5, మార్చి 2011, శనివారం

వేటూరితో మాధవ పెద్ది సురేష్



మాధవ పెద్ది సురేష్ అభిప్రాయాలు కొన్ని.
"రమేష్ నాయుడు, మహదేవన్, బాల సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో
నేను కీ బోర్డును వాయించాను.
వారి ఆధ్వర్యంలో చాలా
మంచి పాటలకి
Key Board ను వాయించ గలగడం
నేను పూర్వ జన్మలో చేసుకున్న పుణ్యం.
ముఖ్యంగా ‘శంకరాభరణం ‘,లో అన్ని పాటలకీ,
‘ఆనంద భైరవి ‘, ‘శ్రీ వారికి ప్రేమ లేఖ ‘,
పడమటి సంధ్యా
రాగం’, ‘సప్త పది ‘,.....
ఇలాగ ఎన్నో సినిమాలకు
కొన్ని వందల పాటలకు కీ బోర్డ్స్ ప్లే చేయడం
నాకు లభించిన గొప్ప ఊదృష్టం.
అసలు ఆ పాటలు అన్నింటికీ 90% ఆర్కెస్ట్రా మెంబర్సు
అందరమూ, గాయకులూ కలిసి పని చేసే వాళ్ళం.
ఒక విధంగా చెప్పాలంటే – మన ఇంట్లో పండగకు అందరం కలిసి –
కింద కూర్చుని – సరదాగా కబుర్లు చెప్పుకుంటూ –
ఆత్మీయంగా, ఆనందంగా భోజనం చేసినట్లు ఉండేది.
ఇప్పుడు – రికార్డింగ్ పద్ధతి ఎలా ఉందంటే –
మనింట్లో డైనింగ్ టేబుల్ ,
దాని పైన భోజనం పెట్టి రెడీగా ఉన్నవి,
ఎవరికి ఆకలి వేస్తే వాళ్ళు వచ్చి
భోజనం చేసి వెళుతూంటారు కదా , అలాగ ఉంది.
ఒక రకంగా నేను అదృష్ట వంతుణ్ణి,
ఎందుకంటే సుమారు తొమ్మిది భాషలలో ఎన్నోcinema songs కి
ఎందరో మహానుభావులు కలిసి,
ఎంతో రుచిగా చేసిన వంటలో , కలిసి పాలు పంచుకునే భాగ్యం లభించింది ,
అందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది."
చక్రవర్తి గారి వద్ద మా అన్నయ్య మాధవ పెద్ది రమేష్
సహాయకుడిగా పని చేసేప్పుడు , (ప్రముఖ
మ్యూజిక్ డైరెక్టర్ ఐన )
కోటి, మా అన్నయ్య – లంబు & జంబు ‘లు ‘ లాగా ఉండే వాళ్ళు............”
ఇలాగ సురేష్ అనేకం వివరించారు.
వేటూరి సుందర రామ్మూర్తి గారిని రమేష్ అన్నయ్య
మొట్ట మొదటి సారిగా పరిచయం చేసాడు.











“బాబాయి హోటల్”
మేమిద్దరం కలిసి పని చేసి మొదటి చిత్రం.
అందులో చిత్ర పాడిన లాలి పాటను వేటూరి రచించారు.
అటు తర్వాత పర్వతాలు –
పానకాలు, ప్రేమా జిందాబాద్ మూవీలకి
ఇద్దరమూ కలిసి పని చేసాము.
వేటూరి “ ప్రేమా! జిందాబాద్” కు గురువు గారు
8 నుండి 9 గంటల లోపు పూర్తి పాటను రాసి ఇచ్చరు.
( తననా లకి రాసినది)
“ఎ బి సి రాని వాడు ఏబ్రాసిరో – వాడు
ఓ అంటే ఢం రాని సన్నాసిరో
రూపంలో కోతొ, రాగంలో కాకి
పప్పు సుద్దోయమ్మా.”
ఇలాగ ఉన్నది ఆ పల్లవి.
“ ఏం సార్! నా గురించే ఈ పాటను రాసారా?” అన్నను.
దానికి జంధ్యాల, వేటూరి ముసి ముసిగా నవ్వేసారు.........
ఇలాగ ఎన్నో భావాలను వక్కాణించారు మాధవ పెద్ది సురేష్.
“కోటి వేల్పుల అండ
కోటప్ప కొండ” అనే Devotinal song casset
వేటూరి రచనలో వెలువడినది.
అందులో
“అమ్మ తోడు – అందరి వాడు
అమ్మ తోడు ఎరుగని వాడు ........”
అనే పల్లవి కల పాట అంటే
వేటూరికి చాలా ఇష్టమైన పాటలలో ఇది ఒకటి కావడం –
నా మహత్ భాగ్యం.
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి సేవలు వర్ణిస్తూ –
ఒక T.V. serial కి ఆయన రచన, నా Music direction లో
ఈ పాట కంపోసింగ్ – మా ఇంట్లో జరిగింది.
నా భార్య వారికి ఇష్టమైన వంట చేసింది.
ఎస్. జానకి గారికీ, వేటూరికీ మా ఇంట విందు.
నా జీవితంలో మరిచి పోలేని సంఘటన –
అని గుర్తుకు తెచ్చుకున్నారు సురేష్.
“వేటూరి మంచి భోజన ప్రియుడు.
ఆయన మంచి పాటను ఎంత ఆస్వాదిస్తారో,
అలాగే మంచి భోజనాన్ని కూడా అనుభవించి,
తృప్తిగా తింటారు. జానకి కూడా అంతే!........”
“పుట్టింటి గౌరవం” రీ రికార్డింగు,
విజయా గార్డెన్సులో జరుగుతూన్నప్పుడు జరిగిన సంఘటన గురించి,
సురేష్ మననం చేసుకున్నారు.
వేటూరి షష్ఠి వేడుకలు పూర్తి జరిగాయి.
ఆయన 60 వ జన్మ దినోత్సవం నేను మరిచి పోలేని తీపి జ్ఞాపకం.’
గురువు గారికి ముఖ్యమైన శిష్యులలో ఒకడు
సౌండ్ ఇంజనీర్ ఐన కొల్లి రామ క్రిష్ణ.నేనూ, రామక్రిష్ణ,
గురువు గారికి పుష్ప మాల, ఫలాలు సమర్పించి,
పాదా
భివందనం చేసి, ఆయన ఆశీర్వాదాలను పొందాము.
ఆ తర్వాత మేము కలిసి భోజనం చేసాము.
వేటూరి ఎంతో ఆనందించారు.
ఇటు వంటి గొప్ప వ్యక్తిని గురించి రాయటం నా అదృష్టం.”
అంటూ వివరించారు మాధవ పెద్ది సురేష్.

[హాసం - జనవరి 2003]

" వివాహ భోజనంబు; వింతైన భోజనంబు.....
" మాయా బజార్ - లో ఈ పాట
సకలాంధ్రులకూ, నేటికీ శ్రవణానందదాయకం.
కుల గోత్రాలు- లోని పేకాట పాట,
రమణా రెడ్డి, రేలంగి వగైరా పాత్ర ధారులతో
పరిపుష్టం ఐన ఆ సీను,
ఆ గానం చేసిన గాంభీర్య గళ సంపద
తెలుగు ప్రేక్షకులకు ఎరుకే!
మాధవ పెద్ది సత్యంకు
Music director కావాలనే ఆకాంక్ష ఉండేది.
కానీ అది నెర వేర్లేదు.


















"నేనెలాగూ సంగీత దర్శకుడిని కాలేకపోయాను.
నువ్వు తప్పకుండా సంగీత దర్శకుడివి కావాలి"
అని సురేష్ కు తన అభిలాషను చెప్పారు.
ఆ సంగతిని గుర్తు చేసుకున్నారు మాధవ పెద్ది సురేష్.
" అలాగ ఆయన ఆశీస్సు, ప్రోత్సాహం లభించాయి.
మా బాబాయి (చిన్నాన్న) ప్రోత్సాహమే
నన్ను సంగీత దర్శకుడిని చేసింది."
అంటూ మాధవ పెద్ది సత్యం గురించి జ్ఞాపకం చేసుకున్నారు రమేష్.
See about Madhava peddi Satyam - Link -
[చిన్నాన్న మాధవ పెద్ది సత్యం ప్రోత్సాహము]

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...