దుర్యోధనుడు ;( ప్రవేశించి, కలయ జూచి ఆశ్చర్యముతో);;;;;"ఔరా! ఈ రచనా చమత్కృతి ఏమియో గాని,ప్రకృతి సౌందర్యము నధఃకరించుచు,కురు సార్వభౌముండునైననా మానసమును సైతము ఆకర్షించుచున్నదే!(ప్రక్కకు చూచి)వీరు – నా నుడులను ఆలించి యుండరు కదా???(ఆశ్చర్యముతో)ఏమి వీరల రూప లావణ్యాతిశయములు!ఈ త్రి జగన్మోహనాకృతులెవ్వరివై యుండును??(సమీపించి)ఓయీ! మీరలెవ్వరు?ఇచ్చట నుండుటకు గతంబేమి? ఏమిది?(బాగుగ పరీక్షించి)నేనెంత భ్రమ పడితిని? నిమేషత్వమే లేదు.ఇవి సాల భంజికలు!సజీవ మనుష్యాకృతుల వలె నున్నవే!?ఏమి ఈ కల్పన!మయుని లోకోత్తర కళా కౌశలము!(ఇంకొక వైపు చూచి)సభా భవనమున ఉద్యన వనమా?ఎంత రమణీయముగ నున్న్నది!వివిధ ఫల భరావనత శాఖా, శిఖా, తరు వర విరాజితంబు –రాజిత తరు స్కంధ సమాశ్రితదివ్య సురభిళ పుష్ప వల్లీమతల్లికా సంభాసురంబు!భాసుర పుష్ప గుచ్ఛ స్రవన్మధురమధు రసాస్వాదనార్ధసంభ్రమ భ్రమర కోమల ఝుంకార నినాద మేదురంబు!మేదుర మధుకర ఘన ఘనా ఘన శంకా నర్తన క్రీడాభిరామ -మయూర వార విస్తృత కలా కలాప రమణీయంబు,రమణీయ కోమల కలాప కలాప్యాలాపమంజుల దోషద ధూప ధూమాంకుర సంకీర్ణంబుసంకీర్ణ నికుంజ పుంజ సుందరంబు!ఆహా! ఈ ఆరామ సౌకుమార్యంబు అత్యంత మనోహరంబు!దిన దినానేక నూత్నారామ, రంజష్యమాన,కౌరవ వంశ వర్ధన మనః ప్రమోదావహంబగు ఈ నిష్కటంబు.తక్కొరుల కద్భుత దర్శనీయంబగుట నిర్వివాదాంశంబు!కాననే"మయ సభ”,"మయ సభ”అని –సామాన్య జనులు మొదలు రాజ కంఠీరవుని పర్యంతముఏక గ్రీవముగా – దీనిని గురించి వర్ణించుట సరియే!(పరిశీలించి)ఇందలి ఫల కుసుమ జాలములునుమహదానందము కలిగించుచున్నవి.(నడువ బోయి)కాసారమా ఇది! ఉండీ లేనట్లును,లేకుండీ ఉన్నట్లును కానంబడుచున్నది.(బాగుగా చూచి)ఇచ్చట జలాశయమే!కాకున్న ఈ బిస సూత్రములు!ఈ శత పత్రాది కమలములూ ఎట్లుండును?!ఔరా! ఏమి దీని శృంగార వైభవమ్ము!సంస్పర్శ మాత్ర నూత్న చైతన్య ప్రసాదిక!!!!శీతల విమల మధు వారిపూర్ణ సంపూర్ణంబు!!మంద పవన చాలనోద్ధూత కల్లోల తరంగ మాలికాపరస్పర సంఘట్టన జాయమానమృదుల ధ్వాన విస్తారాతి శ్రావ్యంబు.కమల కోక నదాది నానా విధ జల కుసుమ రాగారుణిత దరీభాగంబు;ఆలోల బాల శైవాల జాల లాలిత జంగమోద్యాన శంకావహంబు;గ్రీవాలంకృత బిస సూత్ర పాళికా సందీపిత,హంస హంసీ గణ భూషితంబు , వర్ణనాతీతంబు!చూడం చూడ ఇయ్యది –అపూర్వ రమణీయాకృతిం దలపించు చున్నది.ఇందలి మధు వారి పూరము ఇంచుక గ్రోలిఈ పరిసరమ్మున నొక్కింత విశ్రమించెద!(అడుగు పెట్టి వట్టి నేల యగుటను యోచించి)ఇది ఏమి? ఇచ్చటి ప్రకృతియే నన్ను పరిహసించుచున్నట్లున్నదే!!!!!!ఇది ఎంత మాయగ నున్నది?ఇది మయుని రచనా విశేషమా?లేక నేను భ్రాంతియుతుడనై, విభ్రాంత చిత్తుడనైతినా?(వినుచూ)ఎచ్చటిదీ హాస ధ్వని????????మమ్ము ఎవ్వరును పరిహసించుట లేదు కదా?????(కలయ జూచుచూ)ఇచ్చట ఎవ్వరునూ కాన రారే!!!ఈ సవ్వడి ఎట నుండి వచ్చేను?ఓహో! అతులిత మాయా రచనా సమర్ధుడైనఆ మయుండిట్లు ధ్వనించు యంత్రము ఇందెందైన నిర్మించి యుండెనేమో?( మరి ఒక వంక చూచి)ఆ కనపడునదేమి?వివిధ వికార కుడ్య భాగాంతర్గత ద్వార దేశమా?తత్ సువర్ణ శాఖాంతరోల్లిఖిత గారుత్మత వల్లీసముల్లసితమా?వల్లీ సముల్లిత సల్లలిత పల్లవ సందోహమా?మధ్యే పల్లవ సంపుటాత్యంత భాసుర పుష్ప ఫల ప్రతానమా?పుష్ప ఫల మకరంద సవనార్ధ సమాగత షట్పద కీర వారమా?(యోచిస్తూ, అటు ఇటు తిరుగుతూ) ~~~~~~~~కట కటా! ఇట్టి త్రి జగన్నుత సభా భవనము –డవుల యధీనములో యుండుటా? కాల స్వభావము!పాంనిన్న మొన్నది దనుక – నిలువ నీడ లేకుండిన పాండవులు!!!!!! –దిగ్విజయ మొనరించి,రాజ సూయ మహాధ్వర నిర్వహణమునసార్వ భౌమ పదంబు నలంకరించుటయా??అభిమాన ధనులగు భూ రమణు లెల్లరు అరి గాపులై,వస్తు వాహనాది నానా విధోపాయనముల నర్పించి గౌరవించుటయా?ఏ లోకముననో పడి యుండిన ఆ మయ బ్రహ్మ !త్రిలోకాధిక భ్రాజ మానంఅగు ఈ సభా భవనమ్మును నిర్మించి ఇచ్చుటయా?పాండవు లన్య జన దుర్నిరీక్ష్యులై విజృంభించుటయా?ఇదంత కనులార గాంచుచు,సుక్షత్రియ వంశ సంజాతుండగుసుయోధన సార్వ భౌముడు సహించి ఊరక ఉండుటయా?(యోచించి)నా సమక్షమున ఊరును, పేరును లేని ధర్మజునకునా సామంతు లెల్లరున్ ఉపాయనమ్ములను అర్పించి,పరస్పర శిరః కోటీర సంఘర్షణంబున డుల్లిన,వజ్ర మణి మయూఖంబులు భూసతికి నూత్న శోభ నాపాదించి,రత్న గర్భ నామమును సార్ధక పరుప –సాష్టాంగ దండ ప్రణామంబు నాచరించుట నాకవమానము కాదా????????దుర్మదంబున ధర్మజుండు యుక్తా యుక్త విచార విదూరుండై,"సార్వభౌముని సమక్షము" - అను జ్ఞానమైనను లేకస్వేచ్ఛగ వారి ప్రణతులం గైకొనుటయా?యోచించిన కొలందిమనంబున పట్ట రాని క్రోధము వెల్లి విరిసి – దుర్భరంబగుచున్నది.ఇంక ఇచ్చట నిలువ జాల!అదే - ఆకసంబనబడు ద్వారమున నిర్గమించెద!(పోబోవ ద్వారము నుదుటికి కొట్టుకొనెను.)అబ్బా! ఎక్కడిదీ పాపిష్ఠి శిలా ఫలకము?ఎంత బిట్టుగ కొట్టుకొనెను.(పరిహాస ధ్వని వినపడి,పైకి చూచెను).మరల పరిహాసము!( క్రోధముతో పైకి చూచి.)పాంచాలీ! పంచ భర్తృకా!నన్నే పరిహసించు చుంటివి కదూ!కానిమ్ము; ఇప్పటి కిది పరిహాసము మాత్రమే!కాలాంతరమున ప్రళయ భయంకర భైరవ వికటాట్టహాస విస్ఫారితభ్రుకుటీ ప్రభూత తీవ్ర వైశ్వానర జ్వాల! కానిమ్ము;ఇప్పటి కిది పరిహాసము మాత్రమే!కాలాంతరమున ప్రళయ భయంకర భైరవ వికటాట్టహాసవిస్ఫారిత భ్రుకుటీ ప్రభూత తీవ్ర వైశ్వానర జ్వాల ; తీవ్ర వైశ్వానర జ్వాల!
1, నవంబర్ 2010, సోమవారం
మయ సభ ( Eka pAtrAbhinaya)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు
"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...
-
అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి! ఆది పరాశక్తి పాలయమాం! త్రిభువనేశ్వరి! రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయమాం! ; || ; శ్రీ జగదీశ్వరి అన్న...
-
మన సంస్కృతాంధ్ర కవులు మాటలతోనే గాక అక్షరాలతో కూడా అందమైన ఆటలాడుకున్నారు. పద్యాలు, పదాలతో రకరకాల విన్యాసాలు చేసారు. పద్యంలో ఇంకో పద్యం, ఎటున...
-
“భయ భంజన శర్మ” విరచితమైన “రమల రహస్యము” అనే ప్రాచీన గ్రంధమును చదువుట వీరికి(ఎక్కిరాల వేద వ్యాస, ఎక్కిరాల సోదరులు) సంభవించినది. ఈ ప్రాచీన జ్యో...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి