుసంధించాను.
నాకు ఆ పాట అంటే చాలా ఇష్టం.
దీనిని ఆరుద్ర గురించి రాసిన essayలో రాయడానికి వీలు కాక ఇక్కడ వేసిన త్యరపాటు పొర దనం,
ప్రతి అంశాన్నీ శ్రద్ధగా చదివి,
పాఠకులు ఉండటం, ముదావహం,
బ్లాగు రచయితలకు ఇది ఒక వరం లాంటిది, రచనలను మరింత బాగా మెరుగులు దిద్దే వీలు కలిగించేస్తుంది.
మీకు ధన్యవాదాలు,
ఆర్టికల్ ని సరి దిద్దే ప్రయత్నం చేస్తాను.

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...