23, నవంబర్ 2010, మంగళవారం

ఎక్కిరాల వేద వ్యాస experiments "Ramala sastra"
“భయ భంజన శర్మ” విరచితమైన
“రమల రహస్యము” అనే ప్రాచీన గ్రంధమును చదువుట
వీరికి(ఎక్కిరాల వేద వ్యాస, ఎక్కిరాల సోదరులు) సంభవించినది.

ఈ ప్రాచీన జ్యోతిష్య,ప్రశ్న శాస్త్రమును చదివి,
వానిని నమ్మక, - “యవ్వన గర్వముతో” ప్రయోగములు చేయుచున్న దశలో,
తనకు జీవితంలో ఎదురైన సంఘటనలను చెప్పారు.

1. “ప్రశ్న అడిగే వాడే ప్రశ్న ఫలితమును చెప్ప రాదు.”
కనుక వీరు ఒక ఏర్పాటును చేసుకొనిరి.
వేద వ్యాస అన్నయ్య “ఎక్కిరాల కృష్ణమాచార్య”తో
సంయుక్తంగా పరిశీలన చేయ పూనుకున్నారు.

2.ఇందు మూలముగా వారిరువురు చేసుకున్న ఏర్పాటు ఇది;
వేద వ్యాస తాను అనుకున్న ప్రశ్నను,
గ్రంధంలో వర్ణించ బడిన విధముగా గవ్వలను వేశారు:
తన అన్న కృష్ణకు కూడ చెప్పరాదు;
సహోదరుడు ఆ గవ్వలను లెక్కించి,
పరిశీలించి, (పేజీ 250) ఆ పుస్తకములో తెలిపిన ఫలితాన్ని చదివి చెప్పాలి.”
ఇదీ వారి ప్రణాళిక.

మక్ఖేశ్వరుడు ఐన పరమేశుని భక్తితో ధ్యానించి,"
16 గవ్వలను (sixteen) గల గలలాడించి ,
కలిపి, ఒక్కసారి కింద వదిలి పెట్టాలి.
“ప్రశ్నించిన వ్యక్తి నడి యవ్వన వయసులో ఉన్న
విద్యా వంతుడు, విద్యా బోధకుడు( lecturer)
22 లోపు వయస్సు, లలిత కళలలో ప్రవీణ్యత కలిగిన వాడు.....”
అంటూ ఉన్న : అనేక అంశములూ ,
విపులీకరించిన సర్వ లక్షణాలూ సరిగ్గా సరిపోయినాయి.

వేద వ్యాస “ ఏకాగ్రతతో ప్రశ్నను సంకల్పించి,
దోసిటిని నుదుటికి ఆనించాడు.
గవ్వలను ఒకేసారి కింద వెదజల్లాడు!!!
సోదరుడు క్రిష్ణ ఆ గవ్వలను లెక్కించాడు.
ఆ ఫలితాన్ని లెక్కించి, దాని ఫల భాగాన్ని (risult)ను సూచించే
ఒక గుర్తు( symbol) తీసాడు;
దానికి ఎదురుగా ఉన్న పుటలోని ఫలితాంశాన్ని తీసి, ఇలా చదివాడు.
3.దోసిట్లో గవ్వలను ఉంచుకోవాలి.
మదిలోని Question ను పైకి చెప్పకుండానే,
”నా మదిలోని సందేహానికి ఏం జరుగుతుంది?”
అనుకుంటూనే, ధ్యానము చేయాలి ;

“ మక్ఖేశ్వరుడు ఐన పరమేశుని భక్తితో ధ్యానించి,
16 గవ్వలను (sixteen) గల గలలాడించి
కలిపి, ఒక్కసారి కింద వదిలి పెట్టాలి.
“ఈ ప్రశ్నకు “గురు శుక్రులు” ప్రశ్నాధిపతులుగా వచ్చినారు.
ఫలితాంశము ఈ విధంగా ఉన్నది _
వివాహము మూడు వారములలోగా జరుగును.
గురువారము నాడు పెండ్లి జరుగును.
పెళ్ళి కుమార్తె స్వగ్రామము ఒక నదీ తీరము;
పిల్ల తండ్రి విద్యతో జీవనము చేసి, ముసలి వాడై,
ఉద్యోగ విరామం చేసిన వ్యక్తిగా ఉంటాడు పిల్ల తండ్రి!
పెద్ద ముక్కు, బట్ట తల, బొంగురుగా అరుస్తున్నట్లు
మాట్లాడే కంఠ స్వరము!
ఇంటి వెనుకనే నదీ ప్రవాహము _ సమీపంలో మసీదు . ..........
ఆ గృహస్థుకు ..... రెండవ భార్యకు కలిగిన సంతానము ఈ వధువు .
ఆ వంశములో ఎవరికీ ఇంత వరకూ వివాహము కాలేదు!
ఇదే ఆ ఇంటిలోని మొదటి వివాహము!”
భార్య (= పెళ్ళి కుమార్తె) సంగీత విద్యాభిరుచి కలది,
క్షణ కోపము, మాట తొందర, మంచి మనసు సుందర రూపము కలది;
వివాహము శుక్ర వారము జరుగును. ఇది ప్రశ్న ఫలితము!”
అప్పటి దాకా వ్యాసకు 52 సంబంధాలు చూసారు.”
ఇది ఒక - నాడీ గ్రంధమా? లేక ప్రశ్న శాస్త్రమా?”
అన్నంతగా చెప్పలేనంత ఆశ్చర్యం ఆ ఇద్దరికీ !!
ఇందులోని ఫలితాలు గనుక నిజంగా _
ఈ ప్రకారమే జరిగితే -
“ ఇది ఒక అద్భుతమైన భగవత్ శక్తి గల శాస్త్రము అన్న మాట!!!!!
సరే!అప్పుడు నమ్మ వచ్చును." అనుకుని.................
ఎగతాళిగా మాట్లాడుతూ నవ్వుకున్నారు.........
ఆసక్తితో ఎదురు చూడ సాగారు...........
ఆ తరువాయి అనేక సంఘటనల సంపుటిగా
వ్యాస ఆత్మ కథ నిర్మితమైనది.
1955 May దూరపు బంధువైన (తణుకు నివాసి) నండూరి పార్ధ సారధి
ఒక సంబంధం తెచ్చాడు. మూడు రోజుల తర్వాత “పెళ్ళి చూపులకు ఏర్పాట్లు ”
“అప్పుడే గవ్వలను వేసి, తీసిన ప్రశ్న ఫలితం ప్రారంభించినట్లున్నదే!”
అనుకుంటూ నవ్వుకున్నారు ఆ అన్న దమ్ములు.
అన్ని వివరాలూ మక్కికి మక్కీగా సరి పోలినవి.
కానీ........ “ రమల శాస్త్ర రహస్య vidita శాస్త్ర కారుడు
ఒక చోట – గురు వారము – పరిణయము జరుగుతుంది ’అని రాసాడు;
మరి అదే ప్రశ్నకు answer గా –
రెండవ భాగంలో వివరాల తరువాత –
‘ శుక్ర వారము జరుగును ‘ అని ఉన్నది – ఇది ఎలాగ??????????
“రమల శాస్త్ర కారుడు గట్టి చిక్కులోనే ఇరుక్కున్నాడు !”
అనుకుంటూ, కృష్ణ, వేద వ్యాస వినోదంగా నవ్వుకున్నారు.

1. ఇంటి వెనుక గోస్తనీ నది...... ఇతర వివరాలూ డిటోగా సరిపోతున్నాయి.
2.తీరా, మధ్య వర్తులున్నూ, బంధువులున్నూ
"వడ్ల గింజలో బియ్యపు గింజ”
మాటా మాటా పెరిగి ,marriage [మర్రీగె :->) ]వ్యవహారం
కాస్తా ఫెడీల్ మని చెడి పోయింది.
బేర సారాలు, ఇరు పక్షాల వారూ రద్దు చేసుకున్నారు; మానుకున్నారు.
‘మనకి మళ్ళీ హాయిగా మామూలుగా విశ్రాంతి లభించింది.’
అనుకుంటూసోదర ద్వయం
మళ్ళీ ప్రశ్న శాస్త్ర ఫలితాలను నెమరు వేసుకున్నారు.
బెజ వాడలోని నాగేశ్వర రావు నాయుడు గారి మేడ పైన కూర్చుని చర్చించుకున్నారు,
అన్నీ సరి పోయాయి కానీ ఇలాగ జరిగిందేమిటి ??????”

“ఈ రోజులలో ప్రశ్నలు జరగడ మేమిటి?
మన భయ భంజన శర్మ గారి –
రమల రహస్య గ్రంధాన్ని – కట్ట కట్టి
అటక పైన పాత సామానులులో భద్ర పరచాలి.”
అంటూ వేళాకోళం చేసాడు వ్యాస.
“ అన్నీ సరి పోయినా ఫలితం గుడ్డు షున్నా.
ఇంకెందుకు? మూట కట్టెయ్యి ఈ శాస్త్రాన్ని!” అన్నాడు వ్యాస.
వారం తిరిగే లోగా మెనీ ఇన్సిడెంట్సు వరసాగ్గా సాగాయి.
అర్ధ రాత్రి వచ్చి, తండ్రి అనంతాచార్యులు
” నీకీ సంబంధం నచ్చిందా?” ఉరిమినట్టు అడిగారు .
నిద్ర కళ్ళతో “ ఏ సంబంధం?”
“ మొన్న చూసినదే”
“యాభై సంబంధాలు చూపిస్తిరి,ఏదో ఎలా గుర్తు ఉంటుంది?
రేప్పొద్దున మాట్లాడుకుందాములే నాన్నా!”
చిరాకుతో ఆ జనకుడు
“ వెధవ మారా ముళ్ళ ప్రశ్నలూ, నువ్వూనూ! నీకెందుకోయీ ?
అడిగిన దానికి సమాధానం చెప్పు”
ఆ వెనుక “ June 2 నే పెళ్ళి ముహూర్తము -
వేగంగా ఏర్పాట్లు జరిగాయి.
“ గురు , శుక్ర వారముల మీమాంస” తో
వ్యాస పెళ్ళి సంబరాలని చిత్రంగా వీక్షిస్తూనే ఉన్నారు.
“ మంగళ వారం స్నానం చేయించి, “ స్నాతకము” చేసి,
పెళ్ళి పీటల మీద కూర్చో బెట్టారు ముత్తైదువులు.
ఏక బిగిన హోమాది కార్యక్రమాలలో పాల్గొని,
వివాహ క్రతువు, తంతు వలన చాలా బడలిక, అలసట కలిగాయి.
వధూ వరుల కొంగు ముడి - ఉన్నదని కూడా ఆట్టే గమనించకుండా,
వ్యాస అలాగే మంచంపై వాల బోతూన్నాడు;
========================;
తూర్పున తెల తెలవారుతూన్నది.
ఉదయాన్నే మూడున్నర, నాలుగు గంటల మధ్య కాలం!
తీరా చూస్తే తారీఖు మారి జూన్ మూడవ తేదీ వచ్చేసింది. (page 269)
ఆశ్చర్యం! అంటే శుక్ర వారం వచ్చేసింది అన్న మాట!
పరమాశ్చర్యంగా అక్షరం పొల్లు పోకుండా గురు వారం ప్రారంభించి,
శుక్ర వారం నాడూ పూర్తి కావడం, ఆశ్చర్యంలో ముంచెత్తింది.
“ఈలాగ అంతటి విచిత్ర ముహూర్తం, తన కళ్యాణ ఘడియ”!
ఈ సంఘటన వలన నాటి వరకూ హేళనా మిళితమైన
తన అభిప్రాయాలలో కలిగిన మార్పులు,
వేద వ్యాస యొక్క వ్యక్తిత్వ పరంగా గొప్ప మలుపు తిరిగినది.
“మంత్ర శాస్త్రము, సైంటిఫిక్ గా,
విజ్ఞాన, హేతు బద్ధంగా నిర్మించ బడినది
మన హిందూ ధర్మంలోనే!”
అని ఎక్కిరాల వేద వ్యాస దృఢ నిశ్చయానికి వచ్చారు.
ప్రాచీన కాలం నుండీ
క్రమ క్రమంగా నిర్మించ బడిన భారతీయ ఆచారాలలోని నిర్మాణత్వాన్ని
హేతు బద్ధతలకు మంత్ర ముగ్ధులై,
ఆయా విశేషాల గురించి పరిశోధనలను కొన సాగిస్తూ,
తన బ్రతుకు బండిని ఆ మార్గంలో నడిపించారు ఎక్కిరాల వేద వ్యాస.
University ofVedic Sciences"ను నెలకొల్పారు.
" హాజీ వారిష్ ఆలీషా దివ్య చరిత్ర" మున్నగు రచనలను చేసారు.
వందలాది గ్రంధ రచనలు" చేసి,
ప్రపంచానికి జ్యోతిష్యాది విద్యల పట్ల గౌరవ భావం కలిగించే
అత్యున్నత కార్యక్రమాన్ని శ్రమ దమాదులను లెక్క చేయకుండా, కొనసాగించారు.
మహనీయ వ్యక్తిగా అందరి మన్ననలను పొందిన ఎక్కిరాల వేద వ్యాస.
({spreading this holy knowledge.

Contact details of ISADS is :
Tel.: +91 141 2520094, Mobile : +91 9414044559 +91 98290213090
Website : http://isads.hostwebs.com ,
E-mail : anupamjolly@hotmail.com} )

2 వ్యాఖ్యలు:

Unknown చెప్పారు...

భయ భంజన శర్మ గారి రమల రహస్య గ్రంధం ఇప్పుడు మీ దగ్గర ఉందా సార్ ఉంటే మాకు వివరాలు పంపగలరు

Unknown చెప్పారు...

Usha123neeli @gmail. Com pone : 9912356127

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...