27, మార్చి 2011, ఆదివారం

వినోబా భావే





"వామన పండితుడు రచించిన
Sanzasloki Gita (the Gita verse by verse) ను తెచ్చి పెట్టు, విన్యా!"
ఆ పుస్తకాన్ని కొని తెచ్చి,తల్లికి ఇచ్చాడు వినోబా భావే.
1915 లలో బరోడాలో జరిగిన "భగవద్గీతా ఉపన్యాసాలు"ఆమె రోజూ వినేది.
బాల్యంలో సంఘటన వినోబా ఆలోచనలకు పునాది రాయిగా ఐనది.
ఒక రోజు - Wordsworth poemsను చదువుతున్నాడు.
"ఏం చదువుతున్నావు, విన్యా!"అమ ప్రశ్నకు బదులిచ్చాడు -
అమ్మా! నేను మంచి పుస్తకాలనే చదువుతున్నాను."

"నువ్వు మంచి పుస్తకాలే చదువుతావు
నాకు తెలుసును. ఐతే భగవద్గీతను చదువు."
పిల్లల వ్యక్తిత్వాలపై ఆమె ప్రభావము చాలా ఉన్నది.
వారు సంఘ సేవకు తమ జీవితాలను అంకితం చేసారు.
సంఘ సంస్కరణలలో మైలు రాళ్ళను నెలకొల్పిన ఘనత వారిదే!
వినోబా భావే "భూదానోద్యమము" విజయవంతమైనది.
ఆయన రూపొందించిన పద్ధతులతో,
భూసంస్కరణలు పదుగురిచేత
"శభాష్!"అంటూ మెప్పును పొందినాయి.
వినోబా భావే మరాఠీ భాషలో శ్రీమద్భగవద్గీతా సారాంశము గురించి
అగణిత ఉపన్యాసాలను ఇచ్చారు.-
రచించిన Discourses on Gita అమిత ప్రాచుర్యాన్ని పొందాయి.
అనేక భాషలలో లెక్కలేనన్ని ప్రచురణలు జరిగాయి.
ఈ పుస్తకములు పునర్ముద్రణలతో సరి కొత్త రికార్డులు వెలిసాయి.
క్విట్ ఇండియా, స్వాతంత్ర్య ఉద్యమాలలో పాల్గొన్నాడు
సబర్మతీ ఆశ్రమము వద్ద "వినోబా కుటీరము"
సాంఘిక సేవలో పాత్రను పోషించింది.
"సర్వోదయ ఉద్యమము"
ప్రజలలో నిద్రాణంగా ఉన్న సాంఘిక సేవాతత్పరతను మేల్కొలిపింది.
మన రాష్ట్రంలో "పోచంపల్లి"వద్ద నుండి
భూదానోద్యమాన్ని ప్రారంభించిన చరిత్ర పోచంపల్లి కి దక్కినది.










;;;;;;
(Acharya Vinoba Bhave. Born: 11 September, 1895. )

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...