వాడివిల్ - అనే ఇతిహాస నాటక ప్రక్రియ- వైవిధ్యత వలన అమెరికాలో, ఫ్రాన్స్, పాశ్చాత్య దేశాలలో19,20 వ శతాబ్దాలలో ప్రజల ఆదరణను పొందింది.(Vaudeville ; the early 1880s until the early 1930s.)చార్లీ చాప్లిన్ తల్లిదండ్రులు ఈ డ్రామాలలో వేసే వాళ్ళు.నాటకం, సంగీతం, సర్కస్ ఫీట్లు, చమక్కులు - ఒకటేమిటి?అన్ని రకాల ఐటమ్ స్ తో పరిపుష్టమైనదిఈ Vaudeville నాటక స్వరూపము.చిన్నఐటమ్స్ను ఎంచుకుని, హాస్యోక్తులతో, పేరడీ సాంగ్సుతో సాగేవి.కందుకూరి వీరేశ లింగము మన ఆంధ్ర దేశంలో ప్రముఖ సంఘ సంస్కర్త.ఆయన అనేక ప్రహసనాలను, వీధి నాటకాలను,ఆభాణకములనూ,సాహిత్య ప్రక్రియలన్నింటా పుంఖాను పుంఖాలుగా రచనలను వెలువరించారు.ఆధునిక సారస్వత ప్రక్రియలను రచనా రంగానికి అందించారు.ముఖ్యంగా "ప్రహసనముల రచనలో అందె వేసిన చెయ్యి ఆ మహనీయునిది.సాంఘిక సంస్కరణలను "కలం బలంతోనూ,చిత్త శుద్ధీతోనూ నిర్వహించినఅఖండ ధీమంతుడు మన - వీరేశలింగం గారు.ఇప్పుడు "ప్రజా నాట్య వేదిక, జన నాట్య మండలి" మున్నగుకొన్ని సంస్థలు ఈ మార్గాన పయనిస్తున్నాయి.చిన్న కొస మెఱుపు ;"ఒక నాటికను రాసి, ఇవ్వగలరా?" పబ్లిషర్స్ అభ్యర్ధన."ఏ నాటికైనా రాస్తాను." శ్రీ రంగం శ్రీనివాసరావు చమత్కార హామీ అది.'ఏ నాడు/ ఎప్పటికైనా/ ఏ నాటికి ఐనా ' అనే శ్లేషను రంగరించిన చెణుకు,ఈ నాటిక - రాసి ఇవ్వక పోయినా, ఈ joke పాఠక లోకానికి అంది వచ్చింది.&&&&&&&
4, మార్చి 2011, శుక్రవారం
Vaudeville ప్రక్రియ
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు
"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...
-
“భయ భంజన శర్మ” విరచితమైన “రమల రహస్యము” అనే ప్రాచీన గ్రంధమును చదువుట వీరికి(ఎక్కిరాల వేద వ్యాస, ఎక్కిరాల సోదరులు) సంభవించినది. ఈ ప్రాచీన జ్యో...
-
మన సంస్కృతాంధ్ర కవులు మాటలతోనే గాక అక్షరాలతో కూడా అందమైన ఆటలాడుకున్నారు. పద్యాలు, పదాలతో రకరకాల విన్యాసాలు చేసారు. పద్యంలో ఇంకో పద్యం, ఎటున...
-
అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి! ఆది పరాశక్తి పాలయమాం! త్రిభువనేశ్వరి! రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయమాం! ; || ; శ్రీ జగదీశ్వరి అన్న...
కామెంట్‌లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి