21, మార్చి 2011, సోమవారం

శ్యామ శాస్త్రి బొమ్మ


కర్ణాటక సంగీతానికి త్రి రత్నాలు
త్యాగరాజు, ముత్తు స్వామి, శ్యామ శాస్త్రి లు
(Trinity of Carnatic music ).
శ్యామ శాస్త్రి రేఖా చిత్రాన్ని ఎవరో ఒక అజ్ఞాత వ్యక్తి వేశాడు,
కానీ ఎందువలననో సగంలో ఆ పటము ఆగి పోయింది.
పూర్తి కాని ఆ శ్యామ శాస్త్రి బొమ్మను,
ఆయన అనుయాయులు పూజ గదిలో భద్ర పరిచి ఉంచారు.

(The rest of the portrait was finished later
and it still survives,
in the puja of Syama Sastri’s descendants. )
ఎన్నో ఏళ్ళ అనంతరం ఆ బొమ్మపై దృష్టి సారించిన ఆర్టిస్టు ఎస్. రాజమ్,
ఆ చిత్ర పటాన్ని వెలుగులోనికి తెచ్చాడు.
తమిళ్ నాడులో 18 వ శతాబ్దం ఉత్తరార్ధములో
కర్ణాటక సంగీత త్రి రత్నముల ((Trinity)
ఫొటోలూ, చిత్రముల కొరకు అన్వేషణ జరిగినది.

Music Academy వారు ,
సాంప్రదాయక కళా అనుయాయులు ప్రయత్నించారు.
అంతకు ముందరే/ మునుపు ఫురందర
దాసు,స్వాతి తిరుణాల్
(Purandara Dasa and Swati Tirunal) బొమ్మలను చిత్రించిన
S.రాజమ్* కు ప్రభుత్వం శ్యామ శాస్త్రి పట చిత్రణా బాధ్యతను అప్పగించింది.
ఆయన తనకు ప్రభుత్వము తరఫున మ్యూజిక్ అకాడమీ వారు అప్పగించిన
ఈ బృహత్ కార్యాన్ని భుజ స్కంధాలపై నిడుకొన్నాడు.
శ్యామ శాస్త్రి భక్తుల వద్ద ఆ బొమ్మను కనుగొన్నాడు, చిత్ర సూత్రం కళా రీతిలో పూర్తి చేసాడు.
( 40 సంవత్సరాల తర్వాత – “ఈ బొమ్మను వేసిన కళా కారుడు ఎవరు?”)
అనే విషయం వివాదాలకు గురి ఐనది.)
12 వ శతాబ్దము నాటి భారతీయ చిత్ర కళా రీతులను,
దేవాలయ కళా పద్ధతులను రాజమ్ అనుసరించాడు.
రేఖా చిత్రాలుగా వీనిని పేర్కొన వచ్చును.
ఔట్ లైనులతో స్పష్టంగా చిత్రీకరణ ఉంటుంది,
సహజ సిద్ధమైన రంగులను వాడుతారు.
ఆయన “చిత్ర సూత్రము” అనే traditional painting method ను
భక్తి శ్రద్ధాళువు ఐ అనుసరించాడు అని విమర్శకుల అభిప్రాయం.
The Government of India and the Department of Posts
06-01-1961 లో త్యాగరాజు బొమ్మను,
1975/ 18-03-1976 లో ముత్తు స్వామి దీక్షితర్ బొమ్మను,
21-12-1985 శ్యామ శాస్త్రి బొమ్మను
స్టాంపులుగా ముద్రించి, విడుదల చేసింది.ఎస్. రాజమ్
(* మధురై లో సెప్టంబర్ 2 వ తేదీన, 1919 సంవత్సరంలో
జన్మించాడు - (1919 to 2010 )
ఎస్. రాజమ్ తమిళములో “సీతా కళ్యాణం” లో 1934 లో నటించాడు.
ఆయన కర్ణాటక సంగీతములో నిష్ణాతుడుగా కీర్తి గడించాడు,
కానీ చిత్రలేఖనంలో చేయి తిరిగిన కళాకారుడు- అని చాలా మందికి తెలియదు.
ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్నిs. Rajam చెప్పారు.)
స్టాంపులు (see the Link) ;

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...