18, మార్చి 2011, శుక్రవారం

భట్టిప్రోలు బౌద్ధ స్థూపములు , లిపి మాతృక









భట్టిప్రోలు మన తెలుగు నాట ఉన్న చిన్న గ్రామము.
గుంటూరుకు 40 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ కుగ్రామం,
క్రీస్తు పూర్వం నుండీ ఆంధ్రుల ఘన చరిత్రకు నిదర్శనము.
మెగస్తనీసు 30 ఆంధ్ర దుర్గాలను పేర్కొన్నాడు,
వానిలో విశిష్టమైనది "భట్టిప్రోలు".
భట్టి ప్రోలు లిపి ->
_________
క్రీస్తు పూర్వం 500 నుండీ రూపు దిద్దుకో సాగినది.
300 నాటికి “భట్టిప్రోలు లిపి" గా స్వరూపం దిద్దుకున్నది.
మౌర్య లిపికి , ఎదిగిన లేఖనము అనవచ్చును.
తెలుగు బాస కు భట్టిప్రోలు లిపి మాతృక - అని భావించ వచ్చును.
లలోనే ఏర్పడిన తెలుగు భాషా మూల రూపంగా
“భట్టిప్రోలు లిపి" -
Linguistics లో ఉన్నత స్థానాన్ని పొందింది.
కుబేరకుడు అనే రాజు పరిపాలన, మౌర్యుల కన్నా ముందే
తెలుగు సీమకు ప్రతిష్ఠాకరమైన చారిత్రక నాగరికత
విలసిల్లినదనడానికి బలమైన ఋజువులు.
కుబేరకుడు/ కుభీరక/ కుబేర ధనదుడు
ప్రతీపాల పురమును రాజధానిగా రాజ్య పాలన చేసాడు.
[Pratipalapura (Bhattiprolu), ]
నాటి ప్రతీపాల పురమే నేటి భట్టిప్రోలు
బ్రాహ్మీ లిపి Brahmi script విభాగములోనిది
అని చరిత్రకారుల అభిప్రాయం.

క్రిష్ణా నదీ మైదానానికీ,
బంగాళా ఖాత మహా సముద్ర తీరానికి చేరువలో ఉన్న కుగ్రామం ఇది.
గుంటూరు- రేపల్లె రైలుమార్గము వద్ద ఉన్న ప్రాంతము.
"భట్టిప్రోలు శాసనాలు"
తెలుగు లిపి యొక్క ప్రాచీనతకు ప్రత్యక్ష సాక్ష్యాలు.
బ్రిటిష్ పాలకులు మొట్ట మొదటి సారి
1870 లో భట్టిప్రోలు వద్ద తవ్వకములు జరిపారు.
అటు పిమ్మట ఆ అంగ్లేయులే వరుసగా తవ్వకములు జరిపించినారు.
[ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి, చరిత్ర పట్ల ,
మాతృ భూమి పట్ల పౌరులకు ఉండ వలసిన భక్తి శ్రద్ధలకు -
బీజము వేసిన వారు వారేనని- ఒప్పుకోవలసినదే!]












భట్టిప్రోలు వద్ద విక్రమార్క దిబ్బ - ను తవ్వగా
ఈ శిథిలాలు బయల్పడ్డాయి.
"ధాతు కరండము", స్థూపాలు మున్నగు అమూల్య సంపద ప్రత్యక్షమైనది.
1870 లో బాస్వెల్, 1871 లో సర్ వాల్టేర్ ఎలియట్,
అప్పటి నుండీ 1874 వఱకూ రాబర్ట్ సీ వెల్ ;
పిమ్మట 1892 లో అలెగ్జాండర్ రే,
అటు పిమ్మట
చాలా కాలం తర్వాత -
1984 లో బుహ్లార్, 1969 లోనూ, 1970 లలోనూ
డా. ఆర్. సుబ్రహ్మణ్యం మున్నగు వారెందరో పరిశోధనార్ధమై,
భట్టిప్రోలు పల్లె సీమ వద్ద త్రవ్వకాలు జరిపించారు.
archialogy of survey India ఆధ్వర్యంలో జరిగినవి.
"శిలా మంజూష" ఇక్కడి విశిష్ట వస్తువు.
ఈ రాతి పెట్టెలో బుద్ధుని ధాతువులు, వెండి భరిణలు,
నవ రత్నాలు, కుందన పుష్పాలు ఉన్నవి.
మహా స్థూపాలు , చైత్యము, బౌద్ధ విహారాలు ఇత్యాదుల నిర్మాణాలు -
భట్టిప్రోలులో విభిన్నంగా ఉండి,విశిష్టతను కలిగి ఉన్నాయి.
8 అడుగుల ప్రదక్షిణా పథము,
దారి సువిశాలంగా ఉన్నది.
స్థూపము :-
1. పద్మ దళాకారంలో ,
2. 1700 చదరపు గజాల విస్తీర్ణము
3.148 అడుగుల "మేధి" ( డ్రమ్ ఆకారము );
4. 40 అడుగుల ఎత్తు కలిగి ఉన్నది. ;
పాల రాయి తో కట్టిన గోడ కట్టారు.
5. స్థూప నిర్మాణానికై
- 45 ×- 30 × 8 కొలతలు గల
ఇటుకలను వాడారు.
ఇంగువ కార్తికేయ శర్మ, టి.వి.జి. శాస్త్రి, పి.ఆర్.కె. ప్రసాద్,
సి. శివరామమూర్తి, ఎస్. శంకర నారాయణన్, చరిత్ర రీసెర్చ్ లో కృషి చేసారు.
భట్టిప్రోలును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయదగిన సీమ - అని
మేధావులు పలువురు అభిప్రాయాలను వెలిబుచ్చారు.



















ఉత్తర ప్రదేశ్ లో బుద్ధ దేవుని విగ్రహమును నెలకొల్పారు.
అతి గొప్ప విగ్రహము మనకు గర్వ కారణము.
ఈ సందర్భంగా
మన ఆంధ్ర ప్రదేశ్ లోని [ SEE LINK]
ఒక బౌద్ధ స్థూపము గురించి ప్రస్తావన ,
విహంగావలోకనముగా చేద్దాము/చేసాము..

1 కామెంట్‌:

డా.పోట్లూరి పద్మావతి శర్మ చెప్పారు...

కుసుమగారు !భట్టిబ్రోలు బౌద్ధ స్తూపం వ్యాసం చాల బాగుంది .

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...